రివైజ్ కోర్స్ మురళి 31-12-2005
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
కొత్తలో మీ పాత సంస్కారాలను యోగాగ్నిలో భీష్మం చేసి బ్రహ్మాచాలా సమానంగా త్యాగం, తపస్య మరియు సేవలో మొదటి నెంబర్ అవ్వండి.....
ఈరోజు బాప్దాదా నలువైపుల ఉన్నటువంటి ఎదురుగా ఉన్నా లేక దూరంగా కూర్చుని కూడా మనస్సుకి సమీపంగా ఉండే పిల్లలకు మూడు రకాలైన శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఒకటి-కొత్తజీవితం యొక్క శుభాకాంక్షలు, రెండు- క్రొత్తయుగం యొక్క శుభాకాంక్షలు, మూడు ఈరోజు క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. మీరందరు కూడా క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇచ్చేటందుకు మరియు తీసుకునేటందుకు వచ్చారు కదా! వాస్తవానికి సత్యమైన మనస్సు యొక్క సంతోషం యొక్క శుభాకాంక్షలు బ్రహ్మణాత్మలైన మీరు తీసుకుంటున్నారు మరియు ఇస్తున్నారు.
ఈరోజు యొక్క గొప్పతనమేమిటంటే వీడ్కోలు కూడా మరియు శుభాకాంక్షలు కూడా తీసుకుంటారు. వీడ్కోలు మరియు శుభాకాంక్షల సంగమయుగం. ఈరోజుని సంగమం యొక్క రోజు అని అంటారు. సంగమం యొక్క మహిమ చాలా గొప్పది. మీ అందరికీ కూడా తెలుసు, సంగమయుగానికి మహిమ ఉన్న కారణంగానే ఈరోజుల్లో పాత సంవత్సరం మరియు క్రొత్త సంవత్సరం యొక్క సంగమాన్ని ఎంత గొప్పగా జరుపుకుంటున్నారు! సంగమయుగానికి మహిమ ఉన్న కారణంగానే ఈ పాత, క్రొత్త సంవత్సరం యొక్క సంగమానికి కూడా ఇంత మహిమ ఉంది.
ఎక్కడైతే రెండు నదులు కలుస్తాయో సంగమం జరుగుతుందో దానికి కూడా మహిమ ఉంటుంది. ఎక్కడ నది మరియు సాగరం యొక్క సంగమం జరుగుతుందో దానికి కూడా మహిమ ఉంటుంది కానీ అన్నింటికంటే గొప్ప మహిమ ఈ సంగమయుగానికి మరియు పురుషోత్తమయుగానికే ఉంది. 'ఇక్కడ భాగ్యవంతులైన బ్రాహ్మణ అత్యలు కూర్చున్నారు. ఈ నషా ఉంది కదా! ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీరు ఏ సమయంలో ఉన్నారు? అని అడిగితే కలియుగంలో ఉన్నామని చెప్తారా లేక సత్యయుగంలో ఉన్నామని చెప్తారా? ఏ నిశ్చయంతో చెప్తారు?
మేము ఈ సమయంలో పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము అని చెప్తారు కదా! మీరు కలియుగీలు కాదు, సంగమయుగీలు ఈ సంగమయుగానికి విశేషంగా ఎందుకు మహిమ ఉంది? ఎందుకంటే భగవంతుడు మరియు పిల్లల కలయిక జరుగుతుంది. ఈ మేళా మరియు మిలనం ఇక ఏ యుగంలో ఉండదు. మీరు కూడా మేళా జరుపుకునేటందుకు వచ్చారు కదా! మీరు మిలనం యొక్క మేళా జరుపుకునేటందుకు ఎక్కడెక్కడి నుండి వచ్చారు! ఎప్పుడైనా కలలో అయినా డ్రామాలో నా ఆత్మకి ఇటువంటి భాగ్యం నిర్ణయించబడి ఉంది అని ఆలోచించారా?
ఆత్మకు పరమాత్మ కలయిక భాగ్యం లభించింది. బాబా కూడా ప్రతి బిడ్డ యొక్క భాగ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఓహో! భాగ్యవాన్ పిల్లలు ఓహో! అని. మీ భాగ్యాన్ని చూసి మనస్సుతో ఓహో! నేను ఓహో! ఓహో!నా భాగ్యం ఓహో! ఓహో! బాబా ఓహో! ఓహో బ్రాహ్మణ పరివారం ఓహో ఈ ఓహో ఓహో! అనే పాట స్వతహాగా వస్తుంది కదా! ఈరోజు ఈ సంగమ సమయంలో ఏ,ఏ విషయాలలో వీడ్కోలు ఇవ్వాలో ఆలోచించుకున్నారా? అందరు ఆలోచించారా? సదాకాలికంగా వీడ్కోలు ఇవ్వాలి ఎందుకంటే సదాకాలికంగా వీడ్కోలు ఇవ్వటం ద్వారా సదాకాలికంగా శుభాకాంక్షలతో జరుపుకోగలరు.
ఏ ఆత్మ ఎదురుగా వచ్చినా మీ ముఖం చూసి వారు కూడా శుభాకాంక్షలు పొంది సంతోషం అవ్వాలి. ఎవరైతే మనస్సుతో శుభాకాంక్షలు తీసుకోవటం మరియు ఇవ్వటం చేస్తారో వారు ఎలా కనిపిస్తారు? సంగమయుగీ ఫరిస్తాగా కనిపిస్తారు. అందరి పురుషార్ధం ఇదే కదా - బ్రాహ్మణుల నుండి ఫరిస్తా. ఫరిస్తా నుండి దేవత. ఎందుకంటే బాబాకి అన్ని రకాల సంకల్పాలు, ప్రవృతి యొక్క సంకల్పాలు, కర్మ యొక్క బరువు ఇచ్చేసారు కదా! బరువంతా ఇచ్చేసారా లేక కొద్దిగా ఉండిపోయిందా??? ఎందుకంటే కొద్దిగా బరువు ఉన్నా ఫరిస్తాగా అవ్వనివ్వదు. బాబా మీ బరువంతా తీసుకోవడానికి వస్తే మీకు బరువు ఇవ్వటం కష్టమా?
కష్టమా లేక సహజమా? ఎవరైతే బరువంతా ఇచ్చేసాము అంటారో వారు చేతులెత్తండి! ఇచ్చేసారా? ఆలోచించి చేతులెత్తండి బరువు ఇచ్చేసారా? ఇచ్చేస్తే చాలా శుభాకాంక్షలు. ఎవరైతే ఇవ్వలేదో వారు ఎందువలన ఉంచుకున్నారు? బరువంటే ఇష్టమా?? బరువు మంచిగా అనిపిస్తుందా? బాప్దాదా ప్రతి బిడ్డను ఏమంటారు? ఓ నా నిశ్చింతా చక్రవర్తి పిల్లలూ! అంటారు. బరువు ఉంటే చింత ఉంటుంది కదా! బరువు తీసుకునేటందుకు బాబా వచ్చారు ఎందుకంటే 63 జన్మల నుండి బరువులు ఎత్తుతూ అందరు చాలా భారీగా అయిపోయారు అందువలనే బాబా పిలలతో ప్రేమతో బరువు ఇచ్చేయండి అని చెప్తున్నారు.
అయినప్పటికీ ఎందుకు ఉంచుకుంటున్నారు? బరువు మంచిగా అనిపిస్తుందా? అన్నింటికంటే సూక్ష్మమైన బరువు - పాత సంస్కారాల బరువు. బాప్దాదా ప్రతి బిడ్డకు ఈ సంవత్సరం ఎందుకంటే సంవత్సరం హర్తయిపోతుంది కదా కనుక ఈ సంవత్సరం యొక్క చార్ట్ చూసారు. మీరందరు కూడా మీ సంవత్సరం యొక్క చార్ట్ పరిశీలించుకున్నారా? బాప్దాదా చూసారు - కొంతమంది పిల్లలకు ఈ పాత ప్రపంచం యొక్క ఆకర్షణ తక్కువగా ఉంది, పాత సంబంధాల ఆకర్షణ కూడా తక్కువగా ఉంది కానీ పాత సంస్కారాల బరువు ఎక్కువ మందిలో ఉండిపోయింది ఏదోక రూపంలో అంటే మనస్సులో అశుద్ధ సంకల్పాలు లేవు కానీ వ్యర్ధసంకల్పాల శాతం ఇప్పుడు కూడా శాతంలో కనిపిస్తుంది.
మాటలో కూడా కనిపిస్తుంది. సంబంధ, సంసర్కంలో కూడా ఏక సంస్కారాలు అప్పటికి కనిపిస్తున్నాయి. ఈరోజు బాప్దాదా పిల్లలందరికి శుభాకాంక్షలతో పాటు వెనువెంట ఇదే సైగ చేస్తున్నారు. ఈ మిగిలి ఉన్న పాత సంస్కారాలు సమయానికి మోసం చేస్తాయి మరియు అంతిమంలో కూడా మోసం చేయడానికి నిమిత్తం అవుతాయి అందువలన ఈరోజు సంస్కారాల సంస్కరణ చేయండి. ప్రతి ఒక్కరికి మీ సంస్కారాల గురించి మీకు తెలుసు, వదలానుకుంటున్నారు కూడా వాటితో విసిగిపోతున్నారు కూడా కానీ సదాకాలికంగా పరివర్తన చేసుకోవటంలో తీవ్రపురుషార్ధం చేయటంలేదు.
పురుఫార్ధం చేస్తున్నారు కానీ తీవ్రపురుషార్ధం చేయటంలేదు. కారణం ఏమిటి? తీవ్రపురుషార్ధం ఎందుకు చేయలేకపోతున్నారు? కారణమేమిటంటే, రావణుడిని చంపుతున్నారు. కానీ కేవలం చంపడమే కాదు, అంటిస్తున్నారు కూడా. చంపేటందుకు పురుషార్ధం చేస్తున్నారు, సంస్కారాలు మూర్ఛపోతున్నాయి కూడా కానీ అంటించకపోతే మూర్ఛపోయినవి మరలా మధ్యమధ్యలో వచ్చేస్తున్నాయి. కనుక పాత సంస్కారాలను సంస్కరణ చేసేటందుకు ఈ క్రొత్త సంవత్సరంలో యోగాగ్ని ద్వారా అంటించేటువంటి ధృడసంకల్పం యొక్క ధ్యాస పెట్టుకోండి. ఈ క్రొత్త సంవత్సరంలో ఏమి చేయాలి? అని అడుగుతున్నారు కదా!
సేవా విషయం వేరు కానీ మొదట స్వయం యొక్క విషయం - యోగం జోడిస్తున్నారు, బాప్దాదా పిలల్లను యోగంలో అభ్యాసిగా చూసారు. కానీ యోగాన్ని తపస్యగా చేయటంలేదు. ప్రేమతో స్మృతి చేస్తున్నారు, ఆత్మిక సంభాషణ కూడా చాలా చేస్తున్నారు, శక్తి తీసుకునే అభ్యాసం కూడా చేస్తున్నారు కానీ స్మృతిని శక్తిశాలిగా చేసుకోవటం లేదు. ఏ సంకల్పం చేస్తున్నారో దానికి వీడ్కోలు అంటే వీడ్కోలు ఇచ్చేయాలి. అంత శక్తిశాలి స్మృతి ఉండాలి. యోగాన్ని యోగాగ్ని రూపంలో కార్యంలో ఉపయోగించటంలేదు అందువలన యోగాన్ని శక్తిశాలిగా చేసుకోండి.
విశేషంగా సంస్కారాలను భస్మం చేసుకోవటంలో ఏకాగ్రతా శక్తి చాలా అవసరం. ఏ స్వరూపంలో ఏకాగ్రం కావాలంటే అలా, ఎంత సమయం ఏకాగ్రం కావాలంటే అంత సమయం ఇలా ఏకాగ్రతతో సంకల్పం చేయగానే భస్మం అయిపోవాలి దీనినే యోగాగ్ని అని అంటారు. గుర్తులన్నీ సమాప్తి అయిపోవాలి. చనిపోయిన తర్వాత కూడా శవం ఉంటుంది కదా! అంటించేసిన తర్వాత మొత్తం సమాప్తి అయిపోతుంది. ఈ సంవత్సరం యోగాన్ని శక్తిశాలిగా చేసుకోండి.
ఏ స్వరూపంలో ఉండాలంటే అంటే మాస్టర్ సర్వశక్తివంతులు అంటే ఆజ్ఞాపించారు అంటే సమాప్తి చేసుకునే శక్తి మీ ఆజ్ఞ అంగీకరించక పోవటమనేది ఉండకూడదు. యజమానులు. మాస్టర్ కదా! మాస్టర్ అజ్ఞాపించగానే శక్తి రావటంలేదు అంటే వారిని మాస్టర్ అని అంటారా? బాప్దాదా చూసారు, పాత సంస్కారాల అంశం ఇప్పుడు కూడా ఇంకా కొంచెం ఉండిపోయింది ఆ అంశం మధ్య మధ్యలో వంశాన్ని కూడా పుట్టిస్తుంది. అరు కర్మ వరకు కూడా వచ్చేస్తుంది. యుద్ధం చేయాల్సి వస్తుంది. సమయానుసారం బాప్దాదా పిల్లలను యుద్ధ స్వరూపంలో చూడాలనుకోవటంలేదు. ప్రతి ఒక్కరిని యజమానిగా చూడాలనుకుంటున్నారు. ఆజ్ఞాపించగానే హాజరవ్వాలి.
ఈ సంవత్సరం స్వయం ఏమి చేయాలో విన్నారా? శక్తిశాలిగా, నిర్మింతా చక్రవర్తిగా అవ్వాలి ఎందుకంటే ఎవరిని అడిగినా అందరి లక్ష్యం ఏమిటి? మేము విశ్వరాజ్యాన్ని పొందుతాము విశ్వరాజ్యాధికారి అవుతాము అని అంటారు. స్వయాన్ని రాజయోగి అని అంటున్నారు కదా ప్రజా యోగులా? ఈ సభలో ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా? రాజయోగులు కాకుండా. ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా? టీచర్స్లో ఎవరైనా ఉన్నారా? మీ సేవాకేంద్రంలో ఎవరైనా ఉన్నారా? అందరు రాజయోగులే కదా! ప్రజాయోగులలో ఎవరు చేయి ఎత్తడంలేదు. మంచిగా అనిపించడంలేదు కదా!
బాబాకి కూడా సంతోషంగా ఉంది. బాబా నషాతో సంగమయుగంలో ప్రతి బిడ్డ రాజా బిడ్డ అని చెప్తున్నారు. నా ప్రతి బిడ్డ రాజా బిడ్డ అని ఏ తండ్రి ఇలా నిశ్చయంతో చెప్పలేదు కానీ నా ప్రతి బిడ్డ స్వరాజ్యాధికారి రాజా అని బాప్దాదా చెప్తున్నారు. ప్రజాయోగులలో చేతులు ఎత్తలేదు అంటే రాజులే కదా! ఏదైనా ఆజ్ఞాపిస్తే రాని విధంగా బలహీన రాజులుగా కూడా ఉండకూడదు. రాజయోగులం అని అనుకునేవారు చేతులు ఎత్తండి! పైన కూడా కూర్చున్నారు. గ్యాలరీలో కూర్చుని చేతులు ఊపుతున్నారు, ఈరోజు హాల్లో 18 వేల మంది సోదరీ, సోదరులు కూర్చున్నారు) పైన ఉన్నవారు చేతులు ఎత్తండి .బాప్దాదా చూస్తున్నారు.
ఇప్పుడు ఇది అంతిమ టర్న్ కదా కనుక బాప్దాదా మూడు నెలలకు పని ఇస్తున్నారు. ఇమ్మంటారా? హోమ్ వర్క్ ఇస్తున్నారు ఎందుకంటే ఇలా మధ్య మధ్యలో ఇచ్చే హోమ్వర్క్ కూడా అంతిమంలో జమ అవుతుంది. మూడు నెలల్లో ప్రతి ఒక్కరు మీ చార్ట్ పరిశీలించుకోండి నేను మాస్టర్ సర్వశక్తివాన్ అయ్యి ఏ కర్మేంద్రియానికి అయినా, ఏ శక్తికి అయినా ఎప్పుడు ఏ ఆ ఇచ్చినా, ఏ ఆజ్ఞ ఇచ్చినా అది ప్రత్యక్షంగా మీ ఆజ్ఞను పాటిస్తుందా లేక లేదా? అని. చేయగలరా?
మొదటి వరసలో కూర్చున్నవారు చేయగలరా? చేతులు ఎత్తండి! మంచిది, మూడు నెలలు ఏ పాత సంస్కారం యుద్ధం చేయకూడదు. సోమరిగా అవ్వకూడదు, అయిపోతుంది.... అనే రాయల్ సోమరితనంలోకి రాకూడదు బాప్దాదా తో చాలా మధురాతి మధురమైన విషయాలు చెప్తున్నారు. తయారైపోతాము, బాబా మీరు చింతించకండి అని.బాప్దాదా ఏమి చేస్తారు? విని నవ్వుకుంటున్నారు. కానీ బాబా ఈ మూడు నెలలలో ఇటువంటి విషయాలు అంగీకరించరు. అంగీకారమైతే చేతులు ఎత్తండి! సభలో ఉన్నాము కదా అని చేతులు ఎత్తకండి, మనస్సుతో ఎత్తండి!
కొన్ని విషయాలు సహించవలసి వచ్చినా, కొన్ని వదలవలసి వచ్చినా ఏమీ పర్వాలేదు | కానీ చేయాల్సిందే, పక్కాయేనా? పక్కాయేనా? పక్కాయేనా? టీచర్స్ చేస్తారా? మంచిది. ఈ కిరీటం ధరించి ఉన్నవారు ఏమి చేస్తారు? చిన్న పిల్లలు కిరీటం ధరించి. ఎదురుగా కూర్చున్నారు) కిరీటం మంచిగా పెట్టుకున్నారు కదా? చేయాల్సి ఉంటుంది. మంచిది. పిల్లలు చేతులు ఎత్తుతున్నారు. ఒకవేళ చేయకపోతే ఏమి చేయాలి? అది కూడా చెప్పండి. అయితే చేయకపోతే బాగ్దాదా మిమ్మల్ని ఒక సీజన్లో రానివ్వరు. ఎందుకంటే బాబా చూస్తున్నారు. సమయం మీ కొరకు ఎదురుచూస్తుంది.
మీరు సమయం కోసం ఎదురు చూసేవారు. కాదు, తయారయ్యేవారు కానీ సమయం మీ కోసం ఎదురుచూస్తుంది. ప్రకృతి కూడా, సత్వప్రదాన ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మూడు నెలల్లో మీ శక్తిశాలి స్థితి ద్వారా మీలో ఉండిపోయిన సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి. ఇలా మూడు నెలలు ధ్యాస పెట్టుకుంటే తర్వాత కూడా అభ్యాసం అయిపోతుంది. ఒకసారి పరివర్తన చేసుకునే పద్ధతి వస్తే అది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు వినాశనం అవుతుంది. ఎప్పుడు వినాశనం అవుతుంది అని సమయం కోసం మీరు ఎదురుచూడకండి.
పైకి అడగటంలేదు కానీ ఆత్మికసంభాషణలో అడుగుతున్నారు లోపల ఎప్పుడు వినాశనం అవుతుందో తెలియదు అని మాట్లాడుతున్నారు. రెండు సంవత్సరాలలో అవుతుందా, 10 సంవత్సరాలలో అవుతుందా, ఎన్ని సంవత్సరాలలో అవుతుంది? అని సమయం మీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఎందురు ఎదురుచూడాలి! బాబాని తేదీ చెప్పండి, సంవత్సరం చెప్పండి, 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా చెప్పండి అని అడుగుతున్నారు. బాప్దాదా పిల్లలను ప్రశ్నిస్తున్నారు - మీరందరు బాబా సమానంగా అయిపోయారా?
పరదా తెరవమంటారా లేక పరదా తెరిచేటప్పటికి కొంతమంది తల దువ్వుకుంటూ, కొంతమంది ముఖానికి క్రీమ్ రాసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది! మీరు ఎవరెడ్డిగా, సంస్కారాలను సమాప్తి చేసేసుకుంట బాప్దాదాకి పరదా తెరవటంలో ఆలశ్యం అవుతుందా! ఎవరెడ్డి అవ్వాలి కదా! అయిపోతాము, అయిపోతాము అని చెప్తూ బాబాని చాలా సమయం నుండి సంతోషం చేస్తున్నారు, ఇప్పుడిక ఇలా చెప్పటం కాదు, తయారవ్వాల్సిందే, చేయాల్సిందే. బాబా సమానంగా అవ్వాలి అనే దానిలో అందరు చేతులు ఎత్తుతున్నారు కానీ చేతులు ఎత్తవలసిన అవసరం లేదు.
బ్రహ్మాబాబాని చూడండి, సాకారంలో బ్రహ్మాబాబాని అనుసరించాలి కదా! బ్రహ్మాబాబా అంతిమ ఘడియ వరకు త్యాగం, తపస్య, సేవ యొక్క సాకార రూపాన్ని ప్రత్యక్షంగా చూపించారు. శివబాబా చెప్పిన మహావాక్యాలను ఉచ్చరించే తన బాధ్యతను అంతిమ ఘడియ వరకు నిలుపుకున్నారు. అంతిమ మురళి జ్ఞాపకం ఉందా? మూడు మాటల వరదానం జ్ఞాపకం ఉందా? (నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అవ్వండి) ఎవరికి జ్ఞాపకం ఉందో వారు చేతులు ఎత్తండి! మంచిది, అందరికీ జ్ఞాపకం ఉంది, శుభాకాంక్షలు. చివరి రోజు వరకు త్యాగం కూడా చేసారు, తన పాత గుడిసెను వదలలేదు.
పిల్లలు ఎంతో ప్రేమతో చెప్పినా కానీ అవి పిల్లల్ల కోసమే తయారుచేసాను అని స్వయం ఉపయోగించుకోలేదు మరియు సదా రెండున్నర, మూడు గంటలకు లేచి స్వయం కొరకు తపస్య చేసి సంస్కారాలను ధన్యం చేసుకున్నారు కనుకనే కర్మాతీతంగా, అవ్యక్తంగా ఫరిస్తాగా అయ్యారు. ఏది ఆలోచించేవారో అది చేసి చూపించేవారు. చెప్పటం, ఆలోచించటం మరియు చేయటం మూడు సమానంగా ఉండేవి కనుక తండ్రిని అనుసరించండి. అంతిమం వరకు తన కర్తవ్యాన్ని పూర్తి చేసారు. ఉత్తరాలు కూడా వ్రాసేవారు, ఎన్ని ఉత్తరాలు వ్రాసారు సేవను కూడా వదలలేదు. కనుక తండ్రిని అనుసరించండి.
అఖండ మహాదాని మహాదాని కాదు, అఖండ మహాదాని యొక్క ప్రత్యక్షరూపాన్ని అంతిమం వరకు చూపించారు. అంతిమం వరకు ఏ ఆధారం లేకుండా తపస్విగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కూర్చోవడానికి ఏదోక ఆధారం తీసుకుంటున్నారు కదా! కానీ బ్రహ్మాబాబా ఆది నుండి అంతిమం వరకు తపస్వీ రూపంలోనే ఉన్నారు. కళ్ళకు కళ్ళజోడు పెట్టుకోలేదు ఇదే బాబా యొక్క సూక్ష్మశక్తి, నిరాధారంగా ఉండేవారు. శరీరం పాతది, రోజు రోజుకి ప్రకృతి యొక్క నీరు, గాలి• కలుషితం అయిపోతున్నాయి అందువలన బాప్దాదా మీకు చెప్పటంలేదు. ఆధారం ఎందుకు తీసుకుంటున్నారు అని అనటంలేదు.
కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నారు అని అనటంలేదు. భలే పెట్టుకోండి కానీ తప్పకుండా శక్తిశాలి స్థితిని తయారుచేసుకోండి. మొత్తం విశ్వం యొక్క కార్యం పూర్తి చేసారా? బాప్దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు - విశ్వకళ్యాణ కార్యం పూర్తయిపోయింది. అని మీరందరు సంతుష్టం అయిపోయారా? విశ్వకళ్యాణ కార్యం సమాప్తి అయిపోయింది. అనుకుంటున్నవారు చేతులు ఎత్తండి! ఒక్కరు కూడా లేరా? మరి వినాశనం అవుతుందని ఎం చెప్తున్నారు? పని పూర్తి చేయలేదు. అందరు కొత్త సంవత్సరంలో ఏమి చేయము? అని ప్రశ్నిస్తున్నారు. బాప్దాదా చెప్తున్నారు. సందేశమిచ్చే మెగా ప్రోగ్రామ్స్ అయితే చాలా చేసారు దానికి బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు.
చేసింది మంచిగా చేసారు, సందేశం ఇచ్చారు కానీ అనుభవం చేయించలేదు. దీనిలో అక్కడ, ఇక్కడ ఒకరికొకరు ఉత్సాహ, ఉల్లాసాలు ఇప్పించుకుంటూ, ఆ ఉత్సాహ, ఉల్లాసాలను చూసి కూడా ఉత్సాహ, ఉల్లాసాలతో చేసారు, ఫలితం కూడా బాగా వచ్చింది కానీ ఇప్పుడు రాయల్ (ఉన్నత) ప్రజలను తయారుచేసే ప్లాన్ తయారుచేయండి. రాయల్ ప్రజలు అంటే సమీప సంబంధంలోకి వచ్చేవారు. సంబంధ, సంపర్కంలోకి వచ్చేవారిని మొదట 9 లక్షల మందిన తయారుచేయండి. ఇప్పుడు 9 లక్షల మంది తయారైపోయారా? అయిపోయారా? 9 లక్షలు అయిపోయారా? లిస్ట్ ఎవరు తీస్తారు?
( లిస్ట్ ఇప్పుడే వస్తుంది, ముందు సంవత్సరానికి 8 లక్షల 12 వేల మంది) కానీ 9 లక్షల మంది తయారయ్యారా, ఏవిధమైన వారు తయారయ్యారు. వారు సమీప రాయల్ ప్రజలుగా అయ్యే యోగ్యులేనా? ఇది కూడా పరిశీలించుకోవాలి కదా! మంచిది. ఇప్పుడు లెక్కలఖాతా తీయండి. ఒకటి, 9లక్షల మంది మొదటి జన్మ యొక్క ప్రజలు, రాయల్ ఫ్యామిలీ (ఉన్నత కుటుంబీకులు) కావాలి కదా! రేపే వినాశనం చేసేస్తే ఉన్నత ప్రజల తయారైపోయారా? తయారైపోయారా? లేక తయారుచేయాల్సి ఉంటుందా?
అందరినీ అలా కలిపేస్తే కలిసిపోతారు కానీ లక్షణాలు కలిగిన వారు కావాలి కదా! సంబంధ, సంపర్కంలోకి వచ్చేవారిని కలిపేస్తే 9 లక్షల మంది అయిపోతారు కానీ బాప్దాదా చెప్తున్నారు, మొదటి నెంబర్ ప్రజలు మంచి నెంబర్ ఉంటారు కదా ఎందుకంటే వారికి కూడా అన్నీ వన్, వన్, వన్ గా లభిస్తాయి. మొదటి నెంబర్, మొదటి తారీఖు, మొదటి సంవత్సరం, మొదటి రాజధాని ఉంటుంది కనుకు మొదట ఇలా లక్షణాలు కలిగిన 9 లక్షల మంది తయారయ్యారా? అని పరిశీలించుకోండి. రాయల్ ప్రజలు తయారయ్యారా? ఉన్నత కుటుంబం కూడా తయారవ్వాలి కదా!
ఈ సంవత్సరం సంస్కారాలను సమాప్తి చేసుకోవాలి. బాషాకి సంకల్పమేమిటంటే -మీ. మీ సేవాకేంద్రాలలో ఈ యోగాభ్యాసం యొక్క ఉన్నతమైన ప్రోగ్రామ్ పెట్టుకోవాలి మరియు లక్ష్యం పెట్టుకోండి, ఒకే తారీఖులో దేశ, విదేశాలలో ఒకే సమయంలో బ్రహ్మాకుమారీల అన్ని సేవాకేంద్రాలలో ఈ ప్రోగ్రామ్ జరగాలి మరియు ఈ ప్రోగ్రామ్ పేపర్లో రావాలి మరియు దీనిలో ఒక లక్ష్యం పెట్టుకోండి, కేవలం కామెంట్రీతో యోగం చేయించటం కాదు, అనుభవం చేయించాలి. అనుభవమనేది పక్కాగా చేస్తుంది. ఒకే సమయంలో, ప్రతి సేవాకేంద్రంలో ఒకే ప్రోగ్రామ్ జరగాలి మరియు ప్రతి సేవాకేంద్రం.
యొక్క అనుభవం ఏమిటి అనే ఫలితం వ్రాయాలి. 3 రోజులు ప్రోగ్రామ్ చేయండి. ఒక రోజు చేయండి కానీ నలువైపులు అందరు కలిసి ఎలా అయితే మూడవ ఆదివారం అన్నివైపుల యోగం చేస్తున్నారు కదా అలాగే ఇప్పుడు నలువైపుల ఇప్పుడు అనుభవం చేయించే ప్రోగ్రామ్ చేయాలి. ఒకే సమయం, ఒకే లక్ష్యం కానీ నలువైపుల జరగాలి. దేశంలో అందరు విశ్వశాంతి కోసం వీరందరు కలిసి ఒకే సమయంలో ప్రోగ్రామ్ పెట్టారు అని అనుకోవాలి దీనిలో అనుభవీగా చేసే లక్ష్యం పెట్టుకోండి కేవలం విని వెళ్ళిపోకూడదు, ఏదోకటి అనుభవం చేసుకుని వెళ్ళాలి. మీరు కూడా బాబా వారిగా ఎలా అయ్యారు?
ఏదోకటి అనుభవం చేసుకున్నారు. ప్రేమ యొక్క అనుభవం చేసుకున్నారు లేదా టోలీ (ప్రసాదం) తిని అయినా ప్రేమ యొక్క అనుభవం చేసుకున్నారు, అక్కయ్యల నడవడిక ద్వారా అనుభవం చేసుకున్నారు, అక్కయ్యల చిరునవ్వు ద్వారా అనుభవం చేసుకున్నారు, శ్రీ మర్యాదను అనుభవం చేసుకున్నారు ఏదోకటి అనుభవం చేసుకున్నారు కనుకనే బాబా వారిగా అయ్యారు కదా! అలా అందరిని కూడా అనుభవీగా చేయండి. ఇప్పుడు అఖండ సేవ చేయండి. చాలా సేవ మిగిలి ఉంది. మంచిది. ఈరోజు అయితే ఒకరికొకరు శుభాకాంక్షలైతే ఇచ్చుకున్నారు కదా!
రెండవది ఏమి చేస్తున్నారు? బహుమతి ఇస్తున్నారు. బాప్దాదా దగ్గరకి కూడా ఎన్ని బహుమతులు వచ్చాయి, చాలా కార్డులు వచ్చాయి, సుందరమైన బహుమతులు పంపారు మీరు లేచి నిల్చుని వాటిని చూడండి. వాస్తవానికి మీ దగ్గరకు ఎవరు వచ్చినా ఖాళీగా వెళ్ళకూడదు. మనస్సు ద్వారా శక్తినిచ్చే బహుమతి ఇవ్వండి, మాట ద్వారా జ్ఞానం యొక్క బహుమతి ఇవ్వండి, కర్మ ద్వారా గుణాల బహుమతి ఇవ్వండి. ఖాళీ చేతులతో పంపకండి. మీరు మాస్టర్ దాతలు, మాస్టర్ దాత దగ్గరకు వచ్చినవారు ఖాళీ చేతులతో వెళ్ళటమనేది ఉండదు. అఖండ మహాదానిగా అవ్వండి. అఖండం అంటే ఏదోక సేవ చేస్తూ ఉండండి.
మనస్సు ద్వారా చేయండి, మాట ద్వారా చేయండి, కర్మ ద్వారా చేయండి లేదా సంబంధ, సంపర్కాల ద్వారా చేయండి. అఖండ సేవాధారిగా అవ్వండి. కొంతమంది పిల్లలు బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ అమృతవేళ కొద్దిగా బద్దకం యొక్క తరంగాలు ఉంటున్నాయి అని చెప్తున్నారు. తప్పకుండా చేస్తున్నారు కానీ స్వయం పట్ల మరియు విశ్వానికి శక్తినివ్వటంలో శక్తిశాలిగా ఉండటానికి బదులు కొద్దిగా అలసట యొక్క రేఖ ఉంటుంది. ఆ సమయంలో నేను సేవాకేంద్రంలో యోగం యొక్క గదిలో కూర్చున్నాను, బాబా గదిలో కూర్చున్నాను, క్లాస్ రూమ్లో కూర్చున్నాను అని అనుకోకండి కానీ విశ్వమనే వేదికపై కూర్చున్నాను అని అనుకోండి.
హీరో పాత్రధారిని మరియు వేదికపై కూర్చున్నాను అని అనుకోండి. హీరో పాత్రధారి అలసట యొక్క పాత్రను అభినయిస్తే ఎలా ఉంటుంది? వాయుమండలం ఎలా ఉంటుంది? కనుక అమృతవేళను శక్తిశాలిగా చేసుకోండి. నియమాన్ని మంచిగా నిలుపుకుంటున్నారు కానీ చెప్పాను కదా ఇప్పుడు యోగం శక్తులతో శక్తిశాలిగా ఉండాలి. యోగం అగ్నిలా ఉండాలి.. జ్వాలాముఖీగా ఉండాలి. ఈ మూడు నెలలు విశేషంగా అమృతవేళ కూడా నోట్ చేసుకోవా విషయాలు చాలా మంచిగా చెప్తున్నారు. ప్రేమ స్వరూపంగా కూడా ఉంటున్నారు కానీ జ్వాలారూపం తక్కువగా ఉంటుంది.
ఇప్పుడు సంస్కారాలు అంశ మాత్రంగా కూడా ఉండకూడదు అప్పుడే మిమ్మల్ని జ్వాలారూపీ యోగీ ఆత్మ అని అంటారు మరియు వెనువెంట ఈ క్రొత్త సంవత్సరంలో ఏవైతే ఖజానాలు లభించాయో జ్ఞానం యొక్క ఖజానా, శక్తుల యొక్క ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ట సంకల్పాల ఖజానాలను ఒకటి, సఫలం చేసుకోండి మరియు రెండు, జమ చేసుకోండి. జమ కూడా చేసుకోండి మరియు సఫలం చేసుకోండి ఎందుకంటే మీ బిరుదు మరియు వరదానం-- సఫలతా సితార. అందరు నిశ్చయంతో సఫలత మా కంఠహారం, సఫలత మా జన్మ సిద్ద అధికారం 'అని చెప్తున్నారు కదా!
మీరు సఫలతామూర్తులు, కనుక సఫలం చేసుకోండి మరియు జమ చేసుకోండి. సేవ ఎంత చేస్తున్నా జమ అయ్యిందా లేక లేదా అనే దానికి గుర్తు లేదా స్వర్ణిమ తాళంచెవి. నిమిత్తభావం, నిర్మాణభావం మరియు నిర్మల మాట. ఈ మూడు ఉన్నాయా? మూడింటిలో ఒకటి తక్కువైనా సేవ ఎంత చేసినా జమ అవ్వదు. చాలా కొద్దిగా, నామమాత్రంగా జమ అవుతుంది. బాప్దాదా ఇది కూడా పరిశీలించారు - సేవ అయితే చాలా చేస్తున్నారు కానీ జమాఖాతా ఎంత ఉండాలో అంత ఉండటంలేదు దీనికి కారణం ఏమిటి? కారణమైతే చేసుకుంటున్నారు కదా! ఒకటి, మూడు విశేషతలలో, నిమిత్తభావంలో నాది అనే భావం కలిసిపోతుంది. నాది అనే భావం వచ్చింది అంటే జమ అవ్వదు.
ఎంత శ్రమ చేసినా, రాత్రి, పగలు పరుగు పెట్టి సేవ చేసినా, ఎంత బుద్ధితో ఆలోచించి సేవ చేసినా నిమిత్తభావం, నిర్మాణభావం, నిర్మలమాట ఈ మూడు కనుక లేకపోతే జమ అవ్వదు. ఎక్కువలో ఎక్కువ 5 శాతం జమ్మ అవుతుంది. కనుక జమ అయ్యిందా? అనేది పరిశీలించుకోండి. బాప్దాదా చాలా సహజమైన 'మార్గం చెప్తున్నారు. ఎవరి సంబంధ, సంపర్కంలోకి వస్తున్నా, లౌకికం అయినా, అలౌకికం అయినా మొదట మీ శుభభావన, శుభకామన యొక్క వృత్తిని పరిశీలించుకోండి మరియు ఎవ్వరిని కలుసుకుంటున్నా సదా ఆత్మను చూస్తూ మాట్లాడండి.
ఆత్మతో మాట్లాడుతున్నాను అనుకోండి. అలౌకిక పరివారంతో మాట్లాడుతున్నా వీరు కల్పపూర్వపు ఆత్మలు, ప్రతి కల్పం భాగ్యాన్ని తయారుచేసుకునే కోట్లలో కొద్దిమందిలో ఒక ఆత్మ అనే భావనతో చూడండి. కాల్బలం వారైనా కోట్లలో కొద్దిమంది. నా బాబా అని అయితే అంటున్నారు కదా? క్రోధీ ఆత్మ అయినా, స్వభావం, మంచిగా లేకపోయినా కానీ మీరు మీ స్వభావాన్ని శ్రేష్టంగా ఉంచుకోండి. వీరు శ్రేష్టాత్మ అనే రూపంలో చూడండి. శ్రేష్టాత్మ అనే స్వరూపంలో చూడండి. అప్పుడు కార్యం మంచిగా అవుతుంది. మరియు జమ అవుతుంది. ఈ సంవత్సరం హోమ్వర్క్ చాలా లభించింది.
ఏం చేయము, ఎం చేయము, ఏం చేయము... అని అందరు అడుగుతున్నారు కదా! చాలా హోమ్వర్క్ లభించింది. ఏ పిల్లలైతే ఈ హోమ్వర్క్ నెంబరన్ పాస్ అవుతారో వారికి బాప్దాదా బహుమతి ఇస్తారు. వేలు మంది తయారైనా బహుమతి ఇస్తారు. బహుమతులు తయారుచేయిస్తాను. కానీ సర్టిఫికెట్ తీసుకోవాలి. మీరు చెప్తే బాబా ఏమీ అంగీకరించరు, సహయోగుల ద్వారా కూడా సర్టిఫికెట్ తీసుకుంటారు. మొదట మనస్సు యొక్క సర్టిఫికెట్ తర్వాత బ్రాహ్మణ పరివారంలో సహయోగుల ద్వారా సర్టిఫికెట్ మరియు మూడవది, బాబా ద్వారా సర్టిఫికెట్. మరి సర్టిఫికెట్ తీసుకుంటారు. కదా! ధైర్యం ఉంది కదా!
ఎవరైతే మేము సర్టిఫికెట్ తీసుకునే తీరతాము అనే దృడనిశ్చయంతో ఉన్నాము అంటారో వారు చేతులు ఎత్తండి. మంచిది, యువకులు కూడా ఎత్తుతున్నాడు. మంచిది. బుల్ విదేశీయులు కూడా ఎత్తుతున్నారు. చేసి చూపిస్తారా? చేతులు పెద్దగా ఎత్తండి! (అందరు రైతులు ఎత్తారు) అయితే చాలా బహుమతులు తయారుచేయించాల్సి ఉంటుంది. మీ తయార్సీ ముందు ఈ బహుమతులు తయారుచేయించటం గొప్ప విషయమేమి కాదు. మొదట అయితే పరమాత్మ హృదయసింహాసనం లభిస్తుంది మరలా బహుమతి కూడా ఇస్తాను. మంచిది, ఇప్పుడు ఎమి చేయాలి?
నలువైపుల నుండి పిల్లలందరి కార్డులు, పత్రాలు మరియు ఈమైల్ ద్వారా, రకరకాలైన సాధనాల ద్వారా శుభాకాంక్షల సమాచారం అందింది , బాప్దాదా వారికి కూడా శుభాకాంక్షలు సంపారు వారందరికి కోటాను కోట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాప్దాదా దూరంగా కూర్చున్న. పిల్లలను కూడా సన్ముఖంగా చూస్తున్నారు. ఎంతో ఉత్సాహ, ఉల్లాసాలతో తమ, తమ స్థానాలలో కూర్చున్నారు. వింటున్నారు అది చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. పిల్లలు కూడా సంతోషిస్తున్నారు. మరియు శుభాకాంక్షలు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. బాప్దాదా సమాచారం విన్నారు, రాత్రిని కూడా పగలుగా చేసుకుంటున్నారు.
అటువంటి పిల్లలకు ఎన్ని సార్లు మనస్సుతో ఆశీర్వాదాలు మరియు ప్రేమను ఇవ్వను? ఉత్సాహ, ఉల్లాసాలు మంచిగా ఉన్నాయి మరియు ఇంకా మంచిగా ఉంటాయి, ఇప్పుడు దూరంగా కూర్చున్నవారు అందరు బహుమతి తీసుకోవటంలో మొదటి నెంబర్ అవ్వాలి. మంచిది. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి! బాప్దాదా పిల్లలందరిని చూసి సంతోషిస్తున్నారు. ఎవరైతే క్రొత్తగా వచ్చారో వారు వేగంగా ముందుకి వెళ్ళి మొదటి నెంబర్లోకి వచ్చి చూపించాలి.
ప్రతి టర్న్ క్రొత్తవారు వస్తున్నారు. ఇప్పుడు కేవలం అమరంగా ఉండాలి. మరియు అమరంగా చేయాలి. అమరభవ అనే వరదానాన్ని స్వయానికి స్వయం ఇచ్చుకోవాలి. మంచిది. మాతలు చాలా మంది ఉన్నారు. సంగమంలో మాతల యొక్క టర్న్ పాండవులు కూడా తక్కువ కాదు. మంచిది, పాండవులు కూర్చోండి. మాతలు నిల్చుని ఉండండి. మాతలు చాలా మంది ఉన్నారు. మంచిది.
నలువైపుల ఉన్నటువంటి సదా ఉత్సాహ, ఉల్లాసాలతో ముందుకు వెళ్ళేవారికి, సదా ధైర్యంతో బాగ్దాదా యొక్క కోటాను కోట్ల సహాయానికి పాత్రులైన పిల్లలకు, సదా విజయీ రత్నాలకు, ప్రతి సమయం విజయీగా అయ్యి, ఇప్పుడు కూడా విజయీగా మరియు ప్రతి కల్పం విజయీగా అయ్యేవారికి, సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అనే స్మృతితో ప్రపంచం యొక్క ఆకర్షణ లేకుండా, సంస్కారాల యొక్క ఆకర్షణ లేకుండా, ఇలా ఈ రెండింటి ఆకర్షణకు ముక్తిగా ఉండే వారికి, సదా బాబా సమానమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.