రివైజ్ కోర్స్ మురళి 05-03-2004
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
బలహీన సంస్కారాల యొక్క సంస్కారం చేసి సత్యమైన హోలీ జరుపుకోండి అప్పుడే ప్రపంచం పరివర్తన అవుతుంది
ఈరోజు ఈ నలువైపులు ఉన్నటువంటి రాజపాలన పొందే పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ పాలన కోట్లలో కొద్దిమంది శ్రేష్టాత్మలకే లభిస్తుంది. బాప్దాదా ప్రతి పిల్లవాని మూడు రాజ్య సింహాసనాలను చూస్తున్నారు. ఈ మూడు సింహాసనాలు మొత్తం కల్పంలో ఈ సంగమయుగంలోనే లభిస్తాయి మరియు పిల్లలైన మీకే లభిస్తాయి. మూడు సింహాసనాలు కనిపిస్తున్నాయా? 1. కుటి సింహాసనం, దీనిపై ఆత్మ మెరుస్తూ ఉంది. 2. పరమాత్మ హృదయం * సింహాసనం. హృదయసింహాసనాధికారులు కదా! మరియు 3. భవిష్య విశ్వ సింహాసనం. హృదయసింహాసనాధికారి అవ్వటం ద్వారా అందరి కంటే భాగ్యవంతులుగా అయ్యారు.
పరమాత్మ హృదయసింహాసనం అదృష్టవంతులైన మీకే లభిస్తుంది. భవిష్య రాజ్య సింహాసనం అయితే లభిస్తుంది. కానీ అధికారిగా ఎవరు అవుతారు? ఈ సమయంలో స్వరాజ్యాధికారి అయిన వారే విశ్వరాజ్యాధికారిగా అవుతారు. స్వరాజ్యం లేకపోతే విశ్వరాజ్యం కూడా లభించదు. ఎందుకంటే ఈ సమయం యొక్క స్వరాజ్యాధికారం ద్వారానే విశ్వరాజ్యం లభిస్తుంది. విశ్వ రాజ్యం యొక్క సర్వ సంస్కారాలు ఈ సమయంలోనే తయారవుతాయి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు సదా స్వరాజ్యాధికారిగా అనుభవం చేసుకుంటున్నారా? భవిష్యరాజ్యం యొక్క మహిమ మీకు తెలుసు రాజ్యం ఉంటుంది. ఎన్నిసార్లు ఈ స్వరాజ్యం మరియు విశ్వ రాజ్యం చేశారు అనేది స్మృతి ఉందా?
ఎన్ని సార్లు ఈ రాజ్యం చేశారో జ్ఞాపకం ఉందా? స్పష్టంగా జ్ఞాపకం వస్తుందా? జ్ఞాపకం చేయటం ద్వారా జ్ఞాపకం వస్తుందా? నిన్న రాజ్యం చేశారు మరియు రేపు రాజ్యం చేయాలి. ఇలా స్పష్టంగా - స్మృతి ఉందా? ఈ స్పష్ట స్మృతి ఉన్న ఆత్మ ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారిగా ఉంటుంది. స్వరాజ్యాధికారులేనా? సదా ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? ఏమంటారు? సదా స్వరాజ్యాధికారులేనా? డబల్ విదేశీయుల యొక్క టర్న్ కదా! సదా స్వరాజ్యాధికారులేనా? పాండవులు సదా ఉంటున్నారా? సదా అనే మాట అడుగుతున్నారు బాబా ఎందుకు? ఈ ఒక జన్మలో, చిన్న జన్మలో ఒకవేళ సదా స్వరాజ్యాధికారి కాకపోతే 21 జన్మలు సదా స్వరాజ్యం ఎలా లభిస్తుంది?
21 జన్మల రాజ్యాధికారి అవ్వాలా లేక అప్పుడప్పుడు అవ్వాలా? ఏది మంజూరు చేస్తారు? సదా అవుతారా? అవుతారా సదా రాజ్యాధికారి? చేతులు ఊపండి మంచిది 21 జన్మలు రాజ్యాధికారి అవ్వాలి. రాజ్యాధికారి అంటే రాయల్ ప్యామిలీలో కూడా రాజ్యాధికారి అవ్వాలి. సింహాసనంపై అయితే కొద్దిమందే కూర్చుంటారు కదా కానీ అక్కడ సింహాసనాధికారికి ఎంత గౌవరం ఉంటుందో అంతగానే రాయల్ ఫ్యామిలీలో వారికి కూడా గౌరవం ఉంటుంది. వారిని కూడా రాజ్యాధికారి అంటారు. కానీ దానికి ఇప్పటి లెక్కతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు ఉంటే అక్కడ కూడా అప్పుడప్పుడు ఉంటుంది.
ఇప్పుడు సదా ఉంటే అక్కడ కూడా సదా ఉంటుంది. బాబా సంపూర్ణ అధికారం తీసుకోవటం అంటే వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క పూర్తి 21 జన్మలకు రాజ్యాధికారిగా అవ్వటం. డబల్ విదేశీయులు పూర్తి అధికారం తీసుకునేవారా లేక సగం లేక కొద్దిగా తీసుకునేవారా? ఏమి చేస్తారు? పూర్తి అధికారం తీసుకోవాలా? పూర్తిగా తీసుకోవాలి. ఒక జన్మ కూడా తక్కువ అవ్వకూడదు. అయితే ఏమి చేయాలి? ఏమి చేయాలి? బాప్దాదా ప్రతి ఒక పిల్లవాడిని సంపూర్ణ అధికారిగా చేస్తున్నారు. అయ్యారు కదా! పక్కాయేనా?' అవుతానూ, అవ్వమా అనే ప్రశ్న ఉందా? ఉందా? అవుతామా, లేదా అనే ప్రశ్న అప్పుడప్పుడు ' వస్తుందా? తయారవ్వల్సిందే.
పక్కాయేనా? తయారవ్వల్సిందే అనేవారు చేతులు ఎత్తండి. తయారవ్వల్సిందే కదా? మంచిది, ఇక్కడగా ఉన్న మీరందరు ఏ మాలలో మణులుగా అవుతారు? 108 మాలలో వారి అవుతారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరు 108లోకి వస్తారా? ఇక్కడైతే 1800 మంది ఉన్నారు. 108 మాలను పెంచమంటారా? మంచిది, 16 వేలు అయితే మంచిగా అనిపించదు. 16 వేలలోకి వెళ్తారా? వెళ్ళరు కదా! ఈ నిశ్చయం ఉందా మరియు నిశ్చితం అయిపోయింది అని ఉందా? మేము తయారవ్వకపోతే ఎవరు తయారవుతారు. 'అనే నషా ఉందా? మీరు తయారవ్వకపోతే ఇంకెవ్వరు తయారవ్వరు కదా!
మీరే తయారయ్యేవారు కదా! మీరే కదా చెప్పండి! పాండవులు మీరే తయారయ్యేవారు కదా! మంచిది, వెనుక ఉన్నవారు | తయారయ్యేవారము అని అనుకుంటున్నారు కదా! మీ నిశ్చయం చూసి బలిహారం అవుతున్నారు. ఓహో! ఓహో!! ప్రతి ఒక పిల్లవాడు ఓహో! ఓహో!! అని ఓహో! ఓహో!! అనిపించుకునేవారే కదా!' "ఓహో! ఓహో! (వాహ్. వాహ్) అంటున్నారా లేక ఎందుకు వై) అంటున్నారా? అప్పుడప్పుడు ఎందుకు వై) అంటున్నారా? లేదు కదా? 1. వై (ఎందుకు) 2. వాహ్ (ఓహో) 3. జై (ఏడవటం) మీరు ఓహో ! ఓహో!! అనేవారు కదా! బాబాకి డబల్ విదేశీయులంటే విశేషమైన గర్వం ఉంది. ఎందుకు?
భారతవాసీయుడైన బాబాని భారతదేశంలోకి పిలిచారు. కానీ డబల్ విదేశీయులంటే గర్వం ఎందువలన ఉంది అంటే డబల్ విదేశీయులు బాప్దాదాని తమ సత్యమైన ప్రేమ యొక్క బంధనలో బంధించారు. ఎక్కువ మంది సత్యతతో ఉంటారు. కొంతమంది దాచేస్తారు కానీ చాలామంది తమ యొక్క బలహీనతలను, పెడతారు. బాబాకి అన్నింటికంటే ఇష్టమైనది - సత్యత. అందువలనే సత్యతతో బాబా ముందు భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ (సత్యమే భగవంతుడు) అంటారు. అన్నింటికంటే ఇష్టమైన విషయం సత్యత. ఎందుకంటే ఎవరిలో సత్యత ఉంటుందో వారిలో స్వచ్చత ఉంటుంది.
స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉంటారు. అందువలనే బాప్దాదాని డబల్ విదేశీయుల సత్యమైన ప్రేమ అనే తాడు లాగుతూ ఉంది. కొంతమంది కొంచెం, కొంచెం కల్తీ చేస్తున్నారు. కానీ డబల్ విదేశీయులు మీ సత్యత యొక్క విశేషతను వదలకండి. సత్యతశక్తి ఒక లిఫ్ట్ వలె పనిచేస్తుంది. అందరికీ ' సత్యత ఇష్టమనిపిస్తుంది. పాండవులకు ఇష్టమనిపిస్తుందా? మధువనం వారికి కూడా ఇష్టమనిపిస్తుంది. మధువనం వారు చేతులు ఎత్తండి! దాదీ మిమ్మల్ని భూజాలు అంటారు కదా! మధువనం వారు, శాంతివనం వారు అందరు చేతులు ఎత్తండి! మధువనం వారికి సత్యత ఇష్టమనిపిస్తుందా?
ఎవరిలో సత్యత ఉంటుందో వారికి బాబాని స్మృతి చేయటం సహజం ' అవుతుంది. ఎందుకు? బాబా కూడా సత్యమైనవాడు కదా! ఎవరైతే సత్యంగా ఉంటారో వారికి తొందరగా బాబా స్మృతి వస్తుంది. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఒకవేళ ఇప్పటికీ స్మృతిలో శ్రమ అనిపిస్తుంది అంటే సూక్ష్మ సంకల్పంలో కానీ, స్వప్నంలో కానీ సత్యత యొక్క 15 లోపం ఉన్నట్లు అర్ధం చేసుకోండి. ఎక్కడ సత్యత ఉంటుందో అక్కడ సంకల్పం చేయగానే బాబా వెంటనే హాజరైపోతారు. అందువలనే బాప్దాదాకి సత్యత అంటే చాలా ఇష్టం.
బాప్దాదా పిల్లలందరికీ ఇదే సైగ చేస్తున్నారు. - 21 జన్మల పూర్తి వారసత్వం తీసుకోవాలంటే ఇప్పటి స్వరాజ్యాన్ని పరిశీలన చేసుకోండి. ఇప్పుడు మీరు ఎంతగా స్వరాజ్యాధికారి) అవుతారో అంతగానే అధికారం లభిస్తుంది. కనుక ఒకే రాజ్యం అని మహిమ ఉంది కదా రెండు రాజ్యాలు ఉండవు కదా! అలాగే వర్తమాన స్వరాజ్యం యొక్క స్థితిలో సదా ఒకే రాజ్యం ఉంటుందా?? అనేది పరిశీలన చేసుకోండి. స్వరాజ్యం ఉందా లేక అప్పుడప్పుడు పరరాజ్యం కూడా నడుస్తుందా? అప్పుడప్పుడు ఒకవేళ మాయా రాజ్యం ఉంటే పరరాజ్యం అంటారా లేక స్వరాజ్యం అంటారా? సదా ఒక రాజ్యం ఉంటుందా, పరాధీనం అవ్వటం లేదు కదా? అప్పుడప్పుడు మాయ రాజ్యం, అప్పుడప్పుడు స్వ రాజ్యం నడుస్తుందా?
ఇలా నడుస్తుంది అంటే ఇప్పుడు ఇంకా సంపూర్ణ వారసత్వం లభించలేనట్లే, ఇప్పుడింకా లభిస్తుంది. కనుక ఒకే రాజ్యం ఉందా? అని పరిశీలన చేసుకోండి. ఒకే ధర్మం అంటే ధారణ. విశేషమైన ధారణ ఏమిటి? పవిత్రత యొక్క ధారణ| ఉండాలి. ఒకే ధర్మం అంటే సంకల్పం, స్వప్నంలో కూడా పవిత్రత ఉందా? సంకల్పంలో కానీ స్వప్నంలో కానీ ఒకవేళ అపవిత్రత యొక్క ఛాయ ఉంటే ఏమంటారు? ఒకే ధర్మం ఉన్నట్లా? పవిత్రత సంపూర్ణంగా ఉందా? పరిశీలన చేసుకోండి. ఎందుకు? సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. సమయం వేగంగా వెళ్తున్నప్పుడు స్వయం నెమ్మదిగా వెళ్తే గమ్యానికి చేరుకోలేరు. కదా!
అందువలనే మాటిమాటికి పరిశీలన చేసుకోండి. ఒకే రాజ్యం ఉందా? ఒకే ధర్మం ఉందా? లా అండ్ ఆర్డర్ ఉందా? లేక మాయ తన యొక్క ఆర్డర్పై నడిపిస్తుందా? పరమాత్మ పిల్లలు శ్రీమతం యొక్క లా అండ్ ఆర్డర్లో నడిచేవారు కానీ మాయ యొక్క ఆర్డర్లో నడిచేవారిగా ఉండకూడదు. కనుక పరిశీలన చేసుకోండి - భవిష్యత్తు యొక్క అన్ని సంస్కారాలు ఇప్పుడే కనిపించాలి. ఎందుకంటే అవి ఇప్పుడే నింపుకోవాలి. అక్కడ నింపుకోవటం కాదు, ఇక్కడే నింపుకోవాలి. సుఖం ఉందా? శాంతి ఉందా? సంపత్తివాన్ గా ఉన్నారా? సుఖం అనేది ఇప్పటి సాధనాల ఆధారంగా లేదు కదా?
అతీంద్రియసుఖం ఉందా? సాధనాలు ఇంద్రియాలకు ఆధారం. అతీంద్రియసుఖం సాధనాల ఆధారంగా లభించదు. అఖండశాంతి ఉందా? ఖండితం అవ్వటంలేదు "కదా? ఎందుకంటే సత్యయుగీ రాజ్యం యొక్క మహిమ ఏమిటి? అఖండ శాంతి, స్థిర శాంతి ఉంటుంది అని సంపన్నత ఉందా? సంపత్తి ద్వారా ఏమి వస్తుంది? సంపన్నత వస్తుంది. సర్వ సంపత్తి ఉందా? గుణాలు, శక్తులు, జ్ఞానం ఇవే మీ సంపత్తి (సంపద). వారి యొక్క గుర్తు ఏమిటి? సంపత్తితో సంపన్నంగా ఉన్న వారి యొక్క గుర్తు ఏమిటి? సంతుష్టంగా ఉంటారు. సర్వ ప్రాప్తులకు ఆధారం - సంతుష్టత.
అసంతుష్టత అప్రాప్తికి సాధనం. కనుక పరిశీలన చేసుకోండి. ఒక విశేషత కూడా తక్కువ అవ్వకూడదు. ఇంతగా పరిశీలన చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారా? మొత్తం ప్రపంచం ఇప్పుడు మీ సంస్కారాల ద్వారానే తయారవుతుంది. ఇప్పటి సంస్కారాలు భవిష్య ప్రపంచాన్ని తయారుచేస్తాయి. మీరందరు ఏమంటున్నారు? మీరెవరు? విశ్వపరివర్తకులు కదా! అవునా? విశ్వపరివర్తకులేనా? విశ్వపరివర్తనకు ముందు స్వ పరివర్తన ఉండాలి. కనుక ఈ - అన్ని సంస్కారాలు మీలో పరిశీలన చేసుకోండి. దీని ద్వారా నేను 108 మాలలలోకి వస్తానా లేక ముందు వస్తానా, వెనుక వస్తానా అనేది అర్ధం చేసుకోండి.
ఈ పరిశీలన అనేది ఒక దర్పణం, ఈ దర్పణంలో మీ యొక్క వర్తమానం మరియు భవిష్యత్తుని చూసుకోండి. చూసుకుంటున్నారా? ఇప్పుడు హోలీ జరుపుకునేటందుకు వచ్చారు కదా! హోలీ జరుపు కునేటందుకు వచ్చారు, మంచిది. హోలీ యొక్క అర్ధం వర్ణన చేశారు కదా! చేశారు కదా? బాప్దాదా ఈరోజు విశేషంగా డబల్ విదేశీయులకు చెప్తున్నారు, డబల్ విదేశీయులు కూడా వెంట ఉన్నారు. ఇది చాలా మంచిగా ఉంది. మధువనం వారితో కలిసి చెప్తున్నాను. ఎవరైతే వచ్చారో బొంబాయి నుండి వచ్చినా, ఢిల్లీ నుండి వచ్చినా కానీ ఈ సమయంలో అందరు మధువనం నివాసీయులే డబల్ విదేశీయులు - కూడా.
ఈ సమయంలో ఎక్కడ ఉన్నారు? మధువనం నివాసీయులు కదా! మధువనం నివాసీయులుగా అవ్వటం మంచిది కదా! పిల్లలందరిలో ఇక్కడ ఎదురుగా కూర్చున్న పిల్లలైనా, నలువైపుల తమ, తమ స్థానాలలో కూర్చున్న పిల్లలైనా అందరిలో బాప్దాదా ఒక పరివర్తన కోరుకుంటున్నారు అది ఏమిటో ధైర్యం ఉంటే బాప్దాదా చెప్తారు. ధైర్యం ఉందా? దైర్యం - ఉందా? ఉందా ధైర్యం? చేయవలసి ఉంటుంది. చేతులు ఎత్తాము అయిపోయింది ఇలా కాదు, చేయాలి. చేతులు ఎత్తడం సహజమే కానీ మనస్సుతో ఎత్తాలి. ఈరోజు కేవలం ఈ చేతులు ' ఎత్తడం కాదు, మనస్సుతో ఎత్తాలి.
నా డబల్ విదేశీయులు సమీపంగా కూర్చున్నారు కదా! దగ్గరవారికి మనస్సులోని విషయాలు చెప్తారు కదా! ఎక్కువమందికి బాప్దాదాతో, సేవతో చాలా ప్రేమ ఉంది. బాబా యొక్క ప్రేమ లేకుండా ఉండలేకపోతున్నారు మరియు సేవ లేకుండా కూడా ఉండలేకపోతున్నారు. ఈ సర్టిఫికెట్ చాలా మందికి మంచిగా ఉంది. బాప్దాదా నలువైపుల చూస్తున్నారు. కానీ.... కానీ అనే మాట ' "వస్తుంది. చాలా మంది నుండి ఇదే ధ్వని వస్తుంది ఏదోక పాత సంస్కారం అది కావాలనుకోవటంలేదు కానీ ఆ పాత సంస్కారం మాటిమాటికి ఇప్పటికీ ఆకర్షితం చేస్తుంది. ' ఉన్నా హోలీ జరుపుకునేటందుకు వచ్చారు.
హోలీ యొక్క అర్ధం ఏమిటంటే జరిగిపోయిందేదో' జరిగిపోయింది అని. హోలీ అంటే అయిపోయింది. కొద్దిగా ఏ సంస్కారం ఉన్నా 5 శాతం 10 శాతం ఉన్నా, 50 శాతం ఉన్నా ఎంత ఉన్నా తక్కువలో తక్కువ 5 శాతం ఉన్నా ఈ రోజు సంస్కారాల యొక్క హోలీ జరుపుకోండి. సంస్కారం అనేది మధ్యమధ్యలో మనల్ని అలజడి చేస్తుంది ఇలా అందరు భావిస్తున్నారు కదా? హోలీ అంటే ఒకటి - అంటిస్తారు, రెండు రంగులు జల్లుతారు. రెండు రకాలైన హోలీ ఉంటుంది. మరియు హోలీ అంటే జరిగిపోయిందేదో' జరిగిపోయింది అని అర్ధం.
బాబా ఇదే కోరుకుంటున్నారు - ఈ రోజు ఏవైతే పాత సంస్కారాలు ఉండిపోయాయో వాటి కారణంగా ప్రపంచం కూడా పరివర్తన అవ్వటంలేదో ఆ బలహీన సంస్కారాలను అంటించాలి అంటే అంతిమ సంస్కారం చేయాలి. అంటించడాన్ని కూడా సంస్కారం అంటారు కదా! మనుష్యులు చనిపోయినప్పుడు కూడా అంతిమ సంస్కారం ద్వారా సదాకాలికంగా ' సమాప్తి చేస్తారు కదా! ఈరోజు సంస్కారాలను కూడా సంస్కారం చేస్తారా? చేస్తారా? మీరు అంటారు కదా ఆ సంస్కారం కావాలి అనుకోవటంలేదు కానీ ఆ సంస్కారం వస్తుంది ఏమి చేయము? అని.
ఇలా ఆలోచిస్తున్నారా? మంచిది, సరే అది పొరపాటుగా మీ దగ్గరికి వచ్చింది, * ఒకవేళ ఎవరికైనా ఇచ్చేసిన వస్తువు తిరిగి మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? జాగ్రత్తగా దానిని బీరువాలో పెట్టి ఉంచుతారా? ఒకవేళ వచ్చినా కానీ మనస్సులో పెట్టుకోకూడదు. ఎందుకంటే మనస్సులో బాబా కూర్చున్నారు కదా! బాబాతో పాటు ఆ సంస్కారాలను కూడా ఉంచుకుంటే మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు కదా! అందువలన ఒకవేళ పొరపాటుగా వచ్చినా కానీ బాబా, బాబా అనండి. అంతే అది సమాప్తి అయిపోతుంది. బిందువు పెట్టగలరు. బాబా ఎవరు? బిందువు కదా!
కనుక మనస్సుతో బాబా అంటే బిందువు పెట్టగలరు. అలా కాకుండా బాబా తీసుకో, తీసుకో అని మీ దగ్గరే ఉంచుకుని బాబాని జ్ఞాపకం చేస్తే ఎలా తీసుకుంటారు? మొదట మీరు దానిని మీ వస్తువుగా భావించకుండా ఉంటే అప్పుడు బాబా దానిని తీసుకుంటారు. 'ఇతరుల వస్తువులను తీసుకునేవారిని ఏమంటారు? హోలీ జరుపుకుంటారా? జరుపుకుంటారా? హోలీ అంటే అయిపోయింది. ధృఢసంకల్పం పెట్టుకోండి, ఇలా మాటిమాటికి తొలగించుకుంటూ గా ఉంటే అది తొలగిపోతుంది. లోపల పెట్టుకోకండి. ఏమి చేయము, ఎలా చేయము, తొలగటంలేదు! అనుకోవద్దు. తొలగించుకోవలసిందే. ధృఢసంకల్పం చేస్తారా?
ఎవరైతే చేస్తారో వారు ఇప్పుడు 'చేతులు ఎత్తండి! పైపైకి ఎత్తటం కాదు, మనస్సుతో ఎత్తాలి. (కొంతమంది ఎత్తటం లేదు) ఇక్కడ ఎత్తటం లేదు. చాలా మంచిది, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఒకవైపు ఎడ్వాన్స్పర్టీ వారు మాటిమాటికి బాబాని అడుగుతున్నారు - ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? అని. రెండవవైపు ఇప్పుడు ప్రకృతి కూడా పరివర్తన చేయండి అని అడుగుతుంది. బ్రహ్మాబాబా కూడా పరంధామం యొక్క ద్వారాన్ని ఎప్పుడు తెరుస్తారు? అని అడుగుతున్నారు. వెంట వెళ్ళాలి కదా! ఇక్కడే ఉండిపోరు కదా! వెంట వెళ్ళాలి, వెంట వెళ్ళి గేట్ తెరుస్తారు.
తాళం బ్రహ్మాబాబా తీస్తారు కానీ వెంట ఉంటారు కదా! ఇప్పుడు ఇది పరివర్తన చేయండి. అసలు దానిని రానివ్వకూడదు. అది మన వస్తువు కాదు, రావణుని వస్తువు ఎందుకు పెట్టుకుంటున్నారు! ఇతరుల వస్తువు ఎవరైనా ఉంచుకుంటారా? కనుక ఇది ఎవరిది? రావణుడివి కదా! రావణుని వస్తువులు మీరెందుకు ఉంచుకుంటున్నారు? ఉంచుకుంటారా? ఉంచుకోకూడదు కదా? పక్కాయేనా? పక్కాయేనా? మంచిది. రంగుల యొక్క హోలీ భలే జరుపుకోండి కానీ మొదట ఈ హోలీ జరుపుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, మీ యొక్క మహిమ - దయా స్వరూపులు. కదా?
మీరు దయాస్వరూప దేవీ దేవతలు కదా? కదా? దయ రావటంలేదా? మీ యొక్క సోదరీ, సోదరులు ఇంత దుఃఖంతో ఉన్నారు కదా వారిని చూసి మీకు దయ రావటంలేదా? దయ వస్తుందా? కనుక సంస్కారాలను. మార్చుకోండి అప్పుడు ప్రపంచం కూడా పరివర్తన అయిపోతుంది. సంస్కారాలను మార్చుకోనంత వరకు ప్రపంచాన్ని పరివర్తన చేయలేరు. కనుక ఏమి చేస్తారు?. ఈరోజు శుభవార్త విన్నారు అందరికీ దృష్టి ఇవ్వాలి అని. మంచి విషయమే. బాప్దాదా పిల్లల యొక్క ఆజ్ఞాకారియే కానీ ... కానీ అనే శబ్దం విని నవ్వుతున్నారు, భలే నవ్వండి. దృష్టి ద్వారా సృష్టి మారుతుంది అని చెప్తారు.
కనుక ఈరోజు యొక్క దృష్టి ద్వారా సృష్టిని పరివర్తన చేయాలి. ఎందుకంటే బాప్దా చూస్తున్నారు, సంపన్నత లేక ఏదైతే ప్రాప్తి లభిస్తుందో దాని యొక్క అభ్యాసం చాలా సమయం నుండి ఉండాలి. సమయానికి అయిపోతుంది అనుకోకండి. చాలా సమయం యొక్క రాజ్యభాగ్యం తీసుకోవాలంటే చాలా సమయం సంపన్నత కూడా ఉండాలి. మంచిగా ఉన్నారు కదా? డబల్ విదేశీయులు సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు శాంతివనం యొక్క బేహద్ ఇంటిలో ఉన్నారు కదా! ప్రతి స్థానానికి లాభం ఉంది. పైన స్థానానికి లాభం ఉంది, శాంతివనానికి లాభం ఉంది. ఇక్కడ పరివారానికి, దాదీలకు సమీపంగా ఉన్నారు మరియు అక్కడ బాప్దాదా యొక్క కర్మభూమికి సమీపంగా ఉంటారు. కానీ మంచిగా అనిపిస్తుందా లేక లేదా?
పైన స్థానం కొంచెంగా జ్ఞాపకం వస్తుందా? బాబాకి ఇదే ఆనందంగా ఉంది డబల్ విదేశీయులు ఒకే సమయంలో చాలా సంఖ్యను పెంచుతున్నారు. సంఖ్య కారణంగా పైన ఉండలేకపోతున్నారు కదా! సంఖ్య పెంచడం సంతోషం యొక్క విషయమే - కదా! మరియు ఒకే సమయంలో అందరు ఒక చోట ఉండటం ఇది కూడా ఒక అనుభవం కదా! మరియు అందరికంటే ముందు మధువనం నివాసీయులు డబల్ విదేశీయులకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే డబల్ విదేశీయుల సమయంలో మధువనం నివాసీయులకు అవకాశం ఇచ్చారు. మధువనం వారు చప్పట్లు కొట్టండి. మధువనం వారు ఎంత సంతోషపడుతున్నారో. చూడండి, లేకపోతే పూర్తి సీజన్ లో మధువనం నివాసీయులకు అవకాశం ఎక్కడ లభించింది, డబల్ విదేశీయులు అవకాశం ఇచ్చారు కనుక బాప్దాదా కూడా ధన్యవాదాలు ఇస్తున్నారు.
మాతలతో - మాతలు చాలా తెలివైనవారు. బాప్దాదా మాతలకు ముందుకు వెళ్ళే అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారు కనుక చాలా, చాలా శుభాకాంక్షలు. చాలా మంచి శక్తి అవతారాలుగా ఉన్నారు. మీ సంఘటనను ఇంకా పెంచుకోండి. ఎక్కడైనా మాతల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. డబల్ విదేశీయులలో ఇప్పుడు కూడా మాతల సంఖ్య ఎక్కువగా ఉంది, భారతవాసీయులలో కూడా మాతల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం కల్పంలో ఇప్పుడు మీకు అవకాశం లభించింది కనుక మీ అవకాశాన్ని మంచిగా తీసుకున్నారు. (సెంటర్ నివాసీయులు మరియు ఎన్.సి.ఓ. మీటింగ్ యొక్క సోదరీ సోదరులతో మాట్లాడుతున్నారు) చాలా మంచిది.
సేవాకేంద్ర నివాసీయులు అంటే పుణ్యం యొక్క ఖాతా పెంచుకునే వారు. ఎవరు వచ్చినా వారికి బాబా యొక్క పరిచయం చెప్పి బాబా వారిగా చేస్తున్నారు ఈ పుణ్యం జమ అయిపోతుంది. కనుక సేవాకేంద్ర నివాసీయులు సదా మిమ్మల్ని మీరు నేను పుణ్యాత్మను, పుణ్యం జమ చేసుకోవడానికి ఆ అవకాశం లభించింది అని భావించాలి. ఎంతెంత పుణ్యం జమ అవుతూ ఉంటుందో అంతగా కొద్దిగా స్వప్నంలో అయినా కొద్దిగా పాపరేఖ ఏదైనా ఉండిపోయినా అది సమాప్తి అయిపోతుంది. - ఇది పుణ్యాత్మల యొక్క గ్రూప్. కుమారులు, పాండవులు కూడా సేవకు నిమిత్తం అయ్యారు.
ఇది మంచి అవకాశం లభించింది. సదా సేవను పెంచడానికి నిమిత్తంగా అయ్యి వచ్చారు. పాండవులు, దాని శక్తులు ఇద్దరికీ బాప్దాదా సేవ యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. మంచిది. చిన్న పిల్లలు కూడా ఏపై అద్భుతం చేసి చూపిస్తారు. పెద్దవారు చేయలేని సేవ చిన్న పిల్లలు చేస్తారు. ఎందుకంటే పిల్లలపై 'అందరికీ ప్రేమ ఉంటుంది కదా! చాలా మంచిగా చేశారు, చాలా మంచిది. మంచిది, బాప్దాదా చెప్పిన విషయం మర్చిపోకండి, జ్ఞాపకం ఉంచు కోండి. ఇప్పుడు పాత సంస్కారాల యొక్క సమాప్తి సమారోహం జరుపుతారు. ఆ సమారోహానికి మిమ్మల్ని పిలుస్తాను కానీ ఎవరైతే చేస్తారో వారినే పిలుస్తారు. మంచిది.
నలువైపుల ఉన్నటువంటి మూడు సింహాసనాధికారి పిల్లలకు, విశేషాత్మలకు, సదా "స్వరాజ్యాధికారి విశేషాత్మలకు, సదా దయాహృదయులుగా అయ్యి ఆత్మలకు సుఖం, శాంతి యొక్క బిందువు ఇచ్చే మహాదాని ఆత్మలకు, సదా ధృడత మరియు సఫలత యొక్క అనుభవం చేసుకునే దూబా సమానమైన ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియసృ్మతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.