రివైజ్ కోర్స్ మురళి 21-01-1969
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ, జీవితంలో ఆచరించినపుడు ఆత్మిక స్థితి / యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
" తీవ్ర పురుషార్థం, స్మృతి చేయండి. బాప్ దాదా పిల్లలందరినీ శక్తిశాలిగా చేసేటందుకే చెప్పేవాడు.
బాప్ దాదా పిల్లలను ఎంతో శృంగారించారు. అయితే పిల్లలు అంతా అలంకారధారులుగా తయారవ్వలేదా ఏమిటి? ఒకరోజు ఎటువంటి సమయం వస్తుందంటే, అది ఈ బాప్ దాదా యొక్క అలంకరణను, స్మృతి చేస్తారు. అయితే, అది ఈ సమయమే. మొదట అయితే అతడు తనను నిరహంకారీ, నమ్రచిత్ అని చెబుతూనే చాలా మంది పిల్లలకు, “నేను కూడా ఇంకా సంపూర్ణం కాలేదు” అని, వినిపించేవాడు. “నేను కూడా ఇప్పుడు, నిరంతర దేహీ అభిమానిగా కాలేదు.” కానీ, మీరు మీ అనుభవం ఆధారంగా 3, 4 నెలల్లోనే గమనించే ఉంటారు సన్ముఖంగా కలిసే సౌభాగ్యం ప్రాప్తించే ఉంటుంది. అయితే ఇది అనుభవం చేసి ఉంటారు.
ఇపుడు ఈ బ్రహ్మ సాకారీ కాదు కాని, అవ్యక్త ఆకారీ రూపధారి అని. కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మ చిన్న చిన్న మాటలు వినేవాడు. మీరు పిల్లలు అతని తనువు ద్వారా ఎప్పుడు పరిశీలించలేదా ఏమిటి? ఏదైనా అతని మస్తకంలో, నక్షత్రం మెరుస్తూ కనిపిస్తుండేది. ఎవరైతే అవ్యక్త స్థితిలో ఉంటారో, వారు అవ్యక్త మూర్తిని గుర్తించారు. ఎవరైతే స్వయం అవ్యక్త స్థితిలో ఉండరో, వారు అమూల్యమైన రత్నాన్ని పూర్తిగా గుర్తించలేదు. ఇప్పుడు కూడా స్థాపన కార్యం బ్రహ్మదా? లేదా, మాదా? ఇప్పుడు కూడా మీ పిల్లలందరి పాలన బ్రహ్మ ద్వారానే జరుగుతుంది.
స్థాపన యొక్క అంతిమం వరకు కూడా బ్రహ్మ యొక్క పాత్ర నడుస్తుంది. ఇప్పుడు, మీ పిల్లలందరూ, ఆలోచిస్తుంటారు బ్రహ్మ ద్వారా చదువు ఎలా సాగుతుంది అని. అదైతే వాస్తవానికి స్థితి ఆధారంగా ఎలా? ఎందుకు? అనే ప్రశ్నలు రావొద్దు. కానీ, చాలా మంది పిల్లలలో ప్రశ్నలే కాదు కానీ చాలా అలజడి యొక్క సాగరం మొదలైంది. ఈ మొదటి పేపరు చాలా కొద్ది మందే పాస్ అయ్యారు. కొంచెం ధైర్యం అయితే పెట్టండి ఎప్పుడైతే జ్ఞానం అవినాశి. చదువు అవినాశి. అయితే, ప్రశ్నల యొక్క అలజడి ఎందుకు? అయినా సరే! అదే అలజడిని, శాంతింపచేయుటకు, అర్థం చేయిస్తున్నారు.
క్లాస్ ఎలాగైతే నడుస్తుందో అలాగే నడుస్తుంది. ఏమి వినిపిస్తారు? బ్రహ్మ యొక్క తనువు నిర్ణయించబడి ఉందంటే, మురళి అయితే అతని తనువు ద్వారా నడిచిందో! అదే మురళి ఇది. మరియు సందేశీల ద్వారా కొద్ది సమయం కోసం సేవ చేస్తారో అది మురళి అనబడదు. ఆ మురళిలో మహిమ (జాదు) లేదు. బాప్ దాదా యొక్క మురళీలోనే మహిమ ఉంది. అందువలన ఏవైతే మురళీలు నడిచాయో అవన్నీ రివైజ్ చేయాల్సి ఉంది.
ఎలా అయితే! మొదట్లో పోస్ట్ వెళ్ళేది, అలాగే ముఖ్య కేంద్రాలకు ఆబూ నుండి వెళ్తూనే ఉంటాయి మీకు ఒక ఏడాది క్రితం ఏదైతే మురళి నడిచిందో అది జ్ఞాపకం ఉందా?
నిన్న ఏదైతే మురళి నడిచిందో అది కూడా జ్ఞాపకం ఉండి ఉండదు. చాలా పాయింట్స్ ఎలా ఉన్నాయంటే! ఎన్నిసార్లు చదివినా మనసులో నిలిచిపోని అంశాలు చాలా ఉన్నాయి. అందువలన మురళి మరియు లేఖ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలా అయితే ఉంటుందో! అలాగే ఉంటుంది. ఎలా, మీరు మధువనానికి, రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు కదా! అలాగే వస్తారు. ఏంచేయాలి? ఎవరితో కలవడానికి రావాలి? ఇప్పుడు మళ్లీ ఇలాంటి ప్రశ్న వస్తుందా? ఎవరితో రీఫ్రెష్? ఎవరి ద్వారా రిఫ్రెష్ అవుతారు?
ఎవరైతే అదృష్ట సితారలు ఉన్నారో! అంటే ఎవరైతే నిమిత్తంగా ముఖ్యంగా ఉన్నారో! వారితో, పూర్తి సంబంధాలు జోడించి, ఏదైతే, మీ సేవా కేంద్రం రిజల్ట్ ఉందో! సమస్యలు ఏవైనా, సేవా కేంద్రం ఉన్నతి ఉందో, ఎవరైనా కొత్త కొత్త పూలు పూదోట నుండి వికసిస్తారో వారిని కూడా సంగఠన యొక్క సాక్షాత్కారం చేయించడానికి మధువనానికి తీసుకురావాలి. దాంతోపాటు, సంగఠన మధ్యలో బాప్ దాదా, నిమిత్త సందేశి ద్వారా పూర్తి సేవ చేస్తారు. ఇంకా ఏమైనా ప్రశ్నలు మిగిలాయా? మీరు ఆలోచిస్తుంటారు, ప్రజలు మిమ్మల్ని అడుగుతారు మీ బ్రహ్మబాబా 100 సంవత్సరాల కంటే ముందే వెళ్లిపోయారు కదా! అని.
ఇదైతే చాలా సులభమైన ప్రశ్న, కష్టమేమీ లేదు. 100కు దగ్గరగా అయితే ఆయుష్షు ఉండెను. ఇదైతే 100 సంవత్సరాలకు చెప్పబడింది. ఇది తప్పేమీ కాదు. ఒకవేళ ఏదైనా మిగిలిపోయి ఉంటే ఆకారం ద్వారా పూర్తి చేస్తారు. 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క, స్థాపన యొక్క, పాత్ర ఉంది. అదైతే! 100 సంవత్సరాలు పూర్తి అవ్వవలసిందే! కానీ! మధ్యలో బ్రహ్మ తర్వాత ఏదైతే బ్రాహ్మణుల పాత్ర ఉందో! అది నడవవలసి ఉంది. బ్రహ్మ బ్రాహ్మణులను ఎందుకు రచించారు? బ్రహ్మ తన రచనను చూడలేరా! ఏమిటి? మీకు ఇప్పుడు కార్యం యొక్క బాధ్యతా కిరీటాన్ని ఇవ్వరా? అయితే సత్యయుగంలో దేవతలుగా ఎలా తయారవుతారు?
ఇక్కడి బాధ్యతయే, అక్కడ పునాది వేస్తుంది. అందువలన ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్లకు ఇదే జవాబు ఇవ్వండి, బ్రహ్మ యొక్క స్థాపన అయితే నడవాలి అని! ఇప్పుడు పిల్లల చదువు యొక్క సమయం, చాలా సమీపంగా ఉంది. ఇది అయితే ప్రతి ఒక్క మురళిలో మమ్మా తర్వాత సైగ ఇచ్చారు. పేపర్లో తేదీ, తారీఖు ఇవ్వబడుతుందా? ఏదైతే ముందు నుంచే చెప్పబడితే దానిని ఏ పేపర్ అంటారు? ఏదైతే అకస్మాత్తుగా వస్తుందో దానినే పేపర్ అంటారు. ఎవరి మనసులోనైనా ఏదైనా అకస్మాత్తుగా జరగదు. ఫలితం ఏమి చూశారు? అందరూ పాస్ కాలేదు.
ఒక్కొక్కరిలో ఏదో ఒక లోటు చూశాను. అయినా చాలా మంచిది! ఎందుకంటే, పురుషార్థం యొక్క సమయం ఆధారంగా ఫలితం మంచిదే, అంటారు. మిగిలినదైతే బాప్ దాదా ఇద్దరు కూడా, ఒక విషయంలో సంతోషంగా ఉన్నారు. అది ఏమిటి? పిల్లలు సంగఠన మరియు స్నేహము, రెండింటి ఋజువు ఇచ్చారు. బ్రహ్మ వతనం నుండి చూస్తుండేవారు ఎవరు ఎలా ఎలా ఎప్పుడెప్పుడు వస్తారు అని! ఏ సంతోషంతో వస్తారు, ఏ స్థితిలో కలుస్తారు! దీని యొక్క ఫలితాన్ని రిజల్ట్ని కూడా బాప్ దాదా ఇద్దరూ కలిసి చూస్తూ ఉన్నారు. అయితే! ప్రతి ఒక్కరు స్వయాన్ని చూసుకొని స్వయంలో ఏదైతే లోటు ఉందో! లోటును నింపుకోవాలి. మిగిలినది ఈరోజు నుండి అందరికోసం ఎవరు నిమిత్తంగా ఉన్నారు?
అదైతే మీకు తెలుసు దీదీ అయితే తోడుగా, సహాయకారిగా ఉంది. ఎలాగైతే వ్రాతపూర్వక రచనలు నడుస్తుండేవో అలాగే హెడ్ క్వార్టర్స్ నుండి నడుస్తూ ఉంటుంది. వీరిద్దరూ మీ అందరి బాగోగులు చూసుకుంటారు. అవసరమైతే మీ అందరి, సేవా కేంద్రాలను చుట్టి వస్తారు కానీ! ఇప్పటి పేపర్ ఏమిటి? ఏదైతే అకస్మాత్తుగా వచ్చింది కానీ ఏదైతే రాబోయే పేపర్ ఉందో అది తెలుపుతుంది. ఇప్పుడు ఒకే మతం, అంతర్ముఖి, మరియు, అవ్యక్త స్థితిలో స్థితులై, సంబంధం లోకి రండి. ఇది బాప్ దాదా ఏదైతే, పేపర్ చూపిస్తున్నారో, దాని రిజల్ట్ చూస్తారు. మొదట్లో ఆ సమయంలో బ్రహ్మ తనువు ద్వారా, ఏదైతే చదివించారో! అది అయితే అందరూ కూడా విని ఉంటారు. మరియు జ్ఞాపకం కూడా ఉండే ఉంటుంది.
ఈ రోజు ఈ సంగఠన మధ్యలో కొద్దిగా ఇవ్వడానికి వచ్చారు. అయితే కొద్దిగా తీసుకోవడానికి కూడా వచ్చారు. ఎవరైతే తీసుకుంటారో వారు ఇవ్వడానికి తయారేనా? ఎవరి హృదయంలో కొద్దిగా సంకల్పం వస్తుందా? ఏం జరుగుతుందో తెలియదు-ఇలాంటి విషయమేది లేదు అన్నవారు చేతులెత్తండి! ఒకవేళ అందరూ సంతుష్టంగా ఉన్నారా? అయితే! ఎవరైతే తీసుకుంటారో! వారు ఇవ్వటంలో కూడా సంతోషంగా ఉంటారు. ఈ రోజు సంగఠన మధ్యలో రెండు విషయాలు దానం చేయాల్సి ఉంది. ఏవి ఆ రెండు విషయాలు? ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజు నుండి ఒకరి అవగుణాలను మరొకరు చూడకండి, వినకండి, గుర్తుంచుకోకండి.
ఒకవేళ ఎవరైనా మీ సోదర లేదా సోదరీల మధ్య మీకు ఏదైనా సమస్య వస్తే, మీరు వాటిని నిమిత్తంగా ఉన్న వారి ద్వారా సూచనలు ఇప్పించ వచ్చు, రెండవది- చాలా మంది మీ దృఢ నిశ్చయాన్ని అలజడి చేయడానికి, మాట్లాడతారు. ఇప్పుడు ఈ సంస్థ ఎలా నడుస్తుందో చూద్దాం! అని వాయిస్‌ని వ్యాప్తి చేస్తారు. అయితే! తమ ఆధారం అవినాశి, అని ఆ ప్రజలకు తెలియదు. రెండవది- ఎవరైనా కదలడానికి ప్రయత్నిస్తే, మునుపటి కల్పంలో గాయనం ఉందికదా! పిల్లలైన మీరు అంగదుడిలా మీ పాదాలను కదపకూడదు. ఇది కూడా గుర్తుంచుకోండి.
అటువంటి నిశ్చయబుద్ధి, స్థిరబుద్ధి, మరియు అచంచలమైన మరియు, ఏకీరసస్థితి గలవారే రాబోయే అంతిమ పేపర్‌లో ఉత్తీర్ణత సాధించగలరు. మరియు ఇది కూడా! బ్రాహ్మద్వారా ఇంతమంది బ్రాహ్మణులు రచింపబడ్డారో అయితే, తండ్రి తన పిల్లలు పెద్దయ్యాక పదవీ విరమణ చేస్తారు కదా? ఇప్పుడు మీరు, పదవీ విరమణ చేసిన స్థితిలో కూడా, తండ్రి మీ తోడుగా ఉన్నారని అర్థం చేసుకోండి. పిల్లలకు పని అప్పగించి చూస్తూనే ఉంటారు. “శరీరం వదిలిపోయింది కానీ చేయి తోడు వదిలి పోలేదు”. బుద్ధి యొక్క తోడు వదిలిపోలేదు. అదైతే అవినాశిగా ఉంటుంది.
ఈ రెండు విషయాలు ఏవైతే! వినిపించానో- ఒకటి అలజడి అవ్వని దానం ఇవ్వండి. అవగుణాలు చూడకుండానే బహుమతి ఇవ్వాలి. పిల్లలందరూ, ఇది గుర్తుంచుకోవాలి. ”సంకల్పం చేశారు అంటే అర్థం ఇచ్చేశారు”. సంకల్పం చేసిన వస్తువు ఏదీ తిరిగి వాపస్ తీసుకోబడదు ఒకవేళ మాయ, తిరిగి వాపస్ తీసుకోవడానికి ప్రయత్నింప చేసినా కానీ, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీరు పాస్ అవుతారు. ఇప్పుడు మరో విషయం మీ దృష్టికి తీసుకు వస్తున్నాము - ధ్యానంలో ఎక్కువ సమయం గడపడం అంటే సమయాన్ని వృధా చేయడమే అని బాప్ దాదా చివరి మురళీలో పొందిన శిక్షణ. కాబట్టి ఇలా జరగకూడదు.
సందేశీల ద్వారా సెంటర్లలో ఏదైతే పాత్ర నడిచిందో! దాన్ని మీరు పరీక్షించుకో లేకపోవటం, ఇది జరగకూడదు. అందువలన మీరు, నిమిత్తంగా మారిన దీదీ మరియు కుమార్ కా. నియమించిన సందేశీ ద్వారా సూచనలు అందుకుంటారు. ఈ పాత్ర కోసం కూడా, మీరు ఎవరినైతే నిమిత్తం చేస్తారో! వారి ద్వారా మాత్రమే రహస్యాలు స్పష్టమవుతాయి. ఉదాహరణకు, ఆనందించే సమయంలో వైకుంఠం మొదలైన వాటికి వెళ్లడం సమయం వృధా అని గతంలోని మురళిలో ఒక సూచన, కూడా ఉంది. ఎందుకంటే! భోగ్ పెట్టే సమయంలో వైకుంఠం మొదలైన వాటిలోకి వెళ్లడం అనేది సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవడమే.
ఎందుకంటే వెళ్లడం తిరగడం రావడం ఇప్పుడు మంచిగా (శోభ) అనిపించదు. (కుదరదు). ఇప్పుడు మనం నిరంతరం స్మృతి యాత్ర మరియు ఆచరణాత్మక జీవితం (ప్రాక్టికల్ లైఫ్)లో మనం పొందిన శిక్షణలను ధారణచేసే ఋజువు ఇవ్వాలి. బ్రహ్మాబాబాతో స్నేహం ఉంటే, స్నేహానికి గుర్తు ఏమిటి? ఆప్యాయత అంటే రెండు కన్నీటి చుక్కలు కార్చడం కాదు. కానీ స్నేహమని దేనిని అంటారు? బాబాకి దేనిపైన స్నేహం ఉందో దానితో మీకు దానిపై స్నేహం ఉండాలి. వారి స్నేహం సేవ తో ఉండేది. గతంలో కూడా సేవ యొక్క ఋజువు ఇచ్చారు, కదా?
కాబట్టి సేవపై ప్రేమ, వారి ఆజ్ఞల పై ప్రేమ. ఇదే స్నేహం అనబడుతుంది. మిగిలిన ఎవరూ కూడా ఇలా అనుకోవద్దు. పిల్లలతో సెలవు గురించి చెప్పకుండా సాకారబాబాను వతనంలోకి ఎందుకు పిలిచారు? కానీ సెలవు ఇప్పించాలంటే మీరు ఇస్తారా? అందుకే డ్రామా మొదట కూడా చూశారు. ఎవరైతే వెళ్లారో! సెలవు తీసుకుని అయితే వెళ్లలేదు. కావున బ్రాహ్మణ కులం యొక్క డ్రామాలో ఇదొక ఆచారమని గ్రహించండి. డ్రామాలో ఏదైతే నమోదు చేయబడిందో, ఆచారం కొనసాగింది. ఇలా అయితే అనుకుంటున్నారా? మీ అందరికీ సాకరునిపై చాలా ప్రేమ ఉండేది.
ప్రేమ లేదంటే ఈ సభలో ఎలా ఉంటారు? సాకారంలో అనుసరించడానికి అయితే ఇతని శరీరమే ఉండేది. అయితే ప్రేమ ఎందుకు ఉండదు. స్నేహం ఉండేది మరియు ఉంది. ఇది తండ్రి మరియు పిల్లలయొక్క గుర్తు. దీనితో సాకారుడు కూడా వతనంలో నవ్వుతున్నాడు. పిల్లలకు స్నేహం ఉంది అంటే నాకెందుకు లేదు? కానీ డ్రామాలో ఏదైనా పాత్ర ఉంటుందో, అది కళ్యాణకారి అని, వారికి తెలుసు. వారు విచలితమవ్వరు. వారైతే సంపూర్ణంగా స్థిరంగా, చలించని వారిగా ఉన్నారు. కానీ అతనికి మీ పిల్లలంటే వెయ్యి రెట్లు స్నేహం ఎక్కువ. ఇప్పుడు మనం స్నేహం యొక్క, ఋజువు ఇవ్వాల్సి ఉంది.
ఇది కూడా దాగుడు మూతల ఆట. కాబట్టి విచారసాగర మథనం చేయండి. హల్ చల్, అలజడి యొక్క మంతన చేయకండి. ఎవరైతే శక్తిశాలిగా ఉన్నారో, వారిని ప్రత్యక్షం చేయండి. ఇది భారత మాత శక్తి అవతారం అంతిమ నినాదం ఇదే. Sun shows father- కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. డ్రామా రికార్డ్ చేయిస్తుంది. సాకారబాబా చెప్పారు, పిల్లలతో మిలనం జరుపుకోవడానికి వస్తాను. ఒకవేళ ఈ రోజు వచ్చి ఉంటే పిల్లలు కన్నీళ్లు పెట్టుకునేవారు.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.