రివైజ్ కోర్స్ 31-03-2011
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
ధృడ సంకల్పం ద్వారా ఆందోళనా ముక్తుల యొక్క ఉదాహరణయై ఆధారమూర్తి అవ్వండి, మనసా శక్తి ద్వారా దుఃఖ ఆత్మలకు సుఖం యొక్క పరదానం ఇవ్వండి
ఈరోజు తాత ముత్తాతలకు తాత (గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్) తన యొక్క కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది అయిన పిల్లల యొక్క భాగ్యరేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసే దివ్యసితార మెరుస్తూ కనిపిస్తుంది. నయనాలలో స్నేహం యొక్క రేఖను చూస్తున్నారు. నోటిలో జ్ఞానం యొక్క రేఖను చూస్తున్నారు. మనస్సులో మనోభిరామునిలో లవలీనం అయ్యే 'రేఖను చూస్తున్నారు. చేతులలో జ్ఞాన ఖజానాల యొక్క రేఖను చూస్తున్నారు. పాదాలలో ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన యొక్క రేఖను చూస్తున్నారు.
ప్రతి ఒక్క బిడ్డ ఈ రేఖలలో నెంబరు వారీగా సంపన్నులు. ఇటువంటి భాగ్యం మీకు తప్ప మరెవ్వరికీ లేదు. మీకు ఎంత శ్రేష్ట భాగ్యం అంటే ప్రతి ఒక్క బిడ్డ మెరుస్తూ కనిపిస్తున్నారు. ఈ భాగ్యం అవినాశి అయిపోతుంది. ఎందుకు? ఎందుకంటే ఇచ్చేవారు అవినాశి తండ్రి. ఈ సంగమయుగంలోనే ఇటువంటి శ్రేష్ట భాగ్యం ప్రాప్తిస్తుంది. ఇది భవిష్యత్తులో కూడా వస్తుంది. సంగమయుగం సర్వప్రాప్తుల యుగం. ఎవరు ఎంత తమ భాగ్యాన్ని జమ చేసుకుంటారో అంత అనేక జన్మలు భాగ్యానికి ఫలం లభిస్తుంది. ఈ సంగమయుగం యొక్క మహిమ పిల్లలైన మీకే తెలుసు. సంగమయుగం యొక్క ప్రాప్తులు) కల్పమంతటిలో శ్రేష్టాతి శ్రేష్టమైనవి.
బాప్దాదా చూస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డ ఈ సంగమయుగ ప్రాప్తులతో ఎంత సంపన్నం! మీరందరు కూడా సర్వప్రాప్తుల యొక్క అనుభవంలో సదా ఉంటున్నారా లేక అప్పుడప్పుడా? అవినాశి తండ్రి కనుక ప్రాప్తులు కూడా అవినాశి. బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డను ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు? తెలుసా? బాప్దాదా కోరుకునేది ఏమిటంటే ప్రతి బిడ్డ స్వరాజ్యాధికారి రాజు అవ్వాలి. స్వయంపై అంటే కర్మేంద్రియాలపై, మనస్సు, బుద్ధి, సంస్కారాలపై రాజు అయ్యి రాజ్యం చేయాలి. భవిష్యత్తులో అయితే రాజ్యాధికారి అవుతారు కానీ ఇప్పుడు స్వరాజ్యాధికారి రాజు అవ్వాలి.
ఏ కర్మేంద్రియం అయినా కానీ మీ అదుపులో ఉండాలి, ఎందుకంటే బాబా ద్వారా సర్వశక్తుల యొక్క ఖజానా ప్రాప్తించింది. బాబా ప్రతి ఒక్క బిడ్డను స్వరాజ్యాధికారి రాజుగా చూడాలనుకుంటున్నారు. అయితే మీరందరు స్వరాజ్యాధికారిగా అయ్యారా? మనస్సు, బుద్ధి, సంస్కారాలపై రూలింగ్ చేసే శక్తి, కంట్రోల్ చేసే శక్తి వచ్చాయా? ఆధీనత లేదు కదా? అధికారులు. 6. బాబాని తోడు పెట్టుకుంటున్నారు, ఒంటరిగా ఉండటం లేదు, బాబాని సదా తోడు పెట్టుకుంటే మనస్సు, బుద్ధి, సంస్కారాలలో దేనికీ ధైర్యం చాలదు, మీ కంట్రోల్ నుండి తప్పుకోవడానికి.
అందువలన బాప్దాదా సదా శక్తులకు చెప్తుంటారు మీ యొక్క ఏ స్వరూపాన్ని గుర్తు ఉంచుకోవాలి, దాని ద్వారా ఎప్పుడూ కూడా బాబాతోడుని మర్చిపోకూడదు. అది ఏమిటంటే శివశక్తిని. శివుడు మరియు శక్తి కలిసి ఉన్నాయి. ఈ స్మృతి మాయాజీత్ , ప్రకృతిజీత్ స్వతహాగా తయారు చేస్తుంది. ఎందుకంటే బాప్దాదా మీకు చెప్పేశారు, వర్తమాన సమయంలో ప్రకృతి తన పని తాను చేస్తుంది. ఎందుకంటే మనుష్యాత్మలు ప్రకృతిని కూడా విసిగిస్తున్నారు అందువలన ప్రకృతి కూడా విసిగిస్తుంది. ఈరోజుల్లో చూస్తున్నారు కదా!
ప్రకృతి ఎక్కడో ఒక చోట తన కార్యం చేస్తూ ఉంది కానీ మీరు ప్రకృతిజీత్ ప్రకృతిని కూడా సతోప్రధానంగా తయారుచేస్తున్నారు. 7. ప్రజలైతే ప్రకృతి యొక్క అలజడి చూసి రేపు ఏమవుతుందో అని భయపడతారు. కానీ మీకు తెలుసు, జరగబోయేది అంతా మంచిదే అని ఎందుకంటే సృష్టిచక్రంలో ఇప్పుడు సంగమయుగం. అంటే అమృతవేళ జరుగుతుంది. అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? ఉదయం. అంధకారం సమాప్తి అయిపోయి వెలుగు వస్తుంది. అందువలన మీకు సంతోషం, మా రాజ్యం, సుఖమయ రాజ్యం అక్కడ ప్రకృతి కూడా సుఖమయంగా ఉంటుంది అటువంటి రాజ్యం ఇక రానే వచ్చింది. అని సంతోషంగా ఉంది కదా!
ఆ రాజ్యంలో దుఃఖం, అశాంతి యొక్క నామరూపాలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు సంగమయుగంలో మీరు ప్రకృతిజీత్ అవుతున్నారు. అందరికీ సంతోషంగా ఉంది కదా? మా రాజ్యం రానున్నది అని చెప్పండి. ఈ సంతోషం ఉందా? సంతోషంలో ఉన్నవారు. చేతులెత్తండి. చాలా మంచిది. మీరు సంతోషంగా ఉంటున్నారు శుభాకాంక్షలు కానీ ఇటువంటి. సంతోషాన్ని, మీ సంతోషాన్ని దుఃఖం అశాంతిలో ఉన్న మీ సోదరీ సోదరులకు బాబా ద్వారా మీరు తీసుకున్న కిరణాల ద్వారా వారికి సంతోష కిరణాలను ప్రసరింపచేయండి. బాప్దాదా చెప్పారు.
ఈ మనసాసేవ కొరకు ప్రతి ఒక్కరు తమ దినచర్యలో సమయాన్ని నిర్ణయించుకోవాలని. ఎలాగైత ఇతర కార్యాల కొరకు సమయం నిశ్చయించబడి ఉందో అలాగే మీ సంతోష భోజనం . ద్వారా దు:ఖి అశాంతి ఆత్మలకు మనసా శక్తి ద్వారా ఎంతోకొంత వరదానాన్ని ఇచ్చి వారిని కూడా సంతోషపరచండి. అయితే మనసా సేవ కొరకు సమయాన్ని నిర్ణయించుకున్నాం అనేవారు. చేయి ఎత్తండి. మంచిది, నిర్ణయించుకోనివారు కూడా ఉన్నారు కానీ తక్కువమంది. కానీ దీనికి సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వారు మీ సోదరీ సోదరులే కదా!
మరయితే మీకు దయ రావటం లేదా? వస్తుంది కదా! బాప్దాదా అందరినీ ఏవిధంగా చూడాల నుకుంటున్నారంటే.. సంగమయుగంలో రెండు విషయాలు అమూల్యమైనవి 1. సంకల్పశక్తి 2. సంగమయుగం యొక్క సమయం. ఎందుకంటే సంగమయుగ సమయంలో ఒక జన్మలో అనేక జన్మల ప్రాలబ్దాన్ని తయారు చేసుకోవాలి. ప్రస్తుతం బాప్దాదా చూశారు. ఎక్కువమందికి అశుద్ధ సంకల్పాలు తక్కువ నడుస్తున్నాయి. కానీ వ్యర్ధ సంకల్పాలు వస్తూ ఉన్నాయి. ఈ ఒక్క జన్మ యొక్క విలువను అనుసరించి వ్యర్ధ సంకల్పాలు ఇప్పుడు సమాప్తి అయిపోవాలి ఎందుకంటే సంగమయుగం యొక్క గొప్పతనం యొక్క లెక్కతో చూస్తే ఒక్క సెకండు కూడా ఎంతో విలువైన సమయం యొక్క అధికారాన్ని ఇప్పిస్తుంది.
అందువలన ప్రతి ఒక్కరు ఈ రెండు విషయాలపై అనగా సమయం మరియు సంకల్పం రెండింటి యొక్క విలువను తెలుసుకుని సమయాన్ని మరియు సంకల్పాన్ని సఫలం చేస్కోండి. స్థూల ఖజానాని ఎలాగైతే సఫలం చేసుకుంటారో, ఒక్క జన్మలో సఫలం చేసుకోవటం ద్వారా అనేక జన్మలకు ఆ ప్రాప్తి జమ అవుతుంది అని మీకు తెలుసు. అదేవిధంగా ఈ రెండు విషయాలపై ధ్యాస పెట్టి సఫలం చేసుకుని సఫలతామూర్తి అవ్వండి. ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డకి విశేషంగా ఒక వరదానం ఇస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు నుండి స్వయాన్ని ఆందోళన నుండి ముక్తిగా తయారు చేసుకోగలరా?
దృడ సంకల్పం చేయండి - ఈరోజు నుండి అటెంక్షన్ ఉంది, టెంక్షన్ లేదు. పిల్లలు ఆందోళనలో ఉన్నప్పుడు చూసి బాప్దాదా అనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే వీరిని ఫోటో తీసి పంపాలి అనుకుంటున్నారు.అప్పుడు మీరు ఎలా అయిపోయారో మీకే అర్ధమవు తుందని, బాప్దాదా పిల్లలను మన్జీత్గా,, జగజ్జీత్గా తయారు చేయాలను కుంటున్నారు. ఆందోళన ఎక్కడ వస్తుంది? మనస్సులోనే వస్తుంది. కదా! మీరయితే రాజులు కదా, స్వరాజ్యాధికారులు కదా! మనస్సు మీదా లేక మనస్సు మీకు యజమానియా? మీరు ఏమంటున్నారు? నా మనస్సు అని రోజంతా అంటూంటారు కదా!.
మనస్సు యజమాని కాదు కదా! అయితే ఎవరు ధైర్యం పెట్టుకుంటారు? బాబా యొక్క వరదానం సహజంగా లభిస్తుంది కానీ కొద్దిగా ధ్యాస పెట్టుకోవలసి ఉంటుంది. బాబా వరదానం యొక్క సహాయాన్ని అనుభవం చేసుకుని చూడండి. అందరి ముఖం ఎప్పుడు చూసినా కానీ ఎలా కనిపించాలి? ఆందోళన నుండి ముక్తిగా, కమలపుష్ప సమానంగా లేదా వికసించిన గులాబీపుష్పం వలె ఉండాలి. బాప్దాదా చూశారు, ఇంతకు ముందు శాతం వ్రాసి ఇవ్వమని ఒక పని ఇచ్చాను; అన్ని చోట్ల నుండి సమాచారం వచ్చింది. ఇక్కడ కూడా ఫలితం తీశారు. అంటే ధ్యాస పెట్టారు కనుక బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు.
కానీ ఇప్పుడు బాప్దాదా కోరుకునేది ఏమిటంటే ప్రస్తుత సమయాన్ని బట్టి వాణి ద్వారా చెప్తే వినే సమయం కూడా తక్కువ లభిస్తుంది అందువలన మనస్సు ద్వారా మరియు మీ ముఖం ద్వారా మరియు నడవడిక ద్వారా సేవ చేయండి. ఇప్పటి ఈ అభ్యాసం రాబోయే సమయంలో చాలా పనికొస్తుంది. అయితే ఈరోజు నుండి ఆందోళన ముక్తి యొక్క సంకల్పం చేయగలరా? చేయగలరా? చేయగలరా? చేయి ఎత్తండి. ఆందోళన నుండి ముక్తులవ్వాలి. మంచిది, అందరినీ ఫోటో తీయండి. చాలా మంచిది. 8. ఈనాడు ప్రపంచంలో ఆందోళన బాగా పెరిగిపోతూ ఉంది, పరిస్థితులను అనుసరించి అనేకాత్మలు చాలా ఆందోళనపడుతున్నారు.
కనుక మీరు ఆందోళన నుండి ముక్తులైన అనుభవం మరియు నడవడిక మరియు ముఖం వారికి ఒక ఆధారంగా అవుతుంది. ప్రపంచం అంతా తిరిగి చూస్తే లేదా వార్తలు వింటే ఏమి కనిపిస్తుంది? అల్పకాలికంగా తమని తాము సంతోషం చేసుకునే సాధనాలు తయారుచేసుకుంటున్నారు. కనుక ఆందోళనలో ఉన్నవారికి ఆందోళన ముక్తుల యొక్క ఉదాహరణ చూపండి, దాని ద్వారా వారికి కూడా సహాయం కనిపించాలి. అయితే సంకల్పం చేశారు. ఆందోళన ముక్తులుగా ఉంటాం అని మనస్సులో సంకల్పం చేశారా? ధృడంగా చేశారా లేక సాధారణంగా చేశారా? ఎక్కడ ధృడత ఉంటుందో అక్కడ సఫలత లభించి తీరుతుంది.
చేస్తాం అనకూడదు, చేసి తీరుతాం. ఇష్టమేనా? దీనిలో చేతులెత్తండి. బాప్దాదా ఒక విషయం చూశారు. చేతులెత్తి చాలా సంతోషపెడుతున్నారు. చేతులెత్తి సంతోషం చేశారు సరే కానీ ఇప్పుడు ఏమి చేస్తారు? దృడ సంకల్పం మరియు సాధారణ సంకల్పం వీటిలో రాత్రికి పగలుకి ఉన్నంత తేడా ఉంది. చేస్తాం మరియు చేసి తీరుతాం వీటిలో తేడా ఉంది కదా! ఈ సంవత్సర సీజన్లో ఇది | చివరి మిలనం కదా కానీ తర్వాత సీజన్ వచ్చేసరికి చాలా సమయం ఉంది ఆ సమయానికి చిన్న పెద్ద సెంటర్స్లో అందరిలో కారణాలు ఉండకూడదు నివారణా స్వరూపులుగా కనిపించాలి.
మరి ఎంత ధైర్యం మరియు ఉల్లాసం ఉన్నాయి? బ్రాహ్మణ పరివారంలో ఆందోళన యొక్క నామరూపాలు ఉండ కూడదు. అలా కాగలరా? కాగలనా అని ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అడగండి. ఈ సంతోషకర వార్త బాప్దాదా వినాలనుకుంటున్నారు. బాప్దాదా చూశారు, చేస్తాం అనే కోరిక. అయితే అందరు పెట్టు కుంటున్నారు కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తనకు వశం చేసేసు కుంటుంది. ఆ తర్వాత చాలా మధురమైన విషయాలు చెప్తున్నారు ఇలా జరిగిపోతుంది కదా, ఇలా జరుగుతుంది కదా, ఇలా అవుతుంది కదా అని బాబాకి చాలా మధురాతి మధుర విషయాలు వినిపిస్తున్నారు.
అన్నింటికీ కారణం రాజుగా అయిపోండి చాలు. స్వరాజ్యాధికారి అయిపోండి. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ అంటే ఎదురుగా కూర్చున్న వారిని, దూరంగా ఉంది మనస్సులో కూర్చున్న వారిని, మీరయితే కళ్ళెదురుగా ఉన్నారు దూరంగా కూర్చున్న వారిని హృదయంలో చూస్తున్నాను. బాప్దాదాకి తెలుసు, ఈరోజు మధువనంలో కూడా చిన్న చిన్న గీతాపాఠశాలలు పెట్టారు. పిల్లలు వచ్చారు, క్రింద కూర్చున్నవారికి, అక్కడక్కడ కూర్చున్న వారికి బాబా చాలా చాలా మనస్పూర్వక పాలనను మరియు ప్రియస్మృతులను ఇస్తున్నారు.
(ఈరోజు శాంతివనంలో 28 వేలనుంది కంటే ఎక్కువ అన్నయ్యలు, అక్కయ్యలు కూర్చున్నారు ) బాప్దాదా చూశారు, పిల్లలకు కొద్దిగా కష్టంగా అనిపించటం కనిపించింది కానీ ఆ కష్టాన్ని సంతోషంగా అనుభవం చేసుకోవటం లేదు. అయినా కానీ విశ్రాంతిగా నిద్రపోవడానికి మూడు అడుగుల చోటు ఉంది కదా! పట్టారాణిగా అయిన పిల్లలకు బాప్ దాదా విశేషంగా ప్రియస్కృతులు ఇస్తున్నారు. మంచిది, ఈరోజు మొదటిసారిగా వచ్చిన పిల్లలకు బాప్దాదా కొత్తగా బ్రాహ్మణ పరివారంలో వచ్చినందుకు మీ తరపు నుండి 9 మరియు బ్రాహ్మణ పరివారం తరపు నుండి చాలా చాలా శుభాకాంక్షలు ఇస్తున్నారు ఎందుకంటే బాగా ఆలశ్యంగా వచ్చారు అయినా కానీ వచ్చారు.
బాప్దాదా మరియు పరివారాన్ని చూశారు. బాప్దాదా అనుకుంటున్నారు ఈరోజు వచ్చిన వారికి వరదానం ఏమిటంటే ఒకవేళ మీరు మనస్సులో కోరుకుంటే చివర వచ్చినా కానీ తీవ్రంగా, తీవ్రం నుండి మొదటికి రాగలరు. బాప్ మరియు పరివారానికి ఆత్మలైన మీరంటే ప్రేమ. కనుక సహయోగి అవుతారు, స్నేహమిస్తారు. మరియు మిమ్మల్ని ముందుకి తీసుకువెళ్తారు. అవకాశమిస్తారు. అందువలన ఈరోజు వచ్చిన వారికి డ్రామానుసారం సారం చాలా మంచిగా ముందుకి వెళ్ళే అవకాశం లభించింది. ఎవరు ఎక్కడ మంది వచ్చినా కానీ పరివారం అందరూ మీకు సహయోగి అవుతారు మీరు సహజయోగి అవ్వాలి, మంచిది.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.