రివైజ్ కోర్స్ మురళి 15-01-1983
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
సహజయోగి మరియు ప్రయోగీలను గూర్చిన వ్యాఖ్య.
ఈరోజు బాప్దాదా తమ ప్రయోగి భుజాలను చూస్తున్నారు. ఏ విధంగా నా సహయోగి భుజాలు శ్రేష్ఠ కార్యమును సఫలం చేస్తున్నారు అని గమనిస్తున్నారు. ప్రతి భుజం యొక్క దివ్య అలౌకిక కార్యపు వేగమును చూసి బాప్దాదా హర్షితులై ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. కొందరు భుజాలు సదా అలసటలేనివారిగా మరియు ఒకే శ్రేష్ఠ ఉల్లాస ఉత్సాహాలు కలిగి తీవ్రగతితో సహయోగులుగా ఉండడం, మరికొందరు కార్యము చేస్తూ ఉంటారు కాని మధ్య మధ్యలో ఉల్లాస ఉత్సాహాల తీవ్రగతిలో తేడా వచ్చేయడం బాప్దాదా గమనించారు. కాని, సదా అలసట లేకుండా తీవ్రగతిలో ఉండే భుజాల ఉల్లాస ఉత్సాహాలను చూస్తూ వీరు కూడా తీవ్రగతితో కార్యమును చేయడం ప్రారంభిస్తారు, పరస్పర సహయోగం ద్వారా వారి వేగమును తీవ్రతరం చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు.
బాప్దాదా ఈరోజు మూడు రకాల పిల్లలను చూస్తున్నారు. ఒకరు సదా సహజ యోగులు, రెండవవారు- విధిని పదే పదే ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగులు. మూడవవారు- సహయోగులు. ముగ్గురూ యోగులే కాని భిన్న భిన్న స్థితులలో ఉన్నారు. సహజ యోగులు సమీప సంబంధము మరియు సర్వప్రాప్తులు కలిగి ఉన్న కారణంగా సదా స్వతహాగా సహజయోగ స్థితిని అనుభవం చేసుకుటాంరు. సదా సమర్థ స్వరూపము ఉన్న కారణంగా నేను ఉన్నదే బాబాకు చెందిన ఆత్మగా అన్న అనుభవపు నషాలో సదా ఉంటారు. నేను ఆత్మను, నేను బాబా సంతానమును అని గుర్తుచేసుకోవలసిన అవసరం ఉండదు.
నేను ఉన్నదే అలా అని సదా స్వయమును ఈ అనుభవపు నషాలో సహజంగానే ప్రాప్తీ స్వరూపంగా నిశ్చయం చేసుకుటాంరు. సహజ యోగులకు సర్వసిద్ధులు స్వతహాగానే అనుభవమవుతాయి. కావున సహజ యోగులు సదా శ్రేష్ఠ ఉల్లాస ఉత్సాహాల సంతోషంలో ఏకరసముగా ఉంటారు. సహజ యోగులు సర్వప్రాప్తుల అధికారీ స్వరూపంలో సదా శక్తిశాలీ స్థితిలో స్థితులై ఉంటారు. ప్రయోగం చేసే ప్రయోగులు సదా ప్రతి స్వరూపం యొక్క, ప్రతి పాయ్టిం యొక్క, ప్రతి ప్రాప్తీ స్వరూపం యొక్క ప్రయోగమును చేస్తూ ఆ స్థితిని అనుభవం చేసుకుటాంరు.
కాని, కాసేపు సఫలతను అనుభవం చేసుకుటాంరు మరికాసేపు శ్రమను అనుభవం చేసుకుటాంరు. కాని, ప్రయోగులుగా ఉన్న కారణంగా, బుద్ధి అభ్యాసపు ప్రయోగశాలలో బిజీగా ఉన్న కారణంగా 75 శాతం మాయ నుండి సురక్షితంగా ఉంటారు. కారణమేమి? ప్రయోగి ఆత్మలకు క్రొత్త క్రొత్త, భిన్న భిన్న అనుభవాలను పొంది చూడాలన్న అభిరుచి ఉంటుంది. ఈ అభిరుచిలోనే ఉన్న కారణంగా ప్రయోగశాలలో మాయ నుండి సురక్షితంగా ఉంటారు. కాని, ఏకరసముగా ఉండరు. అప్పుడప్పుడు అనుభవం కలిగిన కారణంగా చాలా ఉల్లాస ఉత్సాహాలలో ఊగుతూ ఉంటారు.
మరికాసేపు విధి ద్వారా సిద్ధి యొక్క ప్రాప్తి తక్కువగా కలిగిన కారణంగా ఉల్లాస ఉత్సాహాలలో తేడా వచ్చేస్తుంది. ఉల్లాస ఉత్సాహాలు తక్కువగా ఉన్న కారణంగా కష్టం అనుభవమవుతుంది కావుననే ఒక్కోసారి సహజయోగులుగా, మరోసారి శ్రమించే యోగులుగా అయిపోతారు. నేను ఉన్నదే అలాగా అని అనేందుకు బదులుగా 'ను, ను' అని అంటూ ఉంటారు. నేను ఆత్మను, బాబా సంతానమును, మాస్టర్ సర్వశక్తివంతుడను... ఈ స్మృతి ద్వారా సిద్ధిని పొందేందుకు పదే పదే ప్రయత్నము చేయవలసి వస్తుంది.
కావున అప్పుడప్పుడు సంకల్పించగానే అనుభవమయ్యే స్థితిలో స్థితులవుతారు మరియు అప్పుడప్పుడు పదే పదే ఆలోచించడం ద్వారా స్వరూపపు అనుభూతిని పొందుతారు. వీరినే ప్రయోగి ఆత్మలు అని అంటారు. అధికారపు స్వరూపము సహజయోగి స్వరూపము. పదే పదే అధ్యయనము చేసే స్వరూపము ప్రయోగి ఆత్మా స్వరూపము. కావున ఈరోజు సహజయోగులు ఎవరు మరియు ప్రయోగులు ఎవరు అని గమనిస్తున్నారు. ప్రయోగులు కూడా అప్పుడప్పుడు సహజయోగులుగా అయిపోతారు కాని సదా అలా అవ్వరు.
ఏ సమయంలో ఏ పొజిషన్ ఏర్పడుతుందో దాని అనుసారంగానే స్థూలమైన ముఖకవళికలు కూడా మారుతాయి. మనస్సు యొక్క పొజిషన్ను కూడా చూస్తారు మరియు ఫోజును కూడా చూస్తారు. రోజంతిలో ఎన్ని ఫోజులను మారుస్తారు? మీ భిన్న భిన్న ఫోజులను గూర్చి మీకు తెలుసా? స్వయమును సాక్షిగా అయి చూస్తారా? బాప్దాదా సదా ఈ బేహద్ ఆటను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తూ ఉంటారు. ఏ విధంగా ఇక్కడ లౌకిక ప్రపంచంలో ఒక్కరినే భిన్న భిన్న ఫోజులలో నవ్వు ప్టుటించే ఆటలలో స్వయమే చూసుకుటాంరు కదా! విదేశాలలో ఈ ఆటలు ఉంటాయా?
ఇక్కడ ప్రాక్టికల్గా ఇటువంటి ఆటలనైతే ఆడరు కదా! ఇక్కడ కూడా అప్పుడప్పుడు భారము కారణంగా లావుగా అయిపోతారు, మళ్ళీ అప్పుడప్పుడు ఎక్కువగా ఆలోచించే సంస్కారము కారణంగా అందాజా కన్నా పొడుగ్గా అయిపోతారు, మళ్ళీ అప్పుడప్పుడు నిరుత్సాహం కారణంగా స్వయమును చాలా చిన్నగా చూస్తారు. ఒక్కోసారి చిన్నగా అయిపోతారు, ఒక్కోసారి లావుగా అయిపోతారు మరోసారి పొడుగ్గా అయిపోతారు. మరి ఇటువంటి ఆట మీకు మంచిగా అనిపిస్తుందా?
డబల్ విదేశీయులందరూ సహజ యోగులేనా? ఈరోజు ఈ సహజయోగి యొక్క చార్ట్ ఉందా? కేవలం ప్రయోగంచేసే ప్రయోగిలుగా మాత్రమే లేరు కదా! డబల్ విదేశీయులు మధువనం నుండి సదాకాలికంగా సహజయోగులుగా ఉండే అనుభవమును తీసుకొని వెళుతున్నారా? అచ్ఛా- సహయోగులు కూడా యోగులే, దీనిని గూర్చి మరింకెప్పుడైనా వినిపిద్దాము.
టీచర్లందరూ క్రింద హాలులో మురళి వింటున్నారు.
బాప్దాదాతోపాటు నిమిత్త సేవాధారులు అనండి, నిమిత్త శిక్షకులు అనండి కావున ఈరోజు సహచరుల గ్రూప్ కూడా వచ్చింది కదా! చిన్నవారైతే ఇంకా అతిప్రియంగా అనిపిస్తారు. క్రింద ఉన్నా కూడా అందరూ పైనే కూర్చున్నారు. బాప్దాదా చిన్న అయినా లేక పెద్ద అయినా ధైర్యమును ఉంచే, సేవా క్షేత్రంలో స్వయమును సదా బిజీగా ఉంచుకునే సేవాధారులకు చాలా చాలా ప్రియస్మృతులను తెలియజేస్తున్నారు. కావున త్యాగులుగా అయి అనేకుల భాగ్యమును తయారుచేసేందుకు నిమిత్తంగా అయ్యే సేవాధారులను బాప్దాదా త్యాగం యొక్క విశేష ఆత్మలుగా గమనిస్తున్నారు.
ఇటువంటి విశేష ఆత్మలకు విశేష రూపంలో అభినందనలతోపాటు ప్రియస్మృతులు కూడా. డబల్ అద్భుతము ఏమి? ఒకటేమో- బాబాను తెలుసుకునే అద్భుతము. దూరదేశము, ధర్మము యొక్క పరదా, ఆచార వ్యవహారాలు, అన్నపానాదులు అన్నిం భిన్నత యొక్క పరదా మధ్య ఉంటూ కూడా తండ్రిని తెలుసుకున్నారు, కావున ఇది డబల్ అద్భుతము. పరదా లోపల దాగి ఉన్నారు. సేవకొరకు ఇప్పుడు జన్మ తీసుకున్నారు. పొరపాటు చేయలేదు, కాని డ్రామానుసారంగా సేవా నిమిత్తము నలువైపులా చెల్లాచెదురైపోయారు. లేకపోతే ఇన్ని దేశాలలో సేవ ఎలా జరుగుతుంది?
కేవలం సేవ కారణంగా తమ కొద్ది సమయపు నామమాత్రపు లెక్కాచారాలను అక్కడ జోడించారు. కావున డబల్ అద్భుతమును చూపించేవారు సదా బాబా స్నేహపు ఛాత్రకులు, సదా హృదయంతో 'నా బాబా' అన్న గీతమును గానం చేసేవారు, సంవత్సరంలో 12 నెలలు బాబా వద్దకు వెళ్ళాలి, వెళ్ళాలి అనే ఇదే ధునిలో ఉండేవారు ఇటువంటి ధైర్యమును ఉంచి బాప్దాదాలకు సహాయకులుగా అయ్యే పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవాధారులైన అక్కయ్యలు, అన్నయ్యలతో:-
మహాయజ్ఞపు మహా సేవ యొక్క ప్రసాదమును తిన్నారా? ఈ ప్రసాదము ఎప్పుడూ తగ్గేది కాదు. ఇటువంటి అవినాశి మహాప్రసాదమును ప్రాప్తింపజేసుకున్నారా? ఎంత వెరౖటీ ప్రసాదము లభించింది! సదాకాలికంగా సంతోషము, సదాకాలికమైన నషా, అనుభూతి... ఇలా అన్నిరకాలైన ప్రసాదాలను పొందారా? కావున ప్రసాదమును పంచుకొని తినడం జరుగుతుంది. ప్రసాదమును కళ్ళకు అద్దుకొని, మస్తకంపై ఉంచుకొని తినడం జరుగుతుంది. కావున ఈ ప్రసాదము మీ కళ్ళలో ఇమిడిపోవాలి, మస్తకం యొక్క స్మృతి స్వరూపంగా అయిపోవాలి అనగా మీలో ఇమిడిపోవాలి.
ఇటువంటి ప్రసాదము ఈ మహాయజ్ఞంలో లభించిందా? మహాప్రసాదమును తీసుకునేవారు ఎంత మహాన్ భాగ్యవంతులు. ఇటువంటి అవకాశము ఎంతమందికి లభిస్తుంది? చాలాకొద్దిమందికి లభిస్తుంది, ఆ కొద్దిమందిలో మీరూ ఉన్నారు. మరి మీరు మహాన్ భాగ్యవంతులుగా అయిపోయినట్లే కదా! ఏవిధంగా ఇక్కడ బాబా మరియు సేవ తప్ప మూడవదేదీ గుర్తుండదో అలా ఇక్కడి ఈ అనుభవమును సదా నిల్పుకొని ఉంచుకోండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విశేషంగా అక్కడి నుండి ఏదో ఒక గుర్తును తీసుకొని వెళతారు. కావున మధువనం యొక్క విశేష స్మృతిచిహ్నంగా ఏమి తీసుకువెళతారు?
నిరంతరము సర్వప్రాప్తీ స్వరూపంగా ఉంటారా? కావున అక్కడకు వెళ్ళి కూడా అలాగే ఉంటారా లేక వాయుమండలం అలా ఉంది, సాంగత్యం అలా ఉంది అని అంటారా! పరివర్తన భూమి నుండి పరివర్తన అయి వెళ్ళాలి. ఎటువంటి వాయుమండలం ఉన్నాకాని మీరు మీ శక్తితో పరివర్తన చేసెయ్యండి. ఇంతి శక్తి ఉంది కదా! వాయుమండలపు ప్రభావము మీపై పడకూడదు. అందరూ సంపన్నంగా అయి వెళ్ళాలి. అచ్ఛా!
మాతలతో:-
మాతలకొరకైతే ఇది ఎంతో సంతోషకరమైన విషయము. ఎందుకంటే బాబా వచ్చిందే మాతలకొరకు. గోపాలునిగా అయి గోమాతలకొరకు వచ్చారు. దీని స్మృతిచిహ్నమే గాయనం చేయబడ్డది. ఎవరినైతే ఎవ్వరూ యోగ్యంగా భావించలేదో అటువంటివారినే బాబా యోగ్యంగా భావించారు. ఇదే సంతోషంలో సదా ఎగురుతూ ముందుకువెళ్ళండి. ఎటువంటి దు:ఖపు అల రాజాలదు. ఎందుకంటే సుఖసాగరుని పిల్లలుగా అయిపోయారు. సుఖసాగరంలో ఇమిడిపోయి ఉండేవారికి ఎప్పుడూ దు:ఖపు అల రాజాలదు, ఇటువంటి సుఖస్వరూపులుగా అవ్వాలి.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.