రివైజ్ కోర్స్ మురళి 18-06-1971

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

బుద్ధి యొక్క అలౌకిక వ్యాయామం

ధ్వనికి అతీతంగా వెళ్ళటం ఇష్టమనిపిస్తుందా లేక ధ్వనిలో ఉండటం ఇష్టమనిపిస్తుందా? అసలైన దేశం లేదా అసలైన స్వరూపంలో ధ్వని ఉంటుందా? అసలైన స్థితిలో స్థితులైనప్పుడు అలాంటి ధ్వనికి అతీతమైన స్థితి ఇష్టమనిపిస్తుంది కదా! ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే స్వరూపంలో స్థితులు అవ్వాలి. యుద్ధవీరుడు యుద్ధ మైదానంలో ఉన్నప్పుడు వారికి ఎప్పుడు ఆజ్ఞ లభిస్తుందో అలా చేస్తూ వెళ్తారు. అదేవిధంగా ఆత్మిక యుద్ధ వీరులకు ఎప్పుడు మరియు ఏ. ఏ సలహా లభిస్తే ఆవిధంగా స్థితులు కాగలుగుతున్నారా?

ఎందుకంటే మాస్టర్ జ్ఞాన సాగరులు, కూడా మరియు మాస్టర్ సర్వశక్తివంతులు కూడా. రెండూ కనుక ఒక్క సెకను కంటే కూడా తక్కువ సమయంలో ఏ స్థితిలో స్థితులవ్వాలంటే ఆ స్థితిలో స్థితులు అయిపోవాలి. అలాంటి యుద్ధవీరులేనా? ఇప్పుడిప్పుడే పరంధామ నివాసి అవ్వండి అని అంటే పరంధామ నివాసిగా 'అయిపోండి. చెప్పగానే ఈ దేహాన్ని మరియు దేహం యొక్క దేశాన్ని మరిచి అశరీరి పరంధామ నివాసి అయిపోయే అభ్యాసం అయ్యిందా? మరలా ఇప్పుడిప్పుడే పరంధామ నివాసి నుండి అవ్యక్త స్థితిలో స్థితులవ్వండి అని అంటే అవ్యక్త స్థితిలో స్థితులు అయిపోవాలి.

సేవ చేస్తూ కూడా స్వ స్వరూపం యొక్క స్మృతి ఉండాలి. ఇలాంటి అభ్యాసిగా అయ్యారా? ఇలాంటి అభ్యాసం అయ్యిందా? లేకపోతే పరంధామ నివాసిగా అవ్వాలనుకున్నప్పుడు పరంధామ నివాసికి బదులు మాటిమాటికి ధ్వనిలోకి వచ్చేసే అభ్యాసం అయితే చేయటం లేదు కదా? ఒక్క సెకను • కంటే తక్కువ సమయంలో మీ బుద్ధిని ఎక్కడ నిలపాలో అక్కడ నిలపగలుగుతున్నారా? ఇలాంటి అభ్యాసం అయ్యిందా? స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతునిగా భావిస్తున్నారా? సర్వశక్తివంతులు ' అయినప్పుడు మీ బుద్ధి యొక్క సంలగ్నతని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించలేరా?

ఆ అధికారం ముందు ఈ అభ్యాసం సహజమా లేక కష్టమా? స్థూల కర్మేంద్రియాలను ఎప్పుడు.. కావాలంటే, ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించగలుగుతున్నారు కదా! ఇప్పుడు చేతిని పైకి ఎత్తాలన్నా, క్రిందకి దించాలన్నా చేయగలుగుతున్నారు కదా! స్థూల కర్మేంద్రియాలకు యజమాని అయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడగలుగుతున్నారు. అదేవిధంగా సంకల్పాలను లేదా బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించగలుగుతున్నారా? స్థూల కాళ్ళు చేతులను ఎక్కడికి కావాలంటే అక్కడికి నడిపించగలుగుతున్నారు లేదా ఉపయోగించగలుగుతున్నారు.

ఇలాంటి అభ్యాసం ఉన్నవారినే మాస్టర్ సర్వశక్తివాన్ లేదా మాస్టర్ జ్ఞాన సాగరులు అని అంటారు. ఈ అభ్యాసిగా కాకపోతే మాస్టర్ సర్వశక్తివంతులు, మాస్టర్ జ్ఞాన సాగరులు అని అనరు. జ్ఞాన సాగరులు అనగా ఈ సమయంలో ఏమి చేయాలి - ఏమి చేయకూడదు; చేస్తే లాభం ఏమిటి నష్టం ఏమిటి? ఇలా పూర్తి జ్ఞానం ఉంటుంది. ఇలా జ్ఞానం ఉన్న వారే జ్ఞానవంతులు. మరియు వెనువెంట మాస్టర్ సర్వ శక్తివంతులు కనుక సర్వశక్తుల ఆధారంగా ఈ అభ్యాసం నిరంతరం మరియు సహజంగా ఉంటుంది. చదువు యొక్క అంతిమ పాఠం ఏమిటి? అది పాఠం ఏమిటి?

ఆది పాఠం మరియు అంతిమ పాఠం - ఈ అభ్యాసమే. బిడ్డ లౌకికంగా జన్మించినప్పుడు వారికి ఒక మాట గుర్తు చేస్తూ ఉంటారు లేదా నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలౌకిక జన్మ తీసుకుంటూనే మొదట ఏ మాట నేర్చుకున్నారు? బాబాని సృతి చేయండి. కనుక లౌకికం అయినా, అలౌకికం అయినా జన్మించిన వెంటనే అనిన మాట సదా గుర్తు ఉంచుకోవాలి. ఇది కష్టమా? మీకు మీరు వ్యాయామం చేసుకునే అభ్యాసం చేయటం లేదు. ఇది బుద్ధి యొక్క వ్యాయామం. వ్యాయామాన్ని అభ్యసించేటప్పుడు మొదట నొప్పి కూడా అనుభవం అవుతుంది. కానీ అభ్యాసిగా అయిపోయిన వారు వ్యాయామం చేయకుండా ఉండలేరు.

ఇక్కడ కూడా బుద్ధి యొక్క వ్యాయామం చేసే అభ్యాసం తక్కువగా ఉన్న కారణంగా మొదట కష్టమనిపిస్తుంది. తల బరువుగా ఉన్నట్లు లేదా ఏదొక విఘ్నం రావటం అనేవి అనుభవం అవుతూ ఉంటాయి. కానీ అభ్యాసిగా అవ్వవలసిందే. ఇది లేకుండా రాజ్య భాగ్యం లభించటం కష్టం. ఎవరికైతే ఈ అభ్యాసం కష్టమనిపిస్తుందో వారికి ప్రాప్తి కూడా కష్టం. అందువలన ఈ ముఖ్య అభ్యాసాన్ని సహజం మరియు నిరంతరం చేసుకోండి. ఇలాంటి అభ్యాసిలు అనేక ఆత్మలకు సాక్షాత్తు బాప్దాదా కనిపించేలా సాక్షాత్కారం చేయిస్తారు. ధ్వనిలోకి రావటం ఎంత సహజమో ధ్వనికి అతీతంగా వెళ్ళటం కూడా ఇంత సహజంగా అనిపించాలి. మంచిది.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

ఆత్మిక గులాబి భవ!