రివైజ్ కోర్స్ మురళి 29-05-1970
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవితభాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
సమీపరత్నాల యొక్క గుర్తులు.
సమయము ఎంత సమీపానికి చేరుకుందో కనిపిస్తోందా, లెక్క చూడగలరా? భవిష్య లక్షణములతో పాటు సంపూర్ణ స్వరూపపు లక్ష్యము కూడా ఎదురుగా ఉందా? సమీపపు లక్షణము ఏమిటి? శరీరాన్ని వదిలేటప్పుడు చాలామందికి ముందే తెలిసిపోతుంది. అలాగే మీరు కూడా ఈ శరీరము వేరు, దీనిని మేము ధరించి నడిపిస్తున్నాము అన్న అనుభవము చేసుకుంటారు. సమీపంగా వచ్చే సమీప రత్నాల లక్షణము ఇదే ఉంటుంది. ఎల్లప్పుడూ తమ ఆకారీ రూపము మరియు భవిష్య రూపమును ఎదురుగా చూస్తూ ఉంటారు. ప్రాక్టికల్ లో అనుభవమవుతుంది.
ఇలా తయారవ్వాలి అని లైటు యొక్క ఫరిస్తా స్వరూపము ఎదురుగా కనిపిస్తుంది మరియు భవిష్యరూపము కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని వదులుతాము దానిని తీసుకుంటాము.... ఎప్పుడైతే ఇటువంటి అనుభవము ఉంటుందో అప్పుడు సంపూర్ణతకు సమీపంగా వచ్చినట్లు భావించండి. ఒక కంట్లో సంపూర్ణ స్వరూపము, మరొక కంట్లో భవిష్య స్వరూపము ఈ విధముగా ప్రత్యక్షముగా కనిపిస్తుంది. ఏవిధంగా మీ ఈ స్వరూపము ప్రత్యక్షముగా అనుభవమవుతుందో అలా, ఇక్కడ లేము కానీ ఆ సంపూర్ణ స్వరూపములో కూర్చున్నాము అని కూర్చొని, కూర్చొనే అటువంటి అనుభవం చేసుకుంటారు.
ఈ పురుషార్థీ శరీరము పూర్తిగా మర్జ్ అయిపోతుంది. ఒకవైపు అవ్యక్తము మరొకవైపు భవిష్యత్తు, ఈ రెండూ ఇమర్జ్ అవుతాయి. ఇటువంటి అనుభవమును మొదట మీరు చేసుకున్నట్లయితే అప్పుడు ఇతరులకు కూడా అనుభవమవుతుంది. ఏవిధంగా ఒక వస్త్రాన్ని వదిలి మరొకదానిని ధరించినట్లుగా అంత సహజముగా అనుభవము చేసుకుంటారు. ఇది మర్జ్ అవుతుంది అది ఇమర్జ్ అవుతుంది, దీనిని మర్చిపోతూ ఉంటారు. ఇటువంటి స్థితిలో విల్ పవర్ కూడా ఉంటుంది. విల్లును వ్రాస్తారు కదా, విల్లు చేసిన తరువాత నాది అన్న భావమంతా సమాప్తమైపోయినట్లుగా, బాధ్యత దిగిపోయినట్లుగా అనుభవమవుతుంది.
విల్ పవర్ కూడా వస్తుంది మరియు సర్వస్వమును విల్లు చేసేసినట్లుగా కూడా అనుభవమవుతుంది. సంకల్ప సహితంగా అన్నీ విల్లు అయిపోయాయి. శరీర భానమును వదలటము మరియు సంకల్పాలతో సహా పూర్తిగా విల్లు చేయటము ఇదే మైట్(శక్తి). అప్పుడిక సమానత స్థితి కలుగుతుంది. సమానత అన్నా సంపూర్ణత అన్నా విషయమైతే ఒక్కటే. ఇప్పుడు ఈ చార్టును పెట్టాలి. ఆ చార్ట్ అయితే మామూలే. పంచతత్వాల శరీరము ఉన్నాగానీ లైట్ స్వరూపమును అనుభవము చేసుకుంటారు. లైటు అన్న మాటకు గల అర్థములో కూడా అంతరము ఉందని వినిపించి ఉన్నాము కదా!
లైట్ అనగా తేలికతనము అని మరియు లైట్ అనగా జ్యోతి అని కూడా అంటారు. పూర్తిగా తేలికతనము అనగా లైట్ స్వరూపులై నడుస్తున్నాము, మేమైతే నిమిత్తులము! అవ్యక్తరూపములో అయితే ప్రతి విషయములోనూ సహాయము లభిస్తుంది. అచ్ఛా!
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.