రివైజ్ కోర్స్ మురళి 31-12-2002
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
ఈ క్రొత్త సంవత్సరంలో సర్వఖజానాలను సఫలం చేసుకుని సఫలతామూర్తిగా అయ్యే విశేషత చూపించండి
ఈరోజు నవయుగ రచయిత, నవజీవన దాత బాప్దాదా క్రొత్త సంవత్సరం జరుపుకునేటందుకు వచ్చారు. మీరందరు క్రొత్త సంవత్సరం జరుపుకునేటందుకు వచ్చారా లేక క్రొత్తయుగం జరుపుకునేటందుకు వచ్చారా? క్రొత్త సంవత్సరం అందరు జరుకుంటారు కానీ మీరందరు క్రొత్త జీవితం, క్రొత్త యుగం మరియు క్రొత్త సంవత్సరం మూడూ జరుపుకుంటున్నారు. బాప్దాదా -కూడా త్రిమూర్తి శుభాకాంక్షలు ఇస్తున్నారు. క్రొత్త సంవత్సరంలో ఒకరికొకరు శుభాకాంక్షలు. ఇచ్చుకుంటారు మరియు ఏదోక బహుమతి కూడా ఇస్తారు. బహుమతి ఇస్తారు కదా! కానీ బాప్దాదా మీ అందరికీ ఏ బహుమతినిచ్చారు?
స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతి ఇచ్చారు. అందరికీ స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతి లభించింది కదా! ఆ స్వర్ణిమ ప్రపంచంలో, కొత్త- యుగంలో సర్వప్రాప్తులు ఉంటాయి. మీ రాజ్యం స్మృతి ఉందా? అప్రాప్తి యొక్క నామరూపాలేమీ -ఉండవు. ఈ విధమైన బహుమతి బాప్దాదా తప్ప మరెవ్వరు ఇవ్వలేరు. మొత్తం విశ్వంలో ఎవ రైనా ఎంత గొప్ప బహుమతి ఇచ్చినా ఏమి ఇస్తారు? ఉన్నతోన్నతమైన కిరీటము లేదా సింహాసనం ఇస్తారు. స్థాపన యొక్క ఆదిలో (స్థాపన కాలంలో ఉన్న ఆత్మలు ముందు కూర్చున్నారు) (బ్రహ్మాబాబా : అడిగేవారు - ఒకవేళ ఎవరైనా మీకు ఈరోజుల్లో రాజా, రాణీ యొక్క సింహాసనం ఇస్తే తీసుకుంటారా? అని జ్ఞాపబహుమతికం ఉంది కదా?
అప్పుడు పిల్లలు, బాబా లభించినప్పుడు ఈ. హాసనం, కిరీటం ఏమి చేసుకుంటాము అనేవారు. ఈ స్వర్ణిమ ప్రపంచం యొక్క .. ముందు ఏ బహుమతి గొప్ప కాదు. కొంతమంది పిల్లలు సత్యయుగంలో ఏమేమి ప్రాప్తులు ఉంటాయి అని అడుగుతారు. దాదా చెప్తున్నారు ప్రాప్తుల యొక్క లిస్ట్ అయితే చాలా పెద్దది, సార రూపంలో ఏంచెప్తారు? ఏ వస్తువు యొక్క అప్రాప్తి ఉండదు. జీవితంలో ఏవైతే కావాలో అవన్నీ లభిస్తాయి.అటువంటి స్వర్ణమ్ ప్రపంచం యొక్క బహుమతికి అధికారి ఆత్మలు, అధికారులు కదా! డబల్ దేశీయులు అధికారులే కదా? (చేతులు ఊపుతున్నారు) అందరు రాజులుగా అవుతారా?
రాజులు అవుతారు మంచిది. అయితే ఇన్ని సింహాసనాలు తయారు చేయవలసి ఉంటుంది. ఆ సింహాసనం సింహాసనమే, అక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయి కానీ సంగమయుగీ స్వరాజ్యం దానికంటే తక్కువైనది కాదు. ఇప్పుడు కూడా రాజులే కదా! ప్రజలా లేక రాయల్ఫ్యామిలీ ఆత్మలా? ఎవరు? నా యొక్క ఒక్కొక్క పిల్లవాడు రాజా పిల్లవాడు అని నిశ్చయంతో బాబా కదా! రాజయోగులా లేక ప్రజాయోగులా? ఈ సమయంలో అందరు హృదయసింహాసనాధికారి -ఒక్కరే చెప్పగలరు. మీరు రాజులు స్వరాజ్యాధికారి, రాజా పిల్లలు. ఇంత ఆత్మికనషా ఉంటుంది కదా? ఎందుకంటే ఈ సమయం 'యొక్క స్వరాజ్యం ద్వారానే భవిష్య రాజ్యం లభిస్తుంది.
ఈ సంగమయుగం చాలా, చాలా, చాలా అమూల్యమైనది, శ్రేష్టమైనది. సంగమయుగం గురించి బాప్దాదాకి మరియు పిల్లలందరికీ తెలుసు సంతోషంతో సంగమయుగానికి ఏ పేరు పెట్టారు? మజాల యుగం. సంగమయుగంలో ఉన్న ఆనందం. -మొత్తం కల్పంలో ఉండదు. కారణం ఏమిటి? పరమాత్మ కలయిక యొక్క ఆనందం మొత్తం - కల్పంలో ఇప్పుడే లభిస్తుంది. సంగమయుగం యొక్క ఒక్కొక్క రోజు ఏవిధంగా ఉంటుంది? ఆనందమే ఆనందం. ఆనందంలో ఉన్నారు కదా, అయోమయం అవ్వటంలేదు కదా! ప్రతి రోజు . ఉత్సమమే ఎందుకంటే ఉత్సాహంలో ఉంటారు. మీ సోదరీ సోదరులందరినీ పరమాత్మ తండ్రి - వారిగా చేయాలి అనే ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నాయి కదా!
సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నాయి కదా! ఇది చేయాలి, అది చేయాలి. ఇలా చేయాలి... అని ప్లాన్స్ తయారుచేస్తున్నారు కదా! ఎందుకంటే శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తున్నప్పుడు "ఇతరులకు చెప్పకుండా ఉండలేదు. ఈ సంగమయుగం యొక్క ప్రాప్తి స్వర్ణమ ప్రపంచంలో కూడా ఉంటుంది. ఇప్పటి పురుషార్ధం యొక్క ప్రాలబ్ధమే భవిష్య స్వర్ణిమ ప్రపంచం, సంగమయుగం. ఇష్టం అనిపిస్తుందా, సత్యయుగం ఇష్టం అనిపిస్తుందా? ఏది ఇష్టం అనిపిస్తుంది? సంగమయుగం సూవుంది కదా? కేవలం మధ్యమధ్యలో మాయ వస్తుంది. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా అయోమయం. అవుతున్నారు.
కొంతమంది పిల్లలు సహజయోగాన్ని కష్టయోగంగా చేసేసుకుంటున్నారు. కష్టం కాదు. కానీ కష్టంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి చాలా సహజమైనది. కష్టమనిపిస్తుందా? ఎవరికి కష్టం అనిపిస్తుందో వారు చేతులు ఎత్తండి! సదా కాదు కానీ అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా? లేక సహజమేనా? కష్టయోగులం అనేవారు చేతులు ఎత్తండి! మాతలు కష్టయోగుల - లేక సహజ యోగులా? కష్టయోగులు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తమని చెప్పటం లేదు ఎందుకం చాలా పెద్ద సభ ఉంది కదా! పిల్లలందరు సంతోషంతో పొంగుతూ నా బాబా అని అంటున్నారు. -నా బాబా అంటున్నారా?
నా బాబా అంటున్నారా లేక దాదీల బాబాయా? నా బాబా కదా! ప్రతి ఒక్కరు మొదట నావాడు అంటారు. సింధ్ దేశంవారు అందరు కూర్చున్నారు కదా! నా బాబాయా లేక జానకీ దాదీ బాబా, ప్రకాశమణి దాదీ బాబాయా? ఎవరి బాబా? నా బాబా కదా? రోజంతా -ఏమి జ్ఞాపకం ఉంటుంది? నా బాబా కదా! బాప్దాదా చాలా సహజయుక్తి చెప్తున్నారు. రోజంతటిలో ఎన్నిసార్లు నాది అనే మాట వాడతారు? ఒకవేళ లెక్క పెడితే చాలాసార్లు మాట్లాడతారు కదా! వాడి - అని మాట్లాడేటప్పుడు నాది అంటే ఎవరు? నా బాబా. కష్టమా? అప్పుడప్పుడు మర్చిపోతున్నారా? బాప్దాదా క్రొత్త మాట చెప్పటంలేదు.
నేను, నాది అనే మాటలు సదా కార్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే నేనెవరు మరియు నాది ఏమిటి? కొంతమంది పిల్లలు పురుషార్ధం కష్టంగా - ఎందుకు చేస్తున్నారు? కేవలం బిందువు ఎదురుగా రావాలి అనుకుంటున్నారు బిందువు, బిందువు, - బిందువు... బిందువే కానీ ఎటువంటి బిందువు? నేనెవరు అనే స్వమానం స్మృతిలోకి తెచ్చుకోవటం ద్వారా పురుషార్ధం రమణీయకంగా అవుతుంది, కేవలం జ్యోతిర్బిందువు అనుకుంటే అవుతుంది. సహజ పురుషార్ధం మరియు మజా పురుషార్ధం చేయండి.
ఈ క్రొత్త సంవత్సరంలో పురుషార్ధం శ్రేష్టంగా ఉండాలి మరియు సహజంగా కూడా ఉండాలి. రెండూ వెనువెంట ఉంటాయా? డబల్ విదేశీయులు చెప్పండి? బాప్దాదా చూస్తున్నారు. బాబా అయితే పరిశీలన చేస్తూ ఉంటారు కదా! ఎవరెవరు కష్టయోగులుగా అవుతున్నారు! సహజయోగం అంటే సోమరితనపు పురుషార్ధిగా అవ్వమని కాదు. పురుషార్ధం శ్రేష్టంగా మరియు సహజంగా ఉండాలి. పాండవులు సహజయోగులేనా? సహజయోగులు చేతులు ఎత్తండి! టీ.విలో వస్తుంది. శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎవరి ముందు ఏ కష్టం రాదు ఎందుకంటే అందరు 'సహజయోగులు. సోమరిగా అవ్వకూడదు.
ఈ క్రొత్త సంవత్సరంలో సమయ ప్రమాణంగా విశేషంగా అందరు ఇవే లక్ష్యం పెట్టుకోవాలి' -సమయం, సంకల్పం, గుణాలు, జ్ఞానం, శక్తులు... ఇలా ఏవైతే ఖజానాలు లభించాయో . అన్నింటినీ సఫలం చేసుకోవాలి. అన్నింటికంటే ఉన్నతమైన ఖజానా సంకల్పం. శ్రేష్టమైన సంకల్పం, శుద్ధమైన సంకల్పం ఉండాలి. ఈ అన్ని ఖజానాలను ప్రతి రోజు సఫలం చేసుకోవాలి. -బాగా పంచి పెట్టండి. దాత యొక్క పిల్లలు, మాస్టర్ దాతలుగా అవ్వండి. బాగా పంచండి. ఎందుకు? సఫలం చేసుకోవటం అంటే సఫలతను పొందటం. ఈ సంవత్సరం యొక్క ఈ విశేషతను సదా స్థిరంగా ఉంచుకోవాలి.
సఫలం చేసుకోవాలి. సఫలత లభించే ఉంది. సఫలత -మా యొక్క జన్మసిద్ధ అధికారం అని అందరు చెప్తారు కదా! అధికారమేనా? కనుక సఫలం "చేసుకోండి మరియు సఫలత పొందండి. ఏ కార్యం చేసినా ఏదోక ఖజానా సఫలం చేసుకుంటూ వెళ్ళండి మరియు సఫలత యొక్క అనుభవం చేసుకుంటూ వెళ్ళండి. ఆలోచించుకోండి - సఫలత్వం -యొక్క అధికారం బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికైనా లభిస్తుందా? ఎందుకు? ఎందుకంటే -బాబా మీకు సఫలత భవ అనే వరదానం ఇచ్చారు. బాప్దాదా సదా చెప్తారు - ఒక్కొక్క బ్రాహ్మణాత్మ సఫలత సితార, సఫలతాస్వరూపం.
సఫలతా సితారలా లేక శ్రమ సితారలా? బాబా దాదా సదా పిల్లలను సఫలతా స్వరూపంలోనే చూస్తారు. బ్రహ్మాబాబా ఆదిలో ఎంత సమయంలో అన్నింటినీ - సఫలం చేసుకున్నారో జ్ఞాపకం ఉందా? అంతిమం వరకు తన యొక్క సమయాన్ని సఫలం : చేసుకున్నారు, కర్మాతీతంగా అయిపోయినా కానీ ఎన్నో ఉత్తరాలు వ్రాసేవారు! సమయం సఫలం. చేసుకున్నారు కదా! చివరి రోజు కూడా మహావాక్యాలను పలికారు. చివరి రోజు వరకు అన్నీ - సఫలం చేసుకున్నారు. అందువలనే సఫతలని పొందారు. కనుక బాబాని అనుసరించండి.
సంగమయుగం యొక్క ఒకొక్క సంకల్పం, ఒక్కొక్క సెకను సఫలం చేసుకోవడమే సఫలతా మూర్తిగా అవ్వటం. అందరు నిశ్చయంతో బ్రహ్మాబాబాపై మాకు చాలా ప్రేమ ఉంది అని చెప్తున్నారు కదా! ప్రేమకి గుర్తు బాబాకి ఏది ఇష్టమో పిల్లలకి కూడా అదే ఇష్టం అనిపించాలి. సమయం, సంకల్పం మరియు సర్వఖజానాలను సఫలం చేసుకోవాలి. వ్యర్ధం చేసుకోకూడదు. ప్రేమకి గుర్తు - బాబాని అనుసరించాలి. బ్రహ్మాబాబా ఏమి విశేషత చూపించారు? ఏది ఆలోచించేవారో అది సెకనులో చేసేవారు. కేవలం ఆలోచించడం, ప్లాన్ తయారుచేయటం కాదు ప్రత్యక్షంలో చేసి చూపించారు.
బాబాని అనుసరించేవారే కదా? మంచిది! ఈరోజు క్రొత్త సంవత్సరం జరుపుకునేటందుకు చాలా మంది వచ్చారు. మంచిది, ఒకవేళ హాల్ చిన్నది అయినా మనస్సు అయితే విశాలంగా ఉంది. హృదయం విశాలంగా ఉంది కనుకే సర్దుకున్నారు కదా? (ఈనాటి సభలో 18, 19 వేల మంది సోదరి, సోదరులు కూర్చున్నారు అందరు బయట కూర్చుని కూడా వింటున్నారు కదా? బయట కూర్చున్నవారు కూడా వింటున్నారు వారు కనిపించడంలేదు. బాప్దాదా విన్నారు - విదేశంలో ఆస్ట్రేలియా వారు అందరి కంటే ఎక్కువగా 12 గంటలకి కూర్చుంటున్నారు. రాత్రి 12 గంటలకు కూర్చుంటున్నారు తిరిగి అమృతవేళ 4 గంటలకు లేస్తున్నారు.
కనుక బాషా కూడా ఆస్ట్రేలియా వారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా వారు చేతులు . ఎత్తండి! త్రిమూర్తి శుభాకాంక్షలు మొదట ఆస్ట్రేలియా వారికి తర్వాత అందరికీ ఇస్తున్నారు. ఈ సంవత్సరం యొక్క లక్ష్యం అయితే చెప్పాను - సఫలం చేసుకోండి సఫలత లభిస్తుంది. -ఇది అందరు పక్కా చేసుకున్నారా? సఫలం చేసుకోవాలి. వ్యర్ధం కాదు. సంగమయుగం అంటే సమర్ధయుగం, సఫలతాయుగం, వ్యర్ధం చేసుకునే యుగం కాదు. వ్యర్ధం యొక్క 63 జన్మలు సమాప్తి అయిపోయాయి. ఇప్పుడు ఈ చిన్న యుగం సఫలం చేసకునే యుగం.
ఒకవేళ ఇప్పుడు సమయం సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా అర్ధకల్పం పూర్తి సమయం రాజ్యాధికారి అవుతారు. ఒకవేళ అప్పుడప్పుడు సఫలం చేసుకుంటే అప్పుడప్పుడు రాజ్యాధికారిగా అవుతారు.. ఇదే సమయం సఫలం చేసుకున్న దానికి ప్రాలబ్బం. శ్వాసను సఫలం చేసుకుంటే 21 జన్మలు ఆరోగ్యంగా ఉంటారు. నడుస్తూ, నడుస్తూ గుండె ఆగిపోదు. కొంతమందికి గుండె ఆగిపోతుంది. కొంతమందికి నరాలలో రక్తసరఫరా నిలిచిపోతుంది. అక్కడ అలా జరగదు. జ్ఞానం యొక్క ఖజానాను కూడా సఫలం చేసుకోండి.
జ్ఞానం అంటే తెలివి దీనిని జమ చేసుకోవటం ద్వారా అక్కడ ఎంత తెలివైన వారిగా అవుతారంటే మంత్రుల యొక్క అవసరం ఉండదు. ఈరోజుల్లో చూడండి పదవి యొక్క శపధం చేస్తూనే మంత్రిమండలిని తయారు చేసుకుంటారు. అక్కడ సహయోగులు ఉంటారు కానీ మంత్రులు ఉండరు. రాయల్ఫ్యామిలీ వారు ప్రతి ఒక్కరు రాజ్యసభలో కూర్చునే కిరీటధారులుగా ఉంటారు. రాయల్ప్యామిలీ వారు కూడా తక్కువేమి కాదు, సింహాసనంపై కూర్చోకపోయినా కానీ కర్తవ్యం అనేది ఒకే విధంగా ఉంటుంది.
అందువలన సింహాసనాధికారులుగా కొద్దిమందే అవుతారు అని ఆలోచించకండి కానీ మీరు కూడా రాజ్యసభలో రాజ్యాధికారి రూపంలో ఉంటారు. మీ తలపై కూడా కిరీటం ఉంటుంది మరియు మీకు కూడా పూర్తి అధికారం ఉంటుంది. కనుక ఏవిధంగా అవుతారు? నెంబర్ వన్ అవుతారా లేక నెంబర్ వార్గా అవుతారా? ఏమి చేయాలో తెలుసా? ధైర్యం చూపించారు. ఇది చాలా మంచిది. కానీ మొదట నెంబర్ అవ్వడానికి ముందు జయించాల్సి ఉంటుంది. జయిస్తున్నారు కదా! చేస్తాము అనటం కాదు, చేస్తున్నాను. అనాలి.
ఈరోజు సింధ్ ప్రాంతంలోని పాతవారు, బ్రహ్మాబాబా యొక్క సహయోగులు చాలా మంది వచ్చారు. వారు చేతులు ఎత్తండి! హిందీ వారు కాదు, సింధీ వారు పిల్లలు కూడా నిల్చొండి పెద్ద విషయం చెప్పటం లేదు చిన్న విషయం చెప్తున్నాను చేయడానికి తయారుగా ఉన్నారా? పిల్లలు కూడా అద్భుతం చేసి చూపిస్తారు కదా? (38 లక్షలను తయారు చేస్తాము అని చెప్పారు-కోటిరెట్లు శుభాకాంక్షలు. మీరు అయితే పెద్ద విషయం చెప్పారు కానీ బాప్దాదా చిన్న విషయం " చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరినీ తీసుకురండి. తీసుకువస్తారు కదా? పిల్లలైతే పిల్లలను తీసుకురండి.
మాతలైతే అన్నయ్యలను లేదా అక్కయ్యలను తీసుకురండి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి తీసుకురండి. ఈ గ్రూప్ గైడ్ గా అయ్యి మరలా సంవత్సరానికి డబల్ గ్రూప్ తీసుకురావాలి బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు ఎక్కడ నుండి ఆది అయ్యిందో అక్కడే ప్రత్యక్షత జరగాలి అని. దయవస్తుంది కదా! బ్రహ్మాబాబా యొక్క దేశవాసీయులు కనుక దేశవాసీయులతో ప్రేమ ఉంటుంది. మీ దగ్గర చాలా ఖజానాలు ఉన్నాయి, గుణాల యొక్క ఖజానా ఎంత పెద్దది, శక్తులు యొక్క ఖజానా ఎంత పెద్దది! కనుక గుణదానం మరియు శక్తుల యొక్క దానం చేసే మాస్టర్ దాతగా -అవ్వండి.
ఎవరు సంబంధంలోకి వచ్చినా, సంపర్కంలోకి వచ్చినా వారికి ఏదోక శక్తి లేదా గుణం " యొక్క బహుమతి ఇవ్వండి. ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏమి లేకపోయినా బాబా సందేశం యొక్క మధురమైన మాట అయినా బహుమతిగా ఇవ్వాలి. ప్రపంచం వారు ఏదైనా పండగ జరుపుకుంటే ఒకరికొకరు నోటిని తీపిగా చేసుకుంటారు. కానీ బాప్దాదా చెప్తున్నారు. మీరు కూడా నోటిని మధురంగా చేసుకోండి కానీ ముఖాన్ని కూడా మధురంగా చూపించాలి. కేవలం నోరు మధురం చేసుకోవటం కాదు, ముఖాన్ని కూడా మధురంగా చేసుకోవాలి. ఇంత -మధురత జమ అయ్యింది కదా! పంచిపెడుతున్నా కానీ నిండుగా ఉండాలి. ఈ ఖజానాలను ఎంత పంచిపెడితే అంత పెరుగుతుంది, తక్కువ అవ్వదు.
ఈ సంవత్సరం నోట్ చేసుకోండి- ఏ ఆత్మ వచ్చినా ఆ ఆత్మకి ఏదైనా ఇచ్చామా? ఒకవే మీరు చెప్తే వినేవారు కాకపోతే మధురమైన శక్తిశాలి దృష్టి ఇవ్వాలి. కానీ తప్పకుండా ఇవ్వాలి ఖాళీగా వెళ్ళకూడదు. ఇదైతే సహజమే కదా! కష్టమా? డబల్ విదేశీ యువకుల గ్రూపుతో యువకులకు అన్నింటికంటే శ్రేష్టశక్తి - పరివర్తనాశక్తి ఉండాలి. ఆలోచించారు అంటే చేయాలి - యువకులు ప్రతిజ్ఞలు చాలా చేశారు కదా! బాప్దాదా సమాచారం విన్నారు. యువకులు ఏవిధంగా* అయ్యారు? (యువకులందరు చేతులు ఊపుతున్నారు) అందరు తిలకధారులుగా అయ్యి వచ్చారు.
విశేష రిఫ్రెస్మెంట్ తీసుకున్న తికలధారులు నిల్చోండి! (తిలకం పెట్టుకుని కూర్చున్నారు) మంచి గుర్తు పెట్టుకున్నారు. ఆత్మ మెరుస్తుంది కదా? ఎవరైతే ఈ ట్రైనింగ్ ద్వారా గోల్డెన్ హార్ట్ - -తయారయ్యింది అని భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి! గోల్డెన్ స్టార్ (స్వర్ణమ నక్షత్రం) కాదు : విమానంలో తిరిగి వెళ్తున్నప్పుడు మరలా గోల్డెన్ హార్ట్ పైకి క్రిందకి అవ్వదు కదా! మీ దేశానికి - వెళ్ళిన తర్వాత గోల్డెన్ సిల్వర్గా అయిపోదు కదా? అవ్వదు కదా? భారతదేశం యొక్క ఆత్మలను మేల్కొల్పే విధంగా తయారవ్వండి. భారతదేశాన్ని మేల్కొల్పుతారా? భారతదేశం వారు చాలా. వంకర ప్రశ్నలు వేస్తారు. సమాధానం చెప్తారా?
మీ అందరి ఫోటో టి.విలో వస్తుంది. మీ అందరికి - భారతదేశాన్ని మేల్కొల్పే ఆహ్వానం వస్తుంది. ఎవరెడీగా ఉండాలి. ఒకవేళ టికెట్ లేకపోయినా దొరుకుతుంది. బాప్దాదాకి డబల్ విదేశీయుల యొక్క విశేషత తెలుసు -కులుసుకుంటారు మరలా సంవత్సరానికి సంవత్సరం అంతా తయారుచేసుకుంటారు. ఎన్ని - ఒక సంవత్సరం దేశాల యువకులు ఉన్నారు? (21 దేశాల వారు ఉన్నారు) బాబాకి తెలుసు - ఈ గోల్డెన్ ' హార్ట్ అద్భుతం చేస్తుంది. ధ్యాన మంచిగా పెట్టుకున్నారు. ఈ సారి ఎక్కువగా స్వపురుషార్ధం పై -అండర్లైన్ చేసుకున్నారు. బాప్దాదా సంతోషిస్తున్నారు. గ్రూప్ గ్రూప్ తయారు చేయటం ద్వారా ధ్యాస వస్తుంది. మొత్తం సంఘటనకు బదులు గ్రూప్ మంచిగా ఉంది కానీ పాజిటివ్ గా ఉండాలి.
(బాప్దాదా ప్రతి గ్రూప్ వారిని నిలబెడుతున్నారు. అంతర్ముఖి గ్రూప్ వారితో మాట్లాడుతున్నారు) మంచి పురుషార్ధం చేశారు. బాబా చూస్తున్నారు - ప్రతి గ్రూప్ వారు ఎవరికి వారు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఈర్ష్య పడటంలేదు కానీ పరుగు పెడుతున్నారు. -మంచిది, అంతర్ముఖి - సదాసుఖి (శాంతి గ్రూప్ వారితో మాట్లాడుతున్నారు) బాబా శక్తి గ్రూప్ వారిని అడుగుతున్నారు - ప్రత్యక్షత యొక్క జెండా ఎప్పుడు ఎగరవేస్తారు? అని. శక్తులు జెండా ఎగరవేసేవారు కదా! ప్రత్యక్షత యొక్క జెండా శక్తులే ఎగరవేస్తారు కదా! మంచిది. పరస్పరం - ఆత్మిక సంభాషణ చేసుకుని తారీఖు నిర్ణయం చేసుకోవాలి.
ఇతర విషయాల గురించి ఎలా అయితే తారీఖు నిర్ణయం చేసుకుంటున్నారో అదేవిధంగా ప్రత్యక్షత యొక్క జెండా ఎప్పుడు. ఎగరచేస్తారో ఆ తారీఖు నిర్ణయించండి. ఎగరవేస్తారు కదా? (మహావీర్ గ్రూప్ తో మాట్లాడుతున్నారు). మహావీర్ గ్రూప్ ఏమి చేస్తారు? సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతో పాటు మాయకి కూడా సదాకాలికంగా వీడ్కోలు ఇవ్వండి. మాయకి వీడ్కోలు ఇస్తారా? మాయ వచ్చినా పర్వాలేదా? మహావీర్ అంటే అర్ధం - బ్రహ్మాబాబా ఏది చెప్పేవారో అది చేసేవారు, ఏది ఆలోచించేవారో అది వెంటనే చేసేవారు. తక్షణమే దానం చేసి మహాపుణ్యం సంపాదించుకున్నారు.
మహావీరులకు కూడా ఇదే లక్ష్యం ఉంది కదా! చేస్తారా? మంచిది, ధైర్యం అయితే వస్తుంది. (విదేశాల నుండి చిన్న పిల్లల యొక్క గ్రూప్ వచ్చారు) అందరు తమ యొక్క గుర్తు పెట్టుకున్నారు. (యువకులు) తిలకం పెట్టుకున్నారు. చిన్న పిల్లలు బేనర్ వేసుకుని చేతిలో శివబాబా జెండా పట్టుకున్నారు) 1 దేవదూత నుండి దేవతగా అయిపోయారు. ఎంత మంచిగా ఉంది! దేవత అంటే దివ్యగుణాలు కలిగినవారు. దివ్యగుణాలను ఎప్పుడు వదలకూడదు. పిల్లలకు ఉత్సాహ, ఉల్లాసాలు పెరుగుతాయి. భారతదేశం యొక్క పిల్లలు కూడా నిల్చోండి! (భారతదేశం నుండి 1000 మంది పిల్లలు వచ్చారు) మంచిది.
భారతదేశం మరియు విదేశాలు అందరూ కలిసి ఢిల్లీపై ప్రభావం చూపించండి ఢిల్లీని మీ రాజధానిగా చేసుకోవాలి కదా! అయితే మొదట రాజధానిగా తయారుచేసుకుంటేనే రాజ్యం చేయగలరు కదా! ఢిల్లీలో నలువైపులు ప్రభావం వేయండి. భారతదేశం యొక్క వి. బి.పిలు అందరూ మేల్కొవాలి. భారతదేశం యొక్క పిల్లలు కూడా చేస్తారు కదా! మంచిది, భారతదేశం కూడా తక్కువ కాదు. మంచి మంచి పిల్లలు వచ్చారు. మంచిది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమి నవీనత చేస్తారు? ఇప్పటివరకు బాప్దాదా ఏదైతే పని ఇచ్చారో అది చేయలేదు. మైక్ లేదా వారసులను తీసుకురమ్మని చెప్పారు కానీ ఎక్కడ -తీసుకువచ్చారు?
బాప్దాదా ఇదే చెప్తున్నారు - వెయిట్ అండ్ సీ. మైక్ అయిన వారు ప్రత్యక్షత యొక్క ఎగురవేయటంలో తెలివైనవారిగా ఉంటారు. వేర్వేరు దేశాలలో కొందరు మైక్ ఉన్నారు కానీ సంఘటిత రూపంలో బాప్దాదా ఎదురుగా రాలేదు. ఇప్పుడు వారిని అందరికీ కలపండి అందరినీ కలపటం ద్వారా ఏమి జరుగుతుంది? ఒకరినొకరు చూసి వారికి ఉత్సాహం ఉల్లాసాలు వస్తాయి. భారతదేశంలో కూడా మైక్ కావాలి మరియు విదేశాలలో కూడా. తయారవుతున్నారు కదా? కానీ ఇప్పుడు వారు దాగి ఉన్నారు, పరదా లోపల ఉన్నారు, వారిని 'బయటకు తీసుకురండి. తీసుకురావాలి కదా! చాలా మంచిది.
మాతలు చాలా మంది ఉన్నారు. "నిల్చోమంటే హాలు అంతా దాగిపోతుంది. మాతలను చూసి బాప్దాదా సంతోషిస్తారు. ఎందుకు.? ఎందుకంటే సంగమయుగంలో బాప్దాదా ద్వారా మాతలకే అవకాశం లభిస్తుంది. ద్వాపర, కలియుగాలలో లభించలేదు, ఇప్పుడు లభిస్తూ ఉంది. మహాత్మలలో కూడా రోజురోజుకి ఎక్కువ అవకాశం లభిస్తుంది. ప్రభుత్వంలో కూడా మాతలకి సేవ చేసే అవకాశం లభిస్తుంది. బాప్దాదా సదా చెప్తూ ఉంటారు - మాతలు ఏ సెంటర్లో ఉంటే ఆ సెంటర్ సదా ఫలీభూతంగా ఉంటుంది. వారు సంపాదించకపోయినా హృదయం చాలా విశాలంగా ఉంటుంది, భావన చాలా విశాలంగా ఉంటుంది. .
బాబా కూడా భావన మరియు సత్యమైన హృదయాన్ని ఇష్టపడతారు. ప్రతి గ్రూప్ చూశారు మాతలు ఎక్కువగానే ఉంటారు. మాతలు ఇప్పుడు మీ వారసులను ఇంకా మేల్కొల్పండి. -మీరు అందరినీ తీసుకురండి. హాలు స్వతహాగా పెద్దది అయిపోతుంది. హాలు ఇప్పటికే నిండిపోయింది, ఇక వారు ఎక్కడ కూర్చుంటారు అని అనుకోకండి, మీరు తీసుకురండి అన్నీ - సమకూరుతాయి. అవును కదా! ఏమి చేయాలి అని దాదీ ఆలోచించటం లేదు కదా! తక్కువలో 'తక్కువ తొమ్మిది లక్షలమంది కూర్చునే విధంగా ఉండాలి, ఇంతమంది ప్రజలను అయినా తయారుచేస్తారా? లేదా? ఎప్పుడు చేస్తారు?
ఆ తారీఖుని నిర్ణయించుకోండి. మొదట తొమ్మిది - లక్షల మందిని తీసుకురండి. పాండవులు తీసుకుని వస్తారా? బాప్దాదా హాలుని తయారుచేయిస్తారు. " కానీ ముందు మీరు తొమ్మిది లక్షల మందిని తీసుకురండి (ఒకొక్క సంవత్సరం, ఒకొక్క లక్షమందిని తీసుకువస్తాం) అలా కాదు. వారు అయితే రానేవస్తారు దానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ. -చివరికి వేదికపైకి తొమ్మిది లక్షల మందిని తీసుకువస్తారా లేదా? తీసుకురాకపోతే రాజ్యం ఎవరిపై చేస్తారు? మీ మొదటి జన్మలో తొమ్మిది లక్షల మంది ప్రజలు మరియు రాయల్ కుటుంబం' లేకుండా రాజ్యం ఎవరిపై చేస్తారు?
మధువనం వారు ఏమి ఆలోచిస్తున్నారు? తొమ్మది లక్షల -మంది కావాలా? వద్దా? ముఖ్యంగా పాండవులు ఏమంటారు? కావాలా? వద్దా? తొమ్మిది లక్షల మంది వస్తే సాధనాలు స్వతహాగానే సమకూరుతాయి. హాలు తయారుచేయాల్సి ఉంటుందని భయపడకండి. చూడండి, భవిష్యత్తు చాలా చాలా ఉజల్వంగా ఉంటుంది. సర్వ సాధనాలు లభిస్తాయి. తయారైపోయిన హాలు మీకు లభిస్తుంది. తయారుచేసుకోవలసిన అవసరం లేదు. కానీ మీరు ఈ సంవత్సరం యొక్క స్లోగన్ని - సఫలం చేసుకోండి, సఫలత లభించే తీరుతుంది ఇది జ్ఞాపకం ఉంచుకోండి.
ఒక్క సెకనులో మనస్సు యొక్క వ్యాయామం జ్ఞాపకం ఉందా -ప్రతి ఒక్కరు రోజంతటిలో ఎన్నిసార్లు వ్యాయామం చేస్తున్నారు? అనేది పరిశీలన చేసుకోoడి ఈ మనస్సు యొక్క వ్యాయామం ఎన్నిసార్లు చేస్తారో అంతగానే సహజ మరియు సరళయోగిగా అవుతారు. ఒకవైపు మనసాసేవ, రెండవవైపు మనసా వ్యాయామం చేయాలి - నిరాకారి, ఇప్పుడిప్పుడే ఫరిస్తాగా అవ్వాలి. ఫరిస్తాలైన మిమ్మల్ని బ్రహ్మాబాబా ఆహ్వానం చేస్తున్నారు పరిస్తాగా అయ్యి బ్రహ్మాబాబా వెంట నిరాకారి రూపంలో మీ ఇంటికి వెళ్ళాలి తిరిగి దేవతగా - అవ్వాలి. మంచిది.
నలువైపుల ఉన్నటువంటి పిల్లల నుండి కార్డుల రూపంలో, ఉత్తరాల రూపంలో చాలా ప్రియస్స్మృతులు బాప్దాదా దగ్గరకి చేరుకున్నాయి. ప్రతి ఒక్క పిల్లవాడు నా యెుక్క ప్రియసృ్మతులు- బాబాకి అందాలి అని భావిస్తున్నారు. ప్రియసృ్మతులు ఇచ్చేటటువంటి చాలా చాలా గారాభమైన పిల్లలు . బాప్దాదా ఎదురుగా ఉన్నారు. అందువలనే బాప్దాదా చెప్తున్నారు - ప్రతి ఒక్క పిల్లవానికి, పేరు పేరున మనస్సు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి. మీ అందరికీ కూడా నవజీవితం, సవయుగం, ద్వాపర నవ సంవత్సరం యొక్క చాలా చాలా పదమా, పదమా, పదమాల ప్రియస్మృతులు మరియు మనస్సు యొక్క ఆశీర్వాదాలు మరియు నమస్తే
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.