రివైజ్ కోర్స్ మురళి 30-03-2014
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
“ఎటువంటి వాయుమండలాన్ని చూస్తున్నా బాబా స్నేహము మరియు సహయోగముతో ముందుకు వెళ్తూ ఉండండి, ప్రతి ఒక్కరిలో విశేషతలను చూడండి, స్వయం కూడా తీవ్ర పురుషార్థపు ఉల్లాస-ఉత్సాహాలలో ఉండండి మరియు తోటివారికి కూడా ఉమంగ- ఉల్లాసాలను ఇప్పించండి”
ఓం శాంతి. ఈ రోజు,బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిలో బాప్దాదాపై హృదయపూర్వక ప్రేమ ఎంత ఉంది అని ఆ ప్రేమ స్వరూపాలను పిల్లల ముఖాలలో చూస్తున్నారు. పిల్లలకు బాప్దాదాపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ బాబాకు పిల్లలందరిపై ఉంది. ఈ హృదయపూర్వక ప్రేమ పిల్లలందరినీ యథాశక్తి నడిపిస్తుంది. పిల్లలందరిలో బాబాపై,బాప్ దాదా ఇద్దరిపై హృదయపూర్వక చాలా చాలా ప్రేమ ఉండటాన్నిబాప్దాదా చూసారు.
బాప్ దాదాకు కూడా పిల్లలందరి పట్ల హృదయపూర్వక ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలో బాబా ప్రియస్మృతులు నిండి ఉన్నాయి, ఈ అలౌకిక ప్రేమ అందరినీ నడిపిస్తుంది.
పిల్లలు ఎంతమంది ఉన్నా, ఎక్కడున్నా కానీ బాప్దాదా యొక్క హృదయపూర్వక ప్రేమ పిల్లలను నడిపిస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ బాప్దాదా ప్రేమలో, పరివారపు ప్రేమలో నంబరువారీగా నడుస్తున్నారు. ఈ అలౌకిక ప్రేమను పూర్తి కల్పంలో ఇప్పుడు సంగమయుగంలో మాత్రమే అనుభవం చేసుకుంటారు. బాప్దాదా కూడా పిల్లల హృదయపూర్వక ప్రేమను చూసి పిల్లలందరికీ హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తారు, పిల్లలు సదా హృదయం యొక్క ప్రేమికుడు ద్వారా హృదయపూర్వక ప్రేమను తీసుకుంటూ సదా ముందుకు వెళ్తూ ఉండండి.
బాప్దాదా యొక్క హృదయపూర్వక ప్రేమ, పరివారం యొక్క హృదయపూర్వక ప్రేమ ప్రతి ఆత్మను నడిపిస్తుంది మరియు నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ మహావీరులై నడుచుకోవాలన్న ఆశీర్వాదాలను బాప్దాదా అందరికీ ఇస్తున్నారు. ఎప్పుడూ అలసిపోవద్దు, గాభరా పడవద్దు, బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరూ అతి ప్రియము. ఈ ప్రేమే ముందుకు నడిపిస్తుంది మరియు నడిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రభు ప్రేమను, హృదయపూర్వక ప్రేమను ప్రతి ఒక్కరూ నంబరువారీగా అనుభవం చేసుకుని నడుస్తున్నారు మరియు ప్రతి ఒక్కరి హృదయంలో ఉల్లాస -ఉత్సాహాలు ఉన్నాయి.
కానీ బాబా సమానంగా అవ్వాలన్నది మాత్రం నంబరువారీగా ఉంది. అందరికీ ఉల్లాసం ఉంది కదా! బాబా సమానంగా అవ్వాలి కదా! అవుతున్నారు మరియు ఇక ముందు కూడా అవుతారు. చేతులెత్తండి. బాబాకు కూడా హృదయపూర్వక ప్రేమ ఉంది, సదా పిల్లల గుణాలను వాహ్ పిల్లలూ వాహ్! అంటూ గానం చేస్తూ ఉంటారు. ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూ ఉండండి. చూడండి, పూర్తి విశ్వంలో బాప్దాదా తోటి సంబంధాన్ని ప్రాక్టికల్గా అనుభవం చేసుకునేవారు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు! మరి మీరందరూ ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తున్నారు.
హృదయపూర్వక ప్రేమతో మరియు ప్రేమపూర్వక పాలనతో మున్ముందుకు వెళ్తున్నారు. అందరూ ప్రేమపూర్వక పాలనతో ముందుకు వెళ్తున్నారా లేక మధ్యలో ఏదైనా విఘ్నము వస్తే ఆగిపోవడం లేదు కదా? ముందుకు వెళ్ళాలన్న సంకల్పం చాలామందిలో ఉండటాన్ని బాప్దాదా చూసారు, చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ మెజారిటీ పిల్లలు బాబా ఇచ్చిన జ్ఞానము మరియు ప్రేమ ఆధారంతో మంచిగా ముందుకు వెళ్తూ ఉండటాన్ని బాప్దాదా చూసారు. బాప్దాదా మిమ్మల్ని చూసి ఒక విషయంలో మాత్రం చాలా సంతోషిస్తారు, అది ఏ విషయము?
ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ నిర్భయులుగా అయ్యి మెజారిటీ ముందుకు వెళ్తున్నారు. పిల్లల లక్ష్యము మరియు లక్షణాలను చూసి బాప్దా సంతోషిస్తున్నారు అందుకే ఎప్పుడు కూడా ఎటువంటి వాయుమండలాన్ని చూసి కూడా దాని ప్రభావంలోకి రాకుండా బాబా స్నేహము మరియు సహయోగముతో చాలామంది ముందుకు వెళ్తున్నారు, ఇలాగే ముందుకు వెళ్తూ ఉండండి. ఇతరులను చూసినప్పుడు వారిలోని విశేషతలను చూడండి, ఇతర విషయాలను చూడకండి. ముందుకు వెళ్ళవలసిందే. ముందుకు వెళ్ళవలసిందే అన్న లక్ష్యము అందరికీ ఉంది కదా!
వారు చేతులెత్తండి. ఇతరుల బలహీనతల విషయాలను వింటూ విననట్లుగా ఉండండి. స్వయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళండి మరియు తోటివారిని కూడా ముందుకు తీసుకువెళ్ళండి. మంచి పురుషార్థాన్ని చేసే పిల్లలను కూడా బాప్దాదా చూసారు, కానీ తీవ్ర పురుషార్థం యొక్క అలను సదా స్వయంలోకి తీసుకువచ్చి ఇతరులను కూడా తీవ్ర పురుషార్థపు అలలోకి తీసుకురండి. ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురండి, సహయోగులుగా అవ్వండి. పురుషార్థహీన వాయుమండలంలోకి రాకుండా వారిని కూడా ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురండి. మధ్య మధ్యలో కొంతమంది ఆత్మలకు పురుషార్థంలో అలసట అనిపిస్తూ ఉంటుంది, బాగ్దాదా చూస్తుంటారు.
కానీ స్వయం పురుషార్థంలో తీవ్రంగా ఉంటూ ఇతరులను కూడా పురుషార్థంలో ముందుకు తీసుకు వెళ్ళండి. వాయుమండలాన్ని, దినచర్యను ఎలా తయారు చెయ్యండంటే అందరూ పురుషార్థపు ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉండాలి, అందరినీ తీసుకువెళ్ళాలి కూడా ఎందుకంటే ఒకరికొకరు సహకరించుకునే వారు కదా! కావున అందరిపట్ల శుభభావన ఆధారంతో వెళ్తూ ఉండండి, మీ ఉల్లాస ఉత్సాహాల అనుభవాలను వినిపిస్తూ ఇతరులకు సహయోగులుగా అవ్వండి.
మెజారిటీ పిల్లలు పురుషార్థపు అలలో చక్కగా ఉన్నట్లు బాప్దాదా చూసారు కానీ పురుషార్థంలో తోటివారు ఢీలాగా ఉన్న కారణంగా కొంచెం కొంచెం ప్రభావం పడుతుంది, ఆ అటెన్షన్ ఉంచండి. మనం నంబరువన్ లేక ఎనిమిదిలోపు రావలసిందే. అందరికీ ఉల్లాసము ఉంది, ఎనిమిదిలోపు ఉంటారు కదా లేక వెనుక ఉంటారా! మేము విజయులుగా అవుతామని భావించేవారు చేతులెత్తండి. విజయులే, మరియు అవుతారు కూడా.
చేతులైతే అందరూ చాలా బాగా ఎత్తుతారు, అందుకు కృతజ్ఞతలు చేయి సదా ఎత్తే ఉంచండి, అప్పుడప్పుడూ కాదు. వాయుమండలం ఎలా ఉన్నాకానీ మీరు మీ వాయుమండలంతో వాయుమండలాన్ని పరివర్తన చెయ్యండి. వాయుమండలంలోకి రాకండి, ముందుకు వెళ్ళండి, ముందుకు తీసుకువెళ్ళండి. ఇతరులకు మీరు సహయోగులు కదా! మరి సదా ఇవ్వడమంటే ముందుకు తీసుకువెళ్ళడము. ముందుకు వెళ్తూ ఉండండి. ఇప్పుడు పిల్లలందరూ ఏ లక్ష్యములో ఉన్నారు! తీవ్ర పురుషార్థి. ఢీలా పురుషార్థి కాదు. అయిపోతుందిలే, అయిపోతుందిలే అని అనుకోకండి.
అవ్వవలసిందే ఎందుకంటే బాబాపై ప్రేమ ఉంది కదా. బాబాపై ప్రేమ ఉంది కదా, మరి బాబాకు ఎవరంటే ఇష్టము? తీవ్ర పురుషార్థీ పిల్లలంటే ఇష్టము. మరి మీరు ఏమవుతారు? తీవ్ర పురుషార్థి, మేము తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇతరులకు కూడా సహయోగులుగా అవుతామని భావించేవారు చేతులెత్తండి. చేతులెత్తడంలో అయితే అందరూ తెలివైనవారు, బాప్దాదా సంతోషిస్తున్నారు. ధైర్యమును ఉంచారు కదా! పిల్లల ధైర్యము భగవంతుడి సహాయము. తప్పకుండా సహాయము లభిస్తుంది. కేవలం అవ్వవలసిందేనన్న కోరికను పెట్టుకోండి, అంతే. చెయ్యవలసిందే, పురుషార్థహీనంగా కాదు, పురుషార్థము.
బాప్దాదా సంతోషిస్తున్నారు, కొంతమంది పిల్లలు పురుషార్థంలో ఏదైనా పరిస్థితి వస్తే కొంచెం బలహీనంగా అవుతున్నారు, కానీ అలా కాదు, బహాదూర్ (ధైర్యశాలి) అవ్వండి, బహాదూర్గా తయారు చెయ్యండి. కనీసం రెగ్యులర్గా వచ్చేవారైతే తీవ్ర పురుషార్థాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి, లక్ష్యం లేదని కాదు, లక్ష్యం ఉంది కానీ మధ్యలో పరిస్థితులు వచ్చినప్పుడు పురుషార్థపు విషయాలను ఆలోచిస్తారు కానీ వాటిని చెయ్యడంలో కొంచెం ఢీలా పడతారు.
నా పురుషార్థపు గతి తీవ్రంగా ఉందా లేక నడుస్తుందా అని రోజూ అమృతవేళ పరిశీలించుకోండి. చేరుకుంటాములే, అయిపోతుందిలే అన్న సంకల్పాలైతే లేవు కదా! తీవ్ర పురుషార్థులుగా అవ్వండి. పురుషార్థము ఉంది కానీ తీవ్ర పురుషార్థీలుగా ఉన్నామా అని పరిశీలించుకోండి. బాప్దాదా కు ప్రియమైనవారు ఎవరు? తీవ్ర పురుషార్థీలు. మరి పిల్లలు ప్రతి ఒక్కరూ ఎలా అవ్వాలి? తీవ్ర పురుషార్థీగా అవ్వాలా? చేతులెత్తండి. అవ్వాలి, అవ్వాలా లేక అయ్యి ఉన్నారా? ఈ లక్ష్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి, తీవ్ర పురుషార్థీలుగా ఉండవలసిందే, ఇతరులకు సహయోగమును ఇవ్వవలసిందే.
ఈ లక్ష్యం ఉంది కదా, ఎవరి హృదయంలో అయితే ఈ లక్ష్యం ఉందో వారు చేతులెత్తండి. అచ్ఛా.చేతులైతే అందరూ ఎత్తుతారు. సరే, కొంచెం చల్లబడితే తీవ్రం చెయ్యండి ఎందుకంటే రోజురోజుకూ మాయ కూడా తన పని చేస్తూ ఉంటుంది. కానీ పిల్లలైన మీరందరూ ఎవరు? మీ టైటిల్ ఏమిటి? మాయాజీతులు. మాయాజీతులుగా ఎవరు తయారవుతారు, వారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. ధైర్యము ఉంచినందుకు బాప్దాదా కు సంతోషంగా ఉంది, పిల్లల ధైర్యము తండ్రి సహాయము ఉండనే ఉంది. ధైర్యాన్ని వీడకండి. ముందుగాబాప్దాదా సహాయము ఉంటుంది.
ధైర్యము కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. ధైర్యముంటే పిల్లల ధైర్యము తండ్రి సహాయము ఉండనే ఉన్నాయి. బాగుంది! ధైర్యమున్నవారు. వారు చేతులెత్తండి. కొంతమంది రెండ్రెండు చేతులెత్తుతున్నారు. మంచిది, చేతులెత్తడమైతే సహజము కానీ పురుషార్థపు చేతిని కూడా ఎత్తండి. పిల్లలలో ఉల్లాస ఉత్సాహాల అల ఉన్నప్పుడు బాప్దాదా సంతోషిస్తారు కానీ పిల్లలందరి లక్ష్యము నంబరువన్ అవ్వాలనే కదా! అంతే కదా! నంబరు టూ అయితే కాదు కదా! లేదు, నంబరువన్గా అవ్వవలసిందే అని అనుకునేవారు చేతులెత్తండి. చేతులైతే అందరూ ఎత్తుతున్నారు.
చేతులు మంచిగా ఎత్తుతున్నారు. బాల్దా సంతోషిస్తున్నారు. మీరు చేతులెత్తడాన్ని చూసి సంతోషిస్తున్నారు కానీ ఇలాగే సంతోషపరుస్తూ ఉండండి. మంచిది. ఈ రోజు ఎవరి టర్న్? ఇండోర్ మరియు భోపాల్ జోన్ వారి సేవ టర్న్:- (10 వేల మంది వచ్చారు) సగం క్లాసు వీరే ఉన్నారు. ఈ టర్న్ 26 వేల మంది వచ్చారు. అన్నిటికన్నా పెద్ద గ్రూపు. మరి విజయం ఉందా! అభినందనలు. టర్న్ వారు చేతులెత్తండి. మంచిది. పిల్లల ధైర్యము తండ్రి సహాయము. మంచిది. ధైర్యాన్ని ప్రతి కార్యంలో సదా ఉంచండి. మనం చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు! మనమే కదా, ఇలాగే అనుకుంటున్నారు కదా. మనమే కదా.
ధైర్యము ఉంచినందువలన సహాయం కూడా లభిస్తున్నందున బాప్దాదా సంతోషిస్తున్నారు. మంచిది. అభినందనలు, అభినందనలు.డబుల్ విదేశీ సోదరసోదరీలు:- బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషంగా ఉన్నారు కానీ విదేశీయులు సభ యొక్క భాగ్యాన్ని మంచిగా స్పష్టం చేసారు. డబుల్ విదేశీయులను చూసి బాబా సంతోషిస్తున్నారు ఎందుకంటే విదేశీయులు చేతులెత్తని టర్న్ ఏదీ లేదు. మరియు మంచి సంఖ్యలో వస్తారు అందుకే అభినందనలు, అభినందనలు, అభినందనలు.
మధువన నివాసులతో:- మంచిది, మధువనం వారి ఆహ్వానము ఉంటుంది కదా, అందుకే మధువనం వారు కూడా మంచి సేవను చేస్తున్నారు. సేవా రిజల్టు బాగుంది. మధువన నివాసులు ప్రతి డిపార్టుమెంట్ను మంచి శ్రద్ధతో చూసుకుంటున్నందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు, ఇందుకు అభినందనలు, అభినందనలు మధువనం వారికి. అచ్ఛా.మొదటిసారి చాలామంది వచ్చారు:- సగం క్లాసు మొదటిసారి వచ్చినవారు ఉన్నారు. బాగా చేతులెత్తండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న విశేష సోదరసోదరీలు, సదా డైరెక్షన్పై నిశ్చలంగా ఉండేవారు, అటువంటి పిల్లలు కూడా బాప్దాదా వద్ద నోట్ అయి ఉన్నారు. ఎవరైతే ప్రతి కార్యంలో ముందుకు వెళ్తూ ఉంటారో వారిని బాప్దాదా నోట్ చేసుకుంటారు, భిన్న భిన్న కార్యాలలో చేతులెత్తే ఆత్మలే ఉన్నారు. మంచిది. ఇటువంటి పురుషార్థీ పిల్లలను కూడా బాప్దాదా చూస్తారు, వారికి విశేషంగా చాలా చాలా చాలా హృదయపూర్వక ప్రియస్మృతులను స్వీకరించగలరు.దాదీ జానకిగారు ప్రత్యేకమైన స్మృతిని ఇచ్చారు, ఆరోగ్యం మంచిగా లేదు, గదిలో వింటున్నారు:- జనక్ బిడ్డకు విశేషమైన ప్రియస్మృతిని ఇస్తున్నాము.
మీ అందరి తరఫున స్మృతిని ఇస్తున్నాము ఎందుకంటే వారి మనసు ఇక్కడే ఉంది, శరీరం మాత్రమే అక్కడుంది. పూర్తి సభ వారి ముందుంది. పురుషార్థంలో మంచి నంబరు తీసుకుంటున్నారు. అలాగే అనారోగ్యంలో కూడా నంబరువన్ తీసుకున్నారు. లేకపోతే ఎప్పుడూ మిస్ అవ్వరు. బాప్దాదా చాలా-చాలా ప్రేమను ఇస్తున్నారు. మీ అందరికీ కూడా. (బాబా ఏదైనా గారడీ చేసి మమ్మల్ని సమ్ముఖంలోకి పిల్చుకోవాలి అని దాదీ జానకి అంటున్నారు). ఇప్పుడు లేవటం మంచిది కాదు. నొప్పి ఉంది కదా.
మోహిని అక్కయ్య: – వీరు కూడా ధైర్యాన్ని ఉంచుతారు, అభినందనలు. పెరుగుతూ ఉంటుంది.ఈషూ దాదీ:- వీరు ఎవరెడీ. ప్రతి కార్యంలోనూ హాఁ జీ, హాఁ జీ. మంచిది. పాత్రను మంచిగా చేస్తున్నారు.రుక్మిణి దాదీ: - బాగున్నారు కదా. మంచివారు, ధైర్యమును ఉంచి ఇంత వృద్ధి చెందారు. మంచిది. ఢిల్లీవారందరికీ అభినందనలు, ప్రతి కార్యంలోనూ శ్రద్ధ పెడ్తారు, ఎవరెడీ.(మీటింగ్ సమయంలో కూడా బాప్దాదా రావాలి, ఇది మా రిక్వెస్ట్ అని నిర్వైర్ అన్నయ్య చెప్పారు) చూద్దాము.బృజ్ మోహన్ అన్నయ్య: - మంచిగా నడుస్తుంది, నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది.
గామవి సెంటర్ గోల్డెన్ జూబిలీ:- గామేవి అయితే పునాది. మంచిగా నడిపించారు, (అందరూ స్మృతిని ఇచ్చారు) అందరికీ చాలా చాలా ప్రియస్మృతులను ఇవ్వండి.(గాడ్లీ స్టూడియోలో డబుల్ విదేశీయుల సేవా సమాచారమును ఇచ్చే గది తయారయింది) చాలా మంచిది.కలకత్తా బాంగూర్ సేవాకేంద్రము యొక్క సిల్వర్ జూబిలీ:- అందరి తరఫున బాప్దాదా అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు. (హాల్ బయట తోటలో, కాన్ఫరెన్స్ హాలులో చాలామంది సోదరసోదరీలు కూర్చుని ఉన్నారు) నలువైపుల ఎక్కడెక్కడి నుండి పిల్లలు చూస్తున్నారో, బాప్దాదా కూడా మీ అందరినీ చూసి ప్రియస్మృతులను ఇస్తున్నారు మరియు గుడ్నైట్ చెప్తున్నారు.
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్దాదాకు అతి స్నేహులు, సదా తమ శుభ భావనల సకాశ్ ద్వారా విశ్వ కళ్యాణ అనంత సేవలో ఉన్న దేశవిదేశాల నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,ఈశ్వరీయ స్నేహసంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.తర్వాత సమాచారమేమనగా, మన మధురాతి మధురమైన దాదీ జానకిగారి ఆరోగ్య సమాచారము మీ అందరికీ లభించే ఉంటుంది. వారికి కుడివైపు భుజంలో కొంచెం బ్రేక్ వచ్చిన కారణంగా బాగా నొప్పిగా ఉంది, దానితోపాటు వెన్నుపూసలో మరియు తుంటిలో కూడా దెబ్బ తగిలిన కారణంగా కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది.
దాదీగారైతే ఎల్లప్పుడూ యోగయుక్తంగా ఉంటారు, కానీ నిన్నటి సాకార మురళిలో బాబా ఏమన్నారంటే నా అనన్య పిల్లలకు ఏదైనా కష్టమొస్తే నేను వారి కోసం రాత్రంతా కూర్చుని విశేషంగా సకాశ్ను ఇస్తాను, వారికి ఎక్స్ట్రా సహాయాన్ని అందిస్తాను అని అన్నారు. మరి దాదీ జానకిగారైతే మనందరికీ, యజ్ఞానికి వీరు అనన్యమైనవారు, సదా అలసట లేకుండా అందరికీ జ్ఞానయోగాల పాలన ఇస్తారు.
ఇప్పుడు దాదీగారు 5-6 వారాల వరకు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు కావున అన్ని సేవాకేంద్రాలలో కూడా విశేషంగా మురళి క్లాసు తర్వాత 15 నిమిషాలు బాబా పిల్లలందరూ పవర్ఫుల్ యోగ అభ్యాసం ద్వారా దాదీగారికి సకాశ్ ఇచ్చే సేవను చేద్దాము అప్పుడు వాయుమండలం కూడా శక్తిశాలిగా అవుతుంది మరియు మన జానకి దాదీగారు కూడా ఎంతో త్వరగా కోలుకుంటారు. ఈ శుభ భావనలతో మీ అందరికీ చాలా చాలా స్మృతి...ఈశ్వరీయ సేవలో, బి.కె.హృదయమోహిని.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.