రివైజ్ కోర్స్ మురళి 13-02-1984
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
ఆబూ సమ్మేళనంలో వచ్చి ఉన్న అతిథులతో కలయిక
1) (డా. జోన్హా) అసిస్టెంట్ సెక్రటరీ జనరల్(యు.ఎన్.ఓ/ఐక్యరాజ్యసమితి) - బాప్దాదా పిల్లల మనసులోని సంకల్పాలకు సదా సహయోగమిచ్చి పూర్తి చేస్తూ ఉంటారు. మీ సంకల్పమేదైతే ఉందో, అదే సంకల్పాన్ని సాకారంలోకి తీసుకొచ్చే యోగ్య స్థానానికి చేరుకున్నారు. వీరంతా నా సంకల్పాన్ని పూర్తి చేసే సహచరులని భావిస్తున్నారా? సదా శాంతిని స్మృతి ద్వారా అనుభవం చేస్తూ ఉంటారు. చాలా మధురమైన, సుఖమయమైన శాంతి అనుభూతి అవుతూ ఉంటుంది. శాంతిప్రియ పరివారములోకి చేరుకున్నారు. కావున సేవకు నిమిత్తంగా అయ్యారు.
సేవకు నిమిత్తంగా అయినందుకు రిటర్న్గా(బదులుగా) ఎప్పుడు తండ్రిని స్మృతి చేసినా సహజ సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు. సదా ''నేను శాంతి స్వరూప ఆత్మను, శాంతి సాగరుని సంతానాన్ని, శాంతిప్రియ ఆత్మను'' అన్న స్మృతిలో ఉండండి. ఇదే అనుభవం ద్వారా ఎవరైతే సంపర్కంలోకి వస్తారో వారికి సందేశకులుగా అయ్యి సందేశమునిస్తూ ఉండండి. ఇదే అలౌకిక కర్తవ్యము సదా శ్రేష్ఠ కర్మను చేయిస్తూ ఉంటుంది. శ్రేష్ఠ కర్మ ద్వారా శ్రేష్ఠ ప్రాప్తిని చేయిస్తూ ఉంటుంది. వర్తమానం మరియు భవిష్యత్తు రెండూ శ్రేష్ఠంగా ఉంటాయి. మీరు శాంతిని అనుభవం చేసే యోగ్య ఆత్మలు. సదా శాంతిసాగరంలో తేలియాడుతూ ఉండండి.
ఎప్పుడైనా ఏదైనా కార్యంలో కష్టమనిపించినప్పుడు శాంతి ఫరిస్తాలతో సంపర్కాన్ని ఉంచుకుంటే కష్టము సహజమైపోతుంది. అర్థమయ్యిందా! అయినా చాలా భాగ్యశాలురుగా ఉన్నారు. ఈ భాగ్యవిధాత ధరణి పైకి చేరుకునేవారు కోటిలో కొందరు, కొందరిలో కూడా కొందరే ఉంటారు. భాగ్యశాలురుగా అయితే అయిపోయారు. ఇప్పుడు పదమాపదమ్ భాగ్యశాలురుగా తప్పకుండా అవ్వాలి. అటువంటి లక్ష్యము ఉంది కదా! తప్పకుండా అవుతారు. కేవలం శాంతి ఫరిస్తాల జతలో ఉంటూ ఉండాలి.
విశేష ఆత్మలు, విశేష పాత్రను అభినయించే ఆత్మలు ఇక్కడకు చేరుకుంటారు. మీ ముందు కూడా విశేషమైన పాత్ర ఏదైతే ఉందో, అది కూడా మున్ముందు తెలుస్తూ ఉంటుంది. ఈ కార్యమైతే సఫలమయ్యే ఉంది. కేవలం ఎవరి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేయాలో వారి భాగ్యాన్ని తయారు చేసేందుకు ఈ సేవా సాధనముంది. ఇదైతే అయ్యే ఉంది. ఇది అనేకసార్లు జరిగింది. మీ సంకల్పం చాలా బాగుంది. మీ సహచరులెవరైతే ఉన్నారో, ఎవరైతే ఇక్కడికి వచ్చి వెళ్లారో, స్నేహీ సహయోగులుగా ఉన్నారో, విశేష స్నేహ పుష్పాలతో పాటు బాప్దాదాల ప్రియస్మృతులనివ్వండి.
2. మేడమ్ అన్వర్ సాదాల్తో అవ్యక్త బాప్దాదా కలయిక - ఈజిప్ట్ కొరకు సందేశము
మీ దేశానికి వెళ్లి ధనము పొదుపు చేసే విధానాన్ని నేర్పించండి. మానసిక సంతోషం ద్వారా ధనము అనుభూతి కలుగుతుంది. ధనము యొక్క పొదుపుయే మానసిక సంతోషానికి ఆధారము. ఇలా ధనము యొక్క పొదుపు మరియు మానసిక సంతోషానికి సాధనాన్ని తెలిపితే వారు మిమ్ములను ధనము మరియు మనసుకు సంతోషాన్నిచ్చే సంతోష ఫరిస్తాగా అనుభవం చేస్తారు. కావున ఇప్పుడు ఇక్కడి నుండి శాంతి మరియు సంతోష ఫరిస్తాలుగా అయ్యి వెళ్లండి. ఈ శాంతికుండానికి గల సదా అవినాశీ వరదానాన్ని జతలో ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా విషయం మీ ఎదురుగా వచ్చినట్లైతే ''మేరా బాబా(నా తండ్రీ)'' అని అన్నారంటే ఆ విషయం సహజమైపోతుంది.
సదా లేచిన వెంటనే ముందు తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడండి. అంతేకాక రోజులో కూడా మధ్య మధ్యలో తండ్రికి తోడుగా ఉన్నానా? అని మిమ్ములను మీరు చెక్ చేసుకోండి. రాత్రి తండ్రి జతలోనే నిదురించండి. ఒంటరిగా నిదురించకండి. అప్పుడు సదా తండ్రి తోడును అనుభవం చేస్తూ ఉంటారు. అందరికీ తండ్రి సందేశాన్ని ఇస్తూ ఉంటారు. మీరు చాలా సేవ చేయగలరు. ఎందుకంటే అందరికీ సంతోషం లభించాలి, శాంతి లభించాలి అన్న కోరిక ఉంది. హృదయంలోని కోరిక ఏదైతే ఉందో, దానితో ఏ కార్యం చేస్తారో, అందులో సఫలత లభించనే లభిస్తుంది. మంచిది. ఓంశాంతి.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.