రివైజ్ కోర్స్ మురళి 14-04-1994                                        

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

స్నేహానికి బదులు ఇవ్వటం అంటే స్వయాన్ని పరివర్తన చేసుకోవటం.

శుభసంకల్పాల గొప్పతనాన్ని చెప్పే, స్నేహి మరియు శక్తిమూర్తి బాబాబా తన స్నేహి పిల్లలు సభను చూస్తూ మాట్లాడుతున్నారు ఈరోజు స్నేహ మరియు శక్తిమూర్తి  బాప్దాదా నలువైపుల ఉన్న తన స్నేహిపిల్లలను చూస్తున్నారు. సాకారంలో ఎంత పెద్ద సభ ఉందో దానికంటే పెద్ద సభ ఆకారి రూపంలో ఉంది. సాకార రూపధారి మరియు ఆకార రూపధారి పిల్లలందరు బాబా యొక్క స్నేహ బాహువులలో ఇమిడిపోయారు. స్నేహ భుజాలు ఎంత పెద్దవి నది సాగరంలో కలిసిపోయినట్లు నలువైపుల ఉన్న పిల్లలందరు స్నేహం భుజాలలో ఇమిడిపోయారు. స్నేహ భుజాలు మరియు స్నేహసాగరుడు బేహద్ పిల్లలందరు నెంబర్వారీగా ఉన్నా కానీ స్నేహంలో అందరూ బంధింపబడి ఉన్నారు.

పిల్లలందరిలో బాప్దాదా యొక్క స్నేహం ఇమిడి ఉంది. స్నేహశక్తి ద్వారానే అందరు ముందుకు ఎగురుతూ వెళ్తున్నారు. స్నేహం అనే విమానం పిల్లలందరినీ తనువు ద్వారా, మనస్సు ద్వారా హృదయం ద్వారా బాబాకి సమీపంగా తీసుకువచ్చింది. స్నేహం యొక్క విమానం వేగంగా సెకనులో బాబాకి సమీపంగా తీసుకువస్తుంది. జ్ఞానము, యోగము, ధారణ వీటిలో శక్తిననుసరించి నెంబర్వారీగా ఉన్నారు కానీ స్నేహంలో అందరు స్వయాన్ని నెంబర్ వన్ గా అనుభవం చేసుకుంటున్నారు. స్నేహం పిల్లలందరికీ బ్రాహ్మణజీవితం ప్రసాదించే ముఖ్య ఆధారం. నిరంతరయోగులేనా? నిరంతర జ్ఞానస్వరూపులేనా?  కాదు జ్ఞాన స్వరూపులేనా? అని అడిగితే. ఆలోచిస్తారు, అవును కానీ.... అంటారు.

నిరంతర ధారణా స్వరూపులేనా అని అడిగితే ఏమంటారు? -లక్ష్యం అయితే ఉంది కానీ నిరంతర స్నేహీలేనా? అని అడిగితే అవును అంటారు. స్నేహంలో అందరు పాస్ అయిపోయారు. కొందరు పాస్విత్అనర్ మరియు కొందరు పాస్, పాస్ అయిపోయారు కదా? డబల్ విదేశీయులు, భారతవాసీయులు అందరూ పాస్ అయిపోయారా? -పాస్ అవ్వకపోతే పాస్ అంటే సమీపంగా రాలేదు. సమీపంగా వచ్చారంటే పాస్ అయిపోయినట్లే స్నేహం అంటే సమీపంగా ఉండాలి మరియు పాస్ అవ్వాలి మరియు ప్రతి పరిస్థితిని చాలా సహజంగా దాటేయాలి. అందరు మూడింటిలో పాస్ అయిపోయారు కదా?

పాస్ చేయటం అంటే దాటటం కూడా సహజం కదా లేదా దాటడంలో అప్పుడప్పుడు కష్టంగా, అప్పుడప్పుడు సహజంగా అనుభవం చేసుకుంటున్నారా? సమీపంగా ఉండటంలో అయితే ఆనందమే ఆనందం మరియు దాటటంలో నెంబర్వారీగా ఉన్నారా లేదా నెంబర్ వన్ గా ఉన్నారా? నెంబర్ వన్ అనటంలేదు, నిశ్శబ్దం అయిపోయారు అంటే ఏదో ఉంది. కానీ సమయానుసారం స్నేహశక్తి ద్వారా దాటడం కూడా సమీపంగా ఉండటం ఎంత సహజమో అంత సహజంగా అవుతుంది మరియు అవ్వవలసించే మరియు ఎప్పుడైతే దాటడం సదా సహజం అయిపోతుందో అప్పుడు పాస్ అవ్వడం ఏమిటి, పాస్ అయ్యే తీరుతారు.

పాస్ అవ్వాల్సిందే ఇది పక్కా నిశ్చయం. కేవలం రిపీట్ చేయాలి. ఇంత స్థిర నిశ్చయం ఉంది కదా? దూరంగా ఉన్నా కానీ అందరూ సమీపమే. కదా! హృదయ సింహాసనంలో ఉన్నారు. కొందరు నయనజ్యోతులు, కొందరు హృదయ సింహాసనాధికారులు. అన్నింటికంటే సమీపమైనవి- నయనాలు మరియు హృదయం, మీరందరు ఓం శాంతి భవనంలో కూర్చోలేదు, బాప్దాదా యొక్క హృదయసింహాసనంపై లేదా నయనజ్యోతులుగా నయనాలలో ఇమిడి ఉన్నారు. ఇమిడి ఉన్నవారు ఎప్పుడూ దూరం అవ్వరు,

ఈ సంవత్సరం ఏమి చేస్తారు? ఈ సంవత్సరంలో ఇది అంతిమ కలయిక అని అనటం అయితే అంటారు కానీ అంత్యం, ఆది యొక్క స్మృతిని ఎక్కువ ఇప్పిస్తుంది. ఆది అనేది మధ్యను స్మృతి ఇప్పిస్తుంది కానీ అంత్యం ఆదిని స్మృతి ఇప్పిస్తుంది. కనుక ఇది అంత్యం కాదు, ఆది. తీవ్రవేగంతో ఎగరడానికి ఆది అనాది స్వరూపం అంటే ఆత్మ స్వరూపం అయితే అనాది "స్వరూపం యొక్క వేగం ఎంత? ఎంత తీవ్ర వేగం? ఈనాటి రకరకాల విజ్ఞానసాధనాల తీవ్ర వేగం కంటే తీవ్రవేగం. విజ్ఞాన సాధనాల యొక్క వేగాన్ని విజ్ఞానం ద్వారా తగ్గించవచ్చు మరియు పట్టుకోవచ్చు కానీ ఆత్మ యొక్క వేగాన్ని ఇప్పటి వరకు ఎవరు పట్టుకోలేకపోయారు మరియు పట్టుకోలేరు.

దీనిలోనే విజ్ఞానం ఫెయిల్ అయినట్లు భావిస్తారు. ఎక్కడ విజ్ఞానం ఫెయిల్ అయ్యిందో ' అక్కడ శాంతిశక్తి ద్వారా ఏది కావాలంటే అది చేయవచ్చు. ఆత్మశక్తి యొక్క విమానం యొక్క తీవ్రవేగాన్ని ఆరంభించండి. స్వ పరివర్తనలో లేదా ఎవరి వృత్తినైనా పరివర్తన చేయటంలో, వాయుమండలాన్ని పరివర్తన చేయటంలో, సంబంధ, సంపర్కాల పరివర్తనలో ఇప్పుడు తీవ్రవేగాన్ని తీసుకురండి. తీవ్రతకు గుర్తు ఆలోచించగానే అయిపోవాలి. ఆలోచించాను.... అయిపోతుంది... అని అనకూడదు. ఆలోచించగానే అయిపోవాలి, సంకల్పం, మాట మరియు కర్మ మూడూ వెనువెంట శ్రేష్టంగా ఉండాలి.

వ్యర్ధ లేదా వ్యతిరేక సంకల్పాలను పరిశీలిస్తే వాటి వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే సంకల్పం వస్తుంది, ఇప్పుడిప్పుడే మాట్లాడేశారు. ఇప్పుడిప్పుడే చేసేశారు కూడా! సంకల్పం, మాట, కర్మ మూడు కలిసి చాలా వేగంగా జరిగిపోతాయి. వారి వేగం యొక్క ఆవేశం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ ఆవేశంలో శ్రేష్ట సంకల్పం, కర్మ, మర్యాద, బ్రాహ్మణజీవితం యొక్క మహాసత యొక్క తెలివి సమాప్తి అయిపోతుంది. వ్యర్ధం యొక్క ఆవేశం - సత్యత యొక్క స్పృహను, యదార్థత యొక్క తెలివిని సమాప్తి చేసేస్తుంది. మరియు కొంచెం సమయం తర్వాత తెలివి వచ్చి చేయాలనుకోలేదు, యదార్ధం కాదు కానీ. - అని ఆలోచిస్తున్నారు.

కానీ ఆ సమయంలో ఆ ఆవేశంలో యదార్ధాన్ని గ్రహించకుండా అయదార్ధాన్ని యదార్ధంగా అనుభవం చేసుకుంటున్నారు. కనుక వ్యర్ధం యొక్క ఆవేశం తెలివిని సమాప్తి - చేసేస్తుంది. ఈ సంవత్సరం పిల్లలందరు విశేషంగా వ్యర్ధం నుండి అమాయకులు అవ్వండి. మీరు ఎప్పుడైతే సత్యయుగీ రాజ్యంలో ఉండేవారో అప్పుడు వ్యర్థం మరియు మాయతో అమాయకులుగా ఉండేవారు అందువలనే దేవతలను మహాన్ ఆత్మలు అని, సాధుస్వభావం కలిగినవారు అని అంటారు అటువంటి మీ ఆ సంస్కారాన్ని వెలుపలికి తీయండి. వ్యర్ధం యొక్క - అవిద్యా స్వరూపంగా అవ్వండి. సమయం, శ్వాస, మాట, కర్మ అన్నింటిలో వ్యర్ధం నుండి అవిద్య అంటే అమాయకులు అవ్వండి.

 ఎప్పుడైతే వ్యర్ధం నుండి అవిద్యాగా అవుతారో అప్పుడు దివ్యత " “స్వతహాగానే, సహజంగానే అనుభవం అవుతుంది మరియు అనుభవం చేయించగలరు. పురుషార్ధం అయితే చేస్తూనే ఉన్నాము..... అని ఇప్పటి వరకు ఇదే ఆలోచించకండి. పురుషుడు ఈ రధంపై సవారీ చేస్తున్నాడు అంటే పురుషుడిగా అయ్యి రథం ద్వారా చేయించాలి - దీనినే పురుషార్ధం అని అంటారు. పురుషార్ధం నడుస్తుంది అని అనటంకాదు కానీ పురుషార్ధి సదా ఎగురుతున్నారు. అనాలి. వారినే యదార్ధపురుషార్ధి అని అంటారు. పురుషార్ధం అంటే ఒకసారి చేసిన పొరపాటు మాటిమాటికి చేయమని అర్ధం కాదు ఇలా పురుషార్ధాన్ని మీ సాకుగా చేసుకోకండి.

యదార్ధ పురుషార్ధిగా ఉండాలి. స్వభావం కూడా స్వాభావికంగా, అతి సహజంగా ఉండాలి. ఇప్పుడు శ్రమను తొలగించుకోండి. అల్పకాలిక ఆధారాల తోడు, దీనిని వేరుగా పెట్టుకుని ఉంచాడు అల్పకాలిక తోడు యొక్క ఒద్దుని ఇప్పుడు వదిలేయండి. ఎప్పటి వరకు ఈ హద్దులు ఉంటాయి. అప్పటి వరకు బాబా యొక్క తోడు అనుభవం అవ్వదు. మరియు బాబా యొక్క తోడు లేనప్పుడే హద్దు యొక్క ఒడ్డులను ఆధారంగా చేసుకుంటున్నారు. మీ స్వభావ, సంస్కారాల యొక్క లేదా పరిస్థితుల యొక్క హద్దులు ఏవైతే తయారుచేసుకున్నారో అవన్నీ, అల్పకాలికంగా కనిపించేవర మోసం చేసేవి. మోసపోకండి.

బాబా యొక్క తోడు మీ ఛత్రఛాయ. అల్పకాలిక విషయాలు మోసపూరితమైనవి. మాయ యొక్క మధురాతి మధుర విషయాలు చాలా వింటూ ఉంటారు. చాలా విన్నారు కూడా! ఎలా అయితే ద్వాపరయుగంలో శాస్త్రాలు తయారుచేసేవారు చాలా తెలివైనవారు, ఎంత మధురాతి మధుర విషయాలు తయారుచేసారో కదా! విషయాలు తయారుచేయటంలో ఒకరికంటే ఒకరు తెలివైనవారు. విషయాలు తయారుచేయకండి, విషయాలు చూడకండి, విషయాలు చేయకండి. మరి ఏమి చేయాలి? బాబాని చూడండి, బాబా సమానంగా చేయండి, బాబా సమానంగా తయారవ్వండి.

ఏదైనా విషయం ఎదురుగా వస్తే విషయాలు తయారుచేయటం సెకనులో వస్తుంది ఎందుకంటే మాయ యొక్క వేగం కూడా తీవ్రంగా ఉంటుంది. కదా! ఎంత సుందరమైన విషయాలు తయారు చేస్తున్నారంటే అవి విని బాబాకి కూడా నవ్వు వస్తుంది మరియు ఇతరులు అయితే వాటికి ప్రభావితం అయిపోతున్నారు బాగా చెప్పారు, - చాలా బావుంది, సరైన విషయం అని ఇతరులకు మరియు స్వయానికి కూడా మంచిగా అనిపిస్తుంది. శ్రీ కానీ సమయం యొక్క తీవ్రవేగాన్ని చూసి ఇప్పుడు ఈ హద్దుల నుండి తీవ్ర వేగంతో ఎగిరిపోవాలి. ఈ అనేకరకాల విషయాలు వ్యర్థం యొక్క రోలేని తయారుచేస్తూ ఉంటాయి.

రోల్ఫై రోల్ తయారైపోతూ ఉంటుంది. అందువలన దీనితో అమాయకులు అవ్వండి. ఈ అమాయకస్థితి ద్వారా తయారైపోయిన సేవావేదిక మీ ఎదురుగా వస్తుంది. ఈ సంవత్సరం యొక్క యదార్థ పురుషార్ధానికి ప్రత్యక్షఫలానికి గుర్తు తయారుగా ఉన్న సేవ మీ ఎదురుగా వస్తుంది. వ్యర్థాన్ని ఎదుర్కోవడాన్ని సమాప్తి చేయండి అప్పుడు సేవా అవకాశం మీ ఎదురుగా వస్తుంది. మీరందరు అనేక సంవత్సరాలుగా సేవకు నిమిత్తం అయ్యారు, ఇప్పుడు ఇతరులను నిమిత్తంగా చేసే సేవకు నిమిత్తం అవ్వండి. వారు మైక్ మరియు మీరు మైట్. చాలా సమయం మీరు మైక్ అయ్యారు. ఇప్పుడు ఇతరులను మైక్ చేయండి, మీరు మైట్ అవ్వండి.

మీ మైట్తో మైక్ నిమిత్తం అవ్వాలి. దీనినే తీవ్రవేగవంత విమానం అని అంటారు. ఏమి చేయాలో అర్థమైందా? వేగవంతమైన విమానమే. కదా! లేక అప్పుడప్పుడు వేగంగా, అప్పుడప్పుడు నెమ్మదిగా నడుస్తుందా? సదా తీవ్ర వేగవంత విమానంలో ఎగురుతూ ఉంటారు. మేఘూలను చూసి భయపడకండి, ఈ విషయాలే మేఘాలు, వీటిని సెకనులో దాటేయండి. విధిని తెలుసుకోండి మరియు ఆ విధి ద్వారా సిద్ధిని పొందండి. ఒకవైపు మంత్రతంత్రాల శక్తి కానీ మీది విధిసంపన్న సిద్ధి శక్తి, మంత్రతంత్రాలు అల్పకాలికమైనవి. కానీ విధి ద్వారా సిద్ధి అనేది సదాకాలికం.

బాప్దాదా ఇప్పుడు ఈవిధమైన గ్రూపుని కోరుకుంటున్నారు - మనస్సులో, మాటలో, సంపర్కంలో సదా అర్జునుడిగా ఉండాలి. నేను ఏది చేస్తారో నన్ను చూసి ఇతరులు చేస్తారు (నేను అంటే దేహాభిమానంతో కూడినది కాదు, నేను అంటే నేను శ్రేష్టాత్మను) ఇలా ఎవరు చేస్తారో వారే అర్జునులు. మొదటి నెంబరు- అర్జునుడు అనే మహిమ ఉంది కదా! అర్జునులు అనగా అలౌకిక  జనులు. ఇటువంటి గ్రూపుని బాప్దాదా చూడాలనుకుంటున్నారు. విషయాలను చూడకండి. ఇతరులను చూడకండి, ఇతరుల వ్యర్థాన్ని వినకండి, కేవలం అలౌకికంగా ఉండాలి. సంకల్పం, మాట, కర్మ అన్నింటిలో అలౌకికత, దివ్యత యొక్క మెరుపు ఉండాలి.

అటువంటి వారినే అర్జునులు లేదా అలౌకిక జనులు అని అంటారు. ఇటువంటి గ్రూప్ని ఆ సంవత్సరం తయారుచేస్తారా లేదా. మరలా సంవత్సరం తయారుచేస్తారా? ఈ గ్రూప్లో రావాలి అనుకుంటున్నవారు చేతులెత్తండి! "నేను తయారవ్వాలి. నేను అర్జునుడిని అనేవారు. ఎంచేయము. అయిపోతుంది.. పరిస్థితులు అలాంటివి, సహాయం లభించడంలేదు. అశీర్వాదాలు లభించడంలేదు. తోడు లభించడంలేదు. అనే సమాచారం రాకూడదు. ఎవరికైతే కొంచెం సమయం కావాలో వారు చేతులు ఎత్తండి! ఒకటి, రెండు నెలలు కావాలా లేదా ఒక సంవత్సరం కావాలా? ఏ గ్రూప్ వచ్చినా వారిని అడిగి తర్వాత - ఫలితం చెప్పండి.

ముందు టీచర్స్, ఎందుకంటే ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారి సూక్ష్మ వాయుమండలం, తరంగాలు తప్పక వెళ్తాయి. కోటానుకోట్ల రెట్లు పుణ్యం కూడా లభిస్తుంది. మరియు కోటానుకోటి రెట్లు నిమిత్తంగా కూడా అవుతారు, మరే మాట లేదు కదా! టీచర్ గా అవ్వటం చాలా మంచిది. గద్దె లభిస్తుంది కదా! దాదీ, దీదీ అనే టైటిల్ కూడా లభిస్తుంది కదా! కానీ బాధ్యత కూడా అంతగానే ఉంటుంది. ఈ సంవత్సరంలో ఏదోక నవీనత చూపించండి. చేతులైతే చాలాసార్లు ఎత్తాము, ప్రతిజ్ఞలు కూడా చాలా సంవత్సరాల నుండి చేస్తున్నాము. అనుకోకండి, ఈవిధమైన సంకల్పాలు సూక్ష్మంగా కూడా రాకూడదు, ఇతరుల గురించి కూడా రాకూడదు.

 ఈ సంకల్పాలు కూడా ఢీలా చేస్తాయి. ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా అవుతూనే ఉంటుంది... ఈ తరంగాలు కూడా బలహీనం చేసేస్తాయి. ధృఢసంకల్పం చేయండి, ధృడత సఫలతను తప్పక తీసుకువస్తుంది. బలహీన సంకల్పాలను ఉత్పన్నం చేయకండి. వాటి పాలనలో చాలా సమయం వ్యర్ధం అయిపోతుంది. ఇవి చాలా త్వరగా ఉత్పన్నం అవుతాయి. ఒక సెకనులో వంద పుడతాయి అప్పుడు వాటిని పాలన చేయటంలో ఎంత సమయం పడుతుంది! తొలగించు కోవడానికి శ్రమించవలసి వస్తుంది కూడా మరియు సమయం కూడా పడుతుంది. మరియు బాప్దాదా యొక్క వరదానం లేదా ఆశీర్వాదాల నుండి కూడా వంచితం అయిపోతారు.

శుద్ధసంకల్పాలతో ఎలా బంధించాలి లేదా ఆక్రమించాలి అంటే అది అందరి కొరకు ఒక చత్రఛాయ అవ్వాలి. ఎవరైనా కొద్దిగా బలహీనంగా ఉన్నా వారి కొరకు కూడా ఈ శుద్ధ సంకల్పాల ఆక్రమణ చత్రఛాయ వలె అవ్వాలి, రక్షణా సాధనం అవ్వాలి, కోట అవ్వాలి. శుద్ధసంకల్పాల శక్తిని ఇప్పుడు తక్కువగా గ్రహించారు. ఒక శుద్ధ లేదా శ్రేష్ట శక్తిశాలి సంకల్పం ఎంత అద్భుతం చేయగలదో ఆ అనుభూతిని ఈ సంవత్సరంలో చేసుకుని చూడండి. అభ్యాసం మొదట్లో యుద్ధం జరుగుతుంది, వ్యర్ధసంకల్పం, శుద్ధసంకల్పాన్ని కట్ చేస్తుంది. ఎలా అయితే కౌరవులు, పాండవుల బాణాలతో యుద్ధాన్ని చూపిస్తారు కదా!

ఒక బాణం మరో బాణాన్ని దారిలోనే సమాప్తి చేసేస్తుంది, అలాగే సంకల్పం, సంకల్పాన్ని సమాప్తి చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు చేస్తుంది కానీ దృఢసంకల్పం, ఉన్నవారికి తోడు బాబా. వారికి విజయీ తిలకం సదా ఉంటుంది. ఇప్పుడు దీనిని ప్రత్యక్షం చేయండి అప్పుడు వ్యర్ధం స్వతహాగా గుప్తం అయిపోతుంది. వ్యర్థానికి సమయం ఇస్తున్నారు. ' కట్ చేయటంలేదు కానీ దాని రంగులోకి వచ్చేస్తున్నారు. సెకను కంటే తక్కువ సమయంలో కట్ చేయండి.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

ఎవరెడీ భవ!