రివైజ్ కోర్స్ మురళి 30-11-2015
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
(15-12-11) రివైజ్ మురళీ వీడియో చూపించారు
ఈరోజు ప్రియమైన అవ్యక్త బాప్ దాదా అవతరణ దినోత్సవం. కర్ణాటక, ఇండోర్, భోపాల్ మరియు దేశ విదేశాల నుండి సుమారు 22 వేల మంది అక్కయ్యలు, అన్నయ్యల గ్రూపు శాంతివనంలో యోగ తపస్యా భట్టీ చేసుకుంటున్నారు. నలువైపుల అవ్యక్త వాతావరణంలో ప్రియమైన అవ్యక్త బాప్ దాదాను ఆహ్వానం చేస్తున్నారు. కానీ డ్రామా క్రొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. గుల్జార్ దాదీ అహ్మదాబాద్ లో ఉన్నారు, చలి దగ్గు కారణంగా విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు.
అందువలన ఈ రోజు అందరు తమ తమ అవ్యక్తస్థితి ఆధారంగా అవ్యక్త మిలనం చేసుకుంటున్నారు. మరియు 15-12-11 యొక్క అవ్యక్త బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలను వీడియో ద్వారా చూపించారు. జానకీ దాదీ, రతన్మోహి దాదీ, విశేష ముగ్గురు అన్నయ్యలు యోగం చేయించారు. డ్రామాలో సంగమయుగం యొక్క ఈ మిలనం చాలా చాలా అమూల్యమైనది మరియు అతీతమైనది, ప్రియమైనది. ఇది కూడా అకస్మాత్తు లాటరీ, ఇది భాగ్యవంతులైన పిల్లలకే లభిస్తుంది... 31-12-15
ఈ రోజు మనస్సుకి ప్రియమైన ప్రతీ బిడ్డ తమ మనస్సుకి ప్రియమైన తండ్రితో కలుసుకుంటున్నారు. బాప్ దాదా కూడా నలువైపుల ఉన్న ఒకొక్క బిడ్డని చూసి సంతోషిస్తున్నారు. నా నయనాలలో నిండి ఉన్న ప్రతీ బిడ్డ ఓహో అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతీ ఒక్కరిలో ఏదొక విశేషత ఉంది, ఆ విశేషత కారణంగానే తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక జరుగుతుంది. ఎక్కడి నుండి వచ్చినా కానీ అందరు బాబాకి గారాభమైనవారు. ప్రతీ ఒక్కరు చాలా ప్రేమతో ఓహో బాబా ఓహో అంటూ కలయిక జరుపుకుంటున్నారు. ప్రతీ బిడ్డ వెనుక కూర్చున్నా కానీ, ముందు కూర్చున్నా కానీ, ముఖ్యంగా వెనుక కూర్చున్న వారు చేయి ఎత్తండి.
తండ్రి మరియు పిల్లల కలయిక యొక్క సంతోషం ముఖంలో ఎంతగానో కనిపిస్తుంది. ప్రతీ ఒక్కరి మనస్సు నుండి ఇదే మాట ఓహో బాబా ఓహో. సాకారంలో సన్ముఖంగా కలుసుకునే ఈ అవకాశం మీరు ఇచ్చారు కనుక ప్రతీ బిడ్డ సన్ముఖంగా కలుసుకునే స్వర్ణిమ అవకాశాన్ని పొందుతున్నారు. బాబా కూడా పిల్లలను కలుసుకునే ఈ అవకాశాన్ని చూసి ఎంతగానో మురిసిపోతున్నారు. ఇంత పెద్ద సభ చూసి బాబా కూడా మాటిమాటికీ ఓహో పిల్లలు ఓహో అంటున్నారు. ఈ మిలనం ఎంతో గొప్పది. మిలనం చేసుకునేటందుకు పిల్లలు ఎక్కడెక్కడి నుండో వచ్చి చేరుకున్నారు.
తండ్రి మరియు పిల్లల యొక్క ఈ మిలనం ఎంతో అతీతమైనది మరియు ప్రియమైనది. ప్రతీ ఒక్కరి నయనాలలో తండ్రి మరియు పిల్లల కలయిక యొక్క ఆనందం నయనాలలో ఉంది. ఈ సభలో ఉన్న ఒకొక్క బిడ్డ ఓహో బాబా ఓహో అనే పాట పాడుతున్నారు. ఈ మిలనం సదా హృదయంలో ముద్రింప బడుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకుంటే ఎంతో సుఖం అనుభూతిలోకి వస్తుంది. మనస్సు నుండి వెలువడుతుంది. -ఓహో బాబా మీ యొక్క ఆత్మిక దృష్టి, ఇలా ఒకొక్క బిడ్డ చూసి ఎంతగానో హర్షిస్తున్నారు.
ఓహో పిల్లలు ఓహో అంటూ ఎదురుగా బాబాని కలుసుకుంటున్నారు. ప్రతీ ఒక్కరి నయనాలు ఈ మిలనంలో ఎంత సంతోషం అయ్యాయంటే ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు - సాకార ప్రపంచంలో సాకార రూపంలో తండ్రి మరియు పిల్లల యొక్క ఈ కలయిక అద్భుతమైనది అని, ప్రతీ ఒక్కరి మనస్సు అంటుంది. ఓహో బాబా ఓహో, బాబాతో ఈవిధంగా కలుసుకుంటాం అని మేము అనుకోలేదు కానీ ఈ మిలనం చాలా చాలా చాలా ప్రియమైనది అంటున్నారు. ఇలా కలుసుకుంటాం అని ఈ మిలనం గురించి కలలో కూడా అనుకోలేదు అంటున్నారు.
కానీ తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక జరిగింది. పిల్లలు బాబాని చూసి ప్రసన్నం అయ్యారు, ఓహో బాబా ఓహో, మరియు బాబా కూడా పిల్లలను చూసి సంతోషం అయ్యారు. ఓహో ఓహో ఓహో ఇదే మాట, ప్రతీ ఒక్కరి సంతోషపు అల వారి ముఖంలో మెరుస్తూ కనిపిస్తుంది. అందరి నోటి నుండి ఇదే మాట వెలువడుతుంది- ఓహో బాబా ఓహో, ఈరోజు మీరు మిలనం యొక్క స్వరూపాన్ని అనుభవం చేయించారు అంటున్నారు. హాలు అంతటా ప్రతీ ఒక్కరి హృదయం నుండి ఒకే మాట వస్తుంది. - ఓహో మధురమైన బాబా ఓహో. ఇటువంటి మిలనాన్ని చూసి ఈ మిలనం యొక్క నషాలో నిమగ్నమైన ఆత్మలుగా కనిపిస్తున్నారు.
అందరి నుండి ఒకే మాట ఓహో బాబా ఓహో, ప్రతీ ఒక్కరి హృదయం ఇదే మాట అంటుంది. సభలో ఉన్న అందరి మనస్సు యొక్క పాట చాలా మధురంగా వినవస్తుంది. ఈ పాట ఎంత ప్రియమైనది! సాకార రూపంలో ఈ కలయిక చాలా అమూల్యం. డ్రామాలో సంగమయుగం యొక్క ఈ మిలనం అతీతమైనది మరియు ప్రియమైనది. ప్రతీ ఒక్కరి హృదయంలో నా బాబా, నా బాబా, నా బాబా ఇదే ఉంది. ఇక్కడికి వచ్చి ఎదురుగా చూసినట్లయితే అందరి మస్తకం మెరుస్తూ కనిపిస్తుంది.
కాంతి కనిపిస్తుంది ఎందుకంటే తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక ఇంత సాకారంలో ఇంత సమీపంగా జరుగటం చూసి అందరు తమని తాము భాగ్యవంతులుగా అనుభవం చేసుకుంటున్నారు. పిల్లలు బాబాతో పాటు ఉంటూ కూడా తమ సహయోగులను కలుసుకోవటం చూసి అకస్మాత్తుగా లాటరీ తగిలినట్లు లీనమైపోయారు. సంగమయుగంలో తండ్రి మరియు పిల్లల కలయికకి ఈ మిలనం ఒక ఉదాహరణ. అది కూడా సాకార రూపంలో మిలనం, ఇదయితే స్వప్నంలో కూడా లేదు కదా కానీ మీ అందరి హృదయాల్లో ఈ మిలనం సదాకాలికంగా నిండిపోయింది. ప్రతీ ఒక్కరి హృదయంలో ఏమి ఉంది?
ఈ మిలనం స్వయంగా తండ్రి మరియు పిల్లల యొక్క మిలనం. ఇది ఎంత గొప్పదో ఆలోచించండి. అందరు ఈ రోజు కోసమే ఎదురుచూసేవారు. సాకార రూపంలో ఈ మిలనం చాలా అమూల్య మిలనం. కనుక ఆ తర్వాత కూడా మాటిమాటికీ మనస్సులో ఈ మిలనం యొక్క స్వరూపం రావాలి ఆవిధంగా కలుసుకోండి. ఇప్పుడు కూడా మిలనం జరుగుతున్నట్లుగా అప్పుడు కూడా అనుభవం అవ్వాలి. తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక ఎంత ప్రియమైనది! బాబా నాతో కలుసుకున్నారు అని ఎంత సంతోషం! తండ్రి మరియు పిల్లల యొక్క అవ్యక్త మిలనం ఏవిధంగా ఉంటుందో ఆ అనుభవం ఈ రోజు అందరి మనస్సులో ఉంది.
ఆ అనుభవాన్ని పిల్లలందరికీ బాప్ దాదా చేయిస్తున్నారు. అందరు జరుపుకున్నారు ఈ మిలనాన్ని, సాధారణ విషయం కాదు ఇది. కలుసుకునే భాగ్యాన్ని పొందటం, ఇది అందరికీ లభిస్తుంది. కానీ లభించిన భాగ్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. చాలామంది ఉన్నారు కానీ నిజంగా అనుభవం చేసుకోవటం అనేది భాగ్యం. ఈ రోజు బాప్ దాదా ఇటువంటి పిల్లల యొక్క భాగ్యాన్ని చూస్తున్నారు-వీరు ఏవిధంగా మనస్సుతో మిలనం జరుపుకుంటున్నారో అని, పాటలు పాడుతూ స్మృతి చేస్తున్నారో అని. ఈ భాగ్యం కూడా ఎవరిదివారిదే. సాకారంలో భాగ్యం ప్రాప్తించింది. ఇటువంటి భాగ్యం భాగ్యశాలులకే లభిస్తుంది.
బాప్ దాదా ఈనాటి మిలనాన్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. పిల్లలు సాకారంలో మిలనం చేసుకున్న అనుభవం పొందుతున్నారని. ప్రతీ ఒక్కరి మనస్సులో ఎవరున్నారు? బాబా, నా బాబా, ప్రియమైన బాబా, బాబా మనస్సులో రాత్రి పగలు పిల్లలే పిల్లలు ఉంటారు. ఎందుకంటే అందరి మనస్సులో ఇప్పుడు బాబాయే స్మృతి ఉన్నారు. కలుసుకునేది కూడా బాబానే. బాబా చూశారు, బాబా ఎంత భోళాభండారీయో అంటే స్మృతి చేశారు ప్రాప్తి పొందారు. అవును కదా. బాబాతో మిలనం జరుగుతుంది అనేవారు చేయి ఎత్తండి.
బాబా అయితే పిల్లల ముఖాన్ని చూసి సంతోషిస్తున్నారు ఎంత సమయం వేరుగా ఉన్నారో ఇప్పుడు కలుసుకున్నారు కనుక కలయిక యొక్క సంలగ్నతలో లీనమై ఉన్నారు. బాప్ దాదాకి కూడా పిల్లలని కలుసుకుని సంతోషంగా ఉంది. ఎవరైనా తప్పిపోయి దొరికితే ఎంత సంతోషంగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా చాలాకాలంగా వేరు అయిపోయారు కానీ ఇప్పుడు కలుసుకున్నారు. కలుసుకున్నారు కదా! చేయి ఎత్తండి. ఓహో. ఆ దృశ్యం బాబాకి చాలా మంచిగా అనిపిస్తుంది. వెనుక ఉన్నవారు కూడా చేయి ఎత్తుతున్నారు. ప్రతీ ఒక్కరి మనస్సు యొక్క ఆనందం ముఖంలో కనిపిస్తుంది.
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.