రివైజ్ కోర్స్ మురళి 07-03-2005

                                

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతం పెట్టుకోవటం మరియు నే అనే దానిని సమాప్తి చేయటమే శివజయంతి జరుపుకోవటం

ఈరోజు విశేషంగా శివతండ్రి తన సాలిగ్రామ పిల్లల యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవటానికి వచ్చారు. పిల్లలైన మీరు తండ్రి యొక్క జయంతిని జరుపుకునేటందుకు వచ్చారు. మరియు బాబా పిల్లలైన మీ జయంతిని జరుపుకునేటందుకు వచ్చారు. ఎందుకంటే బాబాకి పిల్లలంటే చాలా ప్రేమ. బాబా అవతరిస్తూనే యజ్ఞాన్ని రచిస్తారు. మరియు బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం సంపన్నం అవ్వదు. అందువలన ఈ జయంతి అలౌకిక మైనది, అతీతమైనది మరియు ప్రియమైనది.

తండ్రి మరియు పిల్లల యొక్క జయంతి రెండూ కలిసి ఒకేరోజు రావటం అనేది కల్పం మొత్తంలో మరెప్పుడూ ఉండదు మరియు ఉండబోదు. తండ్రి నిరాకారుడు, కానీ నిరాకారుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శివతండ్రి ఒక్కరికే శరీరం ఉండదు. కనుక బ్రహ్మ శరీరంలో అవతరిస్తారు. ఈ అవతరణనే జయంతిగా జరుపు కుంటున్నారు. మీరందరు మీ జయంతిని జరుపుకునేటందుకు వచ్చారా లేక తండ్రి జయంతిని జరుపుకునేటందుకు వచ్చారా? శుభాకాంక్షలు చెప్పేటందుకు వచ్చారా లేక శుభాకాంక్షలు తీసుకునేటందుకు వచ్చారా? వెనువెంట ఉండే ప్రతిజ్ఞ పిల్లలతో బాబా చేశారు.

ఇప్పుడు ఈ సంగమ యుగంలో కూడా కంబైండ్గా వెంట ఉంటారు, అవతరణ కూడా వెనువెంట అవతరిస్తారు, పరివర్తన చేసే కార్యాన్ని కూడా వెంటే చేస్తారు మరియు తిరిగి ఇంటికి వెళ్ళటం కూడా వెంటే వెళ్తారు. ఇదే తండ్రి మరియు పిల్లల యొక్క ప్రేమ స్వరూపం. శివజయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు కానీ వారు కేవలం పిలుస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. మీరు పిలవటం లేదు మీరు జరుపుకోవటం అంటే సమానంగా అవ్వటం. జరుపుకోవటం అంటే సదా ఉత్సాహ ఉల్లాసాలలో ఎగురుతూ ఉండాలి. అందువలనే దీనిని ఉత్సవం అని అంటారు.

 ఉత్సవం అంటేనే ఉత్సాహంలో ఉండటం. కనుక సదా ఉత్సవంలో అనగా ఉత్సాహంలో ఉండేవారే కదా! సదా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే ఉత్సాహ ఉల్లాసాలు. శ్వాస లేకుండా ఎలా ఉండలేరో అలాగే ఉత్సాహ ఉల్లాసాలు లేకుండా బ్రాహ్మణ జీవితంలో ఉండలేరు. అలా అనుభవం చేసుకుంటున్నారు కదా! విశేషంగా జయంతిని జరుపుకునేటందుకు ఎక్కడెక్కడి నుండో దూరదూరాల నుండి పరుగు పెట్టుకుంటూ వచ్చారు కదా!బాప్దాదాకి తన జయంతి కంటే పిల్లల జయంతి యొక్క సంతోషం ఎక్కువ ఉంది.

అందువలన బాప్దాదా ప్రతి ఒక్కరికీ కోటానుకోట్ల సంతోషంతో నిండిన శుభాకాంక్షలు ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్దాదా కి ఈరోజు సత్యమైన భక్తులు కూడా చాలా స్మృతి వస్తున్నారు. వారు ఒక్కరోజు కొరకు వ్రతం పెట్టుకుంటారు మీరు జీవితమంతా సంపూర్ణ పవిత్రులుగా అయ్యే వ్రతం పెట్టుకున్నారు. వారు భోజనం కొరకు వ్రతం పెట్టుకుంటారు మీరు మనస్సు యొక్క భోజనానికి అనగా వ్యర్థ సంకల్పాలు, వ్యతిరేక సంకల్పాలు, అపవిత్ర సంకల్పాల యొక్క వ్రతం పెట్టుకున్నారు. వ్రతాన్ని ఫక్కాగా పెట్టుకున్నారు కదా!

డబల్ విదేశీయులు ముందు కూర్చున్నారు. కుమారులు చెప్పండి - వ్రతం ఫక్కాగా పెట్టుకున్నారా? అపరిపక్వంగా కాదు కదా? మాయ వింటూ ఉంది. అందరూ జెండాలు ఊపుతున్నారు కదా! మాయ చూస్తూ ఉంది. పవిత్రంగా తప్పక అవుతాం అని వ్రతం పెట్టుకోవటం అంటే వృత్తిని శ్రేష్టంగా చేసుకోవటం. ఎటువంటి వృత్తి ఉంటుందో అటువంటి దృష్టి మరియు కృతి తయారవుతాయి. అటువంటి వ్రతం పెట్టుకున్నారు. కదా! 2. పవిత్ర శుభ వృత్తి, పవిత్ర శుభ దృష్టి ఉండాలి. పరస్పరం చూసుకున్నప్పుడు దేనిని చూస్తున్నారు? ముఖాన్ని చూస్తున్నారా లేక భ్రుకుటి మెరిసే ఆత్మను చూస్తున్నారా?

ఎవరో అడిగారు - ఇతరులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఇతరులతో కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు ముఖాన్ని చూసే మాట్లాడవలసి ఉంటుంది. కళ్ళ వైపుకే దృష్టి వెళ్తుంది కానీ అప్పుడప్పుడు ముఖాన్ని చూసినప్పుడు కొంచెం వృత్తి మారుతుంది అని. వారికి బాప్దాదా చెప్తున్నారు - కళ్ళతో పాటు భ్రుకటి కూడా ఉంది కదా! కనుక భ్రుకుటి మధ్యలో ఉన్న ఆత్మని చూసి మాట్లాడలేరా? ముఖంలోకి చూసినా కానీ భ్రుకుటిలో మెరిసే సితారను చూడండి. కనుక ఈ వ్రతాన్ని తీస్కోండి. తీసుకున్నారు కానీ మరింత ధ్యాస పెట్టండి. ఆత్మని చూసి మాట్లాడాలి. ఆత్మతో ఆత్మ మాట్లాడుతుంది.

ఆత్మ ఆత్మని చూస్తుంది. ఈ అభ్యాసం చేస్తే వృత్తి సదా శుభంగా ఉంటుంది మరియు వెనువెంట రెండవ లాభం ఏమిటంటే ఎటువంటి వృత్తియో అటువంటి వాయుమండలం ఏర్పడుతుంది. వాయుమండలం శ్రేష్టంగా చేయటం ద్వారా స్వపురుషార్థంతో పాటు సేవ కూడా జరుగుతుంది. రెండు లాభాలు ఉన్నాయి కదా! మీ వృత్తిని ఎంత శ్రేష్టంగా చేసుకోవాలంటే ఎటువంటి వికారి ఆత్మ అయినా, పతిత ఆత్మ అయినా పరివర్తన అయిపోవాలి. ఇటువంటి వ్రతం సదా స్మృతిలో మరియు స్వరూపంలో ఉండాలి. వర్తమాన సమయంలో బాప్దాదా పిల్లల యొక్క చార్టు చూశారు.

వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారుచేయటానికి బదులు అక్కడక్కడ అప్పుడప్పుడు ఇతరుల వాయుమండలం యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటి? పిల్లలు ఆత్మిక సంభాషణలో చాలా మధురాతి మధురమైన విషయాలు చెప్తున్నారు. అంటున్నారు - వీరి విశేషత బావుంది, వీరు మంచి సహయోగులు .... ఇలా అంటున్నారు. కానీ ఆ విశేషత ప్రభు యొక్క వరదానం. బ్రాహ్మణ జీవితంలో లభించే ప్రాప్తి లేదా విశేషత అన్నీ ప్రభువు యొక్క ప్రసాదం. ప్రభువు యొక్క వరదానం.

కనుక దాతను మర్చిపోయి దాత నుండి తీసుకున్నవారిని జ్ఞాపకం చేస్తే ..... ప్రసాదాన్ని ఎవరి వ్యక్తిగతమైనది కాదు కదా! దేవుని ప్రసాదం అంటారు. ఫలానా వారి ప్రసాదం అనరు కదా! అదేవిధంగా సహయోగం లభిస్తుంది అనేది మంచి విషయమే కానీ సహయోగాన్ని ఇప్పించే దాతను మర్చిపోకూడదు కదా! కనుక జన్మదినోత్సవం యొక్క పక్కా వ్రతం పెట్టుకున్నారు కదా! వృత్తి మారిపోయిందా? సంపన్న పవిత్రత యొక్క పక్కా పక్కా వ్రతం పెట్టుకున్నారు కదా! వృత్తి మారిపోయిందా? సంపన్న పవిత్రత యొక్క సత్య వ్రతాన్ని లేదా ప్రతిజ్ఞను చేయాలి.

పరిశీలించుకోండి - పెద్ద పెద్ద వికారాల కొరకు వ్రతం పెట్టుకున్నారు కానీ చిన్న చిన్న వికారాల నుండి అనగా వాటి పిల్లల నుండి ముక్తులయ్యారా? జీవితంలో కూడా కుటుంబంలోని వారికి పిల్లల కంటే మనవలపై ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా! మాతలకి ప్రేమ ఉంటుంది కదా! అదేవిధంగా పెద్ద పెద్ద రూపాలను జయించేశారు కానీ చిన్న చిన్న సూక్ష్మ రూపాలతో యుద్ధం చేయటం లేదు కదా! కొందరు అంటారు - ఆసక్తి లేదు కానీ మంచిగా కనిపిస్తుంది అని. ఈ వస్తువు చాలా ఇష్టంగా అనిపిస్తుంది కానీ అసక్తి లేదు అని. కానీ విశేషంగా ఇష్టంగా ఎందుకు అనిపిస్తుంది?

అందువలన పరిశీలించుకోండి - చిన్న చిన్న రూపాలలో కూడా అపవిత్రత యొక్క అంశం మిగిలిన ఉండలేదు కదా అని. ఎందుకంటే అంశం నుండి వంశం కాగలదు. 3. ఏ వికారం అయినా చిన్న రూపంలో అయినా పెద్ద రూపంలో అయినా రావటానికి ఒక మాట ఆధారం ఆ మాట ఏమిటంటే నేను. దేహాభిమానంతో కూడిన నేను అనే భావం. నేను అనే మాట వలనే అభిమానం వస్తుంది ఆ అభిమానం పూర్తి కాకపోతే క్రోధం కూడా వస్తుంది. ఎందుకంటే అభిమానం కల వారికి గుర్తు ఏమిటంటే వారు అవమాన కరమాట ఒక్కటి అయినా సహించలేదు. అందువలన క్రోధం వచ్చేస్తుంది.

భక్తులు అయితే బలి ఇస్తారు కానీ మీరు మీలో ఉన్న హద్దులోని నేను అనే భావాన్ని బాబాకి సమర్పించండి, బాబాకి ఇచ్చేయండి. చేయాలి, అవ్వాలి కానీ .... ఇలా ఆలోచించకండి. సమర్థులయ్యి సమర్పితం చేయండి. క్రొత్త విషయమేమీ లేదు. ఎన్నో కల్పాలు మరియు ఎన్నో సార్లు విజయీ అయ్యారు కేవలం దానిని రిపీట్ చేయాలి. తయారై ఉన్న దానిని తయారుచేయాలి. అందువలనే తయారైపోయిన డ్రామా అని అంటారు. తయారై ఉంది కేవలం దానిని ఇప్పుడు రిపీట్ చేయాలి అంటే తయారుచేయాలి. కష్టమా లేక సహజమా? బాప్దాదా భావిస్తున్నారు సంగమయుగం యొక్క వరదానం - సహజ పురుషార్థం.

ఈ జన్మలో సహజ పురుషార్థం యొక్క వరదానం ద్వారా 21 జన్మల సహజ జీవితం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డని శ్రమ నుండి ముక్తుల్ని చేయడానికి వచ్చారు. 63 జన్మలు శ్రమ చేశారు, కనుక ఈ ఒక్క జన్మ పరమాత్మ ప్రేమ ద్వారా శ్రమ నుండి ముక్తులు అవ్వండి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కనుక బాప్దాదా సహజ పురుషార్థి భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. శ్రమ నుండి ముక్తులయ్యేటందుకు సాధనం - ప్రేమ. బాబాతో మనస్పూర్వక ప్రేమ ఉండాలి. ప్రేమలో లవలీనం అయ్యి ఉండాలి మరియు ముఖ్య యంత్రం - మన్మనాభవ యొక్క మంత్రం.

ఈ యంత్రాన్ని ఉపయోగించండి. ఉపయోగించటం వస్తుంది కదా! బాప్దాదా చూశారు సంగమయుగంలో పరమాత్మ ప్రేమ ద్వారా బాప్దాదా నుండి ఎన్నో శక్తులు లభించాయి, గుణాలు లభించాయి, జ్ఞానం లభించింది, సంతోషం లభించింది. ప్రభువు యొక్క ఈ వరదానాలను, ఖజానాలను సమయానికి ఉపయోగించండి. కనుక బాప్దాదా  ఏమి కోరుకుంటున్నారో విన్నారా? ప్రతి ఒక్కరు సహజ పురుషార్థిగా మరియు తీవ్ర పురుషార్థిగా అవ్వాలి. ధృడతను ఉపయో గించండి.

 తయారవ్వవలసిందే, మేము తయారవ్వకపోతే మరెవ్వరు తయార వుతారు, మేమే అయ్యాము, మేమే అవుతాము మరియు ప్రతి కల్పం మేమే తయారవుతాం అనే ధృఢనిశ్చయాన్ని స్వయంలో ధారణ చేయండి. చేస్తాం అని చెప్పకండి, చేయాల్సిందే అనండి. తయారవ్వాల్సిందే. తయారయ్యే ఉంది. బాప్దాదా  దేశ విదేశాల యొక్క పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. కేవలం ఎదురుగా ఉన్న మిమ్మల్నే చూడటం లేదు, నలువైపుల ఉన్న దేశ విదేశాలలోని పిల్లలను చూస్తున్నారు. అక్కడక్కడి నుండి ఎక్కువ మంది నుండి జన్మదినోత్సవ శుభాకాంక్షలు వచ్చాయి. కార్డులు వచ్చాయి. ఇ మెయిల్స్ వచ్చాయి.

మనస్సు యొక్క సంకల్పాలు కూడా అందాయి. తండ్రి కూడా పిల్లల యొక్క పాట పాడుతున్నారు. మీరు పాట పాడతారు కదా - బాబా నీవు అద్భుతం చేశావు అని. అలాగే బాబా కూడా పాట పాడుతున్నారు - మధురమైన పిల్లలూ అద్భుతం చేశారు అని. బాప్దాదా సదా చెప్తారు - మీరు ఎదురుగా కూర్చున్నారు కానీ దూరంలో ఉన్న వారు కూడా హృదయంలో ఉన్నారు. ఈరోజు నలువైపుల ఉన్న పిల్లల సంకల్పంలో ఇదే ఉంది - శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్దాదాకి మారుమూల ధ్వని కూడా చేరుకుంటుంది మరియు మనస్సు యొక్క సంకల్పాలు కూడా చేరుకుంటాయి.

ఇవి కేవలం గ్రీటింగు కార్డులే కాదు, ఉత్తరాలే కాదు వజ్రాల కంటే ఎక్కువ విలువైన బహుమతులు. అందరూ వింటున్నారు, సంతోషిస్తున్నారు కదా! అందరూమీ జయంతిని జరుపుకున్నారా? రెండు సంవత్సరాల వారైనా, ఒక్క సంవత్సరం వారైనా, వారంరోజుల వారైనా కానీ ఇది యజ్ఞ స్థాపన యొక్క జయంతి. బ్రాహ్మణులందరూ యజ్ఞనివాసీలే కదా! అందువలన పిల్లలందరికీ చాలా చాలా మనస్పూర్వక ప్రియస్మృతులు మరియు ఆశీర్వాదాలు కూడా. సదా ఈ ఆశీర్వాదాలతో పాలింపబడుతూ ఉండండి. ఎగురుతూ ఉండండి. ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటం సహజం కదా! సహజమేనా?

సహజం అని భావించేవారు చేతులెత్తండి. జెండాలు ఊపండి. ఆశీర్వాదాలను వదలటం లేదు కదా! 4. అన్నింటికంటే సహజ పురుషార్థం - ఆశీర్వాదాలను ఇవ్వటం మరియు ఆశీర్వాదాలను తీసుకోవటం. దీనిలో యోగం కూడా వచ్చేస్తుంది, ధారణ మరియు సేవ కూడా వచ్చేస్తాయి. ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటంలో నాలుగు సబ్జెక్టులు వచ్చేస్తాయి. డబల్ విదేశీయులకి ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటం సహజమే కదా! సహజమేనా? 20 సం॥ల నుండి ఉన్నవారు చేతులెత్తండి. మీకు 20 సం||లు పూర్తి అయినవి కానీ బాప్దాదా మీకు కోటానుకోట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు.

ఎన్ని దేశాల నుండి వచ్చారు? (69 దేశాల నుండి వచ్చారు) 69వ జయంతిని జరుపుకునేటందుకు 69 దేశాల నుండి వచ్చారు. ఎంత బావుంది! రావటంలో కష్టమనిపించలేదు కదా! సహజంగా వచ్చేశారు కదా! ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కొంచెం కూడా శ్రమ ఉండదు. ఈరోజు యొక్క ఏ విశేష వరదానాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు? సహజ పురుషార్థి అనే వరదానాన్ని జ్ఞాపకం ఉంచుకోండి.

సహజ పనిని త్వరత్వరగా చేసేస్తారు. కష్టమైన పని కష్టంగా ఉంటుంది కనుక చేయడానికి సమయం పడుతుంది. అయితే మీరందరు ఎవరు? సహజ పురుషార్థులు. చెప్పండి. జ్ఞాపకం ఉంచుకోండి. మీ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత శ్రమలో పడిపోకూడదు. 5. ఒకవేళ ఏదైనా కష్టమైన పని వచ్చినా కానీ మనస్సుతో "బాబా! నా బాబా!" అనండి. అప్పుడు కష్టం సమాప్తి అయిపోతుంది. మంచిది. జరుపుకోవటం అయిపోయింది. కదా! తండ్రి కూడా జరుపుకున్నారు మీరు కూడా జరుపుకున్నారు. మంచిది.

నలువైపుల ఉన్న సదా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండే శ్రేష్ట పిల్లలకు, సదా సహజ పురుషార్థులు, సంగమయుగి సర్వ వరదాని పిల్లలకు, సదా బాబా మరియు నేను ఆత్మను ఈ స్మృతిలో నేను అని మాట్లాడేవారికి, సదా సర్వాత్మలకు తమ వృత్తి ద్వారా వాయుమండలం యొక్క సహయోగం ఇచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మతులు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు మరియు నమస్తే.

ప్రశ్నలు

1. బ్రాహ్మణాత్మలు ఏ విషయాల యొక్క వ్రతం పెట్టుకోవాలి?

2. వృత్తి మరియు దృష్టిని ఏవిధంగా పరివర్తన చేసుకోవాలి?

3. వికారాలన్నింటికీ మూలమైనది ఏది?

4. అన్నింటికంటే సహజ పురుషార్థం ఏమిటి? 5. కష్టాన్ని సమాప్తి చేసుకునే యుక్తి ఏమిటి?

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

సదా స్నేహీ భవ!