రివైజ్ కోర్స్ మురళి 22-04-1984
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
విచిత్రమైన తండ్రి ద్వారా విచిత్రమైన చదువు మరియు విచిత్రమైన ప్రాప్తి
శ్రేష్టప్రాప్తికి అధికారిగా తయారు చేసేటువంటి సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు జ్ఞానస్వరూప పిల్లలతో మాట్లాడుతున్నారు :-
ఈ రోజు ఆత్మికతండ్రి తన యొక్క ఆత్మిక పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. ఆత్మికతండ్రి ప్రతి ఒక్క ఆత్మను చూస్తున్నారు, ప్రతి ఒక్కరిలో ఎంత ఆత్మికశక్తి నిండి ఉంది అని. ప్రతి ఒక్క ఆత్మ ఎంత సంతోష స్వరూపంగా అయ్యింది అని. ఆత్మికతండ్రి అవినాశి సంతోషం యొక్క ఖజానా పిల్లలకు జన్మసిద్ధ అధికార రూపంలో ఇచ్చారు. కనుక ప్రతి ఒక్కరు తమ వారసత్వాన్ని, అధికారాన్ని ఎంత వరకు జీవితంలో పొందారు అనేది చూస్తున్నారు. ఖజానాలకు పిల్లల నుండి యజమానులుగా అయ్యారు. బాబా దాత, పిల్లలందరికీ పూర్తి అధికారం ఇస్తున్నారు. కానీ ప్రతి ఒక్క బిడ్డ తమతమ ధారణ యొక్క శక్తిననుసరించి అధికారిగా అవుతుంది.
బాబాకి అయితే పిల్లలందరి పట్ల ఒకే శుభసంకల్పం ఉంది, ప్రతి ఆత్మ రూపి బిడ్డ సదా సర్వఖజానాలతో సంపన్నంగా, అనేక జన్మల కొరకు సంపూర్ణ వారసత్వానికి అధికారిగా అవ్వాలి అని. ఇలా ప్రాప్తిని పొందే ఉత్సాహ, ఉల్లాసాలలో ఉండే పిల్లలను చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు చిన్నవారు, పెద్దవారు, పిల్లలు, యువకులు, వృద్ధులు, మధురాతి మధురమైన మాతలు, చదువుకున్నవారు లేదా చదువుకోనివారు, శరీరంతో నిర్భలంగా ఉన్నప్పటికీ ఆ ఆత్మలు ఎంత శక్తిశాలి! ఒకే పరమాత్ముని యొక్క సంలగ్నత ఎంతగా ఉంది! మేము పరమాత్మ తండ్రిని తెలుసుకున్నాము అంటే అన్నీ తెలుసుకున్నాము అనే అనుభవం ఉంది.
బాప్ దాదా కూడా ఆవిధమైన ఆత్మలకు ఇదే వరదానం ఇస్తున్నారు - సంలగ్నతలో నిమగ్నమైన ఓ పిల్లలూ, సదా స్మృతిలో జీవిస్తూ ఉండండి, సుఖం, శాంతి యొక్క ప్రాప్తితో పాలింపబడుతూ ఉండండి, అవినాశి సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉండండి మరియు విశ్వాత్మల రూపీ మీ ఆత్మిక సోదరులకు సుఖం, శాంతి యొక్క సమజ సాధనాన్ని చెప్తూ వారికి కూడా ఆత్మికతండ్రి యొక్క ఆత్మిక వారసత్వానికి అధికారిగా చేయండి. ఈ ఒక పాఠమే అందరికీ చదివించండి. మనమందరం ఆత్మలం, ఒకే తండ్రి వారము, ఒకే పరివారానికి చెందిన వారము, ఒకే ఇంటిలో ఉండేవారము, ఒకే సృష్టిరంగస్థలంపై పాత్రను అభినయించేవారము, సర్వాత్మలైన మనందరి యొక్క స్వధర్మం ఒకటే, శాంతి మరియు పవిత్రత అంతే ఈ పాఠం ద్వారా స్వపరివర్తన మరియు విశ్వపరివర్తన చేస్తున్నారు మరియు నిశ్చితం అవ్వవలసిందే.
ఇది సహజమైన విషయం కదా! దీనిలో కష్టమేమీ లేదు. చదువుకోనివారు కూడా ఈ పాఠం ద్వారా జ్ఞానసాగరులుగా అయిపోయారు. ఎందుకంటే రచయిత బీజాన్ని తెలుసుకుని రచయిత ద్వారా రచనను స్వతహాగానే తెలుసుకుంటారు. అందరు జ్ఞానసాగరులుగా అయిపోయారు కదా! మొత్తం చదువుని రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని కేవలం మూడు మాటలలో చదువుకున్నారు. ఆత్మ, పరమాత్మ మరియు సృష్టిచక్రం. ఈ మూడు మాటల ద్వారా ఎలా తయారయ్యారు! ఏ సర్టిఫికెట్ లభించింది? బి.ఎ.ఎమ్.ఎ సర్టిఫికెట్ లభించలేదు. కానీ త్రికాలదర్శి జ్ఞానస్వరూపులు అనే బిరుదులైతే లభించాయి కదా! మరియు ఏమి సంపాదన లభించింది? ఏమి లభించింది? సత్యమైన శిక్షకుని ద్వారా అవినాశిగా జన్మజన్మల ప్రాప్తి గ్యారంటీగా లభిస్తుంది.
అక్కడి టీచర్ అయితే సదా సంపాదిస్తూ ఉంటారు లేదా ధనవంతులుగా ఉంటారు అని గ్యారంటీ ఇవ్వటంలేదు. వారు కేవలం చదివించి యోగ్యంగా తయారుచేస్తారు. పిల్లలైన మీకు లేదా భగవంతుని విద్యార్థులకు శిక్షకుడైన తండ్రి ద్వారా, వర్తమానం ఆధారంగా 21 జన్మలు సత్య, త్రేతాయుగాలలో సదా సుఖం, శాంతి, సంపత్తి, ఆనందం, ప్రేమ, సుఖదాయి పరివారం లభించాల్సిందే. లభిస్తుంది అని కూడా కాదు, లభించాల్సిందే. ఇది గ్యారంటీ. ఎందుకంటే అవినాశి తండ్రి, అవినాశి శిక్షకుడు. కనుక అవినాశి ద్వారా ప్రాప్తి కూడా అవినాశిగా లభిస్తుంది. ఇదే సంతోషం యొక్క పాట పాడుతున్నారు కదా, మాకు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుని ద్వారా సర్వప్రాప్తుల యొక్క అధికారం లభించింది అని. దీనినే విచిత్ర చదువు, విచిత్ర విద్యార్ధులు మరియు విచిత్ర చదువు లేదా విచిత్రమైన ప్రాప్తి అని అంటారు.
ఎవరు ఎంతగా చదువుకున్నా కానీ ఈ విచిత్ర తండ్రిని మరియు శిక్షకుని యొక్క చదువుని లేదా వారసత్వాన్ని తెలుసుకోలేరు. చిత్రాన్ని కూడా తీయలేరు. ఇక ఎలా తెలుసుకుంటారు! ఇంత ఉన్నతోన్నతమైన తండ్రి శిక్షకుడు మరియు ఎక్కడ చదివిస్తున్నారు మరియు ఎవరిని చదివిస్తున్నారు! ఎంత సాధారణమైనవారు! మానవుల నుండి దేవతలుగా తయారుచేసేటువంటి, సదాకాలికంగా చరిత్రవంతులుగా తయారుచేసే చదువు మరియు చదువుకునేవారు ఎవరు? ఎవరినైతే ఎవరూ చదివించలేరో వారిని బాబా చదివిస్తున్నారు. ప్రపంచం చదివించేవారినే బాబా కూడా చదివిస్తే గొప్ప విషయం ఏముంటుంది! నిరాశావాదులను ఆశావాదులుగా చేస్తున్నారు. అసంభవాన్ని సంభవం చేయిస్తున్నారు. అందువలనే నీ గతి, మతి నీకే తెలుసు అనే మహిమ ఉంది. బాప్ దాదా ఈ విధంగా నిరాశవాదుల నుండి ఆశావాదులుగా అయిన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. భలే వచ్చారు, బాబా ఇంటికి శృంగారమైన పిల్లలు వచ్చారు అని. మంచిది.
సదా స్వయాన్ని శ్రేష్టప్రాప్తికి అధికారిగా అనుభవం చేసుకునే శ్రేష్టాత్మలకు, ఒక జన్మలో అనేకజన్మల ప్రాప్తిని పొందే జ్ఞానస్వరూప పిల్లలకు, సదా ఒకే పాఠం చదువుకునే మరియు చదివించే శ్రేష్ట పిల్లలకు, సదా వరదాత బాబా యొక్క వరదానాలతో పాలింపబడే భాగ్యవాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.