రివైజ్ కోర్స్ మురళి 21-01-1971
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు
ఈ రోజు బాప్ దాదా ప్రతీ ఒక్కరి మస్తకంలో ఏమి చూస్తున్నారు? పిల్లలని చూసినప్పుడు తండ్రికి ఇదే శుభ భావన ఉంటుంది - ప్రతీ ఒక్క బిడ్డ ఉన్నతోన్నత భాగ్యం తయారుచేసుకోవాలని వర్తమాన సమయంలో వరదాత రూపంలో వరదానం ఇచ్చేటందుకు తండ్రి వచ్చినా కానీ ప్రతీ ఒక్క ఆత్మ యోగాన్ని అనుసరించి, శక్తిననుసరించి వరదాత నుండి వరదానాలు పొందుతూ ఉంది. ఈ సమయానికి ఉన్న విశేష వరదానం- సర్వాత్మలకు వరదానాలను ప్రాప్తింపచేయటం, ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు.
ఈ రోజు ఈ ఆత్మలు (రాజ్యపాల్ దంపతులకు) కూడా వరదానం ప్రాప్తింప చేసుకునే శుభ రోజు. కల్పమంతటిలో కొద్దిమంది పదమాపద భాగ్యశాలి ఆత్మలకు మాత్రమే ఈ మిలనం యొక్క భాగ్యం లభిస్తుంది. సంప్రదింపుల్లోకి వచ్చారు తర్వాత సంబంధంలోకి రావాలి. ఎందుకంటే సంబంధం ద్వారానే శ్రేష్ట ప్రాప్తి లభిస్తుంది. రెండు మాటలను సదా గుర్తుంచుకోవాలి - 1. స్వయం 2, సమయం. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే ఈ జీవితంలో అనేక జన్మలకు శ్రేష్ట ప్రాలబ్దాన్ని పొందగలరు. రాజ్యపాల్ దంపతులతో సంభాషణ - మీ అసలైన ఇంటికి వచ్చారు - ఇలా అనుభవం చేసుకుంటున్నారా?
మీ ఇంటికి ఎంత త్వరగా రావాలో తెలుసా? విధులు పూర్తవగానే మన ఇల్లు గుర్తు వస్తుంది. అదే విధంగా మీ శరీర నిర్వహణార్ధం చేసే విధులు అయిపోగానే మీ ఇల్లు గుర్తు రావాలి. సంబంధాన్ని పెంచుకోవాలి. ఒక సంబంధాన్ని పెంచుకోవటం ద్వారా అనగా ఈ సంబంధం యొక్క ఆవశ్యకతను గుర్తించటం ద్వారా అనేక రకాల ఆవశ్యకతలు పూర్తయిపోతాయి. అన్ని అవసరాలను పూర్తి చేసుకునేటందుకు ఒక అవసరాన్ని అర్ధం చేసుకోవాలి. శరీర నిర్వహణ కొరకు అనేక సాధనాలు అవసరం అని భావిస్తారు కదా అదే విధంగా ఆత్మ ఉన్నతి కొరకు ఒక సాధనం అవసరం.
సదా స్వయాన్ని అకాలమూర్తిగా భావించి నడిస్తే అకాలమృత్యువుల నుండి, అకాలంగా సంభవించు సర్వ సమస్యల నుండి రక్షింపబడతారు. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించు కునేటందుకు ఒకే సాధనాన్ని గుర్తు ఉంచుకోండి - కేవలం మీ యొక్క ఈ పాత శరీర అభిమానాన్ని తొలగించుకోవాలి.
ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవటం ద్వారా సర్వ పరిస్థితులు తొలగిపోతాయి. ఇప్పుడు ఇక అడగవలసినది ఏమీ లేదు. కేవలం సంబంధంలోకి వస్తూ ఉండండి. అందరినీ కలుసుకునేటందుకు మరలా వస్తాను. ఇప్పుడు అందరి నుండి శెలవు.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.