రివైజ్ కోర్స్ మురళి 30-07-1983
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
మన్మోహినీ దీదీగారు సాకార శరీరం వదిలేసిన సమయంలో అవ్యక్త బాప్ దాదా యొక్క మహావాక్యాలు
ఈ రోజు అచంచల రాజ్యాధికారులు, అచంచల స్థితిలో ఉండే విజయీ పిల్లలను చూస్తున్నారు. ఇప్పటి నుండి చలించని సంస్కారాల ఆధారంగానే చలించని రాజ్యం యొక్క ప్రాలబ్ధం పొందుతున్నారు. ప్రాలబ్ధం పొందే ముందు పురుషార్థం కల్పకల్పం చలించనివారిగా అయ్యారు. డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని, డ్రామా చక్రంలో సంగమయుగీ బిందువుపై స్థితులై దేనిని చూసినా కానీ స్వతహాగానే అచంచలంగా స్థిరంగా ఉండగలరు. బిందువు నుండి క్రిందకు వచ్చేస్తున్నారు. అందువలన అలజడి అవుతున్నారు. శ్రేష్టబ్రాహ్మణ ఆత్మలందరూ సదా ఎక్కడ ఉంటున్నారు? మొత్తం చక్రంలో సంగమయుగం ఉన్నతమైన యుగం.
చిత్రంలో కూడా సంగమయుగం యొక్క స్థానం ఉన్నతమైనది. మిగిలిన యుగాల్లో చూస్తే చిన్న యుగం ఈ ఉన్నతమైన బిందువుపై ఉన్నత స్థానంలో, ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన జ్ఞానంలో, ఉన్నతోన్నమైన బాబా స్మృతిలో, ఉన్నతోన్నతమైన సేవ యొక్క స్మృతి స్వరూపంగా ఉన్నట్లయితే సదా సమర్థంగా ఉంటారు. ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం సదాకాలికంగా సమాప్తి అయిపోతుంది కదా లేక ఇంకా కొంచెం పాత వ్యర్థఖాతా ఉందా? బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే తనువు, మనస్సు, ధనం అన్నీ నీవే అని ప్రతిజ్ఞ చేసారు అంటే వ్యర్ధసంకల్పం సమాప్తి అయిపోయింది. ఎందుకంటే మనస్సు సమర్థ బాబాకి ఇచ్చేసారు.
ఈ రెండు మూడు రోజుల్లో మనస్సు నీది అనే దానికి బదులు నాదిగా చేసుకోలేదు కదా? నిమిత్తమైన వారికి ఆజ్ఞ ఏమిటంటే మనస్సుతో సదా సమర్థంగా ఆలోచించండి. వ్యర్థానికి ఇంకా అవకాశం ఉందా? వ్యర్థం నడిచిందా? అది స్నేహం అని మీరు అంటారు. పరివారం యొక్క స్నేహం అనే త్రాడుతో అందరూ బందీ అయ్యి ఉన్నారు. అది అయితే చాలా మంచిది. స్నేహంతో ముత్యాలు రాలినవి అంటే ఆ ముత్యాలు చాలా అమూల్యమైనవి. కానీ ఎందుకు? ఏమిటి? అనే సంకల్పంతో కన్నీళ్ళు వచ్చాయి. అంటే వ్యర్థఖాతాలోకి జమ అవుతాయి. స్నేహం యొక్క ముత్యాలు మీ స్నేహీ అయిన దీదీ కంఠానికి హారంగా మెరుస్తున్నాయి.
అటువంటి సత్యమైన స్నేహం యొక్క మాలలు దీదీ మెడలో చాలా ఉన్నాయి. కానీ ఒక్క శాతం అయినా అలజడి స్థితిలోకి వచ్చి కన్నీళ్ళు వచ్చాయి అంటే అది దీదీ దగ్గరకు చేరలేదు. ఎందుకు దీదీ సదా విజయీగా అచంచలంగా స్థిరమైన ఆత్మగా ఉండేవారు మరియు ఇప్పుడు కూడా ఉన్నారు. అటువంటి అచంచల ఆత్మ దగ్గరకు అలజడితో కూడిన ఆత్మ యొక్క సంకల్పాలు చేరుకోవు. అవి ఇక్కడే ఉండిపోతాయి. ముత్యాలుగా అయ్యి మాలలో మెరవవు. ఎటువంటి స్థితిలో ఉండే ఆత్మ దగ్గరకు అటువంటి స్థితిలో ఉండే ఆత్మ యొక్క స్మృతియే చేరుకుంటుంది.
స్నేహం ఉంది. అది చాలా మంచి గుర్తు. స్నేహం ఉంటే స్నేహంతో అర్పణ చేయాలి కదా? ఎక్కడ సత్యమైన శ్రేష్ట స్నేహం ఉంటుందో అక్కడ దుఃఖం యొక్క అల కూడా ఉండదు. ఎందుకంటే దుఃఖధామం నుండి దాటేశారు కదా? అందరి యొక్క మధురాతి మధురమైన నిందలు చేరుకున్నాయి. మా మధురమైన దీదీని ఎందుకు పిలిచారని, అందరూ నిందలు వేసారు. అప్పుడు బాప్దాదా అన్నారు. అందరికి మధురం అయిన దీది బాబాకు కూడా మధురమే కదా! మధురత కావాలంటే ఎవరిని పిలుస్తారు? మధురాతి మధురమైన వారిని పిలుస్తారు కదా!
మీరందరూ ఆలోచిస్తున్నారు మరియు మాటిమాటికీ అడుగుతున్నారు ఎడ్వాన్స్ పార్టీలోని విశేషాత్మలు ఇప్పటి వరకూ ఎందుకు గుప్తంగా ఉన్నారని. ప్రత్యక్షం చేయాలి అనుకుంటున్నారు కదా? సమయ ప్రమాణంగా ఎడ్వాన్స్ పార్టీ యొక్క ఆత్మలు శ్రేష్టయోగ బలం యొక్క శ్రేష్ట విధిని ప్రారంభం చేసే శ్రేష్ట ఆత్మలను పిలుస్తున్నారు. ఇటువంటి ఆది పరివర్తన యొక్క విశేష కార్యం కోసం ఆది కాలంలోని ఆదిరత్న ఆత్మలు కావాలి. విశేష యోగీ ఆత్మలు కావాలి. యోగబలాన్ని, ప్రయోగించేవారు కావాలి. భాగ్యవిధాత బాబా యొక్క భాగస్వామి ఆత్మలు కావాలి.
భాగ్యవిధాత అని బ్రహ్మాబాబాని కూడా అంటారు. ఎందుకు పిలిచారో అర్థమైందా? ఇక్కడేమి అవుతుంది? ఎలా అవుతుంది అని ఆలోచిస్తున్నారు కదా! బ్రహ్మాబాబా అవ్యక్తం అయినప్పుడు ఏమయ్యిందో ఎలా అయిందో చూసారు కదా? దాదీని ఒంటరిగా భావిస్తున్నారా? దాదీ భావించటం లేదు. కానీ మీరు భావిస్తున్నారు. అలా ఉన్నారు కదా! (దాదీ వైపు చూస్తూ) మీ అందరికి దివ్య ఐక్యత లేదా? దివ్య ఐక్యత గల భుజాలు కదా? ఈ గ్రూపు ఎందుకోసం తయారుచేసారు. సదా ఒకరికొకరు సహయోగి అవ్వటానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికి కావాలంటే వారికి అందరి సేవ కోసం హాజరుగా ఉండాలి.
దాదీలకు కూడా పరస్పరం చాలా ప్రీతి ఉంది. మీకు తెలియదు. అందువలన ఇప్పుడు ఏమవుతుంది అని అనుకుంటున్నారు? ఒక దీదీ ఋజువు చేసి చూపించారు. అది రత్నాలు అయిన మేమందరమూ ఒకటే అని. చూపించారు కదా? బ్రహ్మాబాబా తర్వాత సాకారరూపంలో తొమ్మిది రత్నాలు పూజ్య ఆత్మలు సేవ అనే వేదికపై ప్రత్యక్షం అయ్యారు. ఈ తొమ్మిది రత్నాలు లేదా అష్టరత్నాలు మాలలో సదా ఒకరికొకరు సహయోగిగా ఉంటారు. అష్ట రత్నాల మాల ఎవరు? సేవలో ఎవరు ముందు చేస్తారో వారే అర్జునులు అంటే అష్ట రత్నాల మాల. సేవా వేదికపై అష్టరత్నాలు లేదా నవరత్నాలు తమ పాత్రను అభినయిస్తున్నారు.
అష్టరత్నాలు పరస్పరం సదా స్నేహీ మరియు సదా సహయోగిగా ఉంటారు. అందువలన ఆది నుండి సేవ యొక్క సహయోగి ఆత్మలు సదా సహయోగి పాత్రను అభినయిస్తూనే ఉంటారు. అర్ధమైందా? ఇంకా ఏమి ప్రశ్న ఉంది? చెప్తే దీదీతో యోగం చేస్తారు. డ్రామా యొక్క విచిత్ర పాత్ర, విచిత్ర చిత్రం మొదట చెప్పరు. అలజడి యొక్క పేపరు అకస్మాత్తుగా వస్తుంది. మరియు ఇప్పుడు కూడా ఈ విశేషాత్మ యొక్క పాత్ర ఇప్పటి వరకూ వెళ్ళిన ఆత్మల కంటే అతీతమయినది మరియు ప్రియమైనది. ప్రతీ సేవాక్షేత్రంలో ఈ శ్రేష్టాత్మ యొక్క తోడు, సహయోగం యొక్క అనుభూతి చేసుకుంటూ ఉంటారు.
బ్రహ్మాబాబా యొక్క పాత్ర వేరు. అటువంటి పాత్ర ఇంకెవరికి ఉండదు. కానీ ఈ ఆత్మ యొక్క విశేషత ఏమిటంటే సేవలో ఉత్సాహ ఉల్లాసం ఇచ్చే యోగిగా, సహయోగిగా మరియు ప్రయోగిగా అవ్వటంలో సదా ఉంటుంది. అందువలన ఆత్మ యొక్క విశేష సంస్కారం ప్రతీ సమయం మీ అందరికీ కూడా సహయోగిగా ఉండే అనుభవం చేయిస్తుంది. ఇది కూడా ప్రతీ ఒక్క ఆత్మది ఎవరిది వారికే విచిత్ర పాత్ర. మంచిది. మధువనానికి వచ్చి స్నేహ స్వరూపం చూపించారు. ఇది కూడా విశ్వ సేవలో నిమిత్త పాత్ర మీరందరూ రావటం వల్ల విశ్వంలో స్నేహం యొక్క అలలను, సువాసనలను, కిరణాలను వెదజల్లబడ్డాయి.
అందువలన అందరికీ స్వాగతం. దీదీ తరపున కూడా బాప్ దాదా స్నేహం యొక్క సేవా స్వరూపానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. దీదీ కూడా చూస్తున్నారు టీ.వి.లో ఉన్నారు. మీరు కూడా వతనంలోకి వెళ్ళి చూడండి. ఇది కూడా సేవ యొక్క ముద్ర. ఈరోజు సంఘటనలో కమల (దీదీ యొక్క లౌకిక వదిన) కూడా స్మృతి వచ్చారు. దీదీ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరయితే స్నేహీ శ్రేష్ట ఆత్మపట్ల తమ సహయోగం ఇచ్చారో. అటువంటి అలసిపోని పిల్లలకు ఇక్కడ కూర్చున్నా, కూర్చోకపోయినా కానీ పిల్లలందరికీ శుభ భావన, శుభ కామన మరియు ఒకే సంలగ్నతతో తమ స్నేహం చూపించారు.
వారు చాలా శ్రేష్టంగా ఉన్నారు. అందువలన బాప్ దాదాకి విశేషంగా దీదీ చెప్పారు. నా తరుపున ఇటువంటి స్నేహీ సేవాధారి పరివారానికి ప్రియస్మృతులు మరియు కృతజ్ఞతలు ఇవ్వండి అని. అంటే దీదీ యొక్క పని ఈ రోజు బాప్ దాదా చేస్తున్నారు. ఈ రోజు బాప్ దాదా సందేశీ అయ్యి సందేశీ ఇస్తున్నారు. అయితే జరిగిందేదైతే ఉందో అది కూడా చాలా రహస్యాలతో నిండిన డ్రామా జరిగింది. మీ అందరికీ దీదీ అంటే ఇష్టం. దీదీకి సేవ అంటే ఇష్టం. అందువలన సేవ తనవైపు లాక్కుంది. ఏదైతే జరిగిందో అది పరివర్తనా పరదా తెరవటానికి చాలా మంచిగా జరిగింది.
డాక్టర్ భగవతి యొక్క దోషం లేదు. భగవంతుడి యొక్క దోషం లేదు. ఎప్పుడూ కూడా డాక్టర్ గురించి కూడా ఆలోచించకూడదు. వీరు ఇలా చేసారు. ఇటువంటి ఆపరేషన్ చేసారు అని. డాక్టర్ యొక్క స్నేహం అంతిమం వరకూ తల్లి స్నేహంగానే ఉంది. అందువలన డాక్టర్ తన వైపు నుండి ఎటువంటి పొరపాటు చేయలేదు. ఇది డ్రామా యొక్క ఆట. అర్ధమైందా? అందువలన ఎటువంటి సంకల్పాలు చేయకూడదు.
ఈ రోజు కేవలం ఆజ్ఞాకారి అయ్యి దీదీ తరపున సందేశీగా అయ్యి వచ్చాను. అచంచల స్థితిలో స్థితులయ్యేవారికి, అచంచల రాజ్యాధికారులకి, నిశ్చయబుద్ధి నిశ్చింత ఆత్మలకి, నిశ్చిత విజయం పొందే పిల్లలకు ఈరోజు త్రిమూర్తి ప్రియస్మృతులు ఇస్తున్నారు. బాప్ దాదాతో పాటూ అందరికీ అతిప్రియమయిన దీదీ కూడా ప్రియస్మృతులు ఇస్తున్నారు. మరియు నమస్కారం చేస్తున్నారు.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.