రివైజ్ కోర్స్ మురళి 09-03-2009
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
హోలీ యొక్క విశేష బహుమతి - రోజూ మధ్యమధ్యలో పఠిస్తా దుస్తులను ధరించటం మరియు పాత సంస్కారాలను కాల్చటం
ఈరోజు పవిత్ర తండ్రి తన యొక్క పవిత్ర పిల్లలతో హోలీ జరుపుకునే టందుకు వచ్చారు. పిల్లలందరూ పవిత్రమైన పిల్లలు. మీరందరు కూడా హోలీ జరుపుకునేటందుకు వచ్చారు. పవిత్ర ఆత్మలైన మీపై ఏ రంగు అంటిందో, దాని ద్వారా మీరు పవిత్రంగా అయ్యారో ఆలోచించండి! రంగులు అయితే అనేకం కానీ మీకు ఏ రంగు అంటినది? అన్నింటికంటే శ్రేష్టమైన రంగు ఏది; దాని ద్వారానే మీరు పవిత్రంగా అయ్యారు? అన్నింటికంటే గొప్ప రంగు పరమాత్మ సాంగత్యం యొక్క రంగు.
పరమాత్మ సాంగత్యం అనే రంగుని అంటించుకోవటం ద్వారా సహజంగా పవిత్రంగా అయిపోయారు ఎందుకంటే పరమాత్మ సాంగత్యం అవినాశి సాంగత్యం యొక్క రంగు. ఇతర రంగులు అయితే కొద్దిసమయమే అంటి ఉంటాయి కానీ పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటడం ద్వారా సహజంగానే పవిత్రం అయిపోయారు. ఆత్మ యొక్క రంగు అపవిత్రత నుండి పవిత్రం అయిపోయింది ఎందుకంటే మీరందరు పరమాత్మను మీ తోడుగా చేసేసుకున్నారు, పరమాత్మ సాంగత్యం చేశారు కనుక ఇద్దరూ కలిసిపోయారు. ఇలా కలిసిఉన్న రూపం చాలా ప్రియంగా ఉంటుంది.
ఈ కంబైండ్ రూపం ఎప్పుడూ వేరు అవ్వలేదు. అనుభవం ఉంది కదా! సదా బాబాతో కలిసే ఉంటున్నారు కదా, ఒంటరిగా లేరు కదా! ఒంటరిగా చేయడానికి మాయం ప్రయత్నిస్తుంది కానీ సదా కలిసి ఉండేవారు ఎప్పుడూ కూడా వేరు అప్పలేరు. మాయ ఇద్దరినీ వేరు చేసేసి పాత సంస్కారాలను తీసుకువస్తుంది, అలా పాత సంస్కారాలు బయటకి వస్తే శుద్ద సంస్కారాలు గుప్తం అయిపోతాయి. పాత సంస్కారాలు అంటే సోమరితనం మరియు నిర్లక్ష్యం; ఇవి రకరకాల రూపాలలో రావటం వలన కంబైండ్ రూపం నుండి వేరు అయిపోతున్నారు.
ప్రతి ఒక్కరు పరిశీలించుకోండి-సదా కంబైండ్గా ఉంటున్నారా? లేక అప్పుడప్పుడు ఒంటరిగా అయిపోతున్నారా? మాయ యొక్క అనేక స్వరూపాలు మీకు తెలిసిపోయినవి కదా! మాయ తెలివిగా తన రంగుని అంటిస్తుంది. బాబాతో వేరవ్వటం అంటే మాయా రంగుని అంటించుకోవటం. సోమరితనం మరియు నిర్లక్ష్యం చాలా రకరకాల రూపాలలో వస్తాయి ; ఈవిధంగా మాయ తన వైపుకి ఆకర్షించుకుంటుంది. సోమరితనం మరియు నిర్లక్ష్యం అనేవి రావణుని ఖజానాలు, బాబా ఖజానాలు కావు. నేను చేయాలనుకోవటం లేదు కానీ ఇది నా సంస్కారం అని రావణుని ఖజానాను చాలా నషాగా చెప్తున్నారు.
నా సంస్కారం అని అంటున్నారు. ఇవి పరమాత్మ ఖజానాలా? లేక రావణుని ఖజానాలా? వాటిని నా సంస్కారం అనటం సరైనదా? వాటిని మీవిగా చేయటం మాయ యొక్క తెలివి. బాబా ఖజానాలు ప్రియమా లేక రావణుని ఖజానాలు ప్రియమా? నేను చేయాలనుకోవటం లేదు కానీ ఇది నా సంస్కారం అని చాలా సాధారణ పద్ధతిలో స్వయం తప్పించుకునేటందుకు పిల్లలు ఇది నా సంస్కారం అని అనేస్తున్నారు. కానీ నిజంగా అవి మీవేనా ఆలోచించండి! బాబా చెప్తున్నారు - రావణుని ఖజానాను మీదిగా చేసుకోవటం ద్వారా మీలో ఉన్న శుద్ధ సంస్కారాలు నెమ్మదినెమ్మదిగా సమాప్తం అయిపోతాయి.
పరమాత్మ సాంగత్యం యొక్క రంగు వెలసిపోతుంది, మాయా రంగు ప్రత్యక్షమైపోతుంది. కనుక నడుస్తూ నడుస్తూ ఏ రంగు అంటి ఉంది అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. హోలీ రోజున ప్రజలు కూడా ఏమి చేస్తారు? మొదట చెడుని కాలుస్తారు తర్వాత రంగులు చల్లుకుంటారు, పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా బాప్దా మీపై తన సాంగత్యం అనే రంగుని చల్లారు. దాంతో పాటు జ్ఞానం అనే రంగుని, శక్తులు అనే రంగుని, గుణాల రంగుని కూడా చల్లుతూనే ఉన్నారు. అందరిపై ఈ ఆత్మిక రంగు అంటి ఉంది కదా! అంటినదా? చేతులెత్తండి.
ఆత్మిక రంగు అంటినది, వెలసిపోయేది కాదు కదా! ఎవరిపైనైతే ఆత్మిక రంగు అవినాశిగా అంటి ఉన్నదో వారిపై మరే ఇతర రంగు అంటదు. ఈ రంగు ద్వారా ఎంత పవిత్రంగా అయిపోయారు? కల్పమంతటిలో మీ వంటి పవిత్రులుగా ఎవరూ కాలేరు. మీ పవిత్రత, పరమాత్మ సాంగత్యం యొక్క రంగు, పరమాత్మతో కంబైండ్గా ఉండే అనుభవం అన్నింటికంటే అతీతమైనది మరియు ప్రియమైనది. ఇతరులు ఎవరైతే పవిత్రంగా అవుతారో వారు శరీరంతో పవిత్రంగా అవ్వరు, ఆత్మ మాత్రమే పవిత్రంగా అవుతుంది కానీ మీ శరీరం మరియు ఆత్మ రెండూ పవిత్రంగా అవుతాయి.
పవిత్రతను సుఖం, శాంతి, ప్రేమ, ఆనందాలకు జనని (తల్లి) అని అంటారు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖం, శాంతి వెనువెంట ఉంటాయి; ఎందుకంటే తల్లి ఎక్కడ ఉంటుందో పిల్లలు కూడా అక్కడే ఉంటారు కదా! బాబా వచ్చి మిమ్మల్ని ఎంత పవిత్రులుగా చేస్తారంటే కలియుగం యొక్క అంతిమ జన్మలో కూడా మీ జడచిత్రాలను చూడండి - వాటిని ఎంత విధిపూర్వకంగా పూజిస్తారో కదా! ఇది పవిత్రత యొక్క విశేషత. ఇక ఇతర మహానాత్మలు లేదా ధర్మాత్మలు ఎంతమంది పవిత్రంగా అయినా కానీ ఎవరికీ మందిరాలు తయారవ్వవు మరియు ఇటువంటి విధిపూర్వక పూజ కూడా ఎవరికీ జరగదు.
మీ జడచిత్రాలు అయితే అంతిమ జన్మ వరకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాయి మరియు వాటి సమక్షంలో అల్పకాలిక సుఖ శాంతులను అనుభవం చేసుకుంటారు. అయితే మీ హోలీ మరియు ప్రాపంచిక హోలీకి ఎంత తేడాయో చూడండి. మనస్సుని ఉల్లాసంగా ఉంచుకునేటందుకు మీరు కూడా కొంచెం స్థూలంగా హోలీని జరుపుకుంటారు కానీ సత్యమైన హోలీ అంటే పరమాత్మ సాంగత్యం యొక్క రంగుని అంటించు కోవటం మరియు కంబైండ్ స్వరూపం యొక్క యదార్థమైన హోలీని మీరు జరుపుకుంటున్నారు. ప్రజలు కూడా హోలీని రకరకాలుగా జరుపుకుంటారు.
కానీ వాస్తవానికి మీకు తెలుసు - హోలీ అనే మాటకు కూడా రహస్యం ఉంది, అది మీకే తెలుసు. కనుక మీరే ఆవిధంగా జరుపుకుంటారు. హోలీ అంటే హో... లీ... అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని అర్ధం. మీరందరు కూడా పాత జీవితం, పాత విషయాలు, పాత సంస్కారాలు, పాత వ్యర్థ సంకల్పాలు వీటన్నింటినీ హోలీ చేసేశారు కదా! అంటే జరిగిపోయినవి. అలా చేశారు కదా? లేక ఇప్పటికీ పొరపాటుగా పాత సంస్కారాలు వచ్చేస్తున్నాయా? మీ జన్మయే క్రొత్తది, మీరందరు మరజీవ అయిపోయారు కదా! అయిపోయారా? మరజీవ అయ్యారా? చేతులెత్తండి. మంచిది.
కొత్తజన్మ తీసుకున్నారు. అయితే పాత జన్మ ఎలా గుర్తు వస్తుంది? పాతది పాతబడిపోయింది కదా? జరిగిపోయిన విషయాలు లేదా సంకల్పాలు, సంస్కారాలు ప్రత్యక్షమవుతున్నాయంటే ఏమంటారు? హోలీ జరుపుకున్నట్లా? వాటిని హో...లీ... చేశారా? అంటే పరమాత్మ సాంగత్యమనే రంగు సరిగ్గా అంటలేదు. పరమాత్మ సాంగత్యమనే రంగు అంటడం అంటే పాత జన్మను మర్చిపోవటం. పాత విషయాలను మర్చిపోవటం. ఎందుకంటే మరజీవ అయిపోయారు కదా! శరీరంతో ఒక జన్మ నుండి మరో జన్మ తీసుకున్నప్పుడు పాత జన్మ గుర్తుంటుందా? అదేవిధంగా మీరందరు బ్రాహ్మణ జన్మ తీసుకున్నవారు.
అయితే పాత జన్మ యొక్క సంస్కారాలు, పొరపాటుగా వాటిని నా సంస్కారాలు అని అంటున్నారు, అవి మీవా? అవి బ్రాహ్మణ జీవితం యొక్క సంస్కారాలా? అప్పుడప్పుడు సోమరితనం, అప్పుడప్పుడు సూక్ష్మ నిర్లక్ష్యం, ఈ నిర్లక్ష్యం కూడా చాలా రకరకాల రూపాలలో వస్తుంది. నిర్లక్ష్యం ఏయే రూపాలలో వస్తుందో, ఎంత సూక్ష్మరూపంలో వస్తుందో ఎప్పుడైనా దీని గురించి క్లాస్ చేస్కోండి. కనుక బ్రాహ్మణ జీవితం అంటే కొత్త జీవితం, దీంట్లో పాతవి ఏమీ ఉండవు. ఈరోజు హోలీ జరుపుకునేటందుకు వచ్చారు కదా! హోలీ అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈరోజు హోలీ జరుపుకోవటం అంటే పాత సంస్కారాలను కాల్చేయాలి.
కాల్చేసిన తర్వాతే జరుపుకోవటం ఉంటుంది. కనుక ఇప్పుడు మీది జరుపుకునే స్వరూపం. కాల్చేశారు కనుక ఇప్పుడిక జరుపుకోవాలి. ప్రభు సాంగత్యం యొక్క రంగు యొక్క ఆనందాన్ని పొందేవారు మరియు కంబైండ్ రూపాన్ని అనుభవం చేసుకునేవారు, ఎందుకు? పవిత్ర తండ్రి మీపై పవిత్రత అనే రంగుని చల్లారు. ఈరోజు ఏ హోలీ జరుపుకుంటున్నారు? విశేషంగా ఈరోజు ఏ పాత సంస్కారాన్ని రానివ్వకూడదు. ఈ హోలీ జరుపుకోవాలి. జరుపుకోగలరా లేక అప్పుడప్పుడు అవి వచ్చేస్తాయా? నేను చేయాలనుకోలేదు కానీ ఇది నా సంస్కారం అని చాలా రాయల్ మాటలు చెప్తున్నారు.
ఈ మాటలను ఈరోజు ధృడ సంకల్పం అనే విధితో సమాప్తి చేయండి. ఈరోజు నుండి ఇటువంటి సదాకాలిక హోలీని జరుపుకునే ధైర్యం ఉందా? లేక అప్పుడప్పుడు జరుపు కుంటారా? ఈరోజు నుండి పాత సంస్కారాలు హోలీ అంటే గతించిపోయినవి, క్రొత్త జన్మ, పాత జన్మ సమాప్తం అని ధైర్యం పెట్టుకునే వారు, బాబాకి మధురాతి మధురమైన గారాభ పిల్లలు కదా! ఈవిధంగా సంకల్పం కాదు, ధృడ సంకల్పం చేసే ధైర్యం ఉందా? చేతులెత్తండి. చూడండి, అందరూ ధైర్యం పెట్టుకున్నారు. కొద్దిమంది మిగిలి ఉన్నా కానీ మీరందరు తోడుగా ఉన్నారు కదా. పక్కాగా తోడు ఉండేవారు.
రెండు చేతులెత్తండి! వీరందరికీ ఫోటో తీయండి. మంచిది. డబల్ విదేశీయులు కూడా చేతులెత్తుతున్నారు.అయితే మీ అందరికీ బాప్దా పదమా పదమాపద శుభాకాంక్షలు ఇస్తున్నారు. హోలీని హో.. లీ..గా జరుపుకునేటందుకు. ఇప్పటి నుండి ఇక పొరపాటుగా కూడా ఈ మాటలు రాకూడదు. నా సంస్కారం అంటున్నారు, రావణుని సంస్కారాలను నావి అంటున్నారు, అద్భుతం! రావణుడిని శత్రువు అని అంటారు, మీ శత్రువు యొక్క ఖజానాని మీదిగా చేసుకోవటం ఆశ్చర్యకరమైన విషయం! ఏమంటున్నాం మేము అని మీకు కూడా ఆశ్చర్యమనిపిస్తుంది కదా.
పొరపాటున అనేస్తున్నారు. అంటున్నారు కానీ లోపల మనస్సు తినేస్తూ ఉంటుంది, అనుభవం కూడా చేసుకుంటున్నారు, బాబాతో చెప్తారు కూడా, బాబా రేపటి నుండి ఈవిధంగా చేయము అని క్షమాపణ కోరతారు మరలా చేస్తూ ఉంటారు. అప్పుడు బాబా ఏం చేస్తారు? చూస్తూ ఉంటారా? ఇప్పుడు ఈ మాటను కాల్చేయండి. కాల్చటం గురించి ఒక మంచి విషయం చెప్తారు - పక్షిని వండుకునేటందుకు త్రాడుతో కట్టేసి కాలుస్తారు, ఆ పక్షి ఉడికిపోతుంది కానీ త్రాడు మాత్రం కాలదు. మీరు ఆత్మ అవినాశి, శరీరం వినాశి అని మొదటి పాఠం చదువుకున్నారు కదా!
ఇలాంటి పండుగలు, శాస్త్రాలను తయారుచేసేవారు కూడా బాబాకి పిల్లలే కదా కానీ మీరు గారాభ పిల్లలు; ఆ పిల్లల అద్భుతం కూడా తక్కువేమీ కాదు. పిండిలో ఉప్పు అంత నిజం ఉంటుంది కానీ దాని గురించి కథలు పెద్దగా తయారుచేసేశారు. ప్రతి పండుగని స్మృతిచిహ్నంగా తయారుచేశారు. కానీ చాలా సూక్ష్మ విషయాలకు స్థూల రూపాన్ని ఇచ్చేశారు. కానీ స్మృతిచిహ్నాన్ని అయితే తయారుచేశారు కదా! భక్తిలో కూడా తక్కువ చేయలేదు కదా! భక్తిలో ద్వాపర, కలియుగాల్లో కూడా కొన్ని విషయాలు స్మృతిలో ఉంచుకున్నారు. వాటి ద్వారా మనిషిని అతి వికారిగా చేయకుండా రక్షించారు.
కనుక బాప్దాదా కూడా ఇటువంటి సామాగ్రి, శాస్త్రాలు లేదా పండుగలు తయారుచేసే పిల్లలకు కూడా ఫలం ఇస్తారు. ఏదైనా కానీ భక్తిలో కూడా ఎంతోకొంత స్మృతి చేస్తారు కదా, కొద్ది సమయం అయినా వికారాల నుండి రక్షణగా ఉంటారు. అయితే ఈరోజు మీరు ఏ హోలీ జరుపుకున్నారు? ఏ హోలీ జరుపుకున్నారు? హోలీ, అందరూ చెప్పండి హో..లీ... పక్కా కదా? జరుపుకున్నారా? జరుపుకున్నారా? మంచిది. అయితే రేపే మాయ వస్తుంది; ఎందుకంటే మాయ కూడా వింటుంది కానీ మీరు మాయను మీవైపుకి పిలవకూడదు, ఆవిధంగా చేయకూడదు. దీంట్లో మజా ఉంది కదా, ఉంది కదా మజా! ఆ మజాలో ఉండాలి.
బాబాని జ్ఞాపకం చేసుకోవాలి, బాబా మనకు ఎంతగా ఆత్మిక రంగుని అంటిస్తున్నారో కదా, దాని ద్వారా మీరు పవిత్ర హంసలు అయిపోతున్నారు. పవిత్ర హంస అంటే నిర్ణయశక్తి గల పవిత్ర హంసలు. ఏ పని చేస్తున్నా కానీ ఒక స్థితిని తయారుచేసుకోండి, ఆ స్థితిలో స్థితులై ఆ తర్వాత నిర్ణయం చేయండి, ఆ స్థితి ఏమిటో తెలుసా? ఆ స్థితి - త్రికాలదర్శి స్థితి. మొదట త్రికాలదర్శి స్థితిలో స్థితులై మూడు కాలాలను చూడండి, కేవలం వర్తమానాన్నే
కాదు; ఆది మద్యాంతాలు మూడింటినీ చూడండి. మూడు కాలాలలో లాభం ఉందా, నష్టం ఉందా? అని చూడండి.
కొంతమంది పిల్లలు చాలా తెలివైనవారు; ఏమి తెలివి చూపిస్తున్నారో చెప్పనా? ఏదో పని జరిపించాలి కనుక అలా చేసేశాం, కానీ ఇది చేయకూడదు అని నాకూ తెలుసు కానీ చేసేశాం అని అంటున్నారు. మీరు అలా చేసేశారు సరే కానీ ఆ కర్మకి ఫలం లభిస్తుంది కదా! కనుక తెలివి చూపించకండి, బాబాని కూడా చాలా సంతోషపరుస్తున్నారు. పొరపాట్లు చేసేసి ఆ తర్వాత బాబా నీవు దయాసాగరుడివి కదా, క్షమాసాగరుడివి కదా ఇలా బాబా ఎవరో అది బాబాకే జ్ఞాపకం చేస్తున్నారు. చేసిన పొరపాటు నాకు చెప్పి సమాప్తి చేస్కోండి అని నీవే చెప్పావు కదా అని అంటున్నారు.
కానీ పశ్చాత్తాపంతో చెప్పి సమాప్తి చేస్కోండి. చెప్పమన్నారు కదా అని సగం మాటను పక్కా చేసుకుని చెప్తున్నారు కానీ మొదట స్వయాన్ని పరివర్తన చేస్కోవాలి అని ధృడ సంకల్పం చేసుకుని ఆ తర్వాత చెప్పండి. నీవే చెప్పావు కదా అని బాబాని చాలా సంతోషపెడుతున్నారు. నీవు ఇలా చెప్పావు కదా, అలా చెప్పావు కదా అని బాబాకే గుర్తు చేస్తున్నారు. ఇలా చాలా తెలివి చూపిస్తున్నారు. ఇప్పుడిక ఆ తెలివి చూపించకూడదు. ధైర్యం పెట్టుకోండి. చేస్తాం, చూస్తాం కాదు; చేయాల్సిందే. చేస్తాం, చూపిస్తాం, అవుతాం... ఇలా రోజంతటిలో ఈ పాటలు బాగ్దాదా ఎక్కువగా వింటున్నారు.
కానీ మీ వేగం ఏమిటి? ఇలా చేస్తాం, చూస్తాం అనేవారు బాబా వెంట వెళ్తారా? బాబా అయితే ఎవరెడీ మరి చేస్తాం, చూస్తాం అనేవారు ఎవరెడీ అవ్వలేదు కదా కనుక బాబా వెంట ఎలా వెళ్తారు? బాబాతో పాటు వెళ్ళేవారిని చూస్తూ ఉంటారు. బాబాకి ఒకొక్క బిడ్డపై పదమాపదాల ప్రేమ ఉంది. నా పిల్లలు నాతో రాకుండా ఉండాలని బాబా అనుకోరు. ఇంటికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళరా? ఎందుకంటే ఇంటికి వెళ్ళి తిరిగి రాజ్యానికి రావాలి. బాబాతో కలిసి ఇంటికి వెళ్ళకపోతే బ్రహ్మాబాబాతో కలిసి రాజ్యానికి కూడా రాలేరు, తర్వాత వస్తారు. కానీ మీ ప్రతిజ్ఞ ఏమిటి?
వెంటే వెళ్తాం అనా లేక వచ్చేస్తాం అంటారా? మేము వచ్చేస్తాం, బాబా చూడు మేము వచ్చేస్తాం అంటారా? ఈ భాషను ఇప్పుడు సమాప్తి చేయండి. ఈరోజు బాప్దాదా వతనంలో కూడా హోలీ జరుపుకున్నారు; ఎవరితో? మీరయితే ఇప్పుడు జరుపుకుంటారు. వారితో హోలీ జరుపుకున్నారు. ఎడ్వాన్స్ పార్టీ ఉంది కదా, పేరే ఎడ్వాన్స్ పార్టీ. కనుక బాప్దాదా ఎడ్వాన్స్ గా హోలీ జరుపుకున్నారు. ఎడ్వాన్స్ పార్టీ క్రొత్తవారు, పాతవారు అందరు ఉన్నారు.
కొద్దికాలం క్రితమే వెళ్ళిపోయిన మహారథీలను మీరు గుర్తు చేసుకుంటారు కదా వారిని కూడా ప్రత్యక్షం చేశారు ఎందుకంటే ఇప్పుడే వెళ్ళిన వారందరు చిన్నతనం నుండి లేదా చాలా సమయం నుండి సేవాపాత్రను అభినయించినవారు. మీరు కూడా మీ యొక్క ఆ సహయోగులను గుర్తు చేసుకుంటారు కదా! ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవలసి వస్తుంది. కదా! కనుక ఈరోజు వతనంలో మమ్మా, దీది మరియు దాదీ ముగ్గురినీ విశేషంగా అందరి సంఘటన మధ్యలో నిలబెట్టారు మరియు ఇంకా ఇతర సహయోగులు ఉన్నారు కానీ ఈ ముగ్గురుని విశేష పాత్రగా నిలబెట్టారు మరియు వారికి స్మృతి ఇప్పించారు.
వారికి స్మృతి ఉంది కూడా కానీ వీరు గుప్తరూపంలో సేవ చేయవలసి ఉంటుంది. అమృతవేళ వీరు కూడా వతనంలో ప్రత్యక్షమవుతారు తిరిగి సేవకి వెళ్తారు. విశేషాత్మలు సేవను వదల్లేదు. అమృతవేళ వీరు వతనానికి రావటం నిర్ణయమైపోయింది, వచ్చి తమ అసలైన బ్రాహ్మలు జీవితంలో కి వస్తారు మరియు నలువైపుల ఏదొక సేవార్ధం వెళ్తారు. తమ మనసాసేవ ద్వారా, మనస్సు మరియు బుద్ధి ద్వారా ఆత్మల మనస్సు, బుద్దిని ఆకర్షించే విశేష సేవ చేస్తారు. మీరు ఏమి చేస్తున్నారు? అని ఈరోజు బాప్దాదా ఈ ముగ్గురుని అడిగారు. బాబాకి తెలుసు అయినా కానీ అడగాలి కదా!
అప్పుడు వారు చెప్పారు - మేము రెండు రకాలైన వారికి ప్రేరణనిస్తున్నాం. 1. అలజడి చేసేవారికి మరియు 2. కొత్త సృష్టికి నిమిత్తమయ్యేవారికి; ఎందుకంటే మేము ఎదురు చూస్తున్నాం. మేము చాలాకాలం నుండి వేచి చూస్తున్నాం అని మమ్మా అన్నారు. అందువలన మా సఖిలను అడగండి - ఇప్పటికీ ఇంకా వేచి చూడాలా లేక కొంచెం తయారవ్వాలా? మమ్మా యొక్క మరియు దీదీ, దాదీల సఖీలు చాలామంది కూర్చుని ఉన్నారు, సఖులు కూడా ఉన్నారు. అంటే వారి తోటి అన్నయ్యలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు.
వారి ప్రశ్న ఏమిటంటే వేచి చూడటం మా పని కానీ ఎడ్వాన్స్డ్ స్థితి కలిగిన మీ పాత్ర ఏమిటి? మేము అయితే ఎదురుచూస్తున్నాం, మీరు అయితే తయారవ్వాలి. అయితే తారీఖు ఎప్పుడు నిర్ణయిస్తారు? బాబా పిల్లలైన మీరందరు సమానంగా, సంపూర్ణంగా అయినప్పుడే తయారీలు జరుగుతాయి. దీదీ అన్నారు, నా తరపున ఒక ప్రశ్న అందరినీ అడగండి. అయితే దీదీ ఏమన్నారు? ఎవరెడీగా అనే విషయం మీ అందరికీ తెలిసిందే మరియు అంటూంటారు కూడా. అయితే సంపన్నం మరియు సంపూర్ణంగా అయ్యేటందుకు ఎవరెడీయేనా? ఇక దాదీ ఏమన్నారు?
ఈరోజు ఆత్మిక సంభాషణ జరిగింది. దాదీ అన్నారు - నాతో ఎవరైనా కలిసినప్పుడు నేను చూశాను మరియు అందరూ నాతో అంటూండేవారు కూడా - దాదీ మీకు కర్మాతీతంగా అవ్వాలి, అవ్వాలి ఇదే సంలగ్నత ఉంది అని. మేము కూడా వెంట వెళ్ళాలి కదా, ఇప్పుడు కూడా నా తోటి సహయోగులకు నేను చెప్పేది ఇదే - కర్మాతీతంగా అవ్వాల్సిందే కానీ ఎప్పుడు? ఎప్పుడో అనే దానిని ఇప్పుడులోకి మారుస్తారా? బాబా అయితే నవ్వుకుంటూ ఉన్నారు. ఈరోజు మొదట వీరి యొక్క ఆత్మిక సంభాషణ జరిగింది, మిగిలిన వారందరు కూడా వారితో కలిసిపోయారు, చాలా బాగా చెప్పారు అని మమ్మా అన్నారు, దీదీ మీరు కొద్దిగా శక్తినింపండి అని అన్నారు.
దాదీ మీరు అయితే అందరికీ తోడునిచ్చారు. బాబా అవ్యక్తం అవుతూనే మీరు పాత్ర అభినయించారు. మా అందరి మనస్సుల్లో దాదీ యొక్క ఈ మాట గుర్తు ఉంది కానీ ఇంకా వారి యొక్క ఇతర సహయోగులు అన్నారు, దాదీ, ఇప్పుడు మీ మాటను జ్ఞాపకం చేయండి. బాబా అవ్యక్తం, శివబాబా నిరాకారి, బ్రహ్మాబాబా అవ్యక్తఫరిస్తా కానీ దాదీ అయితే సాకారంలోనే ఉండేవారు కదా, ఇప్పుడు మీరు ఆలోచించింది చేసి చూపండి. దాదీ వంటి భాద్యత తీసుకుని చూపించండి. అంటే ఈరోజు హృదయం తెరిచి ఆత్మిక సంభాషణ చేశారు. ఇప్పుడు ఏమి చేయాలి?
హోలీ జరుపుకున్నారు కదా! నిన్నటి విషయాలే లేవు, ఇక ముందు జన్మ విషయాలు ఆలోచించటం ఏమిటి! ఇలా అందరూ సంభాషించు కుంటుండగా బాప్దాదా హోలీ జరుపుకోవటం ప్రారంభించేశారు. అందరూ తెల్లని వస్త్రాలలో ఉన్నారు మరియు వతనంలో అయితే ఫరిస్తా రూపంలో ఉన్నారు. హోలీ జరుపుకుంటున్నాం అని బాబా చెప్పనేలేదు అకస్మాత్తుగా చేసేశారు. అందరూ అర్థ చంద్రాకారంలో కూర్చుని ఉన్నారు, నిల్చుని లేరు, కూర్చుని ఉన్నారు, 4,5 వరుసలుగా ఉన్నారు. మొదట చిన్నవారు తర్వాత పెద్దవారు, ఆ తర్వాత ఇంకా పెద్దవారు అలా వరుసక్రమంలో కూర్చున్నారు.
అప్పుడు బాప్దాదా ఏమి చేశారు? అకస్మాత్తుగానే గా రంగుల వజ్రాలను పొడి చేశారు. ఆ పొడిని అందరిపై చల్లారు. ఫరిస్తా దుస్తుల యొక్క మెరుపు ఒకటి మరియు దానిపై 7 రంగుల పొడి చల్లారు. ఇప్పుడు మీరు దీనిని ప్రత్యక్షం చేస్కోండి - మెరిసే దుస్తులపై 7 రంగుల పొడి చల్లితే అది ఎలా ఉంటుందో! సత్యయుగంలో కూడా ఇటువంటి దుస్తులు లభించవు. అలా అందరూ మెరిసిపోయారు. దీదీ అయితే నషాలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆమె నషాలోకి వెళ్ళిపోయేవారు కదా అలా అక్కడ కూడా నషాలోకి వెళ్ళిపోయి అందరూ ఒకరినొకరు పట్టుకుని నాట్యం చేయటం ప్రారంభించారు.
మధువనంలో మీరు మధువనంలో మిఠాయి తయారుచేస్తారు కదా, అలాగే బాబా వతనంలో మిఠాయిని ప్రత్యక్షం చేశారు. అప్పటికి మధువనం నుండి అయితే రాలేదు. ఆ మిఠాయిని అందరికీ పెట్టారు. ఇలా అందరూ చాలా మజాగా హోలీ జరుపుకున్నారు. మీరు కూడా ఫరిస్తా దుస్తుల్లాంటివి రకరకాల దుస్తులు మార్చుకుంటారు కదా, అలాగే రోజంతటిలో మధ్యమధ్యలో ఫరిస్తా దుస్తులను వేసుకుని చూడండి. 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు నేను ఫరిస్తా రూపంలో ఉన్నాను అనుకోండి అంతే దుస్తులు మార్చేసుకున్నట్లే.
సాధారణ రూపం నుండి ఫరిస్తా రూపం యొక్క దుస్తులు ధరించారు మరియు బాప్దాదా అప్పుడప్పుడు జ్ఞానం, అప్పుడప్పుడు శక్తులు, గుణాలు అనే రంగుని చల్లుతూ ఉన్నారు, ఇలా ఫరిస్తా దుస్తులలో ఫరిస్తా అయ్యి 5 లేదా 10 నిమిషాలు అనుభవం చేస్కోండి. ఆ తర్వాత మరలా దుస్తులు మార్చుకోండి. కర్మయోగులు కదా మీరు! ఇలా రోజంతటిలో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ ఫరిస్తా దుస్తులను వేస్కోండి మరియు బాబా ద్వారా రంగు చల్లుకోండి. ఈ ఫరిస్తా దుస్తుల యొక్క అనుభవాన్ని ఇప్పటి నుండి చేసుకుంటారు కదా!
ఈ దుస్తులు వేసుకోవటం ద్వారా నషా పెరుగుతుంది మరియు ఫరిస్తాగా అవ్వటంలో సహాయం కూడా లభిస్తుంది. నలువైపుల ఉన్న పిల్లలందరికీ హోలీకి ఈ బహుమతిని బాప్దాదా ఇచ్చారు. ఈ దుస్తులు వేసుకుంటూ అభ్యాసం చేస్తూ ఉండాలి మర్చిపోకూడదు. హోలీకి ఫరిస్తా దుస్తులను బహుమతిగా ఇస్తున్నాను. కనుక మధ్యమధ్యలో ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. సహజమే కదా! దుస్తులు మార్చుకోవటం వచ్చు కదా! వచ్చా? వచ్చు కదా! రోజూ స్థూల వస్త్రాలను మార్చుకుంటారు కదా అదేవిధంగా ఫరిస్తా దుస్తులను కూడా మార్చుకుని చూడండి. ఈ డ్రెస్ ఎంత అందంగా, మెరుస్తూ ఉంటుందో! విన్నారా!
ఈరోజు వతనం యొక్క సమాచారం చెప్పాను. ఎడ్వాన్స్పార్టీ వారందరినీ మీరందరు కూడా గుర్తు చేసుకుంటున్నారు కదా ఎందుకంటే చాలా స్థానాల నుండి అనేకమంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినవారిని గుర్తు చేసుకుంటారు కదా! బాప్దాదా కూడా అమృతవేళ విశేషంగా ఎడ్వాన్స్పార్టీ వారితో సేవ చేయిస్తారు ఎందుకంటే ప్రపంచం అంతా నిద్రపోతూ ఉంటుంది కనుక వీరు దుస్తులు మార్చుకుని వతనానికి వచ్చేస్తారు. విన్నారా! ఇప్పుడు ఏమి చేస్తారు? ఈ వ్యాయామాన్ని మర్చిపోకూడదు. వస్త్రాలను మార్చుకోవాలి. రోజంతటిలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ ఫరిస్తా దుస్తులు ధరించి కూర్చోండి, 3 నిమిషాలు కూర్చున్నా కానీ కూర్చోవటం మాత్రం తప్పనిసరి.
దుస్తులను తప్పకుండా మార్చుకోండి. ఇప్పటి నుండే సంస్కారంగా చేస్కోండి. ఎందుకంటే ఫరిస్తా కాకుండా దేవతగా కాలేరు. మంచిది. నలువైపుల ఉన్న పిల్లలందరినీ కూడా బాప్దాదా చూస్తున్నారు. దూరంగా కూర్చున్నా కానీ విజ్ఞాన సాధనాల ద్వారా చాలా ఎక్కువ స్థానాల నుండి సేవాకేంద్రాలలో బాప్దాదాని చూస్తున్నారు. ఇప్పుడు మీరు టోలీ తింటున్నారు కదా అలాగే అక్కడ కూడా టోలీ పంచుతున్నారు. దూరంగా కూర్చుని కూడా సమీపంగా ఎలా అనుభవం చేసుకుంటున్నారో అని అందరినీ బాప్దాదా కూడా చూస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలందరు బాబా సమానంగా, సంపూర్ణంగా అవ్వాలి. ఈ సంకల్పాన్ని ధారణ చేశారు మరియు ఆ సంకల్పానికి సమయాన్ని అనుసరించి ధృడత యొక్క బలం ఇస్తూ ఉన్నారు.
ఈవిధంగా నలువైపుల ఉన్న శుభ సంకల్పాన్ని ధారణ చేసేవారికి, వెనువెంట బాబా యొక్క ఆశలను పూర్తి చేసే ఆశాసితారలకు, దాదీ మాట - కర్మాతీతంగా అవ్వాల్సిందే, అవ్వాల్సిందే, అవ్వాల్సిందే... మరియు మమ్మా మాట ఏదైతే చేయాలో అది ఇప్పుడే చేయండి, రేపటికి వదలకండి. మరియు దీదీ యొక్క మాట - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి; ఈ మాట చెవుల్లో మారుమ్రోగుతూ ఉండాలి.
ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి, కర్మాతీతంగా అవ్వాలి మాటిమాటికి ఇవే మాటలను స్మృతిలోకి తెచ్చుకునే సమర్ధ ఆత్మలకు బాప్దాదా యొక్క హోలీ మరియు పిల్లల హోలీ యొక్క శుభాకాంక్షలు. దానితో పాటు మధువనం యొక్క మిఠాయి కంటే ముందుగా బాప్దాదా యొక్క మిఠాయి తినండి. అందరూ నోరు తెరవండి మరియు మిఠాయి తినండి. తిన్నారా! అయితే అందరికీ బాప్దాదా మరియు ఎడ్వాన్స్ పార్టీ వారి యొక్క చాలా చాలా కోటానుకోట్ల ప్రియస్మృతులు మరియు బాబా యొక్క నమస్తే.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.