రివైజ్ కోర్స్ మురళి 21-01-1971-2

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

అవ్యక్త వతనం యొక్క అలౌకిక ఆహ్వానం

ఈ రోజు కలుసుకునేటందుకు పిలిచారు. ఈ అవ్యక్త మిలనాన్ని అవ్యక్త స్థితిలో స్థితులైతేనే చేసుకోగలరు. అర్ధం చేసుకోగలరా? ఈ రోజు చూస్తున్నారు - ఎవరెవరు ఎంత శక్తి స్వరూపులు అయ్యారు? మీ చిత్రాలలో శక్తులకు స్మృతిచిహ్నాలు నెంబరువారీగా చూపించారు కదా! శక్తులను  ఏ చిత్రాల ద్వారా పరిశీలించవచ్చో తెలుసా? మీ శక్తులను మీరు పరిశీలించుకునే చిత్రం ఏమిటో తెలుసా? శక్తులకు స్మృతి చిహ్నాలు రకరకాలుగా మరియు నెంబరువారీగా తయారు చేశారు. మీ చిత్రాన్ని మర్చిపోయారా? శక్తుల చిత్రాలలో భిన్న భిన్న రూపాలలో మరియు భుజాల రూపంలో నెంబరువారీగా చూపించారు.

ఆ చిత్రాలలో కొందరికి కొన్ని భుజాలు ఇంకొకరికి మరికొన్ని భుజాలు చూపించారు. అనగా కొందరు అష్ట శక్తులను ధారణ చేసిన వారు అయ్యారు, కొందరు ఇంకా ఎక్కువ, కొందరు తక్కువ ధారణ చేశారు. అందువలనే అక్కడక్కడ 4 భుజాలు, 5 భుజాలు, అక్కడక్కడ 16 భుజాలను కూడా చూపించారు నెంబరువారీ. కనుక ఈ రోజు చూస్తున్నారు – ప్రతీ ఒక్కరు ఎన్ని శక్తులను ధారణ చేశారు. మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సర్వశక్తులను ధారణ చేసేవారు. మీ శక్తి స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుందా? అవ్యక్త వతనంలో ప్రతీ ఒక్కరి శక్తి రూపాన్ని చూస్తే ఏమి కనిపిస్తుంది?

వతనంలో బాప్ దాదా యొక్క అలౌకిక ప్రదర్శిని ఉంది. దాంట్లో ఎన్ని చిత్రాలు ఉంటాయి? మీ చిత్రం కూడా లెక్కించబడుతుంది కానీ బాప్ దాదా యొక్క ప్రదర్శినిలో చిత్రాలు లెక్కించగలమా? బాప్ దాదా ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించేవారు ఆహ్వానిస్తున్నారు కానీ రావటం అనేది వచ్చేవారి పని. బాప్ దాదా మీ అందరి కంటే కోటిరెట్లు సంతోషంతో ఆహ్వానిస్తున్నారు. ప్రతీ ఒక్కరికి అనుభవం అవగలదు. కొంచెం సమయం నిరంతరం అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోండి అప్పుడు ఎలా అనుభవం అవుతుందంటే విజ్ఞానం ద్వారా దూర వస్తువులు కూడా దగ్గరగా కనిపిస్తాయి.

అదే విధంగా అవ్యక్త వతనం యొక్క కార్యకలాపాలు అన్నీ ఇక్కడి నుండే స్పష్టంగా చూడవచ్చు. బుద్ధిబలం ద్వారా మీ సర్వశక్తివాన్ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోగలరు. వర్తమాన సమయంలో స్మృతి తక్కువగా ఉంది, అందువలన సమర్థత రావటం లేదు. వ్యర్థ సంకల్పాలు, వ్యర్ధ మాటలు, వ్యర్ధ కర్మ వలన సమర్ధంగా కాలేకపోతున్నారు. వ్యర్ధాన్ని తొలగించుకోండి సమర్థంగా అయిపోతారు. ప్రతీ ఒక్కరి యొక్క పురుషార్ధం యొక్క భిన్న భిన్న స్వరూపాలు పతనంలో చూస్తూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మీ ప్రతీ ఒక్కరి యొక్క అనేక రూపాలు వతనంలో చూసినంతగా మీకు మీరు ఎక్కడా చూసుకోలేరు.

మీరు కూడా ఒక రోజు విశేష శ్రద్ద పెట్టుకుని చూడండి, రోజంతటిలో నా యొక్క రూపాలు ఎన్ని ఉన్నాయి మరియు ఎలా ఉన్నాయి? ఆ రకరకాల ఫోజులు  చూసి చాలా నవ్వు వస్తుంది. ఈ రోజుల్లో ఒక్కరివే అనేక ఫోజులు చూపిస్తారు కదా! అలాగే మీవి కూడా చూస్కోండి. మీ బహురూపాలను సాక్షాత్కారం చేసుకోండి. వతనానికి రావలని అందరికీ మనస్సు ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు అడగండి - బ్రాహ్మణులై చేయాల్సిన కర్తవ్యాలు అన్నీ చేసేశామా? సర్వ కర్తవ్యాలు సంపన్నం చేసిన తర్వాతే సంపూర్ణంగా అవుతారు. ఇప్పుడు ఎలాంటి సమయం నడుస్తుందంటే అడుగడుగు జాగ్రత్తగా వేయాలి.

 శ్రద్ధ లేని కారణంగా పురుషార్ధం గురించి కూడా ఆందోళనగా ఉంటున్నారు. ఒకవైపు వాతావరణం యొక్క ఆందోళన, రెండవ వైపు పురుషార్ధం యొక్క ఆందోళనలో ఉంటున్నారు. అందువలన కేవలం ఒక అక్షరాన్ని కలపండి  అటెంక్షన్. అప్పుడు ఈ బహురూపాలన్నింటి నుండి ఒకే సంపూర్ణ రూపంగా అయిపోతారు. కనుక ఇప్పుడు అడగడుగునా శ్రద్ధ పెట్టండి. చెప్పాను కదా ఈ రోజుల్లో సర్వాత్మలు సుఖం మరియు శాంతిని అనుభవం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎక్కువగా వినాలని అనుకోవటం లేదు. అనుభవం చేయించేటందుకు స్వయం అనుభవీ స్వరూపంగా అవ్వాలి.

అప్పుడే సర్వాత్మల కోరికను పూర్తి చేయగలరు. రోజురోజుకీ మీరు చూస్తారు - ధనంతో బికారులు అయిన వారు  భిక్ష కోసం ఎలా అయితే వస్తారో అలాగే శాంతి అనుభవం కోసం బికారులై బిక్ష తీసుకునేటందుకు తపిస్తారు. ఇప్పుడు కేవలం ఒక దుఃఖం యొక్క అల వస్తుంది. అలల్లో కొట్టుకుపోతున్న ఆత్మలు లేదా అలల్లో మునిగిపోతున్న ఆత్మ ఏదొక సహాయంతో ఒడ్డుకి చేరాలని చూస్తారో అదే విధంగా మీ ఎదురుగా అనేక బికారి ఆత్మలు ఈ భిక్ష అడిగేటందుకు వస్తారు. ఇలా తపిస్తున్న, బికారి, దప్పికగొన్న ఆత్మల యొక్క దప్పిక తీర్చేటందుకు స్వయాన్ని అతీంద్రియ సుఖం లేదా సర్వ శక్తులతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా?

సర్వ శక్తుల ఖజానా, అతీంద్రియ సుఖం యొక్క ఖజానా ఇంతగా జమ చేసుకున్నారా. దీని ద్వారా మీ స్థితి స్థిరంగా ఉండటమే కాదు, ఇతరాత్మలను కూడా సంపన్నంగా తయారు చేయగలగాలి. దాత యొక్క పిల్లలు కదా, సర్వుల జోలెను నింపేవారు కదా! ఇప్పుడు ఈ దృశ్యం చాలా త్వరలో ఎదురుగా రానున్నది. ఈ జబ్బుకి వైద్యులు కూడా మందులు ఇవ్వలేరు. అప్పుడు మీ దగ్గరకి ఈ ఔషధం తీసుకోవటానికి వస్తారు. నెమ్మదినెమ్మదిగా సుఖం శాంతి యొక్క అనుభవం బ్రహ్మాకుమారీల వద్ద లభిస్తుంది అనే మాట వస్తుంది. భ్రమిస్తూ భ్రమిస్తూ అసలైన ద్వారం దగ్గరకి అనేకాత్మలు వచ్చి చేరుకుంటాయి.

ఇలా అనేకాత్మలను సంతుష్టం చేసేటందుకు స్వయం మీ యొక్క ప్రతీ కర్మతో సంతుష్టంగా ఉన్నారా? సంతుష్ట ఆత్మలే ఇతరాత్మలను సంతుష్టం చేయగలరు. ఇప్పుడు ఈ సేవ చేయటానికి స్వయాన్ని తయారు చేసుకోండి. ఇలా తపిస్తున్న ఆత్మలు ఏడు రోజుల కోర్సు కోసం ఉండలేరు. ఆ సమయంలో ఆ ఆత్మలకు ఏదొక అనుభవం అనే ప్రాప్తిని ఇవ్వవలసి ఉంటుంది. అందువలనే చెప్పాను ఇప్పుడు మీ బ్రాహ్మణ కర్తవ్యాలు అన్నీ సంపన్నం చేసుకునేటందుకు స్వయాన్ని సంపూర్ణంగా తయారు చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఏ సేవ చేయాలో అర్ధమైందా?

మీరు వ్యక్తంలో బిజీగా ఉన్నంత వరకు బాప్ దాదా  అవ్యక్తంలో ఉంటూ కూడా సహాయకారిగా ఉంటారు. ధైర్యవంతులైన పిల్లలకు తండ్రి సహాయం చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు బాగా బిజీగా ఉంటారో!  ఆదిలో వతనం యొక్క అనుభవం చేయించేవారు కదా! ధ్యానంలోకి వెళ్ళేవారి కంటే బాగా అనుభవం చేసుకునేవారు. (బాబా! మీరు ఇప్పుడు కూడా అనుభవం చేయించండి) అనుభవం చేసుకోండి. బుద్ధి అనే విమానం ఉంది కదా! కొంతమంది పిల్లలు ఒక్కో విషయంలో మొండితనం చేస్తూ ఉంటే బాబా కూడా అంగీకరించవలసి ఉంటుంది. అలా మీరు ఇప్పుడు అనుభవం చేయించండి అని మొండితనం చేయండి. మంచిది.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

సదా ఆరోగ్య భవ!