రివైజ్ కోర్స్ మురళి 26-06-1970
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
కామధేనువు యొక్క అర్ధం.
మిమ్మల్ని మీరు సాక్షాత్కారమూర్తిగా భావిస్తున్నారా? మూర్తి దగ్గరికి ఎందువలన వెళ్తారు? తమ మనోకామనలు పూర్తి చేసుకునేటందుకు వెళ్తారు. ఏ ఆత్మకి ఏ రకమైన కోరిక ఉంటే ఆ కోరికను పూర్తి చేసే సాక్షాత్కారమూర్తిగా అయ్యారా? అల్పకాలిక కోరికలు కాదు, సదాకాలిక కోరికలను పూర్తి చేయగలరా?
కామధేనువు అని మాతలను అంటారు కదా! కామధేనువు అంటే సర్వుల కోరికలను పూర్తి చేసేవారు అని అర్థం. ఎవరికైతే తమ సర్వ కోరికలు పూర్తి అవుతాయో వారే ఇతరుల కోరికలను పూర్తి చేయగలరు. సదా ఇదే లక్ష్యంపెట్టుకోండి - సర్వుల కోరికలను తీర్చే మూర్తి అవ్వాలని, సర్వుల కోరికలను తీర్చేవారు స్వయం కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా ఉంటారు. ఇలాంటి అభ్యాసం చేయాలి. స్వరూపంగా అవ్వటం ద్వారా ఇతరులకి ప్రాప్తినివ్వగలరు. సదా మిమ్మల్ని మీరు దాతగా లేదా మహాదానిగా భావించాలి. మహాజ్ఞాని తర్వాత మహాదాని యొక్క కర్తవ్యం నడుస్తుంది.
మహాజ్ఞాని యొక్క పరిశీలన మహాదాని అవ్వటం ద్వారా తెలుస్తుంది. షైర్ చేయటం (విహరించటం) మంచిగా అనిపిస్తుంది. ఎవరికైతే షైర్ చేసే అలవాటు ఉంటుందో వారు సదా షైర్ చేస్తారు. ఇది కూడా అంతే. ఎంత స్వయం విహరిస్తారో అంత ఇతరులని కూడా బుద్దియోగం ద్వారా విహరింప చేయగలరు. మీ ద్వారా సాక్షాత్కారం అవ్వాలి. ఎలా అయితే సాకార బాబా ఎదురుగా రావటంతోనే ప్రతి ఒక్కరికీ భావన ప్రకారం సాక్షాత్కారం లేక అనుభవం అయ్యేది. అలాగే మీ ద్వారా కూడా సెకను, సెకను అనేక అనుభవాలు లేక సాక్షాత్కారాలు అవుతాయి.
అవ్యక్త ఆకృతి రూపాన్ని తయారు చేసుకున్నప్పుడే ఇలా దర్శనీయమూర్తి లేక సాక్షాత్కారమూర్తిగా అవుతారు. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారికి శరీరం కనిపించకూడదు, సూక్ష్మవతనంలోని ప్రకాశమయ రూపం కనిపించాలి. కేవలం మస్తకమే ప్రకాశంగా కాదు, కానీ మొత్తం శరీరం కూడా ప్రకాశంగా సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడైతే ప్రకాశమే ప్రకాశం చూస్తారో అప్పుడు స్వయం కూడా ప్రకాశరూపం అయిపోతారు. మంచిది.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.