రివైజ్ కోర్స్ మురళి 31-12-1984
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
క్రొత్త సంవత్సరంలో అవ్యక్త బాప్ దాదా యొక్క మహావాక్యాలు
నవయుగ పరివర్తకుడు, సదా కళ్యాణకారి శివబాబా మాట్లాడుతున్నారు :-
ఈ రోజు నలువైపుల ఉన్న పిల్లలు సాకారరూపంలో లేదా ఆకారరూపంలో క్రొత్తయుగం, క్రొత్త జ్ఞానం, క్రొత్త జీవితాన్ని ఇచ్చే బాప్ దాదాతో క్రొత్త సంవత్సరం జరుపుకునేటందుకు ఈ ఆత్మిక ఉన్నతమైన మరియు పవిత్రమైన క్రొత్త సభలో ఉపస్థితులై ఉన్నారు. బాప్ దాదా దగ్గరికి పిల్లలందరి మనస్సు యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు మరియు పరివర్తన చేసే ప్రతిజ్ఞల యొక్క శుభసంకల్పం, శుభభావనలు, శుభకామనలు చేరుకున్నాయి.
బాప్ దాదా కూడా క్రొత్త విశ్వం యొక్క నిర్మాతలకు, విశ్వపరివర్తక విశేషాత్మలకు సదా పాత ప్రపంచం యొక్క పాత సంస్కారాలు, పాతస్మృతులు, పాత వృత్తులు, పాత దేహం యొక్క స్మృతి యొక్క అభిమానం నుండి అతీతంగా ఉండే సర్వ పాతవిషయాలకు వీడ్కోలు ఇచ్చేవారికి సదాకాలికంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. జరిగిపోయిన దానికి బిందువుపెట్టి, స్వరాజ్యం యొక్క బిందువు పెట్టేవారికి స్వరాజ్యతిలకం యొక్క అభినందనలు ఇస్తున్నారు. పిల్లలందరికీ ఈ వీడ్కోలు యొక్క అభినందనలతో పాటు క్రొత్త సంవత్సరం యొక్క విశేషబహుమతి - సదా వెంట ఉండండి, సదా సమానంగా ఉండండి.
సదా హృదయసింహాసనాధికారి యొక్క శ్రేష్ట ఆత్మిక నషాలో ఉండండి. ఇదే వరదానం యొక్క బహుమతి ఇస్తున్నారు. ఈ మొత్తం సంవత్సరం ఇదే సమర్ధ స్మృతి ఉండాలి - వెంట ఉండి, బాబా సమానంగా ఉంటే స్వతహాగానే ప్రతి సంకల్పంలో వీడ్కోలు యొక్క అభినందనలను అనుభవం చేసుకుంటూ ఉంటారు. పాతవాటికి వీడ్కోలు ఇవ్వకపోతే నవీనత యొక్క అభినందనలను అనుభవం చేసుకోలేరు. అందువలనే ఎలా అయితే ఈ రోజు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తున్నారో అదేవిధంగా సంవత్సరంతో పాటు పాతవిషయాలు ఏవైతే చెప్పానో ఆ పాతవాటికి సదాకాలికంగా వీడ్కోలు ఇవ్వండి.
క్రొత్త యుగం, క్రొత్త బ్రాహ్మణుల సుందర ప్రపంచం, క్రొత్త సంబంధం, క్రొత్త పరివారం, క్రొత్త ప్రాప్తులు. అన్నీ క్రొత్తవే క్రొత్తవి. చూస్తున్నా కూడా ఆత్మిక దృష్టితో ఆత్మను చూస్తున్నారు. ఆత్మిక విషయాలనే ఆలోచిస్తున్నారు. కనుక అన్నీ క్రొత్తవి అయిపోయాయి కదా! రీతి క్రొత్తది, ప్రీతిక్రొత్తది అన్నీ క్రొత్తవే. కనుక సదా నవీనత యొక్క అభినందనలలో ఉండండి. దీనినే ఆత్మిక అభినందన అని అంటారు. కేవలం ఒక రోజు కొరకు కాదు కానీ సదా ఆత్మిక అభినందనలతో వృద్ధిని పొందుతూ ఉండండి.
బాప్ దాదా మరియు సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క అభినందనలు లేదా ఆత్మిక ఆశీర్వాదాలతో పాలింపబడుతున్నారు, నడుస్తున్నారు – ఇటువంటి క్రొత్త సంవత్సరం విశ్వంలో ఎవరూ జరుపుకోలేరు. వారు అల్పకాలికంగా జరుపుకుంటారు. మీరు అవినాశిగా, సదా జరుపుకుంటారు. మనుష్యాత్మలు మనుష్యలతోనే, శ్రేష్టాత్మలైన మీరు పరమాత్మ తండ్రితో జరుపుకుంటున్నారు. విదాత మరియు వరదాతతో జరుపుకుంటున్నారు. అందువలనే జరుపుకోవటం అంటే ఖజానాలతో, వరదానాలతో జరుపుకుంటారు.
సదాకాలికంగా జోలెను నింపుకోవటం. అందువలనే బాప్ దాదా తోనే జరుపుకుంటున్నారు కదా! వారు హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కానీ మీరు ఎవర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అంటారు. ఈరోజు సంతోషంగా మరియు రేపు దుఃఖం యొక్క ఘటనలు దు:ఖీగా చేయటంలేదు. ఎటువంటి దుఃఖం యొక్క ఘటన అయినా కానీ అటువంటి సమయంలో కూడా సుఖ, శాంతి స్వరూప స్థితి ద్వారా సర్వులకు సుఖ,శాంతి యొక్క కిరణాలు ఇచ్చే మాస్టర్ సుఖ సాగరులుగా అయ్యి దాత యొక్క పాత్రను అభినయిస్తున్నారు. అందువలనే ఘటన ప్రభావం నుండి అతీతం అయిపోతున్నారు. మరియు సదా సంతోషాన్ని సదా అనుభవం చేసుకుంటున్నారు.
ఈ సంవత్సరంలో నవీనత ఏమి చేస్తారు? కాన్ఫరెన్స్ చేస్తారు, మేళా చేస్తారు. ఇప్పుడు అందరు పాత ఆచారాలతో, పాత సడవడికలతో అలసిపోయారు. అందరు ఏదో క్రొత్తది కావాలి అనుకుంటున్నారు. ఏమి క్రొత్తదనం కావాలి, ఎలా ఉండాలి అనేది అర్ధం కావటంలేదు. ఇలా నవీనత యొక్క కోరిక పెట్టుకునే వారికి క్రొత్త జ్ఞానం ద్వారా క్రొత్త జీవితం ద్వారా నవీనత యొక్క మెరుపు అనుభవం చేయించండి.
ఇది మంచిది. అనేంత వరకు అర్ధం చేసుకుంటున్నారు కానీ క్రొత్తది. ఈ క్రొత్త జ్ఞానమే క్రొత్త యుగాన్ని తీసుకువస్తుంది అనే ఈ అనుభవం ఇప్పుడు గుప్తంగా ఉంది. అవ్వాలి అంటున్నారు వారి కోరికను పూర్తి చేయడానికి క్రొత్త జీవితం యొక్క ప్రత్యక్ష ఉదాహరణ వారి ఎదురుగా ప్రత్యక్ష రూపంలో తీసుకురండి. దీని ద్వారా వారికి క్రొత్త మెరుపు అనుభవం అవ్వాలి. కనుక క్రొత్త జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయండి. ప్రతి ఒక్కరికి బ్రాహ్మణ జీవితం ద్వారా క్రొత్తదనం అనుభవం అవ్వాలి అప్పుడే క్రొత్త ప్రపంచం యొక్క మెరుపు వారికి కనిపిస్తుంది.
ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా దానిలో లక్ష్యం పెట్టుకోండి అందరికీ నవీనత యొక్క అనుభవం అవ్వాలి. ఇక్కడ కూడా మంచి కార్యం జరుగుతుంది అనే రిమార్క్ కి బదులు ఈ క్రొత్త జ్ఞానమే క్రొత్త ప్రపంచాన్ని తీసుకువచ్చేది అని అనుభవం చేసుకోవాలి. అర్ధమైందా! క్రొత్త సృష్టి యొక్క స్థాపన యొక్క అనుభవం చేయించే అల వ్యాపింపచేయండి. క్రొత్త సృష్టి వచ్చేసింది. అంటే మనందరి శుభభావనలకు ఫలం లభించే సమయం వచ్చేసింది, ఇటువంటి ఉత్సాహ, ఉల్లాసాలు వారి మనస్సులో ఉత్పన్నం అవ్వాలి.
అందరి మనస్సులో నిరాశకు బదులు శుభ ఆశలదీపాన్ని వెలిగించండి. ఏదైనా ఉన్నతమైన రోజు జరుపుతున్నప్పుడు దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఈ రోజుల్లో అయితే రాయల్గా క్రొవ్వొత్తులు వచ్చేసాయి. అందరి మనస్సులో ఈ దీపాన్ని వెలిగించండి. ఇటువంటి క్రొత్త సంవత్సరం జరుపుకోండి. శ్రేష్టభావనలకు ఫలం అందరికీ ఇవ్వండి. మంచిది.
సదా సర్వులకు క్రొత్త జీవితం, క్రొత్తయుగం యొక్క మెరుపు చూపించేవారికి, క్రొత్త ఉత్సాహ ఉల్లాసాల యొక్క అభినందనలు ఇచ్చేవారికి, సర్వులను నదా సంతోషంగా తయారుచేసేవారికి, విశ్వానికి క్రొత్త రచన యొక్క అనుభవం చేయించేవారికి, ఇలా సర్వ శ్రేష్ట క్రొత్తయుగ పరివర్తకులకు, విశ్వ కళ్యాణకారి, సదా బాబా వెంట అనుభవం చేసుకునేవారికి, బాప్ దాదాకి సదా సహయోగి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.