రివైజ్ కోర్స్ మురళి 24-07-1969                    

                                                

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

బిందు రూపం యొక్క అభ్యాసం

              మధురాతి మధురమైన పిల్లలూ! ఎవరి ఎదురుగా కూర్చున్నారు? మరియు ఎలా అయ్యి కూర్చున్నారు? బాబా అయితే మిమ్మల్ని బిందురూపంగా తయారుచేయడానికి వచ్చారు. నేను ఆత్మను, బిందు రూపాన్ని, బిందువు ఎంత చిన్నగా ఉంటుంది మరియు బాబా కూడా ఎంత చిన్నగా ఉంటారు? ఇంత చిన్న విషయం కూడా బుద్ధిలోకి రావటం లేదా? బాబా అయితే పిల్లల ఎదురుగానే ఉన్నారు. దూరంగా లేరు. దూరంగా ఉన్నవారిని మర్చిపోవచ్చు కానీ దగ్గరగా ఉన్నవారిని మర్చిపోతే మంచిగా అనిపించదు. ఒకవేళ పిల్లలు బిందువునే మర్చిపోతే ఇక దేని ఆధారంగా నడుస్తారు చెప్పండి?

ఆత్మ ఆధారంగానే శరీరం నడుస్తుంది. నేను ఆత్మను, బిందువుని, బిందువు యొక్క సంతానాన్ని అనే నషా ఉండాలి. సంతానం అనుకోవటం ద్వారానే స్నేహం అనుభవం అవుతుంది. కనుక ఈరోజు పిల్లలైన మీకు బిందు రూపంలో స్థితులయ్యే అభ్యాసం చేయించనా? నేను ఆత్మను దీనిలో మర్చిపోవలసిన విషయం లేదు. మీ తండ్రిని మీరు మర్చిపోతారా? పరిచయం చెప్పడానికి అయితే నా నామం, రూపం, గుణం, కర్తవ్యం ఏమిటి అనేవి చెప్పాలి. మరియు నేను ఎప్పుడు వస్తాను? ఎవరి తనువులో వస్తాను? పిల్లలైన మీకే నా పరిచయాన్నిస్తాను. బాబా మీ పరిచయాన్ని మర్చిపోతారా?

పిల్లలు కూడా అటువంటి స్థితిలో ఒక్క సెకను అయినా ఉండలేకపోతున్నారా? మీ నామం, రూపం, దేశం కూడా మర్చిపోతున్నారా? ఇది మొట్టమొదటి విషయం . మీరు అందరికీ చెప్తున్నారు కదా - నేను ఆత్మను, శరీరం కాదు అని వారిని ఆత్మగా భావించి కూర్చోమని చెప్పినప్పుడే వారు తమ శరీరాన్ని మర్చిపోతారు. ఒకవేళ ఆత్మగా భావించి కూర్చోకపోతే దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోగలరా? వారిని మీరు మరిపించి కూర్చోబెడుతున్నప్పుడు మీరు మీ శరీరానికి అతీతమై అతీత తండ్రి యొక్క స్మృతిలో కూర్చోలేరా?

ఇప్పుడు పిల్లలందరు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి కూర్చోండి. ఎదురుగా ఎవరిని చూడాలి? ఆత్మల తండ్రిని చూడాలి. ఈ స్థితిలో ఉండటం ద్వారా వ్యక్తానికి అతీతంగా అవ్యక్తస్థితిలో ఉండగలరు. నేను ఆత్మను, బిందురూపాన్ని అనేది స్మృతి రావటంలేదా? ఇలా అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్తే ఒక్క సెకను ఏమిటి ఎన్ని గంటలైనా ఆ స్థితిలో స్థితులై ఆ స్థితి యొక్క రసం తీసుకోగలరు. ఈ స్థితిలో ఉండటం ద్వారా ఇక మాట్లాడే అవసరమే ఉండదు. బిందువు అయి కూర్చోవటం అనేది జడమైన స్థితి కాదు.

ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారం అంతా ఇమిడి ఉంటుందో అలాగే ఆత్మనైన నాలో బాబా స్మృతి ఇమిడి ఉంది అని భావించి కూర్చోవటం ద్వారా అన్ని రసనలు వస్తాయి. మరియు వెనువెంటే మేము ఎవరి ఎదురుగా ఉన్నాము అనే నషా కూడా ఉంటుంది. బాబా మనల్ని కూడా తన వెంట ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? బాబా తన పిల్లలని ఒంటరిగా వదలడం లేదు. బాబా మరియు పిల్లలైన మన ఇంటికి వెంటే తీసుకువెళ్తారు, అందరు కలసి వెళ్ళవలసిందే. ఆత్మగా భావించి మరలా శరీరంలోకి వచ్చి కర్మ కూడా చేయాలి. కర్మ చేస్తూ కూడా అతీతం మరియు ప్రియంగా అయి ఉండాలి. బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని చూస్తున్నారు. చూస్తూ కూడా బాబా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు కదా!

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

సదా సమర్థ భవ!