రివైజ్ కోర్స్ మురళి 08-06-1973
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
“సర్వశ్రేష్ఠ శక్తి పరిశీలనా శక్తి”
సర్వశక్తులలో విశేష శక్తిని గూర్చి మీకు తెలుసా? స్వయమును మాస్టర్ సర్వశక్తివంతులుగా అయితే భావిస్తున్నారు కదా! సర్వశక్తులలోకి సర్వశ్రేష్ఠమైన శక్తి ఏది? ఏ విధంగా చదువులో అనేక సబ్జెక్టులు ఉన్నా కాని వాటిలో ఒకటి విశేషంగా ఉంటుంది, అలాగే సర్వశక్తులూ అవసరమే. కాని, ఈ శక్తులలోకెల్లా అన్నింటికన్నా శ్రేష్ఠమైన శక్తి ఏది? అది ఎంతో అవసరము, అది లేకుండా మహారథులుగా లేక మహావీరులుగా అవ్వడం కష్టము. నిజానికి అన్నీ అవసరమే. ఒకదానికి మరొకదానితో సంబంధం ఉంటుంది. అయినా కాని సర్వశక్తులను సమీపంగా తీసుకువచ్చే నెంబర్ వన్ శక్తి ఏది? (పరిశీలనా శక్తి).
సెల్ఫ్ రియలైజేషన్ (ఆత్మపరిశీలన) చేసుకోవడం కూడా పరిశీలనా శక్తియే. సెల్ఫ్ రియలైజేషన్ అంటేనే తమనుతాము పరిశీలించుకోవడము లేక తెలుసుకోవడము. ఎప్పుడైతే మొదట బాబాను గుర్తించగలరో అప్పుడే వారిని తెలుసుకోగలరు. ఎప్పుడైతే వారిని గుర్తిస్తారో అప్పుడే వారికి సమీపంగా రాగలుగుతారు లేక సమానంగా అవ్వగలుగుతారు. పరిశీలించే శక్తి నెంబర్ వన్ శక్తి. ఈ పరిశీలించడమునే సామాన్య పదాలలో గుర్తించడము అని అంటారు. మొట్టమొదటి జ్ఞానపు ఆధారము బాబాను గుర్తించడము. ఈ విషయం యొక్క కర్తవ్యము జరుగుతోంది అని గుర్తించడము. మొదట పరిశీలించే శక్తి అవసరము. పరిశీలించే శక్తిని నాలెడ్జ్ ఫుల్ స్థితి అని అంటారు.
పరిశీలించే శక్తి యొక్క విస్తారం ఏమిటి మరియు దాని నుండి ఏయే ప్రాప్తులు లభిస్తాయి? ఈ విషయంపై పరస్పరం చర్చించుకోవచ్చు. పరస్పరంలో సమానమైనవారు ఆడుతుంటే ఆ ఆటలో ఆనందం కలుగుతుంది. ఆ ఆటలలో కలుసుకోవడం కూడా జరిగిపోతుంది. ఈ ఆటలో కూడా పరస్పరం ఆడుతూ ఆడుతూ స్నేహితులుగా అయిపోతారు. అదేమో స్థూలమైన ఆట. ఇక్కడ కూడా ఆటలలో ఆత్మల సామీప్యత యొక్క మిలనము జరుగుతుంది. ఆత్మల సంస్కార స్వభావాల మిలనము జరుగుతుంది. ఆట ఆడే సహచరులు చాలా పక్కాగా ఉంటారు. జీవితాంతం వరకు తమ తోడును నిర్వర్తిస్తారు.
ఆత్మిక ఆటతో పాటు అంతిమం వరకు పరస్పరంలో కలుసుకుంటూ ఉంటారు, కావుననే ఈ మిలనానికి గుర్తుగా 'మాల' తయారుచేయబడి ఉంది. అన్ని విషయాలలో ఎప్పుడైతే అంతిమంలో పరస్పరము సమీపంగా అయిపోతారో, మిలనము జరుగుతుందో అప్పుడు మణి మణితో కలిసి మాలగా తయారవుతుంది. ఈ మిలనానికి గుర్తు మాల. అచ్ఛా!
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.