రివైజ్ కోర్స్ మురళి 15-12-2003
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
బాబాని ప్రత్యక్షం చేసేటందుకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయమూర్తి అవ్వండి.
ఈరోజు బాప్దాదా నలువైపుల ఉన్న తన పిల్లల మస్తకం మధ్య మెరుస్తున్న మూడు భాగ్యసితారలను చూస్తున్నారు. ఎంత భాగ్యం లభించింది మరియు ఎంత సహజంగా లభించింది? 1. అలౌకిక శ్రేష్టజన్మ యొక్క భాగ్యం 2. శ్రేష్టసంబంధం యొక్క భాగ్యం 3. సర్వప్రాప్తుల యొక్క భాగ్యం. మెరుస్తున్న ఈ మూడు భాగ్యసితారలను చూసి బాబా కూడా సంతోషిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యం చూడండి - మీ యొక్క జన్మ భాగ్యవిధాత బాబా ద్వారా లభించింది. జన్మదాతయే భాగ్యవిధాత అయితే జన్మ ఎంత అలౌకికంగా మరియు శ్రేష్టంగా ఉంటుంది! మీ అందరికీ కూడా ఈ భాగ్యం యొక్క మరియు జన్మ యొక్క నషా, సంతోషం ఉన్నాయి కదా!!
అలాగే సంబంధం యొక్క విశేషత కూడా చూడండి, మొత్తం కల్పంలో ఇటువంటి సంబంధాలు ఏ ఆత్మకు లభించదు. విశేషాత్మలైన మీకే ఒకని ద్వారా మూడు సంబంధాలు లభిస్తాయి. ఒకే బాబా తండ్రి, టీచర్ మరియు సద్గురువు, ఇలా ఒకని ద్వారా మూడు సంబంధాలు బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ లభించవు. అనుభవం ఉంది కదా? తండ్రి సంబంధంతో వారసత్వం ఇస్తున్నారు మరియు పాలన కూడా చేస్తున్నారు. వారసత్వం కూడా చాలా ఉన్నతమైనది మరియు అవినాశి. ప్రపంచంచారు మా యొక్క పాలనాకర్త భగవంతుడు అని చెప్తారు కానీ పిల్లలైన మీరు నిశ్చయం మరియు నషాతో మా యొక్క పాలనాకర్త భగవంతుడు అని చెప్తారు. ఇటువంటి పరమాత్మ్య పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ్య వారసత్వం ఎవరికీ లభించదు.
ఒకే బాబా తండ్రి, టీచర్ మరియు సద్గురువు, ప్రతి ఆత్మకి జీవితంలో మూడు సంబంధాలు అవసరం కానీ మూడు సంబంధాలు వేరువేరుగా ఉంటాయి. మీకు ఒకరిలోనే మూడు సంబంధాలు : లభిస్తున్నాయి. చదువు కూడా మూడు కాలాల యొక్క చదువు లభిస్తుంది. త్రికాలదర్శిగా అయ్యే చదువు లభిస్తుంది. చదువు సంపాదనకు ఆధారం అని అంటారు. చదువు ద్వారా పదవి కూడా లభిస్తుంది. మొత్తం విశ్వంలో అన్నింటికంటే ఉన్నతమైన పదవి రాజజ్యపదవి అనే మహిమ ఉంది. అలాగే మీకు ఈ చదువు ద్వారా ఏమి పదవి లభిస్తుంది? ఇప్పుడు కూడా రాజులుగా అవుతున్నారు మరియు భవిష్యత్తులో కూడా రాజ్యపదవి లభిస్తుంది. ఇప్పుడు స్వరాజ్యాధికారులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్యభాగ్యం అవినాశిగా లభిస్తుంది. దీని కంటే ఉన్నత పదవి ఏదీ ఉండదు.
శిక్షకుని ద్వారా త్రికాలదర్శిగా అయ్యే శిక్షణ లభిస్తుంది మరియు పదవి కూడా దైవీ రాజ్యపదవి లభిస్తుంది. ఇటువంటి శిక్షకుని యొక్క సంబంధం బ్రాహ్మణజీవితంలో తప్ప సాధారణ జీవితంలో లేదు మరియు ఉండదు. సద్గురువు ద్వారా శ్రీమతం లభిస్తుంది ఈ శ్రీమతం యొక్క మహిమ ఇప్పటికీ భక్తిలో కూడా జరుగుతుంది. మీరు నిశ్చయంతో మా ప్రతి అడుగు శ్రీమతం. ఆధారంగా ఉంటుంది అని అంటారు. ఇలా ప్రతి అడుగు శ్రీమతం ఆధారంగా ఉందా? అని పరిశీలన చేసుకోండి. భాగ్యం అయితే లభించింది కానీ భాగ్యం యొక్క ప్రాప్తి జీవితంలో అనుభవం అవుతుందా? ప్రతి అడుగు శ్రీమతం ఆధారంగా ఉంటుందా లేదా మన్మతం, పరమతం కలుస్తుందా?
ప్రతి అడుగు శ్రీమతం ఆధారంగా ఉన్న దాని యొక్క పరిశీలన ఏమిటంటే ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన జమ అయినట్లు అనుభవం అవుతుంది. మన యొక్క అడుగు శ్రీమతం ఆధారంగా ఉంటే సహజంగా సఫలత వస్తుంది. వెనువెంట సద్గురువు ద్వారా వరదానాల ఖజానా లభించింది. వరదానానికి పరిశీలన ఏమిటంటే- ఉంటుందో అక్కడ శ్రమ అనేది ఉండదు. కనుక సద్గురువు యొక్క సంబంధంతో శ్రేష్టమతం మరియు వరదానం లభిస్తుంది మరియు సహజమార్గం లభించింది.
ఎందుకంటే ఒకరిలోనే ఎక్కడ వరదానం మూడు సంబంధాలు కనుక ఒకరిని జ్ఞాపకం చేయటం సహజం.ముగ్గురిని వేర్వేరుగా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు అందువలనే మీరందరు ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు అని అంటున్నారు. ఇది సహజమే ఎందుకంటే ఒకరిలోనే విశేష సంబంధాలు వస్తున్నాయి. భాగ్యం యొక్క సితార అయితే మెరుస్తుంది ఎందుకంటే బాబా ద్వారా సర్వప్రాప్తులు లభించాయి.
మూడవ భాగ్యసితార - సర్వప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు అనే మహిమ కూడా ఉంది. మీ యొక్క ఖజానాలను స్మృతి చేయండి. ఇటువంటి ఖజానాలు లేక సర్వప్రాప్తులు ఎవరి ద్వారా అయినా లభిస్తాయా? మనస్సుతో నాబాబా అనగానే ఖజానా హాజరైపోతుంది. అందువలనే ఇంత శ్రేష్టభాగ్యం యొక్క ఖజానా స్మృతిలో ఉండాలి. దీనిలో నెంబర్వారీగా ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు - ప్రతి పిల్లవాడు కోట్లలో కొద్దిమంది కనుక పిల్లలందరు నెంబర్ వారీగా కాదు, నెంబర్వన్గా అవ్వాలి అని. కనుక మిమ్మల్ని మీరు అడగండి - నెంబర్ వారీగా ఉన్నానా లేదా నెంబరన్గా ఉన్నానా? అని. ఎలా ఉన్నారు?
టీచర్స్ నెంబర్వారీగా ఉన్నారా లేక నెంబర్వన్గా ఉన్నారా? పాండవులు నెంబర్ వన్ గా ఉన్నారా. లేదా నెంబర్ వారీగా ఉన్నారా? ఎవరైతే సదా మేము నెంబర్ వన్ గా ఉంటాము అంటారో వారు చేతులెత్తండి! ఈరోజు నెంబర్వన్, రేపు నెంబర్ వారీలోకి రావటం ఉండకూడదు. బ్రహ్మాబాబా ఎలా అయితే నెంబర్ వన్ అయ్యారో అలాగే మేము బ్రహ్మబాబా సమానంగా నెంబర్వన్ ఉంటాము అనేవారు చేతులు ఎత్తండి! అలాగే అని చేతులు ఎత్తడం కాదు, ఆలోచించి, అర్ధం చేసుకుని ఎత్తండి! పెద్దగా ఎత్తండి. సగం ఎత్తితే సగంలోనే ఉండిపోతారు. చేతులు చాలా మంది ఎత్తారు. దాదీ చూసారు కదా!
నెంబర్ వన్ అవుతాము అన్నవారి తెక్క తీయాలి. జానకీదాదీ లెక్క తీయాలి. డబల్ విదేశీయులు కూడా ఎత్తారు. నెంబర్వన్ గా ఉన్నవారు చేతులు ఎత్తండి. చేతులైతే ఎత్తి బాప్దాదా ని సంతోషం చేసారు. చేతులు ఎత్తారంటే మీకు ధైర్యం ఉన్నట్లు తెలుస్తుంది. మరియు ధైర్యం ఉంటే బాబా యొక్క సహాయం తప్పకుండా లభిస్తుంది కానీ బాబా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు? నెంబర్వన్ అవ్వాలను కుంటున్నారు ఇది సంతోషమే కానీ... కానీ ఏమి చెప్పము ఇలా అంటున్నారా లేక కానీ అనేదే లేదా?బాప్దాదా దగ్గర కానీ అనేది ఉండదు.
బాప్దాదా అయితే చూసారు - మనస్సులో అయితే ఉంది కానీ అది మనస్సు వరకే ఉంది కానీ నడవడిక మరియు ముఖంలో ప్రత్యక్షం అవ్వలేదు, ఇప్పుడు బాగ్దాదా నెంబర్ వన్ ఆ స్థితి అనేది నడవడిక మరియు ముఖంలో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సమయానుసారంగా నెంబర్వన్ అనే వారి ప్రతి నడవడికలో దర్శనీయమూర్తిగా కనిపించాలి. వీరు దర్శనీయమూర్తులు అని మీ ముఖం చెప్పాలి. మీ జడచిత్రాలు అంతిమజన్మ వరకు, అంతిమ సమయం వరకు దర్శనీయమూర్తిగా అనుభవం అవుతున్నాయి. చైతన్యంలో కూడా మీరు బ్రహ్మాబాబాని చూసారు. కదా - ఫరిస్తాగా తర్వాత తయారయ్యారు కానీ సాకారస్వరూపంలో ఉంటూ కూడా ఎలా కనిపించేవారు?
సాధారణంగా కనిపించేవారా? అంతిమ 84వ జన్మలో, పాతజన్మ అయినా కానీ, 60 సంవత్సరాలు వయస్సు దాటినా ఆది నుండి అంతిమం వరకు దర్శనీయ మూర్తిగా అనుభవం చేయించారు. చేయించారు కదా? సాకారరూపంలో అనుభవం చేయించారు కదా! ఇలా ఎవరైతే నెంబర్ వన్ చేతులు ఎత్తారో వారు టీ.వి లో వచ్చారు కదా! బాప్దాదా వారి యొక్క ఫైల్ చూస్తారు, బాప్దాదా దగ్గర స్టైల్ అయితే ఉంది కదా! కను ఇప్పటినుండి మీ యొక్క ప్రతి నడవడిక ద్వారా అనుభవం అవ్వాలి.
కర్మ సాధారణమైనది అయినా ఏ కర్మ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా, వైద్యం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా ఏది చేస్తున్నా కానీ మీరు ఏ స్థానంలో చేస్తున్నారో అక్కడ మీ సంబంధ, సంపర్కంలోకి వచ్చిన వారు మీ నడవడిక ద్వారా వీరు అతీతమైనవారు మరియు అలౌకికమైనవారు అని అనుభవం చేసుకుంటున్నారా? సాధారణంగా భావించే విధంగా లౌకికంగా కూడా ఉంటున్నారా? కర్మ యొక్క విశేషత లేకపోయినా కానీ ప్రత్యక్షజీవితం యొక్క విశేషత ఉండాలి. చాలా మంచి వ్యాపారులు, చాలా మంచి న్యాయ కవాదులు, చాలా మంచి డైరెక్టర్.....ఇలా చాలా ఉంటాయి. విశేషమైనవారి పేర్లు అన్నీ ఒక పుస్తకంలో ఉంటాయి.
దానిలో ఎంత మంది పేర్లు ఉంటాయి! చాలా మంది పేర్లు ఉంటాయి కదా! వీరు ఈ విశేషం చేసారు. ఆ విశేషం చేసారు అనే పేరు అయితే వచ్చింది కదా! కానీ మీ ప్రత్యక్ష నడవడికలో పరివర్తన కనిపించాలి. ఎక్కడ పని చేసినా కానీ ఒక్కొక్క ఆత్మ సాధారణ కర్మ చేస్తూ కూడా దర్శనీయమూర్తులు అనే ధ్వని రావాలి. కానీ ఇప్పుడు ఆ ధ్వని రాలేదు. ఇలా. అవుతుందా? ముందు కూర్చున్నవారు చెప్పండి! ఇప్పుడు ఫలితంలో ఈ ధ్వని తక్కువగా వినిపిస్తుంది. సాధారణత ఎక్కువ కనిపిస్తుంది. ఎవరైనా, ఎప్పుడైనా విశేషకార్యం చేస్తుంటే విశేషధ్యాస పెడతారు. కదా!
అప్పుడే మంచిగా కనిపిస్తారు కానీ మీకు బాబాపై విశేషమైన ప్రేమ ఉంది. బాబాపై ప్రేమ ఉందా? ఎంత శాతంలో ఉంది? టీచర్స్ చేతులు ఎత్తండి! చాలా మంది టీచర్స్ వచ్చారు. విశేషంగా కనిపిస్తున్నారా? లేదా అప్పుడప్పుడు విశేషంగా, అప్పుడప్పుడు సాధారణంగా కనిపిస్తున్నారా? ఏ కార్యం చేస్తున్నా బాబా కూడా అలౌకికంగా ఉండాలి. సాధారణ భాష ఉండకూడదు. ఇప్పుడు బాప్దాదా కి పిల్లలందరిపై ఇదే శ్రేష్ట ఆశ ఉంది. అప్పుడే బాబా యొక్క ప్రత్యక్షతం జరుగుతుంది. మీ యొక్క కర్మ, నడవడిక, ముఖం స్వతహాగానే ఋజువు చేస్తాయి. ఉపన్యాసంతో ఋజువు అవ్వడు. ఉపన్యాసం అంటే బాణం వేయటం.
కానీ వీరిని తయారుచేసిన వారు ఎవరు అనే దాని ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. స్వయం వెతుకుతారు. స్వయం అడుగుతారు మిమ్మల్ని తయారుచేసినవారు ఎవరు? అని. రచన రచయితను ప్రత్యక్షం చేస్తుంది. ఈ సంవత్సరం ఏమి చేస్తారు? దాడీ గ్రామాల యొక్క సేవ చేయండి అని చెప్పారు. భలే అది చేయాలి కాని బాప్దాదా ఈ పరివర్తన చూడాలను కుంటున్నారు. ఒక సంవత్సరంలో చేయటం ఇది సంభవమేనా? రెండవసారి సీజన్ ప్రారంభమయ్యేటప్పటికి తేడా కనిపించాలి. అన్ని సేవాకేంద్రాల నుండి ఇదే మాట రావాలి - మహాన్ పరివర్తన వచ్చింది అని, అప్పుడే - పరివర్తన, పరివర్తన అనే పాట పాడతారు.
సాధారణ మాట ఇప్పుడు మీ భాగ్యం ముందు మంచిగా అనిపించదు. కారణం ఏమిటంటే, నేను అనేది వస్తుంది. ఈ నేను, నాది అనే భావన ఉంటే నేను ఏది ఆలోచిస్తున్నానో, నేను ఏది చెప్తున్నానో, నేను ఏది చేస్తున్నానో... అదే మంచిది. ఈ నేను అనే భావన కారణంగా అభిమానం కూడా వస్తుంది మరియు క్రోధం కూడా వస్తుంది. రెండూ తమ పని చేస్తున్నాయి. విశేషత బాబా యొక్క ప్రసాదం, నాది అనేది ఎక్కడినుండి వచ్చింది? ప్రసాదాన్ని ఎవరైనా నాది అని అంటారా? ఒకవేళ తెలివైన బుద్ధి ఉన్నా, ఏదైనా విశేషత ఉన్నా ఆ విశేషత లేదా తెలివైన బుద్ధి బాబా యొక్క ప్రసాదం కానీ నాది అనేది తీసుకురాకండి.
ఈ నాది అనే భావనను సమాప్తి చేయండి. ఇది సూక్ష్మమైన నాది అనే భావన. అలౌకిక జీవితంలో ఈ నాది అనే భావన దర్శనీయమూర్తిగా అవ్వనివ్వడు. దాదీలు ఏమని భావిస్తున్నారు? పరివర్తన అవుతారా? పాండవులు, ముగ్గురు చెప్పండి! ముగ్గురు విశేషమైనవారు కదా! కనుక ముగ్గురు పరివర్తన అవుతారా? చెప్పండి. అవుతుందా? అవుతుందా? మంచిది. ఇప్పుడు దీని యొక్క కమేండర్ అవ్వాలి. ఇతర విషయాలలో కమేందర్ " అవ్వకూడదు. పరివర్తనలో కమేండర్ గా అవ్వకూడదు; పరివర్తనలో కమేండర్గా అవ్వాలి. మధువనం వారు అవుతారా? అవుతారా?
మధువనం వారు చేతులు ఎత్తండి ? అవుతారా? బొంబాయి వారు చేతులు ఎత్తండి! బొంబాయి వారు పరివర్తన అవుతారా? ఒకవేళ అవుతాము స్త్రీ అనుకుంటే చేతులు ఊపండి. మంచిది, ఢిల్లీ వారు చేతులు ఎత్తండి! మంచిది. ఢిల్లీ వారు చేస్తారా? టీచర్స్ చెప్పండి, ప్రతి నెల రిపోర్ట్ తీసుకుంటారు. ధైర్యం ఉంది కదా! బాప్దాదా శుభాకాంక్షలు. మంచిది, ఇండోర్ వారు చేతులు ఎత్తండి! సేవ యొక్క అవకాశం వీరిది కదా! ఇండోర్లోని టీచర్స్ చేతులు ఎత్తండి! మీరు చేస్తారా? ఇండోర్ వారిని బాబా అడుగుతున్నారు, మీరు చేస్తారా? చేతులూపండి! అందరు ఊపలేదు. చేస్తారా లేక చేయిస్తారా?
దాదీలు చూడండి, టీ.విలో చూస్తున్నారు. గుజరాత్ వారు చేతులెత్తండి. మీరు చేస్తారా? చేతులూపటం అయితే సహజం. ఇప్పుడు మనస్సుతో చెప్పండి. ఇంత దు:ఖాన్ని చూసి మీకు దయ రావటంలేదా? ఇప్పుడు పరివర్తన అయితే మంచిది కదా! బాబాని ప్రత్యక్షం చేసేటందుకు ప్లాన్ ఏమిటంటే మీ ప్రత్యక్ష జీవితం. ఇతర ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తున్నారో అవి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి అది అయితే మంచిదే కానీ బాబా ప్రత్యక్షం అయ్యేది మీ నడవడిక మరియు ముఖం ద్వారా!! ఇంకా ఏ జోన్ వారు అయినా మిగిలిపోయారా? ఉత్తరప్రదేశ్ వారు చేతులెత్తండి!
కొద్దిమందే ఉన్నారు. సరే మీరు చేస్తారా? మహారాష్ట్ర వారు చేతులెత్తండి! బాగా పైకి ఎత్తండి! మంచిది. మీరు చేస్తారా? శుభాకాంక్షలు. రాజస్థాన్ వారు ఎత్తండి! టీచర్స్ చేతులూపండి. కర్ణాటక వారు ఎత్తండి! మీరు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ వారు చేతులెత్తండి! మంచిది. మీరు చేస్తారా? డబల్ విదేశీయులు చేతులెత్తండి! చేస్తారా డబల్ విదేశీయులు? అందరూ చాలా బాగా ధైర్యం చూపించారు. ఆ ధైర్యానికి పదమాపద శుభాకాంక్షలు. బయట కూర్చుని కూడా వింటున్నారు. తమ తమ దేశాలలో ఉండి కూడా వింటున్నారు. వారు కూడా చేతులెత్తుతున్నారు.
మామూలుగా కూడా చూడండి - ఎవరైతే శ్రేష్ట ఆత్మలు ఉంటారో వారి ప్రతి వాక్కు సత్యంగా ఉంటుంది. సత్యవచన మహారాజు అని అంటారు కదా! కానీ మీరు అయితే మహా మహారాజులు. మీ మాట ఎవరైతే వింటారో వారికి ఇది సత్యం అని అనుభవం అవ్వాలి. మీ అందరి మనస్సుల్లో చాలా విషయాలు నిండి ఉన్నాయి.బాప్దాదా దగ్గర మనస్సుని చూసే టీ.వి ఉండి. స్థూలమైన ఈ టీ.వి అయితే స్థూలరూపాన్ని చూపిస్తుంది కానీ ప్రతి ఒక్కరి మనస్సు యొక్క స్థితి ఏ సమయంలో ఎలా ఉందో చూసే యంత్రం బాప్దాదా దగ్గర ఉంది. అలా చూస్తే మనస్సులో చాలా విషయాలు జై కనిపిస్తున్నాయి. బాప్దాదా మనస్సు యొక్క టీ.వి చూసినప్పుడు చాలా సంతోషిస్తున్నారు.
చాలా ఖజానాలు ఉన్నాయి. చాలా శక్తులు ఉన్నాయి కానీ కర్మలో యధాశక్తి కలిగినవారిగా అయిపోతున్నారు. అందువలన ఇప్పుడు కర్మ వరకు తీసుకురండి. నడవడిక వరకు తీసుకురండి. శివశక్తులే వెలసెను అని పాట ఉంది కదా! అప్పుడు అందరు ఆవిధంగా మీ గురించి అనుకుంటారు. అందరు శివశక్తులే. పాండవుల కూడా శివశక్తులే. ఈ శక్తులే శివ తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. ఇప్పుడు చిన్ననాటి ఆటపాటలను వదిలేయండి. వానప్రస్థితిని తెచ్చుకోండి, బాప్దాదా పిల్లలందరినీ తన ఆశలను పూర్తి చేసే ఆశాసితారలుగా చూస్తున్నారు.
ఏ విషయం వచ్చినా కానీ ఇదే సూక్తి గుర్తు ఉంచుకోవాలి - పరివర్తన, పరివర్తన, పరివర్తన. మంచిది, ఢిల్లీ వారు చాలా మంచి సేవ యొక్క ప్రత్యక్షతను చూపించారు. బాప్ దాదా సేవ కొరకు ఏదైతే సలహాను కలపమని చెప్పారో ఆ రకంగా సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే సంబంధ, సంపర్యంలోకి వస్తున్నారో వారు ఇదే అంటున్నారు మీ కార్యం నుంచి కానీ ప్రచారం సరిగా లేదు, గుప్తంగా ఉన్నారు అందువలనే బాబా కూడా ప్రత్యక్షం కాలేదు. ఢిల్లీలో ప్రసారమాద్యమం ద్వారా సేవ చేసారు దాని ద్వారా ప్రచారం అనేది ఇప్పుడు ప్రారంభం అయ్యింది. బ్రహ్మాకుమారీలు పెద్ద కార్యక్రమం చేసారు అని బాగా పేరు వచ్చింది.
కనుక ఢిల్లీ' వారికి శుభాకాంక్షలు. ఎవరైతే ఢిల్లీ నుండి వచ్చారో వారు ముందుకి వచ్చి చేతులు ఎత్తండి! చాలా పెద్ద గ్రూప్ వచ్చారు (సుమారుగా 900 మంది ఢిల్లీ నుండి వచ్చారు) చూడండి! ఎవరైతే స్టేజ్ పై ఉన్నారో వారిని బాగ్దాదా చూడటంలేదు. ఎదురుగా ఉన్న మిమ్మల్నే బాబా చూస్తున్నారు. అందువలన మీ పేరుని అందరి కంటే ముందుగా ఉన్నట్లుగా భావించండి. సేవలో బాప్దాదా నాకు మొదటి నెంబర్. అని ప్రతి ఒక్కరు భావించండి. చాలా మంది వచ్చారు కదా! అలాగే వెనుక ఉన్నవారు మేము వెనుక ఉన్నాము అని అనుకోకండి. మీరు అందరికంటే ముందు ఉన్నారు.
టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ బాప్దాదా పేరుపేరున ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు ఇస్తున్నారు. పేర్ల మాలను స్మరించడం లేదు కానీ హృదయంలో బాప్దాదా ప్రతి ఒక్కరి మాలను జపిస్తున్నారు. కనుక నా పేరు చెప్పలేదు అని ఎప్పుడు అనుకోకండి. అందరి పేర్లు ఉంటాయి. ఇది సాకారవతనం కదా! కనుక సాకారంలో సాకారపూర్వకంగానే చేయవలసి ఉంటుంది కదా! ఇక్కడ ఇంతమందిని వేదికపైకి ఎలా రమ్మనేది ? స్టేజ్ అంతా నిండిపోతుంది. వెనుక ఉన్నవారు చేతులెత్తండి! మీరు హృదయంలో ఉన్నారు. మీరు స్టేజ్ పై ఉన్నారు బాప్దాదా మీలో ఏ విశేషతను చూసారు? ఐక్యత. మీ ఆలోచనను చెప్తారు. తిరిగి ఏది చెప్తే దానికి అలాగే అలాగే అంటూ ఐక్యతకు లోబడి ఉన్నారు. ఈ ఐక్యతయే సఫలతకి సాధనం.
"మీరు ఒకొక్కరు సఫలతా సితారలు. ముఖ్యంగా వెనుక ఉన్నవారు ఒక్కొక్కరు బాబా ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు సంతోషంగా ఉందా? లేక నా పేరు చెప్పలేదు అంటారా? అందరు కష్టపడ్డారు. చిన్న చిన్న టీచర్స్ ఎక్కువ శ్రమ చేసారు. అన్నయ్యలు కూడా చాలా శ్రమ చేసారు. ఎవరు ఏ బాధ్యత తీసుకున్నారో దానిని సఫలత పూర్వకంగా నిర్వహించారు. అందువలనే సఫలత | వచ్చింది. ఢిల్లీ అంటే బాగ్దాదా దిల్ (హృదయం) సరే వెనుక ఉన్నవారు ముందుకి వస్తారా లేదా వెనుకే ఉంటారా? మమ్మల్ని పిలవలేదు, పిలవలేదు అంటూ మరల నిందించకూడదు. అందరూ బాప్దాదా యొక్క నయనాలలో ఉన్నారు.
బాప్దాదా ఎదురుగా ఉన్నారు. చిన్న టీచర్స్క డబల్ శుభాకాంక్షలు. ఇక పాండవులకు సదా బాబా తోడుగా ఉంటారు. సరే, మంచిది. సంతోషంగా ఉన్నారా? సదా సంతోషంగా ఉండండి. ఇప్పుడు విదేశీయులు అద్భుతం చేయాలి. విదేశంలో కార్యక్రమం జరగాలి. భారతదేశంలో చూడాలి. ఇది కష్ట విషయమేమీ కాదు. లక్షల మంది ఒకే స్థానంలో కలవలేకపోయినా కానీ ప్రసారమాధ్యమాల ద్వారా ప్రభావం మంచిగా ఉండాలి. లక్షల మంది అక్కడ కలవాలి అని కాదు ప్రసారమాధ్యమం ద్వారా అక్కడి కార్యక్రమం భారతదేశంలో చూడాలి అప్పుడే కుంభకర్ణులు మేల్కొంటారు. మంచిది.
ఇప్పుడు కలకత్తా వారు కూడా ప్రియస్మృతులు పంపారు. ప్రతి స్థానానికి తమ తమ ప్రభావం ఉంటుంది. ఢిల్లీలో అయితే అంతర్జాతీయ సాధనాలు ఉన్నాయి. కలకత్తాకి మరో దీవిశేషత ఉంటుంది. కలకత్తా కూడా తక్కువ కాదు. మీరు చేసే పురుషార్ధానికి ప్రాలబ్ధం లభిస్తుంది. సఫలత అనేది మీ జన్మసిద్ధ అధికారం. కలకత్తా వారు కూడా ధ్వనిని బాగా వ్యాపింప చేస్తున్నారు. మరియు చేస్తారు కూడా! కనుక కలకత్తా వారు ఢిల్లీ కంటే తక్కువైనవారు కాదు. వారు కూడా ముందుకి వెళ్తున్నారు. ప్రతి స్థానానికి వాటి వాటి రూపురేఖలు ఉంటాయి. ఇప్పుడు బాప్దాదా విదేశీయులకు చెప్తున్నారు. - విదేశంలో కార్యక్రమం జరగాలి, భారతదేశం వారు చూడాలి.
ఇంజనీర్లు, సైంటిస్ట్లు, సమాజ సేవకులు, యువకులు, గ్రామాలలో సేవ చేసేవారు. శ్రీ మరియు నిమిత్త రాజాస్థాన్ అక్కయ్యలు, అన్నయ్యలు మీటింగ్ కొరకు వచ్చారు. వారితో అవ్యక్త బాప్దాదా సంభాషణ. ఇలా వర్గాల వారీగా చేసే సేవలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వర్గం వారు శ్రమ చేస్తున్నారు. సంపర్కాన్ని పెంచుతున్నారు.. వైద్య వర్గం వారు కూడా యోగం ద్వారా గుండె బాగా పని చేస్తుంది అని ప్రత్యక్షంగా చేసిచూపించారు. యోగం ద్వారా గుండె సక్రమంగా పని చేస్తుంది అని ఋజువు చూపించారు. చూపించారు కదా! మీరందరు కూడా విన్నారు కదా! ప్రపంచంలోని వారు కూడా ఇటువంటి ప్రత్యక్ష ఋజువులు చూడాలనుకుంటున్నారు.
ఇదే రకంగా మిగిలిన వర్గాల వారు ఎవరైతే వచ్చారో వారందరు కూడా ఋజువు చూపించండి. కార్యక్రమాలు అయితే చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏమి ప్లాన్ చేయాలంటే మీరు చేసే దాని ఫలితం అందరికీ కనిపించాలి. అన్ని వర్గాల వారికి బాప్దాదా చెప్తున్నారు. ఈ విషయం గవర్నమెంట్ వరకు కూడా చేరుకుంటుంది కదా! యోగం ద్వారా గుండె జబ్బులు నయం అవుతాయి అనే మాట కూడా వ్యాపించింది. ప్రారంభం అయితే చేసారు కానీ ఇప్పుడు దీనిని మరింత పెంచాలి. డాక్టర్ గుప్త ఎక్కడ ఉన్నారు? దీనిని మరింత వ్యాపింపచేయండి. ఇదేవిధంగా ప్రతి వర్గం వారు ప్రత్యక్షఋజువు చూపించాలి. ధ్వనిని వ్యాపింపచేసారు.
సంప్రదింపులు పెంచారు దీనికి బాబాబా కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు శ్రమ చేస్తున్నారు మరియు సఫలత కూడా పొందుతున్నారు ప్రత్యక్ష విషయం విని ఇది ఇలా అని వారు అర్ధం చేసుకోవాలి. ఏ వర్గం వారు అయినా కానీ ఒక చిత్రాన్ని తయారు చేయండి. ప్రత్యక్ష ఉదాహరణ ఇవ్వండి. యోగం ద్వారా అన్నీ జరుగుతాయి అని అందరి ధ్యాస యోగం వైపుకి తీసుకురండి. ఆధ్యాత్మికత వైపుకి తీసుకురండి. వైద్యరంగం వారు కూడా మున్ముందు ఇతర వ్యాధులకు కూడా చేయగలరు. కొంచెం కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటే ధ్వని వ్యాపిస్తూ ఉంటుంది. పరమాత్ముని ఆశీర్వాదం కూడా అన్నీ చేయగలదు అనే మాట ప్రత్యక్షం చేయండి, సరే, చాలా బాగా చేసారు.
నలువైపుల ఉన్న చాలా, చాలా భాగ్యశాలీ ఆత్మలకు, మొత్తం విశ్వంలో కోట్లలో కొద్దిమంది మరియు కొద్ది మందిలో కొద్దిమంది అయిన విశేషాత్మలకు, సదా స్వయం యొక్క నడవడిక, ముఖం ద్వారా బాబాని ప్రత్యక్షం చేసే విశేష పిల్లలకు సదా స్నేహం మరియు సహయోగం యొక్క బంధనలో ఉండే శ్రేష్టాత్మలకు, సదా బ్రహ్మాబాబా సమానంగా ప్రతి కర్మను అలౌకిక కర్మగా చేసే అలౌకిక ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.