రివైజ్ కోర్స్ మురళి 22-06-1971
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
తీవ్ర పురుషార్థుల గుర్తులు
శుద్ధ సంకల్ప స్వరూప స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? అనేక సంకల్పాలు స సమాప్తి అయిపోయి, ఒకే శుద్ధ సంకల్పం మిగులుతుంది, అటువంటి స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? ఈ స్థితినే శక్తిశాలి స్థితి అని, సర్వ కర్మ బంధనాలకు అతీతమైన మరియు " అతి ప్రియమైన స్థితి అని అంటారు. అటువంటి అతీత మరియు అతి ప్రియ స్థితిలో స్థితులై చేయడానికి క్రిందకి రావాలి. కొందరి నివాస స్థానం ఉన్నతంగా ఉంటుంది కానీ కార్యo చేయటానికి క్రిందకి వస్తారు, అలా క్రిందకి వచ్చినా కానీ తమ నిజ స్థానాన్ని మర్చిపోరు.
మీరు మీ ఉన్నత స్థితిని అనగా అసలు స్థానాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? కార్యార్ధం కొద్ది సమయం కొరకు ఇప్పుడే క్రిందకి దిగి వచ్చాం అని భావించండి. కానీ సదాకాలిక వాస్తవిక స్థి ' మాత్రం అదే. అప్పుడు ఎన్ని కార్యాలు చేసినా కానీ కర్మయోగి వలె కర్మ చేస్తూ కూడా మీ సే స్థితిని స్థానాన్ని మర్చిపోరు. ఈ స్మృతియే సమర్ధతని ఇప్పిస్తుంది. మాస్టర్ సర్వశక్తివంతుల జన సిద్ధ అధికారం ఏమిటి? సర్వశక్తులే, మాస్టర్ సర్వశక్తివంతుల యొక్క జన్మ సిద్ధ అధికారం. స్మృతి యొక్క స్థితి జన్మ సిద్ద అధికారం రూపంలో సదా ఉండాలి. సదా మీ జన్మ సిద్ధ అధికారం మీతోపాటే ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా?
స్వయాన్ని సుపుత్రునిగా భావిస్తున్నారా? ఇక్కడ కూర్చున్న వారందరు స్వయాన్ని సుపుత్రులుగా భావిస్తున్నారా? (అవును, సుపుత్రులం అని కొందరు అన్నారు, తయారవుతు గా ఉన్నాం అని కొందరు అన్నారు) సుపుత్రులుగా అవుతున్నారా లేక రుజువుగా అవుతున్నారా? రాజు (రెండూ) సుపుత్రులుగా కాకపోతే స్మృతియాత్ర కూడా నిలవదు. అంతిమం వరకు కూడా సుపుత్రునిగా అయ్యే పురుషార్ధమే చేస్తూ ఉన్నట్లయితే రుజువు ఎప్పుడు చూపిస్తారు? రెండు లేదా నాలుగు సంవత్సరాలలో సుపుత్రులుగా అయిపోయి ఆ తర్వాత రెండు లేదా నాలుగు సంవత్సరాలలో రుజువుగా అయ్యి చూపిస్తారా?
మీరు సుపుత్రులే. మీరు సమర్పణ అయ్యారు కదా అంటే సుపుత్రులే కదా? సమర్పణ అయ్యారా లేక ఇప్పుడు సమర్పణ అవ్వాలా? సమర్పణ అయితే సుపుత్రులు కాదా? అర్ధమైందా? శ్రీమతం ఆధారంగా, బాబా సలహానుసారంగా నడిచేవారు సుపుత్రులు కాదా? అక్కడక్కడ ఎక్కువ ఆలోచించటం వలన కూడా ఫలితం మారిపోతుంది. పరీక్ష సమయంలో పరీక్ష వ్రాయటానికి బదులు ప్రశ్న గురించే ఆలోచిస్తూ ఉండిపోతే పరీక్ష ఉండిపోతుంది కదా! కనుక ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళకూడదు. మీరు సుపుత్రులు కనుకనే శ్రీమతానుసారం నడుస్తున్నారని బాబా భావిస్తున్నారు.
ఇక మిగిలింది, రుజువు చూపించే విషయం. అది కూడా శక్తిననుసరించి చూపిస్తున్నారు మరియు చూపిస్తూ ఉంటారు. బాబా తన పిల్లలపై ఎంత నిశ్చయబుద్ధిగా ఉంటారో, పిల్లలకి స్వయంపై నిశ్చయం ( తక్కువగా ఉంది. అందువలన ప్రతీ కార్యంలో విజయీ అనే ఫలితం అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది. బాబాపై నిశ్చయం, చదువుపై నిశ్చయం ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా స్వయంపై కూడా ప్రతీ సమయం మరియు ప్రతీ సంకల్పంలో నిశ్చయబుద్ధి అయ్యి నడవాలి. ఇది లోటుగా గా ఉంది. ఈ లోటుని ఎప్పుడు తొలగించుకుంటారు? రెండు మూడు సంవత్సరాలలోనా?
రెండు మూడు సంవత్సరాలు అని సంకల్పంలో లేదా స్వప్నంలో కూడా ఎప్పుడూ అనుకోకూడదు. ఏమనాలి? ఇప్పుడే అని అనాలి. తీవ్ర పురుషార్ధి అయిన వారి నోటి నుండి ఎప్పుడో అనే మాట ఎప్పుడూ రాదు. సదా ఇప్పుడే అని అంటారు. కేవలం అనటమే కాదు, ఇప్పుడిప్పుడే చేసి కూడా చూపిస్తారు. ఇదే తీవ్ర పురుషార్ధం. ఉన్నతంగా వెళ్తూ ఉన్నారు అంటే సమీపం అవుతూ ఉండాలి. కదా! రెండు మూడు సంవత్సరాలు అని సమయం పెట్టుకుంటే తీవ్ర పురుషార్థిల వరుసలో లెక్కించబడరు.
తీవ్ర పురుషార్ధి అనగా ఏ విషయంలో అయినా బలహీనత లేదా లోపం కనిపిస్తే దానిని ఇప్పుడిప్పుడే సమాప్తి చేసేసుకుంటారు. వీరికి స్మృతి ఉంటుంది మరియు స్మృతితో పాటు సమర్ధత కూడా ఉంటుంది కనుక ఎంత సహజంగా లోపాన్ని పూరించుకుంటారంటే ఏదైనా సాధారణ కార్యం ఎంత సహజంగా, అనుకోకుండానే స్వతహాగా చేసేసారో అలా చేసేస్తారు. అంత స్వతహాగా చేసేస్తారు. ఇలాంటి పురుషార్ధం చేసేటందుకు ప్రతీ రోజూ బాబా ద్వారా ఏవైతే శిక్షణలు లభిస్తున్నాయో వాటి స్వరూపంగా అవుతూ ఉండండి.
శిక్షణలను శిక్షణలుగా. బుద్ధిలో పెట్టుకోవటం కాదు, ప్రతీ శిక్షణ యొక్క స్వరూపంగా అవ్వండి. అప్పుడు ఎలా అయిపోతారు? మీ వాస్తవిక స్థితి గురించి మహిమ ఉంది కదా - జ్ఞాన స్వరూపులు, ప్రేమ స్వరూపులు, ఆనంద స్వరూపులు అని, అలాంటి స్థితి తయారయిపోతుంది. పాయింట్ని పాయింట్ రూపంగా బుద్ధిలో పెట్టుకోవటం కాదు, పాయింట్ యొక్క ప్రత్యక్షం స్వరూపంగా అవ్వండి. అప్పుడు సదా పాయింట్ స్వరూపంలో స్థితులు కాగలరు. ఇప్పుడు ఎక్కువమంది పాయింట్ని పాయింట్ గా ధారణ చేస్తున్నారు. వర్ణన చేస్తున్నారు.
కానీ ఎవరైతే పాయింట్ని స్వరూపంలోకి తీసుకువస్తారో వారు వర్ణన చేయడానికి బదులు సాక్షాత్కార మూర్తిగా అయిపోతారు. కనుక ఇదే పురుషార్ధం చేస్తూ నడవండి. వర్ణన చేయటం అయితే చాలా సహజం. మనసం చేయటం కూడా సహజం. ఏదైతే మననం చేస్తున్నారో, వర్ణన చేస్తున్నారో ఆ స్వరూపంగా అయ్యి ఇతరాత్మలకు కూడా ఆ స్వరూపాన్ని అనుభవం చేయించండి. అలాంటి వారిని సుపుత్రులు మరియు రుజువు చూపించేవారు అని అంటారు. సుపుత్రులను నమ్మకధారి, ఆజ్ఞాకారులు అని వి అంటారు. అందరు స్వయాన్ని ఆజ్ఞాకారులుగా భావిస్తున్నారా?
విజయం యొక్క వరదానం ఉంది, విజయం దేని ద్వారా లభిస్తుంది? ఆజ్ఞపై నడిచినప్పుడు. అయితే మరి ఆజ్ఞాకారులు కాదా? స్థూలంగా ఆజ్ఞను పాటించే శక్తి కూడా సూక్ష్మంపై ఆధారపడి ఉంటుంది. నిరంతరం ఆజ్ఞను పాటిస్తున్నారా? అయితే ముఖ్య ఆజ్ఞ ఏది? నిరంతరం బాబా స్మృతిలో ఉండండి మరియు మనసా, వాచా, కర్మణా పవిత్రంగా ఉండండి. పవిత్ర భవ, యోగి భవ అని ఇతరులకు చెప్తారు. కదా! ఏదైతే ఇతరులకు చెప్తున్నారో అదే ముఖ్యమైన ఆజ్ఞ. సంకల్పంలో కూడా అపవిత్రత లేదా అశుద్దత ఉండకూడదు. అలాంటి వారినే సంపూర్ణ పవిత్రులు అని అంటారు.
ఇలా ఆజ్ఞాకారులుగా I అయ్యారా? శక్తి సేన అందరూ పవిత్రులేనా యోగులేనా లేక ఇప్పుడు అవ్వాలా? నిరంత యోగులు కూడా. నిరంతరం అనగా సంకల్పంలో కూడా అశుద్ధత ఉండదు. సంకల్పం కూడా పాత సంస్కారాలను తాకితే సంపూర్ణ పవిత్రత అని అనరు. స్థూల భోజనం అయి అశుద్ధమైనది స్వీకరించలేదు కానీ తాకినా కానీ సత్యమైన వైష్ణవులు కాదు అని భావిస్తారు అలాగే బుద్ధి ద్వారా కూడా అశుద్ధ సంకల్పాలు లేదా పాత సంస్కారాలను సంకల్ప రూపం తాకుతున్నారంటే సంపూర్ణ వైష్ణవులు అని అంటారా?
అకర్తవ్య కార్యాన్ని ఎవరైనా చూసినా ఆ ప్రభావం పడుతుంది, దానికి కూడా పాపం తయారవుతుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే సంస్కారాలు, అశుద్ధ సంకల్పాలు బుద్ధిలో కూడా తాకుతున్నాయి అంటే సంపూర్ణ వైష్ణ లేదా సంపూర్ణ పవిత్రత అని అనరు. పురుషార్ధం యొక్క లక్ష్యం ఏమిటి? ఇంత స్థితికి చేరుకో ఉంది, మరి ఇప్పటి వరకు ఈ చిన్న చిన్న విషయాలు శోభిస్తాయా? ఇప్పటి వరకు ఇ యొక్క ఆటలు ఆడుతూ ఉంటున్నారు లేదా ఆడాలని అప్పుడప్పుడు అనిపిస్తుందా? - రచన చేశారు, అప్పుడే పాలన చేశారు, అప్పుడే వినాశనం చేశారు - ఇది ఏ ఆట? భక్తి గుడ్డి నమ్మకాల ఆట.
మాయ తప్పక వస్తుంది కానీ ఇప్పటి స్థితిని అనుసరించి, సమయాన్ని అనుసరించి వీడ్కోలు తీసుకోవటానికే వస్తుంది అంతే కానీ మరో రూపంలో కాదు. నమస్కారం చేయటానికి వస్తుంది. ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళిపోయే తయారీలు చేయరా ఏమిటి? కొంచెం నీ సమయం ఆ నమస్కారాన్ని చూస్తారా లేక ఇక వెళ్తారా? శక్తులు అన్నింటినీ అనుభవం చేసుకోవాలి. బాప్దాదా ఇది కూడా త్యాగం చేసి శక్తులకు మరియు పాండవులకు వరదానంగా ఇస్తున్నారు. అందువలనే శక్తులకు ఎక్కువ పూజ జరుగుతుంది. ఇప్పటి నుండే శక్తులను పిలవటం ప్రారంభించేశారు. వారి పిలుపు వినబడుతుందా?
ఎంత ముందుకి వెళ్తూ ఉంటారో అంతగా ఎలా అనుభవం చేసుకుంటారంటే విగ్రహం ముందు భక్తులు ధూపం వెలిగిస్తారు. గుణగానం చేస్తారు ప్రత్యక్షంగా ఆ సువాసనను అనుభవం చేసుకుంటారు, ఎదురుగా వచ్చి ఎవరో పిలుస్తున్నట్లు వారి పిలుపు వినబడుతుంది. దుర్భిణి ద్వారా దూరదృశ్యం సమీపంగా కనిపిస్తుంది. __ కదా! అదేవిధంగా దివ్య స్థితియే దుర్భిణిలా పనిచేస్తుంది. శక్తుల యొక్క స్మృతికి సిద్ధి ఇక్కడే కాగా లభిస్తుంది. ఇలా అంతిమ సిద్ధిని పొందిన భక్తులు; శక్తుల ద్వారా మంత్రతంత్రాలు పొందాలని, అనుకుంటారు. ఇక్కడ సిద్ధి చూసినప్పుడే ఆ సంస్కారం నిండుతుంది.
మీ స్మృతి యొక్క సిద్ధి ఎదురుగా వస్తుందా? పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయాలి మరి పిల్లలు అలా చేస్తున్నారా? బాప్దాదా ప్రత్యక్ష రూపంలో ఈ పాత్రను చూడరు కానీ శక్తులు మరియు పాండవుల యొక్క ఆ పాత్ర ఇది. ఇంత నమ్మకధారి మరియు ఆజ్ఞాకారులుగా తయారవ్వాలి. ఒక్క సెకండు మరియు ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞ లేకుండా నడవకూడదు. ఆజ్ఞాకారి అంటే ఇదే. మరి నమ్మకధారి అని ఎవరిని అంటారు? ఎవరి సంకల్పంలో మరియు స్వప్నంలో ఒక్క బాబా, బాబా కర్తవ్యం, బాబా మహిమ, బాబా యొక్క జ్ఞానం తప్ప మరే విషయం ఉండదో వారినే సంపూర్ణ నమ్మకధారి అని అంటారు.
ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. మరే విషయం స్వప్నంలో, స్మృతిలో కనిపించకూడదు. ఇలాంటి నమ్మకధారుల ప్రత్యక్ష నడవడికలో ఏ గుర్తు కనిపిస్తుంది? సత్యత మరియు స్వచ్ఛత. సంకల్పం వరకు కూడా సత్యత మరియు స్వచ్చత కావాలి. కేవలం మాట వరకు కాదు. మిమ్మల్ని మీరు చూసుకోవాలి - ఎంత వరకు నమ్మకధారి, ఆజ్ఞాకారి అయ్యానని? బుద్ధి యొక్క సంలగ్నత సదా ఒకే సాంగత్యంలో ఉంటే అనేక సాంగత్యాల యొక్క రంగు అంటదు.
బుద్ధి యొక్క సంలగ్నత తక్కువగా ఉన్న కారణంగా అనేక రకాల సాంగత్యాల ఆకర్షణ తన వైపుకి లాక్కుంటుంది. కనుక ఇతర సాంగత్యాలు వదిలి ఒకే సాంగత్యంలో ఉంటాను మొట్టమొదటి ప్రతిజ్ఞ ఇదే. ఈ ప్రతిజ్ఞను నిలుపుకోవాలి, వీరినే సంపూర్ణ నమ్మకధారి అన్ని అంటారు. అర్థమైందా? మంచిది.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.