రివైజ్ కోర్స్ మురళి  28-02-2003                                        

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

సేవతో పాటు వెనువెంట ఇప్పుడు సంపన్నంగా అయ్యే ప్లాన్ తయారుచేయండి కర్మాతీతంగా అయ్యే సంలగ్నత పెట్టుకోండి.

ఈరోజు శివతండ్రి సాలిగ్రామాలైన తన పిల్లలతో తన యొక్క మరియు పిల్లల అవతరణ యొక్క జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. ఈ అవతరణ యొక్క జయంతి ఎంత అద్భుతమైనది! నలువైపుల నుండి పిల్లలందరూ పరుగు పరుగున వచ్చారు. తండ్రి యొక్క జయంతి మరియు తమ యొక్క జయంతిని జరుపుకునేటందుకు వచ్చారు. తండ్రి మరియు పిల్లల యొక్క అవతరణ రోజు ఒక్కటే తండ్రి' మరియు పిల్లలు ఒకే రోజు జన్మించారు. ఇదే అద్భుతం. అయితే, ఈరోజు గ్రామ పిల్లలైన మీరందరూ తండ్రికి శుభాకాంక్షలు తెలపడానికి వర్వాదా లేదా తండ్రి నుండి శుభాకాంక్షలు తీసుకోవడానికి వచ్చారా? ఇవ్వటానికి వచ్చారు.

తీసుకోవడానికి కూడా! వచ్చారు. పిల్లలు మరియు తండ్రి పరస్పరంలో చాలా చాలా చాలా స్నేహం ఉంది. అందువలనే జన్మ కూడా వెనువెంట తీసుకున్నారు మరియు మొత్తం అన్ని జన్మలలో కంబైండ్ కలిస్తే ఉంటారు. ఇంత ప్రేమను ఎక్కడైనా చూసారా? విశ్వపరివర్తన అనే కర్తవ్యంలో కూడా తండ్రి మరియు పిల్లలు ఇద్దరిదీ ఒకటే. ప్రతిజ్ఞ ఏమిటి పరంధామం మరియు స్వీట్ హోమ్లో కూడా వెంట నడుస్తాము అనా లేదా వెనుక నడుస్తాము అనా? వెనువెంటే నడవాలి కదా! మీది మరియు బాప్దాదా ఇంత గొప్ప స్నేహం, తండ్రి ఒంటరిగా ఏమీ చేయలేరు మరియు పిల్లలు ఒంటరిగా ఏమీ చేయలేరు. చేయగలరా?

బాబా లేకుండా ఏమైనా చేయగలరా? అలాగే బాబా కూడా ఏమీ చేయలేదు. అందువలనే బ్రాహ్మణలైన మిమ్మల్ని రచించేటందుకు బ్రహ్మాబాబాని ఆధారంగా తీసుకున్నారు. బ్రాహ్మణులు లేకుండా బాబా కూడా ఏమీ చేయలేరు. అందువలన ఈ అలౌకిక అవతరణ రోజున బాబా పిల్లలకి మరియు పిల్లలు బాబాకి పదమాపదాల రెట్లు శుభాకాంక్షలు. ఇస్తున్నారు. మీరు బాబాకి ఇస్తున్నారు మరియు బాబా మీకు ఇస్తున్నారు.

అమృతవేళ నుండి ఇంకా అంతకంటే ముందు నుండి పిల్లల యొక్క శుభాకాంక్షలు, కార్డులు, ఉత్తరాలు, మనస్సు, యొక్క మధురాతి మధురమైన పాటలు, బాప్దాదా దగ్గరికి చేరుకున్నాయి మరియు ఇప్పుడు  కూడా బాప్దాదా చూస్తున్నారు నలువైపుల ఉన్న దేశ విదేశాలలో పిల్లలు సూక్ష్మంగా బాబాకి శుభాకాంక్షలు ఇస్తున్నారు. చేరుకుంటున్నాయి. పిల్లల దగ్గరికి మాట చేరుకుంటుంది కానీ పిల్లల మనస్సు యొక్క మాట బాబాకి చేరుకుంటూ ఉంటుంది. నలువైపుల ఉన్న పిల్లలందరు సంతోషంతో నాట్యం చేస్తున్నారు. ఓహో బాబా ఓహో! అంటూ పాడుకుంటున్నారు.

మేము సాలిగ్రామ ఆత్మలం ఓహో! ఓహో! అని పాటలు పాడుకుంటున్నారు. ఈనాటి జన్మదినోత్సవానికి స్మృతిచిహ్నంగా. ద్వాపరయుగం నుండి ఇప్పటి వరకు భక్తులు జరుపుకుంటూనే ఉన్నారు. భావనలో భక్తులు కూడా తక్కువైన వారు కాదు. కానీ వారు భక్తులు, పిల్లలు కాదు. వారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు కానీ మీరు మొత్తం కల్పంలో ఒకేసారి అవతరణ యొక్క మహత్వాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వారు వ్రతం చేస్తారు మరియు వ్రతం తీసుకుంటారు కూడా. మీరయితే ఒకేసారి వ్రతం తీసేసుకుంటున్నారు.

మిమ్మల్నే వారు కాపీ చేసారు కానీ మీ మహత్వం మరియు వారి స్మృతిచిహ్నం యొక్క మహత్వంలో కూడా తేడా ఉంది. వారు కూడా పవిత్రత యొక్క వ్రతం తీసుకుంటారు కానీ ప్రతి సంవత్సరం ఒక్క రోజు కొరకే వ్రతం తీసుకుంటారు కానీ మీరందరు కూడా జన్మ తీసుకుంటూనే ఒకేసారి పవిత్రత యొక్క వ్రతం తీసుకున్నారు కదా! తీసుకున్నారా లేదా ఇప్పుడు తీసుకోవాలా? తీసేసుకున్నారు. మీరు ఒకేసారి తీసేసుకున్నారు. వారు ప్రతి సంవత్సరం తీసుకుంటారు. అందరూ తీసుకున్నారా? కేవలం బ్రహ్మచర్యమే కాదు, సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతం తీసుకున్నారు.

పాండవులు సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతం తీసుకున్నారా? లేదా కేవలం బ్రహ్మచర్యంలోనే సరిగా ఉన్నారా? బ్రహ్మచర్యం అనేది పునాది. కానీ కేవలం బ్రహ్మచర్యమే కాదు కానీ వెనువెంట ఇంకా నాలుగు ఉన్నాయి. ఆ నాల్గింటి కొరకు కూడా వ్రతం తీసుకున్నారా లేదా ఒకదాని కోసమే తీసుకున్నారా? పరిశీలించుకోండి. క్రోధం ఉండవచ్చు. అని బాప్దాదా సెలవు ఇచ్చారా? లేదా? కొద్ది కొద్దిగా క్రోధం అయితే చేయాల్సి వస్తుంది కదా? అవసరం లేదా? పాండవులు చెప్పండి, క్రోధం అవసరం లేదా?

చేయాల్సివస్తుంది, సరే, బాబా చూసారు - క్రోధం మరియు సహయోగులన్నింటినీ అంటే మహాభూతాలను త్యాగం చేసారు కానీ ఎలాగైతే మాతలకు మరియు ప్రవృతిలో ఉండేవారికి పెద్ద పిల్లలతో అంతగా ప్రేమ ఉండదు, మోహం ఉండదు కానీ మనవలు, మునిమనవలతో చాలా ప్రేమ ఉంటుంది. చిన్న, చిన్న పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు. అలాగే బాప్దాదా కూడా చూసారు, పిల్లలకి కూడా పంచవికారాలనే మహాభూతాల యొక్క మహారూపాలతో ప్రేమ తగ్గిపోయింది కానీ ఈ విజారాల యొక్క పుత్రులు అనగా చిన్న, చిన్న అంశమాత్రంగా, వంశమాత్రంగా ఉన్న వాటితో ఇప్పటికీ కూడా కొద్ది కొద్దిగా ప్రేమ ఉంది. ఉందా ప్రేమ?

అప్పుడప్పుడు ప్రేమ కలుగుతుంది. కదా! అలా అయిపోతుందా? మాతలు చెప్పండి! డబల్ విదేశీయులూ క్రోధం రావటంలేదా? కొందరు చాలా పెద్ద పెద్ద చతురతతో కూడిన మాటలు అంటున్నారు. ఏమంటున్నారో చెప్పనా? చెప్పానంటే మరి ఈరోజు వాటిని వదిలేయాల్సి ఉంటుంది. తయారేనా? వదిలేస్తారా? తయారేనా? లేక ఫైల్లో కాగితం పెడతారు అంతేనా? ప్రతి సంవత్సరం ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు కదా! ప్రతిజ్ఞుల ఫైల్ బాప్ దాదా దగ్గర చాలా చాలా పెద్దవి అయిపోయాయి. అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రతిజ్ఞ యొక్క పేపరుని ఫైల్లో పెట్టమంటారా? కాదు కదా! ఫైనల్ చేస్తారా లేక ఫైల్ చేస్తారా?

 ఏం చేస్తారో చెప్పండి, టీచర్స్? ఫైనలేనా? ఫైనలేనా? చేతులెత్తండి! మామూలుగా ప్రతిజ్ఞ చేయకండి. తిరిగి బాల్ది కొద్ది కొద్దిగా రూపాన్ని ధారణ చేస్తారు సరేనా? డబల్ విదేశీయులు ఫైనల్ చేస్తారా? ఫైనలేనా? ఫైనల్ చేసేవారు చేతులెత్తండి! టి.విలో చూపించండి. చేతులు పెద్దగా ఎత్తండి! చిన్నగా కాదు, త్రేతాయుగీలుగా కాదు. మంచిది, సరే వినండి. తండ్రి మరియు పిల్లల మాటలు ఎలా ఉంటాయి? బాప్దాదా నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు క్రోధంలోకి వచ్చారు.  అని బాబా అంటారు. నేను కోప్పడలేదు కానీ కోపం తెప్పించారు అని పిల్లలంటారు. నేను తెచ్చుకోలేదు. తెప్పించారు అంటారు.

బాబా ఏమంటారు? ఇంకా ఏమంటున్నారంటే ఒకవేళ మీరు ఉండి ఉంటే మీకు కూడా వచ్చేది అని మధురాతి మధురమైన మాటలు అంటూ ఉంటారు కదా! నిరాకారి నుండి సాకార తనువుని తీసుకుని చూడు అంటారు. ఇప్పుడు చెప్పండి. 3. ఇటువంటి మధురమైన పిల్లలని బాబా ఏమంటారు? అయినా కానీ బాబా దయా హృదయులుగానే అవ్వవలసి ఉంటుంది. సరే మంచిది ఇప్పుడు క్షమిస్తున్నాను కానీ ఇక ముందు మరలా అలా చేయకూడదు అంటున్నారు. కానీ జవాబులు చాలా మంచి మంచిగా చెప్తున్నారు. కనుక పవిత్రత అనేది బ్రాహ్మణులకు అన్నింటికంటే గొప్ప అలంకరణ.

అందువలనే మీ చిత్రాలను ఎంతగా అలంకరిస్తారో! పవిత్రత యొక్క అలంకరణకి స్మృతిచిహ్నమే ఈ అలంకరణ, పవిత్రత అంటే సంపూర్ణ పవిత్రత. పైపై పవిత్రత కాదు. సంపూర్ణ పవిత్రత అనేది బ్రాహ్మణజీవితం యొక్క చాలా గొప్ప ఆస్తి, ఠీవి, వ్యక్తిత్వం. అందులనే భక్తులు కూడా ఒక రోజు కొరకు పవిత్రత యొక్క వ్రతం పెట్టుకుంటారు. ఈరకంగా మిమ్మల్నే కాపీ చేసారు. రెండవది, ఆహారపానీయాల యొక్క వ్రతం పెట్టుకుంటారు. ఆహారపానీయాల యొక్క వ్రతం కూడా తప్పక పాటిస్తారు. ఎందుకు? బ్రాహ్మణలైన మీరు ఆహారపానీయాల యొక్క వ్రతం పక్కాగా తీసుకున్నారు కదా!

మధువనానికి రావాలంటే అహార పానీయాల యొక్క శుద్దత ఉందా? అని అందరిచే ఫారం నింపిస్తారు కదా!  అయితే ఆహార పానీయాల యొక్క వ్రతం పక్కాగా ఉంది కదా? పక్కాయేనా? అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కచ్చాగా అవుతుందా? డబల్ విదేశీయులకైతే డబల్ పక్కాగా ఉంది ఉంటుంది. డబల్ పక్కాయేనా? డబల్ విదేశీయులకు పక్కయేనా? డబల్ పక్కాయేనా? ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఈరోజు కొద్దిగా తినేద్దాం అని అంటున్నారా? కొద్దిగా డీలా చేసుకుంటున్నారా? లేదు కదా! తినటం మరియు త్రాగటంలో పక్కాగా ఉన్నారా? అందువలనే భక్తులు కూడా ఆహారపానీయాల యొక్క వ్రతం పెట్టుకుంటున్నారు.

మూడవది- జాగరణ చేస్తారు. రాత్రంతా మేల్కొని ఉంటారు. బ్రాహ్మణులైన మీరు కూడా అజ్ఞాననిద్ర నుండి మేల్కొనే వ్రతం తీసుకుంటున్నారు. మధ్యమధ్యలో అజ్ఞాననిద్ర రావటంలేదు కదా! భక్తులు మిమ్మల్ని కాపీ చేస్తున్నారు. మీరు పక్కా అయితేనే కదా కాపీ చేస్తారు. ఎప్పుడూ కూడా అలజ్ఞాననిద్ర అనగా బలహీనత యొక్క సోమరితనం. యొక్క లేదా నిర్లక్ష్యం యొక్క నిద్ర రాకూడదు. కొద్దికొద్దిగా కునికిపాట్లు వచ్చినా కానీ పర్వాలేదా? కునికిపాట్లు పడుతున్నారా? అమృతవేళ కొందరు కునికిపాట్లు పడుతూ ఉంటారు.

కానీ ఆలోచించండి, భక్తులు మా యొక్క స్మృతిచిహ్నంగా ఏమేమి కాపీ చేస్తున్నారు అని. వారు ఏది ఏమైనా కానీ వ్రతాన్ని వదలరు. వారే ఇంత పక్కాగా ఉంటున్నారు. ఈరోజు భక్తులు ఆహారపానీయాల యొక్క వ్రతం పెట్టుకుంటారు కానీ మీరేమి చేస్తారు? పిక్నిక్ చేసుకుంటారా? వారు వ్రతం పెట్టుకుంటారు మీరు పిక్నిక్ చేసుకుంటారు. కేక్ కట్ చేసుకుంటారు, పిక్నిక్ ఎందుకు చేసుకుంటారంటే మీరు జన్మతోనే వ్రతం తీసేసుకున్నారు అందువలనే ఈరోజు పిక్నిక్ చేసుకుంటారు. బాప్దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నారు? తెలిసే ఉంటుంది. సంకల్పాలు చాలా మంచిగా చేస్తున్నారు.

అది విని బాబా చాలా సంతోషిస్తున్నారు. సంకల్పం చేస్తున్నారు కానీ తర్వాత ఏమౌతుంది? సంకల్పం బలహీనం ఎందుకు అవుతుంది? కావాలనుకుంటున్నారు ఎందుకంటే బాబా అంటే చాలా ప్రేమ ఉంది. బాబాకి కూడా తెలుసు. బాబాతో పిల్లలందరికీ మనస్పూర్వక ప్రేమ ఉంది. 100 శాతం ఏమిటి, అంతకంటే ఎక్కువే ఉంది అని అందరు చేతులెత్తుతారు. ప్రేమలో అందరు పాస్ అనే విషయాన్ని బాబా కూడా  అంగీకరిస్తారు. కానీ ఏమిటి? కానీ.... అనేది ఉందా, లేదా? కానీ... అని వస్తుందా లేదా? వస్తుందా? పాండవులు? మధ్యమధ్యలో కానీ.... అనేది వస్తుందా? లేదు అని అనటంలేదు అంటే అవును అనే కదా!

బాప్దాదా ఒక విషయాన్ని నోట్ చేస్తారు. మెజార్టీ ప్రతిజ్ఞ బలహీనం అవ్వటానికి ఒకటే కారణం, ఒకే మాట, ఆ మాట ఏమిటో ఆలోచించండి. ఆ ఒక్క మాట ఏమిటో టీచర్స్ చెప్పండి! పాండవులు చెప్పండి, స్మృతి వచ్చింది కదా! ఆ ఒకే మాట ఏమిటంటే నేను. నేను అనే మాట అభిమానరూపంలోనూ వస్తుంది బలహీనంగా చేయటంలో కూడా నేను అనే మాట వస్తుంది.. నేను ఏదైతే చెప్పానో, ఏదైతే చేసానో, ఏదైతే అనుకున్నానో అదే నిజం. అదే జరగాలి... ఇలా అనుకోవటమే అభిమానం యొక్క'నేను అనుకోవటం. నేను అన్నది పూర్తి కాకపోతే తిరిగి అదే మనస్సు యొక్క బలహీనత రూపంలోనూ వస్తుంది.

'నేను చేయలేను, నేను నడవలేను... ఇలా. ఒకటి. దేహాభిమాన నేను అనేది మారిపోయి నేను 'అనే మాటయే స్వమానాన్ని కూడా స్మృతి ఇప్పిస్తుంది మరియు నేను అనే మాటయే దేహాభిమానంలోకి, కూడా తీసుకువస్తుంది. నేను అనేది మనస్సుని బలహీనంగానూ చేస్తుంది మరియు మనస్సుని సంతోషంగానూ చేస్తుంది. అభిమానం యొక్క నేను అనే మాట యొక్క గుర్తులు ఏవిధంగా ఉంటాయో తెలుసా? వారు అవమానాన్ని సహించలేరు. అభిమానం అనేది అవమానాన్ని సహించనీయదు. ఇది సరైనది. కాదు. కొంచెం నిర్మాణంగా ఉండండి అని ఎవరైనా చెప్పారనుకోండి వారికి అది అవమానంగా అనిపిస్తుంది. అభిమానం ఉన్నవారి గుర్తు ఇదే.  

   

బాప్దాదా వతనంలో నవ్వుకుంటున్నారు - ఈ పిల్లలు అక్కడక్కడ ఉపన్యాసాలు చెప్తారు. కదా, శివరాత్రి సందర్భంగా ఇప్పుడు చాలా ఉపన్యాసాలు చెప్తున్నారు. ఆ ఉపన్యాసాలలో పిల్లలు చెప్పే పాయింట్ ఒకటి బాప్దాదాకి జ్ఞాపకం వస్తుంది. ఆ ఉపన్యాసాలలో చెప్తారు 'శివరాత్రికి మేకను బలి ఇస్తారు అది మే, మే అంటూ ఉంటుంది అంటే శివరాత్రికి నేను, నేను అనేదానివి బలి ఇచ్చేయండి అని చెప్తారు. అయితే అది వినీవిని నేను బాప్దాదా నవ్వుకుంటున్నారు. ఈ నేను అనేది మీరు కూడా బలి చేయండి. అర్పణ చేయగలరా? చేయగలరా? పాండవులు చేయగలరా?

డబల్ విదేశీయులు చేయగలరా? పూర్తి సమర్పణయా లేదా కేవలం సమర్పణయా? పూర్తి సమర్పణ. ఈరోజు బాప్దాదా జెండా ఎగురవేసే సమయంలో మామూలుగా ప్రతిజ్ఞ చేయించారు. మీరు ప్రతిజ్ఞ చేయటం, ఆ కాగితాన్ని ఫైల్లో జమ చేయటం ఇటువంటి ప్రతిజ్ఞను చేయించరు. ఏమి ఆలోచిస్తున్నారు. ఈరోజు కూడా ఇటువంటి ప్రతిజ్ఞ చేయిస్తారా దాదీలు! ఫైనల్ చేస్తారా. లేదా ఫైల్లో జమ చేస్తారా? చెప్పండి. (ఫైనల్ చేయించండి) ధైర్యం ఉందా? ఉండా ధైర్యం?: వినటంలో నిమగ్నమైపోయారు, చేతులెత్తటంలేదు. తిరిగి రేపు ఏమీ జరగదు కదా! జరుగదు. కదా!

రేపు మాయ వస్తుంది, మిమ్మల్ని చూసి వెళ్ళటానికి వస్తుంది. మాయకి కూడా ప్రేమ ఉంటుంది కదా! ఎందుకంటే ఈరోజుల్లో అందరు ఘనంగా సేవ యొక్క ప్లాన్స్ తయారు . చేసుకుంటున్నారు. సేవని వేగంగా అట్టహాసంగా చేయటం అంటే సంపూర్ణ సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావటం. ఉపన్యాసం చెప్పి వచ్చాము అని భావించకండి కానీ సమయాన్ని సమీపంగా తీసుకువస్తున్నారు. సేవ బాగా చేస్తున్నారు. బాబా సంతోషిస్తున్నారు. సమయం సమీపంగా వస్తుంది, మీరు తీసుకువస్తున్నారు. అదేవిధంగా లక్షమంది లేదా లక్షన్నరమందిని తీసురకురాలేదు సమయాన్ని సమీపంగా తీసుకువచ్చారు.

ఇప్పుడు గుజరాత్ వారు చేసారు. ఆ బొంబాయి వారు చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు కూడా! లక్షమంది కాకపోయినా 50 వేల మంది సరిపోతారు. సందేశం ఇస్తున్నారు కానీ సందేశంతో పాటుగా సంపన్నత యొక్క తయారీలు కూడా చేస్తున్నారా? తయారేనా? వినాశనాన్ని పిలుస్తున్నారంటే తయారేనా? దాదీ ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు. బాబా తొందర తొందరగా ప్రత్యక్షం అయిపోయేలాంటి ప్లాన్ ఏదైనా తయారుచేయండి అని. అయితే బాబా చెప్తున్నారు - ప్రత్యక్షత అనేది ఒక్క సెకను యొక్క విషయం, కానీ ప్రత్యక్షత కంటే ముందుగా బాప్దాదా అడుగుతున్నారు.

స్థాపన చేసేవారు. ఎవరెడీగా ఉన్నారా? పరదా తెరవమంటారా? లేదా కొందరు చెవులను, కొందరు తలని అలంకరించుకుంటున్నారా? తయారేనా? ఎప్పటికి అయిపోతుంది? తారీఖు చెప్పండి. ఇప్పుడు మీరు సేవ కొరకు తారీఖు నిర్ణయం చేసుకున్నారు కదా! ఈ నెల లోపుగా అందరికీ సందేశం ఇవ్వాలని అనుకున్నారు కదా! అదేవిధంగా అందరూ ఎవరెడీగా ఉండాలి. తక్కువలో తక్కువ 16 వేల మంది అయినా ఎవరెడీగా ఉన్నారా? 9 లక్షల విషయం వదిలేయండి. 16 వేల మంది అయినా తయారేనా? తయారేనా? అయితే చప్పట్లు కొట్టమంటారా? తయారుగానే ఉన్నారు. అని మామూలుగా చెప్పటం కాదు.

ఎవరెడీ అయిపోండి. అప్పుడు బాప్దాదా టచ్ చేస్తారు. చప్పట్లు కొడతారు. అప్పుడు ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది. విజ్ఞానవేత్తలు తమ పనిని ప్రారంభిస్తారు. ఆలశ్యం ఏముంది? అన్నీ తయారుగానే ఉన్నాయి. కానీ 16 వేల మంది తయారుగా ఉన్నారా? తయారేనా? అయిపోతారా? మీకే బాగా తెలుసు అని బాబాకి చెప్పారు) ఈ జవాబు మిమ్మల్ని మీరు తప్పించుకోవడానికి 16 వేల మంది ఎవరెడీగా, సంపూర్ణ పవిత్రంగా తయారైపోయారు అనే రిపోర్టు రావాలి. చప్పట్లు కొట్టటానికి బాప్దాదా యొక్క ఆలశ్యం ఏమీ లేదు. తారీఖు చెప్పండి. (మీరు చెప్పండి) అందరినీ అడగండి.

చూడండి, ఇది తప్పక జరగవలసిందే. కానీ నేను అనే మాటను సంపూర్ణంగా పరివర్తన చేసుకున్నప్పుడు బాబా వెంట వెళ్ళగలరు. లేకపోతే వెనుక రావల్సి ఉంటుంది. అందువలనే బాప్దాదా ఇప్పుడు ఇంకా గేట్ తెరవటంలేదు. ఎందుకంటే వెంట వెళ్ళాలి కదా!! బ్రహ్మాబాబా పిల్లలందరినీ అడుగుతున్నారు - గేట్ తెరిచే తారీఖు చెప్పండి. ద్వారం తెరవాలి కదా! వెళ్ళాలి కదా! ఈరోజు జరుపుకోవటం అంటే తయారవ్వటం. కేవలం కేక్ కట్' చేయటమే కాదు. నేను అనే దానిని కూడా సమాప్తి చేసారా? ఆలోచిస్తున్నారా లేదా ఆలోచించేసారా? ఎందుకంటే బాప్దాదా దగ్గరికి అమృతవేళ అందరి యొక్క వెరైటీ సంకల్పాలన్నీ చేరుకుంటాయి.

పరస్పరం చర్చించుకుని బాబాకి తారీఖు చెప్పండి. ఎంత వరకు తారీఖు నిర్ణయించరో అంత వరకు ఏ పనులు జరగవు. మొదట మహారధీలు పరస్పరం తారీఖుని నిర్ణయించుకోండి. అప్పుడు అందరు అనుసరిస్తారు. అనుసరించేవారు ధైర్యంగానే ఉన్నారు. మీ ధైర్యంతో వారికి మరింత బలం లభిస్తుంది. ఇప్పుడు మీరు ఉత్సాహ, ఉల్లాసాలు ఇచ్చారు కనుక తయారైపోయారు కదా! అదేవిధంగా సంపన్నంగా అయ్యేటందుకు ప్లాన్ తయారుచేసుకోండి. ధర్మాతీతంగా అవ్వవలసిందే అనే సంబగ్నత పెట్టుకోంది ఏమైపోయినా కానీ తయారవ్వవలసిందే, చేయవలసిందే, జరగవలసిందే.

విజ్ఞానవేత్తల యొక్క ధ్వని, వినాశనం చేసేవారి యొక్క ధ్వని బాబా చెవులకి చేరుకుంటుంది. వారు కూడా అంటున్నారు ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు అని, అడ్వాన్స్  పార్టీ వారు కూడా అంటున్నారు తారీఖు నిర్ణయించండి, నిర్ణయించండి అని, బ్రహ్మాబాబా కూడా అంటున్నారు. తారీఖు నిర్ణయించండి అని, అందువలన దీని కొరకు మీటింగ్ పెట్టుకోండి. ఇక, ఏదైతే సేవ చేస్తున్నారో ఆ సేవా విషయంలో బాబా సంతుష్టంగా ఉన్నారు. విదేశీయులు, భారతదేశంలో అన్ని జోన్ల వారు కూడా చేస్తున్నారు. ప్రవృతి వారు కూడా చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. దీని కొరకు శుభాకాంక్షలు. సేవ కొరకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, ఇప్పుడు ఈ అద్భుతం చేసి చూపించండి.

విశేషంగా దాదీ లకు చెప్తున్నాను. పెద్ద అన్నయ్యలకు కూడా విశేషంగా చెప్తున్నాను. ఇప్పుడు మరలా వచ్చే శివరాత్రికి అలజడి మరియు అద్భుతం రెండు వెనువెంట జరగాలి. సరే ముందు. వరసలో కూర్చున్న టీచర్స్ సరేనా? మీటింగ్ చేసుకుంటారు కదా!బాప్దాదాకి ఇప్పుడు తారీఖు అవసరం. చేస్తున్నాము, అయిపోతుంది.... ఇలా చెప్పకూడదు. ఇలా చాలా సార్లు అయ్యింది. 'మొదట పిల్లలు తారీఖు ఇస్తే అప్పుడు బాబా ఫైనల్ చేస్తారు.

బాబా అయితే అంటున్నారు, మరలా వచ్చే శివరాత్రికి అలజడి మరియు అద్భుతం. రెండూ వెనువెంట జరగాలి. ఇప్పుడు తయారీలు చేస్కోండి. టీచర్స్ అంగీకారమేనా? డబల్ విదేశీయలకు అంగీకారమేనా? మొదటి వరసలో వారికి అంగీకారమేనా? పాండవులకు) అంగీకారమేనా? (అంగీకారమే) ధన్యవాదములు, చాలా దుఃఖీ ఆత్మలు ఉన్నారు. బాప్దాదా ఇప్పుడు ఇంత దుఃఖాన్ని చూడలేకపోతున్నారు. మొదట శక్తులైన మీకు, దేవతలైన పాండవులకు 'దయ రావాలి. ఎంతగానో పిలుస్తున్నారు. ఇప్పుడు ఆ పిలుపు యొక్క ధ్వని మీ చెవులలో మారుమ్రోగాలి. సమయం యొక్క పిలుపు అనే కార్యక్రమం చేస్తున్నారు కదా!

ఇప్పుడు భక్తులు యొక్క పిలుపు కూడా వినండి. దుఃఖీల పిలుపు కూడా వినండి. సేవలో నెంబర్ మంచిగా ఉంది. ఈ సర్టిఫికెట్ అయితే బాప్దాదా కూడా ఇస్తున్నారు. ఉత్సాహ, ఉల్లాసాలు బావున్నాయి. గుజరాత్ వారు మొదటి నెంబర్ తీసుకున్నారు. శుభాకాంక్షలు, ఇప్పుడు కొంచెం వారి యొక్క పిలుపు వింటే సరిపోతుంది. ప్రాణంతో, దప్పికతో పిలుస్తున్నారు. విజ్ఞానం వారు కూడా చాలా అరుస్తున్నారు. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి అంటూ పిలుస్తున్నారు. భలే, ఈ రోజు కేక్ కట్ చేసుకోండి కానీ రేపటి నుండి పిలుపు వినండి. జరుపుకోవటం అనేది సంగమయుగం " యొక్క పద్ధతి.

ఒకవైపు జరుపుకోవాలి, రెండవవైపు తయారవ్వాలి. మంచిది, ఏమి విన్నారు? మీ పాట ఉంది కదా - దుఖీ ఆత్మలపై దయ చూపించండి ... మీరు తప్ప మరెవ్వరు దయ చూపించలేరు. అందువలన ఇప్పుడు సమయానుసారం మాస్టర్ దయాసాగరులుగా అవ్వండి. స్వయంపై కూడా దయ మరియు ఇతరాత్మల పట్ల కూడా దయ చూపించండి. లైటాన్ అయ్యి భిన్నభిన్న లైట్స్ యొక్క కిరణాలు వెదజల్లండి. విశ్వంలో ఉన్న ఆప్రాప్తి ఆత్మలందరికీ, ప్రాప్తి యొక్క కిరణాలు ఇవ్వండి. మంచిది.

సాక్షాత్తు బాబా మూర్తి సమాన శ్రేష్టాత్మలకు, సదా ఉత్సాహ, ఉల్లాసాలలో ఉండే బాబా యొక్క సమీప ఆత్మలకు, సదా ప్రతి అడుగు బాబా సమానంగా వేసే పిల్లలకు, బ్రాహ్మణజన్మ యొక్క శుభాకాంక్షలకు పాత్రులైన పిల్లలందరికీ, సదా ఏకాగ్రతాశక్తి కలిగిన సంపన్న ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు పదమాపదమా రెట్లు జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మరియు సమస్తే

    67వ త్రిమూర్తి శివజయంతి సందర్భంగా ప్రియ అవ్యక్తబాప్దాదా! తన హస్తాలతో శివధ్వజారోహణ చేసారు మరియు అందరికీ శుభాకాంక్షలనిచ్చారు. ఈరోజు అందరు తమ జన్మదినం యొక్క శుభాకాంక్షలను ఇచ్చారు మరియు తీసుకున్నారు. కూడా జెండా కూడా ఎగురవేసారు. విశ్వం అనే గ్లోబ్ సర్వాతులు   నిల్చుని మీ అందరి ముఖాలలో బాబా యొక్క జెండాను చూడాలి అటువంటి రోజును ఇప్పుడు త్వరగా తీసుకురావాలి. వస్త్రంతో తయారైన జెండా నిమిత్తమాత్రం కానీ ఒకొక్క పిల్లవాని ముఖంలో బాబా యొక్క చిత్రం కనిపించాలి. అటువంటి జెండాను ఎగురవేయాలి. ఆ రోజుని కూడా చాలా, చాలా, చాలా, చాలా త్వరగా తీసుకురావాలి మరియు తీసుకురావాలి. రావాలి మరియు రావాలి.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

శాంతి దూత భవ!