రివైజ్ కోర్స్ మురళి  20-06-1973      

                                        

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

“లగనమునకు సాధనము విఘ్నము.” 

         వరదాన భూమి నుండి వరదాత ద్వారా సర్వ వరదానాలను ప్రాప్తించుకొని తీవ్ర పురుషార్థులుగా అవుతున్నారా? పురుషార్థం యొక్క నడవడికలో ఏ పరివర్తననైతే తీసుకువచ్చారో దానిని అవినాశిగా తీసుకువచ్చారా లేక అల్పకాలికంగా తీసుకువచ్చారా? ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా, చలింపజేసేందుకు ఎటువంటి విఘ్నం వచ్చినా కాని, ఎవరితోనైతే స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారో వారి ముందు ఆ విఘ్నము ఎంత! వారి ముందు ఆ విఘ్నము పరివర్తన చెంది ఎలా అయిపోతుంది? విఘ్నము లగనము యొక్క సాధనంగా అయిపోతుంది. హర్షితమవుతారు కదా!

ఎటువంటి పరిస్థితి అయినా లేక వ్యక్తి అయినా విఘ్నమును తీసుకువచ్చేందుకు నిమిత్తంగా అయితే, వారి పట్ల ద్వేషదృష్టి, వ్యర్థ సంకల్పాల ఉత్పత్తి జరుగకూడదు. వారి పట్ల ఓహో, ఓహో అనే భావన వెలువడాలి. ఈ దృష్టి ఉంచినట్లయితే మీ అందరికీ శ్రేష్ఠ దృష్టి ఏర్పడుతుంది. ఎవ్వరు ఎలా ఉన్నా కాని మీ దృష్టి మరియు వృత్తి ఎల్లప్పుడూ శుభచింతకంగా ఉండాలి మరియు కళ్యాణభావనతో ఉండాలి. ప్రతి విషయంలోనూ కళ్యాణము కనిపించాలి. కళ్యాణకారి తండ్రి సంతానమైన మీరు కళ్యాణకారులు కదా! కళ్యాణకారులుగా అయిన తర్వాత ఎటువంటి అకళ్యాణపు విషయము జరుగజాలదు.

 ఈ నిశ్చయము మరియు సృతిస్వరూపంగా అయిపోయినట్లయితే మీరెప్పుడూ అలజడి చెందజాలరు. ఎవరైనా పచ్చ కళ్ళద్దాలు లేక ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే వారికంతా పచ్చగా లేక ఎర్రగానే కనిపిస్తుంది. అలాగే మీ మూడవ నేత్రంపై కళ్యాణకారులు అనే కళ్ళద్దాలు ఉన్నాయి. ఈ మూడవ నేత్రము ఉన్నదే కళ్యాణకారిగా, అందులో అకళ్యాణము కనిపించడం అనేది జరుగజాలదు. దానిని అజ్ఞానులు అకళ్యాణంగా భావిస్తారు. కాని మీకు ఆ అకళ్యాణంలోనే కళ్యాణము ఇమిడి ఉంది. జనులు వినాశనాన్ని అకళ్యాణముగా భావిస్తారు, కాని మీరు దీని ద్వారానే గతి, సద్గతి ద్వారాలు తెరుచుకుంటాయి అని భావిస్తారు.

 కావున ఏ విషయం మీ ముందుకు వచ్చినా అన్నింటిలోను కళ్యాణం నిండి ఉంది అన్న ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారిగా అయి నడుచుకున్నట్లయితే ఎటువంటి ప్రాప్తి లభిస్తుంది? ఏకరస స్థితి తయారవుతుంది. ఏ విషయంలోనూ ఆగిపోకూడదు. ఎవరైతే ఆగిపోతారో వారు బలహీనంగా ఉంటారు. మహావీరులు ఎప్పుడూ ఆగరు. విఘ్నాలు వచ్చి ఆగిపోవడం అన్నది జరుగకూడదు. అచ్ఛా! ఓం శాంతి!

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

మాస్టర్ శాంతి సాగర భవ!