రివైజ్ కోర్స్ మురళి 28-01-1974
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
మహిమను స్వీకరించడం ద్వారా ఆత్మిక శక్తిలో లోపం.
ఒక బిడ్డకు మనోహర శిక్షణలను ఇస్తూ ఆత్మిక తండ్రి పరమాత్మ మాట్లాడుతున్నారు -
బిడ్డా! నీవు యుద్ధమైదానంలో ఉపస్థితులై ఉన్న ఆత్మిక వీరుడవు, నీ ఆత్మిక వీరత్వాన్ని మర్చిపోయి నీ జీవితాన్ని సహజంగా, సాధారణంగా గడుపుతూ మీ జీవితం పట్ల సాధనాలు మరియు సంపత్తిని ఉపయోగిస్తూ సమయాన్ని గడిపేయటం లేదు కదా? ఎలా అయితే వీరునికి విజయం పొందాలి అనే ధ్యాసే ఉంటుందో, అలాగే మాయాజీత్ గా అయ్యేటువంటి సంలగ్నత అగ్ని వలె ప్రజ్వలితం అవుతుందా? బిడ్డా! ఇప్పుడు నీ ఎదురుగా సేవా ఫలం సాధనాల రూపంలో మరియు ప్రాప్తి రూపంలో లభించే సమయం. ఈ సమయంలో ఒకవేళ ఈ ఫలం కనుక స్వీకరిస్తే కర్మాతీత స్థితి యొక్క ఫలం, సంపూర్ణస్థితి యొక్క ఫలం మరియు అతీంద్రియసుఖం యొక్క ఫలం పొందలేవు.
ఏ ఆధారంపై జీవితం యొక్క ఆధారం ఉండకూడదు మరియు పురుషార్థం కూడా ఏ ఆధారంగా ఉండకూడదు. దీని ద్వారా యోగబలం యొక్క, శక్తి యొక్క ప్రయోగంలో లోపం వచ్చేస్తుంది మరియు ఎంతగా యోగబలం యొక్క శక్తిని ప్రయోగంలోకి తీసుకురారో అంతగా ఆ శక్తి పెరుగదు. యోగబలం అభ్యాసం ద్వారా తప్పకుండా పెరుగుతుంది. ఏదైనా విషయం ఎదురుగా వస్తే వెంటనే స్థూల సాధనాలపై ధ్యాస వస్తుంది. కానీ స్థూల సాధనాలు ఉన్నప్పటికీ కూడా యోగబలం యొక్క ప్రయోగమే చేయాలి. మంచిది.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.