రివైజ్ కోర్స్ మురళి 13-02-2003
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
వర్తమాన సమయంలో మీ యొక్క దయాహృదయం మరియు దాత యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి
ఈరోజు వరదాత బాబా తన యొక్క జ్ఞానదాత, శక్తిదాత, గుణదాత, వరదాత సందేశవాహకులైన పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు మాస్టర్ దాతగా అయ్యి ఆత్మలను బాబాకి సమీపంగా తీసుకువచ్చేటందుకు మనస్సుతో ప్రయత్నం చేస్తున్నారు. విశ్వంలో అనేకరకాలై ఆత్మలు ఉన్నాయి. కొంతమంది ఆత్మలకు జ్ఞానామృతం కావాలి, కొంతమందికి శక్తి కావాలి. కొంతమందికి గుణాలు కావాలి. పిల్లలైన మీ దగ్గర సర్వ ఖజానాలు అఖండంగా ఉన్నాయి. 'మీరు ప్రతి ఆత్మ యొక్క కోరికను పూర్తి చేసేవారు. రోజురోజుకి సమయం యొక్క సమీపం సమీపంగా వస్తున్న కారణంగా ఇప్పుడు ఆత్మలు ఏదోక క్రొత్త తోడు కోసం వెతుకుతున్నారు.
మీరు ఆ క్రొత్త తోడు ఇవ్వటానికి నిమిత్తం అయ్యారు. బాప్దాదా పిల్లల యొక్క ఉత్సాహం ఉల్లాసాలను చూసి సంతోషిస్తున్నారు. ఒకవైపు అవసరంగా ఉన్నారు మరియు రెండవవైపు ఉత్సాహ, ఉల్లాసాలతో ఉన్నారు. అవసర సమయంలో ఒక బిందువుకి కూడా గొప్పతనం. ఉంటుంది. ఈ సమయంలో మీరిచ్చే బిందువుకి, సందేశానికి కూడా గొప్పతనం ఉంటుంది. వర్తమాన సమయంలో మీ అందరి యొక్క దయాహృదయం మరియు దాత యొక్క నవ్వదూపం ప్రత్యక్షం అయ్యే సమయం, బ్రాహ్మణాతలైన మీ యొక్క ఆనాది స్వరూపంలో కూడా తస్థితి యొక్క సంస్కారం నిండి ఉంది అందువలనే కల్పవృక్షంలో మిమ్మల్ని వృక్షం యొక్క వ్రేళ్ళలో చూపించారు.
ఎందుకంటే వ్రేళ్ళ ద్వారానే మొత్తం వృక్షానికి అన్నీ చేరతాయి. మీ యొక్క ప్ర అది స్వరూపం దేవతాస్వరూపం, దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్ధం. మీ యొక్క మధ్యస్వరూపం పూజ్యనీయచిత్రం కనుక మధ్య సమయంలో కూడా పూజ్యరూపంలో మీరు వరదానం ఇచ్చేటువంటి, ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దాత రూపంలో ఉన్నారు కనుక మీ యొక్క విశేషస్వరూపమే దాతస్థితి యొక్క స్వరూపం. ఇప్పుడు కూడా పరమాత్మ సందేశవాహకులుగా అయ్యి విశ్వంలో బాబా ప్రత్యక్షత యొక్క సందేశం వ్యాపింపచేస్తున్నారు. కనుక ప్రతి ఒక బ్రాహ్మణ పిల్లవాడు పరిశీలన క చేసుకోండి - అనాది, ఆది దాతస్థితి యొక్క సంస్కారం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యక్షంగా ఉందా? అని.
దాతస్థితి యొక్క సంస్కారం ఉన్న ఆత్మల యొక్క గుర్తు - వారు ఇస్తే మేము ఇస్తాము, వారు చేస్తే మేము చేస్తాము అనేది వారికి సంకల్పంలో కూడా ఉండదు. నిరంతరం తెరిచి ఉన్న బండారాగా ఉంటారు. బాబా నలువైపుల ఉన్న పిల్లల దాతస్థితి యొక్క సంస్కారాన్ని చూస్తున్నారు. ఏమి చూసి ఉంటారు? నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా! ఎప్పుడు కూడా ఫలానాది ఉంటే నేను కూడా చేస్తాను అనే సంకల్పం ఎప్పుడు చేయకండి. దాతస్థితి యొక్క సంస్కారం ఉన్నవారికి అన్ని వైపుల నుండి స్వతహాగానే సహయోగం లభిస్తుంది. కేవలం ఆత్మల ద్వారానే కాదు కానీ ప్రకృతి కూడా సమయానికి సహయోగి అవుతుంది.
ఎవరైతే దాతగా అవుతారో ఆ పుణ్యానికి ఫలంగా ఆ ఆత్మకి సమయానికి సహయోగం మరియు సఫలత సహజంగా లభిస్తాయి. ఇది సూక్ష్మమైన లెక్క. అందువలనే సదా దాతస్థితి యొక్క సంస్కారాన్ని ప్రత్యక్షరూపంలో ఉంచుకోండి. పుణ్యఖాతా ఒకటికి 10 రెట్లు ఫలం ఇస్తుంది. కనుక మొత్తం రోజంతటిలో నోట్ చేసుకోండి సంకల్పం ద్వారా, వాణీ ద్వారా, సంబంధ, సంపర్కాల ద్వారా పుణ్యాత్మగా అయ్యి పుణ్యం యొక్క ఖాతా ఎంత జమ చేసుకున్నాను? అని. మనసాసేవ కూడా పుణ్యఖాతాను జమ చేస్తుంది.
వాణీ ద్వారా బలహీన ఆత్మను సంతోషంలోకి తీసుకురావటం, అలజడిలో ఉన్నవారిని స్వస్థితిలోకి తీసుకురావటం, మనస్సు బలహీనంగా ఉన్న ఆత్మను మీ యొక్క వాణి ద్వారా ఉత్సాహ, ఉల్లాసాలలోకి తీసుకురావటం, సంబంధ, సంపర్కాల ద్వారా ఆత్మకి మీ శ్రేష్టసాంగత్యం యొక్క రంగు అనుభవం చేయించటం ఈ విధి ద్వారా పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకోవచ్చు. ఈ జన్మలో ఎంత పుణ్యం జమ చేసుకున్నారంటే అర్ధకల్పం పుణ్యం యొక్క ఫలం తింటున్నారు. మరియు ఆర్ధకల్పం మీ యొక్క జడచిత్రాలు వాయుమండలం ద్వారా పాపి ఆత్మలను పాపాల నుండి ముక్తి చేస్తున్నాయి.
పతితపావని అవుతున్నారు. బాప్దాదా ప్రతి పిల్లవాని యొక్క జమ అయిన పుణ్యఖాతాను చూస్తున్నారు. బాప్దాదా వర్తమాన సమయంలో పిల్లల, సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలను చూసి సంతోషిస్తున్నారు. చాలా మంది పిల్లలలో సేవ యొక్క ఉత్సాహం చాలా మంచిగా ఉంది. అందరు తమ, తమ వైపుల నుండి సేవ యొక్క ప్లాన్స్న ప్రత్యక్షంలోకి తీసుకువస్తున్నారు. దీని ' కొరకు బాప్దాదా మనస్సుతో శుభాకాంక్షలు ఇస్తున్నారు. మంచిగా చేస్తున్నారు మరియు మంచిగా చేస్తూ ఉంటారు.
అన్నింటికంటే మంచి విషయం ఏమిటంటే అందరి యొక్క సంకల్పం మరియు సమయం బిజీ అయిపోయింది. ప్రతి ఒక్కరికీ ఇదే లక్ష్యం ఉంది - నలువైపుల సేవ ద్వారా నిందలను పూర్తి చేయాలి అని. దాదీ 9 లక్షలు తయారుచేయాలి అంటున్నారు. ఒకవేళ 3-4 స్థానాల నుండి లక్ష-లక్ష మంది వచ్చినా ఏమౌతుంది! 6 లక్షల మంది అయితే ఉన్నారు. ఇక 3 లక్షలు కావాలి కదా! దేశంలో మరియు విదేశంలో కూడా అందరు సందేశం ఇస్తున్నారు. ఉత్సాహం చాలా మంచిగా ఉంది అనే విషయం బాబా విన్నారు. అక్కడ కూడా మంచి ప్రోగ్రామ్స్ తయారుచేస్తున్నారు కదా!
ప్రతి స్థానంలో ఎవరి విధి వారికి ఉంటుంది కానీ సేవ యొక్క ఉత్సాహం అందరిలో ఉంది. 3 లక్షలు పెంచడం అనేది ఏమైనా పెద్ద విషయమా! పెద్ద 'విషయమా? మొదటి నెంబర్ లో గుజరాత్ వారు కత్తి ఎత్తారు. మంచిగా చేసారు. గుజరాత్ కి ఎన్ని సేవాకేంద్రాలు ఉన్నాయి? (200 సేవాకేంద్రాలు మరియు 1000 ఉప సేవాకేంద్రాలు ఉన్నాయి) ఒకొక్క సేవాకేంద్రం నుండి 10-10 మంది వచ్చినా ఎంతమందీ అవుతారు? అదేవిదంగా ఢిల్లీ, బొంబాయి, మద్రాస్ అందరు ఉన్నారు. కలకత్తా, హైదరాబాద్, విదేశం వారు అందరు ఉన్నారు.
మరి 3 లక్షల మందిని తయారుచేయటం పెద్ద విషయమా! పెద్ద విషయమా? టీచర్స్ చెప్పండి! 9 లక్షల మంది అయిపోతారు కదా! దీనిలో చేతులు ఊపటంలేదు. పాండవులు చేతులు ఊపుతున్నారు. బ్రాహ్మణుల యొక్క ధృఢసంకల్పానికి చాలా శక్తి ఉంటుంది. ఒకవేళ బ్రాహ్మణులు ధృడసంకల్పం చేస్తే జరగనిది ఏది? కేవలం యోగం యొక్క జ్వాలారూపాన్ని తయారుచేసుకోండి. అన్నీ అయిపోతాయి. యోగాన్ని జ్వాలారూపంగా చేసుకుంటే ఆ జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగానే వచ్చేస్తారు ఎందుకంటే జ్వాల (వెలుగు) లభించడం ద్వారా వారికి మార్గం కనిపిస్తుంది.
ఇప్పుడు యోగం అయితే చేస్తున్నారు కానీ యోగం యొక్క జ్వాలారూపం ఉండాలి. సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు మంచిగా పెంచుకుంటున్నారు కానీ యోగంలో, జ్వాలారూపంపై ఇప్పుడు అండర్లైన్ (ధ్యాస) చేసుకోవాలి. మీ యొక్క దృష్టిలో ఏదోక అనుభూతి చేయించే మెరుపు రావాలి. బాబాకి విదేశం వారు చేసిన సమయం యొక్క పిలుపు అనే విధి మంచిగా అనిపించింది. చిన్న సంఘటనను సమీపంగా తీసుకువచ్చారు. ఇలా ప్రతి జోన్, ప్రతి సేవాకేంద్రం వారు వేర్వేరుగా సేవ అయితే చేస్తున్నారు కానీ అన్ని వర్గాల యొక్క సంఘటన తయారుచేయండి.
బాప్దాదా చెప్పారు - సేవ చాలా వరకు వ్యాపించింది కానీ ఇలా వ్యాపించిన సేవ ద్వారా బాబాకి సమీపంగా వచ్చే యోగ్యఆత్మల యొక్క సంఘటనను తయారుచేయండి. ప్రతి సమయం ఆ సంఘటనలోని వారిని సమీపంగా తీసుకువస్తూ ఉండండి మరియు వారిచే సేవ చేయించి వారి యొక్క ఉల్లాసాన్ని పెంచండి. బాప్ దాదా చూస్తున్నారు ఇప్పుడు అటువంటి ఆత్మలు.. ఉన్నారు కానీ అటువంటి శక్తిశాలి పాలన సంఘటిత రూపంలో లభించటంలేదు. వేర్వేరుగా శక్తిననుసరించి పాలన లభిస్తుంది. కానీ సంఘటనలో ఒకరిని చూసి ఒకరికి ఉత్సాహం వస్తుంది.
వారు ఇది చేస్తున్నారు కనుక నేను కూడా చేస్తాను, నేను కూడా చేయగలను అనే ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు బాస్ లా సేవ యొక్క ప్రత్యక్షత సంఘటిత రూపంలో చూడాలనుకుంటున్నారు. శ్రమ బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ వర్గం యొక్క తమ స్థానం యొక్క సేవాకేంద్రం " యొక్క సేవ చేస్తున్నారు. దీనికి బాప్దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు కొందరిని బాబాకి ఎదురుగా తీసుకురండి. కుటంబంలో ఉండేవారి యొక్క ఉత్సాహం కూడా బాప్దాదా దగ్గరికి చేరుకుంటుంది. మరియు డబల్ విదేశీయులు కూడా డబల్ కార్యంలో ఉంటూ సేవలో మరియు స్వ పురుషార్ధంలో ఉంటున్నారు. ఇది చూసి కూడా బాప్దాదా సంతోషిస్తున్నారు.
విదేశంలో బ్రాహ్మణాత్మలు వర్తమాన వాయుమండలాన్ని చూసి భయపడటం లేదు కదా? రేపు ఏమౌతుంది, రేపు ఏమౌతుంది.... అని ఆలోచించటం లేదు కదా? రేపు మంచిగా అవుతుంది. ఇప్పుడు మంచిదే మరియు మంచే జరగనున్నది. ఎంతగా ప్రపంచంలో అలజడి జరుగుతుందో అంతగా బ్రాహ్మణస్థితి అచంచలంగా అవుతుంది. ఇలా ఉందా? డబల్విదేశీయులు అలజడిలో ఉన్నారా. అచంచలంగా ఉన్నారా? అచంచలంగా ఉన్నారా? అలజడి లేదు కదా! ఎవరైతే అచంచలంగా ఉన్నాము అంటారో వారు చేతులెత్తండి! అచంచలంగా ఉన్నారు సరే రేపు ఏదైనా జరిగితే? అప్పుడు కూడా అచంచలంగా ఉంటారు కదా!
ఏమౌతుంది, ఏమీ అవ్వదు. బ్రాహ్మణాత్మలైన మీపై పరమాత్మ యొక్క ఛత్రధాయ ఉంది. ఏవిధంగా అయితే వాటర్ ప్రూఫ్ అంటే ఎంత నీరు వచ్చినా కానీ వాటర్ ప్రూఫ్ ద్వారా వాటర్ ప్రూఫ్ గా అయిపోతారో అదేవిధంగా ఎంత అలజడి వచ్చినా కానీ బ్రాహ్మణాత్మలు పరమాత్మ ఛత్రధాయలో సదా రక్షణగా ఉంటారు. నిశ్చింతాచక్రవర్తులు కదా!' ఏమౌతుంది అని కొద్దికొద్దిగా చింత ఉందా? లేదు కదా? నిశ్చింతగా ఉన్నారు కదా! స్వరాజ్యాధికారి అయ్యి నిశ్చింతాచకవర్తులుగా అయ్యి, అచంచల, అధోల్ (స్థిరమైన) సీట్పై సెట్ అయ్యి ఉండండి. సీట్ నుండి క్రిందికి దిగకండి. సీట్పై సెట్ అవ్వకపోతే అప్సెట్ అవుతారు.
సీట్పై సెట్ అయినవారు కలలో కూడా అప్సెట్ అవ్వరు. మాతలు ఏమని భావిస్తున్నారు? సీట్పై సెట్ ద అవ్వటం, కూర్చోవటం వస్తుందా? అలజడి అవ్వటం లేదు కదా? బాబాతో కంబైండ్గా ఉన్నారు. సర్వశక్తివాన్ మీ యొక్క కంబైండ్ స్వరూపంగా ఉంటే ఇక మీకు భయం ఏమిటి? ఒంటరిగా భావిస్తే అలజడిలోకి వస్తారు. కంబైండ్గా ఉంటే ఎంత అలజడి వచ్చినా కానీ మీరు అచంచలంగా ఉంటారు. మాతలు మంచిగా ఉన్నారా? కంబైండ్గా ఉన్నారు కదా? ఒంటరిగా లేరు కదా? మీరు సీట్పై సెట్ అయ్యి ఉంటే బాబా యొక్క బాధ్యత ఉంటుంది. అప్సెట్ అయితే మీదే బాధ్యత.
ఆత్మలకు సందేశం ద్వారా బిందువు ఇస్తూ దాత స్వరూపంలో స్థితులై ఉంటే దాతస్థితికి పుణ్యఫలంగా శక్తి లభిస్తుంది. నడుస్తూ, తిరుగుతూ మిమ్మల్ని మీరు చేయించే ఆత్మగా మరియు ఈ కర్మేంద్రియాలు చేసేటువంటి కర్మచారులుగా భావించి ఆత్మస్మృతి యొక్క అనుభవం సదా ప్రత్యక్షరూపంలో ఉండాలి. నేను ఆత్మనే అనుకోవటం కాదు. ప్రత్యక్షంగా ఉండాలి. గుప్తరూపంలో ఉంటుంది కానీ ప్రత్యక్షరూపంలో ఉండటం ద్వారా ఆ నషా, సంతోషం మరియు అదుపులో ఉంచుకునే శక్తి ఉంటుంది. మజా కూడా వస్తుంది. ఎందుకు! సాక్షి అయ్యి కర్మ చేస్తున్నారు కనుక చేయించేవాడిగా అయ్యి కర్మ చేస్తున్నానా?
అని మాటిమాటికి పరిశీలన చేసుకోండి. ఏవిధంగా అయితే రాజు తన కర్మచారులను తన అదుపులో ఉంచుకుంటారో అదేవిధంగా చేయించే ఆత్మ యొక్క స్మృతి ఉండటం ద్వారా సర్వ కర్మేంద్రియాలు అదుపులో ఉంటాయి. మాయ యొక్క అదుపులో ఉండవు. మీ అదుపులో ఉంటాయి. మాయ చూస్తూ ఉంటుంది. చేయించే ఆత్మ బలహీనంగా అయిపోతే ఇక అది అదుపుచేయటం మొదలు పెడుతుంది. అప్పుడప్పుడు సంకల్పశక్తి, అప్పుడప్పుడు నోటి యొక్క వాచాశక్తి మాయ యొక్క ఆర్డర్లో నడిచేస్తూ ఉంటాయి. అందువలనే ప్రతి కర్మేంద్రియాన్ని మీ ఆజ్ఞ ప్రకారం నడిపించండి.
అనుకోవటం లేదు కానీ అయిపోతుంది ఇలా చెప్పకూడదు. ఏది అనుకుంటే అదే జరుగుతుంది ఇలా ఇప్పటి నుండి రాజ్యాధికారిగా అయ్యే సంస్కారం నింపుకుంటేనే అక్కడ రాజ్యాధికారిగా కాగలరు. స్వరాజ్యాధికారి సీట్ నుండి ఎప్పుడూ క్రిందికి రాకండి. ఒకవేళ కర్మేంద్రియాలు కనుక మీ ఆర్డర్లో ఉంటే ప్రతి శక్తి కూడా మీ అర్డర్లో ఉంటుంది. ఏ సమయంలో ఏ శక్తి కావాలో ఆ శక్తి ఆ సహనశక్తిని ఆహ్వానం చేస్తే పని అయిపోయిన తర్వాత వచ్చేలా ఉండదు. ప్రతి శక్తి మీరు సమయంలో హాజరైపోతుంది. మీరు చేయగానే ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రతి శక్తి పరమాత్మ ఇచ్చిన కానుక.
పరమాత్మ కానుక మీదిగా అయిపోతుంది. సొంత వస్తువుని ఎలా అయినా, ఎప్పుడైనా ఉపయోగించు కోవచ్చు అదేవిధంగా ఈ సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉంటాయి. సర్వ కర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటాయి వారినే స్వరాజ్యాధికారి, మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు. పాండవులు ఈవిధంగా ఉన్నారా? మాస్టర్ సర్వశక్తివంతులు మరియు స్వరాజ్యాధికారులు నోటి నుండి అలా వచ్చేసింది అని అనకూడదు. అలా వచ్చేసింది అంటే ఎవరు ఆర్డర్ ఇచ్చారు! చూడాలను కోలేదు కానీ చూసాను, చేయాలనుకోలేదు కానీ చేసాను అంటున్నారు ఇది. ఎవరి ఆర్డర్ ప్రకారం జరుగుతుంది?
ఇటువంటి వారిని ఆధీనులు అని అంటారా లేదా అధికారులు అని అంటారా? కనుక అధికారులుగా అవ్వండి, ఆధీనులుగా కాదు. అందరు బాబా దగ్గరికి చేరుకున్నారు. ఈ సంఘటన కూడా ఎంత ప్రియంగా అనిపిస్తుంది! బాబాకి కూడా పిల్లల యొక్క సంఘటను మంచిగా అనిపిస్తుంది. మీ పరివారాన్ని చూసుకునే అవకాశం లభిస్తుంది. మీ యొక్క ఇంత పెద్ద పరివారాన్ని చూసాము అని చెప్పవచ్చు. మధువనంలో అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి కదా! నీరు లభించిందా? నీరు లభిస్తుంది కదా! ఆహారం, నిద్ర, మిలనం అన్నీ లభిస్తున్నాయి కదా!
బాప్దాదా చెప్తున్నారు ఇప్పుడు మధువనంలో ఎలా అయితే అందరు చాలా, చాలా సంతోషంగా ఉన్నారో అదేవిధంగా సదా సంతోషంగా ఉండాలి. ఆత్మిక గులాబీలు. చూడండి, నలువైపుల చూడండి, వికసించిన గులాబీలుగా ఉన్నారు, వాడిపోయినవి కాదు. వికసించిన గులాబీలు. ఇలా సదా అదృష్టవంతులుగా, సంతోషవంతమైన ముఖంతో ఉండాలి. ఎవరైనా మీ ముఖం చూడగానే మీకు ఏమి లభించింది ఇంత సంతోషంగా ఉన్నారు అని అడగాలి. ప్రతి ఒక్కరి ముఖం బాబా యొక్క పరిచయం ఇవ్వాలి.
ఎలా అయితే చిత్రాలు పరిచయం ఇస్తున్నాయో అదేవిధంగా మీ ముఖం ద్వారా బాబా లభించారు అనే పరిచయం ఇవ్వాలి. మంచిది. అందరు మంచిగా ఉన్నారు కదా? విదేశం వారు కూడా వచ్చారు. ఇక్కడ కూడా మంచిగా అనిపిస్తుంది. కదా? (మోహిని అక్కయ్య న్యూయార్క్ నుండి వచ్చారు) అలజడి వినటం నుండి రక్షించుకున్నారు. కదా! అందరు కలిసి వచ్చారు. చాలా మంచిగా చేసారు. డబల్ విదేశీయులకు డబల్నషా ఉంది కదా! మనస్సుతో నషాలో చెప్పండి, మేము డబల్ విదేశీయులం అంటే డబల్ నషాతో ఉన్నాము, స్వరాజ్యాధికారి నుండి విశ్వరాజ్యధికారిగా అవుతాము అనే డబల్నషా ఉంది కదా!
ఒకవేళ ఏ గ్రూప్లో అయినా డబల్ విదేశీయులు లేకపోతే మంచిగా అనిపించదు. బాబా విశ్వానికి తండ్రి కనుక విశ్వంలో అందరు కావాలి. మాతలు లేకపోతే కూడా వెలుగు ఉండదు. పాండవులు దో లేకపోతే కూడా వెలుగు తక్కువైపోతుంది. చూడండి, ఏ సేవాకేంద్రంలో అయినా పాండవులు లేకుండా మాతలే ఉంటే బావుంటుందా! మరియు కేవలం పాండవులే ఉండి మాతలు లేకపోయినా సేవాకేంద్రం అందంగా ఉండదు. ఇద్దరూ ఉండాలి. పిల్లలు కూడా ఉండాలి. మా గురించి ఎందుకు చెప్పటంలేదు అని పిల్లలు అంటారు కనుక పిల్లలు కూడా ఉంటే వెలుగుగా ఉంటుంది.
నలువైపుల ఉన్నటువంటి సర్వ స్వరాజ్యాధికారులకు, సదా సాక్షి స్థితి యొక్క సీట్పై సెట్ అయ్యి ఉండే అచంచల, అధోల్ ఆత్మలకు, సదా దాతస్థితి యొక్క సృతి ద్వారా సర్వులకు జ్ఞానం, శక్తి, గుణాలు ఇచ్చేటువంటి దయాహృదయ 'ఆత్మలకు, సదా మీ ముఖం ద్వారా బాబా యొక్క చిత్రాన్ని చూపించే శ్రేష్టాత్మలకు, సదా సంతోషంగా ఉండే ఆత్మిక గులాబీ పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.