రివైజ్ కోర్స్ మురళి 01-10-1975
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
మాయాజీత్ మరియు ప్రకృతిజీత్ శక్తుల యొక్క గుర్తులు.
తెలివిలో లేని ఆత్మలను తెలివిలోకి తీసుకువచ్చే, మాయా మరియు ప్రకృతిపై విజయం పొందేటువంటి, ఆసురీ వృత్తులను సంహరం చేసే శివబాబా మాట్లాడుతున్నారు --
శక్తులు తమ శక్తి స్వరూపం, సదా శస్త్రధారి, సదా నిర్భయులు, సర్వ ఆసురీ సంస్కారాలను సంహరం చేసేవారు, ప్రకృతి మరియు మాయాజీత్ అయ్యేవారు ఇలా మీ స్వభావంలో సదా స్థితులై ఉంటున్నారా? శక్తుల స్మృతిచిహ్నం, మాయాజీత్ కు గుర్తు - శస్త్రాలు మరియు లైట్ కిరీటం, ప్రకృతిజీత్ కు గుర్తు - సింహంపై సవారి. ఈ పశు పక్ష్యాదులు ప్రకృతికి గుర్తు. ప్రకృతి యొక్క తత్వాలు కూడా శక్తి స్వరూపులను భయభీతం చేయలేవు. ప్రకృతిపై కూడా సవారీ అంటే అధికారి. ప్రకృతి కూడా వారికి దాసీ అయిపోతుంది అంటే వారిని సత్కరిస్తుంది. ఇలా సదా విజయీగా అయ్యారా?
సదా సౌభాగ్యవంతుల గుర్తులు ఏవైతే మహిమ చేయబడుతున్నాయో సదా బాబా యొక్క తోడు మరియు వారికి సదా మస్తకంపై విజయీ తిలకం పెట్టబడి ఉంటుంది. స్మృతిలో ఉండటం అంటే తిలకం పెట్టుకోవటం. సదా నేను కల్ప,కల్పం విజయీ ఆత్మను ఇప్పుడే కాదు అనే ఈ స్మృతి సదా ఉండాలి. మొదట తెలివిలో ఉండేవారము కాదు. తెలివితక్కువ వారు అంటే స్వయం యొక్క తెలివి లేనివారు. నేనెవరు అనేది తెలియదు అంటే తెలివి తక్కువ వారమే కదా? ఇప్పుడు తెలివైనవారిగా అయ్యారు. తెలివైనవారు ఎప్పుడు బాబాని మర్చిపోరు. నేను సదా విజయీను ఇదే సదా స్మృతి ఉంచుకోండి.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.
మాస్టర్ విష్ను వినాశక విజయీ భవ!