రివైజ్ కోర్స్ మురళి 02-11-2004
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
సర్వ శక్తి, సర్వగుణ సంపన్నమై సన్మాన దాతలు కండి '
ఈరోజు స్నేహసాగరుడు నలువైపుల ఉన్న తన యొక్క స్నేహి పిల్లలను చూప సంతోషిస్తున్నారు. సాకార రూపంలో ఎదురుగా కూర్చున్నా, స్థూల రూపంలో దూరంగా కూర్చున్నా కానీ అందరు స్నేహంతో బాబా దగ్గర కూర్చున్నాం అనే ప్అనుభవం చేసుకుంటున్నారు. స్నేహం ప్రతి పిల్లవాడికి బాబాని సమీపంగా అనుభవం చేయిస్తుంది. పిల్లలైన మీరందరు కూడా బాబాపై స్నేహంతో ఎదురుగా వచ్చారు.బాప్దాదా చూసారు ప్రతి ఒక పిల్లవాని మనస్సులో బాషాల యొక్క స్నేహం నిండి ఉంది. ప్రతి ఒకరి మనస్సులో " నా బాబా " అనే స్నేహం యొక్క పొడి మ్రోగుతుంది.
స్నేహమే ఈ దేహం మరియు దేహం యొక్క సంబంధాల నుండి అతీతంగా చేస్తుంది. స్నేహమే మాయాజీత్ తయారుచేస్తుంది. ఎక్కడ మనస్సు యొక్క స్నేహం ఉంటుంది. 'అక్కడ మాయ దూరం నుండే పారిపోతుంది. స్నేహం అనే సబ్జెక్టులో పిల్లలందరు ప్యా అయిపోయారు. ఒకటి - స్నేహం, రెండు సర్వశక్తివాన్ బాబా నుండి సర్వశక్తుల యొక్క ఖజానా ఈరోజు బాప్దాదా ఒకవైపు స్నేహాన్ని చూస్తున్నారు. రెండవవైపు శక్తిసేన యొక్క శక్తులను " చూస్తున్నారు. ఎంత స్నేహం నిండి ఉందో అంతగా సర్వశక్తులు కూడా నిండి ఉన్నాయా? బాప్దాదా పిల్లలందరికీ ఒకే విధంగా సర్వశక్తులను ఇచ్చి మాస్టర్ సర్వశక్తివాన్ గా తయారుచేసారు.
కొందరిని సర్వ శక్తివంతులుగా, కొందరిని శక్తివంతులుగా తయారు చేయలేదు. స్వమానం కూడా మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటున్నారు కదా! కనుక బాప్దాదా నలువైపుల ఉన్న పిల్లలను అడుగుతున్నారు. - ప్రతీ ఒక్కరు స్వయంలో సర్వశక్తుల యొక్క అనుభవం చేసుకుంటున్నారా? లేదా సర్వశమైం పై అధికారిగా ఉన్నారా? సర్వశక్తులు బాప్దాదా యొక్క వారసత్వం, మరి మీ యొక్క వారసత్వం మీరు అధికారిగా ఉన్నారా? ఉందా అధికారం? టీచర్స్ చెప్పండి. అధికారం ఉందా? ఆలోచించుకుని చెప్పండి. పాండవులకి అధికారం ఉందా? సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా?
1. ఏ సమయంలో, ఏ శక్తి అవసరమో ఆ శక్తి శక్తిసేన అయిన మీ ద్వారా హాజరవుతుందా? సమయానికి చిత్తం ప్రభూ! అంటున్నాయా? ఆలోచించండి. చూసుకోండి. ఆర్డర్ చేయగానే శక్తి చిత్తం ప్రభూ! అనాలి. ఏ శక్తిని ఆహ్వానం చేసినా, ఎటువంటి సమయమో ఎటువంటి పరిస్థితియో అటువంటి శక్తి కార్యంలోకి రావాలి. అటువంటి అధికారి ఆత్మలుగా అయ్యారా? ఎందుకంటే బాబా వారసత్వం ఇచ్చారు మరియు మీరు ఆ వారసత్వాన్ని మీ సొంతం చేసుకున్నారు. చేసుకున్నారు కదా! సొంతవాటిపై అధికారం ఉంటుంది కదా!
ఏ సమయంలో విధి అవసరమో ఆ సమయంలో అది కార్యంలో ఉపయోగ పడాలి. ఉదాహరణకి మీకు ఇముడ్చుకునే శక్తి అవసరం అనుకోండి అప్పుడు మీరు ఇముడ్చుకునే శక్తికి ఆర్డర్ చేస్తే ఆ శక్తి చిత్తం ప్రభూ అంటూ మీ అంగీకరించి హాజరవుతుందా? అవుతుందా! చేతులు ఊపండి. అవుతుందా చేతులు ఊపండి. అవుతుందా? అప్పుడప్పుడు హాజరవుతున్నాయా లేక సదా హాజరు ' అవుతున్నాయా? ఇముడ్చుకునే శక్తి హాజరవుతుంది కానీ 10 సార్లు ఇముడ్చుకున్న తర్వాత 11వ సారి కొద్దిగా అలజడి చేస్తుందా? సదా మరియు సహజంగా హాజరవ్వాలి.
సమయం అయిపోయిన తర్వాత రాకూడదు. ఇలా చేయాలనుకున్నాను కానీ ఇలా జరిగిపోయింది అని అనటం లేదు కదా అటువంటి వారినే సర్వ శక్తుల యొక్క అధికారి అంటారు. ఈ అధికారం బాబా అందరికీ - ఇచ్చారు కానీ సదా అధికారి అవ్వటంలో నెంబర్ వారీగా అయిపోతున్నారు. సదా మరియు సహజంగా, స్వతహాగా, సంస్కారంగా అయిపోవాలి. దానికి విధి - బాబాని ప్రభువు అని కూడా అంటారు కదా! అదేవిధంగా 2. ఏ పిల్లలైతే ప్రతి శ్రీమతాన్ని చిత్తం ప్రభూ! అంటూ నడుస్తారో వారికి సర్వ శక్తులూ హాజరవుతాయి. ప్రతి ఆజ్ఞకి, ప్రతి అడుగులో చిత్తం ప్రభూ! అనాలి.
ఒకవేళ ప్రతి శ్రీమతాన్ని పాటించకపోతే ప్రతి శక్తి, ప్రతి సమయం హాజరవ్వలేవు. ఒకవేళ మీరు అప్పుడప్పుడు బాబా యొక్క శ్రీమతం లేదా ఆజ్ఞను పాలన చేస్తే శక్తులు కూడా మీకు అప్పుడప్పుడు. మీ ఆజ్ఞను పాటించి హాజరవుతాయి. హాజరు కానీ సమయంలో అధికారికి బదులు ఆధీనం అయిపోతాయి. బాప్దాదా ఈ ఫలితం పరిశీలించారు, ఏమి చూశారు? అందరు నెంబర్వార్గా ఉన్నారు. అందరు నెంబర్వన్ లేరు, నెంబర్్వర్గా ఉన్నారు మరియు సదా, సహజంగా కూడా లేరు. అప్పుడప్పుడు సహజం అవుతుంది, అప్పుడప్పుడు కొద్దిగా కష్టంగా శక్తి ప్రత్యక్షం అవుతుంది.
బాప్దాదా ప్రతి ఒక పిల్లవాడిని తన సమానంగా చూడాలనుకుంటున్నారు. నెంబర్ వార్ చూడాలనుకోవటంలేదు మరియు మీ అందరి లక్ష్యం కూడా బాబా సమానంగా అవ్వాలనే కదా! 1. సమానంగా అయ్యే లక్ష్యం ఉందా లేక నెంబర్వార్గా అయ్యే లక్ష్యం ఉందా? ఒకవేళ అడిగితే - అందరు సమానంగా అవ్వాలనుకుంటున్నాము అని చెప్తారు కదా! కనుక పరిశీలించుకోండి - 11. సర్వశక్తులు ఉన్నాయా? సర్వ అనే మాటపై అండర్న్ చేసుకోండి. 2. సర్వగుణాలు ఉన్నాయా? రుజు అప్పుడప్పుడు స్వయం యొక్క స్థితి, అప్పుడప్పుడు పరిస్థితి (పర - స్థితి) విజయం పొందటం లేదు కదా?
ఒకవేళ పరిస్థితి విజయం పొందుతుంది అంటే దానికి కారణం తెలుసు కదా! 3. స్థితి బలహీనంగా ఉన్నప్పుడే పరిస్థితి యుద్ధం చేస్తుంది. సదా స్వస్థితి విజయీగా ఉండాలంటే సాధనం - సదా స్వమానం మరియు సన్మానం యొక్క సమానతను ఉంచుకోవాలి. స్వమానధారి ఆత్మ స్వతహాగానే సన్మానం (గౌరవం) ఇచ్చే దాతగా ఉంటుంది. వాస్తవానికి ఎవరికైనా గౌరవం ఇవ్వటం అంటే అది ఇవ్వటం కాదు, తీసుకోవటం అవుతుంది. గౌరవం ఇచ్చేవారు అందరి - మనస్సులో స్వతహాగానే గౌరవనీయంగా ఉంటారు.
బ్రహ్మాబాబాను చూశారు - ఆదిదేవ్ అయినా, డ్రామాలో ఫస్ట్ ఆత్మ అయినప్పటికీ పిల్లలకు గౌరవాన్ని ఇచ్చేవారు. తన కంటే ఎక్కువ గౌరవాన్ని పిల్లలకు ఆత్మల ద్వారా ఇప్పించేవారు. అందువలనే ప్రతి ఒకరి మనస్సులో బ్రహ్మాబాబా గౌరవనీ యంగా అయ్యారు. అంటే గౌరవాన్ని ఇచ్చినట్లా లేక తీసుకున్నట్లా? గౌరవం ఇవ్వటం అంటే ఇతరుల మనస్సులో, మనస్పూర్వక స్నేహం అనే బీజాన్ని నాటడం. ఎప్పుడైతే ఇతరాత్మలకు స్నేహంతో గౌరవాన్ని ఇస్తారో అప్పుడే విశ్వం ముందు విశ్వకళ్యాణకారి ఆత్మగా అనుభవం అవుతారు. 4. బాబా చూశారు వర్తమాన సమయంలో ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునే అవసరం ఉంది.
గౌరవం ఇచ్చేవారే విధాత ఆత్మగా కనిపిస్తారు. గౌరవం ఇచ్చేవారే బాప్దాదా యొక్క శ్రీమతాన్ని (శుభభావన, శుభకామన) పాలన చేసే ఆజ్ఞాకారి పిల్లలు. గౌరవం ఇవ్వటమే ఈశ్వరీయ పరివారంలో మనస్సు యొక్క ప్రేమ. గౌరవం ఇచ్చేవారు స్వమానంలో సహజంగానే స్థితులవ్వగలరు. ఎందువలన? ఏ ఆత్మలకు గౌరవం ఇస్తారో ఆ ఆత్మల ద్వారా ఏవైతే మనస్సు యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయో ఆ ఆశీర్వాదాల యొక్క ఖజానా సహజంగా మరియు స్వతహాగా స్వమానాన్ని స్మృతి ఇప్పిస్తుంది. అందువలనే బాప్దాదా నలువైపుల ఉన్న పిల్లలకు విశేష అండర్ లైన్ చేయిస్తున్నారు. -సన్మానం ఇచ్చే దాతగా అవ్వండి.
ఏ పిల్లవాడు ఎలా వచ్చినా, బలహీనంగా అయ్యి వచ్చినా, సంస్కారాలకు వశం అయి వచ్చినా, పాపాల బరువుతో వచ్చినా, కఠిన సంస్కారాలతో వచ్చినా ప్రతి ఒక పిల్లవాడిని బాప్దాదా ఏ దృష్టితో చూస్తారు? నా యొక్క ప్రియమైన, గారాభమైన బిడ్డ! ఈశ్వరీయ పరివారంలోని బిడ్డ అనే దృష్టితో చూసారు. సన్మానం ఇచ్చారు మరియు స్వమానధారి అయ్యారు. అదేవిధంగా తండ్రిని _ అనుసరించండి (ఫాలోఫాదర్). సహజంగా సర్వగుణ సంపన్నంగా అవ్వాలంటే సన్మాన దాతగా అవ్వండి. అర్థమైందా! సహజమే కదా? సహజమా లేక కష్టమా? టీచర్స్ ఏమని భావిస్తున్నారు, సహజమే కదా? .
కొందరికి సహజంగా, కొందరికి కష్టంగా ఉందా లేక అందరికీ ఇవ్వటం సహజమేనా? మీ టైటిల్ - సర్వ ఉపకారి. అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసేవారు. కనుక సర్వులకు ఉపకారం చేయాలనే దృష్టి, వృత్తి, స్మృతి ఉంటుందా? అని పరిశీలన, చేసుకోండి. ఇతరులకు ఉపకారం చేయటమే స్వ ఉపకారిగా అవ్వటం. కనుక ఏమి చేయాలి? గౌరవం ఇవ్వాలి కదా! దీని ద్వారా వేర్వేరు విషయాల ధారణ గురించి ఏదైతే శ్రమ చేస్తున్నారో ఆ శ్రమ నుండి విడిపించబడతారు. ఎందుకంటే బాప్దాదా చూస్తున్నారు. "సమయం యొక్క - వేగం చాలా తీవ్రం అవుతుంది.
సమయం ఎదురుచూస్తుంది, మీరందరు తయారవ్వాలి. సమయం యొక్క నిరీక్షణను సమాప్తి చేయాలి. ఏమి తయారీలు చేయాలి? మీ యొక్క సంపూర్ణత మరియు సమానత యొక్క వేగాన్ని తీవ్రం చేయాలి. చేస్తున్నాము అని కాదు, తీవ్రగతి ఉందా? అని వేగాన్ని పరిశీలించండి. స్నేహంతో క్రొత్త క్రొత్త పిల్లలు కూడా చేరుకున్నారు. బాప్దాదా క్రొత్త, క్రొత్త పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి! చాలా మంది వచ్చారు. బాబా ఇంటికి అంటే మీ ఇంటికి వచ్చారు శుభాకాంక్షలు. మంచిది.
కర్ణాటక యొక్క సేవా టర్న్ వారితో బాప్దాదా మాట్లాడుతున్నారు - కర్ణాటక వారు నిల్చోండి. సేవ యొక్క స్వర్ణిమ అవకాశం తీసుకున్నందుకు శుభాకాంక్షలు. మొదటి నెంబర్ తీసుకున్నారు. మొదటి నెంబర్ గానే ఉండాలి కదా! పురుషార్ధంలో విజయీగా అవ్వటంలో మొదటి నెంబర్ తీసుకునేవారు. రెండవ నెంబర్ తీసుకోకూడదు. మొదటి నెంబర్ తీసుకోవాలి. ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? ధైర్యం మీది మరియు వేల రెట్లు సహాయం బాబా నుండి లభిస్తుంది. మంచి అవకాశం తీసుకున్నారు. మీ యొక్క పుణ్యఖాతాను చాలా చాలా జమ చేసుకున్నారు.
కర్ణాటక వారు పెద్ద ప్రోగ్రామ్ చేసారా? చేసారా? ఎందుకు చేయలేదు? కర్ణాటక అన్నింటిలో మొదటి నెంబర్ తీసుకోవాలి. (బెంగుళూరులో చేస్తాము అని చెప్పారు) ఎవరైతే పెద్ద ప్రోగ్రామ్ చేసారో వారు చేతులెత్తండి! ఎన్ని ప్రోగ్రామ్లు జరిగాయి? (8-10 జరిగాయి) బాప్దాదా పెద్ద ప్రోగ్రామ్కి పెద్దగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎన్ని జోన్లు ఉన్నాయి! ప్రతి ఒక జోన్ వారు పెద్ద ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకంటే మీ పట్టణంలో ఇక ఎవరు నింద వేయరు. పెద్ద ప్రోగ్రామ్లో మీరు అద్వర్ టేజ్ మెంట్ కూడా మీడియా ద్వారా, పోస్టర్ ద్వారా ఇలా రకరకాల సాధనాల ద్వారా సేవ చేస్తున్నారు కనుక నింద కూడా తక్కువ అయిపోతుంది.
బాప్దాదా కి ఈ సేవ ఇష్టమే కానీ కానీ అంటే ఇంకా ఏదో ఉంది. పెద్ద ప్రోగ్రామ్ అయితే చేసారు దానికి శుభాకాంక్షలు కానీ ప్రతి ప్రోగ్రామ్ ద్వారా తక్కువలో తక్కువ 108 మాల తయారవ్వాలి. ఆ సేవ ఎక్కడ జరిగింది? తక్కువలో తక్కువ 108, ఎక్కువలో ఎక్కువ 16,000 తయారవ్వాలి. ఇంత శక్తిని ఉపయోగిస్తున్నారు. ఇంత ధనాన్ని ఉపయోగిస్తున్నారు కనుక దాని ఫలితంలో బాబా తక్కువలో తక్కువ 108 తయారవ్వాలి అనుకుంటు న్నారు. ఎందుకంటే వారి అడ్రస్ మీ దగ్గర ఉండాలి కదా! పెద్ద ప్రోగ్రామ్స్ ఎవరినైతే తీసుకువస్తారో వారి పరిచయం ఉంటుంది కదా వారిని మరలా సమీపంగా తీసుకురావాలి.
మేము చేసేసాము అని కాదు. దానికి ఫలం రావాలి కదా! పెద్ద ప్రోగ్రామ్ చేసే వారందరు బాబా కి ఈ ఫలితం చూపించాలి. వారు వేర్వేరు సెంటర్స్కి వెళ్ళినా, ఏ పట్టణంవారైనా అక్కడికి వెళ్ళాలి ఇలా వారు ఎక్కడికి వెళ్ళినా ఫలితం రావాలి. ఇలా చేస్తారు కదా! కొద్దిగా ధ్యాస పెడితే వచ్చేస్తారు, 108 రావటం ఏమీ కష్టం కాదు. తక్కువలో తక్కువ వారు' స్టూడెంట్ అయినా అవ్వాలి ఈ ఫలితం బాప్దాదా చూడాలనుకుంటున్నారు. సహయోగంలో ముందుకి రావాలి కనుక ఈ సీజన్లో బాప్దాదా ఈ ఫలితం చూడాలనుకుంటున్నారు. మంచిదే కదా? పాండవులు మంచిగా ఉన్నారా?
ఎవరు నెంబర్ వన్ గా అవుతారో చూస్తాను. ఎంత మందినైనా తయారుచేయండి కానీ తయారు చేయాలి. ప్రోగ్రామ్ అయితే చేసేస్తున్నారు కానీ తర్వాత సంపర్కంలోకి తీసుకు రావటంలో ధ్యాస తక్కువ అయిపోతుంది. తీసుకురావటం ఏమీ కష్టం' కాదు. బాప్దాదా పిల్లల యొక్క ధైర్యం చూసి సంతోషిస్తున్నారు. అర్థమైందా! మంచిది. ఇండోర్ హస్టల్లో మరియు సభలో ఉన్న కుమారీలతో బాప్దాదా మాట్లాడుతున్నారు - మంచిది. ఎంతమంది కుమారీలు వచ్చారో వారిలో సహయోగులుగా ఎంతమంది అవుతారు? కుమారీలు బాప్దాదా కుడిభుజంగా కాగలరు. స్వర్ణిమ అవకాశం ఉంది.
ఎంత మంది ఉన్నారు! ఎంత మంది కుమారీలు ఉన్నారో తెలుసా? వీరి పేర్లు నోట్ చేసుకోండి వీరిలో ఎంతమంది కుమారీలు కుడిభుజాలుగా అయ్యారు అనే ఫలితం చూడాలి. చేతులు ఎత్తండి! సెంటర్స్లో ఉండేవారు కాదు. కుడిభుజంగా అవుతాం అనే వారు చేతులెత్తండి. వీరికి వీడియో తీయండి. ఎందుకంటే మీకు తెలుసు కదా - సెంటర్స్ తెరవడానికి చాలా మంది ఆహ్వానిస్తున్నారు కానీ సహయోగులు' తక్కువగా ఉన్నారు. మిమ్మల్ని అడుగుతారు. అందువలన కుమారీలు త్వరత్వరగా సేవకి కుడిభుజులుగా అవ్వాలి. చిన్న చిన్న వారి విషయం వదిలేయండి కానీ ఎవరైతే సేవ చేస్తున్నారోవారు.
సమయం అనుసరించి తొందరగా తయారవ్వాలి. వరకట్నం తయారుగా ఉంది, సెంటరే కట్నం, వరుడు కూడా ఉన్నారు మరియు కట్నం కూడా తయారుగా ఉంది. కనుక మీరు తయారవ్వండి.. ఆ పెద్ద పెద్ద వారు రాగలరు కదా త్వరత్వరగా వచ్చేవారు చేతులు ఎత్తండి. ఎంతమంది కుమారీలు' చేతులు ఎత్తుతున్నారో చూడండి. వీడియో తీస్తున్నారు. మంచిది. శుభాకాంక్షలు, ముందుగానే - శుభాకాంక్షలు ఇస్తున్నాను. మంచిది. అన్నివైపుల నుండి స్నేహి పిల్లలు బాప్దాదా మనస్సులో జ్ఞాపకం చేస్తున్నారు.
ఉత్తరాలు' ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా ప్రియస్స్మతులు పంపించారు ఆ పిల్లలందరినీ బాప్దాదా దూరంగా చూడటం లేదు కానీ తన హృదయసింహాసనంలో చూస్తున్నారు. అన్నింటికంటే సమీపమైనది- హృదయం. ఎవరైతే మనస్సుతో ప్రియస్మృతులు పంపించారో వారికి బాప్దాదా ప్రియస్సృతులు పంపిచడమే కాదు తన హృదయసింహాసనంలో చూస్తున్నారు. తిరిగి జవాబు ఇస్తున్నారు. బదులు ఇస్తున్నారు దూరంగా కూర్చున్నప్పటికీ నెంబర్ వన్ తీవ్రపురుషార్థిభవవ! మంచిది - ఇప్పుడు అందరు ఒక సెకనులో, ఒక నిమిషం కూడా కాదు, ఒక సెకనులో, నేను ఫరిస్తా నుండి దేవతను - ఈ మనస్సు యొక్క డ్రిల్ అనుభవం చేసుకోండి.
ఇటువంటి డ్రిల్ (వ్యాయామం) రోజంతటిలో ఒక సెకనులో మాటిమాటికి చేయండి. ఎలా అయితే శారీరక వ్యాయామం శరీరాన్ని శక్తిశాలిగా చేస్తుందో అదేవిధంగా ఈ మనస్సు యొక్క వ్యాయామం మనస్సుని శక్తిశాలిగా చేస్తుంది. నేను ఫరిస్తాను, ఈ పాత ప్రపంచం, పాత దేహం, పాత దేహం యొక్క సంస్కారాలకు అతీతమైన ఫరిస్తాను అనే డ్రిల్ చేయాలి. మంచిది. నలువైపుల ఉన్నటువంటి అతి స్నేహి, సదా స్నేహ సాగరంలో లవలీనమై ఉండే పిల్లలకు, సదా సర్వశక్తుల యొక్క అధికారి శ్రేష్టాత్మలకు, సదా బాబా సమానంగా అయ్యే బాబాకి ప్రియమైన ఆ ఆత్మలకు, సదా స్వమానంలో ఉంటూ ప్రతి ఆత్మకు స్వమానాన్ని ఇచ్చేవారికి, సర్వుల ద్వారా గౌరవనీయంగా అయ్యే ఆత్మలకు, సదా సర్వ ఉపకారి ఆత్మలకు బాప్దాదా యొక్క మనస్సు యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.