రివైజ్ కోర్స్ మురళి 15-11-2003
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
మనస్సుని ఏకాగ్రం చేసి ఏకాగ్రతాశక్తి ద్వారా ఫరిస్తాస్థితి యొక్క అనుభవం చేసుకోండి
ఈరోజు సర్వఖజానాల యజమాని నలువైపుల ఉన్నటువంటి తన యొక్క సంపన్న పిల్లలను చూస్తున్నారు. ప్రతి పిల్లవాడిని సర్వఖజానాలకు యజమానిగా చేసారు. ఎవరు ఇవ్వలేనటువంటి.. ఖజానా లభించింది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటు న్నారా? అన్నింటికంటే శ్రేష్ట ఖజానాలు - జ్ఞానఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, వెనువెంట 2 బాబా మరియు సర్వ బ్రాహ్మణాత్మల ద్వారా ఆశీర్వాదాల ఖజానా ఈ అన్ని ఖజానాలు లభించాయా? అని పరిశీలన చేసుకోండి. సర్వఖజానాలతో సంపన్నంగా అయిన ఆత్మ యొక్క గుర్తు సదా.
వారి నయనాల ద్వారా నడవడిక ద్వారా ఇతరులకు కూడా సంతోషం అనుభవం అవుతుంది. వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా ఈ ఆత్మ అలౌకిక సంతోషంతో, అతీతంగా కనిపిస్తుంది అని అనుభవం చేసుకుంటారు. మీ యొక్క సంతోషాన్ని చూసి ఇతరాత్మలు కూడా కొంత సమయం సంతోషం యొక్క అనుభవం చేసుకుంటారు. ఏవిధంగా అయితే బ్రాహ్మణాత్మలైన మీ యొక్క తెల్ల దుస్తులు అందరికీ ఎంతో ప్రియంగా, అతీతంగా అనిపిస్తాయి కదా! వాటి ద్వారా స్వచ్ఛత, - నిరాడంబరత మరియు పవిత్రత అనుభవం అవుతుంది. దూరం నుండే వీరు బ్రహ్మాకుమారీ, కుమారులు అని అనుభవం చేసుకుంటారు.
అదేవిధంగా బ్రాహ్మణాత్మలైన మీ యొక్క నడవడిక మరియు ముఖం ద్వారా సంతోషం యొక్క మెరుపు, అదృష్టం యొక్క చిత్రం కనిపిస్తుందా? ఈరోజుల్లో సర్వాత్మలు చాలా దుఃఖీగా ఉన్నారు. అటువంటి ఆత్మలు మీ సంతోషం యొక్క ముఖం చూసి, నడవడిక చూసి ఒక ఘడియ అయినా సంతోషం యొక్క అనుభవం చేసుకోవాలి. ఎలా అయితే దాహంతో ఉన్న ఆత్మలకు ఒక్క నీటి బిందువు దొరికినా ఎంతో సంతోషం అవుతారు. అదేవిధంగా సంతోషం యొక్క బిందువు ఆత్మలకు చాలా అవసరం. ఇలా సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా ఉన్నారా?
ప్రతి బ్రాహ్మణాత్మ స్వయాన్ని సర్వ ఖజానాలతో నిండుగా అనుభవం చేసుకుంటున్నారా? లేక అప్పుడప్పుడు అనుభవం చేసుకుంటున్నారా? - ఖజానా అవినాశి, ఇచ్చేటువంటి దాత కూడా అవినాశి కనుక అవినాశిగా ఉండాలి ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీకు లభించిన ఈ అలౌకిక సంతోషం మొత్తం కల్పంలో ఎవరికీ లభించదు. ఇప్పటి యొక్క ఈ అలౌకిక సంతోషం అర్ధకల్పం ప్రాలబ్ద రూపంలో నడుస్తుంది. కనుక సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? దీనిలో అందరు చేతులు ఎత్తారు. మంచిది, సదా సంతోషంగా ఉంటున్నారా? అప్పుడప్పుడు సంతోషం మాయం అయిపోవటంలేదు కదా?
అప్పుడప్పుడు మాయం అయిపోతుందా? సంతోషంగా ఉంటున్నారు కానీ సదా సంతోషంగా, ఏకీరసంగా ఉండటంలో తేడా వచ్చేస్తుంది. సంతోషంగా ఉంటున్నారు కానీ శాతంలో తేడా వచ్చేస్తుంది. బాప్దాదా ఆటోమేటిక్ టి.విలో పిల్లలందరి యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటారు. బాబాకి ఏమి కనిపిస్తుంది? ఒక రోజు మీరు కూడా మీ సంతోషం యొక్క చార్ట్ పరిశీలన చేసుకోండి. అమృతవేళ నుండి రాత్రి వరకు ఒకే శాతంలో సంతోషం ఉంటుందా? లేదా మారిపోతుందా? ఇలా పరిశీలించుకోవటం వస్తుంది కదా? ఈరోజుల్లో వైజ్ఞానికులు కూడా చెకింగ్ మిషనరీ చాలా తీవ్రంగా తయారుచేసారు కదా!
మీరు కూడా పరిశీలన చేసుకుని అవినాశి గా చేసుకోండి బాప్దాదా కూడా పిల్లలందరి యొక్క వర్తమాన పురుషార్థాన్ని పరిశీలన చేసారు. అందరు పురుషార్ధం చేస్తున్నారు కానీ కొంతమంది శక్తిశాలిగా చేస్తున్నారు. కొంతమంది శక్తిననుసరించి చేస్తున్నారు. ఈరోజు బాగ్దాదా అందరి మనస్సు యొక్క స్థితిని పరిశీలన చేసారు. ఎందుకంటే ముఖ్యమైనది - మన్మనాభవ. సేవలో కూడా చూస్తే మనసాసేవ చాలా శ్రేష్టమైనది. మనస్సుని జయించిన వారే విశ్వాన్ని జయిస్తారు అని అంటారు కదా! కనుక బాబా మనస్సు యొక్క స్థితిని పరిశీలన చేసారు. ఏమి చూసి ఉంటారు? మనస్సుకి యజమానిగా అయ్యి మనస్సుని నడిపిస్తున్నారు కానీ అప్పుడప్పుడు మనస్సు కూడా మిమ్మల్ని నడిపిస్తుంది.
మనస్సు పరవశం కూడా చేస్తుంది. బాప్దాదా చూసారు - మనస్సుపై సంలగ్నత పెడుతున్నారు కానీ మనస్సు యొక్క స్థితి ఏకాగ్రం అవ్వటంలేదు. వర్తమాన సమయంలో మనస్సు యొక్క ఏకాగ్రత ఏకీరసస్థితిని అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు బాబా ఫలితంలో చూస్తే మనస్సుని ఏకాగ్రం చేయాలనుకుంటున్నారు కానీ మధ్యమధ్యలో భ్రమిస్తుంది. ఏకాగ్రతాశక్తి అవ్యక్త పరిస్థితి యొక్క అనుభవం సహజంగా చేయిస్తుంది. మనస్సు వ్యర్ధ విషయాలలో, వ్యర్ధ సంకల్పాలలో, వ్యర్ధ వ్యవహారంలో భ్రమిస్తుంది.
కొంతమందికి శరీరంతో ఏకాగ్రంగా కూర్చునే అలవాటు ఉండదు, కొంత మందికి ఉంటుంది అలాగే మనస్సుని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రం చేసినప్పుడే మనస్సు మన వశంలో ఉన్నట్లు ఏకాగ్రతాశక్తి, యజమానిస్థితి సహజంగా నిర్విఘ్నంగా చేస్తుంది. యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. ఏకాగ్రతాశక్తి ద్వారా స్వతహాగానే ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు అనే 'అనుభవం అవుతుంది. స్వతహాగా ఉంటుంది, శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఏకాగ్రతాశక్తి ద్వారా స్వతహాగానే ఏకీరస ఫరిస్తాస్థితి యొక్క అనుభవం అవుతుంది.
బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా కనుక బ్రహ్మాబాబా సమానంగా అవ్వటం అంటే ఫరిస్తాగా అవ్వటం. ఏకాగ్రతాశక్తి ద్వారా స్వతహాగానే సర్వుల పట్ల స్నేహం, కళ్యాణం, స్వమానం యొక్క వృత్తి ఉంటుంది. ఎందుకంటే ఏకాగ్రత అంటే స్వమానం యొక్క స్థితి, ఫరిస్తాస్థితియే స్వమానం. బ్రహ్మాబాబాని చూసారు కదా, వర్ణన కూడా చేస్తున్నారు. సంపన్నత యొక్క సమయం సమీపంగా వచ్చినప్పుడు ఏమి కనిపించింది? నడుస్తూ, తిరుగుతూ ఫరిస్తాగా కనిపించేవారు. దేహాభిమానానికి అతతంగా కనిపించే వారు, దేహం యొక్క ఫీలింగ్ వచ్చేదా? కర్మ చేస్తూ, మాట్లాడుతూ, డైరెక్షన్ ఇస్తూ కూడా ఉత్సాహ, ఉల్లాసాలు పెంచుతూ కూడా దేహానికి అతీతంగా, సూక్ష్మ పరిస్తారూపం యొక్క అనుభూతి చేయించారు.
బ్రహ్మాబాబా మాట్లాడుతూ, మాట్లాడుతూ కూడా బాబా ఇక్కడ లేరు అనే అనుభవం అయ్యేది అలాగే బాబా చూస్తున్నారు కానీ ఇది స్థూలదృష్టి కాదు అలౌకిక దృష్టి అని అనుభవం అయ్యేది. బాబా దేహాభిమానానికి అతీతంగా ఉండేవారు కనుక ఇతరులకు కూడా దేహం యొక్క అభిమానం రాలేదు. అతీతంగా కనిపించేవారు. దీనినే దేహంలో ఉంటూ ఫరిస్తా స్వరూపంగా అవ్వటం అంటారు. ప్రతి విషయంలో, వృత్తిలో, దృష్టిలో, కర్మలో అతీతస్థితి అనుభవం అవ్వాలి. వీరు మాట్లాడుతున్నారు కానీ అతీతంగా, ప్రియంగా మాట్లాడు తున్నారు. ఆత్మిక ప్రేమతో మాట్లాడుతున్నారు అని ఇలా స్వయం కూడా ఫరిస్తాస్థితి యొక్క అనుభవం చేసుకోవాలి మరియు ఇతరులు కూడా అనుభవం చేసుకోవాలి ఎందుకంటే ఫరిస్తాగా కాకుండా దేవతగా కాలేదు.
ఫరిస్తా నుండి దేవతగా అవుతారు, నెంబర్వన్ బ్రహ్మ ఆత్మ : కూడా ప్రత్యక్ష రూపంలో ఫరిస్తా జీవితం యొక్క అనుభవం చేయించింది మరియు ఫరిస్తాగా అయ్యింది. ఆ ఫరిస్తా రూపంతో మీరందరు కూడా ఫరిస్తాగా అయ్యి పరంధామం వెళ్ళాలి. దీని కొరకు మనస్సు యొక్క ఏకాగ్రతపై ధ్యాన పెట్టండి. మనస్సుని ఆజ్ఞతో నడిపించండి. చేయాలనుకుంటే మనస్సు ద్వారా కర్మ చేస్తారు మీరు చేయాలను కోలేదు కానీ మనస్సు చేయండి. అని చెప్తుందంటే అది యజమానిస్థితి కాదు. ఇప్పుడు కొంతమంది పిల్లలు అనుకోలేదు కానీ అయిపోయింది, ఆలోచించలేదు కానీ అయిపోతుంది అంటున్నారు ఇదే మనస్సుకి వశీభూతం అయ్యే స్థితి.
ఇలాంటి స్థితి మంచిగా అనిపించటంలేదు కదా! బ్రహ్మాబాబాని అనుసరించండి. - బ్రహ్మాబాబా ఎదురుగా ఉన్నప్పుడు ఏవిధంగా అనుభవం అయ్యేది? ఫరిస్తా నిల్చుంది. ఫరిస్తా దృష్టి ఇస్తుంది అని అనుభవం అయ్యేది. మనస్సు యొక్క ఏకాగ్రతాశక్తి సహజంగా ఫరిస్తాగా చేస్తుంది. బ్రహ్మాబాబా కూడా పిల్లలకు ఇదే చెప్తున్నారు - సమానంగా అవ్వండి అని. శివబాబా నిరాకారిగా అవ్వండి అని చెప్తున్నారు. బ్రహ్మాబాబా ఫరిస్తాగా అవ్వండి చెప్తున్నారు కనుక అర్ధమైందా? బాబా ఫలితంలో ఏమి చూసారు? మనస్సు యొక్క ఏకాగ్రత తక్కువగా ఉంది. మధ్యమధ్యలో మనస్సు బాగా తిరుగుతుంది, భ్రమిస్తుంది.
ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్తుంది అంటే దానిని ఏమంటారు? భ్రమించటం అంటారు కదా? కనుక ఏకాగ్రతాశక్తిని పెంచుకోండి. యజమానిస్థితి యొక్క సీట్పై సెట్ అయ్యి ఉండండి. సెట్ అయ్యి ఉంటే అప్సెట్ అవ్వరు. సెట్ అవ్వటం లేదు. కనుక అప్సెట్ అవుతున్నారు. రకరకాలైన శ్రేష్ఠస్థితులు అనే సీట్ పై సెట్ అయ్యి ఉండండి. దీనినే ఏకాగ్రతాశక్తి అంటారు. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా? ఎంత ప్రేమ ఉంది? చాలా ప్రేమ ఉంది కదా! ప్రేమకి బదులు ఏమి ఇచ్చారు? బాబాకి కూడా మీపై ప్రేమ ఉంది కనుక మీకు కూడా ప్రేమ ఉంది. బదులు ఏమి ఇచ్చారు?
సమానంగా అవ్వటమే బదులు ఇవ్వటం. ఇది సీజన్ యొక్క మొదటి మిలనం. మొదటి మిలనానికి మొదటి నెంబర్లో వచ్చారు. బాబాకి కూడా ఎంత ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తే అంత మంచిగా అనిపిస్తుంది. ఎంత హాల్ తయారుచేస్తే అంత మందే వస్తున్నారు కనుక ఇప్పుడు పెద్ద హాల్ తయారుచేస్తే చాలా మంది వస్తారు. ఇప్పుడు మొత్తం నిండిపోయింది కదా! మొత్తం నిండిపోయింది అంటే ఇంకా పెద్ద హాల్ తయారుచేయమని సైగ చేస్తున్నట్లు గుర్తు. ఇలా శ్రేష్టాత్మలతో హాల్ నిండుగా ఉంటే ఎంత బావుంటుంది! మధువనం అయినా, శాంతివనం అయినా, పాండవ భవనం అయినా ఖాళీ, ఖాళీగా ఉంటే బావుండదు. కదా!
నిండుగా ఉంటే మంచిగా అనిపిస్తుందా లేదా వారికి ఏకాంతం కావాలా? కావాలా ఏకాంతం? సంఘటన యొక్క మెరుపు మంచిగా అనిపిస్తుంది కదా? అయినప్పటికీ మధ్యలో ఏకాంతం కూడా లభిస్తుంది. డబల్ విదేశీయులు కూడా వచ్చారు. డబల్ విదేశీయులతో కూడా మధువనానికి శృంగారం వస్తుంది. ఇంటర్నేషనల్ అవుతుంది కదా! బాగ్దాదా దాదీ యొక్క సంకల్పం విన్నారు. (ఈరోజు ఉదయం క్లాస్లో దాదీజీ దేశ, విదేశాలలో సేవ తీవ్రంగా జరిగే సంకల్పం చేయించారు. ఏ గ్రామం అయినా, ఏ దేశం అయినా ఈ సంవత్సరం సందేశం నుండి వంచితం కాకూడదు. ఇటువంటి ప్లాన్ తయారుచేయండి అని చెప్పారు. సంకల్పం చేసారు కదా! మంచిది.
విదేశీయులు పూర్తి చేస్తారో, భారతవాసీయులు చేస్తారో చూస్తాను. సందేశం అయితే అందాలి. మీకు బాబా లభించారు. ఖజానా లభించింది, పాలన లభించింది మరి మీ సోదరి సోదరులకు తక్కువలో తక్కువ సందేశం అయినా లభించాలి. ఈ సంవత్సరం ధ్వని వ్యాపింపచేయటంలో ఎంత ధైర్యంతో మరియు శక్తితో ఉంటారో చూస్తాను. డబల్ విదేశీయులకు చాలా ఉత్సాహం ఉంది. ఉంది. కదా? మంచిది. ఒకరిని చూసి ఒకరికి ఉత్సాహం వస్తుంది. ధాదీకి కూడా సంకల్పం వస్తుంది. బిజీ చేసే పద్ధతి మంచిగా వస్తుంది. మంచిది, నిమిత్తులు కదా! మంచిది, అందరు ఎగిరేకళలో ఉన్నారా? ఎగిరేకళ అనేది మొదటి కళ, నడిచేకళ, ఎక్కేటువంటి కళ ఇవి వేగంగా వెళ్ళే కళలు కాదు. ఎగిరేకళ మొదటిది మరియు వేగంగా తీసుకువెళ్ళే కళ కూడా అదే.
'మాతలు ఏమి చేస్తారు? మాతలు తమ యొక్క పరివారాన్ని (కుటుంబ సభ్యులను) మేల్కొల్పండి. మాతలు ఎవరు నిందించేవిధంగా ఉండకూడదు, మాతల యొక్క సంఖ్య ఎక్కువగా, ఉంటుంది. ఈ గ్రూప్ లో అందరు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇది చూసి బాబాకి సంతోషం అనిపిస్తుంది. కుమారీలు కూడా చాలా సంఖ్యలో వచ్చారు. కుమారులు తమ యొక్క పరివారాన్ని మేల్కొల్పండి. కుమారులు స్వప్నంలో కూడా పవిత్రతలో పరిపక్వంగా ఉండాలి. ఈ అద్భుతం చూపించాలి. బాప్ దాదా విశ్వానికి ఛాలెంజ్ చేసి చెప్తారు. ఈ యువకుమారులు బ్రహ్మాకుమారులు అని బ్రహ్మాకుమారులు కూడా మరియు శరీరంతో కూడా కుమారులు కనుక పవిత్రత యొక్క పరిభాష ప్రత్యక్షంలో చూపించాలి.
మిమ్మల్ని పవిత్రత విషయంలో పరిశీలన చేయడానికి ఆర్డర్ చేయమంటారా? చేయమంటారా? దీనిలో చేతులు ఎత్తడంలేదు. పరిశీలన చేయడానికి మిషన్ ఉంటుంది. స్వప్నంలో కూడా అపవిత్రత రావడానికి ధైర్యం ఉండకూడదు, కుమారీలు కూడా ఈవిధంగా ఉండాలి. కుమారీ అంటే పూజ్యపవిత్ర కుమారీ, కుమారీ, కుమారులు బాల్దిదాకి ప్రామిస్ చేయండి. మాకు స్వప్నంలో కూడా అపవిత్రత రానివిధంగా పవిత్రంగా ఉంటాము " అప్పుడు బాప్దాదా పవిత్రత యొక్క సిరమని చేస్తారు. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా ఆపవిత్రత ఉంది ఇది బాప్దాదా కి తెలుసు. అపవిత్రత యొక్క అవిద్యాగా అవ్వాలి. ఎందుకంటే క్రొత్త అను "తీసుకున్నారు కదా!
అపవిత్రత మీ వెనుకటి జన్మ విషయం. ఇది మరజీవాజన్మ ఈ జన జన్మతోనే బ్రహ్మముఖం నుండి పవిత్రజన్మగా లభించింది. పవిత్రజన్మ యొక్క మర్యాద తప్పకుండా. ఉండాలి. కుమారీ, కుమారులు ఈ జెండా ఎగురవేయాలి, పవిత్రంగా ఉంటాము, పవిత్రత యొక్క సంస్కారాలు విశ్వంలో వ్యాపింపచేస్తాము అనే ధ్వని రావాలి. కుమారీలు విన్నారా? కుమారీలు, ఎంత మంది ఉన్నారో చూడండి! ఇప్పుడు ఈ ధ్వని కుమారీలు వ్యాపింపచేస్తారో, కుమారులు వ్యాపింపచేస్తారో చూస్తాను. బ్రహ్మాబాబాని అనుసరించండి. బ్రాహ్మణజీవితం అంటేనే అపవిత్రత యొక్క గుర్తులు కూడా ఉండకూడదు. మాతలలో కూడా మోహం ఉంటే అపవిత్రత ఉన్నట్లే. మాతలు కూడా బ్రాహ్మణులు కదా!
మాతలలో, కుమారీలలో, కుమారులలో ఆధర్ కుమారీ, కుమారులలో ఎవ్వరిలో అపవిత్రత ఉండకూడదు. బ్రాహ్మణులు అంటేనే పవిత్రాత్మలు. ఒకవేళ ఏదైనా అపవిత్ర కార్యం జరిగితే ఇది చాలా పాపం. ఈ పాపం యొక్క శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇది ఇలా నడుస్తూ నే ఉంటుంది అని అనుకోకండి. కొద్దిగా అయితే ఉంటుంది పర్వాలేదు అనుకోకండి. ఇది మొదటి సబ్జెక్ట్. నవీనత కూడా పవిత్రతయే బ్రహ్మలాబా కూడా పవిత్రత విషయం గురించే నిందలు) పడ్డారు. అయిపోయింది పర్వాలేదు అనుకోకండి, ఇలా వదిలేది లేదు. దీనిలో సోమరిగా కాకండి. ఏ బ్రాహ్మణాత్మ అయినా అనగా సమర్పణ అయిన వారైనా, సేవాధారులైనా, కుటుంబంలో ఉండేవారైనా ఈ విషయంలో తేడా వస్తే ధర్మరాజు కూడా వదిలేది లేదు.
బ్రహ్మాబాబా కూడా ధర్మరాజుకి తోడు వస్తారు. కుమారీలు ఎక్కడ ఉంటున్నా, సేవాకేంద్రంలో ఉంటున్నా మధువనంలో ఉంటున్నా కానీ సంకల్పమాత్రంగా గాయం అయినా చాలా పెద్దది. మనస్సుని పవిత్రంగా ఉంచుకోండి. తనువుని పవిత్రంగా ఉంచుకోండి అని పాట పాడతారు కదా! పాట ఉంది కదా!. మనస్సు పవిత్రంగా ఉంటే జీవితం కూడా పవిత్రంగా ఉంటుంది. కనుక మనస్సులో అయినా తేలికగా అవ్వకండి. కొంచెమే కదా జరిగింది. ఏముందిలే అని అనుకోకండి. కొంచెం అయినా కానీ ఎక్కువే:
బాప్దాదా అఫీషియల్గా (సూక్ష్మంగా) సైగ చేస్తున్నారు. ఈ విషయంలో తేడా ఉంటే రక్షించుకోలేరు. ఈ విషయం యొక్క లెక్కాచారాన్ని బాబా మంచిగా తీస్తారు. ఎవరైనా కానీ అందువలన జాగ్రత్తగా, ధ్యాసతో వినండి. అందరు ధ్యాసతో విన్నారా! రెండు చెవులతో వినండి. వృత్తిలో కూడా టచ్ అవ్వకూడదు. దృష్టిలో కూడా టచ్ అవ్వకూడదు, సంకల్పంలోనే లేకపోతే వృత్తి, దృష్టిలో ఎలా వస్తుంది! ఎందుకంటే సమయం యొక్క సంపన్నత సమీపంగా వస్తుంది. కనుక పూర్తిగా పవిత్రంగా అవ్వాలి. ఆ లెక్కతో చూస్తే ఇలాంటి విషయాలు తెల్ల కాగితంపై నల్లమచ్చ వంటివి.
నలువైపుల ఉన్నటువంటి సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే పిల్లలకు, సదా అదృష్టం మరియు సంతోషవంతమైన ముఖం మరియు నడవడిక ద్వారా సంతోషం యొక్క బిందువుని ఇచ్చే విశ్వకళ్యాణకారి పిల్లలకు, సదా మనస్సుకి యజమానిగా అయ్యి ఏకాగ్రతాశక్తి ద్వారా మనస్సుని అదుపు చేసుకునే మనసాజీత్, జగతీత్ పిల్లలకు, సదా బ్రాహ్మణజీవితం యొక్క విశేషత అయిన పవిత్రత యొక్క వ్యక్తిత్వంలో ఉండే పవిత్ర బ్రాహ్మణాత్మలకు, సదా డబల్ట్ అయ్యి ఫరిస్తాజీవితంలో బ్రహ్మాబాబాను అనుసరించేవారికి, ఈవిధంగా బ్రహ్మాబాబా సమానమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. నలువైపుల ఉంటూ వినేటువంటి, స్మృతి చేసే పిల్లలందరికీ కూడా చాలా చాలా మనస్సు యొక్క ఆశీర్వాదాలతో కూడిన ప్రియస్మృతులు, అందరికీ నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.