రివైజ్ కోర్స్ మురళి 31-12-1983

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

క్రొత్త సంవత్సరం సందర్భంగా అవ్యక్త బాప్ దాదా యొక్క మహావాక్యాలు

ఆత్మిక ప్రియుడు అయిన శివబాబా, ప్రేయసీలు అయిన ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు:-

ఈ రోజు సాగరుని ఒడ్డుపై అంటే మధువనం యొక్క ఒడ్డుపై మధుర కలయిక  జరుపుకోవటానికి వచ్చారు. ఎంతో దూరదూరాల నుండి కలయిక జరుపుకోవడానికి వచ్చారు. ఎందుకు? ఇటువంటి అద్భుతమైన ప్రియుడు మొత్తం కల్పంలో ఎప్పుడూ లభించరు. ఒకే ప్రియుడు కానీ ప్రేయసీలు ఎంతమంది? ఒకే ప్రియుడికి అనేక ప్రేయసీలు. ఈ రోజు విశేషంగా ప్రేయసీల సభలోకి వచ్చారు. కలుసుకుంటారు కానీ చెప్పటం ఉండదు. ఈ రోజు చెప్పడానికి రాలేదు. కలుసుకోవటానికి మరియు జరుపుకోవటానికి వచ్చారు. విశేషంగా డబల్ విదేశీ పిల్లలు ఈ రోజు జరుపుకోవటానికి వచ్చారు.

క్రొత్త సంవత్సరం జరుపుకోవాలనే సంకల్పంతో వచ్చారు. బాప్ దాదా కూడా క్రొత్త సంవత్సరంలో స్నేహం మరియు సహయోగ సంపన్న శుభాకాంక్షలు ఇస్తున్నారు. సంగమయుగం అంటే క్రొత్తయుగం. భవిష్య సత్యయుగం ఈ వర్తమాన సమయంలో క్రొత్త యుగం యొక్క క్రొత్త జీవితం యొక్క ప్రాలబ్ధం. బ్రాహ్మణులకి క్రొత్తయుగం లేదా శ్రేష్టయుగం ఇదే. ఎప్పటి నుండి బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటి నుండి క్రొత్తయుగం, క్రొత్త సంసారం, క్రొత్త పగలు, క్రొత్త రాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ క్రొత్త యుగం యొక్క క్రొత్త జీవితం యొక్క ప్రతీ ఘడియ కోట్లతో సమానం, వజ్రంతో సమానం.

 క్రొత్త పగలు వచ్చింది, క్రొత్త రాత్రి వచ్చింది అని సత్యయుగంలో పాడరు. అది ఇప్పటి విషయమే. బాప్ దాదా ఆది నుండి ఏ పాటతో పిల్లలని మేల్కొల్పారు. ఆ పాట జ్ఞాపకం ఉందా? మేల్కోండి ప్రేయసులు మేల్కోండి ఎందుకు మేల్కోవటం? నవయుగం వచ్చింది. ఇది చిన్ననాటి పాట కదా! ఇప్పుడు అయితే క్రొత్త క్రొత్త పాటలు తయారు చేసేశారు. ఆదిలో బాబా ఇదే పాట విన్పించారు కదా! నవయుగం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే పాతది, ముందు క్రొత్తదిగానే అనిపిస్తుంది కదా! పాత ప్రపంచం, పాత జీవితం మారిపోయింది. క్రొత్త జీవితంలోకి వచ్చారు కదా!

తెలివి తప్పిపోయారు ఇప్పుడు నేనెవరు? అనే  తెలివి వచ్చింది కదా అంటే తెలివి తక్కువవారిగా అయిపోయినట్లే కదా. తెలివి తక్కువు నుండి తెలివిలోకి వచ్చారు. క్రొత్త జీవితం అనుభవం చేసుకున్నారు కదా! కళ్ళు తెరవగానే క్రొత్త సంబంధం, క్రొత్త సంసారం చూశారు కదా! అందువలన క్రొత్త యుగం యొక్క క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. లౌకిక ప్రపంచంలో కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తారు కదా. సదా సంతోషంగా ఉండరు కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. కానీ మీరు రాయల్ గా చెప్తారు. హ్యాపీ న్యూ ఇయరే కాదు హ్యాపీ న్యూ యుగం కూడా.

మొత్తం యుగం అంతా సంతోషయుగం, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేటప్పుడు మొదట ఏమి చేస్తారు? ఫారిన్ వారి పద్ధతి అయితే చేతిలో చేయి వేసి చెప్తారు. బాప్ దాదా చేతిలో చేయి ఎలా వేస్తున్నారు? స్థూలమైన చేతిని అయితే ఒక్కసెకను కలుపుతారు కానీ బాప్ దాదా మొత్తం యుగం అంతా చేతిని కలుపుతారు అంటే ఒకే శ్రేష్ట మతం అనే చేతిని ఇచ్చి చేతిలో చేయి కలిపి అంతిమం వరకూ తోడుగానే తీసుకువెళ్తారు. శ్రీమతం అనే చేయి సదా మీ అందరికీ తోడుగా ఉంది. అందువలన యుగం అంతా చేతిలో చేయి వేసి నడుస్తున్నారు. చేయి వదిలేస్తే ఏమి అవుతుంది? వేరు అయిపోతారు.

అందువలన సత్యమైన ప్రేయసీలు సదా ప్రతీ అడుగూ చేతిలో చేయి వేసి నడుస్తారు. చేతిలో చేయి వేసి నడవటం స్నేహానికి మరియు సహయోగానికి కూడా గుర్తు. ఎప్పుడైనా ఎవరైనా నడిచినడిచి అలసిపోతారు అప్పుడు ఇంకొకరు వారి చేతిని పట్టుకుంటారు. కానీ ఆత్మిక ప్రియుడు ప్రేయసీల చేతిని ఎప్పుడూ వదలరు. అంతిమం వరకు ప్రతిజ్ఞ చేశారు. చేయి మరియు తోడు సదా ఉంటుంది. ప్రేయసీలు అందరూ చేతిని గట్టిగా పట్టుకున్నారు కదా. డీలాగా లేరు కదా! వదిలేసేవారు కాదు కదా..వదిలేస్తూ మరలా తీసుకుంటూ ఉన్నవారు చేతులెత్తండి. ఒకొక్కసారి పట్టుకుంటూ, ఒకొక్కసారి వదిలేస్తూ అలా ఎవరైనా ఉన్నారా?

వీరి విశేషత ఏమిటంటే దాచేవారు కాదు సత్యంగా చెప్పేస్తారు. అలా చెప్పటం ద్వారా సగం విఘ్నం సమాప్తి అయిపోతుంది. కానీ పచ్చి వ్యాపారం ఎంత వరకూ చేస్తారు? పాత సంవత్సరంలో పాత ఆచార వ్యవహారాలు సమాప్తి చేసేయాలి కదా లేక క్రొత్త సంవత్సరంలో కూడా అదే పద్ధతి నడుస్తుందా? ఇప్పటి వరకూ జరిగిన దానికి బిందువు పెట్టేయండి సదా తోడు మరియు చేతిని పట్టుకునే స్మృతి తిలకం ఇప్పటి నుండి పెట్టుకోండి. పండుగ రోజులలో లేదా సంతోషకరమైన రోజులలో విశేషంగా సౌభాగ్యానికి మరియు శుభాకాంక్షల యొక్క బిందువు అంటే తిలకం ధరిస్తారు కదా!

మీరు కూడా విశేష యోగభట్టీ రోజున స్మృతి తిలకం పెట్టుకుంటారు కదా ఎందుకు పెట్టుకుంటారు? భట్టీ రోజున విశేషంగా తిలకం ఎందుకు పెట్టుకుంటారు? ఈ రోజు అంతా సహజయోగిగా శ్రేష్టయోగీ స్వరూపంలో ఉంటాను అనే ధృఢ సంకల్పానికి గుర్తుగా తిలకం పెట్టుకుంటారు.

ఈ రోజు కూడా కొంచెం పచ్చిగా ఉంటే ధృఢ సంకల్పాల ద్వారా బిందువు పెట్టండి. మరియు సమర్థ స్వరూపం యొక్క తిలకం పెట్టుకోండి. బిందువు పెట్టుకోవటం వస్తుందా! పాండవులకి బిందువు పెట్టుకోవటం వస్తుందా! శక్తులకి బిందువు పెట్టుకోవటం వస్తుందా! అవినాశి బిందువు పెట్టుకోవాలి. ఈ రోజు ఉదయం అందరూ ఏమి ప్రతిజ్ఞ చేశారు. సమారోహం జరుపుకోవాలి అని కదా! (వివాహ సమారోహం) ఇప్పటికి ఇంకా వివాహం చేసుకోలేదా! పిల్లలు పుట్టలేదా?

వివాహం అయితే అయిపోయింది. కానీ వివాహం యొక్క రోజు జరుపుకోవడానికి వచ్చారు. వివాహం అవ్వని వారు చేతులు ఎత్తండి. ఎన్ని వయ్యారాలు చేసినా ప్రియుడు వదిలేవారు కారు. ఎందుకంటే తెలుసు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు అని. ఈ రోజులలో విదేశాలలో అలవాటు ఉంది కదా! ఒకరుని వదిలేసి హిప్పీలుగా అయిపోతున్నారు. హిప్పీలుగా అవ్వాలా. సదా సంతోష వంతంగా అవ్వాలా లేక హిప్పీలుగా అవ్వాలా? ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే అది చూడలేకపోతున్నాము కదా!

మీరందరూ రాజ్యాధికారులు అందువలన బాప్ దాదాకి తెలుసు అప్పుడప్పుడు తుంటరిగా అయిపోతున్నారు. కానీ బాప్ దాదా ప్రతిజ్ఞ చేసారు. -వెంట తీసుకువెళతాను అని ఆ ప్రతిజ్ఞను బాబా వదలరు. అందువలన వెంట నడవాల్సిందే మంచిది. క్రొత్త సంవత్సరంలో ఏమి నవీనత చేస్తారు. కొత్త విషయం చేస్తారు కదా! ఏదైనా ప్లాన్ తయారు చేసారా! నిమిత్తమైన టీచర్స్ ఏమైనా కొత్త ప్లాన్స్ తయారు చేసారా! గీతా భగవంతుడిని భారతదేశంలో ప్రత్యక్షం చేస్తారు విదేశాలలో ఏమి చేస్తారు. మిగిలిపోయిన విషయాలను ప్రత్యక్షంలోకి తీసుకురావటం చాలా మంచి విషయం. సమయ ప్రమాణంగా అన్ని విషయాలు ప్రత్యక్షం అవుతున్నాయి.

ఈ విషయంలో అయితే భారతదేశంలో అయితే నగాఢా మ్రోగిస్తారు. ధర్మనేతలను మేల్కొలుపుతారు. అలజడి కూడా సృష్టిస్తారు. వారు కొద్దిగా మేల్కొని చాలా మంచిది అని మరలా నిద్రపోతున్నారు. ఎవరయినా నిద్రలోంచి లేవకపోతే వారిపైన చల్లని నీరు జల్లుతారు కదా! అలాగే భారతదేశం వారు కూడా చల్లని నీరు జల్లితే మేల్కొంటారు. మంచిది. ఈ సంవత్సరం ఏమి క్రొత్తదనం చేస్తారు.

లౌకిక ప్రపంచంలో ఏ స్థానంలో ఎక్కువ అలజడి ఉంటుందో ఆ స్థానంలో సదా సంతోషం యొక్క అచంచల స్థితి యొక్క జెండా ఎగురవేయాలి. గవర్నమెంట్ వారు అలజడిలో ఉన్నారు. కానీ ప్రభువు రత్నాలు సదా సంపన్నంగా సదా అచంచలంగా ఉండే విశేషమైన జెండా ఎగురవేయాలి. గవర్నమెంట్ వారికి కూడా ధ్యాస రావాలి ఈ దేశంలో గుప్త వేషధారులు విచిత్ర ఆత్మలు ఎవరు? వారు ఈ దేశంలో అతీతం మరియు అతి ప్రియమైనవారు.

ఎవరైతే ధనంతో బలహీనులో వారిని అవినాశి ధనంతో సంపన్నం చేసి మేము అందరికంటే నిండుగా ఉన్నాం, మేము సదా పదమాపతులము అనే అనుభవం చేయించండి, ధనం యొక్క పేదరికం యొక్క దు:ఖం వారు మరిచిపోవాలి. అటువంటి అల వ్యాపింపచేయండి ఎవరు వచ్చినా కానీ అనుకోవాలి తరగని ఖజానాలలో నిండుగా అయ్యాం ఇంత ధనం ఉంది అని అనుభవం చేసుకోవాలి.

ఈ ధనం ద్వారా స్థూలధనం కూడా స్వతహాగానే సమీపంగా వస్తుంది. దుఃఖం ఉండదు. మంచిది - విదేశంలో క్రొత్త సంవత్సరంలో ఏమి నవీనత చేస్తారు. సెంటర్స్ అయితే తెరుస్తున్నారు మరియు తెరుస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం విదేశాలలో కూడా విశేష క్వాలిటీ సేవ విశేష రూపంలో జరగాలి. మీ అందరికీ విశేష క్వాలిటీ ఉంటుంది. మరియు విశేష క్వాలిటీ గల ఆత్మలు. స్థాపనాకార్యంలో సహయోగిగా అయ్యే వారిని విదేశాలలో నలువైపులా అటువంటి గ్రూపును తయారుచేయండి.

ఆ గ్రూపు అంతా కలిసి భారతవాసీయుల సేవకి నిమిత్తం అవ్వాలి. పేరున్న వారికి ధ్వనిని వ్యాపింప చేసేవారు వేరే గ్రూపు కానీ ఇది సంబంధంలోని వారిది అది సంప్రదింపులో వారిది. సమీప సంబంధాలలో ఉన్న క్వాలిటీ ఆత్మల విశేష గ్రూపు కావాలి. విశేష జీవిత పరివర్తనని అనుభవం చేసుకోవాలి. వారి అనుభవాల ద్వారా ఇంకా విశేష క్వాలిటీ ఆత్మలు, వారసులు వస్తారు. వారు సేవకి నిమిత్తం అయిన గ్రూపు వీరు వారసుల లక్షణాలు గల సేవాధారి గ్రూపు, గొప్పవారు మరియు వారసులు కూడా. ఇటువంటి గ్రూపు విదేశాలలో తయారవ్వటం ద్వారా దేశంలో సేవ యొక్క చక్రం తిరగాలి.

రాజనేతలు, ధర్మనేతలు అన్ని రకాలైన ఆత్మలు తమ అనుభవం యొక్క శక్తితో అనుభవం చేసుకోవాలి అనే కోరిక ఉత్పన్నం అవ్వాలి. ఇలా చక్రం తిరిగే వారసత్వ సేవాధారి క్వాలిటీ గ్రూపుని తయారు చేయండి. అర్థమైందా, విదేశాలలో నలువైపులా ధ్వనిని వ్యాపింపచేసే సాధనాలు సహజంగా ఉంటాయి అందువలన విదేశాలలో ధ్వని వ్యాపిస్తుంది. మరియు వ్యాపిస్తూనే ఉంటుంది. కానీ భారత దేశంలో ధ్వనిని వ్యాపింపచేసే సాధనాలు అంత సహజంగా లేవు భారతవాసీయులను మేల్కొల్పటానికి వ్యక్తిగతమైన సేవ కావాలి. మరియు అది కూడా చాలా సింపుల్ అనుభవం యొక్క మాటలతో సేవ చేయాలి.

భారతవాసీయులు విశేష పరివర్తన యొక్క అనుభవంతో పరివర్తన అవుతారు. అటువంటి విశేష అనుభవీ ఆత్మలు ఉండాలి. వారి అనుభవంతో శక్తిశాలి పరివర్తన యొక్క విషయాలు ఉండాలి. ఇటువంటి కధలు విని భారతవాసీయులు ఎక్కువ ఆకర్షితం అవుతారు. భారతదేశంలో కథలు వినే ఆచారం ఉంటుంది. అర్థమైందా. విదేశీయులకి ఏమి చేయాలో! ఇంతమంది టీచర్స్ వచ్చారు. ఇటువంటి గ్రూపుని తయారు చేసి తీసుకురావాలి. మంచిది. క్రొత్త సంవత్సరం యొక్క విశేష కానుకగా బాప్ దాదా వరదానాల మాలను ఇస్తున్నారు. కార్యక్రమం జరుపుతున్నారు మరియు వరమాలను వేస్తున్నారు.

బాప్ దాదా తన ప్రేయసీల అందరికీ వరదానాల మాలను కానుకగా ఇస్తున్నారు. సదా సంతుష్టత ద్వారా సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టం చేయండి. ప్రతీ సంకల్పంలో విశేషత ఉండాలి. ప్రతీ మాట మరియు కర్మలో విశేషత ఉండాలి. ఇటువంటి విశేషతతో సదా సంపన్నంగా ఉండండి. సదా సరళ స్వభావం, సరళమైన వాక్కు, సరళతా సంపన్న కర్మ ఉండాలి. సరళ స్వరూపులుగా ఉండాలి. సదా ఒకే మతంపై ఒకరితోనే సర్వ సంబంధాలు ఒకరితోనే సర్వప్రాప్తులు, ఒకరి ద్వారానే సదా ఏకీరసంగా ఉండే సహజ అభ్యాసీలుగా ఉండండి.

సదా సంతోషంగా ఉండండి. సంతోషం యొక్క ఖజానాను పంచిపెట్టండి. సంతోషం అనే అలను అందరిలో వ్యాపింప చేయండి. సదా సంతోషం యొక్క చిరునవ్వులు ముఖంపై మెరుస్తూ ఉండాలి. ఇలా హర్షితముఖంగా ఉండండి. సదా స్మృతిలో ఉండండి. వృద్ధిని పొందండి. ఈ వరదానాల మాలను సదా వెంట ఉంచుకోండి. అర్థమైందా. ఇదే క్రొత్త సంవత్సరం యొక్క బహుమతి మంచిది.

ఈవిధంగా సదా వరదాని, సదా తోడు మరియు నీడను అమరంగా ఉంచుకునే శ్రేష్టాత్మలకు, ప్రతీ సంకల్పంలో నవీనత యొక్క విశేషతను జీవితంలోకి తీసుకువచ్చేవారికి విశేష ఆత్మలకు, క్రొత్తయుగం యొక్క క్రొత్త సంవత్సరం యొక్క అమర ప్రియస్మృతులు ఎగిరేకళ యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

జగత్ కళ్యాణి భవ!