రివైజ్ కోర్స్ మురళి 03-04-1994
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
సంతుష్టతకు ఆధారం సంబంధం, సంపత్తి మరియు ఆరోగ్యం
సంతుష్ట స్థితి ద్వారా పరిస్థితులను పరివర్తన చేసుకునే విధిని చెప్పే బాప్దాదా తన సంతోషి పిల్లలతో మాట్లాడుతున్నారు
ఈరోజు మనోభిరాముడైన బాబా సదా సంతుష్టంగా ఉండేటువంటి తన సంతుష్ట ఆత్మలను లేదా సంతుష్టమణులను చూస్తున్నారు. ఈ ఆత్మిక మణుల యొక్క మెరుపు మొత్తం సభను మెరిపింపచేస్తుంది. సంతోషి ఆత్మలు స్వయానికి కూడా ప్రియం మరియు సర్వులకు కూడా ప్రియం మరియు బాబాకి కూడా ప్రియమైనవారే. అయితే ఇలా ఉన్నారు కదా? ఎందుకంటే ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అనే పేరే లేదు. సర్వప్రాప్తి సంపన్న ఆత్మలు! ఎక్కడ సర్వపాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత స్వతహాగా మరియు స్వాభావికంగా ఉంటుంది.
వారి స్వతహా స్వభావమే సంతోషం యొక్క స్వభావం మరియు సంతుష్టత యొక్క స్వరూపం లేదా స్వభావం, మీ నిజసంస్కారం ఎంత శ్రేష్టమైనదంటే అసంతుష్ట ఆత్మ యొక్క అనంతువ తరంగాలు, వాయుమండలాన్ని కూడా సంతోషం యొక్క వాయుమండలంలోకి మార్చేస్తుంది. ఈ సంగమయుగంలో బాప్దాదా యొక్క విశేష బహుమతి సంతుష్టత. సంతుష్టత అనే ఒక విశేషత మిగిలిన విశేషతలన్నింటినీ సహజంగానే మీ సమీపంగా తీసుకువస్తుంది. కానీ సదా సంతుష్టంగా ఉండాలి. పరిస్థితి ఎంత మారినా కానీ సంతుష్టతా స్థితిని పరిస్థితి మార్చలేదు. వర-స్థితియే మారేది.
కానీ స్వ సంతుష్ట స్థితి సదా ప్రగతిశీలంగా ఉంటుంది. ఎంత చలింపచేసే పరిస్థితి మీ ముందు వచ్చినా కానీ అది కీలుబొమ్మలాట (పపెట్ షో) చూస్తున్నట్లు అనిపిస్తుంది. అన్నీ ఉంటాయి కానీ అది కీలుబొమ్మ. మరయితే ఏ పరిస్థితి అయినా కీలుబొమ్మలాటగా ' అనిపిస్తుందా! ఈ రోజుల్లో కార్టూన్ షో ష్యాషన్ కదా! కార్టూన్ షో ఇష్టం అనిపిస్తుంది కదా! ఆ కార్టూన్ షోలో సింహం కూడా ఉంటుంది, పిల్లి కూడా ఉంటుంది కానీ అవన్నీ ఏమిటి? కార్టూన్లు. కధ అంతా ఉంటుంది కానీ అది కార్టూన్ కధ, నిజమైనది కాదు.
ఎప్పుడైనా, ఏదైనా పరిస్థితి వస్తే బేహద్ స్క్రీన్పై కార్టూనో జరుగుతుంది లేదా పపెట్తో జరుగుతుంది అనుకోండి. ఆ ఆటను చూసి అలజడి అవుతారా లేదా మనోరంజనం అనుభవం చేసుకుంటారా? షో చూడటం బావుంటుంది కదా! ఈ మాయ లేదా ప్రకృతి ఇది కూడా ఒక ఆట. ఈ ఆటని సదా సాక్షిస్థితిలో, మనదా సంతుష్టతా స్వరూపంలో చూస్తూ ఉండండి. నేను సంతుష్టమణిని, సంతోష ఆత్మను అని మీ గౌరవంలో ఉంటూ చూడండి. ఇది సంగమయుగి శ్రేష్ఠగౌరవం. గౌరవంలో స్థితులవ్వటం వస్తుంది కదా లేదా అలజడి అవ్వటం ఇష్టమనిపిస్తుందా?
సదా సంతుష్టత అనే విశేషతను ప్రత్యక్షరూపంలో స్మృతిలో ఉంచుకోండి. ప్రాప్తులలో విశేషంగా సంబంధం మరియు సంపత్తి అవసరం. సంబంధంలో కూడా ఒకవేళ ఒక సంబంధం అయినా అప్రాప్తిగా (లోటు) ఉంటే సంపూర్ణ సంతుష్టత ఉండదు. సంబంధంలో అన్ని సంబంధాలు ఉండాలి మరియు అవినాశిగా ఉండాలి. ఏ సంబంధం అయినా వినాశి అయితే అప్రాప్తి మరియు అసంతుష్టత స్వతహాగా ఉంటాయి. కానీ ఈ ఒక్క వర్తమాన సంగమ యుగంలోనే సర్వ అవినాశి సంబంధాలను ఒకే బాబాతో అనుభవం చేసుకోగలరు.
సత్యయుగంలో కూడా చాలా తక్కువ సంబంధాలు ఉంటాయి. - అన్నీ ఉండవు కానీ ఈ సమయంలో ఏ సంబంధం యొక్క ఆకర్షణ ఉంటే, ఏ అనుభూతిని చేసుకోవాలనుకుంటే ఆ సంబంధాన్ని పరమాత్మ ద్వారా అనుభవం చేసుకోగలరు. జీవితంలో ప్రతి ఒక్కరికీ వేర్వేరు సంబంధాలు ఇష్టమనిపిస్తాయి. కొంతమందికి తండ్రి సంబంధం అంత మంచిగా అనిపించదు, స్నేహితుని సంబంధం ఇష్టమనిపిస్తుంది. కానీ ఒకే సమయంలో మరియు ఒకని ద్వారానే సర్వ సంబంధాలు ప్రాప్తిస్తాయా? సర్వప్రాప్తులు లభించాయా లేదా ఏమైనా ఉంది. - పోయాయా? వెనుక కూర్చున్నవారు ఏమనుకుంటున్నారు? ఈరోజు క్రొత్తక్రొత్త వారికి ముందు కూర్చునే అవకాశం ఇచ్చారు. మంచిది,
ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి! భలే రండి, బాప్దాదా కూడా కోటానుకోట్ల స్నేహ సంపన్నంగా స్వాగతిస్తున్నారు. క్రొత్తవారు అయినప్పటికీ కల్పకల్పాలు అధికారులు ఇలా అనుకుంటున్నారా? బాప్దాదా సదా చెప్తారు - పెద్దవారు పెద్దవారే కానీ చిన్నవారు తండ్రితో సమానం. అందువలన సదా మీ ఆత్మిక బేహద్ సంపూర్ణ అధికారం యొక్క నిశ్చయం మరియు నషాలో ఉండండి. బేహద్ నషాలో ఉండాలి, హద్దు నషా కాదు. చూడండి, ఎంత శ్రేష్ట అధికారులు అంటే స్వయం సర్వశక్తివంతుడైన బాబాపై అధికారం పెట్టేశారు.
పరమాత్మ - అధికారి ఇంతకంటే ఉన్నత అధికారం ఇంకేదైనా ఉంటుందా! బీజం మీది అయినప్పుడు దానిలో వృక్షం అంతా ఇమిడే ఉంటుంది. సర్వసంబంధాల యొక్క అవినాశి అధికారం కూడా తీసుకున్నారు మరియు సంపత్తిలో కూడా ఒకవేళ స్థూలసంపత్తి ఉన్నా కూడా సదా సంతుష్టంగా ఉండలేరు. స్థూలసంపత్తితో పాటు సర్వగుణాల సంపత్తి, సర్వశక్తుల సంపత్తి మరియు శ్రేష్టసంపన్న జ్ఞాన సంపత్తి లేకపోతే సదా సంతుష్టంగా ఉండలేరు. కానీ మీ అందరి దగ్గర ఈ శ్రేష్టసంపత్తులు అన్నీ ఉన్నాయి.
సంపత్తివంతులు కదా? ప్రపంచం వారు కేవలం స్థూలసంపత్తి గలవారికి సంపత్తి భవ! అనే వరదానం ఇస్తారు కానీ మీ అందరికీ వరదాత బాబా సర్వశ్రేష్ట సంపత్తిభవ! అనే వరదానం ఇస్తున్నారు. మరయితే సంపత్తులన్నీ ఉన్నాయి కదా లేక ఏమైనా తక్కువగా ఉన్నాయా? పూర్తిగా ఉన్నాయా? వెనుక ఉన్నవారిపై అందరికంటే ఎక్కువ ధ్యాస ఉంది. ముందు వారికి బాబాపై ఎక్కువ ధ్యాస ఉంది మరియు బాబా యొక్క ధ్యాస వెనుక ఉన్నవారిపై ఎక్కువగా ఉంది. ఎంత దూరంలో ఉన్నారో అంతగా నయనాలలో ఇమిడి ఉన్నారు.
సాకారవతనంలో సాకార విషయాలు ఉంటాయి. పరంధామంలో ఆత్మలైన మీరందరు ఎంత సమీపంగా ఉంటారో చూడండి! అందరూ కలిసి ఉంటారు కదా మరియు సూక్ష్మవతనం కూడా ఎంత బేహద్ అంటే ఎవరు ఎంత సమీపంగా రావాలంటే అంత సమీపంగా రావచ్చు. కానీ పిల్లల స్నేహం నిరాకారి మరియు ఆకారిని కూడా సాకారిగా చేస్తుంది. బాబా ఏమంటారు?. అలాగే, చిత్తం ప్రభూ! అంటారు. పిల్లలు తండ్రికి కూడా యజమానులు కదా! యజమానిని ప్రభువు అని కూడా అంటారు మరియు పిల్లలను కూడా యజమాని అంటారు. మీరందరు "ఎవరు? సంతుష్టమణులు.
సంబంధంలో కూడా సంతుష్టం మరియు సంపత్తిలో కూడా సంతుష్టం. సంబంధం, సంపత్తి మరియు మూడవది స్వస్థత అనగా ఆరోగ్యం. మీరందరు ఆరోగ్యవంతులేనా అనారోగ్యంగా ఉన్నారా? ఆత్మ అయితే ఆరోగ్యంగా ఉంది కదా, శరీరం గురించి అయితే ఏమీ పర్వాలేదు, ఆత్మ సదా శక్తిశాలిగా ఉండాలి. సంగమయుగంలో శ్రేష్ట ఆరోగ్యం - ఆత్మ యొక్క ఆరోగ్యం. ఈ సమయంలోని ఆత్మ యొక్క ఆరోగ్యం జన్మజన్మలకు శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇప్పిస్తుంది. కానీ ఈ సమయంలో ప్రకృతి కూడా కొంచెం తన రూపం చూపిస్తుంది. ఇదేమీ గొప్ప విషయం కాదు.
ఇది కూడా కార్టూన్ షో, అయితే సర్వప్రాప్తులు ఉన్నాయి కదా!! సంబంధం కూడా, సంపత్తిభవ కూడా, సర్వసంబంధభవ కూడా మరియు సదా ఆరోగ్యవాన్ భవగా కూడా అయ్యారు. మూడు వరదానాలు వరదాత బాబా నుండి లభించాయి. కనుక వరదానాలను సమయానుసారంగా కార్యంలో ఉపయోగించండి. కేవలం వరదానం విని సంతోషపడిపోకండి - నాకు చాలా మంచి వరదానం వచ్చింది అని లేదా కేవలం నోట్ చేసుకుని ఉంచుకోవటం కూడా కాదు కానీ సమయానికి వరదానాన్ని కర్మలో ఉపయోగించటం ద్వారా వరదానం స్థిరంగా ఉంటుంది.
వరదానాలను సమయానుసారం కార్యంలో ఉపయో గించకపోతే వరదానం ఫలించదు. వరదానం అనేది అవినాశి తండ్రి ఇచ్చినది, కానీ వరదానాన్ని ఫలీభూతం చేయాలి. బీజం అయితే ఉంది కానీ దాని ద్వారా ఎన్ని ఫలాలు పొందుతారో అది మీ చేతుల్లో ఉంది. కొంతమంది కేవలం వరదానం యొక్క బీజాన్ని చూసి సంతోషపడిపోతూ ఉంటారు. చాలా మంచిది, చాలా మంచిది లభించింది అని కానీ ఫలదాయకంగా చేసుకోండి. మాటిమాటికి స్మృతి అనే నీరు ఇవ్వండి, పరదాన స్వరూపంలో స్థితులయ్యే ఎండను ఇవ్వండి, అప్పుడు చూడండి.
వరదానం సదా ఫలీభూతం అవుతూ ఉంటుంది మరియు మిగిలిన వరదానాలను కూడా వెంట తీసుకువస్తుంది. అప్పుడు వరదానాల ఫలస్వరూపంగా అయిపోతారు. ఈరోజు ఈ త్రి (మూడు) వరదానాలను ఫలీభూతం చేసుకోవాలి మరియు సమయానికి తప్పక స్మృతిలో ఉంచుకోవాలి. సమయానికి మర్చిపోతున్నారు, ఆ తర్వాత ఈ వరదానం అయితే ఉంది అని చదువుకుంటూ ఉంటున్నారు. వరదానాలను ఎంతగా సమయానికి కార్యంలో ఉపయోగిస్తారో అంత ఆ వరదానం మరింత శ్రేష్టస్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే అందరికీ వరదానం లభించింది కదా! మంచిది.
దూరంగా కూర్చున్నా మనస్సులో సమీపంగా ఉన్న నలువైపుల పిల్లలకు, నలువైపుల దేశ విదేశాలలో ఉన్న సంతోషి ఆత్మలందరికీ, సంతుష్టమణులకు, సర్వప్రాప్తి సంపన్న ఆత్మలకు, ఎవరైతే స్మృతి, కార్డులు, ఉత్తరాలు పంపారో వారందరికీ, విశేషంగా ఈరోజు గురించి పంపారో వారందరికీ విశేషంగా ఈనాటి యొక్క కోటానుకోట్ల ప్రియస్మృతులు స్వీకరించండి. దూరంగా కూర్చున్నా కానీ మనస్సులో జరుపుకుంటున్నా, నన్ముఖంగా జరుపుకుంటున్నా, కార్డులు లేదా ఉత్తరాలు మొదటే వతనానికి చేరుకుంటాయి. అందరి ఉత్తరాలు, కార్డులు మరియు శుభసంకల్పాల స్మృతి, శుభభావనల స్మృతికి బదులుగా బాప్దాదా విశేషంగా ప్రియసృతులు మరియు పిల్లల నుండి యజమానులుగా అయ్యేవారికి నమస్తే. మంచిది.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.