రివైజ్ కోర్స్ మురళి 30-11-2002
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
రిటన్ (బదులు ఇవ్వటం) అనే మాటను స్మృతిలో ఉంచుకుని సమానంగా అవ్వండి మరియు రిటన్ అగ్ని (తిరుగుప్రయాణం) యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి
ఈరోజు బాప్దాదా నలువైపుల ఉన్నటువంటి తన యొక్క హృదయ సింహాసనాధికారి, భృకిటి సింహాసనాధికారి, విశ్వం యొక్క రాజ్యసింహాస నాధికారి, స్వరాజ్యాధికారి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పరమాత్మ యొక్క హృదయ సింహాసనం మొత్తం కల్పంలో ఇప్పుడే మరియు -ప్రియమైన, గారాభమైన పిల్లలకే లభిస్తుంది. భృకిటి యొక్క సింహాసనం అయితే అందరికీ - "ఉంది, కానీ పరమాత్మ హృదయసింహాసనం బ్రాహ్మణాత్మలకి తప్ప మరెవ్వరికీ లభించదు. 'ఈ' హృదయసింహాసనమే విశ్వం యొక్క సింహాసనాన్ని ఇప్పిస్తుంది.
వర్తమాన సమయంలో. - స్వరాజ్యాధికారిగా అయ్యారు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి స్వరాజ్యం అనేది కంఠహారం. స్వరాజ్యం. "మీ యొక్క జన్మసిద్ద అధికారం. ఇలా స్వయాన్ని ఈ విధమైన స్వరాజ్యాధికారిగా అనుభవం చేసుకుంటున్నారా? మా యొక్క ఈ జన్మసిద్ద అధికారాన్ని ఎవరూ దొంగిలించలేదు అని మనస్సులో ఇదే ధృఢసంకల్పం ఉంది కదా! వెనువెంట ఈ ఆత్మికనషా కూడా ఉంది:- మేము పరమాత్మ యొక్క హృదయసింహాసనాధికారులం అని. మానవ జీవితంలో కూడా, తనువులో అన్ని భాగాల కంటే ఎక్కువగా హృదయమే గొప్పగా మహిమ చేయబడుతుంది.
హృదయం ఆగిపోతే జీవితం. 'సమాప్తి అయిపోతుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా హృదయసింహాసనానికి చాలా గొప్పతనం. ఉంది. ఎవరైతే హృదయసింహాసనాధికారి ఆత్మలు ఉన్నారో వారే విశ్వంలో విశేషాత్మగా మహిమ -చేయబడుతున్నారు. ఆ ఆత్మలే భక్తాత్మల కొరకు మాలలోని మణులుగా స్మరించబడుతున్నారు. అటువంటి ఆత్మలు కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమందిగా మహిమ చేయబడుతున్నారు. వారు ఎవరు? మీరేనా? పాండవులు కూడా ఉన్నారా? మాతలు కూడా ఉన్నారు. (చేతులు -ఊపుతున్నారు. కనుక బాబా చెప్తున్నారు ఓ గారాభమైన పిల్లలూ!
అప్పుడప్పుడు హృదయ - సింహాసనాన్ని వదిలేసి దేహ రూపి మట్టిపై మనస్సు ఎందుకు పెడుతున్నారు? దేహం మట్టి, గారాభమైన పిల్లలు ఎప్పుడు మట్టిలో పాదం పెట్టరు, సదా సింహాసనంపై ఉంటారు - ఒడిలో లేదా అతీంద్రియసుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. మీ కొరకు బావి దాం - రకరకాలైన ఊయలలు ఇచ్చారు. అప్పుడప్పుడు సుఖం యొక్క ఊయలలో ఊగండి. అప్పుడప్పుడు సంతోషం యొక్క ఊయలలో ఊగండి, అప్పుడప్పుడు ఆనందమయ ఊయలలో ఊగండి." ఈరోజు బాప్దాదా నషాగా ఊయలలో ఊగేటటువంటి ఈ విధమైన శ్రేష్ట పిల్లలకు చూస్తున్నారు.
ఊగుతూ ఉన్నారా? ఊగుతున్నారా, మట్టిలోకి వెళ్ళటం లేదు కదా! అప్పుడప్పుడ . మట్టిలో పాదం పెట్టాలి అని మనస్సులో అనిపిస్తుందా? ఎందుకంటే 63 జన్మల నుండి మట్టిలోనే - పాదం పెట్టారు, మట్టితోనే ఆడుకున్నారు. ఇప్పుడైతే మట్టితో ఆడుకోవటం లేదు కదా? అప్పుడప్పుడు మట్టిలోకి పాదం వెళ్ళటం లేదు కదా?- అప్పుడప్పుడు వెళ్తుంది. దేహభ్రాంతి వచ్చింది అంటే మట్టిలో పాదం పెట్టినట్లు, దేహాభిమానం అనేది చాలా లోతైన మట్టిలో పాదం పెట్టడం.
కానీ దేహ భ్రాంతి అంటే శరీర అభిమానం ఇది కూడా మట్టి, సంగమయుగం యొక్క సమయంలో "ఎంత ఎక్కువ సమయం హృదయ సింహాసనాధికారిగా అవుతారో, అంతగా సూర్యవం రాజధానిలో మరియు చంద్రవంశంలో కూడా సూర్యవంశం యొక్క రాజ్య -ఒకవేళ ఇప్పుడు సంగమయుగంలో అప్పుడప్పుడు హృదయ సింహాసనాధికారిగా ఉంటే సూర్యవంశం యొక్క రాయల్ కుటుంబంలో కూడా కొద్ది సమయమే ఉంటారు. సింహాసనం అనేది ఒకరి తర్వాత ఒకరికి ఉంటుంది కానీ సదా రాయల్ కుటుంబంలో, రాజ్యవంశం యొక్క సంబంధంలో ఉంటారు.
కనుక సంగమయుగం యొక్క ఆది సమయం నుండి ఇప్పటి వరకు 10 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 66 సంవత్సరాలైనా కానీ ఎప్పటి నుండి బ్రాహ్మణులుగా అయ్యారో ఆది - నుండి ఇప్పటి వరకు ఎంత సమయం హృదయ సింహాసనాధికారిగా, స్వరాజ్య సింహాసనాధికారిగా ఉన్నాను? అని పరిశీలించుకోండి. చాలా కాలం ఉన్నానా, నిరంతరం ఉన్నానా లేక అప్పుడప్పుడు 'ఉన్నానా? ఎవరైతే పరమాత్య యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటారో వారి యొక్క గుర్తుర -ప్రత్యక్ష నడవడిక మరియు ముఖం ద్వారా నిశ్చింతాచక్రవర్తిగా కనిపిస్తారు.
స్థూల బరువు అయితే తలపై ఉంటుంది కానీ సూక్ష్మ బరువు మనస్సులో ఉంటుంది. వారికి మనస్సులో కూడా ఏ బరువు ఉండదు. చింత ఉంటే బరువు ఉంటుంది, నిశ్చింతగా ఉంటే డబలైట్గా ఉంటారు. . ఒకవేళ ఏ విధంగా అయినా సేవ యొక్క బరువు, సంబంధ, సంపర్కాల యొక్క బరువు, స్థూలసేవ, 'యొక్క బరువు, ఆత్మికసేవ యొక్క బరువు కూడా ఉండదు. ఏమౌతుంది, ఎలా అవుతుంది..... "సఫలత లభిస్తుందా, లభించదా.. అనే బరువు ఉండదు ఆలోచించడం, ప్లాన్ తయారు చేయటం ఇది వేరే విషయం, బరువు అనేది వేరే విషయం.
బరువు ఉన్నవారి యొక్క గుర్తు సదా ముఖంలో కొద్దిగా లేదా చాలా అలసట కనిపిస్తుంది. - 'సేవలో అలసిపోవటం ఇది వేరే విషయం, కానీ అలసట యొక్క గుర్తులు కనిపించడం అనేది . బరువుకి గుర్తు. నిశ్చింతాచక్రవర్తి అంటే సోమరితనంలో ఉండి మాకు ఏ చింత లేదు అని, -అనటం కాదు. సోమరితనం అనేది చాలా మోసం చేస్తుంది. తీవ్ర పురుషార్థానికి మాట అదే మరియు సోమరితనానికి కూడా అదే మాట. తీవ్రపురుషార్ధికి, సదా ధృఢ నిశ్చయం ఉన్న కారణంగా • ప్రతి కార్యం ధైర్యం మరియు బాబా యొక్క సహాయం ద్వారా సఫలత పొందే ఉంది అని భావిస్తారు.
మరియు సోమరితనంగా ఉండేవారు కూడా ఇదే మాట మాట్లాడుతారు అయిపోతుంది, " జరిగిపోతుంది, అయిపోయే ఉంది అని. ఏదైనా కార్యం ఉండిపోయిందా ఏమిటి, అన్నీ - అయిపోతాయి అంటారు. మాట ఒకటే కానీ రూపాలు వేర్వేరు. వర్తమాన సమయంలో మాయ. * యొక్క రెండు విశేషమైన రూపాలు పరీక్ష తీసుకుంటున్నాయి, అవి మీకు తెలుసా? తెలుసుకోవటం - ' అయితే తెలుసుకున్నారు. ఒకటి - వ్యర్ధసంకల్పాలు, వికల్పాలు కాదు, వ్యర్ధసంకల్పాలు రెండవది . కూడా చెప్పనా? రెండవది - నేనే రైట్ (నేనే సత్యం) ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది ఆలోచించినా.. నేనేమి తక్కువ కాదు, నేనే సత్యం.
ఇప్పుడు సమయం అనుసరించి బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు - ఒక మాట సదా స్మృతిలో ఉంచుకోండి - బాబా ద్వారా లభించిన సర్వప్రాప్తుల యొక్క స్నేహం యొక్క సహయోగం యొక్క రిటన్ (ఐదులు) ఇవ్వాలి, రిటన్ ఇవ్వటం అంటే సమానంగా అవ్వటం. - రెండవది మన యొక్క రిటన్ జర్నీ (తిరుగు ప్రయాణం లేదా యాత్ర) రిటన్ అనే ఒకే మాట స్మృతి . ఉంచు కోవాలి. దీని కొరకు చాలా సహజమైన సాధనం - ప్రతి సంకల్పం, మాట మరియు కర్మని -బ్రహ్మాబాబాతో పోల్చి చూసుకోండి. బాబా యొక్క సంకల్పం ఎలా ఉండేది? బాబా యొక్క మాట ఎలా ఉండేది? బాబా యొక్క కర్మ ఎలా ఉండేది?
దీనినే తండ్రిని అనుసరించడం అంటారు. అనుసరించడం అయితే సహజమే కదా! క్రొత్తగా ఆలోచించవలసిన, క్రొత్తగా చేయవలసిన అవసరమే లేదు. బాబా ఏదైతే చేసారో అదే చేయండి. సహజమే కదా! టీచర్లు చేతులు ఎత్తండి? అనుసరించడం కష్టమా లేక 'సహజమా? సహజమే కదా! మొదట పరిశీలించుకోండి, మొదట ఆలోచించి తర్వాత చేయండి, - ఆచితూచి మాట్లాడండి అంటారు కదా! ఈ సంవత్సరం టీచర్స్ అందరు, ఇప్పుడు ఇది ఈ "సంవత్సరం యొక్క చివరి నెల, ఇప్పుడు ఇక పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. క్రొత్తది వస్తుంది. క్రొత్తది వచ్చేముందే ఏమి చేయాలి అనేది తయారు చేసుకోండి.
బాబా అడుగుపై అడుగు తప్ప. - ఇంకే అడుగు వేయకండి, బాబా అడుగుపై అడుగు చేయండి. అడుగుపై అడుగు వేయటం 'సహజమే కదా! ఇప్పటి నుండి సంకల్పంలో క్రొత్త సంవత్సరం యొక్క ప్లాన్ తయారు చేసుకోండి.. ఏవిధంగా అయితే బ్రహ్మాబాబా నిమిత్త భావంతో, నిర్మాణభావంతో ఉండేవారో అదేవిధంగా నిమితభావం మరియు నిర్మాణభావం ఉండాలి. కేవలం నిమిత్తభావమే కాదు, నిమిత్తభావంతో పాటు సంకల్పంలో, మాటలో, ఎవరి యొక్క సంబంధంలో, కర్మలో నిర్మాణంగా ఉండాలి. ఎవరైతే నిర్మాణంగా ఉండరో వారిలో కొద్దిగా అనగా మహాన్ రూపంలో అభిమానం లేకపోయినా, -అహంకారం అయితే ఉంటుంది.
ఈ అహంకారం కూడా అభిమానం యొక్క అంశం. మరియు 'మాటలో సదా నిర్మలభాష, మధురభాష ఉండాలి. సంబంధ, సంపర్కంలో ఆత్మిక రూపం . యొక్క స్మృతి ఉంటే సదా నిరాకారిగా మరియు నిరహంకారిగా ఉంటారు. బ్రహ్మాబాబా యొక్క . చివరి మూడు మాటలు స్మృతి ఉంటున్నాయా? నిరాకారి, నిరహంకారిగా ఎవరైతే ఉంటారో వారే "నిర్వికారిగా అవుతారు. మంచిది, బాబాని అనుసరించండి. పక్కా కదా! గత సంవత్సరం యొక్క ముఖ్య లక్ష్య స్వరూపం యొక్క స్పృతి - ఈ మూడు మాటలే 'నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. అంశం కూడా ఉండకూడదు.
పెద్ద, పెద్ద రూపాలు అయితే సరి అయిపోయాయి కానీ అంశం కూడా ఉండకూడదు ఎందుకంటే అంశమే మోసం చేస్తుంది. ఫాలో ఫాదర్ యొక్క అర్ధం ఈ మూడు మాటలు సదా స్మృతిలో ఉండటం, సరేనా! మంచిది - డబల్ విదేశీయులు నిల్చోండి. మంచి గ్రూపు వచ్చారు. బాప్దాదాకి డబల్ విదేశీయుల యొక్క ఒక విషయం గురించి ఆనందంగా ఉంది, ఏ విషయం గురించి ఆనందంగా ఉందో తెలుసా? ఎంత దూరం నుండి, దూరదేశం నుండి వస్తున్నారు కానీ ఈ టర్న్ రండి "సలహా లభించగానే చేరుకున్నారు కదా! ఏదోక విధంగా ప్రయత్నం చేసి పెద్ద గ్రూప్ చేరుకున్నారు.
దాదీ యొక్క డైరెక్షన్ మంచిగా అంగీకరించారు కదా! దీనికి శుభాకాంక్షలు ,బాప్దాదా ఒక్కొక్కరికి చూస్తున్నారు. దృష్టి ఇస్తున్నారు. స్టేజ్ పైనే దృష్టి లభిస్తుంది అని భావించకండి. దూరం నుంచి "ఇంకా బాగా కనిపిస్తున్నారు. డబల్ విదేశీయులు, "అలాగే" అనే పాఠం మంచిగా చదువుకున్నారు. బాబా కి డబల్ విదేశీయులపై ప్రేమ అయితే ఉండనే ఉంది కానీ గర్వంగా కూడా ఉంది. -ఎందుకంటే విశ్వం యొక్క కొనకోనలో సందేశం ఇవ్వడానికి డబల్ విదేశీయులే నిమిత్తం అయ్యారు. విదేశంలో ఇప్పుడు ఏదైనా విశేష స్థానం ఉందా, గ్రామ, గ్రామం అయిపోయిందా లేక విశేష క స్థానం ఏదైనా ఉందా?
కోన- కోన, గ్రామ గ్రామం, చిన్న స్థానాలు, విశేషస్థానాలు ఏమైనా - ఉండిపోయాయా? ఏ స్థానం ఉండిపోయింది? ఈ గ్రూప్ కూడా ఎన్ని దేశాల యొక్క గ్రూప్త్యో చూడండి! లెక్క తీశారా? తీయలేదు. అయినప్పటికీ బాబాకి తెలుసు అనేక భిన్న, భిన్న దేశాలకు మీరు నిమిత్తం అయ్యారు. బాప్దాదా సదా చెప్తూనే ఉంటారు - విశ్వకళ్యాణకారి అనే - టైటిల్ని డబల్విదేశీయులే ప్రత్యక్షం చేస్తారు అని. మంచిది. ప్రతి ఒక్కరు తమ, తమ స్థానాలలో.. తమ యొక్క పురుషార్ధంలో మరియు సేవలో ముందుకు వెళ్తున్నారు మరియు సదా ముందుకు వెళ్తూ ఉంటారు. సఫలతా సీతారలు. చాలా మంచిది.
2. కుమారులతో - మధువనం యొక్క కుమారులు కూడా ఉన్నారు. కుమారుల యొక్క సంఖ్య ఎంత ఉందో చూడండి? సగం క్లాస్ కుమారులతో ఉంది. కుమారులు ఇప్పుడు సాధారణ -కుమారులు కాదు. ఇప్పుడు కుమారుల యొక్క టైటిల్ ఏమిటి? ఏ కుమారులు? బ్రహ్మాకుమారులే. -కానీ బ్రహ్మాకుమారుల యొక్క విశేషత ఏమిటి? కుమారుల యొక్క విశేషత - సదా ఎక్కడ. అశాంతి ఉన్నా దానిలో శాంతి వ్యాపింపచేసే శాంతి దూతలు. మనస్సు యొక్క అశాంతి ఉండకూడదు, -బయటి అశాంతి ఉండకూడదు.
కుమారుల యొక్క పనియే - కష్టమైన పని చేయటం, హార్డ్వేర్కర్ . `ఉంటారు కదా! ఈరోజు అన్నింటికంటే పెద్ద హార్డ్ కంటే హార్డ్ వర్క్ (అతి కష్టమైన పని) - అశాంతిని తొలగించి శాంతిదూత అయ్యి శాంతిని వ్యాపింపచేయటం. అటువంటి కుమారులేనా? -అశాంతి యొక్క గుర్తులు ఉండకూడదు. అటువంటి శాంతి దూతలే కదా? విశ్వంలో అశాంతి 'ఉండకూడదు, మీ యొక్క సంబంధ, సంపర్కంలో కూడా అశాంతి ఉండకూడదు. అగ్ని ఆర్పేవారు. ఎక్కడ అగ్ని అంటుకుంటే అక్కడ ఆర్పుతారు కదా! అదేవిధంగా శాంతిదూత యొక్క కార్య - అశాంతిని శాంతిలోకి మార్చడం.
శాంతిదూతలు కదా! పక్కా కదా! పక్కాయేనా? పక్కాయేనా? చాలా మంచిగా అనిపిస్తుంది. బాప్దాదా ఇంతమంది కుమారులను చూసి సంతోషిస్తున్నారు. అంతకు ముందు కూడా బాప్దాదా ప్లాన్ ఇచ్చారు కదా - ఢిల్లీలో ఎక్కువలో ఎక్కువ కుమారులు - ఉన్నారు. గవర్నమెంట్ వారు కుమారులు అంటే గొడవ చేసేవారు అని భావిస్తున్నారు కుమారులతో "భయపడుతున్నారు. ఇలా భయపడే గవర్నమెంట్ వారు ప్రతి బ్రహ్మాకుమార్ని, శాంతిదూత యొక్క టైటిల్తో స్వాగతం చేయాలి. అప్పుడే కుమారులది అద్భుతం అవుతుంది. మొత్తం విశ్వంలో -బ్రహ్మాకుమారులు శాంతిదూతలు అని రావాలి.
ఢిల్లీలో చేయాలి. చేయాలి కదా - దాదీలు చేస్తారా? ఒక గ్రూప్లో ఇంత మంది కుమార్తెలు ఉంటే అన్ని గ్రూప్లో ఎంత మంది ఉంటారు? . విశ్వంలో ఎంత మంది ఉంటారు? (సుమారు లక్ష మంది ఉంటారు) కనుక కుమారులు అద్భుతం చేయండి. గవర్నమెంట్ వారికి కుమారుల గురించి ఏదైతే వ్యతిరేఖం ఉందో దానిని మంచిగా చేయండి. కానీ మనస్సులో కూడా అశాంతి ఉండకూడదు. అప్పుడు బోర్డ్ పెట్టుకోవలసిన "అవసరం లేదు కానీ కుమారుల ముఖంలో, మస్తకంలో స్వతహాగా వీరు శాంతిదూతలు అని, -వ్రాసి ఉన్నట్లు అనుభవం అవుతుంది.
కుమారీలు నిల్చోండి కుమారీలు కూడా చాలా మంది ఉన్నారు? ఎవరైతే " సెంటర్లో ఉంటున్నారో వారు కాకుండా, ఎవరైతే సెంటర్లో ఉండటం లేదో వారు నిల్చోండి. ఈ కుమారీల అందరి యొక్క లక్ష్యం ఏమిటి? ఉద్యోగం చేయాలనా లేక విశ్వసేవ చేయాలనా? తలపై కిరీటం'. *పెట్టుకోవాలా లేక బుట్ట పెట్టుకోవాలా? ఏమి పెట్టుకోవాలి? కుమారీలందరు దయా హృదయులుగా అవ్వాలి. విశ్వాత్మల యొక్క కళ్యాణం జరగాలి. కుమారీలకు మహిమ ఉంది - 21 కులాలను -ఉద్దరించేవారు అని. అర్ధకల్పం 21 కులాలు అవుతుంది. అటువంటి కుమారీలేనా? ఎవరైతే 21 కులాల యొక్క ఉద్దరణ చేస్తారో వారు చేతులు ఎత్తండి!
ఒక పరివారం కాదు, 21 పరివారాలను ఉద్దరించాలి. ఇప్పుడు సమయం సూచన ఇస్తుంది. సమయం కంటే ముందే తయారయిపోండి -అని. సమయాన్ని చూస్తూ ఉంటే సమయం గడిచిపోతుంది. అందువలనే లక్ష్యం పెట్టుకోండి మేమందరం విశ్వకళ్యాణిలం, దయా హృదయుడైన బాబా యొక్క పిల్లలం దయాహృదయులం " అని. సరేనా? దయాహృదయులు కదా! ఇప్పుడు ఇంకా దయాహృదయులుగా అవ్వండి. ఇంకా -తీవ్రగతిలో అవ్వండి. కుమారీలకైతే చాలా సహజంగా బాబా యొక్క సింహాసనం లభిస్తుంది. * క్రొత్త సంవత్సరంలో ఏమి అద్భుతం చేసి చూపిస్తారో చూస్తాను.
మాతలు నిల్చోండి - క్లాస్లో సగంమంది మాతలు ఉన్నారు. చేతులు ఊపండి. ఈ -దృశ్యం బావుంది అనిపిస్తుంది. విదేశీయులలో కూడా మాతలు ఉన్నారు. మాతలు ఏమి అద్భుతం. "చేస్తారు? మాతలకి ఒక పాట తయారయ్యి ఉంది కదా! ఏమి పాటయో స్మృతి ఉందా? శక్తులే వెలిసిను.. ఈ పాట విన్నారా! వినకపోతే రేపు వినిపించండి. విశ్వంలో నలువైపుల శక్తుల గుంపు -వచ్చింది. మీరు శక్తులు, శక్తి మాతలు, మాతల యొక్క పని ఏమిటి? పిల్లలను మేల్కొల్పటం, "పాలన చేయటం మరియు అధికారిగా చేయటం.
ఇప్పుడు భారతదేశంలో లేదా విశ్వంలో బాబా - యొక్క పిల్లలు ఉన్నారు మీ యొక్క సోదరీలు నిద్రపోతున్నారు వారిని మేల్కొల్పండి. పాటలు "అయితే చాలా పాడుతున్నారు కదా మేల్కొండి, మేల్కొండి.... అని. ఇప్పుడు నిద్రపోతున్న కదా. "ఆత్మలను త్వరత్వరగా మేల్కొల్పండి. తమ యొక్క కొంచెం వారసత్వం అయినా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా బాగా ఆలశ్యం (టూ లేట్) అనే బోర్డ్ పెట్టలేదు. ఆలశ్యం అయ్యింది, కానీ బాగా ఆలశ్యం అవ్వలేదు. బాగా ఆలశ్యం అయ్యే ముందే, నిద్రపోతున్న వారిని మేల్కొల్పండి. మేల్కొల్పుతారు కదా?
మీ, మీ స్థానాలలో ఎక్కడ సేవ చేస్తున్నారో అక్కడ మేల్కొల్పండి. మరియు వారు దీపపు పురుగులుగా అయ్యి దేవం వరకు చేరుకునే విధంగా పూర్తిగా మేల్కొల్పే సేవ చేయండి. ఇప్పుడు రెండవ సంవత్సరం యొక్క ఫలితంలో ఒక్కొక్క మాత, ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరిని · "తయారుచేయాలి. చేయగలరా? ఒకరోజులో కాదు, ఒక నెలలో తయారుచేయాలి. ఒక నెలలో తయారు చేయలేకపోతే, రెండు నెలలలో తయారుచేయండి. ఈ సంవత్సరంలో ఇంతమంది మాతలు, రెండవ సంవత్సరంలో ఇంతమంది మాతలు అని ఫలితం వస్తుంది కదా!
సంవత్సరంలో ఇప్పుడు ఎంత మంది మాతలు వచ్చారు, ఎంత మంది సంఖ్యను పెంచారు అనేది బాప్దాదా చూస్తారు. ఎంతమంది మాతలు వచ్చారో లిస్ట్ ఉందా? (4 వేల మంది మాతలు? -వచ్చారు) 4 వేల మంది మాతలు వచ్చారంటే ఎంత వృద్ధి అవుతుందో చూస్తాను. ధైర్యం ఉందా? ఎవరైతే వృద్ధి జరుగుతుంది అని భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి! అలాగే అని చేతులు ఎత్తడం కాదు, టి.విలో ఫోటో వస్తుంది. బాబాకి మాతలంటే విశేషమైన ప్రేమ ఉంది. కనుకనే *బాబాకి గోపాలుడు అనే పేరు వచ్చింది. మాతల కారణంగానే గోపాలుడు అనే పేరు. 'మాతలు చాలా మంది ఉన్నారు.. వచ్చింది.
అధర్ కుమారులు నిల్చోండి - అధర్ కుమారులు కూడా తక్కువ కాదు. అధర్ కుమారులు వదిలేయమంటారు . కూడా బావి యొక్క పేరుని చాలా ప్రత్యక్షం చేసారు. వీరు కుటుంబాన్ని ద్వారా అని వ్యర్థవైబ్రేషన్ చాలా కాలం నుండి ఉంది కానీ అధర్కుమారులు ఈ వ్యర్థసంకల్పాన్ని సమాచా చేసారు. కనుక మీకు శుభాకాంక్షలు ఎందుకంటే బాబా యొక్క సేవలో ప్రత్యక్షజీవితం జవాబు ఇచ్చారు. చాలా మంచిది. అధర్ కుమార్ మరియు అధర్కుమారీలను బాప్దాదా" మహాత్మలను కూడా జయించే వారు అంటారు. మీ యొక్క చరణాల దగ్గరికి వస్తారు. మహాత్మలు చేయలేని పని మీరు చేసి చూపించారు.
కమలపుష్ప సమానంగా ఉంటున్నారు. ఒక్కొక్కరు కమల పుష్ప సమానంగా కుటుంబంలో ఉంటూ పరవృత్తిలో ఉంటున్నారు. కనుక సదా ముందుకు వెళ్తూ ఉండండి మరియు తీసుకువెళ్తూ ఉండండి. అదర్ కుమారుల సంఖ్యను కూడా పెంచాలి. - ధైర్యం ఉందా? అలాగే బాబా! ధైర్యం మాది, సహాయం నీది అని చెప్పండి. చాలా మంచిది. కలసి ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటున్నారు ఇది చాలా అద్భుతం. అందువలన బాప్దాదా కూడా అధర్ కుమారులు మరియు కుమారీలకు కూడా మనస్సుతో చాలా చాలా ఆశీర్వాదాలు - ఇస్తున్నారు. సదా ముందుకు వెళ్తూ ఉండండి. మంచిది. అందరికీ స్పెషల్ మిలనం జరిగింది . 'కదా! ఎవరైనా మిగిలిపోయారా?
చిన్న పిల్లలు మిగిలిపోయారు. పిల్లలు సదా ప్రతి స్థానానికి అలంకరణగా ఉంటారు. పిల్లలు ముందుండాలి. బాప్దాదాకి పిల్లలంటే అక్షోణి ప్రేమ ఉంది. మీ యొక్క హక్కు తీసుకున్నారు. * కదా! చతురులు కదా! ఈ విశ్వ విద్యాలయం యొక్క స్థాపన కూడా పిల్లల ద్వారానే జరిగింది. ఆదిలో పిల్లలే ఇప్పుడు పెద్దవారు అయ్యారు కదా! చాలా మంచిది. పిల్లలు బాప్దాదా యొక్క -శిరోకిరీటాలు, డబల్ చదువులో సదా మొదటి నెంబరు తీసుకుంటూ ఉండాలి. లౌకిక చదువులో కూడా మొదటి నెంబరు తీసుకోవాలి, రెండవ లేదా మూడవ నెంబరు కాదు. అలౌకిక చదువులో కూడా నెంబర్ వన్ గా ఉండే పిల్లలుగా అవ్వాలి.
బాప్దాదా చేయించే వ్యాయామం మీకు గుర్తు. - ఉందా? ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే ఫరిస్తా.... నడుస్తూ, తిరుగుతూ ఈ అభ్యాసం చేయటమే బాబా మరియు దాదా యొక్క ప్రేమకి బదులు ఇవ్వటం. ఇప్పుడిప్పుడే ఈ ఆత్మిక వ్యాయామం చేయండి. సెకనులో నిరాకారి, సెకనులో ఫరిస్తాగా అవ్వాలి. (బాప్దాదా వ్యాయామం చేయించారు) మంచిది. నడుస్తూ, తిరుగుతూ మొత్తం రోజంతటిలో ఈ వ్యాయామం బాబా యొక్క స్మృతిని సహజంగా ఇప్పిస్తుంది.
నలువైపుల ఉన్న పిల్లల యొక్క స్మృతి అన్ని వైపుల నుండి బాబాకి చేరుకుంది. ప్రతి పిల్లవాడు మా యొక్క ప్రియస్మృతులు, ప్రియస్మృతులు అని అంటున్నారు. కొంతమంది ఉత్తరాల ద్వారా, కొంతమంది కార్డుల ద్వారా, కొంతమంది నోటి ద్వారా చెప్తున్నారు. నా కానీ బాప్దాదా నలువైపుల ఉన్న పిల్లలను ఒకొక్కరినీ నయనాలలో నింపుకుని ఆ ప్రియస్కృతులకు బదులుగా కోటానుకోట్ల రెట్లు ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఈ సమయంలో ఎవరికి ఎంత సమయం టైమ్) అయినా కానీ మోజారిటీ ఆత్మల యొక్క మనస్సులో మధువనం మరియు మధువనం - * యొక్క బాప్దాదా ఉన్నారు.
నలువైపుల ఉన్నటువంటి మూడు సింహాసనాల అధికారి పిల్లలకు, స్వరాజ్యాధికారి పిల్లలకు, సదా బాబాకి బదులు ఇచ్చేటందుకు బాబా సమానంగా అయ్యే వారికి, సదా తిరిగివెళ్ళాలి. అనే యాత్రను స్మృతిలో ఉంచుకునే స్మృతి స్వరూప పిల్లలకు, సదా సంకల్పం, వాణి మరియు కర్మలో బాబాని ఫాలో చేసే ప్రతి పిల్లవానికి బాప్దాదా యొక్క చాలా, చాలా, చాలా ప్రియస్స్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.