రివైజ్ కోర్స్ మురళి 30-06-1974 - పార్ట్ 2    

                                        

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

ఆత్మిక సేన యొక్క ముఖ్య నియమం.

                   ఆత్మికసేన యొక్క ఉన్నతోన్నతమైన సేనాపతి శివబాబా తన పిల్లలతో మాట్లాడుతున్నారు-

                   

 ఆత్మిక సేన అంటే సదా శస్త్రధారిగా, నియమం మరియు ఆఙ్ఞానుసారం నడిచేవారిగా ఉంటారు. సేన యొక్క ముఖ్య గుణం ఇదే కనిపిస్తుంది. కనుక నియమం మరియు ఆజ్ఞ ఎంత వరకు ఉన్నాయి? మీరందరు నియమం మరియు ఆజ్ఞానుసారం నడుస్తున్నారా? ఆత్మిక సేన యొక్క ముఖ్య నియమం ఏమిటి దానిలో అన్ని నియమాలు వచ్చేస్తాయి. ఆత్మిక సేన యొక్క ముఖ్య నియమం ఇదే - ఎప్పుడు కూడా మీ దేహన్ని మరియు ఇతర దేహధారిని చూడకూడదు. బాబా వైపే ప్రతి అడుగు వేయాలి. ఇదే ఆత్మిక సేనకు ముఖ్య నియమం. ఒకవేళ కొద్దిగా అయినా మీ దేహన్ని లేదా దేహధారిని చూస్తే బాబా వరకు చేరుకోవటం లేదా బాబాని కలుసుకోవటం అనే గమ్యం వరకు చేరుకోలేరు. మంచిది.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

ఆత్మిక గులాబి భవ!