రివైజ్ కోర్స్ మురళి 16-10-1975
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
ప్రసిద్ధి అవ్వడం అనేది సంకల్పం మరియు మాట యొక్క సిద్ధి ఆధారంగా ఉంటుంది.....
జ్ఞాన ధారణల యొక్క గుహ్యత మరియు మహీనతలోకి తీసుకువెళ్ళేవారు, ఆనందసాగరుడైన శివబాబా మాట్లాడుతున్నారు -
మహారథీ పిల్లలు వర్తమాన సమయంలో ఏ లెక్కలఖాతా పెట్టుకోవాలి? ఇప్పుడు మహారథీలు సిద్ధి స్వరూపంగా అవ్వాల్సిన సీజన్. వారి యొక్క ప్రతి మాట మరియు సంకల్పం సిద్ధించాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే వారి యొక్క ప్రతి మాట మరియు ప్రతి సంకల్పం డ్రామానుసారం సత్యం అనగా సమర్థంగా ఉంటుందో అప్పుడు. కనుక మహారధీలు ఇప్పుడు పెట్టుకోవాల్సిన లెక్కలఖాతా ఏమిటంటే రోజంతటిలో అనేక సంకల్పాలు నడుస్తుంటాయి. నోటితో మాటలు వెలువడుతూ ఉంటాయి, వాటిలో ఎన్ని సిద్ధిస్తున్నాయి? సంకల్పం అనేది బీజం.
బీజం సమర్థంగా ఉంటే దానికి మంచి ఫలితం లభిస్తుంది. దానినే సంకల్ప సిద్ధి పొందడం అని అంటారు కనుక రోజంతటిలో ఎన్ని సంకల్పాలు మరియు మాటలు సిద్దిస్తున్నాయి? డ్రామానుసారం ఏదైతే మాట్లాడారో ఏదైతే జరగాలో అదే మాట్లాడారా? దీనికోసం ప్రతి మాట మరియు సంకల్పాన్ని సమర్ధంగా తయారుచేసుకోవడంపై ధ్యాస పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక - మహారథీల యొక్క లెక్కాచారం ఇప్పుడు ఈవిధంగా ఉండాలి. సంకల్పం అనేది బీజం. ఆ బీజం - సమర్ధంగా ఉంటే దానికి ఫలం మంచిగా లభిస్తుంది. దానినే సంకల్ప సిద్ధి అని అంటారు.
డ్రామానుసారం ఏదైతే మాట్లాడారో ఏది జరగాలో అదే మాట్లాడారా, దీని కొరకు ప్రతి మాట. - సంకల్పాన్ని సమర్థంగా తయారు చేసుకోవడంపై ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. మహారథీల లెక్కలఖాతా ఎప్పుడో దీనికి సంబంధించి ఉండాలి. భక్తి మార్గంలో కూడా వీరు సిద్ది స్వరూపులు అని అంటారు - కదా! అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరి సంకల్పము మరియు మాట సిద్ధిస్తాయో ఆ సిద్ధి ఆధారంగా,వారు ప్రసిద్ధులు అవుతారు. సిద్ధి లేకపోతే ప్రసిద్దులు కాలేరు. భక్తిలో కొంతమంది దేవీ దేవతలు ప్రసిద్ధులుగా ఉంటారు. కొందరు ప్రసిద్ధులుగా ఉండరు. వారు కూడా దేవీదేవతలుగానే అంగీకరించబడతారు కానీ ప్రసిద్ధులుగా ఉండరు.
కనుక సంకల్పం మరియు మాట సిద్ధించడం ప్రసిద్ధి అవ్వడానికి ఇదే ఆధారం. దీని ద్వారా స్వతహాగానే అవ్యక్త ఫరిస్తాగా అయిపోతారు మరియు సమయం మిగులుతుంది. వాచాలోకి రావడం అనేది స్వతహాగానే సమాప్తి అయిపోతుంది ఎందుకంటే శాంతిధామానికి వెళ్లాల్సి ఉంది కదా. శాంతి లేదా ఆకారీ ఫరిస్తా స్థితి యొక్క సంస్కారం తనవైపుకు ఆకర్షిస్తుంది. సేవ కూడా ఎంతగా పెరిగిపోతుందంటే వాచా ద్వారా సేవ చేసే అవకాశమే లభించదు. నయనాల ద్వారా మరియు మీ యొక్క హర్షితముఖం ద్వారా, మస్తకంలో మెరిసే మణి ద్వారా సేవ చేయగలుగుతారు.
పరివర్తన అయితే జరుగుతుంది కదా? ఎప్పుడైతే మీ లెక్కాచారం చూసుకుంటారో అప్పుడే అభ్యాసం పెరుగుతుంది. మహారధీల యొక్క లెక్కలఖాతా ఇదే. ఎవరికి దు:ఖం ఇవ్వలేదు కదా, ఏ వికారానికి వశం అవ్వలేదు కదా ఇది మహారథీల లెక్కలఖాతా కాదు. ఇది గుర్రపు సవారీల పని. మహారథీల లెక్కలఖాతా కూడా మహాన్గా ఉండాలి. ఇలా పరస్పరం గుహ్య పురుషార్ధానికి ప్లాన్స్ తయారుచేసుకోండి. దీని కోసమే మధ్యమధ్యలో సమయం లభిస్తుంది. మేళాలో అయితే సమయం లభించదు కదా? మేళాలో అయితే మరో రకమైన సేవలో తత్పరులై ఉంటారు. మేళాలలో ఇచ్చేటటువంటి సమయం, మేళా తరువాత స్వయం నింపుకునే సమయం లభిస్తుంది.
మేళాలలో ఇవ్వడంలోనే రాత్రి, పగలు సమాప్తం అయిపోతాయి. బాప్దాదాకు కూడా తెలుసు ఇంతమంది ఆత్మలకు ఇవ్వటానికి నిమిత్తంగా అయినప్పుడు ఇచ్చేటటువంటి ప్లాన్స్ లేదా సంకల్పాలు నడుస్తుంటాయి కదా, అప్పుడే సంతుష్టత యొక్క సర్టిఫికెట్ స్వతహాగానే లభిస్తుంది. అందరి యొక్క సంతుష్టత ఇది కూడా మీ పురుషార్ధంలో హైజంప్ చేయించడంలో సహయోగం ఇస్తుంది. ఇదైతే చేయవలసి ఉంటుంది. అంటారు. ఇవన్నీ తరువాత విషయాలు అందరూ నోట్ చేసుకుంటున్నారు కదా? మరలా వాళ్ళను కూర్చోపెట్టి రివైజ్ చేయండి.
ఇప్పుడు లభించేది అంతా బుద్ధిలో నిండిపోతుంటుంది కదా. తిరిగి మరలా కూర్చుని రివైజ్ చేసుకుంటు మహీనతలోకి లేదా గుహ్యతలోకి వెళ్ళినప్పుడే ఇతరులను కూడా గుహ్యతలోకి తీసుకురాగలరు. ఇప్పటి వరకు ఏదైతే నడుస్తుందో, ఏవిధంగా అయితే నడుస్తున్నారో బాప్దాదాతో సంతుష్టంగా మరియు హర్షితంగా ఉన్నారు. మంచిది.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.