రివైజ్ కోర్స్ మురళి 15-12-2002                                        

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

సమయ ప్రమాణంగా లక్ష్యం మరియు లక్షణాల యొక్క సమానత ద్వారా బాబా సమానంగా అవ్వండి

ఈరోజు  బాప్దాదా నలువైపుల ఉన్న సర్వ స్వమానధారి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఈ సంగమయుగంలో పిల్లలైన మీకు లభించే స్వమానం కంటే ఉన్నతమైన స్వమానం మొత్తం కల్పంలో ఏ ఆత్మకి లభించదు. ఎంత ఉన్నతమైన స్వమానమో తెలుసా? స్వమానం యొక్క నషా ఎంత ఉన్నతమైనదో స్మృతిలో ఉంటుందా? స్వమానాల మాల చాలా పెద్దదికి ఒకొక్క పూస పాయింట్) లెక్క పెట్టుకుంటూ వెళ్ళండి మరియు స్వమానం యొక్క నషాలో లవలీనం అవ్వండి. ఈ స్వమానం అంటే టైటిల్స్, స్వయంగా బాబా ద్వారా లభించాయి. పరమాత్మ ద్వారా స్వమానం: లభించింది.

అందువలనే ఈ స్వమానం యొక్క ఆత్మిక నషాని చలింపచేసే శక్తి ఏదీ లేదు, ఎందుకంటే సర్వశక్తివంతుని ద్వారా ఈ అధికారం ప్రాప్తించింది. ఈరోజు  బాప్దాదా అమృతవేళ మొత్తం విశ్వం తిరుగుతూ ప్రతి పిల్లవాని యొక్క స్మృతిలో స్వమానం యొక్క మాలలు ఎన్ని ఉన్నాయి అని పిల్లలందరినీ చూశారు. మాలను ధారణ చేయటం అంటే స్మృతి ద్వారా ఆ స్థితిలో స్థితులవ్వటం. కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - ఈ విధమైన స్మృతితో కూడిన స్థితి ఎంతవరకు ఉంటుంది? స్వమానంపై నిశ్చయం మరియు స్వమానం యొక్క ఆత్మికనషా రెండింటి సమానత ఎంత వరకు ఉంటుంది? అనేది బాబా చూస్తున్నారు.

నిశ్చయం అంటే జ్ఞానస్వరూపంగా అవ్వటం మరియు ఆత్మికనషా అంటే శక్తిశాలిగా అవ్వటం. "జ్ఞానస్వరూప స్థితిలో కూడా రెండు రకాలుగా ఉన్నారు - ఒకరు జ్ఞానసాగరులుగా ఉన్నారు. రెండవ వారు నాలెడ్జ్ అంటే జ్ఞానస్వరూపంగా ఉన్నారు. నేనెవరు? అని మిమ్మల్ని మీరు అడగండి. 'పిల్లల యొక్క లక్ష్యం చాలా ఉన్నతమైనది అని బాబాకి తెలుసు. లక్ష్యం ఉన్నతమైనదే కదా! ఉన్నతమైనదేనా? బాబా సమానంగా అవుతాము అని అందరూ అంటారు. బాబా ఎలా అయితే ఉన్నతమైనవారో అలాగే బాబా సమానంగా అయ్యే లక్ష్యం కూడా ఎంత ఉన్నతమైనది!

లక్ష్యం చూసి బాప్దాదా చాలా సంతోషిస్తున్నారు కానీ.. కానీ తర్వాత ఏమిటో చెప్పనా? కానీ ఏమిటి, - టీచర్స్ చెప్పండి? కానీ ఏమిటి అనేది డబల్ విదేశీయులు చెప్తారా? అర్ధం అయిపోయి ఉంటుంది బాప్దాదా లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి లక్ష్యం మరియు లక్షణాలు అంటే ప్రత్యక్షస్థితి సమానంగా ఉందా? ఎందుకంటే 'లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా అవ్వటమే బాబా సమానంగా అవ్వటం. సమయం అనుసరించి ఈ సమానతను సమీపంగా తీసుకురండి .

వర్తమాన సమయంలో  బాప్దాదా పిల్లల యొక్క ఒక విషయాన్ని చూడలేకపోతున్నారు. -కొంతమంది పిల్లలు బాబా సమానంగా అవ్వడానికి రకరకాలుగా శ్రమ చేస్తున్నారు. బాబా యొక్క ప్రేమలో అసలు శ్రమ చేయవలసిన అవసరమే ఉండదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమప - ఉండదు. వ్యతిరేఖ నషా అయిన దేహాభిమానం అనేది స్వతహాగా మరియు సంస్కారంగా - అయిపోయింది. దేహాభిమానంలోకి రావడానికి పురుషార్ధం చేయవలసి వస్తుందా? లేక 63 జన్మలు పురుషార్ధం చేశారా? స్వతహా సంస్కారంగా అయిపోయింది. ఇప్పుడు కూడా ఇదే చెప్తారు?

అప్పుడప్పుడు ఆత్మకి బదులు దేహం యొక్క స్థితిలోకి వచ్చేస్తున్నాము అని, ఎలా అయితే, - దేహాభిమానం అనేది స్వతహా సంస్కారంగా ఉందో అదేవిధంగా ఆత్మాభిమాని స్థితి కూడా స్వతహాగా మరియు సంస్కారంగా అయిపోవాలి. సంస్కారం అనేది మారటం కష్టం అవుతుంది. ఇప్పుడు - కూడా అప్పుడప్పుడు అంటారు కదా - నా భావం ఇది కాదు కానీ ఇది నా సంస్కారం. మరి ఆ "సంస్కారాన్ని స్వతహాగా చేసుకున్నారు కదా, బాబా సమానంగా అయ్యే సంస్కారాన్ని స్వతహాగా చేసుకోలేదా! వ్యతిరేక సంస్కారానికి వశం అయిపోతున్నారు మరి బాబా సమానంగా అయ్యే ఓ యదార్ధ సంస్కారంలో కష్టం అని ఎందుకు అనిపిస్తుంది?

ఇప్పుడు బాప్దాదా ఆత్మాభిమానిగా, -అయ్యే స్వతహా సంస్కారం పిల్లలలో చూడాలనుకుంటున్నారు. బ్రహ్మాబాబాని చూశారు కదా - నడుస్తూ, తిరుగుతూ కార్యం చేస్తున్నా ఆత్మాభిమాని స్థితి యొక్క స్వతహా సంసార్కం ఉండేది. -బాప్దాదా సమాచారం విన్నారు. ఈ రోజులలో విశేషంగా దాదీలు ఇదే ఆత్మికసంభాషణ చేస్తున్నారు. కదా! చేస్తున్నారా? ఫరిస్తాస్థితి, కర్మాతీత స్థితి, బాబా సమాన స్థితి స్వతహా సంస్కారంగా ఏవిధంగా "తయారవుతుంది? ఈ స్థితి సంస్కారంగా అయిపోవాలి అని ఇలా ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. -కదా!

దాదీకి కూడా మాటిమాటికి అనిపిస్తుంది కదా - ఫరిస్తాగా అయిపోవాలి, కర్మాతీతంగా అయిపోవాలి మరియు బాబా ప్రత్యక్షం అయిపోవాలి. అయితే ఫరిస్తాగా కావాలంటే మరియు నిరాకార కర్మాతీతస్థితి తయారవ్వాలంటే విశేష సాధనం - నిరహంకారిగా అవ్వాలి. నిరహంకారియే నిరికారిగా కాగలరు. అందువలనే శివబాబా కూడా బ్రహ్మా ద్వారా చివరి మంత్రంగా - నిరాకారితో “పాటు నిరహంకారి అని కూడా చెప్పారు. దేహ అహంకారం, దేహాభిమానం అంటే కేవలం మీ దేహంతో, ఇతరుల దేహంతో చిక్కుకోవడాన్నే అనరు, దేహ అహంకారం, దేహాభిమానం రెండూ - ఉన్నాయి.

మీ దేహం యొక్క లేదా ఇతరుల దేహం యొక్క అభిమానంలో ఉండటం, తగుల్బాటులోకి రావటం ఈ విషయంలో అయితే చాలా మంది పాస్ అయిపోయారు పురుషార్ధం యొక్క సంలగ్నతలో ఉండేవారు, సత్యమైన పురుషార్థులు ఈ విధమైన స్థూల రూపం యొక్క దేహాభిమానం నుండి ' "అతీతంగానే ఉన్నారు. కానీ దేహాభిమానం యొక్క సూక్ష్మ రూపాలు చాలా ఉన్నాయి. పరస్పరం *దీని యొక్క లిస్ట్ తీయండి. వాటి గురించి ఈ రోజు బాషా చెప్పటంలేదు. ఈ రోజు ఈ సైగయే చాలా ఎక్కువ ఎందుకంటే అందరు తెలివైనవారే. మీ అందరికీ తెలుసు కదా, అందరినీ అడిగితే అందరు చాలా తెలివిగా చెప్తారు.

కానీ బాప్దాదా కేవలం చిన్న, సహజమైన పురుషార్ధం . చెప్తున్నారు - సదా మనసా, వాచా, కర్మణా, సంబంధ, సంపర్కంలో చివరి మంత్రం అయిన మూడు మాటలను ( నిరాకారి, నిర్వికారి, నిరహంకారి) సదా స్మృతిలో ఉంచుకోండి. సంకల్పం - చేస్తున్నారనుకోండి: పరిశీలన చేసుకోండి ఈ సంకల్పం మహామంత్ర సంపన్నంగా ఉందా? అదేవిధంగా మాట మరియు కర్మ అన్నింటిలో ఈ మూడు మాటలను స్మృతి ఉంచుకోండి మరియు అసమానత ఉంచుకోండి. ఇదా అయితే సహజమే కదా? మొత్తం స్మృతిలో ఉంచుకోండి అని 'చెప్పటంలేదు. మూడు మాటలు స్మృతిలో ఉంచుకోండి. అని చెప్తున్నారు.

ఈ మహామంత్రం సంకల్పాన్ని కూడా శ్రేష్టంగా తయారుచేస్తుంది. వాణీలో నిర్మాణతను తీసుకు వస్తుంది. కర్మలో సేవాభావాన్ని తీసుకువస్తుంది. సంబంధ, సంపర్కంలో సదా శుభభావన, శ్రేష్టకామన యొక్క "వృత్తిని తయారుచేస్తుంది. బాప్దాదా సేవ యొక్క సమాచారాన్ని కూడా వింటున్నారు. ఈరోజుల్లో సేవలో రకరకాలైన కోర్సులు చెప్తున్నారు కానీ ఇప్పుడు ఒక కోర్స్ మిగిలిపోయింది. అదేమిటంటే - ప్రతి ఆత్మకి ఏ శక్తి కావాలంటే ఆ శక్తిని నింపే కోర్సు చెప్పాలి. శక్తి నింపే కోర్సు చెప్పాలి. మాటలతో చెప్పే కోర్స్ కాదు. వాచాతో పాటు శక్తి యొక్క కోర్స్ నింపాలి. దాని ద్వారా ఇతరులు, చాలా, చాలా బావుంది అని అనటం కాదు, మంచిగా తయారైపోవాలి.

ఈరోజు నాకు శక్తి -లభించింది అని అనుభవం చేసుకోవాలి. ఆ ఆత్మలకి కొంచెం అనుభవం అయినా వారికి అదే చాలా ఎక్కువ. కోర్స్ చెప్పండి కానీ మొదట మీరు అనుభవం చేసుకుని చెప్పండి.  బాప్దాదా ఏమి కోరుకుంటున్నారో విన్నారా? లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి. అందరి -యొక్క లక్ష్యం చూసి  బాప్దాదా చాలా, చాలా సంతోషిస్తున్నారు ఇప్పుడు కేవలం సమానంగా చేసుకోండి అప్పుడు సహజంగా బాబా సమానంగా అయిపోతారు.  బాప్దాదా అయితే పిల్లలను తన సమానంగా అంటే తనకంటే ఉన్నతంగా చూస్తారు.  బాప్దాదా సదా పిల్లలను శిరోకిరీటాలు -అంటారు.

కిరీటం అనేది తల కంటే ఉన్నతంగా ఉంటుంది కదా! టీచర్స్ శికో కిరీటాలే కదా? టీచర్స్ నిల్చోండి ఎంతమంది టీచర్స్ ఉన్నారో చూడండి. ఒక గ్రూప్ లోనే ఇంతమంది టీచర్స్ ఉంటే అన్ని గ్రూప్లో ఎంతమంది టీచర్స్ ఉంటారో  బాప్దాదా యొక్క ఒక ఆశను -పూర్తి చేసే సంకల్పాన్ని టీచర్స్ చేశారు కానీ తీసుకురాలేదు. ఆ సంకల్పం ఏమిటో తెలుసా? బాప్దాదా వారసుల యొక్క మాల తయారుచేయండి అని చెప్పారు. సాధారణ మాల - కాదు, వారసుల యొక్క మాల తయారుచేయాలి. 2. సంబంధ, సంపర్కంలో ఉండేవారిని మైక్గా తయారుచేయండి. మీరు ఉపన్యాసం చెప్పటం కాదు వారు మీ యొక్క ప్రసార మాధ్యమంగా ((మీడియా) తయారుకావాలి.

మీ యొక్క మాధ్యమాన్ని తయారుచేయండి. ప్రసార మాధ్యమాలు. -(టెలివిజన్, వార్తాపత్రికలు వగైరా) ఏమి చేస్తాయి? ధ్వనిని వ్యాపింపజేస్తాయి కదా! మంచి అయినా, 'చెడు అయినా విషయాన్ని వ్యాపింపజేస్తాయి. భగవంతుడు వచ్చేసారు. భగవంతుడు అవతరించారు. అంటూ మీరు చెప్తారు, కానీ వారు దానిని సాధారణంగా భావిస్తారు. అందువలన మీ గురించి ఎ. ఇతరులు చెప్పాలి, అర్జీ కలిగినవారు చెప్పాలి. వారు మొదట మిమ్మల్ని శక్తిరూపంగా ప్రత్యక్షం 'చేయాలి. ఎప్పుడైతే శక్తులు ప్రత్యక్షం అవుతారో అప్పుడు తండ్రి ప్రత్యక్షం అవుతారు.

అందువలన మీకు మాధ్యమాన్ని తయారుచేయండి. చేశారా? మాల విషయం వదిలేయండి, కంకణం అయినా తయారుచేశారా? ఎవరు తయారుచేశారో వారు చేతులెత్తండి. ఎవరు తయారుచేశారు అని  బాప్దాదా చూస్తారు. మంచిది - ధైర్యం అయితే పెట్టుకున్నారు కదా! టీచర్స్ ఏమి చేయాలో విన్నారా? శివరాత్రికి వారసులను, క్వాలిటీ ఆత్మలను తయారుచేయండి. మైక్ను తయారుచేయండి. - అప్పుడు తర్వాత సంవత్సరం శివరాత్రికి అందరి నోటి నుండి - శివతండ్రి వచ్చేశారు అనే మాట రావాలి. శివరాత్రిని ఆవిధంగా జరుపుకోండి. ప్రోగ్రామ్ అయితే చాలా మంచిగా తయారుచేస్తున్నారు.

ప్రోగ్రామ్ అందరికీ పంపారు కదా! ప్రోగ్రామ్ మంచిగానే తయారుచేశారు . - ఇప్పటికి 66 సంవత్సరాలు అయిపోయినవి. సేవ యొక్క 50 సంవత్సరాలను జరుపుకున్నారు. 'ఇప్పుడు శివరాత్రి యొక్క డైమండ్ జూబ్లీ జరుపుకోండి. ఈవిధంగా రెండు రకాలైన ఆత్మలను తయారుచేయండి అప్పుడు చూడండి నగాఢా మ్రోగుతుందో, లేదో? నగాధా మీరు మ్రోగిస్తారా. -ఏమిటి? మీరు దేవీలు, మీరు సాక్షాత్కారం చేయించేవారు. నగాధా మ్రోగించేవారిని 'తయారుచేయండి. శివశక్తులే వెలసెను అనే పాటను ప్రత్యక్షంగా పాడాలి. విన్నారా? శివరాత్రికి ఏమి చేస్తారు? మామూలుగానే ఉపన్యాసం చెప్పి పూర్తి చేయటం కాదు.

బాబా 500 లక్షల మంది. "వచ్చారు అని వ్రాస్తారు. సరే వచ్చారు. మీరు సందేశం ఇచ్చారు, కానీ ఎంతమంది వారసులు. తయారయ్యారు. మైక్ ఎంతమంది తయారయ్యారు? ఇప్పుడు ఆ సమాచారం ఇవ్వండి. ఇప్పటి వరకు చేసిన దాని ద్వారా భూమిని తయారుచేశారు అనగా సందేశం ఇచ్చారు, దాని గురించి -బాబా మంచిగా చేశారు అని అంటున్నారు. చేసిన ఆ సేవ వ్యర్ధం కాలేదు. సమర్ధమే అయ్యింది. ప్రజలు అయితే తయారయ్యారు. ఉన్నత కుటుంబం కూడా తయారయ్యింది కానీ రాజా, రాణీ కూడా కావాలి కదా!

సింహాసనంపై కూర్చునే రాజా, రాణీ కాదు, రాజా, రాణీతో పాటు అక్కడి 'సభలో రాజుతో సమానంగా కూర్చునేవారు ఉంటారు వారిని తయారుచేయండి. రాజ్యసభ - శోభాయమానంగా అవ్వాలి. శివరాత్రికి ఏమి చేయాలో విన్నారా! పాండవులు వింటున్నారు కదా! - చేతులు ఎత్తండి! ధ్యాస పెట్టారా? మంచిది, పెద్ద, పెద్ద మహారధులు కూర్చున్నారు. మంచిది.. -బాబా సంతోషిస్తున్నారు. ఇది కూడా మనస్సు యొక్క ప్రేమ. ఎందుకంటే మీ అందరికీ ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది.. అనే సంకల్పం నడుస్తుంది కదా! మధువనం వారు ఏమి విన్నారు? మధువనం వారు విన్నారు కదా!

మధువనం వారు చేతులు. ఎత్తండి. మధువనం వారు నిల్చోండి. మధువనం, శాంతివనం, జ్ఞానసరోవరంలోనివారు అందరూ "మధువనం నివాసీయులే. మంచిది. మధువనం నుండి నగాఢా మ్రోగుతుందా? ఎక్కడి నుండి మ్రోగుతుంది? ఎక్కడ నుండి మ్రోగుతుంది నగాఢా? ఎక్కడ నుండి మ్రోగుతుంది? ఢిల్లీ నుండి మ్రోగుతుందా? మధువనం నుండి కాదా? నలువైపుల నుండి అని చెప్పండి. ఒకవైపు నుండే మ్రోగదు. మధువనం నుండి . మ్రోగుతుంది మరియు నలువైపుల నుండి మ్రోగుతుంది అప్పుడే కుంభకర్ణులు మేల్కొంటారు. "మధువనం వారు విన్నారా! చాలా మంచిది.

ఎలా అయితే సేవలో అలసిపోనివారిగా అయ్యి సేవ " యొక్క పాత్రను అభినయిస్తున్నారు కదా అలాగే మనసాసేవ కూడా చేస్తూ ఉండండి. కేవలం కర్మణా సేవయే కాదు, మనసా, వాచా, కర్మణా మూడు సేవలు చేస్తున్నారు కానీ ఇంకా ఎక్కువగా చేయాలి. మధువనం వారు మర్చిపోకండి. మధువనం వారు అనుకుంటున్నారు -  బాప్దాదా వచ్చేది మధువనంలోనే కానీ మధువనం యొక్క పేరు చెప్పరు అని. మధువనం అయితే సదా స్మృతి ఉంటుంది. మధువనం లేకపోతే వీరందరు ఎక్కడికి వస్తారు? సేవాధారులైన మీరు సేవ చేయకపోతే వీరందరూ ఉండేది, తినేది ఎలా?

అందువలన మధువనం వారిని  బాప్దాదా మనస్సుతో స్మృతి చేస్తారు మరియు మనస్సుతో ఆశీర్వాదాలు ఇస్తారు. ఇప్పుడు కూర్చోండి. అలసిపోతారు. టీచర్స్ అయితే అలసిపోయారు. నిల్చుని అలసిపోయారు అని బాప్దాదా అనుకోవటంలేదు. ఎందుకంటే వ్యాయామం చేశారు. కూర్చుని కూర్చుని కాళ్ళుపట్టేస్తాయి. నిల్చుంది బావుంటుంది. టీచర్స్ అంటే ప్రేమ ఉంది కదా! మధువనం వారితో కూడా ప్రేమ ఉంది, టీచర్స్తో కూడా ప్రేమ ఉంది. మధురాతి మధురమైన మాతలతో కూడా ప్రేమ ఉంది మరియు మహావీర్. పాండవులంటే కూడా ప్రేమ ఉంది. అందువలనే చతుర్బుజాల యొక్క మహిమ ఎక్కువగా ఉంటుంది. పాండవులు మరియు శక్తులు రెండింటి యొక్క కంబైండ్ రూపానికి స్మృతిచిహ్నరూపమే - చతుర్భుజ  విష్ణువు...

మాతలని నిల్చోమంటే సభలో సగంమంది మాతలే ఉంటారు. మాతలు నిల్చోండి! 'మాతలు చాలా మది ఉన్నారు. ఇప్పుడు మాతలు వస్త్రపు జెండా ఎగరవేయటం కాదు. జెండా ఎగరవేసి భగవంతుడు వచ్చారు, మేల్కొండి, మేల్కొండి.. అని చెప్తారు కదా కానీ ఇప్పుడు సత్యమైన 'ధ్వని వ్యాపింపచేయండి. అందరి మనస్సు నుండి ధ్వనిని వెలువరించండి. సత్యమైన శివరాత్రి జరుపుకోండి. మాతలు విన్నారు కదా! మనస్సులో బాబా ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేయండి. జెండా ఎగరవేయటం వస్తుంది కదా! తెలివైనవారు! మాతలు కూడా తక్కువైన వారు కాదు. - ఇప్పుడు అందరినీ మేల్కొల్పండి.

 మీ పిల్లలు కుంభకర్ణులుగా నిద్రపోతున్నారు. ఇప్పుడు సమయం వచ్చేసింది కనుక వారిని మేల్కొల్పండి. బాబా వచ్చారు అని వారి నోటి నుండి రావాలి. మాతలు -ఈ విధమైన శివరాత్రి జరుపుకోవాలి. మాతలు అద్భుతం చేసి చూపించాలి. చేతులైతే మంచిగా ఊపుతున్నారు,  బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు. ఏమి సమాచారం వస్తుందో ఈ శివరాత్రికి "చూస్తాను. ఫంక్షన్ చేసుకున్నాము అని కాదు, ఫంక్షన్ చేసుకోండి కానీ వారిని తీసుకురావాలి. మంచిది, మాతలు చాలా మంది ఉన్నారు మాతలతోనే బ్రాహ్మణ పరివారం యొక్క శోభ ఉంది.  

మాతల యొక్క విశేషత ఏమిటంటే, ఎటువంటి గ్రామం యొక్క మాతరైనా, ఏ సేవాకేంద్రంలో (అయితే మాతల యొక్క సంఖ్య ఎక్కువ ఉంటుందో అక్కడ బండారీ మరియు బండారా నిండుగా. -ఉంటుంది. పాండవులు ఒకరు ఉండి మాతలు 25 మంది ఉన్నా నిండుగా ఉంటుంది ఎందుకంటే హృదయం విశాలంగా ఉంటుంది. మంచిది.

ఇప్పుడు డబల్ విదేశీయులు నిల్చోండి! డబల్ విదేశీయులు మీడియా గ్రూప్ తయారు -చేస్తారా? ఎవరు తయారుచేస్తారో వారు చేతులు ఎత్తండి! 30 దేశాల నుండి వచ్చారు అని. బాగ్దాదా విన్నారు. తక్కువలో తక్కువ 30 దేశాలలో సర్వశక్తినాన్ మాధ్యమాన్ని తయారుచేస్తారు. కదా? అక్కయ్యలు ఏమి చేస్తారు? శక్తులు ఏమి చేస్తారు? బాబాపై ఎంత ప్రేమ ఉందో చూడండి. -ఎన్ని సముద్రాలను దాటి వస్తున్నారో! బాబాకి డబలి విదేశీయుల గురించి గర్వంగా ఉంది.. ప్రేమ అందరిపై ఉంది కానీ వెనువెంట బాబా యొక్క సందేశాన్ని నలువైపుల వ్యాపింపచేయడానికి . నిమిత్తం అయ్యారు అని డబల్ విదేశీయుల గురించి గర్వంగా కూడా ఉంది.

లేకపోతే భారతదేశం -యొక్క అక్కయ్యలు ముందు భాష నేర్చుకుని తర్వాత సందేశం ఇవ్వవలసివచ్చేది. కానీ మీరు ఇంటి నుండే ఉద్దరణ ప్రారంభించి చూపించారు. ఇప్పుడు కేవలం 30 దేశాల వారు వచ్చారు. - ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా! కనుక చాలా మంచి సందేశవాహకులుగా అయ్యారు. ఒక్కొక్క పిల్లవాని యొక్క విశేషత చూసి బాప్దాదా చాలా సంతోషిస్తున్నారు. భారతదేశంలోని వారి విశేషతల యొక్క లిస్ట్ వేరు ఇప్పుడు విదేశీయుల విశేషత యొక్క విషయం. మేము . - యొక్క పిల్లలం అని డబల్ విదేశీయులు అనుభవంతో చెప్తున్నారు.

కేవలం బుద్ధితో కాదు, లేదు అనుభవంతో -మనస్సుతో చెప్తున్నారు - మేము బ్రహ్మకుమారీ, కుమారులం. మనస్సుతో మరియు అనుభవంతో చెప్తున్నారు కదా! ఇతరులు చెప్పటం ద్వారా లేదా వినటం ద్వారా చెప్పటం - చెప్తున్నారు. బ్రహ్మకుమారీ, కుమారులుగా అయినందుకు ఆత్మిక నషా ఉంది కదా! ఉందా నషా? చేతులు ఊపండి, ఎంత నషా ఉంటే అంత వేగంగా చేతులు ఊపండి. బ్రహ్మకుమారి, కుమారులు యొక్క నషా ఎంత ఉంది అనేది బాబా పరిశీలిస్తున్నారు. విదేశాలలో శివరాత్రి ఎక్కువగా -చేయరు కానీ జనవరి 18 చేస్తారు.

ఇక్కడ ఎక్కువగా శివరాత్రి జరుపుకుంటారు, 18 జనవరికి లేదా జనవరిలో ఎక్కువగా సేవను వ్యాపింపచేస్తారు, ఇది కూడా మంచిదే, ఇప్పుడు ఎవరు మొదటి నెంబర్ వారసులను, మైకి తీసుకువస్తారో చూస్తాను. వారికి వెండి బ్రహ్మాబాబా కానుకగా ఇస్తారు. బహుమతి ఇస్తాను. భారతదేశం వారైనా, విదేశం వారైనా ఎవరు తీసుకువస్తే. " వారికి బహుమతి వస్తుంది. ఎన్ని సెంటర్స్ వారు తీసుకువచ్చినా  బాప్దాదా దగ్గర ఖజానా నిండుగా ఉంటుంది. సరేనా! పాండవులు ఏమి చేస్తారు? పాండవుల విజయానికి మహిమ ఉంది. - అలసిపోతారని నిల్చోమని బాప్దాదా అనటంలేదు.

బాబా పాండవుల యొక్క మస్తకంలో సదా విజయాన్ని చూస్తున్నారు మరియు విజయం మధ్యలో ఆత్మ మెరుస్తూ ఉంది. పాండవులకు డ్రామానుసారం స్మృతి చిహ్నంలో కూడా విజయం యొక్క వరదానం లభించే ఉంది. విజయీ పాండవులు అనే మహిమ ఉండనే ఉంది. అందువలన పాండవులు ఎప్పుడూ, ఏ విషయంలోనూ ఓడిపోరు.  బాప్దాదా యొక్క కంఠహారంగా అవ్వాలి కానీ ఓడిపోకూడదు. ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే మేము  బాప్దాదా యొక్క కంఠహారం, ఓడిపోయేవాళ్ళం కాదు అని చెప్పండి. "అలా పక్కాయే కదా? లేదా కొంచెం కొంచెం ఓడిపోతారా? జరిగిపోయిందేదో జరిగిపోయింది.

ఇక ఇప్పుడు ఓడిపోకూడదు. విజయం మీ యొక్క కంఠహారం - మీరు  బాప్దాదా యొక్క కంఠహారం, ఓడిపోయే ఆత్మలు కోట్లలో ఉన్నారు. మీరు కాదు. మీరు అయితే కోట్లలో కొద్దిమంది - మరియు ఆ కొద్దిమందిలో కొద్దిమంది. మధువనంలో ఉండే పాండవులకి నషా ఉంది కదా! నషా ఉంది. విజయం యొక్క నషా ఉండాలి ఇతర నషా కాదు. మంచిది, పాండవ భవనంలో మెజారిటీ పాండవులు ఉన్నారు ఈ పాండవులు లేకపోతే మీ అందరికీ మధువనంలో ఉండే మజా రాదు, -ఎందుకంటే మధువన నివాసీలు బలిహారం అయ్యి మిమ్మల్ని అందరినీ మజాగా ఉంచుతున్నారు, " తినిపిస్తున్నారు మరియు ఎగిరింపచేస్తున్నారు.

ఈ రోజు బాబాకి మధువననివాసీయులు అమృతవేళ నుండి స్మృతి వస్తున్నారు. ఇక్కడ ఉన్నా కానీ, పైన కూర్చున్నా కానీ, కొందరు తమ విధులలో ఉన్నారు కానీ నలువైపుల ఉన్న మదువన నివాసీయులందరినీ  బాప్దాదా అమృతవేళ నుండి స్మృతి చేస్తున్నారు.

మంచిది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సేవాధారులు నిల్చోండి. వీరు (మధు నివాసీయులు) 'అయితే సదా సేవాధారులు, మీరు అయితే ఒక్కసారికి సేవాధారులుగా వస్తారు. ఉత్తరప్రదేశ్ సేవాధారులు నిల్చోండి. ప్రతి ఒక్కరు మీకు ఉన్న ఒక్క అవకాశంలో అవినాశి పుణ్యఖాతాను జమ చేసుకున్నారు. కొద్ది సమయం యొక్క సేవ ద్వారా అనేక జన్మల యొక్క పుణ్యరేఖను లేదా భాగ్యాన్ని తయారుచేసుకున్నారు. అంటే మంచి నేర్పరులు కదా!ఒక్క జన్మలోనే అనేక జన్మల కొరకు తయారుచేసుకున్నారు. సేవాధారులను చూసి బాప్దాదా విశేషంగా సంతోషిస్తారు. ఎందువలన? ఎందుకు సంతోషపడతారు?

పాత వాళ్ళకి జ్ఞాపకం ఉండి ఉంటుంది - బ్రహ్మాబాబా - "ఉన్నప్పుడు బాబా సంతకం ఎలా చేసేవారు? ఇట్లు విశ్వసేవాధారి అని మరియు నిరాకార తండ్రి  కూడా ఎందువలన అవతరించారు? సేవాధారిగా అయ్యి వచ్చారు కదా? అందువలన  బాప్దాదాకి సేవాధారులు బాగా జ్ఞాపకం వస్తారు. ప్రియంగా కూడా అనిపిస్తారు. ఇక్కడ కూడా మెజారిటీ. ఆత్మలందరికీ ప్రోగ్రామ్ అనుసారంగా యజ్ఞ సేవ యొక్క పుణ్యం లభిస్తుంది. ఇది కూడా మంచిది. టీచర్స్ అందరూ మంచిగా ఉన్నారు కదా? ఉత్తరప్రదేశ్ యొక్క సేవాధారి టీచర్స్ మంచి 'ఉన్నారు కదా? చాలా మంచిది. బాప్దాదా చెప్పారు కదా టీచర్ని  బాప్దాదా సదా సహయోగి. " శిక్షకులు అనే దృష్టితో చూస్తారు. మంచిది.

ముందుగా పిల్లలు నిల్చోండి. బాలలు మహాత్మలు కదా! చూడండి పిల్లలకి కూడా ఎంత - ప్రేమ ఉందో! పిల్లలు అంటే ప్రతిజ్ఞ చేసేవారు. ఈనాటి ప్రెసిడెంట్లు కూడా పిల్లల మాటలను అంగీకరిస్తున్నారు.  బాప్దాదా కూడా పిల్లలని ప్రేమిస్తారు. బావున్నారు కదా పిల్లలందరూ? బావుంటే చేతులు ఊపండి. చాలా మంచిది. సదా బాబా, బాబా, బాబా అని అనుకుంటూ ఉండండి. -స్మృతిలో ఉండండి.

కుమారీలు నిల్చోండి - కుమారీలు కూడా చాలామంది ఉన్నారు. కానీమీరు ఎటువంటి కుమారీలు? 21 జన్మల వారిని ఉద్దరించే కుమారీలే కదా! లేక బంధనాలు కల్గిన కుమారీలా? క కుమారి అంటే 21 జన్మలను శ్రేష్టంగా చేసేవారు. కుమారీల యొక్క మహిమ ఇది. ఉద్యోగం యొక్క లేదా సంబంధీకుల యొక్క బంధన ఉన్నా కానీ కుమారి అనగా శక్తి. మీ యొక్క యోగశక్తి ద్వారా మిమ్మల్ని మీరు నిర్భందనులుగా చేసుకోవచ్చు. ఉద్యోగం చేయవద్దు అని  బాప్దాదా చెప్పటం లేదు, కానీ ఉదోగ్యం చేస్తున్నా కానీ డబల్ ఉదోగ్యం అనగా సేవ చేయండి. విదేశం * యొక్క విశేషత ఇదే.

విదేశాలలోని వారు ఉదోగ్యం కూడా చేస్తారు మరియు సెంటర్ని కూడా సంభాళిస్తారు, ఈ విశేషత  బాప్దాదా చూశారు. అందువలన బాప్దాదా అటువంటి పిల్లలకు డబల్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. పరిస్థితుల ప్రభావం వలన ఉదోగ్యం చేయవలసి ఉంటే దానికి బాబా వద్దు అని చెప్పరు కానీ సమానత ఉంచుకోండి. అయితే అటువంటి కుమారీలేనా? సెంటర్ తెరిస్తే సంభాళిస్తారా? సెంటర్ తెరవమంటారా? అలాగే అని చెప్పేవారు చేతులెత్తండి. -సెంటర్ తెరవండి అని ఆజ్ఞ ఇస్తే సెంటర్కి వెళ్తారా? కొద్దిమందే చేతులు ఎత్తుతున్నారు. చూసుకోండి టీ.విలో మీ ఫోటో వచ్చేస్తుంది. మంచిది.

ధైర్యవంతులు, ధైర్యం ద్వారా  బాప్దాదా యొక్క. 6 సహాయం లభిస్తుంది. మంచిది. శుభాకాంక్షలు సెంటర్కి వచ్చేటందుకు శుభాకాంక్షలు, కుమారులు పాండవులలోకి వచ్చేసారా? కుమారీలు అయితే సెంటర్ని సంభాళించాలి, మరి అయితే కుమారులు మెక్ని కూడా తయారుచేయగలరు. కుమారులు ప్రభుత్వం వారిని కూడా మేల్కొల్పగలరు. కుమారులు అద్భుతం చేసి చూపిస్తారు. ఆ రోజు కూడా రానున్నది. అందువలన కుమారులను మేల్కొల్పండి, మీరు కూడా కుమారులు, మేము కూడా కుమారులం రండి మేము మీకు కధ చెప్తాం అని వారిని మేల్కొల్పండి. మంచిది.  

బాప్దాదా ఇచ్చిన ఆత్మిక వ్యాయామం రోజంతటిలో - ఎన్నిసార్లు చేస్తున్నారు? మరియు ఎంత సమయంలో చేస్తున్నారు? నిరాకారి మరియు ఫరిస్తా బాబా మరియు దాదా, ఇప్పుడిప్పుడే నిరాకారి మరియు ఇప్పుడిప్పుడే పరిస్తా స్వరూపం. రెండింటిలోనూ దేహాభిమానం ఉండదు. దేహాభిమానం నుండి అతీతంగా కావాలంటే 'కానీ, విధిని నిర్వర్తిస్తున్నా కానీ ఒక్క సెకనులో ఈ ఆత్మిక వ్యాయామాన్ని అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే ఫరిస్తా ఇది సహజ అభ్యాసంగా అయిపోవాలి. మంచిది (బాబాదా డ్రిల్ చేయించారు) ఈ విధంగా నిరంతర భవ!

నలువైపుల ఉన్నటువంటి  బాప్దాదా యొక్క స్మృతిలో నిమగ్నం అయ్యి  ఉండేవారికి, బాబా సమానంగా అవ్వాలనే లక్ష్యం లక్షణాలలో కూడా సమానంగా ఉండేవారికి, -కోనకోనల్లో విజ్ఞాన సాధనాల ద్వారా పగలు లేదా రాత్రి మేల్కొని కూడా కూర్చున్నవారికి బాస్ రా యొక్క ప్రియన్స్మతులు, శుభాకాంక్షలు, మనస్సు యొక్క ఆశీర్వాదాలు. బాబాకి తెలుసు అందరి మనసుల్లో ఈ సమయంలో మనోభిరాముడైన బాబా యొక్క స్మృతి ఇమిడి ఉంది. కోనకోనల్లో - ఉన్న ప్రతీ ఒక్క పిల్లవానికి వ్యక్తిగత పేరు పేరున బాప్దాదా  ప్రియస్మృతులు ఇస్తున్నారు. పేర "మాలను జపిస్తే రాత్రి అంతా అయిపోతుంది.

బాప్దాదా పిల్లలందరికీ స్మృతి ఇస్తున్నారు. పురుషార్ధంలో ఏ నెంబర్ అయినా కానీ బాప్దాదా ప్రతి ఒక్క పిల్లవాని శ్రేష్ట స్వమానానికి? -ప్రియస్మృతులు ఇస్తున్నారు మరియు నమస్తే చెబుతున్నారు. ప్రియసృ్మతులు ఇచ్చే సమయంలో, నలువైపుల ఉన్న ప్రతి పిల్లవాడు  బాప్దాదా ఎదురుగా ఉన్నారు. ఏ ఒక్క పిల్లవాడు అయినా ఏదొక కోనలో లేదా ఊరులో లేదా పట్టణంలో, దేశంలో లేదా విదేశంలో ఎక్కడ ఉన్నా కానీ, -బాబా వారికి స్వమానాన్ని స్మృతి ఇప్పిస్తూ ప్రియస్స్మృతులు ఇస్తున్నారు. అందరు ప్రియస్మృతులకి - అధికారులు ఎందుకంటే బాబా అని అన్నారు అంటేనే ప్రియసృ్మతులకి అధికారులే. ఎదురుగా ఉన్న మీ అందరినీ కూడా బాప్దాదా స్వమాన మాలధారులుగా చూస్తున్నారు. అందరికీ -సమాన స్వమాన స్వరూపంలో ప్రియసృతులు మరియు నమస్తే.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

సౌభాగ్యశాలి  భవ!