రివైజ్ కోర్స్ మురళి 25-05-1983
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
పిల్లలపై బ్రహ్మాబాబా యొక్క ఒక ఆశ
సర్వాత్మల శుభచింతకులు, అవినాశి జ్ఞానం శక్తి మరియు సంతోషం అనే ఖజానాలను ఇచ్చేవారు. విదేహి అయిన శివబాబా అన్నారు. ఈ రోజు బాప్దాదా పిల్లలందరి సేవ యొక్క స్మృతి యొక్క మరియు బాబా సమానంగా అయ్యే చార్టుని చూస్తున్నారు. నిరాకారి మరియు ఆకారి తండ్రిని సాకారంలోకి పిలిచారు మరియు ప్రత్యక్షఫలంగా బావి కూడా పిల్లలపై ఉన్న స్నేహం కారణంగా పిల్లల ఆహ్వానంపై వచ్చి కలుసుకున్నారు 'ఇప్పుడు దాని ఫలస్వరూపంగా పిల్లలు ఎటువంటి ఫలంగా అయ్యారు? అయ్యారా? సీజన్ ఫలంగా అయ్యారా?
రూపం కలిగిన ఫలంగా అయ్యారా లేక రసం కలిగిన ఫలంగా అయ్యారా? డైరెక్ట్ పాలన పొందిన వారిగా అంటే చెట్టుకే ముగ్గిన ఫలంగా అయ్యానం లేక పచ్చి కాయకి ఒకటి రెండు విశేషతలనే మసాలా ఆధారంగా స్వయాన్ని రంగు రూపంలో తెచ్చుకున్నారా? లేక ఇప్పటి వరకూ కూడా వచ్చి ఫలంగానే ఉన్నారా? అని పిల్లల యొక్క ఈ చార్టుని చూస్తున్నారు. సంగమయుగం యొక్క విశేషత అనుసారంగా, ప్రత్యక్షఫలం యొక్క సమయానుసారంగా ప్రతి సబ్జెక్టులో, ప్రతి అడుగులో, కర్మలో ప్రత్యక్షఫలం ఇచ్చేవారిగా, ప్రత్యక్షఫలాన్ని తినేవారిగా, తండ్రి యొక్క పాలనలో పక్వం పొంది, రంగు, రూపం, రసం మూడింటితో సంపన్న అమూల్య ఫలంగా అవ్వాలి.
ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి నేనెవరు? సదా సాంగత్యంలో ఉండే రంగు, సదా బ్రహ్మాబాబా సమానంగా తండ్రిని ప్రత్యక్షం చేసే రూపం, సదా సర్వప్రాప్తులు అనే రసంతో బాబా సమానంగా అయ్యారా? ఈరోజుల్లో బ్రహ్మాబాబా - బ్రాహ్మణ పిల్లల యొక్క సమాన సంపన్నతను విశేషంగా చూస్తూ ఉన్నారు. సమయమంతా ప్రతి ఒక్క విశేష బిడ్డ యొక్క చిత్రాన్ని మరియు చరిత్రను ఎదురుగా పెట్టుకుని వీరు ఎంత వరకు సంపన్నంగా అయ్యారు అని చూస్తూ ఉంటున్నారు. మాలలో మణులు ఎవరు మరియు ఎంతమంది.
తమ నెంబర్లో సెట్ అయ్యారు అనే లెక్కతో ఫలితాన్ని చూసి విశేషంగా బ్రహ్మాబాబా అన్నారు - బ్రాహ్మణాత్మ అనగా ప్రతి కర్మలో బాషా రాని ప్రత్యక్షం చేసేవారు. కర్మ అనే కలంతో ప్రతి అత్యం యొక్క హృదయంపై, బుద్ధిపై బాబా యొక్క చిత్రాన్ని లేదా స్వరూపాన్ని గీసే ఆత్మిక చిత్రకారులు, ఈ సీజన్ యొక్క ఫలితం అనుసరించి బ్రహ్మాబాబాకి పిల్లలపై ఒక ఆశ ఉంది. అది ఏ ఆశ అయ్యుంటుంది? బాబాకి సదా ఏమి ఆశ ఉంటుందంటే ప్రతి బిడ్డ తమ కర్మలనే దర్పణం ద్వారా తండ్రి యొక్క సాక్షాత్కారం చేయించాలి అని.
అంటే ప్రతి అడుగులో తండ్రిని అనుసరించి బాబా సమానంగా అవ్యక్త ఫరిస్తా అయ్యి కర్మయోగి యొక్క పాత్ర అభినయించాలి అని. ఈ ఆశను పూర్తి చేయటం కష్టమా లేక సహజమా? బ్రహ్మాబాబా అయితే ఆది నుండి సదా తక్షణమే దానం చే మహాపుణ్యం అనే సంస్కారాన్ని సాకారంలోకి తీసుకువచ్చేవారిగా ఉండేవారు కదా! చేద్దాం. ఆలోచిద్దాం, ప్లాన్ తయారుచేస్తాం అనే ఈ సంస్కారం ఎప్పుడైనా సాకార రూపంలో చూశారా? ? ఇప్పుడిప్పుడే చేయాలి అనే మహామంత్రం ప్రతి సంకల్పంలో మరియు కర్మలో చూశారు కదా! కనుక అదే సంస్కారం అనుసారంగా పిల్లలపై ఏ ఆశ పెట్టుకుంటారు?
సమానంగా అవ్వాలనే ఆశ పెట్టుకుంటారు కదా! అందరి కంటే మధువనం వారిని బాప్దాదా ముందు పెడుతున్నారు. ఉన్నది కూడా ముందే కదా! అన్నింటికంటే మంచి ఉదాహరణ అందరూ ఎక్కడ చూస్తారు? అన్నింటికంటే పెద్ద షోకేస్ - మధువనం. దేశవిదేశాల నుండి అందరూ అనుభవం చేసుకోవడానికి మధువనమే వస్తారు కదా! కనుక మధువనం అన్నింటికంటే పెద్ద షోకేస్ ఇటువంటి షోకేస్లో పెట్టే అలంకరణ వస్తువులు ఎంత అమూల్యమైనవి ఉంటాయి? కేవలం బాప్దాదాని కలుసుకునేటందుకే రావటం లేదు, పరివారం యొక్క ప్రత్యక్ష రూపాన్ని కూడా చూసేటందుకు వస్తున్నారు.
పరివారం యొక్క ప్రత్యక్ష ఉదాహరణ. కర్మయోగి యొక్క ప్రత్యక్ష ఉదాహరణ. అలసిపోని సేవాధారి యొక్క ప్రత్యక్ష ఉదాహరణ, వరదాన భూమి యొక్క వరదాని స్వరూపం యొక్క ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు? మధువన నివాసీయులే కదా! భాగవతం యొక్క మహిమ వినేటందుకు చాలా గొప్పతనం ఉంటుంది. భాగవతం అంతటికీ అంత ఉండదు. అదేవిధంగా చరిత్ర భూమికి మధువనం వారే మహిమ. మీ గొప్పతనాన్ని గుర్తు ఉంచుకుంటున్నారు కదా! మధువన నివాసీయులకి స్మృతి స్వరూపంగా అవ్వటం కష్టమా లేక సహజమా? మధువనం అంటేనే ప్రజలు మరియు రాజులు ఇద్దరికీ వరదానాన్ని ఇచ్చేది.
ఈరోజుల్లో ప్రజా ఆత్మలు కూడా తమ హక్కుని తీసుకుని వెళ్తున్నారు. మరి ప్రజలు కూడా వరదానం తీసుకుంటుంటే వరదాన భూమిలో ఉండేవారు వరదానాలతో ఇంకెంత సంపన్నంగా ఉంటారు? ఇప్పటి సమయానుసారంగా అన్ని రకాలైన ప్రజలు నలువైపుల నుండి తమ అధికారాన్ని తీసుకునేటందుకు రావటం ప్రారంభం అయ్యింది. నలువైపుల సహయోగులు మరియు సంప్రదింపుల్లో ఉండేవారు వృద్ధి అవుతున్నారు. ప్రజల సీజన్ ప్రారంభమైపోయింది. మరి రాజులు తయారే కదా! లేక రాజకిరీటం అప్పుడప్పుడు. అమరుతూ, అప్పుడప్పుడు అమరటం లేదా?
సింహాసనాధికారులే కిరీటధారులుగా కాగలరు. సింహాసనాధికారులుగా కాకపోతే కిరీటం కూడా అమరదు. అందువలనే చిన్న చిన్న విషయాలలో అప్సెట్ అయిపోతున్నారు. ఇలా అప్సెట్ అవ్వటం అంటే సింహాసనాధికారులుగా కాలేదు. అంటే సింహాసనంపై సరిగ్గా ఆసీనులు కాలేదు. సింహాసనాధికారి ఆత్మని వ్యక్తులేమిటి ప్రకృతి కూడా అప్సెట్ చేయలేదు. మాయ యొక్క నామరూపాలే ఉండవు, మరి అటువంటి సింహాసనాధికారి, కిరీటధారి వరదాని ఆత్మలేనా? మధువన బ్రాహ్మణుల యొక్క గొప్పతనం. అర్థమైందా! ఈరోజు మధువననివాసీయుల అవకాశం.
మిగిలినవారందరూ గ్యాలరీలో ఉన్నారు. గ్యాలరీ కూడా మంచిగా లభించింది. మంచిది. ఆదిరత్నాలు అది స్థితిలోకి వచ్చేశారు కదా! మధ్యలోనిది మర్చిపోయారు కదా! కొమ్మలను వదిలేశారు కదా! ఆదిరత్నాలందరు ఎగిరేపక్షులుగా తయారై వెళ్తున్నారు. బంగారు జింక వెనుక కూడా వెళ్ళకూడదు. ఏ రకమైన ఆకర్షణకి వశం అయ్యి క్రిందకి రాకూడదు. బుద్ధిని కదిలించేటందుకు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ సదా అచంచలంగా, స్థిరంగా, నష్టోమోహ మరియు నిర్మాణంగా ఉండాలి. అప్పుడే ఎగిరే పక్షి అయ్యి ఎగురుతూ ఉంటారు మరియు ఎగిరింప చేస్తారు. సదా అతీతం మరియు సదా బాబాకి ప్రియం.
ఏ వ్యక్తికి లేదా హద్దులోని ఏ ప్రాప్తికి ప్రియంగా కాకూడదు. కానీ ఆత్మల ఎదురుగా ఈ హద్దులోని ప్రాపురే బంగారు జింక రూపంలో వస్తాయి. అందువలన ఓ ఆదిరత్నాలూ! ఆది పిత సమానంగా సదా నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా ఉండాలి. అర్ధమైందా? మంచిది. ఈవిధంగా ప్రతి కర్మలో తండ్రి యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించేవారికి, ప్రత్యక్ష ఫల స్వరూపులకు, సదా తక్షణ దానం మహాపుణ్యం చేసేవారికి, పుణ్యాత్మలకు ప్రతి కర్మలో బ్రహ్మాబాబాను అనుసరించేవారికి, చిత్రకారులై విశ్వం ముందు బాబా యొక్క చిత్రాన్ని చూపించే బ్రహ్మాబాబా సమాన శ్రేష్టాత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.