రివైజ్ కోర్స్ మురళి 29-12-1989
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
చదువు యొక్క సారం రావటం మరియు వెళ్ళటం
ఈరోజు మురళీధరుడు అయిన బాబా తన మాస్టర్ మురళీధరులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ మురళీకి మరియు బాబాతో కలయిక కొరకు చాత్రకుల వలె ఉన్నారు. బ్రాహ్మణాత్మలు తప్ప మరెవ్వరూ ఇటువంటి చాత్రకులుగా ఉండరు. ఈ జ్ఞాన మురళీ మరియు పరమాత్మ కలయిక రెండూ అతీతం మరియు అతిప్రియమైనవి. ప్రపంచంలో అనేక ఆత్మలు పరమాత్మ కలయిక కోసం దాహంతో ఉన్నారు మరియు ఎదురుచూస్తున్నారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు ప్రపంచంలో ఒక మూలలో గుప్తరూపంలో మీ శ్రేష్ట భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఎందుకంటే దివ్యమైన బాబాని తెలుసుకోవాలన్నా, చూడాలన్నా దివ్యబుద్ధి మరియు దివ్యదృష్టి కావాలి.
వాటిని విశేష ఆత్మలైన మీకే బాబా ఇచ్చారు. అందువలన బాహ్మణాత్మలైన మీరే తెలుసుకోగలరు మరియు కలుసుకోగలరు. ఒక్క బిందువు కోసం దాహంతో ఉన్నాం అని ప్రపంచంలోని వారు పిలుస్తూ ఉంటారు. కానీ మీరు ఏమంటారు? మేము వారసత్వానికి అధికారులం అని అంటారు, ఎంత తేడా ఉంది? దాహంతో ఉన్నవారు ఎక్కడ మరియు అధికారులు ఎక్కడ? ఇప్పటికి కూడా అందరు అధికారిగా భావించి అధికారులుగానే వచ్చారు కదా! మేం మా తండ్రి ఇంటికి లేదా మా ఇంటికి మేము వచ్చాం అని మనస్సులో ఈ నషా ఉంది కదా. మేము ఆశ్రమానికి వచ్చాం. అని అనరు కదా! మీ ఇంటికి మీరు వచ్చారు అని అనుకుంటున్నారు కదా?
అధికారానికి గుర్తు అనుకోవటం. మీ తండ్రి దగ్గరకు వచ్చారు. మీ కుటుంబానికి వచ్చారు. అతిధులుగా రాలేదు. పిల్లలుగా మీ ఇంటికి మీరు వచ్చారు. నాలుగు రోజుల కోసం వచ్చినా కానీ మధువనం అంటే మీ స్థానానికి మీరు వచ్చారు. ఇలా రావాలి మరియు వెళ్ళాలి. బ్రాహ్మణులు అయిన మీ చదువు * యొక్క సారం లేదా మురళీధరుని మురళీ యొక్క సారం కేవలం రెండే రెండు మాటలు - • రావాలి మరియు వెళ్ళాలి. స్మృతియాత్రలో ఏ అభ్యాసం చేస్తారు? కర్మయోగి అంటే నేను అశరీరి ఆత్మను శరీరబంధన నుండి అతీతం, కర్మ చేయటానికి కర్మలోకి వస్తున్నాను, కర్మ అయిపోయిన తర్వాత కర్మసంబంధంతో అతీతం అయిపోతున్నాను.
ఇలా సంబంధంలో ఉంటున్నారు కానీ బంధనలో ఉండటం లేదు. అంటే ఇది ఏమైంది? కర్మ కోసం రావాలి, తిరిగి అతీతం అయిపోవాలి. కర్మబంధనకి వశమై కర్మలోకి రావటం లేదు కదా! కర్మేంద్రియాలను ఆధీనం చేసుకుని అధికారికంగా కర్మ చేయటం కోసం కర్మయోగి అవుతున్నారు. ఇంద్రియాలు కర్మకు వశీభూతం అవ్వటం లేదు. ఎవరైనా ఎవరికైనా వశం అయిపోతే వశం అయిన ఆత్మ బలహీనం అయిపోతుంది. యజమాని అయిన ఆత్మ ఎప్పుడూ ఎవరి ద్వారా బలహీనం అవ్వరు. తన స్వమానంలో గట్టిగా ఉంటారు. కొంతమంది పిల్లలు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఏదొక కర్మేంద్రియానికి వశం అయిపోతున్నారు.
అప్పుడు ఏమంటున్నారు? ఈరోజు కళ్ళు మోసం చేసేసాయి, ఈరోజు నోరు మోసం చేసేసింది, ఈరోజు దృష్టి మోసం చేసేసింది ఇలా పరవశం అవ్వటం అంటే మోసపోవటం, . మోసపోవడానికి గుర్తు దుఃఖాన్ని అనుభవం చేసుకోవటం. మోసపోవాలని అనుకోవటం లేదు, అనుకోనప్పటికీ మోసపోతున్నారు. దీనినే వశీభూతం అవ్వటం అని అంటారు. ప్రపంచంలోవారు. అయితే చక్రంలో పడిపోయారు అని అంటారు. అనుకోలేదు కానీ ఎలా పడిపోయామో తెలియదు. అంటారు. స్వదర్శనచక్రధారి ఆత్మ అయిన మీరు ఎవరి మోసపు చక్రాల్లో పడలేరు.
ఎందుకంటే.. స్వదర్శన చక్రం అనేక చక్రాల నుండి విడిపించేది. కేవలం మిమ్మల్నే కాదు, ఇతరులను కూడా విడిపించడానికి నిమిత్తమవుతుంది. అనేక రకాల దుఃఖాలు చక్రాల నుండి రక్షించుకోవడానికి ఈ సృష్టిచక్రం నుండే తొలగిపోతే బావుంటుంది అని అనుకుంటారు. కానీ సృష్టిచక్రంలో పాత్రను అభినయిస్తూ కూడా అనేక రకాల దుఃఖాలు చక్రాల నుండి ముక్తులై ముక్తి - జీవన్ముక్తి స్థితిని.. పొందవచ్చు అనేది ఎవరికీ తెలియదు. మీరు శపధం చేస్తున్నారు. - మేము మీకు జీవితంలో - డబల్ ముక్తిని ఇవ్వగలము అంటే జీవితం కూడా ఉంటుంది మరియు ముక్తి కూడా ఉంటుంది. అని శపథం చేశారు కదా!
జీవన్ముక్తి మా యొక్క మరియు మన యొక్క జన్మసిద్ధఅధికారం అని నషాగా చెప్తారు. కనుక స్వదర్శనచక్రధారి అంటే దుఃఖం యొక్క చక్రాల నుండి ముక్తులుగా ఉండేవారు మరియు ముక్తుల్ని చేసేవారే కానీ వశీభూతం అయ్యేవారు కాదు. అధికారి అయ్యి, యజమాని అయ్యి సర్వకర్మేంద్రియాలతో కర్మ చేయించేవారు. మోసపోయేవారు కాదు మరియు ఇతరులను కూడా మోసం నుండి తప్పించేవారు. ఈ అభ్యాసమే చేస్తున్నారు కదా! కర్మలోకి రావాలి మరియు తిరిగి అతీతం అయిపోవాలి. స్మృతి యొక్క అభ్యాసం ఏమిటి? రావటం మరియు వెళ్ళటం, చదువు అంటే జ్ఞానం యొక్క సారం ఏమిటి?
కర్మాతీతంగా అయ్యి వెళ్ళాలి మరియు తిరిగి రాజ్యం చేసే పాత్రను అభినయించేటందుకు మీ రాజ్యంలోకి రావాలి. జ్ఞానం యొక్క సారం ఇదే కదా! కనుక రావాలి మరియు వెళ్ళాలి ఇదే జ్ఞానం మరియు యోగం. ఈ అభ్యాసంలోనే రాత్రి పగలు ఉంటున్నారు. బుద్ధిలో ఇంటికి వెళ్ళాలనే మరియు రాజ్యంలోకి రావాలనే సంతోషం ఉంది. మధువనానికి అంటే మీ ఇంటికి రావడానికి ఎంత సంతోషంగా ఉంటుంది! టికెట్ బుక్ చేసుకున్న దగ్గర్నుండి వెళ్ళాలి, వెళ్ళాలి ఇదే బుద్ధిలో గుర్తు ఉంటుంది కదా! మధువన ఇంటి గురించి సంతోషంగా ఉంటే ఆత్మల ఇంటికి వెళ్ళాలనే సంతోషం కూడా ఉండాలి.
కానీ సంతోషంగా ఎవరు వెళ్ళగలరు. ఎవరికైతే సదా రావటం మరియు వెళ్ళటం యొక్క అభ్యాసం ఉంటుందో వారు వెళ్ళగలరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరి స్థితిలో స్థితులైపోండి. మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మయోగి అయిపోండి, ఈ అభ్యాసం చాలా పక్కాగా ఉండాలి. "అశరీరిగా కావాలనుకుంటే శరీరం యొక్క బంధన, కర్మ యొక్క బంధన, వ్యక్తుల యొక్క బంధ • వైభవాల యొక్క బంధన, స్వభావ సంస్కారాల యొక్క బంధన ఏదీ ఆకర్పించకూడదు. ఏ బంధ అయినా కానీ అది అశరీరిగా అవ్వనివ్వదు. ఎవరైనా బాగా బిగుతైన దుస్తులు వేసుకుంటే • ఉంటాయి.
అదేవిధంగా ఏ బంధన అయినా కానీ ఉంటే అది తన వైపుకి లాగుతూ ఉంటుంది. బంధన అనేది ఆత్మను బిగుతు చేసేస్తుంది. అందువలన నిర్లిప్తంగా అంటే అతీతం మరియు అతిప్రియం యొక్క అభ్యాసం చాలాకాలం నుండి కావాలి అని బాప్దాదా సదా చెప్తూ ఉంటారు. - జ్ఞానం వినటం మరియు వినిపించటం, సేవ చేయటం అనేవి వేరే విషయం కానీ ఈ అధ్యాసం * అతి ఆవశ్యకం. పాస్వత్అనర్గా అవ్వాలంటే ఈ అభ్యాసంలో పాస్ అవ్వటం చాలా అవసరం. • కనుక ఈ అభ్యాసంపై ధ్యాస పెట్టడంపై డబల్ అండర్లైన్ చేస్కోండి. అప్పుడే డబల్ లైట్ అయ్యి కర్మాతీతస్థితిని ప్రాప్తింప చేసుకుని డబల్ కిరీటధారిగా అవుతారు.
బ్రాహ్మణులుగా అయ్యాడు. బాబా వారసత్వానికి అధికారి అయ్యారు, ఈశ్వరీయ విధ్యార్థిగా అయ్యారు, జ్ఞాని ఆత్మగా అయ్యారు, విశ్వ సేవాధారిగా అయ్యారు ఈ భాగ్యం అయితే పొందేశారు కానీ ఇప్పుడు పాస్విత్అనర్ అయ్యేటందుకు, కర్మాతీతస్థితికి సమీపంగా వెళ్ళేటందుకు, బ్రహ్మాబాబా సమానంగా అతీతంగా, " అశరీరి అయ్యే అభ్యాసంపై విశేష ధ్యాస పెట్టండి. బ్రహ్మాబాబా సాకార జీవితంలో కర్మాతీతంగా అయ్యే ముందు అతీతం మరియు అతిప్రియ స్థితి యొక్క అనుభవాన్ని ప్రత్యక్షంగా చేయించారు.
పిల్లలందరు తమ అనుభవాలు వినిపిస్తుంటే అవి వింటూ కూడా అతీతంగా, కార్యం చేస్తూ కూడా, అతీతంగా, మాట్లాడుతూ కూడా అతీతంగా ఉండేవారు. సేవని లేదా ఏ కర్మని వదలలేదు కానీ అతీతం అయ్యి చివరి రోజు కూడా పిల్లల సేవను పూర్తి చేశారు. అతీతస్థితి అనేది ప్రతి కర్మలో సఫలతను సహజంగా అనుభవం చేయిస్తుంది. చేసి చూడండి. ఎవరికైనా అర్థం చేయించడానికి • ఒక గంట శ్రమ పడండి మరియు 15 ని॥లు వింటూ, మాట్లాడుతూ కూడా అతీత స్థితిలో స్థితులై ఇతరాత్మకు కూడా అతీత స్థితి యొక్క తరంగాలను ఇచ్చి చూడండి. ఆ 15 ని॥లలో వచ్చిన సఫలత ఒక గంట చెప్పిన దానికి రాదు.
ఈ అభ్యాసాన్ని బ్రహ్మాబాబా చేసి చూపించారు. ఏమి చేయాలో అర్ధమైందా? మొదట నిమిత్తులు టీచర్స్. తండ్రిని అనుసరిస్తారు కదా! సేవావిస్తారాన్ని ఎంతైనా కానీ పెంచండి కానీ విస్తారంలోకి వెళ్తూ సార స్థితి యొక్క అభ్యాసం తక్కువ కాకూడదు. విస్తారంలో సారాన్ని మర్చిపోకూడదు. తినండి, త్రాగండి, సేవ చేయండి కానీ అతీత స్థితిని మర్చిపోకండి. వాణి ద్వారా కూడా ఎంత వరకు సేవ చేస్తారు? ఎంతమందికి చేస్తారు? ఇప్పుడు ఆత్మిక తరంగాలను, అశరీరి స్థితి యొక్క తరంగాలను, అతీతం మరియు అతిప్రియ స్థితి యొక్క శక్తిశాలి తరంగాలను వాయుమండలంలో వ్యాపింపచేయండి. సేవ తీవ్రవేగంతో జరగడానికి కూడా సాధనం ఇదే.
ఇతరుల సేవ చేయడానికి ముందు స్వయం ఈ విధితో సంపన్నంగా ఉంటే సేవలో సిద్ధిని పొందగలరు. ఇప్పుడు వాణిలోకి రావటం అనేది సహజం అయిపోయింది. మరియు | • ఇష్టంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అభ్యాసం పక్కా అయిపోయింది. అదేవిధంగా ఈ అభ్యాసం కూడా సహజం అయిపోతుంది. ఈ సహజ అభ్యాసం ద్వారానే సంస్కారం లేదా ప్రకృతి మారుతుంది. మనుష్యాత్మల యొక్క సంస్కారం అయినా లేదా ప్రకృతి అయినా దీని ఆధారంగానే మారతాయి. అర్థమైందా? కష్టమనిపించటం లేదు కదా! ఉన్నతోన్నతమైన బాబాకి పిల్లలు. మరియు ఉన్నతోన్నత ప్రాప్తికి అధికారులు అయిన వారికి ఏ విషయం కష్టంగా అనిపించదు.
వాన పెట్టుకోవటం వస్తుంది కదా? లేక ఆందోళనపడటం వస్తుందా? ధ్యాస పెట్టుకోవటం నేది మీ నిజ సంస్కారం. ఆందోళనపడటం వస్తుంది అంటే ధ్యాస పెట్టుకోవటం అనేది కష్టమా? ఆందోళన పెట్టుకోవటం అనేది అలవాటు అయిపోయింది కదా! కానీ ధ్యాస పెట్టుకోవాలని ఆందోళన పడకండి. ధ్యాస అనేది సహజంగా ఉండాలి. కొంతమంది ధ్యాసను ఆందోళనగా మార్చేసుకుంటున్నారు. ధ్యాసను ధ్యాసగానే పెట్టుకోండి కానీ మార్చకండి. అతీత స్థితి అనేది ఆత్మ యొక్క స్వతహా అభ్యాసం. ఆత్మ అతీతంగా ఉండేది, అతీతంగా ఉంది మరియు అతీతంగానే ఉంటుంది. మోహం అనేది అతీతం కానివ్వటం లేదు.
ఆత్మ యొక్క స్వతహా సంస్కారం శరీరంతో అతీతం, వేరు. శరీరం అనేది ఆత్మ కాదు, ఆత్మ అనేది శరీరం కాదు అంటే అతీతమైనది. కదా! 63 జన్మల నుండి మోహం అనేది అలవాటు అయిపోయింది. స్వతహా సంస్కారం అనేది స్వతహాగానే ఉంటుంది. మంచిది. డబల్ విదేశీయులు కూడా చాలామంది వచ్చారు. క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేటందుకు అతిథులై వచ్చారా లేక పిల్లలుగా వచ్చారా? నాది అని అనిపిస్తుంది కదా! బాప్దాదా కూడా పిల్లలు తమ ఇంట్లో ఉండటం చూసి హర్షిస్తారు.
ఇంటికి అలంకారం పిల్లలే. పిల్లల కారణంగా మధువనం అలంకరించబడింది. అందువలన బాప్దాదా తన ఇంటి యొక్క అలంకారాన్ని చూసి సంతోషిస్తున్నారు. భారతవాసీయులు అయినా, విదేశీయులు అయినా ఇద్దరూ కూడా ఇంటికి అలంకారం. వచ్చినందుకు బాప్దాదా శుభాకాంక్షలు చెప్తున్నారు. వెళ్తున్నందుకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇక్కడకి రావటం కూడా మంచిది, వెళ్ళటం కూడా మంచిది. ఇది వీడ్కోలు కాదు, శుభాకాంక్షలే శుభాకాంక్షలు. వెళ్తుంటే కనుక సేవ యొక్క శుభాకాంక్షలు, ఇక్కడికి వస్తే కలయిక యొక్క శుభాకాంక్షలు. రెండింటికీ శుభాకాంక్షలు. మంచిది.
దేశ విదేశాలలో ఉన్న సదా అధికారి అయిన పిల్లలకు, సదా జ్ఞానం మరియు స్మృతి యొక్క సారంలో ఉండే శ్రేష్టాత్మలకు, సదా రావాలి మరియు వెళ్ళాలి అనే స్మృతితో సంపన్నంగా అయ్యే ఆత్మలకు, సదా బ్రహ్మాబాబాను అనుసరించే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకునే యోగి ఆత్మలకు, సదా నాది అనే అధికారం యొక్క సంతోషంలో ఉండేవారికి, సంతోషవంతమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్స్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.