రివైజ్ కోర్స్ మురళి 20-03-2004
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
ఈ సంవత్సరం విశేష జీవన్ముక్తి సంవత్సరంగా జరుపుకోండి ఏకత మరియు ఏకాగ్రత ద్వారా బాబాని ప్రత్యక్షం చేయండి
ఈరోజు స్నేహసాగరుడైన బాప్దాదా నలువైపుల ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు. బాబాకి కూడా పిల్లలపై మనస్పూర్వక అవినాశి స్నేహం ఉంది మరియు పిల్లలకు కూడా బాబాపై మస్పూర్వక స్నేహం ఉంది. ఈ పరమాత్మ స్నేహం, మనస్సు యొక్క స్నేహం కేవలం బాబా మరియు పిల్లలకే తెలుసు. బ్రాహ్మణాత్మలైన మీరే పరమాత్మ స్నేహానికి పాత్రులు. భక్తి ఆత్మలు పరమాత్మ స్నేహం కొరకు దాహంతో ఉన్నారు, పిలుస్తున్నారు. భాగ్యవాన్ బ్రాహ్మణాత్మలైన మీరు పరమాత్మ ప్రేమకు పాత్రలుగా అయ్యారు. బాప్దాదాకి తెలుసు పిల్లలకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకు?
ఎందుకంటే ఈ సమయంలోనే సర్వఖజానాలకు యజమాని అయిన బాబా ద్వారా సర్వ ఖజానాలు లభిస్తున్నాయి. ఈ ఖజానాలు కేవలం ఈ ఒక జన్మకే కాదు కానీ అనేక జన్మల వరకు అవినాశిగా మీ వెంట వస్తాయి. బ్రాహ్మణాత్మలైన మీరు ప్రపంచం వారి వలె ఖాళీ చేతులతో వెళ్ళరు, సర్వ ఖజానాలతో ఉంటారు. ఇటువంటి అవినాశి ఖజానాల ప్రాప్తి యొక్క నషా ఉంటుంది. కదా! మరియు పిల్లలందరు అవినాశి ఖజానాలను జమ చేసుకున్నారు కదా! జమ యొక్క నషా, జమ యొక్క సంతోషం సదా ఉంటుంది కదా! ప్రతి ఒక పిల్లవాని ముఖంలో ఖజానాల జమ యొక్క మెరుపు కనిపిస్తుంది.
బాబా ద్వారా ఏమి ఖజానాలు లభించాయో తెలుసు కదా? ఎప్పుడైనా మీ జమ ఖాతాను పరిశీలన చేసుకుంటున్నారా? బాబా అయితే పిల్లలందరికీ ప్రతి ఖజానా అఖండంగా ఇస్తారు. కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ ఇవ్వటంలేదు. ప్రతి పిల్లవాడు అఖండమైన అనంతమైన, అవినాశి ఖజానాలకు యజమానులు. పిల్లలుగా అవ్వటం అంటే ఖజానాలకు యజమానిగా అవ్వటం. బాప్దాదా ఎన్ని ఖజానాలు ఇచ్చారు అనేది చూస్కోండి.
1. అన్నింటికంటే మొదటి ఖజానా - జ్ఞానధనం. అందరికీ జ్ఞానధనం లభించిందా? లభించిందా లేక లభించాలా? మంచిది, జమ కూడా చేసుకున్నారా? లేక కొద్దిగా జమ చేసుకుని కొద్దిగా పోగొట్టుకున్నారా? జ్ఞానధనం అంటే తెలివైన వారిగా అయ్యి, త్రికాలదర్శిగా అయ్యి కర్మ చేయాలి. నాలెడ్జుల్ అవ్వాలి. ఫుల్ నాలెడ్జ్ మరియు మూడు కాలాల యొక్క జ్ఞానాన్ని అర్ధం చేసుకుని జ్ఞానధనాన్ని కార్యంలో ఉపయోగించాలి. ఈ జ్ఞాన ఖజానాను ప్రత్యక్ష జీవితంలో, ప్రతి కార్యంలో ఉపయోగించడం ద్వారా విధి ద్వారా సిద్ధి లభిస్తుంది. కొన్ని బంధనాల నుండి ముక్తి జీవన్ముక్తి లభిస్తుంది. అనుభవం చేసుకుంటున్నారా?
సత్యయుగంలోనే జీవన్ముక్తి లభిస్తుంది అని కాదు, ఇప్పుడు కూడా అనగా ఈ సంగమయుగీ జీవితంలో కూడా అనేక హద్దు యొక్క బంధనాలు నుండి ముక్తి లభిస్తుంది. జీవితం బంధనముక్తంగా అవుతుంది. ఎన్ని బంధనాల నుండి ఫ్రీ అయ్యారో తెలుసు కదా! ఎన్ని రకాలైన హా! హా!! కారాల నుండి ముక్తి అయ్యారు! మరియు సదా హా! హా!! కారాలు సమాప్తి అయ్యి, ఓహో! ఓహో!! అంటున్నారు. ఒకవేళ ఏదైనా విషయంలో కొద్దిగా అయినా నోటినుండి కాకపోయినా సంకల్పంలో అయినా, స్వప్నంలో అయినా మనస్సులో హా, హా కారాలు వస్తే జీవన్ముక్తులుగా కాలేనట్లే. ఓహో! ఓహోహో!! ఇలా ఉన్నారా?
మాతలు హా, హా కారాలు చేయటంలేదు కదా? లేదు కదా? అప్పుడప్పుడు చేస్తున్నారా? పాండవులు చేస్తున్నారా? భలే నోటితో అనకపోయినా కానీ సంకల్పంలో అయినా ఏ విషయంలో అయినా వస్తే ఎగరలేరు. హా! అంటే బంధన. ఎగిరేకళ అంటే జీవన్ముక్తులుగా బంధన ముక్తులుగా ఉండటం. కనుకు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఏమైనా బంగారపు లేదా వజ్రపు త్రాళ్ళతో బంధించబడి ఉంటే, బ్రాహ్మణాత్మలు స్వయం బంధనముక్తులుగా కానంత వరకు సర్వాత్మల కొరకు ముక్తి యొక్క గేట్ తెరవలేరు. మీరు బంధనముక్తులుగా అవ్వటం ద్వారా సర్వాత్మల కొరకు ముక్తి యొక్క గేట్ (ద్వారం) తెరవగలరు.
గేట్ తెరిచేటువంటి మరియు సర్వాత్మలను దుఃఖం, అశాంతి నుండి ముక్తి చేసే బాధ్యత మీపై ఉంది. కనుక ఎంత వరకు మీ భాద్యత నిలుపుకుంటున్నారో పరిశీలన చేసుకోండి. మీరందరు బాప్దాదాతో పాటుగా విశ్వపరివర్తన కార్యం యొక్క బాధ్యత తీసుకున్నారు. బాధ్యతధారులే కదా! "బాబా కావాలనుకుంటే ఏదైనా చేయగలరు. కానీ బాబాకి పిల్లలపై ప్రేమ ఉంది, కనుక ఒంటరిగా చేయాలనుకోవటం లేదు”. పిల్లలైన మీరందరు బాబా వెంటే అవతరించారు. శివరాత్రి జరుపుకున్నారు కదా! ఎవరిది జరుపుకున్నారు? కేవలం బాప్దాదా ఒక్కరిదే జరిపారా? మీ అందరిదీ కూడా జరుపుకున్నారు కదా!
బాబాకి ఆది నుండి అంతిమం వరకు సహయోగులు. ఆది నుండి అంతిమం వరకు సహయోగులం అనే నషా ఉంటుందా? భగవంతునికి సహయోగులు. కనుక బాప్దాదా ఈ సంవత్సరం యొక్క సీజన్ అంతిమంలో పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్నారో చెప్పమంటారా? చేయవలసి ఉంటుంది. కేవలం వినటం కాదు, చేయవలసి ఉంటుంది. టీచర్స్ సరేనా? టీచర్స్ చేతులు ఎత్తండి? టీచర్స్ విసనకర్రలతో విసురుకుంటున్నారు, వేడిగా అనిపిస్తుందా! మంచిది, టీచర్స్ అందరు మీరు చేసి మరియు చేయిస్తారా? మంచిది, విసురుకుంటున్నారు మరియు చేతులు కూడా ఊపుతున్నారు. చాలా మంచిది.
బాప్దాదా ఈ సీజన్ యొక్క సమాప్తి సమారోహంలో ఒక క్రొత్త రకమైన దీపావళి జరుపుకోవాలనుకుంటున్నారు. అర్థమైందా! మీరందరు దీపావళి జరుపుకోవడానికి తయారుగా ఉన్నారా? ఎవరు తయారుగా ఉన్నారో వారు చేతులు ఎత్తండి! అలాగే అనటం కాదు. బాప్దాదాని సంతోషం చేయటం కోసం చేతులు ఎత్తడం కాదు, మనస్సుతో ఎత్తాలి. బాప్దాదా తన మనస్సు యొక్క ఆశలను సంపన్నం చేసే దీపం వెలగాలి అని కోరుకుంటున్నారు. బాప్దాదా ఆశాదీపాల దీపావళి జరుపుకోవాల నుకుంటున్నారు. ఏమి దీపావళి జరుపుకోవాలో అర్థమైందా? స్పష్టమైందా?
పాండవులకు స్పష్టమైందా? బాప్దాదా ఆశల యొక్క దీపం ఏమిటి? గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం సీజన్ కూడా సమాప్తి అయిపోయింది. బాప్దాదా చెప్పారు - మీరందరు ఏమి సంకల్పం చేశారో జ్ఞాపకం ఉందా? కొంతమంది ఆ సంకల్పాన్ని సంకల్పం వరకు పూర్తి చేశారు, కొంతమంది సంకల్పాన్ని సగం పూర్తి చేశారు, కొంతమంది ఆలోచిస్తూ, ఆలోచన వరకు ఉండిపోయారు. క్రొత్త విషయమేమి కాదు, పాతవిషయమే - స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన. విశ్వం యొక్క విషయం వదిలేయండి, బాప్దాదా స్వ పరివర్తన ద్వారా బ్రాహ్మణ పరివారం యొక్క పరివర్తన చూడాలను కుంటున్నారు.
ఇప్పుడిక వీరు ఇలా ఉన్నారు, వారు అలా ఉన్నారు ఇలాంటి విషయాలు బాబా వినాలనుకోవటం లేదు. వీరు మారితే నేను మారతాను, వీరు చేస్తే నేను చేస్తాను .... అని అనుకోవద్దు దీనిలో విశేషంగా బ్రహ్మాబాబా పిల్లలకు చెప్తున్నారు నా సమానంగా అర్జునులుగా అవ్వండి. దీనిలో మొదట నేను అనుకోండి, ఫలానా వారు అని కాదు. నేను కళ్యాణకారిని అని భావించాలి. హద్దు యొక్క నేను అనేది క్రిందకి పడేస్తుంది. దీనిలో ముందు నేను అనాలి. ఎవరు చేస్తారో వారే అర్జునులు అనే మహిమ ఉంది కదా! అర్జునుడు అంటే నెంబర్ వస్. నెంబరువారీ కాదు నెంబర్వన్.
మీరు మొదటి నెంబర్ అవ్వాలనుకుంటున్నారా లేక రెండవ నెంబర్గా అవ్వాలనుకుంటున్నారా? కొన్ని కార్యాలలో బాప్దాదా చూస్తున్నారు, నవ్వు వచ్చే విషయమే, పరివారం యొక్క విషయం చెప్తున్నాను. పరివారం కూర్చున్నారు కదా! బాప్దాదా దగ్గరికి సమాచారం వస్తుంది. కేవలం విశేషాత్మల కొరకు కొన్ని ప్రోగామ్స్ జరుగుతాయి అటువంటి సమయాలలో బాప్దాదా దగ్గరికి కొన్ని సంకల్పాలు చేరుకుంటున్నాయి, దాదీల దగ్గరికీ కూడా చేరుకుంటున్నాయి ఎందుకంటే సాకారంలో దాదీలు ఉంటారు కదా! బాప్దాదా దగ్గరికి ఏమి సంకల్పాలు చేరుకుంటున్నాయి?
ఈ కార్యక్రమంలో నా పేరు కూడా ఉండాలి, నేను మాత్రం ఏమి తక్కువ, నా పేరు ఎందుకు లేదు? ఇలా సంకల్పాలు వస్తున్నాయి. అదేవిధంగా బాబా చెప్తున్నారు - అర్జునులుగా అయ్యే విషయంలో కూడా మీ పేరు ఎందుకు ఉండకూడదు? ఉండాలి కదా? మహారధులు కూర్చున్నారు కదా చెప్పండి! మీ పేరు ఉండాలా? బ్రహ్మాబాబా అన్నీ చేసి చూపించారు, వారు చేయటంలేదు, వీరు చేయటం లేదు అని ఎవ్వరినీ చూడలేదు. మొదట నేను అనుకునేవారు. దీనిలో ఎవరైతే మొదట నేను అనుకుంటారో వారు రాయల్ రూపం యొక్క నేను అనే దాని గురించి చెప్పాను కదా దాని నుండి ముక్తి అవుతారు.
ఈ సీజన్ యొక్క సమాప్తిలో బాప్దాదా యొక్క ఆశ ఇదే ప్రతి ఒక పిల్లవాడు అనగా ఎవరైతే బ్రహ్మకుమారీ, బ్రహ్మాకుమారులుగా పిలవబడుతూ, అంగీకరిస్తూ, తెలుసుకున్నారో ఆ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ సంకల్పంలో కూడా ఏదైతే హద్దు యొక్క బంధన ఉంటుందో దాని నుండి కూడా ముక్తి అవ్వాలి. బ్రహ్మాబాబా సమానంగా బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా అవ్వాలి. సాధారణ జీవితం యొక్క ముక్తులుగా అవ్వటం కాదు. ఈ సంవత్సరం బ్రాహ్మణ శ్రేష్ట జీవన్ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ప్రతి ఒక బ్రాహ్మణాత్మ తన యొక్క సూక్ష్మ బంధనాల గురించి తెలుసుకున్నంతగా ఎవరు తెలుసుకోలేకపోతున్నారు.
బాప్దాదాకి అయితే తెలుసు ఎందుకంటే బాప్దాదా దగ్గర టీ.వీ ఉంది. దేహం యొక్క టీ.వీ కాదు, మనస్సు యొక్క టి.వీ ఉంది. ఇప్పుడు సీజన్ సమాప్తి అయిపోయింది మరలా సీజన్ ఉంటుంది కదా! ఉంటుందా లేక శెలవు ఇమ్మంటారా? ఒక సంవత్సరం శెలవు ఇమ్మంటారా? వద్దా? శెలవు ఇమ్మంటారా? ఒక సంవత్సరం శెలవు ఇమ్మంటారా? వద్దా, పాండవులు చెప్పండి - ఒక సంవత్సరం శెలవు ఇమ్మంటారా? (దాదీజీ నెలలో 15 రోజులు శెలవు అని చెప్పారు) మంచిది, చాలా మంచిది, అందరు చెప్తున్నారు ఎవరైతే శెలవు వద్దు అంటారో వారు చేతులు ఎత్తండి! మంచిది, పైన గ్యాలరీలో ఉన్నవారు చేతులు ఊపటంలేదు.
మంచిది, చాలా మంచిది. బాప్దాదా సదా పిల్లలు చెప్పిన దానికి హాజీ, హాజీ (అలాగే, అలాగే) అంటారు. అయితే పిల్లలు బాబా చెప్పినదానికి ఎప్పుడు హాజీ (అలాగే బాబా) అంటారు? బాబా అయితే హాజీ అన్నారు కనుక బాబా కూడా ఒక షరతు పెడుతున్నారు, ఆ షరతుకి అంగీకారమేనా? అందరు హాజీ అనండి. పక్కాయేనా? కొద్దిగా అయినా పెడచెవిన పెట్టరు కదా! ఇప్పుడు అందరి ముఖాలు టి.వీలో చూపించండి. పిల్లలందరు హాజీ, హాజీ అనేవారు అని బాబాకి కూడా ఆనందం అనిపిస్తుంది.
బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు - ఈ కారణంగా లేదా ఆ కారణంగా ఈ బంధన ఇలా కారణాలు చెప్పకూడదు, సమస్యగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వాలి మరియు సహయోగులను కూడా తయారు చేయాలి ఎందుకంటే సమయం యొక్క పరిస్థితిని చూస్తున్నారు. కదా! భ్రష్టాచారంయొక్క వార్తలు ఎంతగా పెరిగిపోతున్నాయి! భ్రష్టాచారం, హత్యాచారం అతిలోకి వెళ్ళిపోతున్నాయి. కనుక శ్రేష్టాచారం యొక్క జెండా మొదట ప్రతి బ్రాహ్మణాత్మ మనస్సులో ఎగరవేయాలి అప్పుడు విశ్వంలో ఎగురవేయగలరు. ఎన్ని శివరాత్రులు జరుపుకున్నారు!
ప్రతి శివరాత్రికి ఇదే సంకల్పం చేస్తున్నారు - విశ్వంలో బాబా యొక్క జెండా ఎగరవేయాలి అని. విశ్వంలో బాబా యొక్క ప్రత్యక్షత జెండా ఎగరవేసేముందు ప్రతి బ్రాహ్మణాత్మ మనస్సులో లేదా హృదయసింహాసనంలో సదా బాబా యొక్క జెండా ఎగరవేయాలి. ఈ జెండా ఎగరవేయడానికి కేవలం రెండు మాటలను కర్మలోకి తీసుకురావాలి. సంకల్పంలో, బుద్ధిలో ఉండటం కాదు, కర్మలోకి తీసుకు రావాలి. మనస్సులో, కర్మలో, సంబంధంలో, సంపర్కంలోకి తీసుకురావాలి. కష్టమైన మాటలు కాదు, సాధారణమైన మాటయే అవి 1. సర్వుల సంబంధ, సంపర్కంలో పరస్పరం ఏకతగా ఉండాలి.
అనేక సంస్కారాలు ఉంటాయి. అనేకతలో ఏకత ఉండాలి. 2. ఏదైతే శ్రేష్ట సంకల్పం చేస్తున్నారో, అది బాగ్దాదాకి చాలా మంచిగా అనిపిస్తుంది, మీరు సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పం విని, చూసి బాబా చాలా ఆనందం అయిపోతున్నారు ఓహో పిల్లలు! ఓహో!! ఓహో శ్రేష్ట సంకల్పం! ఓహో!! అనుకుంటున్నారు. కానీ కానీ .... అనేది వస్తుంది. రాకూడదు కానీ వస్తుంది. చాలా మందికి 90 శాతం సంకల్పం చాలా మంచిగా ఉంటుంది.
ఈరోజు ఈ పిల్లవాని సంకల్పం చాలా మంచిగా ఉంది అని బాప్దాదా అనుకుంటున్నారు, ఉన్నతి అవుతారు అనుకుంటున్నారు కానీ మాటలో సగం తక్కువ అయిపోతుంది, కర్మలో మూడు వంతులు తగ్గిపోతుంది మిక్స్ అయిపోతుంది. కారణం ఏమిటి? సంకల్పంలో ఏకాగ్రత, ధృడత లేదు. సంకల్పంలో ఏకాగ్రత ఉంటే ఏకాగ్రత అనేది సఫలతకు సాధనం. దానిలో తేడా వచ్చేస్తుంది. కారణం ఏమిటి? బాబా ఫలితంలో ఒకే విషయం చూశారు అదేమిటంటే - ఇతరులను ఎక్కువగా చూస్తున్నారు.
మీరు చెప్తారు కదా - ఒక వ్రేలుతో ఇతరులను చూపిస్తున్నాము అంటే నాలుగు వ్రేలు మనల్ని చూపిస్తున్నాయి అని. ఆ నాలుగు చూడటం లేదు ఆ ఒకటే చూస్తున్నారు. అందువలనే ధృఢత, ఏకాగ్రత, ఏకత చలిస్తున్నాయి. వారు చేస్తే నేను చేస్తాను ఇలా రెండవ నెంబర్ వారిగా అయిపోతున్నారు. లేకపోతే మీ స్లోగన్ మార్చేసుకోండి. స్వపరివర్తనయే విశ్వపరివర్తన అనడానికి బదులు విశ్వ పరివర్తనయే స్వపరివర్తన అని అనండి. లేకపోతే ఇతరుల పరివర్తనతో స్వపరివర్తన అనండి. మార్చేస్తారా? మార్చరా? ఇప్పుడు బాప్దాదా కూడా ఒక షరతు పెడుతున్నారు అంగీకారమేనా? బాప్దాదా 6 నెలలలో ఫలితం చూస్తారు అప్పుడు వస్తాను లేకపోతే రాను.
బాబా హాజీ అన్నారు కనుక పిల్లలు కూడా హాజీ అనాలి కదా! ఏది ఏమైనా కానీ బాప్దాదా చెప్తున్నారు - స్వపరివర్తన కోసం ఈ హద్దు యొక్క నేను అనేది చనిపోవాలి. శరీరంతో చనిపోవటం కాదు, నేను, నాది అనేదానితో చనిపోవాలి. నేను సత్యం, నేను ఇది, నేనేమి తక్కువ, ఈ నేను అనే దానితో చనిపోవాలి. ఇలా చనిపోవటం కూడా చాలా మధురమైన మృత్యువు. ఇది చనిపోవటం కాదు, 21 జన్మలు రాజ్యభాగ్యంతో జీవించడం. అంగీ కారమేనా? టీచర్స్కి అంగీకారమేనా? డబల్ విదేశీయులకు అంగీకారమేనా? డబల్ విదేశీయులు ఏ సంకల్పం చేసినా చేయటంలో ధైర్యం పెట్టుకుంటారు.
ఈ విశేషత వారిలో ఉంది. మరియు విదేశీయులు డబల్ ధైర్యం పెట్టుకుంటే భారతవాసీయులు త్రిబుల్ (మూడు రెట్లు) ధైర్యం పెట్టుకునేవారు. కనుక అర్థమైందా! బాప్దాదా ఇదే చూడాలనుకుంటున్నారు. బాప్దాదా శ్రేష్ట ఆశల దీపం ప్రతి పిల్లవానిలో వెలుగుతూ చూడాలని బాప్దాదా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ దీపావళి జరుపుకోండి. 6 నెలల తర్వాత జరుపుకోండి బాప్దాదా ఈ దీపావళి ప్రోగ్రామ్ చూసిన తర్వాత తన ప్రోగ్రామ్ చెప్తారు. చేయవలసిందే. మీరు చేయకపోతే వెనుక వచ్చేవారు చేస్తారా ఏమిటి! 16 వేల మాలలోకి, 108 మాలలోకి పాతవారే రావలసి ఉంటుంది. క్రొత్తవారైతే వెనుక వస్తారు.
కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ కూడా ఉంటారు. కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ వచ్చేస్తారు. కొంతమంది దీనికి ఉదాహరణగా ఉంటారు కానీ కొద్ది మందే ఉంటారు. మిగిలిన వారు మీరే ఉంటారు, ప్రతి కల్పం మీరే తయారయ్యారు, మీరే తయారవ్వాలి. విదేశంలో కూర్చున్నా, దేశంలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కానీ ఎవరైతే చాలా సమయం పక్కా నిశ్చయబుద్ధిగా ఉంటారో వారు తప్పక అధికారులు అవుతారు. బాప్దాదా కూడా చాలా సమయం తీసుకువెళ్తారు. కనుక మేమే తయారయ్యాము, అవుతాము మరియు మేమే వెంట ఉంటాము అని పక్కా నిశ్చయంతో ఉండండి.
పక్కాయేనా? శుభ చింతకులుగా, శుభ చింతనతో, శుభభావన, పరివర్తన యొక్క భావన, సహయోగం ఇచ్చే భావన, దయాహృదయం యొక్క భావనలను ప్రత్యక్షం చేయండి. ఇప్పుడు గుప్తంగా ఉంచారు, ప్రత్యక్షం చేయండి. శిక్షణ ఎక్కువ ఇవ్వకండి, క్షమించండి. శిక్షణ ఇవ్వటంలో ఒకరికంటే ఒకరు తెలివైన వారు కానీ క్షమతో శిక్షణ ఇవ్వండి. మురళి వినిపించడం, కోర్సు చెప్పటం ఈ ప్రోగ్రామ్స్ ద్వారా భలే శిక్షణ ఇవ్వండి కానీ పరస్పరం కార్యవ్యవహారంలోకి వస్తునప్పుడు క్షమతో శిక్షణ ఇవ్వండి. కేవలం శిక్షణ ఒకటే ఇవ్వటం కాదు, దయాభావంతో శిక్షణ ఇస్తే మీ దయాభావం ద్వారా ఇతరులలో బలహీనత క్షమించబడుతుంది. అర్థమైందా!
చాలామంది చాలా రకాలైన సేవలు చేశారు మరియు ఇప్పుడు కూడా చేస్తున్నారు కానీ బాప్దాదా ఒక సైగ చేస్తున్నారు - (క్వాంటిటీ) సంఖ్యను పెంచేసేవ మరియు (క్వాలిటీ) లక్షణాలు కలిగిన వారి సేవ రెండు రకాలైన సేవలు చేయండి కానీ లక్షణాలు కలిగిన వారి సేవకు సహయోగులు అవ్వండి. సేవావేదికపైకి లక్షణాలు కలిగిన వారిని తీసుకురండి. క్వాలిటీ మరియు క్వాంటిటీ రెండు సేవలు ఉండాలి. అంతే కానీ సంఖ్య వెనకపడి లక్షణాలు| కలిగిన వారిని మర్చిపోకండి. ఎందుకంటే సమయం సమీపంగా వస్తుంది. లక్షణాలు కలిగినవారి కార్యం ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది.
సందేశం ఇవ్వటం కూడా అవసరమే. సందేశవాహకులుగా అవ్వటం కూడా అవసరం. మంచిది, ఇప్పుడు వినటం అంటే నింపుకోవటం, నింపుకోవటం అంటే స్వరూపంలోకి తీసుకు రావటం. ఇప్పుడు 6 లక్షల బ్రాహ్మణ పరివారం ఒకరికొకరు సదా స్నేహిగా, సహయోగిగా మరియు సదా ధైర్యం పెంచుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు ఒక్క సెకనులో మనస్సుకి యజమానిగా అయ్యి మనస్సుని ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రం చేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నారా? ఇప్పుడు ఈ ఆత్మిక వ్యాయామాన్ని చేయండి. పూర్తిగా మనస్సు ఏకాగ్రం అయిపోవాలి. సంకల్పంలో కూడా అలజడి ఉండకూడదు. అచంచలంగా ఉండాలి. మంచిది.
నలువైపుల ఉన్నటువంటి సర్వ అవినాశి అఖండ ఖజానాల యజమానులకు, సదా సంగమయుగీ శ్రేష్ట బంధనముక్తి ఆత్మలకు, జీవన్ముక్తి స్థితిలో స్థితులయ్యే వారికి, సదా బాప్దాదా యొక్క ఆశలను సంపన్నం చేసేవారికి, సదా ఏకత మరియు ఏకాగ్రత శక్తి సంపన్న మాష్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దూరంగా కూర్చున్న నలువైపుల ఉన్నటువంటి పిల్లలకు, బాబాకి ప్రియస్మృతులను పంపించిన పిల్లలకు, ఉత్తరాలు పంపిన పిల్లలకు కూడా బాప్దాదా చాలా చాలా మనస్పూర్వక ప్రేమ సహిత ప్రియస్మృతులు. చాలామంది పిల్లలు మధువనం యొక్క రిఫ్రెష్ మెంట్ కొరకు మంచి మంచి ఉత్తరాలు పంపారు వారికి కూడా విశేష ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.