రివైజ్ కోర్స్ మురళి 23-12-1993
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
పవిత్రత యొక్క ధృడ వ్రతం ద్వారా వృత్తి యొక్క పరివర్తన
పవిత్రత యొక్క పునాదిని గట్టిగా చేసుకునే ప్రేరణను ఇచ్చే పరమపవిత్ర బాప్ దాదా అన్నారు -
ఈ రోజు ఉన్నతోన్నత బాబా తన మహాన్ పిల్లలందరినీ చూస్తున్నారు. మహాన్ ఆత్మలుగా అయితే పిల్లలందరూ అయ్యారు. ఎందుకంటే మహాన్గా అవ్వడానికి అన్నింటికంటే ముఖ్య ఆధారం అయిన పవిత్రతను ధారణ చేశారు. పవిత్రత యొక్క వ్రతాన్ని అందరూ ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేశారు. ఏరకమైన ధృడ సంకల్పం అనే వ్రతాన్ని తీసుకోవటం అంటే వృత్తిని మార్చుకోవటం. ధృడ వ్రతం వృత్తిని మార్చేస్తుంది. అందువలన భక్తిలో కూడా వ్రతం తీసుకుంటారు లేదా పెట్టుకుంటారు. వ్రతం తీసుకోవటం అంటే మనస్సులో సంకల్పం చేయటం.
వ్రతం పెట్టుకోవటం అంటే స్థూలంగా పత్యంగా ఉండటం, ఆహార పానీయాల విషయంలోనైనా, విహార వ్యవహారాలలో -అయినా కానీ రెండింటి లక్ష్యం ప్రతం ద్వారా వృత్తిని మార్చుకునేటందుకు పెట్టుకుంటారు. మీరందరు కూడా పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారు మరియు వృత్తిని శ్రేష్టంగా చేసుకున్నారు. సర్వాత్మల పట్ల ఏమి వృత్తి పెట్టుకున్నారు. ఆత్మలు, సోదరులు అని సోదరత్వ వృత్తి పెట్టుకున్నారు. ఈ వృత్తి ద్వారానే బ్రాహ్మణ మహానాత్మగా అయ్యారు. ఈ వ్రతం అయితే అందరికీ పక్కాయే కదా!
బ్రాహ్మణ జీవితం అంటేనే పవిత్ర ఆత్మగా ఉండటం. పవిత్రత అనేది బ్రాహ్మణ జీవితానికి పునాది. పునాది గట్టిగా ఉందా లేదా కదులుతుందా? ఈ పునాది సదా అచంచలంగా, స్థిరంగా ఉంచుకోవటమే బ్రాహ్మణ జీవితం యొక్క సుఖాన్ని పొందటం. ఒకొక్కసారి పిల్లలు బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ తమ సత్యమైన చార్టు ఇస్తూ ఏమంటున్నారు? అతీంద్రియ సుఖం లేదా శక్తులు ఎంతగా అనుభవం అవ్వాలో అంతగా అవ్వటం లేదు అంటున్నారు. లేదా మరోమాటలో ఏమంటున్నారంటే అనుభవం ఉంది కానీ సదా ఉండటం లేదు అంటున్నారు. దానికి కారణం ఏమిటి?
మాస్టర్ సర్వశక్తివంతులు అని అయితే అంటున్నారు, మాస్టర్ సర్వశక్తివంతులేనా అని అడిగితే ఏమంటారు? కాదు అని అయితే చెప్పరు కదా! అవును అనే అంటారు. మాస్టర్ సర్వశక్తివంతులు అయితే సర్వశక్తులూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? బ్రాహ్మణ జీవితం గల వారు, పేరుకి బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణ జీవితం గలవారు. మరయితే బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ సుఖశాంతులు అనుభూతి లేకుండా ఉంటే, సర్వప్రాప్తులతో సంపన్నంగా బ్రాహ్మణులు లేకపోతే బ్రాహ్మణులు తప్ప మరెవ్వరు ఉండగలరు? మరెవ్వరైనా ఉండగలరా? బ్రాహ్మణులే ఉండగలరు కదా!
మీరందరూ ఏమని సంతకం పెడతారు? బి.కె. ఫలానా, బి.కె. ఫలాని అని చేస్తారు కదా! పక్కాయే కదా! బి.కె. అంటే ఏమిటి? బ్రాహ్మణులు. ఇది బ్రాహ్మణుల పరిభాష, ఎంత ఉండాలో అంత లేదు అనే మాట ఎందుకు వస్తుంది? సుఖశాంతికి జనని పవిత్రత అని చెప్తున్నారు కదా! ఎప్పుడైనా అతీంద్రియ సుఖం లేదా మధుర శాంతి యొక్క అనుభూతి తక్కువ అవుతుంది అంటే దానికి కారణం పవిత్రత యొక్క పునాది బలహీనంగా ఉంది.
ఇంతకు ముందు కూడా చెప్పాను - పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యవ్రతమే కాదు, ఈ వ్రతం కూడా గొప్పది ఎందుకంటే ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా ఈ రోజుల్లో మహానాత్మలుగా పిలవబడేవారు కూడా కష్టంగానే కాదు అసంభవంగా భావిస్తున్నారు. అయితే మీరు అసంభవాన్ని ధృడసంకల్పం ద్వారా సంభవం చేశారు లేదా సహజంగా పాటించారు కనుక ఈ వ్రతాన్ని ధారణ చేయటం కూడా చిన్న విషయం కాదు. ఈ వ్రతాన్ని పాలన చేసే ఆత్మలకు బాప్ దాదా మనస్పూర్వక ఆశీర్వాదాల సహితంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. కానీ బాప్ దాదా ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డను సంపూర్ణంగా మరియు సంపన్నంగా చూడాలనుకుంటున్నారు.
ఎలా అయితే ఈ ముఖ్యవిషయాన్ని జీవితంలో ధారణ చేశారో, అసంభవాన్ని సహజంగా సంభవం చేసినప్పుడు ఇక సర్వ రకాల పవిత్రతను ధారణం చేయటం గొప్ప విషయమా! పవిత్రత యొక్క పరిభాష అందరికీ బాగా తెలుసు. పవిత్రత అంటే ఏమిటి? అనే విషయంపై ఉపన్యాసం చెప్పమంటే అందరూ బాగా చెప్తారు కదా! అంటే మీకు తెలుసు మరియు అంగీకరించారు కూడా మరలా ఎంత ఉండాలో అంత లేదు అనే మాట ఎందుకు వస్తుంది? సుఖం, శాంతి, శక్తి యొక్క అనుభూతి తక్కువ అవుతుంది అంటే ఏ రకమైన పవిత్రత బలహీనంగా ఉంది?
పవిత్రత యొక్క ఏదొక స్థితి అచంచలంగా లేదు, ఏ రకమైన పవిత్రత లోపంగా ఉందో పరిశీలించుకోండి. బాప్ దాదా పవిత్రత యొక్క రూపాలన్నింటినీ స్పష్టంగా చెప్పటం లేదు ఎందుకంటే అవన్నీ మీకు తెలుసు, చాలాసార్లు విన్నారు, మరియు చెప్తారు కూడా. పవిత్రత అంటే ఇది, అది అని మీలో మీరు కూడా అనుకుంటూ ఉంటారు. ఎక్కువమంది యొక్క ఫలితాన్ని చూస్తే ఏమి కనిపిస్తుంది? జ్ఞానం అయితే చాలా ఉంది. యోగం యొక్క విధి విధాతలుగా అయిపోయారు, ధారణ అనే విషయాన్ని వర్ణించడంలో కూడా చాలా తెలివైనవారు, సేవలో అయితే ఒకరికంటే ఒకరు ముందు ఇక మిగిలింది ఏమిటి?
నెంబర్వన్ జ్ఞాతగా అయితే అయిపోయారు కేవలం ఒక విషయంలో సోమరిగా అయిపోతున్నారు ఆ విషయం ఏమిటంటే వ్యర్థం ఆలోచించటం, చూడటం, మాట్లాడటం మరియు చేయటంలో ఒక్క సెకనులో బిందువు పెట్టి స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఈ విషయంలో బలహీనతయే సుఖం యొక్క అనుభూతిలో తేడా తీసుకువస్తుంది, శక్తిస్వరూపంగా అవ్వటంలో లేదా బాబా సమానంగా అవ్వటంలో విఘ్నంగా అవుతుంది అని అర్ధం చేసుకుంటున్నారు కానీ మరలా ఏమవుతుంది? స్వయాన్ని పరివర్తన చేసుకోలేకపోతున్నారు. బిందువు పెట్టలేకపోతున్నారు.
అవును, తెలుసు అని కామా (,) పెడుతున్నారు. లేదా ఇతరులను చూసి ఇలా కూడా జరుగుతుందా! అని ఆశ్చర్యార్థకం (!) కూడా పెడుతున్నారు. లేదా ఇలా అవ్వవచ్చా? అని ప్రశ్నార్ధకాలు (?) పెడుతున్నారు. ఎందుకు అనే వరుస పెడుతున్నారు. బిందు స్వరూపమైన బాబా మరియు బిందు స్వరూప ఆత్మ రెండూ స్మృతిలో ఉన్నప్పుడే బిందువు (.) పెట్టగలరు. ఈ స్మృతి బిందువు పెట్టడంలో సమర్థులుగా తయారు చేస్తుంది. ఆత్మిక స్థితిలో స్థితులు అవ్వాలి అని ఆ సమయంలో అనుకుంటున్నారు కానీ మాయ తన తెర ద్వారా ఆత్మకి బదులు వ్యక్తి లేదా విషయాలను మాటిమాటికి ఎదురుగా తీసుకువస్తుంది.
దీని వలన ఆత్మ దాగిపోతుంది మరియు మాటిమాటికీ వ్యక్తి మరియు విషయాలు స్పష్టంగా ఎదురుగా వస్తున్నాయి. కనుక ముఖ్య కారణం స్వయాన్ని అదుపులో పెట్టుకునే నియంత్రణాశక్తి తక్కువగా ఉంది. ఇతరులను అదుపు చేయటం బాగా వస్తుంది. కానీ స్వయంపై అదుపు అంటే పరివర్తనాశక్తిని ఉపయోగించటం తక్కువ వస్తుంది. బాప్ దాదా కొంతమంది పిల్లల మాటలకు నవ్వుకుంటున్నారు. స్వయం పరివర్తన కావలసిన లేదా సహించవలసిన లేదా ఇముడ్చుకునే సమయం వచ్చినప్పుడు ఏమంటున్నారు? నేనే చనిపోవాలా? నేనే మారాలా? నేనే సహించాలా అంటున్నారు.
కానీ ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారు అని ప్రజలు అంటారు కదా! నిజానికి అలా చనిపోతే స్వర్గానికి వెళ్ళరు కానీ ఇలా చనిపోతే స్వర్గంలో శ్రేష్ట పదవి లభిస్తుంది. ఇది చనిపోవటం కాదు, స్వర్గంలో స్వరాజ్యం పొందటం. అంటే చనిపోవటం మంచిదే కదా! లేక కష్టమా? నా పొరపాటు ఏమీ లేదు, వారిదే పొరపాటు అని ఆ సమయంలో కష్టంగా అనిపిస్తుంది కానీ తప్పుని ఒప్పుగా ఏవిధంగా చేయాలి నేను అనేది రావటం లేదు. పొరపాటుగా ఉన్న వారిని మార్చాలా లేక సరిగ్గా ఉన్న వారిని మార్చాలా?
ఎవరిని మార్చాలి? ఇద్దరూ మారాలి. మారటం అంటే ఆధ్యాత్మిక భాష ప్రకారం ముందుకి వెళ్ళటంగా భావించండి కానీ మారటంగా భావించకండి.
మారటం అంటే సరైన రూపంలో మారాలి కానీ తప్పుడు రూపంలో కాదు.
స్వయాన్ని మార్చుకునే శక్తి ఉందా? లేక ఏదో సమయంలో ఎలాగైనా పరివర్తన అయిపోతాం అని అనుకుంటున్నారా? పవిత్రత అంటే సదా సంకల్పం, మాట, కర్మ, సంబంధ సంపర్కాలలో మూడు బిందువుల యొక్క గొప్పతనాన్ని ఈ సమయంలో ధారణ చేయాలి. ఏదైనా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సెకనులో బిందువు పెట్టడంలో మొదట నేను పెట్టాలి అని స్వయాన్ని ముందు పెట్టుకోండి. ఇలా ముందు ఉండేవారికి మూడు రకాలైన ఆశీర్వాదాలు లభిస్తాయి.
1. స్వయానికి స్వయం ద్వారా లభించే ఆశీర్వాదాలు మరియు సంతోషం 2. బాబా ద్వారా 3. బ్రాహ్మణ పరివారంలోని శ్రేష్టాత్మల ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. అంటే ఇది చనిపోవటం అయ్యిందా లేక పొందటం అయ్యిందా? ఏమంటారు? పొందారు కదా! కనుక బిందువు పెట్టే పురుషార్ధాన్ని లేదా నియంత్రణాశక్తి ద్వారా పరివర్తనాశక్తిని తీవ్రవేగంతో పెంచుకోండి. ఇలా అవుతూనే ఉంటుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది అని సోమరితనంగా ఉండకండి. ఇవి సోమరితన సంకల్పాలు. సోమరితనాన్ని పరివర్తన చేసుకుని సంసిద్ధులు అవ్వండి. మంచిది.
నలువైపుల ఉన్న మహానాత్మలకు, సర్వ శ్రేష్ట పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసే ఆత్మలకు, సదా స్వయం సెకనులో బిందువు పెట్టే శ్రేష్ట పరివర్తక ఆత్మలకు, సదా స్వయాన్ని శ్రేష్ట కార్యానికి నిమిత్తం చేసుకునే అవకాశాన్నిచ్చే ఆత్మలకు, సదా మూడు బిందువుల యొక్క గొప్పతనాన్ని ప్రత్యక్షంలో ధారణ చేసి చూపించే బాబా సమాన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.