రివైజ్ కోర్స్ మురళి 25-03-2005
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
మాస్టర్ సూర్యులై అనుభూతి యొక్క కిరణాలను వెదజల్లండి, విదాత అవ్వండి, తపస్వి అవ్వండి.
ఈ రోజు బాప్దాదా తన యొక్క నలువైపుల ఉన్న హోలీహంసలతో హోలీ జరుపుకునేటందుకు వచ్చారు. పిల్లలు కూడా ప్రేమ యొక్క బంధనలో బంధింపబడి హోలీ జరుపుకునేటందుకు వచ్చారు. మిలనం జరుపుకునే టందుకు ఎంతో ప్రేమతో చేరుకున్నారు. బాప్దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూస్తున్నారు. ఎంతో గొప్ప భాగ్యం. ఎంత పవిత్రులో అంత ఉన్నతులు. మొత్తం కల్పంలో చూడండి మీ కంటే ఉన్నత భాగ్యం మరెవ్వరికీ లేదు. మీ భాగ్యం గురించి మీకు తెలుసు కదా! వర్తమాన సమయంలో కూడా పరమాత్మ పాలన, చదువు మరియు వరదానాలతో పాలింపబడుతున్నారు.
భవిష్యత్తులో కూడా విశ్వరాజ్యాధికారులుగా అవుతున్నారు. అవ్వాల్సిందే, నిశ్చితం మరియు నిశ్చయం. తర్వాత పూజ్యులుగా అయ్యే సమయంలో కూడా శ్రేష్ట ఆత్మలైన మీకు జరిగేటంత విధిపూర్వక పూజ మరెవ్వరికీ జరగదు. అంటే వర్తమానం, భవిష్యత్తు మరియు పూజ్య స్వరూపంలో కూడా ఉన్నతోన్నతులు. మీ జడచిత్రాలకు ప్రతీ కర్మకు పూజ జరుగుతుంది. అనేక ధర్మాత్మలు, మహానాత్మలు ఉన్నా కానీ విధిపూర్వక పూజ ఉన్నతోన్నతమైన పరమాత్మ పిల్లలైన మీకే జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రతీ కర్మలో కర్మయోగులై కర్మ చేసిన విధికి ఫలితంగా పూజ కూడా విధిపూర్వకంగా జరుగుతుంది.
ఈ సంగమయుగి పురుషార్థం యొక్క ప్రాలబ్దం లభిస్తుంది. అనగా ఉన్నతోన్నతమైన పరమాత్మ పిల్లలైన మీకు కూడా ఉన్నతోన్నత ప్రాప్తిని ఇస్తున్నారు. హోలీ అనగా పవిత్రత. పవిత్రులు మరియు ఉన్నతులు కూడా. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క పునాదియే పవిత్రత. సంకల్పమాత్రపు అపవిత్రత కూడా శ్రేష్టంగా తయారు కానివ్వదు. పవిత్రతయే సుఖశాంతికి జనని. పవిత్రతయే సర్వ ప్రాప్తులకు తాళంచెవి. అందువలనే మీ అందరి సూక్తి - పవిత్ర భవ! యోగి భవ! స్మృతిచిహ్న హోలీలో కూడా మొదట కాలుస్తారు తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు.
అనగా అపవిత్రతను కాల్చాలి. యోగాగ్ని ద్వారా అపవిత్రతను కాల్చుతున్నారు, పరమాత్మ సాంగత్యం యొక్క రంగు ద్వారా ఎరుపుగా అవుతున్నారు. సర్వ ఆత్మల పట్ల శుభభావన, శుభ కామన అనే కలయిక జరుపుకుంటున్నారు. దీనికి స్మృతి చిహ్నంగా వారు మంగళ కలయిక జరుపుకుంటారు. అందువలన 1.బాప్దాదా పిల్లలందరికీ ఇదే స్మృతి ఇప్పిస్తున్నారు - సదా ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలు తీస్కోండి మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి. మీ ఆశీర్వాదాల యొక్క శుభకామన ద్వారా మంగళ కలయిక జరుపుకోండి. ఒకవేళ ఎవరైనా శాపం ఇచ్చినా కానీ వారు అపవిత్రతకి వశం అయి ఉన్నారు అని భావించండి.
ఆ శాపాన్ని మీరు మనస్సులో పెట్టుకుంటే సంతోషంగా ఉండగలరా? సుఖంగా ఉండగలరా? లేక వ్యర్థ సంకల్పాల యొక్క ఎందుకు, ఏమిటి, ఎలా, ఏవిధంగా, ఇలా దుఃఖం యొక్క అనుభవం అవుతుందా? శాపాన్ని స్వీకరించటం అంటే స్వయాన్ని దుఃఖీగా, అశాంతిగా అనుభవం చేసుకోవటం. అంటే అప్పుడు సుఖం ఇవ్వండి మరియు సుఖం తీస్కోండి అనే బాప్దాదా యొక్క శ్రీమతాన్ని ఉల్లంఘన చేసిన వారు అవుతారు. పిల్లలందరూ ఇప్పుడు సుఖం ఇవ్వటం మరియు తీసుకోవటం నేర్చుకున్నారు కదా! నేర్చుకున్నారా?
ప్రతిజ్ఞ మరియు ధృడత. ధృఢతతో ప్రతిజ్ఞ చేయండి. సుఖం ఇవ్వాలి మరియు సుఖం తీసుకోవాలి. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఇది ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ చేసే దైర్యం ఉందా? ఎవరిలో ధైర్యం ఉందో, ఈరోజు నుండి ఆశీర్వాదాలు ఇస్తాం మరియు ఆశీర్వాదాలు తీసుకుంటాం అనే వారు చేతులెత్తండి. ఫక్కాయేనా? పక్కాయేనా? పచ్చిగా ఉంటే పచ్చిగా ఉన్న పళ్ళను పక్షులు బాగా తింటాయి. ధృడత సఫలతకు తాళంచెవి. తాళంచెవి ఉందా? జాగ్రత్తగా ఉందా, మాయ దొంగిలించటం లేదు కదా? ఈ తాళంచెవి అంటే మాయకు కూడా ఇష్టం.
సదా ప్రతి సంకల్పంలో ఈ సంకల్పాన్ని ఎదురుగా పెట్టుకోండి. గుప్తంగా కాదు, ప్రత్యక్షంగా ఉంచండి. నేను చేయవల్సిందే అని సంకల్పాన్ని ప్రత్యక్షం చేయండి. తయారు కావల్సిందే, జరగవలసిందే, జరిగే ఉంది అని భావించండి. అలాంటి వారినే నిశ్చయబుద్ధి విజయంతి అని అంటారు. డ్రామాలో విజయం నిర్ణయమై ఉంది. కేవలం దానిని పునరావృత్తం చేయాలి. తయారైపోయిన డ్రామా. తయారై ఉంది, పునరావృత్తం చేసి ఇప్పుడు తయారుచేయాలి. కష్టమా? అప్పుడప్పుడు కష్టమనిపిస్తుందా?
మీకు మీరే సహజాన్ని కష్టంగా చేసుకుంటున్నారు. చిన్న పొరపాటు చేస్తున్నారు - ఏ పొరపాటు చేస్తున్నారో తెలుసా? ఆ సమయంలో బాప్దాదాకి అటువంటి పిల్లలపై దయయే కాదు, ప్రేమ కూడా వస్తుంది. ఏమి ప్రేమ వస్తుంది? ఒకవైపు అంటున్నారు బాబా మాతో కంబైండ్గా ఉన్నారు. అని, ఉన్నారా? కంబైండ్గా ఉన్నారా? వెంట ఉండటం కాదు, కలిసి (కంబైండ్) ఉన్నారా? డబల్ విదేశీయులు కలిసి ఉన్నారా? వెనుక ఉన్నవారు కలిసి ఉన్నారా? గ్యాలరీలో వారు కలిసి ఉన్నారా? మంచిది,
ఈ రోజు బాప్దాదా కి సమాచారం లభించింది ఏమిటంటే మధువన నివాసీయులు, పాండవ భవనం, జ్ఞాన సరోవరం మరియు ఇక్కడి వారు కూడా వేరే హాలులో వింటున్నారు. అయితే వారిని కూడా 2.బాప్దాదా అడుగుతున్నారు బాప్దాదా తో కంబైండ్గా ఉన్నారా? అయితే సర్వ శక్తివంతుడైన బాబాతో కలిసి ఉన్నప్పుడు మరలా ఒంటరిగా ఎందుకు అయిపోతున్నారు? ఒకవేళ మీరు బలహీనులు అయినా కానీ బాప్దాదా సర్వశక్తివంతులు కదా! ఒంటరిగా అయిపోతున్నారు అప్పుడే బలహీనం అయిపోతున్నారు. కంబైండ్ రూపంలో ఉండండి. బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి సమయం సహయోగిగా ఉంటారు.
శివబాబా పరంధామం నుండి వచ్చిందే ఎందుకు? ఎందువలన వచ్చారు? పిల్లలకు సహయోగి అయ్యేటందుకు వచ్చారు. బ్రహ్మాబాబా కూడా వ్యక్తం నుండి అవ్యక్తం ఎందువలన అయ్యారు? సాకార శరీరంతో కంటే చాలా ఎక్కువగా అవ్యక్త రూపం ద్వారా సహయోగం ఇవ్వగలరు. అయితే బాప్దాదా ఇరువురు సహయోగం ఇచ్చేటందుకు ఆఫర్ ఇస్తుంటే మరలా ఒంటరిగా ఎందుకు అయిపోతున్నారు? శ్రమలో ఎందుకు ఉంటున్నారు? 63 జన్మల నుండి శ్రమ చేశారు కదా! ఆ శ్రమ యొక్క సంస్కారం ఇప్పటికీ ఆకర్షిస్తుందా? ప్రేమలో ఉండండి, ప్రేమలో లీనమై ఉండండి.
ప్రేమయే శ్రమ నుండి విడిపించేది. శ్రమ ఇష్టమనిపిస్తుందా? అలవాటు కారణంగా బలహీనం అయిపోతున్నారా? సహజ యోగులు మీరు. బాప్ దాదా విశేషంగా పిల్లల కొరకు పరంధామం నుండి బహుమతి తీసుకువచ్చారు. ఏ బహుమతి తీసుకువచ్చారో తెలుసా? అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చారు. మీ చిత్రం కూడా ఉంది కదా! రాజ్య భాగ్యం తీసుకువచ్చింది పిల్లల కొరకు. అందువలన బాప్దాదా కి శ్రమ ఇష్టమనిపించటం లేదు. బాప్దాదా ప్రతి ఒక్కరినీ శ్రమ నుండి ముక్తులుగా ప్రేమలో లీనమైనవారిగా చూడాలనుకుంటున్నారు.
శ్రమ నుండి లేదా మాయా యుద్ధం నుండి ముక్తులయ్యే సంకల్పం ఈ హోలీ రోజున తీసుకుంటారా? ఈ బలహీనతను కాల్చేస్తారా? కాల్చేయటం అంటే నామరూపాలు లేకుండా అయిపోవటం. ఏ వస్తువుని అయినా కాల్చేస్తే నామరూపాలు లేకుండా పోతుంది కదా! ఇటువంటి హోలీ జరుపుకుంటారా? జరుపుకుంటారా? చేతులు అయితే ఊవుతున్నారు. చేతులూపటం చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ.... కానీ ... అనేది ఉందా? కానీ అనమంటారా, వద్దా? మనస్సు యొక్క చేతిని ఊపాలి. ఈ చేతులూపటం సహజం, చేయాల్సిందే. అని మనస్సు అంగీకరించినప్పుడు అది జరిగితీరుతుంది.
కొత్త - కొత్త వారు చాలామంది వచ్చారు. మొదటి సారిగా మిలనం చేసుకునేటందుకు వచ్చిన వారు చేతులెత్తండి. డబల్ విదేశీయులలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మొదటిసారిగా వచ్చారో, బాప్దాదా విశేషంగా వారికి తమ భాగ్యాన్ని తయారుచేసుకునే శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఈ శుభాకాంక్షలను స్మృతిలో ఉంచుకోండి మరియు సదా ఇదే లక్ష్యం ఉంచు కోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అంతిమ ఫలితం ప్రకటించబడలేదు. అందరికీ అవకాశం ఉంది. చివరలో వచ్చినా కానీ లాస్ట్ సో ఫాస్ట్ వెళ్ళి ఫస్ట్లోకి రావచ్చు. అవకాశం ఉంది, మరి వెళ్ళగలరా?
ఆత్మనైనా నేను ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ క్లాస్లోకి రావాలి అని సదా స్మృతిలో ఉంచుకోండి. వి.ఐ.పిలు చాలామంది వచ్చారు కదా! వి.ఐ.పిలు ఎవరైతే ఉన్నారో వారు బాగా చేయి ఎత్తండి. స్వాగతం. మీ ఇంటికి వచ్చేటందుకు స్వాగతం. సుస్వాగతం. ఇప్పుడు కేవలం పరిచయం కొరకు వి.ఐ.పిలు అని అంటున్నారు కానీ ఇప్పుడు వి.ఐ.పి నుండి వి.వి.వి.ఐ.పి.గా కావాలి. దేవతలు వి.వి.వి.ఐ.పిలు కనుక మీరు కూడా ఆవిధంగా తయారుకావాలి. బాప్దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. సంబంధంలోకి వచ్చారు. వి.ఐ.పి.లు అందరూ | నిల్చోండి. కూర్చుని కూర్చుని అలసిపోయి ఉంటారు, కొంచెం లేవండి. మంచిది.
మొదటిసారిగా కలుసుకునేటందుకు వచ్చిన మాతలు నిల్చోండి. వీరందరూ మొదటిసారిగా వచ్చారు. మంచిది, మొదటిసారిగా వచ్చిన పాండవులు నిల్చోండి. బాప్దాదాకి సంతోషంగా ఉంది, ఎందువలన? పిల్లలు బాగా సేవ చేశారు. సేవ యొక్క ఋజువు బాబా చూశారు. ఈ సీజన్లో ప్రతీ గ్రూపులో మొదటిసారిగా వచ్చానవారు సగం మంది కంటే ఎక్కువగా ఉన్నారు. అందువలన ఏ పిల్లలైతే పెద్ద కార్యక్రమం చేశారో వారికి, తమ తమ స్థానాలలో సేవ చేసిన వారికి, సేవ యొక్క ఋజువు చూపించిన వారందరికీ బాప్దాదా సేవ యొక్క శుభాకాంక్షలను మరియు మనస్సు యొక్క ఆశీర్వాదాలను ఇస్తున్నారు.
ఇప్పుడు ఇక ముందు ఏమి చేయాలి? దాదీ సందేశం పంపించారు, ఇక ముందు ఏమి చేయాలి? అని బాప్దాదా పిల్లలను చూసి సంతోషించారు కానీ ఇక ముందు ఇప్పుడు ఎవరైతే సంబంధ, సంపర్కాల్లోకి వచ్చారో ఆ ఆత్మలను విశేష గ్రూపులుగా ప్రతి సెంటర్ వారు పిలిచి వార్ పునాదిని ఫక్కా చేసి పాలన చేయండి. సంబంధం అయితే జోడించారు, అప్పుడప్పుడు వచ్చేవారు అయినా, రెగ్యులర్గా వచ్చేవారు అయినా, సంబంధంలోకి వచ్చేవారు అయినా, సంపర్కంలోకి వచ్చేవారు అయినా కానీ ఆ సంబంధంతో పాటు వారు పురుషార్థంలో ఎక్కువ శ్రమ చేయవలసిన అవసరం లేకుండా వారి యొక్క సంబంధాన్ని బాబాతో గట్టిగా జోడించండి.
వారు మాటిమాటికి మాయతో యుద్ధం చేయకూడదు. విఘ్నం రాలేని విధంగా వారి మనస్సు యొక్క సంలగ్నతను పక్కా చేయండి. ఎక్కడ బాబాతో సంలగ్నత ఉంటుందో అక్కడ మాయ యొక్క విఘ్నం రాలేదు. మాయ రావటం అసంభవం. అందువలన సందేశం ఇచ్చే సేవ చేయండి కానీ ఆ సేవ ద్వారా వచ్చిన ఫలాన్ని పరిపక్వంగా తయారుచేయండి. పచ్చిగా ఉండిపోకూడదు. ఎందుకంటే సమయం వేగంగా వెళ్తూ ఉంది. సమయంపై నమ్మకం లేదు. ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు మరియు అకస్మాత్తుగా జరుగుతుంది. ఎప్పుడు జరగనున్నదో బాప్దాదా కి తెలుసు కానీ చెప్పరు ఎందుకంటే అకస్మాత్తు పరీక్ష జరుగుతుంది. అందువలన జమా ఖాతాను బాగా పెంచుకోండి.
4. వర్తమాన సమయంలో బాప్దాదా రెండు విషయాలపై చాలా చాలా ధ్యాసను ఇప్పిస్తున్నారు - 1. స్టాప్ అనగా బిందువు పెట్టండి. 2. స్టాక్ జమ చేస్కోండి. రెండూ అవసరం. మూడు ఖనానాలను విశేషంగా జమ చేస్కోండి 1. మీ పురుషార్థం యొక్క ప్రాలబ్దం అనగా ప్రత్యక్ష ఫలాన్ని జమ చేస్కోండి 2. సదా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టం చేయాలి. కేవలం సంతుష్టంగా ఉండటమే కాదు, సంతుష్టం చేయాలి కూడా. దానికి ఫల స్వరూపంగా ఆశీర్వాదాలను జమ చేస్కోండి.
ఆశీర్వాదాల యొక్క ఖాతాను అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు జమ చేసుకుంటున్నారు కానీ నడుస్తూ - నడుస్తూ చిన్న చిన్న విషయాలలో అయోమయం అయిపోయి ధైర్యహీనులు అయిపోయి జమ అయిన ఖజానాలో అడ్డగీత పెట్టుకుంటున్నారు. 5. కనుక ఆశీర్వాదాల యొక్క ఖాతా కూడా జమ అవ్వాలి. దానికి విధి ఏమిటంటే సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టం చేయాలి. 3. సేవ ద్వారా ఫలాన్ని లేదా ఖజానాని జమ చేస్కోవాలి. మరియు సేవలో విశేషంగా నిమిత్తభావం, నిర్మాణభావం, నిర్మల మాట ఉండాలి. బేహద్ సేవ చేయాలి. నాది కాదు, బాబాది అనాలి, చేయించేవారు బాబా నాచే చేయిస్తున్నారు ఇదే బేహద్ సేవ.
ఈ మూడు ఖాతాలను పరిశీలించుకోండి. మూడు ఖాతాలు జమ అయినవా? నాది అనే భావం తెలియనివారిగా ఉండాలి. ఇచ్చామాత్రం అవిద్యాగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఏమి చేయాలి? అని ఆలోచిస్తున్నారు. 6. సీజన్ పూర్తి కావస్తుంది ఇక 6 నెలలు ఏమి చేయాలి? అనుకుంటున్నారు. ఏమి చేయాలంటే 1. ఖాతాను జమ చేసుకోవాలి, బాగా పరిశీలించుకోవాలి. ఏదో ఒక మూలలో అయినా హద్దులోని కోరిక లేదు కదా? నేను మరియు నాది అనేది లేదు కదా? తీసుకునేవారిగా లేను కదా? అని పరిశీలించుకోవాలి. విధాతగా అవ్వండి, తీసుకునేవారిగా కాదు. గౌరవం, పేరు, ప్రతిష్టదేనినీ తీసుకోవాలనే కోరిక ఉండకూడదు.
దాత మరియు విధాతగా అవ్వండి. ఇప్పుడు దుఃఖం చాలా చాలా పెరుగుతుంది మరియు ఇంకా పెరుగుతుంది. అందువలన మాస్టర్ జ్ఞాన సూర్యులై అనుభూతి యొక్క కిరణాలను వెదజల్లండి. సూర్యుడు ఒకే సమయంలో ఎన్ని ప్రాప్తులను అనుభవం చేయిస్తున్నాడు. కేవలం ఒకే ప్రాప్తి కాదు అనగా కేవలం ప్రకాశం ఇవ్వటమే కాదు, శక్తిని కూడా ఇస్తున్నాడు. అనేక ప్రాప్తులను ఇస్తున్నాడు. అదేవిధంగా మీరందరూ కూడా ఈ 6 నెలల్లో జ్ఞాన సూర్యులైనుఖం యొక్క సంతోషం యొక్క శాంతి యొక్క, సహయోగం యొక్క కిరణాలను వెదజల్లండి. అనుభూతి చేయించండి. మీ ముఖం చూడగానే దుఃఖం యొక్క అలలలో ఉన్నవారు చిరునవ్వు చిందించాలి.
మీ దృష్టి ద్వారా వారికి ధైర్యం రావాలి. కనుక ఈ ధ్యాస పెట్టుకోవాలి. విధాతగా అవ్వాలి. తపస్వీగా అవ్వాలి. మీరు ఎటువంటి తపస్సు చేయాలంటే ఆ తపస్సు యొక్క జ్వాల ద్వారా ఏదోక అనుభూతిని చేయించాలి. కేవలం వినటం కాదు, అనుభూతి చేయించండి. అనుభూతి అమరంగా ఉంటుంది. కేవలం మాట అయితే అల్పకాలికంగా మంచిగా అనిపిస్తుంది, సదాకాలికంగా గుర్తు ఉండదు. అందువలన అనుభవం యొక్క అథార్టీతో అనుభవం చేయించండి. ఎవరైతే సంబంధ సంపర్కాలలోకి వస్తున్నారో వారికి దైర్యం, ఉత్సాహ ఉల్లాసాలను మీ సహయోగం ద్వారా, బాబాతో సంబంధం ద్వారా వారికి ఇవ్వండి.
వారిని ఎక్కువ శ్రమ చేయనివ్వకండి. స్వయం శ్రమించకండి, ఇతరులను శ్రమించనివ్వకండి. నిమిత్తులు కదా! కనుక ఉత్సాహ ఉలాస్లాల యొక్క తరంగాలను తయారుచేయండి. వాటి ద్వారా గంబీరులు కూడా ఉత్సాహ ఉల్లాసాలలోకి వచ్చేయాలి. సంతోషంలో వారి మనస్సు నాట్యం చేయాలి. ఏమి చేయాలో విన్నారా? ఫలితం చూస్తాను. ఏ స్థానంలోని వారు ఎంతమంది ఆత్మలను ధృడంగా తయారుచేశారు, స్వయం ఎంత ధృడంగా అయ్యారు అనేది చూస్తాను. సాధారణ లెక్కలఖాతా చూడను అనగా ఏ పొరపాటు చేయలేదు కదా, అసత్యం మాట్లాడలేదు కదా, వికర్మ ఏదీ చేయలేదు కదా అని.
కానీ ఎంతమంది ఆత్మలను ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకువచ్చారు, అనుభూతి చేయించారు, ధృఢత అనే తాళంచివిని ఇచ్చారు అది చూస్తాను. సరేనా? చేయాల్సిందే కదా! బాప్దాదా కూడా చేస్తారా అని అనటం లేదు, చేయాల్సిందే అని ఎందుకు అంటున్నారు? మీరు చేయకపోతే మరెవరు చేస్తారు? చివరలో వచ్చేవారు చేస్తారా? మీరే కల్పకల్పం బాబా ద్వారా అధికారులు అయి ఉన్నారు, అయ్యారు మరియు ప్రతి కల్పం అవుతారా కూడా. ఇటువంటి ధృఢతతో నిండిన పిల్లల యొక్క సంఘటన బాప్ దాదా చూడవలసిందే. సరేనా? తయారవ్వవలసిందే అనే వారు చేతులెత్తండి, మనస్సు యొక్క చేయి ఎత్తాలి. ధృడ నిశ్చయం అనే చేయి ఎత్తండి. అందరూ పాస్ అయిపోయారు, అయ్యారు కదా! మంచిది.
అందరూ సంతోషమేనా? వసతి ఏర్పాట్లు చేసిన దాని కంటే ఎక్కువ మంది వచ్చారు (23 వేల మంది పైగా వచ్చారు) ఏమీ పర్వాలేదు. ఎక్కువ మంది వస్తే దాదీకి సంకల్పం వస్తుంది కదా! పెంచాలి అని. మంచిది రండి. హాలు ఎప్పుడో అప్పుడు చిన్నది అవ్వవలసిందే. అవ్వవలసిందే కదా! మొదటి వరుసలో కూర్చున్నవారు చెప్పండి అవ్వవలసిందే కదా! అప్పుడే తయారు చేస్తారు కదా! డ్రామాలో వృద్ధి జరగవలసే ఉంది. సేవాధారులు అలసిపోవటం లేదు కదా! ఇప్పటి సేవ యొక్క అవకాశం ఎవరిది? గుజరాత్వారిది. గుజరాత్ పెద్దది. గుజరాత్ వారు నిల్చోండి.
హాలులో సగం మంది గుజరాత్ వారే ఉన్నారు. (7వేల మంది ఉన్నారు) గుజరాత్ సేవాధారులు చాలా మంది వచ్చారు. అలసిపోలేదు కదా! లేదా? మాతలు చెప్పండి, రొట్టెలు చేసి చేసి అలసిపోయారా? అలసిపోకండి. అన్నింటికంటే కష్టమైన పని రొట్టెలు తయారు చేయటం. గుజరాత్ వారి వరదానం ఏమిటంటే దేశం యొక్క లెక్కతో ఎలా అయితే సమీప దేశమో అదేవిధంగా బాప్దాదా యొక్క హృదయానికి కూడా సమీపంగా ఉండాలి. ఉంటున్నారు మరియు ఉండాలి కూడా.
బాప్దాదా చూశారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే గుజరాత్ వారు హాజరైపోతారు. ఇలా హాజరు అయ్యే ఆత్మల కొరకు బాప్దాదా కూడా సదా హాజరవుతారు. మాతల యొక్క భావన మరియు ప్రేమకి విశేష శుభాకాంక్షలు, పాండవులకి సదా నెంబర్ వన్ మరియు విజయీ అయ్యేటందుకు శుభాకాంక్షలు, విచ్చేసిన వి.ఐ.పిలు అందరికీ సదా ప్రతి అడుగులో ఉత్సాహ ఉల్లాసాల ద్వారా మున్ముందు సంబంధం పెంచుకునేటందుకు, అడగడుగులో కోటానుకోట్ల సంపాదన జమ చేసుకునేటందుకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
మంచిది. నలువైపుల ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలకు, దూరంగా కూర్చుని కూడా పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకునే పిల్లలకు, సదా హోలీ అనగా పవిత్రత యొక్క పునాదిని దృఢంగా చేసుకునేవారికి, స్వప్నమాత్రపు అపవిత్రత యొక్క అంశానికి కూడా దూరంగా ఉండే మహావీర్, మహావీరిణులు అయిన పిల్లలకు, సదా ప్రతి సమయం సర్వ ఖజానాల ఖాతాను జమ చేసుకునే సంపన్న పిల్లలకు, సదా సంతుష్టమణియై సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టం చేసే బాప్ సమాన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్సృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.