రివైజ్ కోర్స్ మురళి 17-10-2003                                        

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

ఈ సంవత్సరం సంతుష్టమణియై సదా సంతుష్టంగా ఉండాలి మరియు సర్వులను సంతుష్టం చేయాలి

ఈరోజు మనోభిరాముడైన బాప్దాదా తన యొక్క నలువైపుల ఉన్నటువంటి అంటే ఎదురుగా ఉన్నవారిని మరియు దూరంగా ఉంటూ కూడా సమీపంగా ఉన్న ప్రతి ఒక్క రాజకుమారులను, అతిప్రియమైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు: "రాజా అందువలనే రాజకుమారులు. పరమాత్మ ప్రేమ, పాలన విశ్వంలో చాల కొద్దిమంది ఆత్మలకి మాత్రమే లభిస్తుంది. మీరందరు పరమాత్మ ప్రేమ మరియు పాలనకి అధికారులు. ప్రపంచంలోని ఆత్మలు భగవంతుడా రా.... అంటూ పిలుస్తున్నారు కానీ మీరందరు పరమాత్మ ప్రేమని అనుభవం. చేసుకుంటున్నారు.

పరమాత్మ పాలనతో పాలింపబడుతున్నారు. ఇలా మీ యొక్క భాగ్యాన్ని అనుభవం |చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారా బాప్దాదా పిల్లలందరినీ డబల్ రాజ్యాధికారులుగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్యధికారులు మరియు భవిష్యత్తు రాజ్యం మీ జన్మసిద్ధ అధికారం. కనక డబల్ రాజులు. అందరు రాజులు కదా! ప్రజలు కాదు కదా! అందరు రాజయోగులేనా లేదా ఎవరైనా ప్రజాయోగులు కూడా ఉన్నారా? ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా? వెనుక ఉన్నవారు రాజయోగులేనా? ఎవరు ప్రజాయోగులు కాదు కదా? పక్కాయేనా? రాజ్యాధికారి అంటే సర్వ స్థూల, సూక్ష్మ కర్మేంద్రియాలకు అధికారి ఎందుకంటే స్వరాజ్యం కదా?

కనుక అప్పుడప్పుడు రాజుగా అవుతున్నారా లేదా సదా రాజుగా ఉంటున్నారా? ముఖ్యమైన మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలకు కూడా అధికారిగా ఉంటున్నారా? స్వరాజ్యం అనేది సదా ఉంటుందా లేక ఒక రోజు ఉండి రెండవరోజు ఉండటంలేదా? రాజ్యం అంటే సదా ఉంటుంది కదా! కనుక సదా స్వరాజ్యాధికారి అంటే మనస్సు, బుద్ధి, సంస్కారాలపై అధికారం ఉండాలి. సదా ఉందా? ' సదా ఉందా అంటే ఉంది అనటంలేదు. అప్పుడప్పుడు మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు మనస్సుని నడిపిస్తున్నారా? అప్పుడప్పుడు మనస్సు యజమానిగా అవుతుందా? సదా స్వరాజ్యాధికారి నుండి విశ్వరాజ్యధికారిగా అవుతారు.

సదా పరిశీలన చేసుకోండి ఎంత సమయం, ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలపై మనస్సు, బుద్ధి, సంస్కారాలపై ఇప్పుడు అధికారిగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజ్యాధికారం లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతం ఆధారంగా ఈ సంగమయుగం యొక్క ఒక జన్మలో సదా అధికారిగా కాకపోతే 21 జన్మలు ఏవిధంగా రాజ్యాధికారిగా అవుతారు? లెక్క ఉంది కదా! ఈ సమయం యొక్క స్వరాజ్యం అంటే స్వయానికి రాజుగా అవ్వటం ద్వారానే '21 జన్మలు గ్యారంటీగా రాజుగా అవుతారు. నేనెవరు మరియు ఏవిధంగా అవుతాను ఇలా వర్తమానం యొక్క అధికారం ద్వారా మీ యొక్క భవిష్యత్తు స్వయమే తెలుసుకోవచ్చు.

ఆలోచించుకోండి - విశేషాత్మలైన మీ యొక్క ఆది, అనాది పెర్సనాల్టీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు కూడా మీరు విశేష మెరుపుతో మెరుస్తూ ఉంటారు. ఆ మెరుపు యొక్క పెర్సనాల్టీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది! అది మీకు కనిపిస్తుందా? పరంధామంలో బాబా వెంట ఆత్మ రూపంలో కూడా ఉంటున్నారు మరియు సమీపంగా కూడా ఉంటున్నారు. ఆకాశంలో కూడా కొన్ని కొన్ని 'నక్షత్రాలు చాలా మెరుస్తూ కనిపిస్తాయి కదా! అదేవిధంగా మీరు కూడా పరంధామంలో విశేషంగా  బాబా వెంట మరియు విశేషంగా మెరిసే నక్షత్రాలుగా ఉంటారు.

పరంధామంలో కూడా మీరు బాబాకి సమీపంగా ఉంటారు మరియు సత్యయుగంలో కూడా దేవాత్మలైన మీ యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది! మొత్తం కల్పం అంతా తిరిగి రండి - ధర్మాత్మలు, 3 మహాత్మలు, ధర్మపితలు, అభినేతలు అనేకమంది వచ్చారు సత్యయుగంలో దేవాత్మలైన మీకున్నంత పెర్సనాలిటీ వారెవరికైనా ఉందా? మీ యొక్క దేవతాస్వరూపం ఎదురుగా వస్తుందా? వస్తుందా ఏదా మేము అవుతామో లేదో తెలియదు అనుకుంటున్నారా? పక్కా కదా? మీ యొక్క దేవతాస్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి మరియు చూసుకోండి.

మీ పెర్సనాల్టీ ఎదురుగా వచ్చిందా? ఎంత ఉన్నతస్థితి ఉంటుంది! ప్రకృతి కూడా పెర్సనాల్టీతో ఉంటుంది. పక్షులు, వృక్షాలు, ఫలాలు, పువ్వులు అన్నీ పెర్సనాల్టీగా ఉంటాయి. మంచిది. ఇంకా క్రిందికి వచ్చి మీ యొక్క పూజ్య స్వరూపం చూసుకోండి. మీకు పూజ జరుగుతుంది. డబల్విదేశీయులు పూజ్యులుగా అవుతారా ? లేదా భారతవాసీయులే అవుతారా? మీరు దేవీదేవతలుగా అవ్వరా? దేవీలలో కూడా కాళీరూపంగా కాదు. కానీ దేవతల యొక్క మందిరాలు చూడండి, మీ యొక్క పూజ్య స్వరూపానికి ఎంత రాయల్టీ మరియు పెర్సనాలిటీ ఉంది! విగ్రహం 4 అడుగులు లేదా 5 అడుగులు ఎత్తు ఉంటుంది.

అంతే కానీ మందిరాలు ఎంత పెద్దగా తయారుచేస్తారు! ఇదే రాయల్టీ మరియు పెర్సనాల్టీ. ఈ రోజుల్లో ఎంత ప్రధానమంత్రి అయినా, రాజైనా కానీ వారి విగ్రహాన్ని దీనంగా ఎండలో తయారుచ పెడుతున్నారు. కానీ మీ పూజ్యస్వరూపం యొక్క పెర్సనాల్టీ ఎంత గొప్పడికి గొప్పడే కదా? కుమారీలు కూర్చున్నారు కదా! మీ యొక్క రాయల్టీ కదా? మరలా అంతిమంలో కూడా సంగమయుగంలో కూడా మీ రాయల్టీ ఎంత ఉన్నతమైనది! బ్రాహ్మణ జీవితం యొక్క పెర్సనాలి ఎంత ఉన్నతమైనది! డైరెక్ట్ భగవంతుడు మీ యొక్క బ్రాహ్మణజీవితంలో రాయల్టీ మరియు -పెర్సనాల్టీ నింపారు. బ్రాహ్మణజీవితం యొక్క చిత్రకారుడు ఎవరు? స్వయం బాబా.

బ్రాహ్మణజీవితం యొక్క పెర్సనాల్టీ, రాయల్టీ ఏమిటి? పవిత్రతయే రాయల్టీ, అవును కదా! ఇక్కడ కూర్చున్న బ్రాహ్మణాత్మలందరిలో పవిత్రత యొక్క రాయల్టీ ఉంది కదా! అవును అని చేతులు ఊపండి. వెనుక ఉన్నవారు చేతులు ఎత్తుతున్నారు మీరు వెనుక లేదు, ఎదురుగా ఉన్నారు. వెనుక ఉన్న వారిపై స్వతహాగా దృష్టి వెళ్తుంది, ముందు కూర్చున్న వారిని ప్రత్యేకంగా చూడవలసి వస్తుంది. -వెనుక ఉన్నవారు స్వతహాగా కనిపిస్తారు. పవిత్రత యొక్క పెర్సనాల్టీ సదా ఉంటుందా? అని పరిశీలన చేసుకోండి. మనసా, వాచా, కర్మణా, వృత్తి, దృష్టి మరియు కృతి అన్నింటిలో పవిత్రత ఉందా?

మనసా పవిత్రత అంటే సదా మరియు సర్వుల పట్ల శుభభావన, శుభకామున ఉండాలి. ఆ ఆత్మ ఎలా ఉన్నా కానీ పవిత్రత యొక్క దీవి గల మనస్సు అంటే సర్వుల పట్ల శుభభావన, శుభకామన, కళ్యాణం యొక్క భావన, దయాభావన, దాత భావన ఉండాలి. దృష్టిలో సదా ప్రతి ఒక్కరిలో ఆత్మిక స్వరూపం కనిపించాలి లేదా ఫరిస్తా స్వరూపం కనిపించాలి. వారు ఫరిస్తాగా అవ్వకపోయినా కానీ మన యొక్క దృష్టిలో ఫరిస్తా స్వరూపం మరియు ఆత్మిక స్వరూపమే ఉండాలి. కృతి అంటే సంపర్కంలోకి రావటం, సంబంధంలోకి రావటం దీనిలో సదా సర్వులకు స్నేహం ఇవ్వాలి, సుఖం ఇవ్వాలి.

ఇతరులు స్నేహం ఇచ్చినా, ఇవ్వకపోయినా కానీ నా యొక్క కర్తవ్యం- స్నేహం ఇవ్వాలి మరియు స్నేహిగా చేయాలి, సుఖం ఇవ్వాలి అని భావించండి. సూక్తి ఉంది కదా - దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి అని, ఇవ్వకూడదు, తీసుకోకూడదు. * ఇచ్చేవారు మీకు ఎప్పుడైనా దుఃఖం ఇచ్చినా కానీ మీరు సుఖం యొక్క స్వరూపంలోనే చూడండి. పడిపోయిన వారిని పడేయకూడదు. పడిపోయిన వారిని ఉన్నతంగా తీసుకువెళ్ళాలి. వారు పరవశం అయ్యి దుఃఖం ఇస్తున్నారు పడిపోయారు కదా! వారిని ఇంకా పడేయకూడదు మరియు వారిని "స్నేహంతో ఉన్నతంగా పైకి తీసుకురావాలి.

దీనిలో కూడా ముందుగా ఇంటి నుండే ఉద్దరణ ప్రారంభించాలి. మీ యొక్క సహయోగులు, సేవా సహయోగులను, బ్రాహ్మణ పరివారం యొక్క సహయోగులందరినీ ఉన్నతంగా చేయండి. వారు తమ యొక్క చెడుని చూపించినా కానీ మీరు వారి యొక్క విశేషతను చూడండి. అందరు నెంబర్ అనుసరించి ఉంటారు కదా! అందరు ఒకే నెంబర్ ఉండరు కదా! 108 నెంబర్ కదా! అందరు నెంబర్వారీగా ఉంటారు కానీ నా యొక్క కర్తవ్యం ఏమిటి? ఇలా ఆలోచించకూడదు నేను అష్టరత్నాలలోకి అయితే రాను కదా.

బహుశా 108 లోకి వస్తానేమో వచ్చినా 108 లో చివరిలోకి వస్తే నాకు కూడా కొన్ని సంస్కారాలు ఉండిపోతాయి కదా అని కానీ ఇలా అనుకోకూడదు. ఇతరులకు సుఖం ఇస్తూ, ఇస్తూ ఉంటే మీ 3 యొక్క సంస్కారం కూడా స్నేహిగా, సుఖీగా అయిపోతుంది. ఇది కూడా సేవ. ఈ సేవ మొదట ఇంటి నుండే అనగా బ్రాహ్మణపరివారం నుండే ప్రారంభించాలి. బాప్దాదాకి ఈరోజు ఒక విషయం గురించి నవ్వు వస్తుంది. చెప్పమంటారా? చెప్తే మీకు కూడా నవ్వు వస్తుంది. బాప్దాదా పిల్లల యొక్క ఆట చూస్తూ ఉంటారు కదా!

బాప్దాదా ఒక్క సెకనులో ఎప్పుడైనా ఏ సేవాకేంద్రం యొక్క టీ.వి అయినా చూస్తారు. అప్పుడప్పుడు ఒక్కో సేవాకేంద్రం యొక్క టి.వి, అప్పుడప్పుడు విదేశం యొక్క టీ.వి, అప్పుడప్పుడు భారతవాసీయుల యొక్క టీ.వి స్విచ్ ఆన్ చేస్తారు. ఏమి చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఎందుకంటే పిల్లలంటే ఇష్టం కదా! పిల్లలు కూడా సమానంగా అవ్వవలసిందే అని చెప్తున్నారు పక్కాయే కదా, సమానంగా అవ్వాలి. కుమారీలు సమానంగా అవ్వాలనుకుంటున్నారా? లేదా డ్రామాలో ఎలా ఉంటే అలా, ఎలా అయినా పర్వాలేదు అనుకుంటు కన్నారా?

అలా కాదు, కుమారీలందరు సమానంగా అవ్వవలసిందే, చనిపోవలసి వచ్చినా, ఏది చేయవలసి వచ్చినా సమానంగా అవ్వవలసిందే. ఆలోచించుకుని చేతులు ఎత్తండి! ఎవరైతే చనిపోవలసి వచ్చినా, వంగవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, అనేక విషయాలు వినవలసి వచ్చినా బాబా సమానంగా అవుతాము అనేవారు చేతులు ఎత్తండి! కుమారీలు ఆలోచించుకుని ఎత్తండి! వీరికి ఫోటో తీయండి. కుమారీలు చాలా మంది ఉన్నారు. చనిపోవలసి వస్తుంది. వంగవలసి వస్తుంది. పాండవులు ఎత్తండి! సమానంగా అవ్వాలి, సమానంగా అవ్వకపోతే మజా రాదు.

పరంధామంలో కూడా సమీపంగా ఉండలేరు. పూజలో కూడా తేడా వస్తుంది. సత్యయుగం యొక్క రాజ్యభాగ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది. బ్రహ్మాబాబాపై మీకు ప్రేమ ఉంది కదా, డబల్ విదేశీయులకు అందరి కంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికైతే బ్రహ్మబాబాపై మనస్పూర్వకమైన ప్రేమ ఉందో వారు చేతులు ఎత్తండి! డబల్ విదేశీయులకు మనస్పూర్వకమైన ప్రేమ ఉందా? మంచిది. పక్కా ప్రేమ ఉంది కదా? అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరితో అయితే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకి గుర్తు - వారికి ఏదైతే ఇష్టమనిపిస్తుందో ప్రేమించే వారికి కూడా అదే ఇష్టమనిపిస్తుంది.

ఇద్దరి యొక్క సంస్కారాలు, స్వభావాలు, సంకల్పాలు కలిసినప్పుడే ప్రియంగా అనిపిస్తారు. కనుక బ్రహ్మాబాబాతో ప్రేమ ఉంటే 21 జన్మలు మొదటి జన్మ నుండి రెండవ జన్మలో, మూడవ జన్మలో వస్తే బావుండదు కానీ మొదటి జన్మ నుండి చివరి జన్మ వరకు భిన్న, భిన్న రూపాలలో వెంట ఉంటారు. వెంట ఎవరు ఉండగలరు? ఎవరైతే సమానంగా అవుతారో వారే వెంట ఉండగలరు. బ్రహ్మాబాబా నెంబర్ వన్ ఆత్మ మరి బ్రహ్మాబాబా వెంట ఎవరు ఉండగలరు? నెంబర్ వన్ అయినప్పుడే వెంట ఉండగలరు. అన్నింటిలో నెంబరన్ అవ్వాలి. మనస్సులో, వాచాలో, కర్మణాలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో అన్నింటిలో నెంబరన్ అవ్వాలి.

కనుక నెంబర్ వన్ గా ఉన్నారా లేదా నెంబర్ వారీగా ఉన్నారా? ఒకవేళ మీకు ప్రేమ ఉంటే ప్రేమ కొరకు ఏది బలిహారం చేయాలన్నా కష్టం అనిపించదు. చివరి జన్మ కలియుగం యొక్క అంతిమంలో దేహాభిమానం యొక్క ప్రేమ ఉన్నవారు ప్రేమ కొరకు ప్రాణాన్ని కూడా బలిహారం చేస్తున్నారు. మీరు బ్రహ్మాబాబాపై ప్రేమతో మీ యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకోవటం. ఇదేమైనా గొప్ప విషయమా? గొప్పవిషయమా ఏమిటి? కాదు. కనుక ఈరోజు నుండి అందరి సంస్కారాలు పరివర్తన అయిపోయాయా! పక్కాయేనా? మరలా రిపోర్ట్ వస్తుంది. మీ యొక్క సహయోగులు వ్రాస్తారు. పక్కాయేనా?

దాదీలు వింటున్నారు కదా! సంస్కారాలు మారిపోయాయి. అంటున్నారా లేక సమయం పడుతుందా? ఏమిటి? మోహిని (అక్కయ్య) చెప్పండి! మారిపోతాయి. కదా! అందరు మార్చుకుంటారు కదా? అమెరికా వారు మార్చుకుంటారు కదా? నవ్వు వచ్చే విషయం గురించి చెప్పలేదు. అది చెప్తాను. నవ్వు వచ్చే విషయం ఏమిటంటే అందరు పురుషార్ధం చాలా చేస్తున్నాము అంటున్నారు, బాషాకి కూడా అది చూసి దయ కూడా వస్తుంది, పురుషార్ధం చాలా చేస్తున్నారు. అప్పుడప్పుడు చాలా శ్రమ కూడా చేస్తున్నారు మరియు ఇంకా ఏమంటున్నారంటే - ఏం చేయము, మా సంస్కారం ఇంతే అంటున్నారు.

సంస్కారం అని చెప్పి తమని తాము తేలి చేసేసుకుంటున్నారు. మీరు ఈరోజు ఏదైతే మీ సంస్కారం అంటున్నారో అది మీ సంస్కారమా చూసుకోండి. మీరు ఆత్మ, ఆత్మే కదా! దేహం కాదు కదా! మరి ఆత్మ యొక్క సంస్కారం ఏమిటి? 'ఈరోజు మీరు ఏదైతే నాది అంటున్నారో అది మీదా లేదా రావణునిదా? ఎవరిది? మీది కాదు. కదా! మరి నా సంస్కారం అని ఎందుకు అంటున్నారు? నా సంస్కారం ఇంతే అని అంటున్నారు. కదా! ఈరోజు నుండి ఇది నా సంస్కారం అని అనకండి. అప్పుడప్పుడు గాలికి అక్కడక్కడ చెత్త అంతా ఎగిరి వస్తుంది కదా! అలాగే ఈ రావణుని వస్తువులు కూడా మన దగ్గరికి వచ్చాయి.

మరి వాటిని నావి అని ఎలా అంటున్నారు! మీవా? కాదు కదా? కనుక ఇక ఎప్పుడు ఇలా. అనకండి. ఎప్పుడైనా నాది అనే మాట వస్తే నేనెవరు, నా సంస్కారం ఏమిటి అనేది స్మృతి ఉంచుకోండి. దేహాభిమానంలో నా సంస్కారం అనేది వస్తుంది కానీ ఆత్మాభిమానిస్థితిలో నా సంస్కారం అనేది ఉండదు.కనుక ఇప్పుడు ఈ భాష కూడా పరివర్తన చేయండి.' నా సంస్కారం అంటూ సోమరిగా అయిపోతున్నారు. నా భావం అది కాదు కానీ నా సంస్కారం అంటున్నారు. మంచిది, ఇంకొక మాట ఏమంటున్నారు? నా స్వభావం అంటున్నారు. ఇప్పుడు నా స్వభావం అనే మాట ఎంతో బావుంటుంది.

స్వ అనగా సదా మంచిగా ఉంటుంది. నా స్వభావం అంటే స్వయం యొక్క భావం మంచిగా ఉంటుంది. చెడుగా ఉండదు. నా స్వభావం, నా సంస్కారం అని ఏదైతే భాష వాడుతున్నారో దానిని మార్చుకోండి. ఎప్పుడైతే నాది' అనే మాట వస్తుందో అప్పుడు నా యొక్క అసలైన సంస్కారం ఏమిటి? అనేది స్మృతి తెచ్చుకోండి. నా సంస్కారం అన్ని ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ మాట్లాడుతుందా? ఇలా ఆలోచించు కుంటే మీపై మీకే నవ్వు వస్తుంది కదా! నవ్వు వస్తుంది కదా? నవ్వు వస్తే ఏదైతే గొడవ పెడుతున్నారో అది సమాప్తి అయిపోతుంది. దీనినే బాష మార్చుకోవటం అంటే ప్రతి ఆత్మ పట్ల స్వమానం మరియు సన్మాన భావంతో ఉండటం.

స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి మరియు ఇతరులను కూడా స్వమానంతో ' చూడండి. - స్వమానంతో చూస్తే మీకు ఇష్టం లేని విషయాలు అంటే అప్పుడప్పుడు ఎవరైనా గొడవ పడితే మీకు ఇష్టమనిపిస్తుందా? ఇష్టమనిపించదు కదా? కనుక ఒకరినొకరు స్వమానం'' యొక్క దృష్టితో చూడండి. వీరు విశేషాత్మ, వీరు బాబా యొక్క పాలన పొందిన బ్రాహ్మణాత్మలు, వీరు కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో ఒక ఆత్మ..... ఇలా స్వమానంతో చూడాలి.

కేవలం ఒక విషయం చేయండి - మీ యొక్క నయనాలలో బిందువుని ఇముడ్చుకోండి/ చాలు. 1. బిందువుతో చూస్తున్నారు 2. బిందువుని ఇముడ్చుకోండి. అప్పుడు ఏమీ జరగదు. శ్రమ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఆత్మ, ఆత్మను చూస్తుంది, ఆత్మ ఆత్మతో. మాట్లాడుతుంది... ఇలా ఆత్మికవృత్తి, ఆత్మికదృష్టి తయారుచేసుకోండి. ఏమి చేయాలో అర్ధమైందా? ఇప్పుడు ఇక ఎప్పుడూ నా సంస్కారం అని అనకండి. స్వభావం అంటే స్వయం యొక్క భావంలో ఉండాలి. బాప్దాదా ఈ సీజన్ యొక్క మొదటి టర్న్, మీ అందరిదీ మొదటి టర్న్ కదా! ఎలాగైతే మొదటి టర్న్ తీసుకున్నారో అలాగే ఫలితం కూడా మొదటి నెంబర్లో ఇవ్వాలి.

ఇవ్వాలి కదా! మరియు డబల్ విదేశీయులకు ఈ విశేషత జన్మ నుండే ఉంది. ఏది చేసినా పక్కాగానే చేస్తారు. సగం చేయరు. పక్కాగా చేస్తారు. అవునా లేక కాదా! అవును మరియు కాదు అనే దాని మధ్యలో ఊగటం లేదు కదా? బాబాకి బదులు ఇవ్వాలి కదా! ఈ సీజన్లో పూర్తి సీజన్ లో ఈరోజు నుండి మొదటి అవకాశం కనుక బాగ్దాదా ఇదే కోరుకుంటున్నారు ఈ పూర్తి సంవత్సరం సీజన్ 6 నెలలు నడుస్తుంది కానీ పూర్తి సంవత్సరం ఎప్పుడు కలుసుకున్నా ఎవరిని కలుసుకున్నా. పరస్పరంలో అయినా, ఇతర బయటి ఆత్మలతో అయినా కానీ ఎప్పుడు,  ఎవరిని కలుసుకున్నా వారికి సంతుష్టత యొక్క సహయోగం ఇవ్వండి..

స్వయం కూడా సంతుష్టంగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టం చేయండి. ఈ సీజన్ యొక్క స్వమానం - సంతుష్టమణి సదా సంతుష్టమణి. అన్నయ్యలు కూడా మణియే అంతే కానీ సంతుష్టమణ లేదా మణుడు అని ఉండదు కదా! మణి అంతే. ఒక్కొక్క ఆత్మ ప్రతి సమయం సంతుష్టమణిగా ఉండాలి మరియు స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులను కూడా సంతుష్టంగా చేయగలరు. సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టం చేయాలి. ఇష్టమేనా?? శ్రీకుమారీలకు ఇష్టమేనా? ఎవరికైతే ఇష్టమనిపిస్తుందో వారు చేసారు. కేవలం వినటంలో కాదు.

ఎవరైతే చేయటంలో ఇష్టపడుతున్నారో వారు చేతులు ఎత్తండి చేతులు, ఇష్టమనిపించటం చూసి బాబా మనస్సు సంతోషం అయిపోతుంది. చాలా మంచిది, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఏది ఏమైనా కానీ స్వమానం యొక్క నీటిపై ఏకాగ్రంగా ఉండండి. భ్రమించకండి. అప్పుడప్పుడు  ఒక సీట్ప. అప్పుడప్పుడు ఒక సీట్ పై ఇలా కూర్చోకండి. మీ స్వమానం యొక్క సీట్పై ఏకాగ్రంగా ఉండండి మరియు ఏకాగ్రత యొక్క సీట్ పై సెట్ అయ్యి ఏదైనా విషయం వచ్చినా కార్టూన్ షో వలె చూడండి. కార్టూన్ షో చూడటం ఇష్టమనిపిస్తుంది కదా! సింహం వస్తుంది, మేక వస్తుంది. .

 ఏది వచ్చినా కార్టూన్ షో మీ యొక్క సీట్ నుండి అప్సెట్ అవ్వకండి. మజా వస్తుంది. మంచిది. సింహం వచ్చింది, కుక్క కూడా వచ్చింది, పిల్లి కూడా వచ్చింది, రానివ్వండి. మీరు చూస్తూ ఉండండి, బాప్దాదా చెప్పారు కదా మీరందరు మీ స్వమానం యొక్క సీట్పై సెట్ అయ్యి ఉంటే అలజడి అవ్వరు, స్వమానం యొక్క గౌరవంలో ఉండటంలేదు అందువలనే అలజడి అవుతున్నారు. చిన్న పేపర్ పులి వంటి పరిస్థితి వస్తుంది అంతే అలజడి అయిపోతున్నారు. కనుక ఈసంవత్సరం ఏకాగ్రంగా అయ్యి స్వమానం యొక్క సీట్పై ఉండాలి. ఇలా ఉండాలి అని నాకు తెలుసు కానీ... విన్నాను కానీ... ఇలా అనకూడదు.

వినటం మరియు తెలుసుకోవటం మంచిదే కానీ మిమ్మల్ని మీరు అంగీకరించి ఏకాగ్రంగా అయ్యి సీట్పై కూర్చోవాలి. అంగీకరించి నడవటంలేదు కేవలం వింటున్నారు, తెలుసుకుంటున్నారు. సీట్ పై స్వరూపంగా అయ్యి కూర్చోండి. (10 సంవత్సరాల నుండి ఉన్నవారు కూర్చున్నారు. ఇది కూడా చాలా అద్భుతం. 10. సంవత్సరాలు అమరంగా ఉన్నారు. అమరనాధ్ బాబా నుండి అమరభవ యొక్క వరదానం లభించింది. 10 సంవత్సరాల వారు చేతులు ఎత్తండి! 10 సంవత్సరాల వారికి బాప్దాదా నవరత్నాల మాల వేస్తున్నారు. నవరత్నాలు నిర్విఘ్నంగా చేయడానికి ఉంటాయి. అంటే అష్టశక్తులు' మరియు బాబా సదా స్మృతిలో ఉండాలి. మంచిది.

విదేశంలో ఉంటూ 10 సంవత్సరాలు దాటారంటే అమరులు అయిపోయారు కదా! ఇక ముందు ఏమౌతుందో అని ఆలోచిస్తున్నారా? మంచిది. 10 సంవత్సరాల నుండి ఉన్నవారు ఎవరైతే చేతులు ఎత్తారో వారికి వారి భవిష్యత్తు గురించి. నిశ్చయం ఉందా లేక నడవగలమా లేక లేదా అని ఆలోచిస్తున్నారా? ఎవరైతే అంతిమం వరకు వెంట ఉంటాము, అమరంగా ఉంటాము, ఏది ఏమైనా హిమాలయ పర్వతాల వంటి పరిస్థితులు వచ్చినా పక్కాగా ఉంటాము అనేవారు చేతులెత్తండి! చాలా మంచిది. భారతవాసీయులు చేతులు ఎత్తారు. భారతవాసీయులు మేము పక్కా అని భావిస్తున్నారా?

10 సంవత్సరాల వారికి అనే కాదు కానీ అందరికీ నిశ్చయం ఉండాలి. ఏది ఏమైనా కానీ బాబా వెంట ఉంటాము, వెంటే నడుస్తాము, వెంటే రాజ్యంలోకి వస్తాము అని పక్కాయే కదా! వెంట ఉంటారు కదా! బాబాని ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు. ఒంటరిగా వెళ్తే మీకు కూడా మంచిగా అనిపించదు. బాబాకి కూడా ఇష్టం అనిపించదు. కనుక బాబాని వదలకూడదు. ఏదైనా విషయం వస్తే మీరు మనస్సుతో బాబా,నా బాబా అనండి. బాబా హాజరైపోతారు. మీ సమస్యను పరిష్కరిస్తారు. మనస్సుతో చెప్పాలి. బాబా ఈ విషయం ఇది. బాబా ఇది చేయండి

. ...ఇలా మనస్సుతో చెప్తే బంధీ అయ్యి ఉంటారు. కానీ మనస్సుతో చెప్పండి అంతేకానీ అవసర సమయంలో స్మృతి చేసి తర్వాత మర్చిపోకండి. డబల్ విదేశీయులు తమ యొక్క భాగ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. మొదటి అవకాశం లభించింది మరియు విశేష అవకాశం లభించింది. పూర్తి సీజన్ బాబా చెప్పింది నిలుపుకుంటారు కదా! ఆలోచించేవారిగా కాదు, నిలుపుకునేవారిగా అవ్వాలి. ఎప్పుడైతే మీరు నా బాబా అన్నారో బాబా కూడా నా పిల్లలు అని అంటారు పక్కా వ్యాపారం అయ్యింది కదా! దాదీలు మంచిగా ఉన్నారు కదా! విదేశీయులను చూసి ఆనందం అనిపిస్తుంది. కదా! చాలా ఆనందం అనిపిస్తుంది.

దాదీకి చాలా ఉత్సాహం వస్తుంది. ఒకవేళ ఏదైనా జరిగితే దాదీ అందరినీ ఇక్కడే కూర్చోపెడతారు అందరు హాజరుగా ఉంటారా లేక లండన్లో డైమండ్ హాల్ ఏమౌతుంది? అని ఆలోచిస్తారా? అలా ఉండకూడదు. అందరు ఎవరెడీగా ఉండాలి. ఒకవేళ బాప్దాదా అందరు వచ్చేయండి, ఏదీ ఆలోచించకండి, సేవ గురించి, సేవాకేంద్రం గురించి, సహయోగుల గురించి ఏదీ ఆలోచించకండి వచ్చేయండి. అంటే వచ్చేస్తారా? (అలాగే వచ్చేస్తాము) అని చెప్పారు. మంచిది. ఆ రోజు కూడా వస్తుంది. వచ్చేయండి అని బాబా నుండి ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే బాబాకి పిల్లలంటే ఇష్టం కదా! వేరు చేయరు. వెంట తీసుకువెళ్తారు. ఎవరైతే పక్కాగా ఉంటారో వారే ఉంటారు.

అందరు నిర్విఘ్నంగా అయిపోయారు కదా! ఇప్పుడు ఏ మూల ఏ విఘ్నం లేదు కదా!. ఇప్పుడు లోపల ఏదైనా విఘ్నం ఉందా? లేదు కదా? అందరు నిర్విఘ్నలే కదా? ఈరోజు ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళాలి. ఓంశాంతి భవనం కదా! ఓం శాతి అయిపోతాయి. ఏమి చేయాలి? ముక్కుని వెంటనే తొలగించాలి. ఒకవేళ తొలగించకపోతే కాలు తొలగించాల్సి ఉంటుంది. అలాగే విఘ్నాన్ని వెంటనే సమాప్తి చేయండి. మీ వాస్తవిక సంస్కారాలను ప్రత్యక్షం చేయండి.

నలువైపుల ఉన్నటువంటి రాజకుమారులైన పిల్లలకు, సర్వ స్నేహి, సహయోగి, సమానంగా అయ్యే పిల్లలకు, సదా మీ యొక్క శ్రేష్టస్వభావం మరియు సంస్కారాన్ని స్వరూపంలో ప్రత్యక్షం చేసే పిల్లలకు, సదా సుఖం మరియు సర్వులకు స్నేహం ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్టమణిగా అయ్యి సంతుష్టత యొక్క కిరణాలను వ్యాపింపచేసేవారికి బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

సదా సుఖీ భవ!