రివైజ్ కోర్స్ మురళి 31-12-2003                                        

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

ఈ సంవత్సరం నిమిత్తంగా మరియు నిర్మాణంగా అయ్యి

జమాఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానిగా అవ్వండి

.ఈరోజు సహస్రభుజధారి బాప్దాదా నలువైపులు ఉన్నటువంటి తన యొక్క భుజాలన్న చూస్తున్నారు. కొన్ని భుజాలు సాకారంగా సన్ముఖంగా ఉన్నారు మరియు కొన్ని భుజాలు సూక్ష్మరూపంలో కనిపిస్తున్నారు. బాప్దాదా తన యొక్క అనేక భుజాలను చూసి సంతోషిస్తున్నారు. భుజలందరు నెంబర్వార్గా ఆల్రౌండర్గా, ఎవరెడీగా, ఆజ్ఞాకారి భుజాలుగా ఉన్నారు. బాప్దాదా సైగ చేయగానే కుడి భుజాలైన పిల్లలు - అలాగే బాబా, హాజి బాబా, ఇప్పుడే చేస్తాము బాబా.... అంటున్నారు. ఇటువంటి గారాభమైన పిల్లలను చూసి ఎంత సంతోషం ఉంటుంది!

బాబాకి ఎంత సంతోషం ఉంటుందంటే నాకు తప్ప ఇక ఏ ధర్మాత్మకి, మహాన్ ఆత్మకి ఇన్ని సహయోగి భుజాలు లభించరు అని. మొత్తం కల్పం తిరిగి చూడండి, ఇటువంటి సహయోగి భుజాలు ఎవరికైనా లభించారా? బాప్దాదా ప్రతి ఒక భుజం యొక్క విశేషతను చూస్తున్నారు. మొత్తం విశ్వం నుండి దం ఎన్నుకోబడిన విశేషభుజాలు, పరమాత్మకు సహయోగి భుజాలు. చూడండి ఈరోజు ఈ హాల్లో కూడా ఎంతమంది ఉన్నారు! (ఈరోజు హాల్లో 18 వేల కంటే ఎక్కువమంది అన్నయ్యలు, అక్కయ్యలు కూర్చున్నారు) అందరు మిమ్మల్ని మీరు పరమాత్మకు కుడిభుజాలుగా అనుభవం చేసుకుంటున్నారా? నషా ఉంది కదా!

బాబాకి ఆనందంగా ఉంది - నలువైపుల నుండి క్రొత్త సంవత్సరం జరుపుకోవడానికి అందరు చేరుకున్నారు. కానీ క్రొత్త సంవత్సరం ఏమి స్మృతి ఇప్పిస్తుంది? క్రొత్త జన్మ, క్రొత్త యుగాన్ని స్మృతి ఇప్పిస్తుంది. ఎంతగా ఇది అతి పురాతన అంతిమ జన్మయో అదేవిధంగా క్రొత మొదటిజన్మ కూడా ఎంతో సుందరంగా ఉంటుంది. ఇక్కడ శ్యామంగా ఉన్నారు మరియు అక్కడు సుందరంగా ఉంటారు. ఇప్పుడు ఏవిధంగా అయితే పాత సంవత్సరం మరియు క్రొత్త సంవత్సరం కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయో అదేవిధంగా మీ యొక్క క్రొత్త జన్మ, క్రొత్తయుగం స్పష్టంగా కనిపిస్తున్నాయా?

 ఈ రోజు అంతిమజన్మలో ఉన్నారు, రేపు మొదటి జన్మలో ఉంటారు. స్పష్టంగా ఉందా? ఎదురుగా వస్తుందా? అది పిల్లలు బ్రహ్మాబాబాని అనుభవం చేసుకున్నారు కదా!!! బ్రహ్మాబాబాకి తన యొక్క క్రొత్తజన్మ మరియు క్రొత్త జన్మ యొక్క రాజ్యశరీరరూపీ వస్త్రం సదా ఎదురుగా మేకుకి తగిలించి ఉన్నట్లు అనుభవం అయ్యేది. పిల్లలెవరైనా కలుసుకోవడానికి వెళ్ళినా అనుభవం అయ్యేది. బ్రహ్మాబాబాకి ఈరోజు నేను వృద్ధునిగా ఉన్నాను, రేపు పిల్లవానిగా అవుతాను అనే అనుభవం అయ్యేది. ఇది జ్ఞాపకం ఉందా? ఈరోజు మరియు రేపటి ఆటగా భవిష్యత్తు అనభవం అవ్వాలి. ఈరోజు స్వరాజ్యాధికారులు, రేపు విశ్వరాజ్యాధికారులు. నషా ఉందా?

ఈరోజు పిల్లలు కిరీటం ధరించి కూర్చున్నారు. (డబల్ విదేశీ చిన్న పిల్లలు రీట్రీట్లో వచ్చారు) మీకు ఏమి నషా ఉంది? కిరీటం ధరించడం ద్వారా ఏమి నషా ఉంది? పరిస్తా నషాలో ఉన్నారు కదా! మేము నషాలో ఉన్నాము అని చేతులు ఊపుతున్నారు. ఈ సంవత్సరం ఏమి చేస్తారు? ఏదైనా ప్లాన్ తయారు చేసారా? ఏమి నవీనత చేస్తారు? ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు, లక్షమందికి రెండు లక్షల మందికి కూడా చేసారు కానీ ఏమి నవీనత చూపిస్తారు. ఈరోజుల్లో ప్రజలు ఒకవైపు స్వప్రాప్తి కోసం కోరికతో ఉన్నారు కానీ ధైర్యంలేదు. వినాలనుకుంటున్నారు కానీ తయారయ్యే ధైర్యంలేదు.

అటువంటి ఆత్మలను పరివర్తన చేయడానికి ముందుగా ఆ ఆత్మలకు ధైర్యం యొక్క రెక్కలు ఇవ్వండి ధైర్యం యొక్క రెక్కలకు ఆధారం . అనుభవం. అనుభవం చేయించండి. అనుభవం అనేది ఎటువంటిదంటే కొంచెం ఒక బిందువు ' అనుభవం చేసుకున్నా అనుభవం అనేది రెక్క అనండి లేక అనుభవం అనేది పాదం అనండి దాని ద్వారా ధైర్యంతో ముందుకు వెళ్ళగలరు. దీని కొరకు విశేషంగా ఈ సంవత్సరం నిరంతరం అఖండంగా మహాదానిగా అవ్వాలి, అఖండంగా అవ్వాలి. మనస్సు ద్వారా శక్తిస్వరూపంగా అవ్వండి. మహాదాని అయ్యి నిరంతరం శక్త "అనుభవం చేయించండి.

మనస్సు ద్వారా, తరంగాల ద్వారా, శక్తుల యొక్క అనుభవం చేయించండి. వాచా ద్వారా జ్ఞానదానం చేయండి, కర్మ ద్వారా గుణాల దానం చేయండి. మొత్తం రోజంతా మనసా, వాచా, కర్మణా మూడింటి ద్వారా  అఖండ మహాదానిగా అవ్వండి. సమయం అనుసరించి ఇప్పుడిప్పుడే దానిగా అవ్వటం, అప్పుడప్పుడు దానం చేయటం ఇలా కాదు. అఖండదానిగా  అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఆత్మలకి ఈ అఖండదానం చాలా అవసరం. మహాదానిగా అయ్యేటందుకు మొదట మీ యొక్క జమా ఖాతాను పరిశీలన చేసుకోండి. నాలుగు సబ్జక్టులలో శ్రీ జమా ఖాతా ఎంత శాతంలో ఉంది? అని పరిశీలన చేసుకోండి.

ఒకవేళ స్వయంలో జమాఖాతా లేకపోతే మహాదానిగా ఎలా అవుతారు! జమా ఖాతాను పరిశీలన చేసుకునే గుర్తు ఏమిటి?  మనసా, వాచా, కర్మణా ద్వారా సేవ అయితే చేసారు కానీ జమ అయిన దానికి గుర్తు-మొదట స్వయం యొక్క సంతుష్టత వెనువెంట ఎవరికైతే సేవ చేస్తున్నారో ఆ ఆత్మలలో సంతోషం యొక్క సంతుష్టత వచ్చిందా? ఒకవేళ రెండు రకాలుగా సంతుష్టత లేకపోతే మీ సేవ యొక్క ఫలం సేవాఖాతాలో జమ అవ్వలేనట్లు భావించండి. బాప్దాదా అప్పుడప్పుడు పిల్లల యొక్క జమాఖాతాను చూస్తూ ఉంటారు. అక్కడక్కడ శ్రమ ఎక్కువ చేస్తున్నారు కానీ ఫలం తక్కువగా జమ అవుతుంది.

కారణం ఏమిటి? రెండు విధాలైన సంతుష్టత యొక్క లోపం ఉంది. సంతుష్టత యొక్క అనుభవం లేకపోతే స్వయం యొక్క ఇతరుల యొక్క జమాఖాతా తక్కువ అయిపోతుంది. బాప్దాదా అయితే జమాఖాతా చాలా సహజంగా పెంచుకునే స్వర్ణిమ తాళంచెవి పిల్లలకు ఇచ్చారు. ఆ తాళంచెవి ఏమిటో తెలుసా? లభించింది కదా! సహజంగా జమా ఖాతాను నిండుగా చేసుకునే స్వర్ణిమ తాళంచెవి - మనసా, వాచా, కర్మణా ఏ సేవ చేస్తున్నా కానీ మీలో నిమిత్తభావం యొక్క స్మృతి ఉండాలి.

నిమిత్తభావం, నిర్మాణభావం, శుభభావం, ఆత్మికస్నేహం యొక్క భావం యొక్క స్థితిలో స్థితులై సేవ చేస్తే సహజంగా మీ యొక్క ఈ భావం ద్వారా ఆత్మల యొక్క భావన పూర్తి అవుతుంది. ఈరోజుల్లో ప్రజు ప్రతి ఒక్కరి భావం ఏమిటి అనేది నోటి చేస్తున్నారు. అదేవిధంగా నిమిత్తభావంతో చేస్తున్నారా లేక అభిమానంతో చేస్తున్నారా అనేది నోట్ చేస్తున్నారు. ఎక్కడ నిమిత్తభావం ఉంటుందో అక్కడ నిర్మాణభావం స్వతహాగా వస్తుంది. కనుక ఏమి జమ అయ్యింది? అని పరిశీలన చేసుకోండి. ఎంత జమ అయ్యింది? అని. ఎందుకంటే సంగమయుగం అంటే జమ చేసుకునే యుగం.

ఒక మొత్తం కల్పం జమ యొక్క ప్రాలబం ఉంటుంది. ఈ సంవత్సరం ఏ విశేషధ్యాస ఉంచుకోవాలి? మీ యొక్క జామా ఖాతాను పరిశీలన చేసుకోండి. పరిశీలించు కునేవారిగా మరియు తయారయ్యేవారిగా అవ్వండి ఎందుకంటే సమయం సమీపంగా కనిపిస్తుంది మరియు అందరు సమానంగా అవుతాము అని బాబాతో ప్రతిజ్ఞ చేసారు. ప్రతిజ్ఞ చేసారు కదా? ఎవరైతే చేసారో వారు చేతులు ఎత్తండి? పక్కాగా చేసారా? లేక శాతంలో చేసారా? పక్కాగా చేసారు కదా? బ్రహ్మాబాబా సమానంగా జమాఖాతా ఉండాలి.      

  బ్రహ్మాబాబా సమానంగా అవ్వాలంటే బ్రహ్మాబాబా యొక్క విశేషచరిత్ర ఏమి చూసారు?) ఆది నుండి అంతిమం వరకు ప్రతి విషయంలో నేను అన్నారా లేక బాబా అన్నారా? బాబు చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను అనేవారు. ఎవరితో కలుసుకోవడానికి వచ్చారు? బాబాతో కలుసుకోవడానికి వచ్చారు అనేవారు. నేను అనే దాని యొక్క అభావంగా, అవిద్యాగా అయ్యారు. ఇది బ్రహ్మాబాబాలో చూసారు కదా! చూసారా? ప్రతి మురళీలో బాబా, బాబా అంటూ ఎన్ని సార్లు స్మృతి ఇప్పించారు? సమానంగా అవ్వటం అంటే నేను అనే దాని యొక్క అభావంగా అవ్వాలి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా!

బ్రాహ్మణులకు నేను అనేది చాలా రాయల్గా వస్తుంది. అని జ్ఞాపకం ఉందా? చెప్పాను కదా! అందరు బాబా యొక్క ప్రత్యక్షత కావాలనుకుంటున్నారు. బాబాని ప్రత్యక్షం చేయాలను కుంటున్నారు. చాలా ప్లాన్స్ తయారుచేస్తున్నారు, మంచి ప్లాన్స్ తయారు చేస్తున్నారు అది చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు కానీ ఈ రాయల్ (సూక్ష్మ) రూపం యొక్క నేను అనే భావం ప్లాన్లో, సఫలతలో శాతం తక్కువ చేసేస్తుంది. స్వతహాగా సంకల్పంలో, మాటలో, కర్మలో బాబా, బాబా అనే స్మృతి ఉండాలి. నేను అనేది ఉండకూడదు. బాప్దాదా చేసి చేయించేవారు చేయిస్తున్నారు అనే స్మృతి ఉండాలి. జగదంబ సరస్వతి యొక్క విశేష ధారణ) ఇదే.

జగదంబ యొక్క స్లోగన్ స్మృతి ఉందా? పాతవారికి జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం ఉందా?. చెప్పండి, నడిపించేవారు నడిపిస్తున్నారు. ఇదే జగదంబ యొక్క విశేషధారణ. కనుక నెంబర్ తీసుకోవాలి. సమానంగా అవ్వాలి అంటే నేను అనేది సమాప్తి అవ్వాలి. నోటి నుండి బాబా, బాబా అనే మాట స్వతహాగా రావాలి. కర్మలో, మీ యొక్క ముఖంలో బాబా యొక్క ముఖం స 'కనిపించాలి అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. బాగ్దాదా ఈ రాయల్రూపం యొక్క నేను, నాది లేదు అనే పాట ఎక్కువగా వింటున్నారు. నేను ఏది చేసానో అదే మంచిది, నేను ఏది ఆలోచించానో అదే మంచిది, అదే జరగాలి ఇలా ఈ నేను అనేది మోసం చేస్తుంది.

 భలే ఆలోచించండి, చెప్పండి కానీ నిమిత్తభావంతో మరియు నిర్మాణభావంతో చెప్పండి. బాప్దాదా ఆదిలో కూడా ఒక ఆత్మిక డ్రిల్ (వ్యాయామం) నేర్పించేవారు. ఆ డ్రిల్ " ఏమిటి? ఇప్పుడిప్పుడే యజమానిగా అవ్వాలి, ఇప్పుడప్పుడే పిల్లవానిగా అవ్వాలి. అభిప్రాయం 20 చెప్పే సమయంలో యజమాని అవ్వాలి, అది నిర్ణయం అయ్యే సమయంలో పిల్లవానిగా అవ్వాలి.. యజమాని మరియు పిల్లవాని స్థితి.... ఈ ఆత్మికడ్రిల్ చాలా చాలా అవసరం. కేవలం బాల్దాదా ఇచ్చిన మూడు శిక్షణలను స్మృతిలో ఉంచుకోండి. అవి అందరికీ జ్ఞాపకం ఉన్నాయా?

మనస్సులో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మలో నిర్వికారి అవ్వండి. సంకల్పం చేసినప్పుడు నిరాకారి స్థితిలో స్థితులై సంకల్పం చేయండి. అన్నీ మర్చిపోయినా కానీ ఈ మూడు మాటలను మాత్రం మర్చిపోకండి. ఈ మూడు మాటల యొక్క శిక్షణ సాకారబాబా యొక్క కానుక, బ్రహ్మాబాబాతో.. సాకారరూపంతో కూడా ప్రేమ ఉంది కదా! ఇప్పుడు కూడా చాలా మంది డబల్ విదేశీయులు మాకు బ్రహ్మాబాబాతో చాలా ప్రేమ ఉంది అని అనుభవం వినిపిస్తారు. చూడకపోయినా కానీ, బాబా అంటే ప్రేమ ఉంది అని అంటారు. డబల్ విదేశీయులకు బ్రహ్మాబాబాపై చాలా ప్రేమ ఉంది కదా? ఉంది కదా?

ఎవరితో ప్రేమ ఉంటుందో వారిచ్చిన బహుమతి చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. చిన్న వస్తువైనా కానీ దానిపై చాలా ప్రేమ ఉంటుంది, దాచి ఉంచుకుంటారు. కనుక బ్రహ్మాబాబాతో ప్రేమ ఉంది అంటే ఈ మూడు మాటల శిక్షణపై పూర్తి ప్రేమ ఉండాలి. దీని ద్వారా సహజంగా సంపన్నంగా మరియు సమానంగా అవుతారు, బ్రహ్మాబాబా ఏమి చెప్పారో. జ్ఞాపకం ఉంచుకోండి. క్రొత్త సంవత్సరంలో భలే వాచా సేవ చేయండి. అట్టహాసంగా చేయండి కానీ అనుభవం'  చేయించే సేవపై సదా ధ్యాస ఉంచుకోండి.

అందరు అనుభవం చేసుకోవాలి, మాకు ఈ అక్కయ్య ద్వారా లేదా అన్నయ్య ద్వారా శక్తి అనుభవం అయ్యింది, శాంతి యొక్క అనుభవం అయ్యింది.' అని ఎందుకంటే అనుభవం అనేది ఎప్పుడూ మర్చిపోరు. విన్నది మర్చిపోతారు, మంచిగా అనిపిస్తుంది కానీ మర్చిపోతారు, అనుభవం అనేది ఎటువంటిదంటే అది ఆకర్షితం చేసి వారిని సమీపంగా తీసుకువస్తుంది. సంబంధ, సంపర్కంలోకి వస్తారు ఎందుకంటే సంబంధం లేకుండా వారసత్వానికి అధికారిగా కాలేరు. అనుభవం సంబంధంలోకి తీసుకువస్తుంది. మంచిది!

ఏమి చేస్తారు పరిశీలన చేసుకోండి, పరిశీలన చేసుకుని తయారవ్వండి. అనుభవం చేయించేవారిగా తయారవ్వండి మరియు జమా ఖాతాను పరిశీలించుకునేవారిగా అవ్వండి. మంచిది, అందరు  బాబా దగ్గరికి చేరుకున్నారు కనుక బాప్దాదా అందరికీ ఆశీర్వాదాలతో కూడిన కోటానుకోట్ల రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. పట్టపురాణీ, పట్టపురాజులుగా అయ్యారు కదా? కుర్చీ రాణీ అనటంలేదు కదా! పట్టపురాణీ అంటున్నారు. ఈరోజు మొత్తం సభలో చాలా మంది పట్టపురాణి. పట్టపురాజులుగా అయ్యారు. కూర్చుని, కూర్చుని అలసిపోలేదు కదా!

కుర్చీపై కూర్చునే వారికి పట్టా లభించింది. కనుక అలసట లేదు కదా? బాధ అనిపించటంలేదు కదా? సంతోషంలో అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు అందరు ఏమి చేస్తారు? బాబాకి కొత్త సంవత్సరంలో ఏదైనా బహుమతి ఇస్తారా లేదా ఇవ్వరా? క్రొత్త సంవత్సరంలో ఏమి చేస్తారు? ఒకరికొకరు బహుమతి. ఇచ్చుకుంటారు కదా! ఒక కార్డు ఇస్తారు లేక బహుమతి ఇస్తారు. బాప్దాదా కి కార్డ్ అవసరం లేదు రికార్డ్ కావాలి. పిల్లలందరి యొక్క రికార్డ్ నెంబర్ వన్ గా ఉండాలి. ఈ రికార్డ్ కావాలి. నిర్విఘ్నంగా ఉండాలి. అప్పుడప్పుడు ఏదోక విఘ్నాల యొక్క విషయాలు వినిపిస్తున్నారు కదా!

బాబాకి ఒక నవ్వు వచ్చే ఆట జ్ఞాపకం వస్తుంది. ఆ నవ్వు వచ్చే ఆట ఏమిటో తెలుసా? ఆ ఆట ఏమిటంటే ముసలి వారు బ్మొమ్మల ఆట ఆడుతున్నారు. అవ్వడానికి ముసలివారు కానీ బొమ్మల ఆట ఆడుతున్నారు అంటే నవ్వు వచ్చే ఆట కదా! ఇప్పుడు చిన్న, చిన్న విషయాలు వింటుంటే, చూస్తుంటే వానప్రస్త్రీ ఆత్మలు చిన్న చిన్న విషయాలతో ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ రికార్డ్ బాబాకి మంచిగా అనిపించటంలేదు. కార్డ్కి బదులు నిర్విఘ్నంగా అయ్యేటువంటి, చిన్నచిన్న విషయాలను సమాప్తి చేసేటువంటి రికార్డ్ ఇవ్వండి. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసుకోవటం నేర్చుకోండి మరియు చిన్న విషయాన్ని సమాప్తి చేయటం నేర్చుకోండి.

బాప్దాదా ఒక్కొక్క బిడ్డ యొక్క ముఖం బాప్దాదా ముఖాన్ని చూపించే దర్పణంగా అవ్వాలనుకుంటున్నారు. మీ యొక్క దర్పణంలో బాబా కనిపించాలి. అటువంటి విచిత్ర దర్పణం బాబాకి బహుమతిగా ఇవ్వండి. పరమాత్మ కనిపించే దర్పణం ప్రపంచంలో ఎక్కడా లేదు. కనుక మీరు కొత్త సంవత్సరంలో ఇటువంటి బహుమతి ఇవ్వండి. విచిత్ర దర్భణంగా అవ్వండి. ఎవరు డ చూసినా బాప్దాదా కనిపించాలి. ఎవరి ద్వారా విన్న బాప్దాదా యొక్క ధ్వని రావాలి. బహుమతి ? ఇస్తారా? ఎవరైతే ఇస్తాము అని ధృడసంకల్పం చేఉన్నారో వారు చేతులు ఎత్తండి! డబలి విదేశీయులు కూడా ఎత్తుతున్నారు.

ఇప్పుడు అందరికీ ఏమి ఇవ్వాలో జ్ఞాపకం ఉందా? గిఫ్ట్ మరియు రికార్డ్. దర్పణంగా అయితే రికార్డ్ స్వతహాగానే వచ్చేస్తుంది. ఇప్పుడు బాప్దాదా శ్రమ యొక్క పురుషార్ధం చూడాలనుకోవటంలేదు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలలో శ్రమ చేయకండి. ఎగిరిపోండి. పైన ఉంటే మిగిలిన విషయాలన్నీ క్రిందే ఉండిపోతాయి. అన్ని వైపుల నుండి కార్డ్స్ అయితే చాలా వచ్చాయి. ఇక్కడ ఉన్నాయి. కార్డులు చాలా వచ్చాయి. కానీ కార్డులు పంపిన వారికి యొక్క బాప్దాదా తిరిగి ప్రియస్మృతులు, ఆశీర్వాదాలతో పాటు రికార్డ్ చూపించండి అని చెప్తున్నారు.

 కార్డ్ పంపిన దానికి శుభాకాంక్షలు కానీ రికార్డ్ చూపిస్తే చాలా, చాలా, చాలా శుబాకాంక్షలు బొమ్మలు కూడా పంపిస్తున్నారు. ఉత్తరాలు కూడా పంపిస్తున్నారు. డబల్ విదేశీయులు ఒక విశేషత బాబాకి చాలా ఇష్టమనిపిస్తుంది. జానకీ బచ్చీ కూడా వింటుంది. విదేశం. ఫలితం విని సంతోషిస్తున్నారు. వారి యొక్క విశేషత ఏమిటంటే - సత్యం మాట్లాడతారు . సత్యమైన మనస్సుకే యజమాని రాజీ అవుతారు. చలించినా, ఊగినా కానీ సత్యం మాట్లాడతారు . మరియు ఎవరైతే సత్యం మాట్లాడతారో వారి యొక్క పొరపాటు సగం క్షమించబడుతుంది..

అందువలనే బావికి ఈ విశేషత మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే అసత్యం మాట్లాడతారో అసత్యం ఎలాంటిదంటే లోపల మనస్సు తినేస్తూ ఉంటుంది. ఏదైనా ముళ్ళు వ కాలులో గ్రుచ్చుకుంటే ఏమౌతుంది? లోలోపలే గ్రుచ్చుకుంటూ ఉంటుంది కదా! అలాగే మాట్లాడేవారికి లోపల ఎప్పుడు సంతోషం ఉండదు. ఏదోక సమస్య వస్తూనే ఉంటుంది. అందువలన స్పష్ట ఆత్మగా అవ్వటం ద్వారా స్పష్టత అనేది శ్రేష్టంగా చేస్తుంది. సహాయం లభిస్తుంది. లిఫ్ట్ కలభిస్తుంది కనుక మీ యొక్క విశేషతను ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. ఈ విశేషత మీకు సహాయం చేస్తుంది.

నలువైపుల ఉన్న మహాదాని పిల్లలకు, బాబా యొక్క కుడిభుజాలు, ఆజ్ఞాకారి పిల్లలకు, సదా సర్వాత్మలకు ధైర్యం యొక్క రెక్కలు ఇచ్చేటువంటి ధైర్యవంతులైన ఆత్మలకు, నలువైపుల సదా బాబా సమానంగా ప్రతి కర్మలో ఫాలో చేసేవారికి, బ్రహ్మబాబా మరియు జగదంబ యొక్క శిక్షణలను సదా ప్రత్యక్షజీవితంలోకి తీసుకువచ్చే పిల్లలందరికీ చాలా, చాలా ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే

రాత్రి 12 గంటల తర్వాత ప్రియమైన అవ్య క్ బాప్దాదా 2004 క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు పిల్లలందరికీ ఇచ్చారు.

"ఈ సమయం సంగమసమయం. పాత సంవత్సరం మరియు క్రొత్త సంవత్సరం యొక్క సంగమం. ఈ పాత సంవత్సరం మరియు క్రొత్త సంవత్సరం యొక్క సంగమ సమయంలో బాబా విశ్వం యొక్క అతి ప్రియమైన, అతి గారాభమైన పిల్లలకు చాలా, చాలా మనస్సు, యొక్క ఆశీర్వాదాలతో కూడిన ప్రియస్మృతులు ఇస్తున్నారు. శుభాకాంక్షల యొక్క పళ్ళాలు నింపి " ఇస్తున్నారు. సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలి. మీ అదృష్టం యొక్క భాగ్యాన్ని సరా స్మృతిలో ఉంచుకుని మాస్టర్ భాగ్యవిధాతగా అవ్వాలి. ఇప్పుడు సంగమయుగం యొక్క ప్రియస్మృతులు.

విదేశీయులకు, భారతవాసీయులకు డబల్ గుడ్మార్నింగ్ మరియు డబల్ గుడ్వైట్ రెండు చెప్తున్నారు. ఇప్పుడు ఎలా అయితే సదా సంతోషంగా ఉంటున్నారో అదేవిధంగా ఏ విషయం వచ్చినా ఈరోజు స్మృతి ఉంచుకుని సదా సంతోషంలో ఊగుతూ ఉండాలి. సంతోషం యొక్క ఊయలలో సదా ఊగుతూ ఉండాలి. ఎప్పుడు దుఃఖం యొక్క అల రాకూడదు.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

మాస్టర్ వరదాత భవ!