రివైజ్ కోర్స్ మురళి 15-12-2013
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
ప్రాణప్రియమైన అవ్యక్త మూర్తి మతాపితా బాప్ దాదా యొక్క అతి ప్రియమైన సదా, బాప్ దాదా ప్రేమలో లవలీనమైన ఈ దేశ మరియు విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సోదరులు మరియు సోదరీమణులందరూ, ఈశ్వరీయ స్నేహ సంపన్న, స్మృతిని స్వీకరించండి.
తరువాతి సమాచారం - ఈ రోజు మీరందరూ బాప్ దాదా ను ప్రత్యేకంగా ఆహ్వానించడానికి, నిమిత్తమై ఛత్రకులుగా అయి సాకార రూపంలో అవ్యక్త మిలనాన్ని జరుపుకోవాలనే ఆశతో మీ మీ స్థానాల్లో కూర్చుని ఉంటారు. కానీ నాటకం భవిష్యత్తులో, బాప్ దాదా పిల్లల యొక్క స్థితిని అచల్ మరియు అడోల్ గా చేయడానికి మరియు అవ్యక్త వతనం వాసీలుగా అయి మరియు, అవ్యక్త రూపంలో మిలనం జరుపుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనందరం అదే విధంగా అనుభవం చేసుకుంటున్నాము.
దాదీ గుల్జార్ ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ, ఆమె చాలా బలహీనంగా ఉంది, అయినప్పటికీ ఆమె చాలా ధైర్యంతో సభ మధ్యలోకి వచ్చింది మరియు బాప్ దాదా యొక్క ఆహ్వాన గీతంను ప్లే చేసింది, కానీ కొద్దిసేపటికే ఆ సర్వశక్తిమంతుడిని తనలో ధారణ చేసుకోలేక పోయింది.అయితే దాదిని వేదిక నుండి గదికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు మనమందరం బాప్ దాదా అవతరణ యొక్క మునుపటి వీడియోను చూస్తూనే ఉన్నాము. ఎవరైతే డైరెక్ట్ చూసిన, విన్న వాళ్లు, కూడా చూసే ఉంటారు. అందరూ దాదిలు, మరియు ప్రధాన సోదరులందరూ వేదికపై యోగం చేయిస్తూనే ఉన్నారు.
గుజరాత్‌లోని సోదరులు మరియు సోదరీమణులు సేవ యొక్క టర్న్ వచ్చింది, భారతదేశం మరియు విదేశాల నుండి సుమారు 20-21 వేల మంది సోదరులు మరియు సోదరీమణులు శాంతివన్‌కు చేరుకున్నారు. రెండు హాల్లూ నిండిపోయాయి. అందరూ చాలా ఏకాగ్ర చిత్తంతో, శక్తివంతమైన వాయు మండలంలో వీడియో ద్వారా బాప్ దాదా, యొక్క అవ్యక్త మహావాక్యాలను వింటున్నారు. కొంత సేపటికి దాది సభలోకి వస్తున్నట్లు మళ్ళీ మెసేజ్ వచ్చింది. దాది మళ్లీ సభలోకి రావడంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారు మ్రోగింది. అందరూ ఆనందంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.
అప్పుడు దాదీ, బాప్ దాదాకు భోగ్ సమర్పించారు మరియు బాప్ దాదా సభ మధ్యలోకి వచ్చారు. అందరికి ఎంతో ప్రేమతో చేతులు ఊపుతూ వరదాని దృష్టిని ఇచ్చారు.దాని తర్వాత మధురమైన మహావాక్యాలను ఉచ్ఛరించారు. “సదా ఆనందంగా ఉండే, సంతోషమైన అదృష్ట వంతులైన పిల్లలకు, చాలా- చాలా, చాలా చాలా ప్రియస్మృతులు. ఎల్లపుడూ సంతోషంగా ఉండండి, ఎక్కువ సంతోషాన్ని పంచండి. బాప్ దాదా ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ప్రేమను ఇస్తున్నారు, మరియు సదా సర్వుల ప్రేమపూర్వక దేహ స్మృతి నుండి అతీతమైన, తండ్రిని హృదయంలో ఇముడ్చుకుని ప్రతి అడుగు వేయాలి. దేశ, విదేశీ, అందరి ఒక్కొక్క పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు స్వీకరించారా? అందరితో పాటు గుజరాత్ నివాసీయులకు కూడా, మొత్తం విశ్వం యొక్క ఆత్మలతో పాటు ప్రియస్మృతులు” ఓం శాంతి
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.