రివైజ్ కోర్స్ మురళి 20-01-1990                                                 

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

‘‘ఎగిరే కళకు ఆధారము, ఉల్లాస-ఉత్సాహాలు అనే రెక్కలు’’

 ఈ రోజు పిల్లలందరి స్నేహ సంపన్న మిలన-భావన మరియు సంపూర్ణంగా అవ్వాలనే శ్రేష్ఠ కామన యొక్క శుభమైన ఉల్లాస-ఉత్సాహాల వైబ్రేషన్లను బాప్ దాదా చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో అందులో కూడా ఈ కల్పంలో మొదటిసారి కలిసిన పిల్లల ఉత్సాహం మరియు ఈ కల్పంలో అనేక సార్లు కలిసిన పిల్లల ఉత్సాహం ఎవరిది వారిదే. దీనినే మీరు మీ భాషలో - కొత్త పిల్లలు మరియు పాత పిల్లలు అని అంటారు. కానీ అందరూ అతి పాత కంటే పాతవారు ఎందుకంటే ఆ పాత గుర్తింపే తండ్రి వైపు, బ్రాహ్మణ పరివారం వైపు ఆకర్షితం చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇది కేవలం గుర్తు కోసం కొత్తవారు, పాతవారు అని చెప్పబడుతుంది.

కొత్త పిల్లల్లో కొంచెం సమయంలోనే చాలా ముందుకు ఎగురుతూ బాబా సమానంగా అయి చూపించాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. పాత పిల్లల్లో, బాప్ దాదా నుండి ఏదైతే పాలన లభించిందో, ఖజానా లభించిందో - దాని రిటర్న్ ను బాబా ముందు సదా పెడుతూ ఉండాలి అనే శ్రేష్ఠ సంకల్పం ఉంది. ఇరువురి ఉల్లాస-ఉత్సాహాలు శ్రేష్ఠంగా ఉన్నాయి. ఈ ఉల్లాస-ఉత్సాహాలే రెక్కలుగా అయి ఎగిరే కళ వైపుకు తీసుకువెళ్తున్నాయి. ఎగిరే కళకు జ్ఞాన-యోగాలనే రెక్కలు ఉండనే ఉన్నాయి కానీ ప్రత్యక్ష స్వరూపంలో పూర్తి దినచర్యలో ప్రతి సమయం, ప్రతి కర్మలో, ప్రతి రోజు కొత్త ఉల్లాస-ఉత్సాహాలు స్వతహాగానే ఉత్పన్నమవుతాయి.

ఉల్లాస-ఉత్సాహాలే ఎగిరే కళకు ఆధారము. ఎలాంటి కార్యమైనా, శుభ్రం చేసే పని గానీ, పాత్రలు కడిగే పని గానీ, కర్మ సాధారణంగా ఉన్నా, అందులో కూడా ఉల్లాస-ఉత్సాహాలు సహజంగా, నిరంతరంగా ఉంటాయి. జ్ఞానం యొక్క చదువును చదువుకొని ఇతరులను చదివించేటప్పుడు లేక స్మృతిలో కూర్చున్నప్పుడు, ఇతరులను స్మృతిలో కూర్చోబెట్టినప్పుడు లేక ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉన్నప్పుడు కేవలం ఆ సమయాలలో ఉల్లాస-ఉత్సాహాలు ఉండడము, సాధారణ కర్మ చేస్తున్నప్పుడు స్థితి కూడా సాధారణంగా అవ్వడము, ఉల్లాస-ఉత్సాహాలు కూడా సాధారణంగా అవ్వడము - ఇది ఎగిరే కళకు గుర్తు కాదు.

ఎగిరే కళలో ఉండే శ్రేష్ఠ ఆత్మల ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలు సదా ఎగురుతూనే ఉంటాయి. కనుక బాప్ దాదా పిల్లలందరి ఉల్లాస-ఉత్సాహాలను చూస్తున్నారు. రెక్కలైతే అందరికీ ఉన్నాయి కానీ అప్పుడప్పుడు ఉల్లాస-ఉత్సాహాలలో ఎగురుతూ-ఎగురుతూ అలసిపోతారు. ఏదో ఒక చిన్న-పెద్ద కారణం అనగా ఆటంకం వస్తుంది, అప్పుడప్పుడు ప్రేమతో దాటేస్తారు కానీ అప్పుడప్పుడు గాబరా పడతారు. దీనినే మీరు తికమకపడిపోతాము అని అంటారు, అందుకే సహజంగా దాటలేని కారణంగా అలసిపోతారు. కానీ కొద్ది-కొద్దిగా అలసిపోయినా లక్ష్యం శ్రేష్ఠంగా ఉంది, గమ్యం అతి ప్రియంగా అనిపిస్తుంది, అందుకే మళ్ళీ ఎగరడం ప్రారంభిస్తారు.

శ్రేష్ఠమైన లక్ష్యం, ప్రియమైన గమ్యం మరియు తండ్రి ప్రేమ యొక్క అనుభవం - ఇది అలసట ద్వారా కలిగిన కింద స్థితిలో ఆగిపోనివ్వవు, అందుకే మళ్ళీ ఎగరడం మొదలుపెడతారు. కనుక బాప్ దాదా పిల్లల ఈ ఆటను చూస్తూ ఉంటారు. అయినా కూడా తండ్రి ప్రేమ మిమ్మల్ని ఆగిపోనివ్వదు మరియు ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు, అందుకే ఆటంకం ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా మరియు చేస్తాయి కూడా. అప్పుడప్పుడు, చాలా కష్టము, దీని కన్నా ఎలా ఉండేవారమో అలాగే అయిపోతామని ఆలోచిస్తారు కానీ కోరుకున్నా కూడా గత జీవితంలోకి వెళ్ళే మజా రాదు ఎందుకంటే పరమాత్మ ప్రేమ మరియు దేహధారుల ప్రేమ - ఈ రెండింటి మధ్య తేడా ఎదురుగా ఉంది.

కనుక ఎగురుతూ-ఎగురుతూ ఎప్పుడైతే ఆగే కళలోకి వస్తారో, అప్పుడు రెండు మార్గాల మధ్యలో ఉంటారు మరియు ఆలోచిస్తారు - ఇటు వెళ్ళాలా లేక అటు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి? కానీ పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం తికమక నుండి స్పృహలోకి తీసుకొస్తుంది మరియు ఉల్లాస-ఉత్సాహాలు అనే రెక్కలు లభిస్తాయి. అందుకే ఆలోచించినా కూడా ఆగిపోయే కళ నుండి ఎగిరే కళలోకి ఎగురుతారు. విషయాలు చాలా చిన్న-చిన్నవి ఉంటాయి కానీ ఆ సమయంలో బలహీనంగా ఉన్న కారణంగా పెద్దవిగా అనిపిస్తాయి. ఎలాగైతే బలహీన శరీరం ఉన్నవారికి ఒక నీటి గ్లాసును ఎత్తడం కూడా కష్టమనిపిస్తుంది మరియు ఎవరైతే ధైర్యం కలవారు ఉంటారో, వారికి రెండు బకెట్లు ఎత్తడం కూడా ఆటలాగా అనిపిస్తుంది.

అదే విధంగా చిన్న విషయాన్ని పెద్దదిగా అనుభవం చేస్తారు. కనుక ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలు సదా ఎగిరిస్తూ ఉంటాయి. ప్రతి రోజూ అమృతవేళ, మొత్తం రోజంతటిలో ఏ స్మృతి ద్వారా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండాలో - ఆ వెరైటీ పాయింట్లను మీ ఎదురుగా ఇమర్జ్ చేసుకోండి. కేవలం ఒక్కటే పాయింటు, నేను జ్యోతిర్బిందువును, బాబా కూడా జ్యోతిర్బిందువే, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ రాజ్యంలోకి రావాలి - ఈ ఒక్క విషయం అప్పుడప్పుడు పిల్లలను విసుగు చెందేలా చేస్తుంది. తర్వాత ఏదో కొత్తది కావాలని ఆలోచిస్తారు. కానీ ప్రతి రోజూ మురళీలో ఉల్లాస-ఉత్సాహాల యొక్క భిన్న-భిన్న పాయింట్లు ఉంటాయి.

ఆ ఉల్లాస-ఉత్సాహాల యొక్క విశేషమైన పాయింట్లను తమ వద్ద నోట్ చేసుకోండి. చాలా పెద్ద లిస్ట్ తయారుచేయగలరు. డైరీలో కూడా నోట్ చేసుకోండి, బుద్ధిలో కూడా నోట్ చేసుకోండి. ఎప్పుడైతే బుద్ధిలో ఇమర్జ్ అవ్వదో, అప్పుడు డైరీ నుండి ఇమర్జ్ చేయండి మరియు వెరైటీ పాయింట్లు ప్రతి రోజు కొత్త ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతాయి. మనుష్యాత్మలకు వెరైటీ ఇష్టమనిపించే స్వభావం ఉంటుంది. అందుకే, కావాలంటే జ్ఞానం యొక్క పాయింట్లను మననం చేయండి లేక ఆత్మిక సంభాషణ చేయండి. రోజంతా బిందువును స్మృతి చేసినట్లయితే బోర్ అయిపోతారు (విసుగు చెందుతారు). కానీ తండ్రి కూడా బిందువు, మీరు కూడా బిందువు సంగమయుగంలో మీరు హీరో పాత్రధారులు కూడా, జీరోతో పాటు హీరో కూడా, కేవలం జీరో కాదు.

సంగమయుగంలో హీరో అయిన కారణంగా రోజంతటిలో వెరైటీ పాత్రను అభినయిస్తారు. జీరోనైన నాకు మొత్తం కల్పంలో ఏ-ఏ పాత్ర ఉంది మరియు ఈ సమయంలో ఏ హీరో పాత్ర ఉంది, ఎవరితో పాత్ర ఉంది, ఎంత సమయం మరియు ఏ పాత్రను అభినయించాలి, ఈ వెరైటీ రూపంలో జీరోగా అయి తమ హీరో పాత్ర యొక్క స్మృతిలో ఉండండి. స్మృతిలో కూడా వెరైటీ రూపంలో, ఒక్కోసారి బీజ రూప స్థితిలో ఉండండి, ఒక్కోసారి ఫరిశ్తా రూపంలో, ఒక్కోసారి ఆత్మిక సంభాషణ చేసే రూపంలో ఉండండి. ఒక్కోసారి తండ్రి నుండి లభించిన ఖజానాల ఒక్కొక్క రత్నాన్ని మీ ఎదురుగా తీసుకురండి. ఏ సమయంలో ఏది ఇష్టమనిపిస్తుందో, ఆ రీతిలో స్మృతి చేయండి.

ఏ సమయంలో, ఏ సంబంధంతో తండ్రి యొక్క మిలనం, తండ్రి యొక్క స్నేహం కావాలో, ఆ సంబంధంతో మిలనం జరుపుకోండి. అందుకే సర్వ సంబంధాలతో తండ్రి మిమ్మల్ని తమ వారిగా చేసుకున్నారు మరియు మీరు కూడా తండ్రిని సర్వ సంబంధాలతో తమ వారిగా చేసుకున్నారు. కేవలం ఒక్క సంబంధమే కాదు, వెరైటీ ఉంది కదా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి - తండ్రి తప్ప, తండ్రి యొక్క ప్రాప్తులు లేక తండ్రి యొక్క ఖజానాలు తప్ప ఇంకేదీ గుర్తు రాకూడదు. వెరైటీ ప్రాప్తులు, వెరైటీ ఖజానాలు, వెరైటీ సంబంధాలు, వెరైటీ సంతోషకరమైన విషయాలు - ఇవన్నీ ఉల్లాస-ఉత్సాహాల యొక్క విషయాలు. అదే విధితో ఉపయోగించండి.

తండ్రి మరియు మీరు - ఇదే రక్షణ రేఖ. ఈ రేఖ నుండి బయటకు రాకండి. అంతే, ఈ రేఖ పరమాత్మ ఛత్రఛాయ, ఎప్పటివరకైతే ఈ ఛత్రఛాయ లోపల ఉంటారో, అప్పటివరకు మాయకు ఎటువంటి ధైర్యం ఉండదు. తర్వాత శ్రమ అంటే ఏమిటి, ఆటంకం అంటే ఏమిటి, విఘ్నమంటే ఏమిటి - ఈ పదాలంటే ఏమిటో తెలియనివారిగా అవుతారు. ఎలాగైతే స్థాపన ఆది సమయంలో, సత్యయుగ ఆత్మలు ప్రవేశించినప్పుడు ఆ ఆత్మలకు వికారాలు అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి - ఈ పదాలంటే ఏమిటో తెలియనివారిగా ఉండేవారు. పిల్లలకు ఈ అనుభవం ఉంది కదా? పాతవారికైతే ఈ విషయాలు తెలుసు.

అలా ఎవరైతే తండ్రి మరియు నేను - ఈ స్మృతి అనే రేఖ యొక్క ఛత్ర ఛాయలో ఉంటారో, వారు ఈ విషయాలంటే ఏమిటో తెలియనివారిగా అవుతారు. అందుకే సదా సురక్షితంగా ఉంటారు, సదా తండ్రి హృదయంలో ఉంటారు. మీకు హృదయమంటే ఎక్కువ ఇష్టమనిపిస్తుంది కదా. బహుమతులు కూడా హృదయం ఆకారంలోనే తయారుచేసి తీసుకొస్తారు. కేక్ కూడా హృదయం లాగ తయారుచేస్తారు, బాక్స్ కూడా హృదయం లాగ తయారుచేస్తారు. కనుక ఉండడము కూడా హృదయంలోనే ఉంటారు కదా? తండ్రి యొక్క హృదయంలోనైతే మాయ రాలేదు. ఎలాగైతే అడవిని కూడా ప్రకాశింపజేసినప్పుడు, అడవికి రాజు అయిన సింహం కూడా రాలేదు, పారిపోతుంది.

తండ్రి యొక్క హృదయం కూడా ఎంత లైట్ (ప్రకాశం) మరియు మైట్ (శక్తి)గా ఉంది! దాని ఎదురుగా మాయ యొక్క ఏ రూపమూ రాలేదు. కనుక శ్రమ నుండి రక్షింపబడ్డారు కదా. జన్మ కూడా సహజంగానే జరిగింది, జన్మ తీసుకోవడంలో ఏమైనా శ్రమ అనిపించిందా? తండ్రి యొక్క పరిచయం లభించింది, గుర్తించారు, తండ్రి నా వారు, నేను తండ్రికి చెందినవాడిని అని సెకండులో అనుభవం చేసారు. జన్మ సహజంగా జరిగింది, భ్రమించే అవసరం పడలేదు. మీ దేశమనే ఇంట్లోకి తండ్రి పిల్లలను నిమిత్తంగా చేసి పంపించారు. వెతికాల్సిన లేక భ్రమించాల్సిన అవసరం రాలేదు. ఇంట్లో కూర్చునే తండ్రి లభించారు కదా.

ఇప్పుడైతే కలుసుకోవడానికి ప్రేమతో భారత్ లోకి వచ్చారు. కానీ పరిచయమైతే అక్కడే లభించింది, జన్మ కూడా అక్కడే లభించింది కదా? జన్మ కూడా అతి సహజంగా జరిగింది, పాలన కూడా అతి సహజమైనది. కేవలం అనుభవం చేయండి. మరియు వెళ్ళడం కూడా సహజంగానే వెళ్తారు. తండ్రితో పాటు వెళ్ళాలి కదా లేక మధ్యలో ధర్మరాజపురిలో ఆగాలా? అందరూ తోడుగా వెళ్ళేవారే కదా. అందరికీ ఈ దృఢ సంకల్పం ఉంది, కలిసి ఉన్నాము మరియు కలిసి వెళ్తాము మరియు ముందు కూడా బ్రహ్మా తండ్రితో పాటు రాజ్యంలోకి వెళ్తాము లేదా పాత్రలోకి వస్తాము, పక్కా సంకల్పం ఉంది కదా? నడుస్తూ-నడుస్తూ అలసిపోయినట్లయితే ఆగిపోతారు, అప్పుడేం చేస్తారు?

ఎందుకంటే తండ్రి అయితే ఆ సమయంలో ఆగరు, ఇప్పుడు ఆగుతున్నారు. ఇప్పుడు సమయమిచ్చారు, ఆ సమయంలో ఆగరు. ఆ సమయంలోనైతే సెకండులో ఎగురుతారు. ఇప్పుడు కొత్త-కొత్త పిల్లల కోసం లేట్ అయ్యింది కానీ టూ లేట్ యొక్క బోర్డు పెట్టలేదు. ఇప్పుడైతే కొత్త ప్రపంచం రావడం కోసం, కొత్త-కొత్త పిల్లల కోసం ఆగి ఉంది ఎందుకంటే వీరు కూడా ఆలస్యంగా వచ్చి వేగంగా వెళ్ళేవారిగా అవ్వాలి మరియు ఫస్ట్ నంబరు వరకు చేరుకోవాలి. అందరూ కలిసి వెళ్ళడం కోసం తయారుగా ఉన్నారు కదా? ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారి వచ్చారో, వారికి బాప్ దాదా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్న-చిన్న పిల్లల పైన పెద్దవారికి చాలా ప్రేమ ఉంటుంది.

కనుక తండ్రికి మరియు పెద్దవారైన సోదర-సోదరీలకు మీరంటే విశేషమైన ప్రేమ ఉంది. ప్రియమైనవారిగా అయిపోయారు కదా. కొత్త పిల్లలు ప్రియమైనవారు. కొత్తవారైనా గానీ, పాతవారైనా గానీ అందరి కోసం తీవ్ర గతితో ముందుకు వెళ్ళడం కోసం ఛత్ర ఛాయలో ఉండడము, సదా హృదయంలో ఉండడము, ఇదే అన్నింటికన్నా సహజమైన తీవ్ర గతి. తమను తాము ఎప్పుడూ బోర్ చేసుకోకండి (విసుగు చెందేలా చేసుకోకండి). సదా తమ కోసం వెరైటీ రూపంలో ఉల్లాస-ఉత్సాహాలను ఇమర్జ్ చేసుకోండి. డబల్ విదేశీయులు కొంతమంది అప్పుడప్పుడు ఇలా కూడా ఆలోచిస్తారు, మా కల్చర్ కు మరియు ఇండియా యొక్క కల్చర్ కు చాలా తేడా ఉంది.

 ఇండియన్ కల్చర్ అప్పుడప్పుడు ఇష్టమనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపించదు. కానీ ఇదైతే ఇండియన్ కల్చర్ కాదు, విదేశీయుల కల్చర్ కూడా కాదు. ఇదైతే బ్రాహ్మణ కల్చర్ ఉంది. బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు, ఈ పేరైతే అందరికీ ఇష్టమనిపిస్తుంది కదా? బ్రహ్మా తండ్రితో కూడా చాలా ప్రేమ ఉంది, బి.కె జీవితం కూడా అతి ప్రియమైనది. అప్పుడప్పుడు తెల్లని వస్త్రాలకు బదులుగా రంగు వస్త్రాలు గుర్తుకొస్తాయి ఎందుకంటే తెల్లని వస్త్రం తొందరగా మురికిగా అయిపోతుంది. ఆఫీసుకు వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా కూడా అటువంటి స్థానాలకు వెళ్ళినప్పుడు, ఏదైతే డ్రెస్ మీరు వేసుకుంటారో, దాని కోసం బాబా వద్దనరు.

కానీ ఈ వృత్తితో ధరించకండి, మాది విదేశీ కల్చర్, ఇదే నా పర్సనాలిటీ - ఈ రీతితో ధరించకండి. సేవా భావనతో ధరించండి, పర్సనాలిటీ యొక్క లక్ష్యంతో కాదు. బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఉండాలి. సేవ కోసం, ఆవశ్యకత కోసం ధరించినట్లయితే వద్దనరు. కానీ అది కూడా నిమిత్తంగా ఉన్న ఆత్మలతో వెరిఫై చేయించండి. బాప్ దాదా అయితే అనుమతినిచ్చారు, మీరు ఎందుకు వద్దంటున్నారు అని కాదు. అప్పుడప్పుడు చాలా నవ్వు వచ్చే మాటలు మాట్లాడుతారు. ఏవైతే మీకు అవసరం వచ్చే పదాలు ఉన్నాయో, వాటిని గుర్తుంచుకుంటారు కానీ వాటి వెనుక నియమం యొక్క విషయం ఏదైతే ఉంటుందో దానిని మర్చిపోతారు.

తెలివితేటలైతే బాప్ దాదాకు మంచిగా అనిపిస్తాయి కానీ తెలివితేటలు హద్దులో ఉండాలి, హద్దులు దాటరాదు. తినండి, తాగండి, ధరించండి, ఆడండి - కానీ హద్దులో. కనుక ఏ కల్చర్ అంటే ఇష్టము? ఏదైతే బ్రహ్మా తండ్రి యొక్క కల్చర్ ఉందో, అదే బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీల కల్చర్, ఇష్టమే కదా? వీరిలో ఒక మంచి విషయం ఉంది, అదేమిటంటే, స్పష్టంగా చెప్పేస్తారు. అందరూ ఒకేలాగ ఉండరు - కొందరు ఎలా ఉన్నారంటే తమ బలహీనతలను వర్ణిస్తారు కానీ నిలకడలేనివారిగా అయిపోతారు. నేను బలహీనుడిని అని పదే-పదే దీనినే స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా నాజూకుగా అవ్వకండి.

విశేషతలను మర్చిపోతారు, బలహీనతలను ఆలోచిస్తూ ఉంటారు, ఇలా చేయకండి. బలహీనతలను తప్పకుండా వినిపించండి కానీ ఎప్పుడైతే తండ్రికి ఇచ్చేసారో, ఇక అవి ఎవరి వద్ద ఉన్నాయి? నేను ఇలా ఉన్నాను అని మళ్ళీ ఎందుకు ఆలోచిస్తారు... తండ్రికి ఇచ్చేసారు కదా. బాప్ దాదాకు ఉత్తరం రాసి బలహీనతలను ఇచ్చేస్తారు లేక ఉత్తరం రాసి బాప్ దాదా గదిలో ఉంచుతారు, తర్వాత జవాబు అయితే లభించలేదని ఆలోచిస్తారు. బాప్ దాదా అలా జవాబు ఇవ్వరు. ఏదైతే బలహీనతను మీరు ఇచ్చేసారో, బాప్ దాదా వాటి స్థానంలో మీకు శక్తి, సంతోషం, ఉల్లాస-ఉత్సాహాలు నింపుతారు. కనుక ఏదైతే బాప్ దాదా ఇచ్చారో, అది తీసుకోరు, కేవలం జవాబు లభించలేదని ఆలోచిస్తారు.

ఏదైతే తండ్రి ఇస్తారో, వాటిని తీసుకోవడానికి ప్రయత్నించండి. జవాబు కోసం వేచి ఉండకండి - శక్తిని, సంతోషాన్ని తీసుకుంటూ ఉండండి. తర్వాత చూడండి, ఎంత మంచి ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో. ఏ క్షణంలోనైతే మీ బలహీనతలను రాస్తారో, లేక నిమిత్తంగా ఉన్న ఆత్మలకు వినిపిస్తారో, అప్పుడే ఇచ్చేసారు అంటే సమాప్తం అయినట్లు. ఇప్పుడు ఏం లభిస్తుందో, అది ఆలోచించండి. బాప్ దాదా వద్దకు ఒక్కొక్కరివి ఎన్ని ఉత్తరాలు వస్తాయి. బాప్ దాదా జవాబు ఇవ్వరు కానీ ఏది అవసరం ఉందో, ఏ లోపం ఉందో దానిని నింపేటువంటి రిటర్న్ ఇస్తారు. ఇకపోతే, ప్రియస్మృతులైతే రోజూ ఇస్తూనే ఉంటారు.

 ప్రియస్మృతులు లభించలేని రోజు ఏదైనా ఉందా? బాప్ దాదా అందరికీ రోజూ 2-3 పేజీల ఉత్తరం రాస్తారు. మురళీ ఇంత పెద్ద ఉత్తరం అయితే రోజూ ఎవ్వరూ ఎవ్వరికీ రాయరు. ఎంతగా మీ ప్రియమైనవారైనా కానీ, ఎవరైనా ఇంత పెద్ద ఉత్తరం రాసారా? మురళీ ఉత్తరం కదా. మీ విషయాలకు జవాబు ఉంటుంది కదా? కనుక ఇంత పెద్ద ఉత్తరాన్ని రాస్తూ కూడా, చెప్తూ కూడా, ఏదైతే మీరు విశేషంగా ఉత్తరం రాస్తారో, దానికి విశేషంగా బదులు కూడా ఇస్తారు ఎందుకంటే సికీలధే, ప్రియమైనవారు. బాప్ దాదా రిటర్న్ లో శక్తిని మరియు సంతోషాన్ని అదనంగా ఇస్తారు. కేవలం బుద్ధిని ఎల్లప్పుడూ అప్రమత్తంగా మరియు స్పష్టంగా పెట్టుకోండి.

ముందు కూడా వినిపించారు, ఆ విషయాలన్నీ బుద్ధి నుండి తొలగించండి. ఆ విషయాలను కూడా పెట్టుకొని ఉంచినట్లయితే, బుద్ధి స్పష్టంగా ఉండదు, అందుకే తండ్రి ఏదైతే రిటర్న్ ఇస్తారో, అది మిక్స్ అయిపోతుంది. అప్పుడప్పుడు మిస్ చేస్తారు, అప్పుడప్పుడు మిక్స్ చేస్తారు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు... ఈ రోజు మీ స్థితి గతులను వినిపిస్తున్నారు. కొంతమంది ఆలోచిస్తారు, సేవ అయితే చేస్తున్నాము కానీ తండ్రి యొక్క ప్రతిజ్ఞ ఉంది, నేను ఎల్లప్పుడూ సహాయకుడిని అని, ఈ సేవలో అయితే సహాయం చేయలేదు, సఫలత తక్కువ వెలువడింది, బాప్ దాదా ఎందుకు సహాయం చేయలేదు? అని. తర్వాత, బహుశా నేను యోగ్యుడిని కానేమో అని ఆలోచిస్తారు.

నేను సేవ చేయలేను, నేను బలహీనుడిని, వ్యర్థం ఆలోచిస్తారు, కానీ పిల్లలు ఎవరైనా ఒకవేళ సేవలో సహాయం కోసం తండ్రి ముందు సంకల్పం చేసినా, పెద్ద మనసుతో చేయండి. దీనికి రిటర్న్ గా బాప్ దాదా సేవా సమయంలో విశేషమైన సహాయం చేస్తారు. కేవలం ఒక విధిని తమదిగా చేసుకోండి. ఎంత కష్టమైన సేవ అయినా కానీ తండ్రికి సేవను కూడా బుద్ధి ద్వారా అర్పించండి. నేను చేసాను, సఫలత లభించలేదు. నేను, ఎక్కడి నుండి వచ్చింది, చేసేవారు చేయించేవారు అయిన తండ్రి యొక్క బాధ్యతను మర్చిపోయి తమ పైన ఎందుకు వేసుకుంటారు. ఈ తప్పు జరుగుతుంది. తండ్రి యొక్క సేవ ఉంది, తండ్రి తప్పకుండా చేస్తారు. తండ్రిని ముందు పెట్టండి, స్వయాన్ని ముందు పెట్టకండి. నేను చేసాను, ఈ నేను అనే పదం సఫలతను దూరం చేస్తుంది. అర్థమయ్యిందా. అచ్ఛా.

నలువైపులా ఉన్న సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగిరేటువంటి తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా తండ్రి హృదయంలో ఉండేటువంటి విశేషమైన మణులకు, సదా తండ్రి మరియు మీరు, ఈ స్మృతి యొక్క ఛత్ర ఛాయలో ఉండేటువంటి, సదా ఆగే కళను - దిగజారే కళను దాటి ఎగిరే కళలో ముందుకు వెళ్ళేవారు, సదా వెరైటీ పాయింట్లతో సంతోషంలో మరియు నషాలో ముందుకు తీసుకెళ్ళే శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

20-01-1990

 ‘‘బ్రహ్మాబాబా యొక్క విశేషమైన ఐదు అడుగులు’’

ఈ రోజు విశ్వ స్నేహీ అయిన తండ్రి తమ విశేషమైన, అతి స్నేహీ మరియు సమీప పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ స్నేహీలే కానీ ఎవరైతే ప్రతి అడుగులో ఫాలో చేస్తారో, వారే అతి స్నేహీ మరియు సమీపమైన పిల్లలు. నిరాకార తండ్రి, సాకార పిల్లలకు సాకార రూపంలో ఫాలో చేసేందుకు, సాకార బ్రహ్మాబాబాను పిల్లల ఎదురుగా నిమిత్తంగా పెట్టారు. ఈ ఆది ఆత్మ, డ్రామాలో 84 జన్మలను ఆది నుండి అంతిమం వరకు అనుభవించారు. సాకార రూపంలో మాధ్యమంగా అయి, పిల్లల ఎదురుగా సులభం చేసేందుకు ఉదాహరణగా అయ్యారు, ఎందుకంటే శక్తిశాలి ఉదాహరణను చూసి ఫాలో చేయడం సులభంగా ఉంటుంది. కావున స్నేహీ పిల్లల కోసం స్నేహానికి గుర్తుగా తండ్రి, బ్రహ్మాబాబాను ఉంచారు, మరియు పిల్లలందరికీ ఇదే శ్రేష్ఠమైన శ్రీమతాన్ని ఇచ్చారు - ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేయండి. అందరూ స్వయాన్ని ఫాలో ఫాదర్ చేసేటువంటి సమీప ఆత్మలుగా భావిస్తున్నారా? ఫాలో చేయడం సహజమనిపిస్తుందా లేక కష్టమనిపిస్తుందా? బ్రహ్మాబాబా యొక్క విశేషమైన అడుగులు ఏం చూసారు?

1- అన్నింటికన్నా మొదటి అడుగు - సర్వంశ త్యాగి. కేవలం తనువు ద్వారా మరియు లౌకిక సంబంధాల ద్వారానే కాదు, కానీ అన్నింటికన్నా పెద్ద త్యాగము, మొదటి త్యాగము మనసు-బుద్ధి ద్వారా సమర్పణ అనగా మనసు-బుద్ధిలో ప్రతి సమయము తండ్రి మరియు శ్రీమతం యొక్క స్మృతి ప్రతి కర్మలో ఉండేది. సదా స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ, ప్రతి కర్మలో అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు. దేహపు సంబంధాల నుండి, నాది అనే భావన యొక్క త్యాగము. ఎప్పుడైతే మనసు-బుద్ధి తండ్రి ఎదురుగా సమర్పణ అవుతాయో, అప్పుడు దేహపు సంబంధాలు స్వతహాగానే త్యాగమైపోతాయి. కావున మొదటి అడుగు - సర్వంశ త్యాగి.

2- రెండవ అడుగు - సదా ఆజ్ఞాకారిగా ఉన్నారు. ప్రతి సమయము, ప్రతి విషయంలో - స్వపురుషార్థంలో కావచ్చు, యజ్ఞపాలనలో కావచ్చు, నిమిత్తంగా అయ్యారు ఎందుకంటే డ్రామాలో విచిత్రమైన పాత్ర నిశ్చితమై ఉన్న ఒకే ఒక్క విశేష ఆత్మ బ్రహ్మా. ఒకే ఆత్మ మాత కూడా, పిత కూడా. యజ్ఞ-పాలనకు నిమిత్తంగా ఉంటూ కూడా సదా ఆజ్ఞాకారిగా ఉన్నారు. స్థాపనా కార్యము విశాలంగా ఉన్నా కూడా, ఏ ఆజ్ఞనూ ఉల్లంఘించలేదు. ప్రతి సమయము ‘‘జీ హాజిర్’’ (హాజరై ఉన్నానండీ) యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని సహజ రూపంలో చూసారు.

3- మూడవ అడుగు - ప్రతి సంకల్పంలోనూ విశ్వాసపాత్రులు. ఎలాగైతే పతివ్రతా నారి, ఒక్క పతిని తప్ప ఇంకెవ్వరినీ స్వప్నంలో కూడా స్మృతి చేయలేరో, అలా ప్రతి సమయము ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు - ఈ విశ్వాసపాత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూసారు. విశాలమైన కొత్త స్థాపన యొక్క బాధ్యతకు నిమిత్తంగా ఉంటూ కూడా, విశ్వాసపాత్రత యొక్క బలంతో, ఒకే బలం ఒకే విశ్వాసంతో ప్రత్యక్ష కర్మలలో ప్రతి పరిస్థితిని సహజంగా దాటారు మరియు దాటించారు.

4- నాల్గవ అడుగు - విశ్వ-సేవాధారి. సేవ యొక్క విశేషత ఏమిటంటే - ఒక వైపు అతి నిర్మానము, విశ్వ సేవాధారి; రెండవ వైపు జ్ఞానం యొక్క అథారిటీ. ఎంత నిర్మానమో, అంతే నిశ్చింత చక్రవర్తి. సత్యత యొక్క నిర్భయత - ఇదే సేవ యొక్క విశేషత. సంబంధీకులు, రాజ నేతలు, ధర్మ నేతలు కొత్త జ్ఞానం అయిన కారణంగా ఎంతగా అపోజిషన్ చేసారు (వ్యతిరేకించారు), కానీ సత్యత మరియు నిర్భయత యొక్క పొజిషన్ నుండి కొద్దిగా కూడా కదిలించలేకపోయారు. దీనిని నిర్మానత మరియు అథారిటీ యొక్క బ్యాలెన్స్ అని అంటారు. దీని ఫలితాన్ని మీరందరూ చూస్తున్నారు. నిందించినవారు కూడా మనసుతో ఎదురుగా తల వంచుతున్నారు. సేవలో సఫలతకు విశేష ఆధారము - నిర్మాన భావము, నిమిత్త భావము, అనంతమైన భావము. ఈ విధితోనే సిద్ధి స్వరూపంగా అయ్యారు.

5- ఐదవ అడుగు - కర్మ బంధన ముక్తులు, కర్మ సంబంధ ముక్తులు అనగా శరీరం యొక్క బంధనాల నుండి ముక్తులైన ఫరిశ్తా, అనగా కర్మాతీతము. సెకెండులో నష్టోమోహా స్మృతి స్వరూపము, సమీపము మరియు సమానము.

కావున ఈ రోజు విశేషంగా, సంక్షిప్తంలో ఐదు అడుగులు వినిపించాము. విస్తారమైతే చాలా ఉంది కానీ సార రూపంలో ఈ ఐదు అడుగులపై అడుగులు వేసేవారినే ఫాలో ఫాదర్ చేసేవారని అంటారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి - ఎన్ని అడుగులలో ఫాలో చేసారు? సమర్పితులయ్యారా లేక సర్వంశ సహితంగా సమర్పితులయ్యారా? సర్వ-వంశ అనగా సంకల్పంలో, స్వభావంలో మరియు సంస్కారంలో, నేచర్ లో కూడా తండ్రి సమానంగా ఉండాలి. ఒకవేళ ఇప్పటివరకు కూడా నడుస్తూ-నడుస్తూ - నా స్వభావం ఇలా ఉంది, నా నేచర్ ఇలా ఉంది, వద్దనుకున్నా కూడా సంకల్పాలు నడుస్తాయి, మాటలు వస్తాయి అని భావిస్తే మరియు ఇలా అంటూ ఉంటే, వారిని సర్వంశ త్యాగి అని అనరు. స్వయాన్ని సమర్పితులుగా చెప్పుకుంటారు కానీ సర్వంశ సమర్పణ - ఇందులో నాది-నీది అనేది అవుతుంది. ఏదైతే తండ్రి స్వభావమో, అదే స్వ యొక్క భావము అనగా ఆత్మిక భావము. సంస్కారాలు సదా తండ్రి సమానంగా స్నేహము, దయ, ఉదారచిత్తత కలవిగా ఉంటాయి, దానిని పెద్ద మనసు అని అంటారు. చిన్న మనసు అనగా హద్దులో నాది అనేది చూడడము - అది స్వయం పట్ల కావచ్చు, తమ సేవా స్థానాల పట్ల కావచ్చు, తమ సేవా సహచరుల పట్ల కావచ్చు. మరియు పెద్ద మనసు అంటే అందరూ నా వారిగా అనుభవమవ్వాలి. పెద్ద మనసున్న చోట సదా అన్ని రకాల కార్యాలలో - తనువు పరంగా కావచ్చు, మనసు పరంగా కావచ్చు, ధనం పరంగా కావచ్చు, సంబంధాల పరంగా కావచ్చు, సఫలత సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధిగా అనగా ఎక్కువ లాభం ఉంటుంది. మరియు చిన్న మనసు కలవారికి శ్రమ ఎక్కువ, సఫలత తక్కువ ఉంటుంది. ఇంతకుముందు కూడా వినిపించాము, చిన్న మనసు కలవారి యొక్క భండారము మరియు భండారా (వంటిల్లు) - సదా సమృద్ధిగా ఉండవు. సేవా సహచరులు చాలా భరోసా ఇస్తారు - మీరిది చేయండి, మేమిది చేస్తాము అని, కానీ సమయానికి పరిస్థితులను వినిపించడం మొదలుపెడతారు. దీనినే, పెద్ద మనసు ఉంటే పెద్ద సాహెబు రాజీ అవుతారు అని అంటారు. రాజయుక్తంగా ఉండేవారిపై సాహెబు సదా రాజీగా ఉంటారు. టీచర్లందరూ పెద్ద మనసు కలవారు కదా! అనంతమైన అతి పెద్ద కార్యార్థమే నిమిత్తులుగా ఉన్నారు. ఇలా అయితే అనరు కదా - మేము ఫలానా ఏరియా యొక్క కళ్యాణకారులము లేక ఫలానా దేశం యొక్క కళ్యాణకారులము అని? విశ్వ కళ్యాణకారులు కదా. ఇంత పెద్ద కార్యం కోసం మనసు కూడా పెద్దది కావాలి కదా? పెద్ద అనగా అనంతము. లేదా టీచర్లు, మాకు హద్దులు తయారుచేసి ఇచ్చారు అని అంటారా? హద్దులు కూడా ఎందుకు తయారు చేయబడ్డాయి, కారణమేమిటి? చిన్న మనసు. ఎంతగా ఏరియాలు చేసి ఇచ్చినా కానీ, మీరు సదా అనంతమైన భావాన్ని పెట్టుకోండి, మనసులో హద్దును పెట్టుకోకండి. స్థానంలోని హద్దు యొక్క ప్రభావం మనసుపై ఉండకూడదు. ఒకవేళ మనసులో హద్దు యొక్క ప్రభావం ఉన్నట్లయితే అనంతమైన తండ్రి హద్దు హృదయంలో ఉండలేరు. పెద్ద బాబా కావున మనసు పెద్దదై ఉండాలి కదా. ఎప్పుడైనా బ్రహ్మాబాబా మధుబన్ లో ఉంటూ ఈ సంకల్పం చేసారా - నాదైతే కేవలం మధుబన్ మాత్రమే, ఇక మిగతా పంజాబ్, యు.పి, కర్ణాటక మొదలైనవి పిల్లలవి అని? బ్రహ్మాబాబా పట్లనైతే అందరికీ ప్రేమ ఉంది కదా. ప్రేమకు అర్థము, ఫాలో చేయడము.

టీచర్లందరూ ఫాలో ఫాదర్ చేసేవారా లేక నా సెంటరు, నా జిజ్ఞాసువులు, నా సంపాదన అని భావిస్తున్నారా, మరియు విద్యార్థులు కూడా - వీరు మా టీచరు అని భావిస్తున్నారా? ఫాలో ఫాదర్ అనగా నాది అన్నదానిని నీదిలో ఇమడ్చడము, హద్దును అనంతంలో ఇమడ్చడము. ఇప్పుడు ఈ అడుగుపై అడుగు వేసే అవసరముంది. అందరి సంకల్పాలు, మాటలు మరియు సేవ యొక్క విధి అనంతమైనవిగా అనుభవమవ్వాలి. ఇప్పుడీ సంవత్సరం ఏం చేయాలి అని అంటారు కదా. కనుక స్వపరివర్తన కోసం హద్దును సర్వ-వంశ సహితంగా సమాప్తం చేయండి. ఎవరిని చూసినా లేక ఎవరు మిమ్మల్ని చూసినా, అనంతమైన చక్రవర్తి యొక్క నషా అనుభవమవ్వాలి. హద్దు మనసు కలవారు అనంతమైన చక్రవర్తిగా అవ్వలేరు. ఎన్ని సెంటర్లు తెరిస్తే లేక ఎంత ఎక్కువ సేవ చేస్తే, అంత పెద్ద రాజుగా అవుతారు అని అనుకోకండి. దీని ఆధారంగా స్వర్గం యొక్క ప్రైజ్ లభించదు. సేవ కూడా చేయాలి, సెంటర్లు కూడా ఉండాలి కానీ హద్దు యొక్క నామ-రూపాలు ఉండకూడదు. అటువంటివారికే నంబరువారుగా విశ్వ రాజ్య సింహాసనం ప్రాప్తి అవుతుంది. అందుకే ఇప్పుడిప్పుడే కొంత సమయం కోసం మీ మనసును సంతోషపరచుకుని కూర్చోకండి. అనంతమైన సుగంధం కలవారు ఇప్పుడు కూడా తండ్రికి సమానంగా మరియు సమీపంగా ఉన్నారు మరియు 21 జన్మలు కూడా, బ్రహ్మాబాబాకు సమీపంగా ఉంటారు. ఇటువంటి ప్రైజ్ కావాలా లేక ఇప్పటికి మాత్రమేనా? చాలా సెంటర్లు ఉన్నాయి, చాలా మంది జిజ్ఞాసువులు ఉన్నారు.... ఇలా చాలా-చాలా అనేదానిలోకి వెళ్ళకండి. పెద్ద మనసును అలవర్చుకోండి. విన్నారా, ఈ సంవత్సరం ఏం చేయాలో? ఈ సంవత్సరం స్వప్నంలో కూడా ఎవరిలోనూ హద్దు సంస్కారాలు ఉత్పన్నమవ్వకూడదు. ధైర్యముంది కదా? ఇతరులను ఫాలో చేయకండి, తండ్రిని ఫాలో చేయండి.

రెండవ విషయం - బాప్ దాదా వాణి పట్ల కూడా విశేషమైన అటెన్షన్ ఇప్పించారు. ఈ సంవత్సరం తమ మాటల పట్ల విశేషమైన డబల్ అటెన్షన్. అందరికీ మాటల కోసం డైరెక్షన్ పంపించడం జరిగింది. దీనికి ప్రైజ్ లభించనున్నది. సత్యతతో-స్వచ్ఛతతో తమ చార్టును స్వయమే పెట్టుకోండి. సత్యమైన తండ్రి యొక్క పిల్లలు కదా. బాప్ దాదా అందరికీ డైరెక్షన్ ఇస్తారు - ఎక్కడైతే సేవ అనేది స్థితిని కిందా-మీదా చేస్తుందో, ఆ సేవలో ఎటువంటి సఫలత లభించజాలదు. సేవను తగ్గిస్తే తగ్గించండి కానీ స్థితిని తగ్గించుకోకండి. ఏ సేవ అయితే స్థితిని కిందకు తీసుకొస్తుందో, దానిని సేవ అని ఎలా అంటారు! అందుకే బాప్ దాదా అందరికీ మళ్ళీ ఇదే చెప్తున్నారు - సదా స్వ-స్థితి మరియు సేవ అనగా స్వ-సేవ మరియు ఇతరుల సేవ, సదా రెండింటినీ కలిపి చేయండి. స్వ-సేవను విడిచి పరుల సేవ చేయడము, దీనితో సఫలత ప్రాప్తించదు. స్వ-సేవ మరియు పరుల సేవ చేయడానికి ధైర్యం పెట్టండి. సర్వశక్తివంతుడైన తండ్రి సహాయకునిగా ఉన్నారు, అందుకే ధైర్యంతో రెండింటి బ్యాలెన్స్ పెడుతూ ముందుకు వెళ్ళండి. బలహీనులుగా అవ్వకండి. అనేక సార్లు నిమిత్తులుగా అయిన విజయీ ఆత్మలు. ఇలాంటి విజయీ ఆత్మల కోసం ఏదీ కష్టం కాదు, ఏదీ శ్రమ కాదు. అటెన్షన్ మరియు అభ్యాసము - వీటిని కూడా సహజంగా మరియు స్వతహాగా అనుభవం చేస్తారు. అటెన్షన్ యొక్క టెన్షన్ కూడా పెట్టుకోకండి. కొంతమంది అటెన్షన్ ను టెన్షన్ లోకి మార్చేస్తారు. బ్రాహ్మణాత్మల నిజ సంస్కారము ‘‘అటెన్షన్ మరియు అభ్యాసము’’. అచ్ఛా!

ఇక మిగిలింది విశ్వ కళ్యాణ సేవ యొక్క విషయము. ఈ సంవత్సరం ప్రతి సేవా కేంద్రము, ఎంతమంది అయితే సందేశం అందినవారు మరియు సంపర్కం వారు ఉన్నారో, వారికి ఆహ్వానం అందించి యథా శక్తి స్నేహ మిలనం చేయండి. వర్గాల వారీగా చేసినా లేక కలిపి చేసినా కానీ ఆ ఆత్మల వైపు విశేషమైన అటెన్షన్ ఇవ్వండి. పర్సనల్ (వ్యక్తిగతం) గా కలవండి. కేవలం పోస్టును పంపించినట్లయితే దాని వలన రిజల్టు తక్కువే వస్తుంది. మీ వద్దకు వచ్చే విద్యార్థుల గ్రూపులు తయారుచేయండి మరియు వారిలో కొందరిని పర్సనల్ గా సమీపంగా తీసుకొచ్చేందుకు నిమిత్తం చేయండి. అప్పుడు విద్యార్థులు కూడా బిజీగా ఉంటారు మరియు సేవ యొక్క సెలెక్షన్ కూడా జరుగుతుంది. దీని గురించే మీరు ఫాలో అప్ చేయడం లేదు అని అంటారు. ఇటువంటి ఆత్మలకు కూడా వినిపించడానికి ఏదైనా కొత్త విషయం ఉండాలి. ఇప్పటివరకైతే బెటర్ వరల్డ్ ఎలా ఉంటుంది అన్నదానికి సంబంధించిన విజన్స్ ను సేకరించారు. ఇప్పుడిక వారికి మీ వైపుకు అటెన్షన్ ఇప్పించండి. వారి కోసం విశేషమైన టాపిక్ పెట్టండి - ‘‘స్వ ఉన్నతి’’ మరియు ‘‘స్వ ఉన్నతి యొక్క ఆధారము.’’ ఈ కొత్త టాపిక్ ను పెట్టండి. ఈ స్వ-ఉన్నతి కోసం ఆధ్యాత్మిక బడ్జెట్ ను తయారుచేయండి. బడ్జెట్ లో సదా పొదుపు యొక్క స్కీము తయారుచేయడం జరుగుతుంది. మరి ఆధ్యాత్మిక పొదుపు యొక్క ఖాతా ఏమిటి! సమయము, మాటలు, సంకల్పాలు మరియు శక్తిని వేస్ట్ నుండి బెస్ట్ లోకి ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అందరికీ ఇప్పుడు స్వ పట్ల అటెన్షన్ ఇప్పించండి. పిల్లలు ఈ టాపిక్ తీసారు - ‘‘ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్’’ (స్వ పరివర్తన కోసము). కానీ ఈ సంవత్సరం ప్రతి సేవా కేంద్రానికి ఫ్రీడమ్ ఉంది, ఎవరు ఎంత చేయగలరో, తమ స్వ ఉన్నతితో పాటుగా మొదట స్వయం యొక్క పొదుపు బడ్జెట్ ను తయారుచేయండి మరియు సేవలో ఇతరులకు ఈ విషయాన్ని అనుభవం చేయించండి. ఒకవేళ ఎవరైనా పెద్ద ప్రోగ్రామ్ లు పెట్టగలిగితే పెట్టండి, ఒకవేళ చేయలేకపోతే చిన్న ప్రోగ్రామ్ లు చేయండి. కానీ స్వ-సేవ మరియు పరుల సేవ యొక్క బ్యాలెన్స్ లేక విశ్వ సేవ యొక్క బ్యాలెన్స్ పట్ల విశేష అటెన్షన్ ఉండాలి. స్వ-ఉన్నతి కోసం సమయం లభించనంతగా సేవలో బిజీ అయిపోకండి. కనుక ఇది సేవ కోసం స్వతంత్ర సంవత్సరము. ఎంత కావాలనుకుంటే అంత చేయండి. రెండు ప్లాన్లను స్మృతిలో ఉంచుకొని వీటికి ఇంకా ఏమైనా కలపవచ్చు మరియు ప్లాన్లలో రత్నాలను పొదగవచ్చు. తండ్రి సదా పిల్లలను ముందుంచుతారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న సర్వ ఫాలో ఫాదర్ చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా డబల్ సేవ యొక్క బ్యాలెన్స్ పెట్టే తండ్రి బ్లెస్సింగ్స్ కు అధికారీ ఆత్మలకు, సదా అనంతమైన చక్రవర్తి - ఇటువంటి రాజయోగి, సహజయోగి, స్వతహా యోగి, సదా అనేక సార్లు విజయం యొక్క నిశ్చయం మరియు నషాలో ఉండేటువంటి అతి సహయోగీ, స్నేహీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము:- నేను ప్రతి కల్పం యొక్క పూజ్య ఆత్మను - ఇలా అనుభవం చేస్తున్నారా? అనేక సార్లు పూజ్యులుగా అయ్యారు మరియు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు! పూజ్య ఆత్మలుగా ఎందుకు అవుతారు? ఎందుకంటే ఎవరైతే స్వయం స్వమానంలో ఉంటారో, వారికి స్వతహాగానే ఇతరుల ద్వారా గౌరవం లభిస్తుంది. స్వమానాన్ని తెలుసుకున్నారా? ఎంత ఉన్నతమైన స్వమానము? ఎంత గొప్ప స్వమానం కలవారైనా కానీ, వారు మీ ముందు ఏమీ కాదు ఎందుకంటే వారి స్వమానం హద్దులోనిది మరియు మీది ఆత్మిక స్వమానము. ఆత్మ అవినాశీ కనుక స్వమానం కూడా అవినాశీ. వారికి దేహం యొక్క గౌరవముంది. దేహం వినాశీ కనుక స్వమానం కూడా వినాశీ. ఎప్పుడైనా ఎవరైనా ప్రెసిడెంటుగా లేక మినిస్టరుగా అయినా కానీ, శరీరం పోతే స్వమానం కూడా పోతుంది. అప్పుడిక ప్రెసిడెంటుగా ఉంటారా? మరి మీ స్వమానం ఏమిటి? శ్రేష్ఠ ఆత్మలు, పూజ్య ఆత్మలు. ఆత్మ స్మృతిలో ఉంటారు, అందుకే అవినాశీ స్వమానము. మీరు వినాశీ స్వమానం వైపు ఆకర్షితులవ్వజాలరు. అవినాశీ స్వమానం కలవారు పూజ్య ఆత్మలుగా అవుతారు. ఇప్పటివరకు మీ పూజను చూస్తూ ఉన్నారు. మీ పూజ్య స్వరూపాన్ని చూసినప్పుడు, ఇది మా రూపమే అని గుర్తుకొస్తుంది కదా. భక్తులు తమ తమ భావన అనుసారంగా రూపాన్ని ఇచ్చి ఉండవచ్చు కానీ నిజానికి పూజ్య ఆత్మలైతే మీరే. ఎంత స్వమానమో, మళ్ళీ అంతే నిర్మానము. స్వమానం యొక్క అభిమానము లేదు. మేము ఉన్నతంగా అయిపోయాము, ఇతరులు చిన్నవారు అని అనుకోవడము లేక వారి పట్ల ద్వేష భావన ఉండడము, ఇది జరగకూడదు. ఎలాంటి ఆత్మలనైనా సరే, దయా దృష్టితో చూస్తారు, అభిమానం యొక్క దృష్టితో కాదు. అభిమానమూ ఉండకూడదు, అవమానమూ ఉండకూడదు. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క నడవడిక కాదు. కనుక దృష్టి మారిపోయింది కదా! ఇప్పుడు జీవితమే మారిపోయింది కనుక దృష్టి అయితే స్వతహాగానే మారిపోయింది కదా! సృష్టి కూడా మారిపోయింది. ఇప్పుడు మీ సృష్టి ఏది! మీ సృష్టి లేక ప్రపంచం తండ్రే. తండ్రిలో పరివారం అయితే ఎలాగూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరిని చూసినా కానీ, ఆత్మిక దృష్టితో, ఉన్నతమైన దృష్టితో చూస్తారు. ఇప్పుడు శరీరం వైపు దృష్టి వెళ్ళజాలదు ఎందుకంటే దృష్టిలో లేక నయనాలలో సదా తండ్రి ఇమిడి ఉన్నారు. ఎవరి నయనాలలోనైతే తండ్రి ఉన్నారో, వారు దేహ భానంలోకి ఎలా రాగలరు? తండ్రి ఇమిడి ఉన్నారా లేక ఇముడుతూ ఉన్నారా? తండ్రి ఇమిడి ఉన్నారు అంటే ఇంకెవ్వరూ ఇమడలేరు. మామూలుగా కూడా బిందువు వలన నయనాల అద్భుతం ఉంటుంది. ఇదంతా చూడడము-చేయడము ఎవరు చేస్తారు? శరీరం పరంగా బిందువే కదా. చిన్న బిందువు అద్భుతం చేస్తుంది. కనుక దేహం పరంగా కూడా చిన్న బిందువు అద్భుతం చేస్తుంది మరియు ఆత్మిక పరంగా కూడా బిందువైన తండ్రి ఇమిడి ఉన్నారు, అందుకే ఇంకెవ్వరూ ఇమడలేరు. ఇలా భావిస్తున్నారా? పూజ్య ఆత్మలుగా అయ్యారన్నప్పుడు, పూజ్య ఆత్మల నయనాలను సదా నిర్మలంగా చూపిస్తారు. అభిమానం లేక అవమానం యొక్క నయనాలను చూపించరు. ఏ దేవీ లేక దేవతల నయనాలైనా నిర్మలంగా మరియు ఆత్మికంగా ఉంటాయి. మరి ఈ నయనాలు ఎవరివి? ఎప్పుడైనా ఎవరి పట్లనైనా ఏదైనా సంకల్పం వచ్చినా సరే, నేను ఎవరు అనేది గుర్తు చేసుకోండి. నా జడ చిత్రాలు కూడా ఆత్మిక నయనాలు కలవి అన్నప్పుడు చైతన్యంగా ఉన్న నేను ఎలా ఉన్నాను? మనుష్యులు ఇప్పటివరకు కూడా మీ మహిమను చేస్తూ, సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. మరి మీరు ఎవరు? సంపూర్ణ నిర్వికారులు కదా! అంశమాత్రం కూడా ఏ వికారము ఉండకూడదు. నా భక్తులు నన్ను ఈ రూపంలో గుర్తు చేసుకుంటున్నారని సదా ఈ స్మృతి ఉంచుకోండి. చెక్ చేసుకోండి - జడ చిత్రానికి మరియు చైతన్య-చరిత్రకు తేడా అయితే లేదు కదా? చరిత్రతో చిత్రాలు తయారయ్యాయి. సంగమంలో ప్రాక్టికల్ గా చరిత్రను చూపించారు, కావుననే చిత్రాలు తయారయ్యాయి. అచ్ఛా!

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

ఉన్నత భవ!