రివైజ్ కోర్స్ మురళి 30-11-2003
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
నాలుగు సబ్జెక్టులలో అనుభవం యొక్క అధికారిగా అయ్యి సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకోండి..
ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తన యొక్క నలువైపులు ఉన్నటువంటి బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు. ఈ బ్రాహ్మణ ప్రపంచం చిన్న ప్రపంచం కానీ చాలా శ్రేష్టమైనది మరియు చాలా ప్రియమైనది. ఈ బ్రాహ్మణ ప్రపంచం మొత్తం విశ్వంలో విశేషాత్మల యొక్క ప్రపంచం. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో ఒక ఆత్మ ఎందుకంటే తన యొక్క తండ్రిని తెలుసుకుంది మరియు బాబా యొక్క వారసత్వానికి అధికారిగా అయ్యింది. బాబా ఏవిధంగా అయితే ఉన్నతోన్నతమైనవారో అదేవిధంగా బాబాని గ్రహించి బాబా వారిగా 'అయ్యే ఆత్మలు కూడా విశేషాత్మలు.
ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు జన్మతోనే భాగ్యవిధాత బాబా మస్తకంలో భాగ్యం యొక్క రేఖను గీసారు. అటువంటి శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలు, ఈవిధమైన భాగ్యవాన్ ఆత్మలుగా మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? ఇంత ఉన్నతమైన ఆత్మికనషా అనుభవం అవుతుందా? ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క మనస్సులో ఉన్నటువంటి మనోభిరాముడు మనస్సును యొక్క ప్రేమ, మనస్సు యొక్క పాలన ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ మొత్తం కల్పంలో ఒకపు ద్వారా మరియు ఒకే సమయంలో లభిస్తుంది. ఈ విధమైన ఆత్మికనషా ప్రతి కర్మలో ఉంటుందా? ఎందుకంటే మేము కర్మయోగి జీవితం కలిగిన విశేషాత్మలం అని మీరు విశ్వానికి ప్రతిజ్ఞ చేస్తున్నారు.
కేవలం యోగం జోడించే యోగీలు కాదు, యోగీజీవితం కలిగినవారు. జీవితం అనేది సదాకాలికంగా ఉంటుంది. స్వతహాగా మరియు నిరంతరం ఉంటుంది. యోగీజీవితం అంటే 6 గంటలు, 8 గంటలు : ఉండదు. యోగం అంటే స్మృతి. ఇది బ్రాహ్మణజీవితం యొక్క లక్ష్యం. జీవితం యొక్క లక్ష్యం స్వతహాగానే స్మృతి ఉంటుంది మరియు ఎటువంటి లక్ష్యమో అటువంటి లక్షణాలు స్వరాగా !! వస్తాయి. బాబా ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క మస్తకంలో మెరుస్తున్న భాగ్యం యొక్క స్థితారను చూస్తున్నారు. బాప్దాదా సదా ప్రతి పిల్లవాడిని శ్రేష్ట స్వమానధారిగా, స్వరాజ్యాధికారిగా చూస్తున్నారు.
మీరందరు కూడా మిమ్మల్ని మీరు స్వమానధారి ఆత్మను, స్వరాజ్యాధికారి ఆత్మను - ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఒకవేళ ఒక సెకనులో నేను స్వమానధారి ఆత్మను ఇలా స్వమానం యొక్క జాబితా తీస్తే సెకనులో ఎంత జాబితా వస్తుంది! చాలా పెద్ద జాబితా అవుతుంది. కదా! స్వమానం అభిమానాన్ని సమాప్తి చేస్తుంది. ఏవిధంగా అయితే సెకనులో లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయటం ద్వారా అంధకారం తొలగిపోతుంది, అంధకారాన్ని తొలగించడానికి శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. స్వతహాగానే సమాప్తి అయిపోతుంది.
అదేవిధంగా స్వమానం యొక్క స్మృతి స్విచ్ ఆన్ చేయటం ద్వారా రకరకాలైన దేహాభిమానం సమాప్తి చేసుకునేటందుకు శ్రమ చేయవలసిన 'అవసరం ఉండదు. స్వమానం యొక్క స్మృతి స్వరూపం అవ్వనంత వరకు శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. బాప్దాదా పిల్లల యొక్క ఆటను చూస్తున్నారు. స్వమానాన్ని మనస్సులో వర్ణన చేస్తున్నారు నేను బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారిని. ఇలా వర్ణన కూడా చేస్తున్నారు. ఆలోచిస్తున్నారు కానీ అనుభవం యొక్క సీట్పై సెట్ అవ్వటం లేదు. ఏది ఆలోచిస్తున్నారో అది తప్పకుండా అనుభవం చేసుకోవాలి.
ఎందుకంటే అన్నింటికంటే శ్రేష్ట అధికారం - అనుభవం యొక్క అధికారం. బాప్దాదా చూస్తున్నారు - పిల్లలు చాలా మంచిగా వింటున్నారు, చాలా మంచిగా ఆలోచిస్తున్నారు కానీ వినటం, ఆలోచించటం ఇది వేరే విషయం. అనుభవీ స్వరూపంగా అవ్వటం అనేది బ్రాహ్మణజీవితం యొక్క శ్రేష్ట అధికారం. ఇదే భక్తికి మరియు జ్ఞానానికి తేడా. భక్తిలో కూడా వినేటువంటి అనందంలో చాలా లీనమైపోతారు. ఆలోచిస్తారు కూడా కానీ అనుభవం చేసుకోలేరు. అనుభవీ స్వరూపం అనేది ఆత్మికనషాను అనుభవం చేయిస్తుంది. అనుభవం అనేది జీవితంలో ఎప్పుడు మర్చిపోరు, విన్నటువంటి విషయం. ఆలోచించిన విషయం మర్చిపోవచ్చు కానీ అనుభవం యొక్క అధికారం ఎప్పుడు తక్కువ అవ్వదు.
బాప్దాదా పిల్లలకు ఇదే స్మృతి ఇప్పిస్తున్నారు - భగవంతుడైన బాబా ద్వారా ఏదైతే విషయం విన్నారో ఆ విన్నటువంటి ప్రతి విషయం యొక్క అనుభవీమూర్తిగా అవ్వండి. అనుభవం అయిన విషయం వేల మంది కలిసి తొలగించాలని చూసినా తొలగించలేరు. ఏవిధంగా అయితే శరీరాన్ని ధారణ చేస్తూనే నేను ఫలానా అని ఎంత పక్కాగా అనుభవం చేసుకుంటున్నారు! ఒకవేళ ఎవరైనా మీరు ఫలానా కాదు, ఫలానా అంటే అంగీకరిస్తారా? అదేవిధంగా ప్రతి స్వమానాన్ని అనుభవం చేసుకోవటం ద్వారా స్వమానాన్ని ఎప్పుడు మర్చిపోరు. కానీ బాప్దాదా చూసారు .
స్వమానాన్ని అనుభవం చేసుకోవటంలో, ప్రతి విషయాన్ని అనుభవం చేసుకోవటంలో, ప్రతి నెంబర్బారీగా ఉన్నారు. ఎప్పుడైతే నేను ఆత్మని అని అనుభవం చేసుకున్నారో ఇక ఆత్మ తప్పు త మీరు ఇంకేమిటి! దేహాన్ని అయితే నాది అంటున్నారు. కానీ నేను ఆత్మనే అంటున్నారు మరి ఇక దేహాభిమానం అనేది ఎక్కడి నుండి వచ్చింది! ఎందుకు వచ్చింది? కారణం ఏమిటంటే, నేను దేహాన్ని అనే వ్యతిరేక నషా 63 జన్మల నుండి పక్కా అయిపోయింది. యదార్ధ అభ్యాసాన్ని అనుభవంలో మర్చి పోతున్నారు. పిల్లలు శ్రమ చేయటం చూసి బాప్దాదా కి పిల్లలపై ప్రేమ వస్తుంది.
పరమాత్మ పిల్లలు శ్రమ చేస్తున్నారు అని, కారణం ఏమిటంటే, అనుభవీమూర్తిగా, అవ్వటంలో లోపం ఉంది. దేహాభిమానం యొక్క అభిమానంలో ఉన్నప్పుడు ఏది ఏమైనా, ఏ కర్మ చేస్తున్నా ఆ అభిమానాన్ని మర్చిపోతాదా? బ్రాహ్మణజీవితం అంటే కర్మయోగిజీవితం, యోగీజీవితం యొక్క అనుభవం, పరిశీలన చేసుకోండి. ప్రతి సబ్జక్టుని అనుభవంలోకి తీసుకువచ్చానా? అని, జ్ఞానం వినటం, వినిపించటం సహజమే కానీ జ్ఞానస్వరూపంగా అవ్వాలి. జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకువస్తే స్వతహాగానే ప్రతి కర్మలో జ్ఞానస్వరూపులై అంటే జ్ఞానం యొక్క లైట్, మైట్ కలిగిన వారిగా ఉంటారు.
జ్ఞానాన్నే లైట్ మరియు మైట్ అంటారు. అలాగే యోగీస్వరూపం అంటే యోగయుక్త, యుక్తాయుక్త స్వరూపంగా ఉండాలి. ధారణా స్వరూపం అంటే ప్రతి కర్మ, ప్రతి కర్మేంద్రియం, ప్రతి గుణం యొక్క ధారణాస్వరూపంగా ఉండాలి. సేవ యొక్క అనుభవీమూర్తి అంటే సేవాధారి అంటే నిరంతరం స్వతహాగా సేవాధారిగా ఉండాలి. మనస్సు ద్వారా అయినా వాచా ద్వారా అయినా, కర్మణా ద్వారా అయినా, సంబంధ, సంపర్కం ద్వారా ఇలా ప్రతి కర్మలో సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. వీరినే నాలుగు సబ్జక్టులలో అనుభవీ స్వరూపం అంటారు. కనుక అందరు పరిశీలన చేసుకోండి.
ఎంత వరకు అనుభవీగా అయ్యాము? అని, ప్రతి గుణం " యొక్క అనుభవీగా, ప్రతి శక్తి యొక్క అనుభవీగా అవ్వాలి. అనుభవం అనేది సమయానికి ఉపయోగ పడుతుంది అని అంటారు కదా! అనుభవీమూర్తి యొక్క అనుభవీగా ఉన్నవారు అనుభవం. యొక్క అధికారంతో సమస్యను ఒక సెకనులో సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకుంటారు. సమస్య సమస్యగా ఉండదు. సమాధాన స్వరూపం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు సమయం యొక్క సమీపత, బాబా సమానంగా అయ్యే సమీపత సమాధాన స్వరూపం యొక్క అనుభవం చేయిస్తుంది.
చాలా సమయం సమస్య రావటం సమాధానం చేయటంలో శ్రమ చేసారు ఇప్పుడు బాప్దాదా ప్రతి ఒక పిల్లవాడిని స్వమానధారిగా, స్వరాజ్యాధికారిగా, సమాధాన స్వరూపంగా, చూడాలనుకుంటున్నారు. అనుభవీ మూర్తులు సెకనులో పరివర్తన చేయగలరు. అన్ని వైపుల నుండి అందరు చేరుకున్నారు. డబల్ విదేశీయులు కూడా ప్రతి గ్రూప్ అవకాశం తీసుకుంటున్నారు. మంచిది, ఈ గ్రూప్లో పాండవులు కూడా ఎక్కువమంది "ఉన్నారు. పాండవులందరు చేతులు ఎత్తండి! మాతలు, కుమారీలు, టీచర్స్ చేతులు ఎత్తండి! మొదటి గ్రూప్లో మాతలు ఎక్కువమంది ఉన్నారు కానీ ఈ గ్రూప్లో పాండవులు కూడా మంచిగా పరుగుపెట్టారు.
పాండవుల యొక్క నషా మరియు నిశ్చయానికి ఇప్పటి వరకు చాలా మహిమ జరుగుతుంది. ఏమి మహిమ జరుగుతుంది? తెలుసా? పాండవులు 5 గురే కానీ నిశ్చయం మరియు నషాతో విజయం పొందారు అనే మహిమ ఇప్పటి వరకు జరుగుతుంది. అటువంటి పాండవులేనా? మంచిది. నషా ఉందా? మీరు పాండవులు అని పాండవులు ఆ మాట విన్నప్పుడు పాండవపతిని మర్చిపోవటం లేదు కదా! అప్పుడప్పుడు మర్చిపోతున్నారా? పాండవులు మరియు పాండవపతి పాండవపతి పాండవులను ఎప్పుడు కూడా మర్చిపోరు. పాండవులకు ఈ నషా ఉండాలి - మేము కల్ప కల్పం పాండవులం మరియు పాండవపతికి ప్రియమైనవారము అని.
స్మృతిచిహ్నంలో కూడా పాండవులకు తక్కువ పేరు లేదు. పాండవుల యొక్క బిరుదే - విజయీ పాండవులు. ఈ విధమైన పాండవులేనా? మేము కేవలం పాండవులం కాదు విజయీ పాండవులం అనే నషా ఉండాలి. విజయం యొక్క తిలకం మస్తకంలో అవినాశిగా పెట్టబడే ఉంది. మాతలకు ఏమి నషా ఉంటుంది? చాలా నషా ఉంటుందా! మాతలు నషాతో బాబా వచ్చిందే మా కోసం అని చెప్తారు. ఇలా ఉన్నారు కదా? ఎందుకంటే అర్ధకల్పం మాతలకు అధికారం లభించలేదు ఇప్పుడు సంగమయుగంలో రాజనీతిలో కూడా మాతలకు అధికారం లభించింది. ప్రతి డిపార్ట్ మెంట్లో శక్తులైన మిమ్మల్ని బాబా ముందు పెట్టారు కనుకనే ఇప్పుడు.
ప్రపంచంలో కూడా ప్రతి వర్గంలో మాతలకు అధికారం లభించింది. మాతలు లేకుండా ఏ వర్గం లేదు. ఇది సంమయుగం యొక్క అధికారం, మా బాబా అనే నషా మాతలకు ఉంటుంది. నా బాబా అనే నశా ఉంటుందా? మాతలు చేతులు ఊపుతున్నారు. మంచిది. భగవంతుడు తన వారిగా చేసుకున్నారు ఈ గారడీ మాతలకు జరిగింది కదా! బాప్దాదా మాతలైనా, పాండవులైనా 'సర్వ సంబంధాలతో ప్రేమతో పెట్టుకుంటున్నారు కానీ విశేషంగా ఎవరు ఏ సంబంధంతో ప్రేమ ఉంచుకుంటున్నారు అనేది చూస్తున్నారు.
కొంతమంది పిల్లలకు భగవంతుడిని స్నేహితునిగా చేసుకోవటం చాలా మంచిగా అనిపిస్తుంది అందువలనే ఈశ్వరుడు స్నేహితుడు అనే దాని మీద కధ కూడా ఉంది. బాప్దాదా కూడా ఇదే చెప్తారు - ఏ సమయంలో, ఏ సంబంధం అవసరమైతే ఆ సంబంధంలో నన్ను మీ వారిగా చేసుకోండి అని. అన్ని సంబంధాలు నిలుపుకోవచ్చు. పిల్లలు నా బాబా అన్నారు మరియు బాబా నేను మీ వాడిని అన్నారు. మధువనం యొక్క వెలుగు మంచిగా అనిపిస్తుంది కదా!
ఎంత దూరంగా కూర్చుని విన్నా, చూసినా మధువనం యొక్క వెలుగు మధువనానిదే. మధువనంలో బాప్దాదా కలుసుకుంటారు మరియు ఎన్ని ప్రాప్తులు లభిస్తాయి? జాబితా తీస్తే ఎన్ని ప్రాప్తులు వస్తాయి? 'అన్నింటికంటే ఉన్నతోన్నతమైన ప్రాప్తి సహజంగా మరియు స్వతహాగా యోగం ఉంటుంది. - శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. మధువనం యొక్క వాయుమండలం, మధువనం యొక్క దినచర్య స్వతహాగా యోగిగా చేస్తుంది. ఎందుకు? మధువనంలో బుద్ధిలో ఒకే పని ఉంటుంది. సేవాధారి గ్రూప్ వారి విషయం వేరు కానీ రిఫ్రెష్ అవ్వడానికి వచ్చినవారికి మధువనంలో ఏమి పని ఉంటుంది?
ఏదైనా బాధ్యత ఉంటుందా? తినండి, త్రాగండి, ఆనందంలో ఉండండి. చదువుకోండి. మధువనం మధువనయే. విదేశంలో కూడా వింటున్నారు కానీ అక్కడ వినటం మరియు మధువనానికి రావటం దీనిలో రాత్రికి, పగలకి ఉన్నంత తేడా ఉంది. బాప్దాదా సాధనాల ద్వారా వినేటువంటి వారికి, చూసేవారికి కూడా ప్రియసుృతులు అయితే ఇస్తున్నారు. కొంతమంది పిల్లలు రాత్రి మేల్కొని కూడా వింటున్నారు. అసలు లేని దాని కన్నా ఇది మంచిదే కానీ ఇంకా, మురళి వినటం మంచిగా అనిపిస్తుందా! అక్కడ కూడా మురళి వింటున్నాము కదా, ఇక్కడ కూడా వెనుక నుంచి టీ. విలో చూడాల్సి వస్తుంది అనుకుంటున్నారా!
ఎవరైతే మధువనం రావటమే మంచిది అని భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి! (అందరు చేతులు ఎత్తారు) భక్తిలో కూడా ' ఏమి మహిమ ఉంది? మధువనంలో మరళి మ్రోగింది అంతే కానీ లండన్లో మురళి మ్రోగింది . శ్రీ అని కాదు కదా! మధువనం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటం అంటే స్వయాన్ని మహాన్గా చేసుకోవటం. ఎవరైతే వచ్చారో వారందరు యోగీ జీవితం, జానీజీవితం, ధారణా స్వరూపం యొక్క అనుభవం చేసుకుంటున్నారా! ఇప్పుడు మొదటి టర్న్లో ఈ సీజన్ కొరకు విశేషద్యాస ఇప్పించారు - ఈ సంవత్సర మంతా సంతుష్టమణిగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టం చేయాలి.
కేవలం సంతుష్టమణిగా అవ్వటమే కాదు సర్వులను సంతుష్టం చేయాలి. ఇప్పుడు సమయానుసారం ఏదైనా జరుగుతుంది, ఒక సంవత్సరంలో అవుతుందా లేదా 6 నెలలలో అవుతుందా అని ప్రశ్నించకండి. అకస్మాత్తుగా ఏ సమయంలో ఏదైనా జరగవచ్చు. అందువలన స్మృతి యొక్క స్విచ్ శక్తిశాలిగా చేసుకోండి. సెకనులో స్విచ్ ఆన్ చేయండి మరియు అనుభవీ స్వరూపంగా అవ్వండి. స్విచ్ బలహీనంగా ఉన్నప్పుడు మాటిమాటికి ఆన్ చేయవలసి ఉంటుంది. మరియు అది మంచిగా అవ్వటంలో సమయం కూడా పడుతుంది.
సెకనులో స్వమానం యొక్క స్వరాజ్యాధికారం యొక్క స్విచ్ ఆన్ చేసి అంతర్ముఖీ అయ్యి అనుభవం చేసుకోండి. అనుభవం యొక్క సాగరంలో ఇమిడిపోండి. అనుభవం యొక్క అధికారం ముందు ఏ అధికారం విజయం పొందలేదు. ఏమి చేయాలో అర్ధమైందా? బాప్దాదా సైగ చేస్తూ ఉంటారు - నిరీక్షణలో ఉండకండి. ప ఎప్పుడో అనవద్దు, ఇప్పుడే అనండి. ఎవరెడీగా ఉండాలి. సెకనులో స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేస్తున్నారా?
ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సమస్య అయినా, స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేయండి. ఈ అభ్యాసం చేయండి ఎందుకంటే అంతిమపేపర్ ఒక సెకనే ఉంటుంది. ఒక నిమిషం కూడా ఉండదు. ఆలోచించేవారు దాటలేరు. అనుభవం ఉన్నవారు పాసైపోతారు. ఇప్పుడు సెకనులో అందరు నేను పరంధామనివాసీ శ్రేష్టాత్మను ఈ స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేయండి మరియు ఇక ఏ స్మృతి ఉండకూడదు. బుద్ధిలో ఏ అలజడి ఉండకూడదు. అచంచలంగా ఉండాలి (ఆత్మిక వ్యాయామం)
నలువైపుల ఉన్నటువంటి శ్రేష్టస్వమానధారి ఆత్మలకు, అనుభవీ ఆత్మలకు, సదా ప్రతి సబ్జెక్టులో అనుభవీగా అయ్యేవారికి, సదా యోగీ జీవితంలో నడిచే నిరంతరయోగీ ఆత్మలకు, ధనదా తమ యొక్క విశేష భాగ్యాన్ని ప్రతి కర్మలో ప్రత్యక్షంలో చూపించే కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది విశేషాత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.