రివైజ్ కోర్స్ మురళి 19-05-1983
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
సాక్షి స్థితి యొక్క అనుభవీగా ఏవిధంగా అవ్వాలి
సర్వశక్తివంతుడు, సదా విశ్వ కళ్యాణకారి శివబాబా అన్నారు ఈరోజు బాప్దాదా ఈ పాతప్రపంచం మరియు పాత రాజ్యం యొక్క ప్రపంచం,
జడజడీభూతం అయిపోయిన ప్రపంచం యొక్క సమాచారాన్ని వింటున్నారు. బాప్దాదా చూస్తున్నారు. - నా పిల్లలు పాత ప్రపంచంలో ఎంత సహించవలసి వస్తుందో అని ఆత్మకి అయితే మజా సమయమే కానీ శరీరంతో అయితే సహించవలసి వస్తుంది. మీ రాజ్యంలో ప్రకృతి మీకు దాసిగా ఉంటుంది. దాసీలు కూడా ఎక్కువమంది ఉంటారు మరియు ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా సదా ఆజ్ఞాకారిగా, సేవాధారిగా ఉంటాయి. కానీ మీ రాజ్యాన్ని స్థాపన చేయాలంటే పాతదాన్నే కొత్తదిగా చేయాలి. పాత ప్రపంచంలో సేవాధారిగానే అవ్వాల్సి ఉంటుంది.
ఇప్పుడు చేసే ఈ సేవ జన్మజన్మాంతరాలు సేవ నుండి ముక్తుల్ని చేస్తుంది. ఈ సమయంలో చేసిన ఈ సేవకి ఫలస్వరూపంగా ప్రకృతి మరియు చైతన్య సేవాధారులు మీ చుట్టూ తిరుగుతారు. అలాగే ప్రభూ! చిత్తం ప్రభూ! అనే మధురాతిమధుర పాటలు వింటూ ఉంటారు. అందువలన ఈ సదాకాలిక సర్వ ప్రాప్తి ముందు ఇక్కడ కొద్దిగా సహించటం కూడా సహించటంగా అనిపించదు. శ్రేష్ట సేవ యొక్క నషా మరియు సంతోషంలో సహించటం కూడా ఒక చరిత్ర రూపంలోకి మారిపోతుంది. భాగవతం అనేది మీ అందరి సహనశక్తి యొక్క చరిత్రకు స్మృతిచిహ్నం.
అందువలన మీరు సహించటం లేదు, చరిత్ర యొక్క స్మృతిచిహ్నాన్ని తయారు చేసుకుంటున్నారు. భగవంతుని పిల్లలు భగవంతుని కలయిక యొక్క స్నేహంలో ఏమేమి చేశారు అనే దాని యొక్క మహిమను... ఇప్పటికీ వింటున్నారు. గోపీవల్లభుని గోపగోపికలు ఏమేమి చేశారు? కనుక ఇది సహించటం కాదు, సహనం అనేది మిమ్మల్ని శక్తిశాలిగా తయారు చేస్తుంది. సహనశక్తి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులు అవుతున్నారు. సహిస్తున్నాం అనిపిస్తుందా లేక ఆట వలె అనిపిస్తుందా? మనస్సు అయితే సదా నాట్యం చేస్తూ ఉంటుంది కదా! అప్పుడు ఆ మనస్సూ యొక్క సంతోషం ఈ కొంచెం సహనాన్ని కూడా సంతోషంలోకి మార్చేస్తుంది.
తనువు కూడా నీదే, మనస్సు కూడా నీచే నీది అని ఎవరితో చెప్పారో ఆయనకు తెలుసు, ఇక మీరు అతీతంగా మరియు ప్రియంగా ఉండండి. ఏ సమయంలో తనువు యొక్క కర్మలఖాతాను పూర్తి చేసుకునే పాత్రను అభినయిస్తారో ఆ సమయంలో నిరంతరం ఏ స్మృతిలో ఉండాలంటే బాబా నీకు తెలుసు కదా! ఇది నీ పని, నేను రోగిగా ఉన్నాను లేదా నా శరీరం రోగిగా ఉంది అనకండి ఇది నీ తాకట్టు వస్తువు కనుక నీకే తెలుసు. నేను సాక్షితి కలిగి ఉండి నీ తాకట్టు వస్తువుకి సేవ చేస్తున్నాను అనుకోవాలి అటువంటి వారినే సాక్షిస్థితి యొక్క అనుభవీలు అని అంటారు.
ఇలా నిమిత్తంగా అవ్వాలి. అదేవిధంగా మనస్సు కూడా నీది, నాది కానే కాదు. నా మనస్సు నిలవటం లేదు, నాకు యోగం కుదరటం లేదు, నా బుద్ధి ఏకాగ్రం అవ్వటం లేదు... ఇలా నాది అనే మాట అలజడిని ఉత్పన్నం చేస్తుంది. నాది అనేది ఎక్కడ ఉంది? నాది అనే భావాన్ని తొలగించుకోవటమే సర్వ బంధమ్ముక్తులుగా అవ్వటం. నా ధనం, నా పత్ని, నా పతి, నా పిల్లలు జ్ఞానంలో నడవటం లేదు, వారి బుద్ధి తాళాన్ని తెరువు అని కేవలం వారి గురించే ఎందుకు ఆలోచిస్తున్నారు? నా వారు అనే భావంతో ఎందుకు ఆలోచిస్తున్నారు? నా గ్రామం లేదా నా దేశంలోని ఆత్మల తాళం తెరువు అని ఏ ఒక్కరు ఎప్పుడూ అనలేదు.
నా పత్ని లేదా నా పిల్లల తాళం తెరువు అంటే ఈ నాది అనే భావం బేహద్ రానివ్వదు. అందువలన బేహద్ గా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన పెట్టుకుంటూ సర్వులతో పా ఆ ఆత్మలను చూడండి. ఏమి అర్ధమైంది? నాదంతా నీది అయిపోయింది, నా భాద్యత ఏమి లేదు బాప్దాదా సేవకి ఎక్కడ నిమిత్తం చేసినా కానీ, తనువు ద్వారా సేవ చేయించినా, మనస్సు ద్వారా మనసా సేవ చేయించినా, ఎక్కడ ఉంచినా, ఏ హాల్లో ఉంచినా, పప్పురొట్టె పెట్టినా లేదా 36 రకాల భోజనం తినిపించినా తింటాను, ఉంటాను అనాలి. నాది అంటూ ఏదీ లేదు అంతా నీటి కనుక నీకే తెలుసు అనుకోవాలి. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు?
భగవంతుడు పిల్లలైన మిమ్మల్ని తనవుతో, మనస్సుతో, ధనంతో సహజంగా ఉంచుతారు. ఇది తండ్రి యొక్క గ్యారంటీ. మరం తిరిగి మీరు భారాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? గతంలో ఆ రోజు కూడా చెప్పాను కదా.. 'అంతా నీదే అన్నారు కనుక బాబా ఏది పెడితే అది తినండి, త్రాగండి, మజాగా ఉండండి మరియు స్మృతి చేయండి. కేవలం ఒక పనే మీది, మిగిలిన పనులన్నీ బాబా స్వతహాగానే చూసుకుంటారు. మీది ఒకటే పని అదేమిటంటే నీది నీది అంటూ నీది అనే దానిలో లీనమైపోండి ఒక పని అయితే చేయగలరు కదా! నాది అంటున్నారు.
అందువలనే మనస్సు చంచలం అవుతుంది. ఇది చాలా కష్టమైన పని అని అనుకుంటున్నారు కదా! నిజానికి కష్టం కాదు కానీ కష్టంగా చేసుకుంటున్నారు. నాది అనే భావం కష్టంగా చేసేస్తుంది. నీది అనే భావం సహజంగా చేస్తుంది. విశ్వకళ్యాణ భావన పెట్టుకోండి అప్పుడు విశ్వ కళ్యాణ కర్తవ్యం త్వరగా సమాప్తి అయిపోతుంది. తర్వాత మీ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇలా విసనకర్రలతో విసురుకోరు. (వేడిగా ఉన్న కారణంగా అందరి చేతులలో రంగురంగుల విసనకర్రలు ఉన్నాయి) అక్కడ అయితే ప్రకృతియే మీకు విసురుతుంది.
అక్కడ ఒకొక్క వజ్రం ఎంత కాంతి ఇస్తుందంటే ఇక్కడి ఈ లైట్లు కంటే అద్భుత కాంతినిస్తాయి. మీ మహల్లో సదా నవరంగుల వజ్రాల కాంతి ఉంటుంది. ఆ కాంతి ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. నవరంగులు కలిసిన కాంతి ఎంత గొప్పగా ఉంటుంది! ఇక్కడ అయితే ఒక రంగుని మాత్రమే ఇచ్చే లైట్ అది కూడా టిమ్హమ్ అనే ఆట ఆడుతుంది. అందువలన సేవాకర్తవ్యాన్ని సంపన్నం చేయండి, సంపన్నంగా, అవ్వండి అప్పుడిక మీ రాజ్యం. సర్వ సుఖాలతో సంపన్న రాజ్యం ఇక రానేవస్తుంది. అర్ధమైందా!
ఈరోజు అందరు వెళ్ళిపోయే రోజు, బాప్దాదా కూడా త్వరత్వరగా చేసేస్తే వెళ్తారు కదా! ఇప్పుడైతే రైళ్ళ రద్దీలో రావలసి వస్తుంది కానీ అక్కడ మీ మహర్షి ముందు వెనుక అనేక విమానాలు కొలువు తీరి ఉంటాయి. నడిపించేవారి గురించి కూడా వేచి చూడనక్కర్లేదు. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నడిపేయగలరు. చిన్న పిల్లలు కూడా స్విచ్ నొక్కితే ఎగిరిపోతారు. అక్కడ దుర్ఘటనలు జరగనే జరగవు. విమానాలు అయితే తయారవు తున్నాయి కానీ మీరు తయారవ్వండి. స్వర్గం అయితే తయారయ్యే ఉంది. విశ్వకర్మ ఆజ్ఞాపించగానే మహల్ మరియు విమానం తయారు. స్వర్గం అంటే ఈశ్వరీయ గారడీ యొక్క ప్రాలబ నగరం. (అందరూ విసురుకుంటున్నారు. ఇది కూడా ఫోటో తీసుకోవలసిన మంచి దృశ్యం, రంగురంగుల విసనకర్రలతో 'విసురుకునే సభ ఏదీ చూడలేదు. మంచిది.
నీది కనుక నీకు తెలుసు అని సదా ధృడసంకల్పంలో ఉండేవారికి, సదా బేహద్ సర్వాత్మల పట్ల శుభ భావన పెట్టుకునేవారికి, సదా ప్రతి కర్మ స్మృతిలో చేసి స్మృతిచిహ్నాన్ని తయారుచేసుకునేవారికి, సదా ఎవరెడీగా ఉండే పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు ' మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.