రివైజ్ కోర్స్ మురళి 17-03-2003                                        

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

ఈ సంవత్సరం స్వమానంలో ఉండాలి సన్మానాన్ని (గౌరవాన్ని) ఇవ్వాలి మరియు సమర్ధంగా తయారుచేయాలి.....

ఈరోజు బాప్దాదా నలువైపుల ఉన్న ప్రతి పిల్లవాని యొక్క మస్తకంలో మూడు భాగ్యరేఖలను చూస్తున్నారు. 1. పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ 2. సత్యశిక్షకుని ద్వారా శ్రేష్ట శిక్షణ యొక్క భాగ్యరేఖ 3. శ్రీమతం యొక్క మెరిసే రేఖ. నలువైపుల ఉన్న పిల్లల యొక్క మస్తకం మధ్యలో ఈ మూడు రేఖలు చాలా బాగా మెరుస్తున్నాయి. మీరందరూ కూడా మీ యొక్క మూడు భాగ్యరేఖలను చూసుకుంటున్నారు కదా! భాగ్యవిధాత మీ యొక్క తండ్రి అంటే మీ కంటే శ్రేష్టభాగ్యం మరెవరికి ఉంటుంది? బాప్దాదా చూస్తున్నారు విశ్వంలో అనేక కోట్ల ఆత్మలు ఉన్నారు కానీ ఆ కోట్లలో 6 లక్షల మంది మీ పరివారంగా ఉన్నారు.... అంటే ఎంత తక్కువమంది!

అంటే కోట్లలో కొద్ది మందే అయ్యారు కదా! ప్రతి మానవుని జీవితానికి పాలన, చదువు మరియు శ్రేష్టమతం మూడింటి అవసరం ఎంతైనా ఉంటుంది. పరమాత్మ పాలన, చదువు, మతానికి, దేవాత్మల లేదా మానవాత్మల పాలన, చదువు, మతానికి రాత్రికి పగలుకి ఉన్నంత తేడా ఉంటుంది. సంకల్పంలో కూడా ఆలోచించ నంత శ్రేష్టభాగ్యాన్ని పొందారు కనుకనే ప్రతి ఒక్కరి - మనస్సు పాడుతుంది. మేము పొందాము అని. పొందారా లేక పొందాలా? ఏమంటారు? దేసారు కదా! బాబా కూడా పిల్లల యొక్క ఇటువంటి భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. ఓహో- బాబా ఓహో! అని పిల్లలు అంటారు ఓహో పిల్లలు ఓహో అని బాబా అంటారు.

ఈ భాగ్యాన్ని, కేవలం సదా స్మృతిలో ఉంచుకోవటమే కాదు సదా స్మృతిస్వరూపంగా ఉండాలి. కొంతమంది పిల్లలు చాలా బాగా ఆలోచిస్తున్నారు కానీ ఆలోచనా స్వరూపులుగా కాదు, స్మృతిస్వరూపులుగా అవ్వాలి. కేవలం ఆలోచనా స్వరూపంగా ఉండటం అనేది సమర్ధ స్వరూపం కాదు. బాప్దాదా పిల్లల యొక్క భిన్న, భిన్న లీలలను చూసి నవ్వుకుంటున్నారు. కొందరు ఆలోచనా స్వరూపంగానే ఉంటున్నారు. సదా స్మృతిస్వరూపులుగా ఉండటంలేదు. ఒక్కొక్కసారి ఆలోచనాస్వరూపులు, ఒక్కొక్కసారి స్మృతి స్వరూపులు, ఎవరైతే సదా స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు నిరంతరం సహజ స్వరూపులుగా ఉంటారు.

ఎవరైతే కేవలం ఆలోచనా స్వరూపులుగానే ఉంటారో వారు శ్రమచేయాల్సి ఉంటుంది. ఇది సంగమయుగం, శ్రమ చేసే యుగం కాదు, సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకునే యుగం. 63 జన్మలు శ్రమ చేసారు. ఇప్పుడు ఆ శ్రమ యొక్క ఫలాన్ని ప్రాప్తింపచేసుకునే యుగం అంటే సమయం, బాప్దాదా చూసారు దేహాభిమానం యొక్క స్మృతిలో ఏమైనా శ్రమ చేసారా? నేను ఫలానా, ఫలానా.. అని ఏదైనా శ్రమ చేసారా? సహజంగా స్మృతిలో ఉన్నారు కదా! దేహాభిమానం అనేది సంస్కారంగా అయిపోయింది కదా! ఎంత పక్కా సంస్కారంగా అయిపోయింది అంటే ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు ఆత్మాభిమాని అవ్వాలనుకున్నా కానీ దేహాభిమానం తనవైపు ఆకర్షించుకుంటుంది.

నేను ఆత్మను, ఆత్మను.... అని ఆలోచిస్తారు కానీ దేహాభిమానం ఎంత సహజంగా ఉంటుందంటే మాటిమాటికి వద్దనుకున్నా కానీ, ఆలోచించకపోయినా కానీ దేహాభిమానంలోకి వచ్చేస్తారు. బాబా చెస్తున్నారు ఇప్పుడు ఈ మరజీవా జన్మలో ఆత్మాభిమాని అంటే దేహీఅభిమాని స్థితి కూడా అంతే సహజంగా మరియు సంస్కారంగా అయిపోవాలి. నేను ఆత్మను, ఆత్మను అని శ్రమ చేయవలసిన అవసరం ఉండకూడదు. ఎవరైనా బ్రాహ్మణజీవితంలోకి రాగానే వారికి పరిచయాన్ని ఇస్తారు కదా మీరెవరు? ఎవరి వారు? అని చెప్తారు కదా! బ్రాహ్మణ పిల్లలైన మీరు జన్మం తీసుకోగానే ఏమి పరిచయం లభించింది? మీరెవరు? అనే పరిచయం లభించింది కదా!

ఆత్మ పాఠాన్ని పక్కా చేయించారు కదా! కనుక ఈ మొదటి పరిచయం సహజ సంస్కారంగా అయిపోవాలి. సహజ సంస్కారం నిరంతరం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉండదు. అదేవిధంగా ఇప్పుడు సమయ ప్రమాణంగా ప్రతి బ్రాహ్మణాత్మకి దేహీఅభిమాని స్థితి సహజంగా ఉండాలి. కొందరు పిల్లలు ఆలోచించవలసిన అవసరం లేకుండానే స్మృతిస్వరూపులుగా ఉంటున్నారు. ఇప్పుడు నిరంతర మరియు సహజ స్మృతిస్వరూపులుగా అవ్వవలసిందే. బ్రాహ్మణాత్మలందరికీ నష్టోమోహ స్మృతిస్వరూప ఇదే అంతిమ పేపర్. అయితే ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు?

కొంతమంది పిల్లలు అడుగుతున్నారు. ఈ సంవత్సరం ఏ విశేష లక్ష్యం పెట్టుకోవాలి? అని. అందువలన బాప్దాదా చెప్తున్నారు సదా  దేహీఅభిమాని, స్మృతిస్వరూపభవ. జీవన్ముక్తి అయితే ప్రాప్తింపవలసే ఉంది కానీ ముందుగా శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. ఈ స్థితి సమయాన్ని సమీపంగా తీసుకువస్తుంది మరియు విశ్వంలో ఉన్న మీ సోదరి సోదరులందరినీ దుఃఖం అశాంతి నుండి ముక్తులుగా చేస్తుంది. అందువలన పరిశీలించుకోండి-సహజ స్మృతిస్వరూపం నుండి సమర్ధ స్వరూపం ఎంత వరకు ఉంటుంది? అని. సమర్ధ స్వరూపంగా అవ్వటం అంటేనే వ్యర్థాన్ని సహజంగా సమాప్తి చేయటం.

మాటిమాటికి శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ సంవత్సరం బాప్దాదా పిల్లలపై ఉన్న స్నేహం కారణంగా ఏ సమస్యలోనూ, ఏ పిల్లవాని యొక్క శ్రమని చూడకూడదు అని అనుకుంటున్నారు. సమస్యలు సమాప్తి అయిపోవాలి మరియు సమాధాన సమర్ధ స్వరూపంగా ఉండాలి. ఇది జరుగుతుందా? దాదీలు చెప్పండి - అవుతుందా? టీచర్స్ చెప్పండి - అవుతుందా? అవుతుండా పాండవులూ? తిరిగి మరలా సాకులు చెప్పకూడదు. ఇది ఉంది కదా, ఇలా జరిగింది కదా, ఇది జరగకపోతే ఇలా అయ్యేది కాదు... ఇలా అనకూడదు. బాప్దాదా పిల్లల యొక్క చాలా ఆటలను చూసేసారు.

మధురాతి మధుర ఆటలు ఆడుతున్నారు. ఏదైనా కానీ అంటే తనుపు ద్వారా, మనస్సు ద్వారా, వ్యక్తి ద్వారా, ప్రకృతి ద్వారా సమస్య లేదా పరిస్థితి ఎంత పెద్దది అయినా కానీ, హిమాలయాల కంటే పెద్ద పరిస్థితి అయినా కానీ మీ స్వస్థితి ముందు గొప్పది కాదు. స్వస్థితి తయారవ్వటానికి సాధనం - స్వమానం. స్వమానం సహజరూపంలో ఉండాలి. జ్ఞాపకం చేసుకోవలసి ఉండకూడదు. మాటిమాటికి శ్రమ చేయవలసి ఉండకూడదు. నేను స్వదర్శనచక్రధారిని, నేను కంటి రత్నాన్ని, నేను హృదయసింహాసనాధికారిని ... ఇలా కాదు. మీరు కాక ఎవరైనా అవుతారా ఏమిటి? కల్పపూర్వం ఎవరు అయ్యారు?

ఇతరులెవరైనా? శ్రీ అయ్యారా లేక మీరే అయ్యారా? మీరే అయ్యారు, ఇప్పుడు మీరే, ప్రతి కల్పం మీరే అవుతారు. నిశ్చితం కదా! మీకు పాస్ అయినట్లుగా సర్టిఫికెట్ లభించింది కదా లేక తీసుకోవాలా? లభించే ఉందా లేక తీసుకోవాలా? కల్పపూర్వం లభించినప్పుడు ఇప్పుడు లభించడా? కనుక ఇదే! స్మృతిస్వరూపులు అవ్వండి. సర్టిఫికెట్ లభించే ఉంది. పాస్విత్ఆనర్ మరియు పాస్ అనే తేడా అయితే ఉంటుంది. కానీ అయ్యేది మనమే. ట్రైన్లో వెళ్తూ, వెళ్తూ మర్చిపోతారా, విమానం ఎక్కిన తర్వాత ఎగిరిపోతుందా? లేదు కదా! .

ఈ సంవత్సరం ధృడసంకల్పం చేసారు కదా! నలువైపుల శివరాత్రి ఉత్సాహ, ఉల్లాసాలతో జరుపుకోవాలి. జరుపుకున్నారు కదా! దృఢసంకల్పం ద్వారా ఏదైతే ఆలోచించారో అది జరిగిపోయింది కదా! అంటే ఇది ఏ విషయం యొక్క అద్భుతం? ఏకత మరియు ధృడత యొక్క అద్భుతం. 67 స్థానాలలో శివజయంతి కార్యక్రమం చేయాలి అని ఆలోచించారు కదా కానీ బాప్దాదా చూసారు, కొంతమంది పిల్లలు అంతకంటే ఎక్కువే చేసారు. ఇది సమర్థ స్వరూపానికి గుర్తు, ఉత్సాహ, ఉల్లాసాల యొక్క ప్రత్యక్షఋజువు. స్వతహాగానే నలువైపుల సేవ చేసారు కదా!

అదేవిధంగా అందరు కలిసి ఒకరికొకరు ధైర్యాన్ని పెంచుకుంటూ ఈ సంకల్పం చేయండి ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావలసిందే. ఆత్మలకు ముక్తిని ఇప్పించాలి కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మీ ఆలోచనను స్మృతిస్వరూపంలోకి తీసుకువచ్చినప్పుడు జరుగుతుంది. బాప్దాదా విన్నారు - విదేశీయుల యొక్క విశేష స్నేహ మిలనం లేదా మీటింగ్ జరుగుతుంది మరియు భారతవాసీయులు మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్లో కేవలం సేవ యొక్క ప్లాన్స్ తయారుచేసుకోవటమే కాదు, తయారు చేసుకోండి కానీ సమానంగా తయారుచేసుకోవాలి.

మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి ముందుకి ఎగిరిపోవాలి ఈవిధంగా ఒకరికొకరు సహయోగిగా అవ్వండి. దాతగా అయ్యి సహయోగం ఇవ్వండి, విషయాలను చూడకండి. సహయోగిగా అవ్వండి. స్వమానంలో ఉండండి మరియు గౌరవాన్ని ఇచ్చి సహాయోగిగా అవ్వండి ఎందుకంటే ఏ ఆత్మకైనా మీరు మనస్సుతో గౌరవం ఇవ్వటం అనేది చాలా చాలా గొప్ప పుణ్యం. ఎందుకంటే బలహీన ఆత్మని ఉత్సాహ, ఉల్లాసాలలోకి తీసుకువచ్చారు అంటే ఎంత గొప్ప పుణ్యం! పడిపోయిన వారిని పడేయకూడదు. దగ్గరికి తీసుకోవాలి.

అంటే శారీరకంగా కాదు, దగ్గరికి తీసుకోవటం అంటే బాబా సమానంగా తయారు చేయటం, సహయోగం ఇవ్వటం. ఈ సంవత్సరం ఏమేమి చేయాలి అని అడిగారు కదా! గౌరవాన్ని ఇవ్వండి మరియు స్వమానంలో ఉండండి. సమర్ధంగా అయ్యి సమర్ధంగా తయారుచేయాలి. వ్యర్ధవిషయాలలోకి వెళ్ళకూడదు. బలహీన ఆత్మ బలహీనంగానే ఉంటుంది. మీరు ఆ బలహీనతను చూస్తూ ఉంటే సహయోగిగా ఎలా కాగలరు? సహయోగం ఇవ్వండి అప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇది అన్నింటికంటే సహజపురుషార్ధం.

ఇంకేమీ చేయలేకపోతే అన్నింటికంటే సహజపురుషార్ధం - ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. గౌరవాన్ని ఇవ్వండి మరియు మహిమా యోగ్యంగా అవ్వండి. గౌరవాన్ని ఇచ్చేవారే సర్వుల ద్వారా గౌరవనీయంగా అవుతారు. ఇప్పుడు ఎంతగా గౌరవనీయంగా అవుతారో అంతగానే రాజ్యాధికారిగా మరియు పూజ్య ఆత్మగా అవుతారు. తీసుకోవాలని ఆలోచించకండి, ఇస్తూ వెళ్ళండి మరియు తీసుకోండి అంటే ఇది వ్యాపారస్తుల పని అయ్యింది. మీరయితే దాత యొక్క పిల్లలు. బాప్దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క సేవని చూసి సంతోషిస్తున్నారు.

 అందరు మంచి సేవ చేసారు కానీ ఇప్పుడు ముందుకి వెళ్ళాలి కదా! వాచా ద్వారా అందరు చాలా మంచి సేవ చేసారు. సాధనాల ద్వారా కూడా సేవ యొక్క మంచి ఫలితాన్ని తీసుకువచ్చారు. అనేకాత్మల యొక్క నిందను కూడా పూర్తి చేసారు. దానితో పాటుగా సమయం యొక్క తీవ్రగతిని చూసి బాప్దాదా ఇదే కావాలను కుంటున్నారు - కేవలం కొద్దిమంది. ఆత్మల యొక్క సేవ చేయటం కాదు కానీ విశ్వంలో సర్వాత్మలకు ముక్తిదాతలుగా మీరు. 1. వాచా. ద్వారా నిమిత్తమయ్యారు. ఎందుకంటే మీరు బాబా యొక్క సహయోగులు. కనుక ఇప్పుడు సమయప్రమాణంగా ఒకే సమయంలో మూడు సేవలను చేయండి.

2. స్వశక్తిశాలిస్ధితి ద్వారా 3. శ్రేష్టఆత్మిక తరంగాల ద్వారా ఎక్కడ సేవ చేసినా కానీ అక్కడ ఆత్మిక తరంగాలను వ్యాపింపచేయండి. ఆ తరంగాల యొక్క ప్రభావంతో ఇతరులు సహజంగానే ఆకర్షితులు కావాలి. చూడండి, ఈ అంతిమజన్మలో కూడా మీ జడచిత్రాలు ఏవిధంగా సేవ చేస్తున్నాయి? వాచా ద్వారా మాట్లాడుతున్నాయా? తరంగాలు ఎలా ఉంటా యంటే భక్తుల యొక్క భావనకి ఫలం సహజంగానే లభిస్తుంది. ఆవిధంగా తరంగాలు శక్తివంతంగా ఉండాలి. తరంగాలలో సర్వశక్తుల యొక్క కిరణాలు వెదజల్లబడుతూ ఉండాలి. వాయుమండలం మారిపోవాలి. తరంగాల ద్వారా మనస్సుపై ముద్ర పడుతుంది.

మీ అందరికీ అనుభవం కూడా ఉంది కదా - ఏ ఆత్మ పట్ల అయినా మీ మనస్సులో మంచిగా అయినా లేదా చెడుగా అయినా వైబ్రేషన్ | ఏర్పడితే అది ఎంత సమయం ఉంటుంది? చాలా సమయం వరకు ఉంటుంది కదా!! తొలగించుకోవాలన్నా తొలగదు. ఎవరిపైనైనా చెడు వైబ్రేషన్ ఉంటే అది సహజంగా తొలగిపోతుందా? అదేవిధంగా మీ యొక్క సర్వశక్తుల కిరణాల యొక్క వైబ్రేషన్ ముద్ర వలె పనిచేస్తుంది. మాటలు మర్చిపోవచ్చు కానీ వైబ్రేషన్ యొక్క ముద్ర సహజంగా తొలగదు. అనుభవం- ఉంది కదా? ఉందా అనుభవం?

గుజరాత్ వారు, బొంబాయి వారు చూపించిన ఉత్సాహ, ఉల్లాసాలకు బాప్దాదా  పదమాపదాల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎందుకు? విశేషత ఏమిటి? ఎందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు? కార్యక్రమాలు అయితే చాలా పెద్దవి చేస్తున్నారు కానీ విశేషంగా శుభాకాంక్షలు ఎందుకు ఇస్తున్నారు? ఇద్దరి యొక్క విశేషత ఏమిటంటే ఏకత మరియు ధృడత. ఎక్కడైతే ఏకత మరియు ధృడత ఉంటుందో అక్కడ ఒక్క సంవత్సరం అవసరం లేదు. ఒక నెల సమయమే ఒక సంవత్సరంగా అనిపిస్తుంది. విన్నారా గుజరాత్ మరియు బొంబాయి వారు. గుజరాత్ వారు? చాలా మంది ఉన్నారు.

సేవ యొక్క అవకాశం వీరిది. గుజరాత్ వారు 4500 మంది ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు. కేవలం టీచర్స్క కాదు, ముందుగా మీ అందరికీ. ఒకవేళ మీ యొక్క సహయోగం లేకపోతే టీచర్స్ ఏమి చేస్తారు? అందువలన గుజరాత్ యొక్క పిల్లలందరికీ ఇప్పటి  స్వర్ణిమ అవకాశం యొక్క శుభాకాంక్షలు మరియు సేవ కొరకు కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా సదా స్వ ఉన్నతిలో, సేవా ఉన్నతిలో ఒకరు ఒకటి చెప్తే రెండవవారు అలాగే అని సదా ఏకత మరియు ధృడత ద్వారా ముందుకు వెళ్తూ ఉండాలి.

శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మంచిది. బొంబాయి వారు నిల్చోండి. (బొంబాయిలో ఉన్న శివాజీ పార్క్ లో 75-80 వేల మంది సంఘటన జరిగింది) మంచిది. శుభాకాంక్షలు లభించాయి కదా! బాగ్దాదా ఇద్దరికీ చాలా చాలా శుభాకాంక్షలు. ఇస్తున్నారు. మహారాష్ట్ర, బొంబాయి, ఆంధ్రప్రదేశ్ అందరికీ శుభాకాంక్షలు. బ్రాహ్మణ పరివారం అందరి తరుపున మరియు బాబా తరపున గుజరాత్ మరియు మహారాష్ట్ర వారికి మనస్సు  యొక్క చాలా చాలా ఆశీర్వాదాలు మనస్సు యొక్క ఈ అశీర్వాదాలు సదా మీ మనస్సులో ఉత్సాహ, ఉల్లాసాలను పెంచాలి. సరేనా పాండవులు. అందరు చాలా మంచి సేవ చేసారు. అందరి సహయోగం ద్వారా లక్షల మంది కార్యక్రమం సఫలం అయ్యింది. మంచిది.

వ్యాపార పరిశ్రమల వర్గం వారితో బాప్దాదా వ్యాపార వర్గం వారికి విశేష సంకల్పం - ఇస్తున్నారు ఎందుకంటే వ్యాపారస్తుల దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. వారు వెళ్ళవలసిన ' అవసరం ఉండదు. వారి దగ్గరికే వచ్చి సరుకు తీసుకుని వెళ్తారు. మరి అయితే ఎవరైతే మీద దగ్గరికి వస్తున్నారో వారికి తక్కువలో తక్కువ బాబా యొక్క సందేశం అయినా ఇస్తున్నారా? ప్రతి ఒక్క వ్యాపారస్తుడు లేదా పరిశ్రమల వారు తమ కార్డులు తయారుచేయించారు దానిలో జ్ఞానం యొక్క చిన్న చిన్న స్లోగన్స్ ఉండాలి. చిరునామా ఉండాలి మరియు రెండు మాటలలో బాబా' సందేశం ఉండాలి. ఇలా అందరు తమ తమ కార్డులను తయారు చేయించారా!

ఎవరు తయారుచేయించుకున్నారో వారు చేతులు ఎత్తండి! ఇంతమంది తయారుచేయించుకోలేదు. వ్యాపారస్తులు ఇంట్లో ఉంటూనే సేవ చేయగలరు. మేము మీ దగ్గరికి కొనుగోలుదారులుగా వచ్చేవాళ్ళము మాకు సందేశం కూడా ఇవ్వవేలేదు అని అంటారు అందువలన కార్డులు తప్పక ముద్రించుకోండి. వారు వాటిని చెత్తడబ్బాలో పడయకూడదు అంత అందంగా కార్డు తయారుచేయించాలి. వ్యాపారస్తులకు వ్యాపారం చేయించటం బాగా వస్తుంది కదా! మంచి వ్యాపారస్తుడు ఎవరు అంటే వచ్చినవారు ఎవరైనా వ్యాపారం చేయకుండా వెళ్ళకూడదు. అయితే, మీరు భగవంతునితో వ్యాపారం చేయించకుండా కేవలం వస్త్రాల యొక్క లేదా సరుకుల యొక్క వ్యాపారం చేయిస్తున్నారా?

వ్యాపారస్తులు చాలా మంది ఆత్మలను సహయోగిగా చేయవచ్చు. సహయోగి నుండి నెమ్మది నెమ్మదిగా యోగి అయిపోతారు. కనుక ఈ సంవత్సరం అందరినీ సహయోగి జాబితాలోకి తీసుకురావాలి. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఎంతమంది ఆత్మలకు సందేశం ఇచ్చారు. ఎంతమందిని సహయోగిగా తయారుచేసారు అనేది బాబా చూస్తారు. సరేనా? చేస్తారా? సంఖ్యను పెంచండి అని దాదీ అంటున్నారు కదా కనుక ప్రతి వ్యాపారస్తుడు సంఖ్యను పెంచగలరు. సరే కదా? ఇప్పుడు బాప్దాదా కూడా ఫలితం చూస్తారు. బాప్దాదాకి ఏమి తెలుస్తుంది అనుకోకండి. బాప్దాదా చూస్తారు.

 వతనం నుండి కూడా చూడగలరు. మిమ్మల్ని అడగవలసిన అవసరం కూడా ఉండదు. అయితే వ్యాపారస్తులు అద్భుతం చేస్తారు కదా! మంచిది. ఎవరైతే మంచి పని చేస్తారో వారి నోట్లో గులాబ్జామ్ అని అంటారు కదా! అలాగే బాప్దాదా కూడా అంటున్నారు. వ్యాపారం చేసేవారి నోటిలో గులాబ్ జామ్. ఉందా నోట్లో మంచిది, కూర్చోండి..ఇప్పుడు ఒక్క సెకనులో జ్ఞానసూర్యస్థితిలో స్థితులై నలువైపుల ఉన్న భయభీత ఆత్మలకు, అలజడి ఆత్మలకు సర్వ శక్తుల కిరణాలను వ్యాపింప చేయండి. చాలా భయభీతులుగా ఉన్నారు. వారికి శక్తినివ్వండి. తరంగాలను వెదజల్లండి. మంచిది.

నలువైపుల ఉన్న పిల్లల యొక్క భిన్న, భిన్న ప్రియ స్మృతులు మరియు సమాచారంతో కూడిన ఉత్తరాలు, ఇ-మెయిల్స్ బాప్దాదా దగ్గరికి చేరుకున్నాయి. మా యొక్క స్మృతులు, మా యొక్క స్మృతులు అంటూ ప్రతి ఒక్కరు అంటున్నారు. అయితే బాప్దాదా అంటున్నారు ప్రతి ఒక్క ప్రియమైన పిల్లల స్మృతి బాప్దాదా కి చేరుకుంది. దూరంగా కూర్చున్నా కానీ బాప్దాదా యొక్క హృదయసింహాసనాధికారులు. మా యొక్క ప్రియస్మృతులు, ప్రియస్మృతులు అంటూ ఎవరైతే మీ అందరికీ చెప్పారో వారందరిని బాబాకి చేరుకున్నాయి. ఇదే పిల్లల యొక్క ప్రేమ బాబా యొక్క ప్రేమ పిల్లలని ఎగిరింపు చేస్తుంది. మంచిది..

నలువైపుల ఉన్న అతి శ్రేష్టభాగ్యవంతులకు, కోట్లలో కొద్దిమంది అయిన విశేషాత్మలకు, సదా స్వమానంలో ఉండేవారికి, గౌరవాన్ని ఇచ్చేవారికి, సేవాధారి పిల్లలకు, సదా స్మృతిస్వరూపం  నుండి సమర్ధ స్వరూప ఆత్మలకు, సదా స్థిరమైన అచంచలమైన స్థితి యొక్క ఆసనంపై స్థితులయ్యే సర్వశక్తి స్వరూప పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి. 

పవిత్ర భవ!