రివైజ్ కోర్స్ మురళి 24-12-1974
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
ఒకసారి సహయోగం ఇవ్వటం అంటే అంతిమం వరకు సహయోగం తీసుకోవటం.
సహజయోగి పిల్లలకు సదా మరియు అంతిమం వరకు సహయోగిగా అయ్యేటువంటి దయాహృదయుడైన శివబాబా ఈ మధుర మహవాక్యాలు తెలియచేస్తున్నారు -
బాప్ దాదా సదా విదేశీయులను నెంబర్ వన్‌గా స్మృతి చేస్తారు. ఎలా అయితే బంధనాలలో ఉండేవారు మొదట జ్ఞాపకం వస్తారో అలాగే విదేశంలో ఉండే పిల్లలు కూడా జ్ఞాపకం వస్తారు. వారికి కూడా మాటిమాటికి ఈ దేశానికి రావటానికి బంధన కదా? బాప్ దాదా అందరికంటే సమీపంగా చూస్తారు. ఎవరైతే విదేశానికి సేవకు వెళ్ళారో వారు ఏమైనా దూరమా? వారు కళ్ళ ఎదురుగా లేరు కానీ నయనాలలో ఇమిడి ఉన్నవారు, ఎప్పుడు దూరం అవ్వరు. వారు అయితే అందరి కంటే సమీపం అయ్యారు కదా? మీరు నయనాల ఎదురుగా ఉంటున్నారా లేదా నయనాలలో ఇమిడి ఉంటున్నారా?
ఎవరైతే ఇమిడి ఉంటారో వారే నిరంతర యోగి. విదేశంలో ఉండే పిల్లలు సమీపంగా వస్తున్నారు. దేశం యొక్క లెక్కతో దగ్గరగా ఉండేవారు నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా రావటంలేదు. అంటే ఎవరు సమీపం అయ్యారు? ఇదంతా సూక్ష్మ సంబంధం, సమీప సంబంధం. కనుకనే సమీంగా వచ్చారు. ఇది ఋజువు కదా? డ్రామానుసారం చూడండి, ఇంతమంది మహరథీల సంకల్పం సాకారం అవ్వలేదు. కానీ ఒకే బాబా యొక్క సంకల్పమే సాకారం అయ్యింది. మరలా సమీపం అయ్యారు కదా? స్వయాన్ని బాప్ దాదాకు దూరంగా భావించకండి.
మీ జన్మపత్రాన్ని చూసుకోవాలి. ఆది నుండి అంటే జన్మ నుండి నా అదృష్టరేఖ ఎలా ఉంది? అని. ఎవరికైతే జన్మతోనే అదృష్టం లభించిందో, ఆది సమయం యొక్క అదృష్టాన్ని తయారు చేసుకుని వచ్చారో, దాని ఆధారంగా వారికి తర్వాత వెనుక లిఫ్ట్ లభిస్తుంది. ఆది నుండే సహజప్రాప్తి లభించింది కదా? శ్రమ తక్కువ మరియు ప్రాప్తి ఎక్కువ. ఈ లాటరీ లభించింది. ఒక రూపాయి లాటరీకి లక్షలు లభిస్తే శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ అయినట్లే కదా?
ఏదైనా విషయంలో ఒకవేళ సమయానికి ఏదైనా సంకల్పాన్ని ఆజ్ఞగా భావించి ఎవరైతే సహయోగిగా అవుతారో ఆ సమయం యొక్క సహయోగులకు బాప్ దాదా కూడా అంతిమం వరకు సహయోగి అయ్యేటందుకు బంధించబడి ఉన్నారు. ఒకసారి సహయోగం ఇవ్వటం ద్వారా అంతిమం వరకు సహయోగం తీసుకునే అధికారిగా చేస్తుంది. ఒకటికి వంద రెట్లు లభించటం ద్వారా శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. మనస్సుతో, తనువుతో అయినా, ధనంతో అయినా కానీ సమయానికి సహయోగి అయ్యారంటే బాప్ దాదా అంతిమం వరకు సహయోగం ఇచ్చేటందుకు బంధించబడి ఉన్నారు.
దీనినే భక్తులు మరో మాటలో అందశ్రధ్ధ అని అంటారు. ఇలా ఒకవేళ ఎవరైనా జీవితంలో ఒకసారైనా బాప్ దాదా కార్యంలో సహయోగి అయితే వారికి అంతిమం వరకు బాప్ దాదా సహయోగిగా ఉంటారు. ఇది కూడా ఒక లెక్క. అరమైందా! మంచిది.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.